
'ప్రభుత్వ కనుసన్నల్లోనే కాల్ మనీ వ్యాపారం'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో అన్నీ అరాచకాలే జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ...కాల్ మనీ వ్యవహారం ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు.
కేసు సీరియస్గా ఉన్న సమయంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ను సెలవుపై పంపడం ఎంతవరకు సబబని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మధు డిమాండ్ చేశారు.