Call money case
-
విజయవాడ కాల్ మనీ కేసులో టీడీపీ నేత అరెస్ట్
-
కాల్‌మనీ కేసులో ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు
గుంటూరు ఈస్ట్: కాల్‌మనీ కేసులో గురుశిష్యులను అరెస్టు చేసిన పోలీసులు, ఇద్దరిపై రౌడీషీట్లు సైతం తెరిచారు. నిందితులపై గతంలో 9 కేసులు ఉన్నా టీడీపీ అండదండలతో రెచ్చిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదలకు సంబంధించి పాత నేరస్తుల చరిత్రను పరిగణనలోకి తీసుకున్న అర్బన్ ఎస్పీ పి.హెచ్డి.రామకృష్ణ వారి ఆగడాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాల్‌మనీ వ్యాపారులు ఇద్దరినీ లాలాపురం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లాలాపేట పోలీస్టేషన్లో ఈస్ట్ డీఎస్పీ కె.సుప్రజ, ఎస్హెచ్ఓలు ఫిరోజ్, రాజశేఖరరెడ్డి, సురేష్ బాబు ఈ కేసు వివరాలను వెల్లడించారు. వారి కథనం మేరకు.. గుంటూరు విద్యానగర్ ఒకటో లైను ఎక్స్టెన్షన్కు చెందిన ఇమడాబత్తిని కల్యాణచక్రవర్తి అలియాస్ పప్పుల నాని లాలాపేట పరిధిలోని హజార్ వారి వీధిలో తొలుత పప్పుల వ్యాపారం చేశాడు. అనంతరం 25 ఏళ్లుగా మీటర్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. నెహ్రూనగర్ 4వ లైనుకు చెందిన మాజేటి శేఖర్ తొలి నుంచి పప్పుల నానికి అనుచరుడిగా ఉంటు న్నాడు. పప్పుల నాని మీటర్ వడ్డీ, వంద రోజుల వడ్డీ, రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. బాకీ చెల్లించని వారిని తన కార్యాలయానికి పిలిపించి బంధించి కొట్టి చెక్కులు, ప్రామిసరీ నోట్లపై అధిక మొత్తం రాయించి సంతకాలు చేయించుకుని పంపేవాడు. కొందరి వద్ద ఖాళీ నోట్లు, చెక్‌లపై సంతకాలు చేయించుకునేవాడు. కార్యాలయానికి రాని వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేసేవాడు. బాకీ వసూలు చేసే క్రమంలో వంటరిగా జీవించే మహిళలతో నాని, శేఖర్ అసభ్యంగా ప్రవర్తించారు. కొందరిని తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. ఓ మహిళపై లైంగికదాడికి యత్నించడంతో కొత్తపేట స్టేషన్లో శేఖర్‌పై ఇటీవల కేసు నమోదైంది. పప్పుల నానికి ఉన్న పలుకుబడి కారణంగా అతని బారినపడిన మహిళలు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. వడ్డీ కోసం గురుశిష్యులు పెట్టే వేధింపులను తట్టుకోలేక గతంలో కొంతమంది ధైర్యం చేసి ఆధారాలతో ఎస్పీలకు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో పలు పోలీస్స్టేషన్లలో పప్పుల నానిపై ఆరు, శేఖర్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. వీరు రిమాండ్‌కు వెళ్లినా వారి అనుచరులు యథావిధిగా కార్యకలాపాలను కొనసాగించేవారు. పప్పులనాని వద్ద గత మార్చి, ఏప్రిల్ నెలల్లో నెహ్రూనగర్ పదో లైనుకుచెందిన ఏలే దుర్గాప్రసాద్, అతని తండ్రి కొండయ్య మీటరు వడ్డీకి ఒకసారి రూ.50 వేలు, మరోసారి రూ.2 లక్షలు తీసుకున్నారు. రోజుకు రూ.5 వేల చొప్పున 50 రోజులు చెల్లించిన అనంతరం, చెల్లింపులు నమోదు చేసిన పుస్తకాన్ని తండ్రీకొడుకుల నుంచి నాని, శేఖర్ లాక్కున్నారు. వడ్డీకి వడ్డీ వేసి ఎక్కువ మొత్తం డిమాండు చేశారు. మొదట ఇచ్చిన ప్రామిసరీ నోట్లు పోయాయంటూ, డిసెంబర్ 28వ తేదీ తండ్రీకొడుకులను నాని, శేఖర్ తమ కార్యాలయంలోబంధించి ఆరు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని వదిలిపెట్టారు. బాధితులు పోలీస్ స్పందన కార్యక్రమంలోలో ఫిర్యాదు చేయడంతో అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ స్పందించారు. నిందితుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టుచేసి రూ.30,32,900 నగదు, 9 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 10 ఖాళీ బ్యాంకు చెక్‌లు, రోజువారి, మీటర్ వడ్డీ లెక్కల పుస్తకాలు స్వాధీనం చేసుకునిరిమాండుకు తరలించారు. రౌడీ ఆగడాలకు అంతేలేదు పప్పుల నాని, శేఖర్ రాజకీయంగా, పోలీసుల వద్ద పలుకుబడి సంపాదించి హోల్‌సేల్ కిరాణా, ఇతర వ్యాపారులపై జులుం ప్రదర్శించే వారు. పప్పుల నాని తన దౌర్జన్య కార్యకాలాపాల కోసం వివిధ కాలనీలకు చెందిన వ్యక్తులు, యువకులను అనుచరులుగా పెట్టుకున్నాడు. ఆ అనుచరులు కిరాణా, ఫ్యాన్సీ, జ్యూస్ షాపులు, చికెన్ షాపులు, తోపుడు బండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వకుండానే తమకు కావాల్సినవి తీసుకెళ్లేవారు. గురుశిష్యులు ఇద్దరు గతంలో ఫోర్జరీ దస్తావేజులు పుట్టించి మోసగించేవారు. నిందితుల రోజువారీ వసూళ్లు రూ.80 వేలు. పోలీసులు వారి కార్యాలయంపై దాడి చేసినప్పుడు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదుకు సంబంధించి వడ్డీకి తీసుకున్న వారి పేరుతో చీటీలు రాసి రబ్బరు బ్యాండులు వేసిన కట్టలులభించడం గమనార్హం. -
మహిళలకు ఫోన్లు చేసి అసభ్యపద జాలంతో..
నగరంలో రెండో పోలీసు స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇటీవల ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 1.20 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వాయిదాలు చెల్లించడంలో జాప్యం జరిగింది. దీంతో ఆ కంపెనీ పేరిట రికవరీ ఏజెంట్ ఒకరు ఫోన్ చేసి పేపర్లో రాయడానికి వీలుకాని భాషలో తిట్టి భయభ్రాంతులకు గురిచేశారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న మరో మహిళకు సైతం ఇలాగే ఫోన్లు చేసి బెదిరించారు. నీ అప్పు నేను కడుతాను.. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వు.. అంటూ చెప్పుకోలేని రీతిలో అసభ్యంగా ప్రవర్తించారు. ప్రతిరోజూ ఇలా ఫోన్లు చేస్తుండటంతో ఆ మహిళ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసింది. అయినా వదలని రికవరీ ఏజెంట్లు ఇంటికెళ్లి బెదిరించడం కొసమెరుపు.రూటు మార్చిన ‘కాల్’నాగులు ఏజెంట్ అవతారంలో సాగిస్తున్నకీచకపర్వనానికి ఉదాహరణలు ఇవి. సాక్షి, అమరావతిబ్యూరో: నగరంలో కీచకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. గతంలో కాల్‌మనీ వ్యాపారం పేరిట కొందరు స్వార్థ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, డబ్బున్నవారు కుమ్మక్కై నిర్లజ్జగా జనం మానప్రాణాలతో ఆడుకున్నారు. రూ. 100కి రూ. 20 వడ్డీ వసూలు చేసి పేద, మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పి చేశారు. అప్పులిచ్చి మహిళలను బెదిరించి లైంగికంగా వేధించారు. ఈ కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కుంభకోణంతో ఇప్పటికే విజయవాడ పరువు చిన్నబోయింది. అనంతరం ఈ రాకెట్ గుట్టు రట్టవ్వడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ వ్యాపారులు ఇప్పుడు మళ్లీ కొత్త అవతారం ఎత్తారు. ఆధీకృత వడ్డీ డీలర్ల వద్ద 20 శాతం కమీషన్ తీసుకుని బకాయిలు వసూలు చేసే పనికి దిగారు. అయి తే ఇక్కడా బలవంతపు వసూళ్లు, లైంగిక వేధింపులకు దిగడం మాత్రం మానకపోవడం విశేషం. పోలీసుల నిర్లిప్తత.. రికవరీ ఏజెంట్ల ముసుగులో ఉన్న కాల్‌మనీ ముఠా సభ్యుల ఆగడాలపై స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. ఫైనాన్స్ కంపెనీల ఆగడాలపై 10 రోజుల కిందట లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. మాకు న్యాయం చేయమంటూ స్టేషన్‌కు వెళితే.. ‘వారిని పిలిపిస్తాం. రేపు రా, ఎల్లుండి రా..’ అంటూ పోలీసులు కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. పైగా నిందితుల పట్ల పోలీసులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రికవరీ ఏజెన్సీల యాజమాన్యాల వెనుక అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో రికవరీ ఏజెంట్లపై కేసులు పెట్టిన బాధితులపైనే పోలీసులు ఉల్టా కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటీవల 2వ పట్టణ పోలీసు స్టేషన్లో కొందరు బాధితులు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్లపై ఫిర్యాదు చేస్తే.. అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని నిందితులకు వత్తాసు పలికినట్లు తెలుస్తోంది. రూటు మార్చేసి.. కాల్‌మనీ సెక్స్‌రాకెట్ గుట్టు రట్టు కావడం.. పోలీసులు కాల్‌మనీ రాకెట్లో పెద్ద చేపల్ని వదిలి చిన్న చేపల్ని పట్టుకోవడంతో ఊపిరి తీసుకున్న అధికారపార్టీ నేతల అండడండలున్న బడా వ్యాపారులు కొంత కాలంపాటు తమ కార్యకలాపాలను పక్కనపెట్టేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాలుగేళ్లు గడిచాయి.. మళ్లీ ఇప్పుడు కాల్‌మనీ వ్యాపారులు కొత్త అవతారం ఎత్తి.. ఫైనాన్స్ కంపెనీలు బకాయిల వసూళ్ల కోసం నియమించుకునే రికవరీ ఏజెన్సీల యజమానులుగా రూపాంతరం చెందారు. ఇప్పుడు వారి వద్ద పనిచేస్తున్న ఏజెంట్లు ఫైనాన్స్ కంపెనీలకు, బ్యాంకులకు సరిగా బకాయిలు చెల్లించని వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు రూ. 20 వడ్డీ వ్యాపారం నిర్వహించే కాల్‌మనీ వ్యాపారులు.. ఇప్పుడు బకాయి వసూలు చేసి ఇస్తే అధికారికంగా రూ. 100కి 20 శాతం కమీషన్ వస్తుండటంతో ఈ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటాం కాల్‌మనీ వ్యాపారాలను సహించం. ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు వినియోగదారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించరాదు. బకాయిల వసూళ్ల కోసం బెదిరింపులకు, లైంగిక వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. – ద్వారకాతిరుమలరావు, నగర సీపీ -
బందరులో మరో కాల్‌మనీ
కృష్ణాజిల్లా, కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : మచిలీపట్నంలో కాల్‌మనీ వ్యవహారం మరో మారు తెరపైకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో అప్పు చేసిన ఓ మహిళ నుంచి వ్యాపారి అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేయటమే కాకుండా ఆలస్యం అయితే తన కోరిక తీర్చమంటూ వేధింపులకు గురి చేశాడు. లేనిపక్షంలో వ్యభిచారం చేసైనా తన అప్పు తీర్చమంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో దిక్కుతోచని బాధితురాలు వడ్డీ వ్యాపారి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి వడ్డీ వ్యాపారిని అదుపులోకి తీసుకుని శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించాలని ఏఎస్పీ సోమంచి సాయికృష్ణ డీఎస్పీ మహబూబ్‌బాషాకు సూచించారు. ఏం జరిగిందంటే.. బాధితురాలి కథనం ప్రకారం మచిలీపట్నం మాచవరానికి చెందిన తాహెరున్నీసా, కరీముల్లా భార్యాభర్తలు. వీరికి ఒక పాప ఉంది. కరీముల్లా 2013లో పనుల నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. ఒంటరిగా ఉంటున్న తాహెరున్నీసా ఏదో ఒక వ్యాపారం చేయాలన్న ఆలోచన తట్టటంతో ఫ్యాన్సీ షాపు పెట్టేందుకు నిర్ణయించుకుంది, తన వదిన ఉన్నీసా ద్వారా పట్టాభిపురానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద 2014లో రెండు దఫాలుగా రూ.1,30,000లను అప్పుగా తీసుకుంది. నూటికి రూ.7 ల చొప్పున వడ్డీ చెల్లిస్తూ వచ్చింది. వ్యాపారం నష్టపోవటంతో అప్పు తీర్చటం కష్టంగా మారింది. దీంతో తాహెరున్సీసా వదిన అప్పు నిమిత్తం ఆమె నుంచి ఆరు ఖాళీ చెక్కులతో పాటు ప్రామిసరీ నోటులు తీసుకుంది. ఇదిలా ఉండగా వడ్డీ వ్యాపారి ఒత్తిళ్ళు తట్టుకోలేని తాహెరున్నీసా అతని అప్పు తీర్చేందుకు నిర్ణయించుకుంది. అందుకోసం ఇంగ్లిష్పాలెంలోని తన ఆడ పడుచు కరీమున్నీసా, ఆమె భర్త షంషుద్దీన్‌ల ద్వారా చిలకలపూడికి చెందిన నూకల రామ్‌కుమార్ అనే వడ్డీ వ్యాపారి వద్ద 2015లో నూటికి రూ.10 వడ్డీ చొప్పున రూ.95,000 ను అప్పుగా తీసుకుంది. మహిళకు రామ్‌కుమార్ వేధింపులు.. వడ్డీ వ్యాపారి నూకల రామ్‌కుమార్ వద్ద అప్పు తీసుకున్న తాహెరున్నీసా 2015 నవంబరు నుంచి దాదాపు 30 నెలల పాటు ప్రతి నెలా రూ.9,500 చొప్పున వడ్డీ కట్టుకుంటూ వచ్చింది. అయితే రెండు మూడు నెలలుగా వడ్డీ కట్టటం భారం కావటంతో తాహెరున్నీసా ప్రతి నెలా గడువు ప్రకారం వడ్డీ చెల్లించటం లేదు, దీంతో తాహెరున్నీసాను రామ్‌కుమార్ వేధింపులకు గురి చేయటం మొదలుపెట్టాడు. వడ్డీ కట్టటం కష్టమైతే తన కోర్కె తీర్చాలంటూ వేధించటం ప్రారంభించాడు. అలా కాని పక్షంలో వ్యభిచారం చేసైనా తన అప్పు తీర్చాలంటూ బెదిరిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం రామ్‌కుమార్ భార్య మరో యువకుడు కలిసి తాహెరున్నీసాను బెదిరించటంతో పాటు రామ్‌కుమార్‌తో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడించారు. రక్షణ కల్పించకుంటే ఆత్మహత్యే శరణ్యం.. రామ్‌కుమార్ వేధింపులతో హడలెత్తిపోయిన తాహెరున్నీసా బుధవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పోలీసు కార్యాలయానికి వెళ్ళింది. ఎస్పీ అందుబాటులో లేకపోవటంతో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణను కలిసి తన ఆవేదనను వెల్లిబుచ్చుకుంది. అతని వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. రక్షణ కల్పించని పక్షంలో తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ కన్నీటి పర్యంతమైంది. అలాగే తన బంధువుల వేధింపుల నుంచి తప్పించాలంటూ కోరింది. దీంతో ఏఎస్పీ బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు. -
విజయవాడలో కాల్‌మనీ వేధింపుల కలకలం
-
షికాగో కేసులో వెనకున్న పెద్దలెవరు?
-
కాల్‌మనీ కేసు ఈనెల 22కు వాయిదా
-
హైదరాబాద్‌లో మరో కాల్ మనీ వ్యవహారం
-
కౌలు రైతును కాటేసిన కాల్‌మనీ కేసు
ఇచ్చిన అప్పు కట్టమన్నందుకు కేసు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు పోలవరం/నిడదవోలు : అతడో కౌలు రైతు. రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయం చేశాడు. నోరు కట్టుకుని.. సరదాలను చంపుకుని పైసా పైసా కూడబెట్టుకున్నాడు. అలా దాచుకున్న రూ.3 లక్షలతో ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. అతనితో స్నేహం పెంచుకున్న ఓ వ్యక్తి ఆ సొమ్ము తనకు అప్పుగా ఇమ్మని అడిగాడు. ఇల్లు కట్టుకునే సమయంలో వడ్డీతో సహా ఇచ్చేస్తానన్నాడు. వడ్డీ రూపంలో ఎంతో కొంత వస్తుందని.. ఇంటి నిర్మాణానికి ఉపయోగపడుతుందని ఆశపడిన ఆ కౌలు రైతు రెండేళ్ల క్రితం స్నేహితుడికి ఆ సొమ్ము ఇచ్చాడు. ఇటీవల ఇల్లు కట్టుకునేందుకు సిద్ధమైన కౌలు రైతు తన సొమ్ము తిరిగివ్వాలని అడిగితే.. సదరు స్నేహితుడు అతడిపై కాల్‌మనీ కేసు పెట్టాడు. మనస్తాపానికి గురైన కౌలు రైతు బలవన్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వరరావు (50) సుమారు ఐదు రోజుల క్రితం పోలవరం మండలం మూలలంకలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం అతడి మృతదేహం లభ్యమైంది. పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతడు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడన్న తొలుత వివరాలు లభ్యం కాలేదు. అతడి వద్ద లభించిన బస్ టికెట్ ఆధారంగా నిడదవోలు ప్రాంతానికి చెందినవాడై ఉంటాడని భావించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల వారికి సమాచారం పంపించారు. మంగళవారం అతని బంధువులు వచ్చి మృతుడి పేరు తోట వెంకటేశ్వరరావు అని, అట్లపాడు గ్రామానికి చెందిన వాడని గుర్తించారు. ఈ ఘటన పూర్వాపరాలపై పోలవరం ఎస్సై కె.శ్రీహరిరావు ఆరా తీయగా.. కాల్‌మనీ కేసు వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వరరావు తాను దాచుకున్న సుమారు రూ.3 లక్షలను అదే గ్రామానికి చెందిన అచ్యుత నాగరాజుకు అప్పుగా ఇచ్చాడు. వెంకటేశ్వరరావు ఇల్లు కట్టుకునేందుకు నిర్ణయించుకుని పాత తాటాకింటిని తొలగించాడు. పూరిపాక వేసుకుని ప్రస్తుతానికి అందులో నివాసం ఉంటున్నాడు. ఇల్లు కట్టుకుంటున్నందును తానిచ్చిన సొమ్మును తిరిగివ్వాలని నాగరాజును వెంకటేశ్వరరావు అడిగాడు. అప్పు తీర్చకపోగా నాగరాజు అతడిపై సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్లో కాల్‌మనీ వేధింపుల కింద 20 రోజుల క్రితం కేసు పెట్టాడు. దీంతో పోలీసులు వెంకటేశ్వరరావును స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వరరావు ఈనెల 15న ఇంటి నుంచి వచ్చేశాడు. పోలవరం మండలం మూలలంక ప్రాంతంలో సోమవారం శవమై కనిపించాడు. అతడికి భార్య మంగ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడికి వివాహం కాలేదు. వారంతా ఉమ్మడిగానే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో కష్టపడి పైసాపైసా కూడబెట్టారు. చివరకు సొమ్ము దక్కకపోగా.. కుటుంబ యజమాని బలవన్మరణం పాలవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
సీన్ రివర్స్
కాల్‌మనీ కేసులను అడ్డుపెట్టుకుని భారీగా దండుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కానిస్టేబుల్ రమేష్ అరెస్ట్‌తో వెలుగులోకి సీపీకి మరో నాలుగు ఫిర్యాదులు ప్రజల నుంచి అక్రమ వడ్డీల రూపంలో అడ్డంగా దోచుకుంటున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కాల్‌మనీ నిందితులను అప్పట్లో అరెస్టు చేశారు. దీనిని అడ్డు పెట్టుకుని పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి కేసుకూ ఒక రేటు నిర్ణయించి కాల్‌మనీ నిందితుల నుంచి లక్షల్లో దండుకున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులపై ఇప్పుడు కమిషనరేట్‌కు ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. విజయవాడ : కాల్‌మనీ కేసుల్లో సీన్ రివర్స్ అయింది. నాడు అధిక వడ్డీల నేపథ్యంలో పలువురిపై ఫిర్యాదులు వెల్లువెత్తితే.. నేడు పోలీసులపై ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాల్‌మనీ పేరుతో అధిక వడ్డీలు గుంజుతున్నారంటూ కేసులు నమోదైన వారినుంచి పోలీసులే భారీగా దండుకోగా, ఇప్పుడు ఆ వ్యవహారం బట్టబయలవుతోంది. ముఖ్యంగా టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసి సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పొట్లూరి రమేష్ అవినీతిపై విజయవాడ కమిషనరేట్ పోలీసులకు ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. కానిస్టేబుల్ పొట్లూరి రమేష్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రసాద్ పేరు చెప్పి మరీ బాధితుల నుంచి వసూలు చేశాడనే ఆరోపణలు ఇప్పుడు కమిషనరేట్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. కాల్‌మనీ కేసుల్లో అరెస్టయిన, పోలీస్ విచారణకు హాజరైన నలుగురు వ్యక్తులు తాజాగా శుక్రవారం ఏసీపీపై విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికి ఐదు ఫిర్యాదులు అందాయి. బెదిరించి.. భయపెట్టి.. టాస్క్‌ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి గత నెలలో తోటవల్లూరుకు బదిలీ అయిన కానిస్టేబుల్ పి.రమేష్‌ను మూడు రోజుల కిత్రం అవినీతి ఆరోపణలతో కమీషనరేట్ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసుల్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పర్యవేక్షించారు. ప్రధానంగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రసాద్‌తో ఆయన టీమ్ ఎక్కువ కేసుల్ని విచారించారు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్‌లో దీర్ఘకాలం పనిచేసిన రమేష్ కాల్‌మనీ ఫిర్యాదులు వచ్చిన వారందరినీ బెదిరించి భయభాంత్రులకు గురిచేశాడని, ఏసీపీ, ఇతర అధికారులు డబ్బులు అడుగుతున్నారంటూ భారీగా వసూళ్లు చేశాడని వెల్లడవుతోంది. ఫిర్యాదుల వివరాలివీ... కానిస్టేబుల్ రమేష్ గొల్లపూడిలోని తన నివాసంలో శానిటరీ మరమ్మతులు చేయించటానికి అవసరమైన రూ.2 లక్షల సామగ్రిని బెదిరించి మరీ కొనుగోలు చేశాడంటూ కాల్‌మనీ కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన కోనేరు అనిల్‌కుమార్ ఫిర్యాదు చేశారు. తనకు తెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బాత్ స్టయిల్స్‌లో వీటిని తాను అప్పుతో కొని ఇచ్చానని, రమేష్ పేరుతో ఉన్న బిల్లులను ఇవ్వాలంటూ షాపు యజమానిని ఈ నెల 16న ఫోనులో బెదిరించాడని పేర్కొన్నారు. దీనిపై బిల్లులను ఫిర్యాదు కాపీతో కలిపి పోలీస్ కమిషనర్‌కు అందజేశారు. తన బావమరిదిని కూడా ఇదే తరహాలో వేధిస్తే రూ.2 లక్షలు ఇచ్చామని ఫిర్యాదులో పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే తనను ఇబ్బంది పెట్టారంటూ విజయవాడ పటమటకు చెందిన యలమంచలి రమేష్ ఫిర్యాదు చేశారు. కాల్‌మనీ కేసుల్లో నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ తనకు చిన్ననాటి స్నేహితుడని, శ్రీకాంత్ పరారీతో తనను, తన స్నేహితులైన అశోక్, సుమన్‌లను టాస్క్‌ఫోర్స్ విచారణ పేరుతో పిలిపించి ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. చివరికి కానిస్టేబుల్ రమేష్.. నారాయణ అనే వ్యక్తిని పంపి రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారని, లక్ష రూపాయలు తీసుకున్నారని వివరించారు. పటమటలో సూపర్‌బజార్ నిర్వహించే యలమంచలి సుమన్ కూడా తనను వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు అందజేశారు. కానిస్టేబుల్ రమేష్.. నారాయణ అనే వ్యక్తి ద్వారా రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి, చివరికి రూ.50 వేలు తీసుకొని వదిలేశారని వివరించారు. వెనిగళ్ల శ్రీకాంత్‌కు తాను స్నేహితుడిని కావటంతో వేధించారని తెలిపారు. కాల్‌మనీ కేసు నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ సోదరుడు వెనిగళ్ల శ్రీరామ్ తన నుంచి రెండు విడతలుగా రూ.80 వేలు వసూలు చేశాడని ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌తో తనకు మాటలు లేవని, అతనితో ఆర్థిక లావాదేవీలు లేవని చెప్పినా వినకుండా కానిస్టేబుల్ రమేష్ ఇబ్బంది పెట్టాడని వివరించారు. -
నోటు కావాలంటే.. కోరిక తీర్చాలట
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన కాల్‌మనీ బాగోతంలో మరో ఉదంతం వెలుగుచూసింది. విజయవాడలో ఓ మహిళ అప్పుతీర్చినా.. ప్రాంసరీ నోటు ఇవ్వకుండా వ్యాపారి వేధిస్తున్నాడు. నోటు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఆమెను బెదిరించాడు. బాధితురాలు పిల్లల చదువు కోసం 50 వేల రూపాయలను అప్పుగా తీసుకుంది. డబ్బు తీసుకున్న సమయంలో వ్యాపారికి ప్రాంసరీ నోటు రాసి ఇచ్చింది. ఆ తర్వాత ఆమె అప్పు మొత్తం తీర్చేసింది. అయితే ప్రాంసరీ నోటు ఆమెకు ఇవ్వకుండా వ్యాపారి వేధింపులకు దిగాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా నిందితుడి కుటుంబ సభ్యులు నుంచి బాధితురాలికి బెదిరింపులు వస్తున్నాయి. -
కాల్‌మనీ కేసులో బాధితుల ఆత్మహత్యాయత్నం
కాల్ మనీ కేసులో రుణదాతపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ... గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ఇద్దరు మహిళలు సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. స్థానికంగా ఆరో వార్డులో ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరో వార్డుకు చెందిన పొదిలి సత్యనారాయణఅనే ఫైనాన్షియర్ నుంచి... ఏకలవ్య కాలనీకి చెందిన దాసరి వెంకట నాగేశ్వరమ్మ, సజ్జా రజనికొన్నేళ్ల క్రితం అప్పు తీసుకున్నారు. నాగేశ్వరమ్మ రనూ.1.5 లక్షలు తీసుకోగా... ఇప్పటి వరకు రూ.4 లక్షలను వడ్డీ రూపంలో చెల్లించింది. రజని కూడా సుమారు రూ.లక్ష అప్పుగా తీసుకుని... గత మూడేళ్ల నుంచి ప్రతి నెలా రూ.5వేలు చొప్పున చెల్లిస్తోంది. అయినా ఇంత వరకు అసలు తీరలేదు. ఇదే విషయమై సత్యానారాయణ వారిని వేధింపులకు గురిచేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టును కూడా ఆశ్రయించారు. అయినా న్యాయం జరగలేదన్న మనస్తాపంతో సోమవారం నాగేశ్వరమ్మ, రజని ఆరో వార్డులోని సత్యానారాయణ ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నంలో ఉండగా... సీఐ మల్లికార్జునరావు సిబ్బందితో చేరుకుని అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపించేశారు. -
చోడవరంలో మరో కాల్‌మనీ కేసు
వడ్డీ వ్యాపారి వేధిస్తున్నాడంటూ ఇద్దరు మహిళల ఫిర్యాదు చోడవరం : చోడవరంలో కాల్‌మనీ కేసు నమోదయింది. తమను వడ్డీ వ్యాపారి వేధిస్తున్నాడంటూ ఇద్దరు మహిళలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...కొత్తకోటకు చెందిన ఇసరపు రమణ అనే వడ్డీ వ్యాపారి వద్ద తాను రూ.4 లక్షలు అప్పుతీసుకున్నానని, ఆ సమయంలో కొన్ని ప్రాంసరీనోట్లు, నాలుగు చెక్కులు ఇచ్చానని ఉలికిరి లక్ష్మి అనే మహిళ తెలిపింది. అప్పు తీర్చినప్పటికీ ప్రాంసరీ నోట్లు, చెక్కులు తిరిగి ఇవ్వలేదని, ఎన్నిసార్లు అడిగినా ఇస్తానని చెప్పి వెళ్లిపోతున్నాడని వాపోయింది. గట్టిగా అడిగితే వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే వడ్డీ వ్యాపారి వద్దే తాను కూడా రూ.5లక్షలు అప్పుతీసుకున్నాని మరో మహిళ సత్యవతి తన ఫిర్యాదులో పేర్కొంది. మొదట రూ.2 వడ్డీ అని చెప్పి ఇప్పుడేమో రూ.5 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నార ని తెలిపింది. నాలుగు ప్రాంసరీ నోట్లు, నాలుగు చెక్కులు కూడా ఇచ్చానని, వడ్డీ గురించి అడిగితే వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె తెలిపింది. ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమణయ్య తెలిపారు. -
నిలదీస్తేనే దారికొస్తారు...
కొత్త కోణం ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ఒత్తిడి తేవాలి. ఎందుకంటే కార్య నిర్వాహక వ్యవస్థ, ప్రజా ప్రతినిధులతో కూడిన శాసన వ్యవస్థకు లోబడి పనిచేయాల్సిందే. పాలనా వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రజలే వాటిని సంస్కరించే బాధ్యతను చేపట్టాలి. మలి తెలంగాణ పోరాటంలో అలాంటి చైతన్యాన్ని చూశాం. తెలంగాణ నినాదాన్నివ్వని ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజలు గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వలేదు. ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించని వారికి ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదని నిలదీశారు. ఓ వైపు విశ్వవిద్యాలయాల్లోని కుల దురహంకారం పేర్చిన చితిపై కాలే విద్యార్థుల శవాల కమురు వాసనలు ప్రభుత్వాధినేతల, ప్రజాప్రతినిధుల ముక్కుపుటాలకు సోకనైనా సోకవు, ఎన్నటికీ తీరని అప్పులకు తాకట్టుపడ్డ ఆడపడుచుల దేహాలు మరోవైపు వడ్డీకాసులు కురిపిస్తుంటాయి. ఇంకోవైపు అవే అప్పుల కుప్పలు రైతన్నల పాలిట యమపాశాలై రక్తాశ్రువులను కురిపిస్తుంటాయి. నాలుగన్నం మెతుకులు కరువై కాటికెళుతున్న కాగజ్‌నగర్ -సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల కుటుంబాల్లో ఆరని ఆకలి మంటలు నిత్యాగ్ని జ్వాలలై మండుతుంటాయి. నగరం నడిబొడ్డున ప్రభుత్వా సుపత్రిలో మురికినీరే తాగునీరై రోగుల ప్రాణాలు తోడేస్తుంటే... కార్పొరేట్ వైద్యం కోసం ఆడపడుచుల తాళిబొట్లు తాకట్ల చీకట్లలోకి జారుకుంటాయి. అయినా అవే అప్పులు... మళ్లీ మళ్లీ కాల సర్పాలై వెన్నాడుతూనే ఉంటాయి. ప్రజలు ఎన్నుకున్న పాలకులు ఎవ్వరూ కిమ్మనరు. ఏ మంత్రీ నోరు విప్పడు. ‘కాల్‌మనీ పాపం’లో మేమే కాదు, ప్రతిపక్షమూ భాగస్వామేనని దబాయించైనా తప్పించుకోజూస్తారు. గొంతెత్తిన ప్రజాప్రతినిధుల నోళ్లు నిబంధనలతో మూస్తారు. నిలదీస్తేవెలివేస్తారు. ఇంతటి ఘోరంపై, నేరంపై ప్రజలకు జవాబుదారీ వహించాల్సిన చట్టసభలో చర్చకు అనుమతి లభించదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాట సరే, చట్టసభైనా వారికి అభయం ఇవ్వలేక ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకే అపవాదమై నిలుస్తుంది. ప్రజా స్వామ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రత్యేకించి పాలకులై అధికారం చలాయి స్తున్న వారు ప్రజల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. అధికారం తమను అధికారంలోకి తెచ్చిన ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం నిత్యకృత్యమైంది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజా స్వామ్య దేశంలో ప్రజాస్వామ్యమెక్కడని వెతుక్కోవాల్సి వస్తోంది. ప్రజల ప్రజాస్వామ్యానికి పునాది ప్రజాస్వామ్యాన్ని ఎందరు ఎన్ని రకాలుగా నిర్వచించినా దాని సారాంశం మాత్రం ప్రజల ప్రాతినిధ్యంతో కూడిన పాలనే. ప్రజాస్వామ్యం నిజంగానే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల నుంచి మొదలై... అంచెలంచెలుగా సమాజంలోని చిట్టచివరి మెట్టునున్న పౌరులకు సైతం అందేవరకు ప్రజా స్వామ్యాన్ని పదే పదే మనం నిర్వచించుకోవాల్సిందే. మన దేశంలో 1920 నాటి తొలి ఎన్నికల నుంచి 1935 వరకు పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం లేదు. 1919 మాంటెగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలకు కొనసాగింపుగా 1920లో మన దేశంలో ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులేగాక బ్రిటిష్ ప్రభుత్వం లేదా కంపెనీలు సూచించిన ప్రతినిధులు సైతం ఆనాడు పాలనలో భాగస్వాములుగా ఉండేవారు. ఇదే వ్యవస్థ 1935 వరకు కొన సాగింది. 1935లో ఈ ద్వంద్వ ప్రాతినిధ్య విధానం స్థానంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే కీలకంగా ఉండే విధానం ముందుకొచ్చింది. అయితే వ్యాపారులు, భూస్వాములు, విద్యావంతులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన రాజ్యాంగసభ మొట్టమొదటి సారిగా 21 ఏళ్ళు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి సార్వజనీన ఓటు హక్కును అమలులోకి తెచ్చింది. రాజ్యాంగ సభలో మనం ఎటువంటి ప్రజాస్వామ్య విధానాన్ని అవలం బించాలనే చర్చ ఉత్పన్నమైనప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు... అధ్యక్ష తరహా పాలనలో ఒకే వ్యక్తి చేతిలో అధికారం ఉండడం వల్ల అది నిరంకుశత్వానికి దారితీసే ప్రమాదం ఉంటుందని, సమష్టి ఆలోచన లకు, నిర్ణయాలకు అవకాశం ఉండే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రమే నిజమైన ప్రజల ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తుందని భావిం చారు. భారత దేశంలోని భిన్నత్వానికి అదే సరైన పరిష్కారమని కూడా భావించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతి నిధులే కీలకమైన శక్తి. సామాజిక, ఆర్థిక సమానత్వమూ కావాలి మానవ సమాజం, చిన్న చిన్న సమూహాల నుంచి జనపదాల పరిపాలన వరకు, అటు నుంచి ఏకఛత్రాధిపత్యంగా సాగిన సామ్రాజ్యాల వరకు సాగిన చర్రితలో రకరకాల పాలనా వ్యవస్థలు అమల్లోకి వచ్చాయి. జనపదాలలో తప్ప ఇతర వ్యవస్థలన్నిటిలోనూ ప్రజల భాగస్వామ్యం శూన్యం. చక్రవర్తి లేదా రాజు తమ ఇష్టానుసారం పాలన చేశారు. మన దేశంలో బ్రిటిష్ వలస పాలనకు ముందు ఇలాంటి పాలనే సాగింది. వలస పాలకులు కొన్ని కొత్త మార్పులను తెచ్చినా... సంపూర్ణ ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పలేదు. వలస పాలకులు స్వీయ ప్రయోజనాల కోసం రాజులు, మత పెద్దలు తదితర స్థానిక అధికార వ్యవస్థలతో కుమ్మక్కయ్యారు. 19వ శతాబ్దం చివరి దశలో పాశ్చాత్య ప్రజాస్వామ్య విధానాలను ఆకళింపు చేసుకున్న జాతీయ నాయకత్వం, మధ్య తరగతి వర్గం నిజమైన ప్రజల పాలన కోసం ఉద్యమం సాగించాయి. ఫలితంగా 1920లో, 1937లో ఎన్నికలను నిర్వహించారు. అయితే పరిమిత ప్రజల భాగస్వామ్యాన్ని కలిగిన ఈ ఎన్నికల విధానాన్ని జాతీయ నాయకత్వం తిరస్కరించింది. సంపూర్ణ ప్రజాస్వామ్యమే భారత ప్రజల లక్ష్యంగా ప్రకటించింది. ఈ క్రమానికి సమాంతరంగా సాగిన అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటం మరో కీలక అంశం. ఆయన 1919లోనే సౌత్‌బరో కమిటీ ముందు భావి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ రూపురేఖలు ఎలా ఉండాలనే దానిపై అనేక అంశాలను ప్రస్తావించారు. ఆ తరువాత సైమన్ కమిషన్ ఎదుట దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తే అంటరాని కులాలకు ఆ పాలనలో భాగస్వామ్యం ఉండేలా చూడాలని, లేనట్లయితే అది సంపూర్ణ ప్రజాస్వామ్యం కాజాలదని వాదించారు. 1930-31 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లలో అంటరాని కులాలతో పాటు అట్టడుగు వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ప్రత్యేక రాజకీయ ఏర్పాట్లను కోరారు. ప్రత్యేక ఓటింగ్ వ్యవస్థ ద్వారా అంటరాని కులాల ప్రతినిధులను ఆ సామాజిక వర్గాలే ఎన్నుకునే విధానం కోసం పట్టుబట్టి సాధించారు. అయితే గాంధీజీ నిరవధిక నిరాహార దీక్ష తో ఆ ప్రత్యేక ఓటింగ్ విధానానికి గండిపడినా, అంటరాని కులాలకు రిజర్వుడు నియోజక వర్గాలనే రాజకీయ హక్కును అంబేద్కర్ సాధించగలిగారు. ఈ కృషిచేస్తూనే ఆయన భావి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై లోతైన అధ్యయనం చేశారు. ప్రజాస్వామ్యం అంటే వయోజన ఓటింగ్, క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు మాత్రమే కాదనీ, రాజకీయ సమానత్వంతోపాటూ సామాజిక , ఆర్థిక ప్రజాస్వామ్య ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని ఆయన ఒక సందర్భంగా స్పష్టం చేశారు. గత ఆరు దశాబ్దాల్లో మన ప్రజాస్వామ్య పాలన ప్రజలకు చేరువ కాకపోగా, ప్రజాస్వామ్య భావనకే భిన్నంగా కొనసాగుతున్నది. ప్రజలను ఓట్లుగా మాత్రమే పరిగణిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళ పాత్ర మీద పెద్దగా చర్చ జరగడం లేదు. పాలనా సౌలభ్యం కోసం నిర్ణీత జనాభాకు, ప్రాంతానికి తమ ప్రతి నిధులుగా ప్రజలు ఎన్నికల ప్రక్రియ ద్వారా పార్లమెంటు, అసెంబ్లీలకు సభ్యులను పంపుతుంటారు. ప్రజల తరఫున వారే ఆయా సభలలో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధికి, అన్ని రకాల సమస్యల పరిష్కారానికి బాధ్యత వహించాలి. కానీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్న వారిలో అత్యధికులు తమ కోసం, తమ పార్టీ కోసం, తమ ప్రభుత్వం మనుగడ కోసమే పని చేస్తున్నారు. తమను ఎవరు ఎన్నుకున్నారో వారి ప్రయోజనాలను కాపాడాలనే స్పృహను కోల్పోతున్నారు. పైగా తమ హోదాను తరచుగా ఒక వ్యాపారంగా చూస్తున్నారు. అందువల్లనే ఎన్నికల్లో ఓట్లను నోట్లతో కొని గద్దెనెక్కాలని, గెలిచాక ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తాలని తాపత్రయం. దీంతో ఎన్నికల వ్యవస్థ పైన, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపైన ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్నది. నేతలు జవాబుదారీ వహించాల్సిందే ప్రజలు ఎన్నుకున్నవారు నిజమైన ప్రతినిధులుగా చట్టసభల్లో నిలవాలంటే... ఆ ప్రక్రియ క్షేత్రస్థాయిలోనే ప్రారంభం కావాలి. అటువంటి చైతన్యం మలి తెలంగాణ పోరాటంలో చూశాం. తెలంగాణ నినాదాన్నివ్వని ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజలు గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వలేదు. ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించకపోతే వారికి ప్రజా ప్రతినిధులుగా ఉండే అర్హత లేదని నడి బజారులో నిలదీశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజల డిమాండుకు తలొగ్గక తప్పలేదు. ఈ అనుభవాన్ని దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడ కోసం శక్తివంతంగా వినియోగించుకోవాలి. వివిధ నియోజకవర్గాలలోని ప్రజా సమస్యల పరిష్కా రానికి బాధ్యులు సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలేననే ప్రజాచైతన్యం రూపు దిద్దుకోవాలి. చౌక్లు, కలెక్టర్ కార్యాలయాలు మాత్రమే కాదు ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ప్రతినిధుల కార్యాలయాలు సైతం సమస్యల పరిష్కారం కోసం చేసే ధర్నాల వంటి పోరాటాలకు వేదికలు కావాలి. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా వారిపై ఒత్తిడి తేవాలి. ఎందుకంటే అధికా రులతో కూడిన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ప్రజా ప్రతినిధులతో కూడిన శాసన వ్యవస్థకు కట్టుబడి పనిచేయాల్సిందే. రాజ్యాంగ రచనా సమయంలో ఆనాటి నిపుణులు చెప్పినట్టు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పాలనా వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రజలే వాటిని సంస్కరించే బాధ్యతను చేపట్టాలి. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీ వహించేలా చేయడానికి ప్రజలు ఉద్యమించడం తప్ప ఈ రుగ్మతలకు పరిష్కారం లేదు. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
కోడిపందేల బరులకు... రేట్లు ఫిక్స్
విజయవాడ : న్యాయస్థానం ఆంక్షలు విధించినా, పోలీసులు అడ్డుకుంటామని హెచ్చరికలు చేస్తున్నా.. కోడిపందేల నిర్వాహకులు ఏమాత్రం తగ్గటం లేదు. పందేల నిర్వహణకు బరుల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మరోపక్క వారికి భరోసా ఇస్తూ పందేల నిర్వహణకు ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతలు బరుల ఏర్పాటుకు రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఈ మొత్తాలు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ముందుగా ఒప్పందాలు చేసుకుని అడ్వాన్స్‌లు ఇచ్చినవారికే ఈ రేట్లు ఉంటాయని, పండుగ దగ్గరకు వచ్చిన తరువాత రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయా నేతల అనుచరులు ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ రేట్లు ఇస్తే నాలుగైదు ఊళ్లలో బరి లేకుండా ఒకేచోట జరిగేటట్లు చేస్తామని నేతలు హామీ ఇస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగకుండా తమ అనుచరులకు ఈ వసూళ్ల బాధ్యత అప్పగించినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లాలో ఓ కీలక మంత్రి ఈ విషయంలో తన పేరు బయటకు రాకుండా వ్యవహారం నడపమని ఆదేశించినట్లు పార్టీ వర్గాల భోగట్టా. పోలీసు శాఖపై పట్టున్న అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గ నేత ఈ రేట్లు ఫిక్స్ చేసి వసూలు చేయటంలో ముందంజలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందే బరులు ఏర్పాటు చేయిస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చిన ఆ నేత రెండు రోజుల క్రితం సిద్ధం చేయించారు. కోడిపందేలు వేసే సమయానికి పోలీసులు తెలిసి అడ్డుకోవటంతో ఒకట్రెండు రోజుల్లో పూర్తి అనుమతులు తీసుకొస్తానని ఆయన సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. మరోపక్క పోలీసుల కోసం కూడా బరి నిర్వాహకులు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాల్‌మనీ కేసుల భయంతో... కాల్‌మనీ కేసులో అభాసుపాలైన ఓ ఎమ్మెల్యే ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతేడాది తన నియోజకవర్గ పరిధిలో పందేలు దగ్గరుండి మరీ నిర్వహించిన ఆ నేత ఈసారి ఒకటి రెండు రోజులు వేచిచూడమని అనుచరులకు చెబుతున్నట్లు సమాచారం. అంతర్గతంగా రేట్లు మాట్లాడి డబ్బులు చేతులు మార్చుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా తన పేరు వాడవద్దని సూచించినట్లు సమాచారం. అంపాపుర ంలో పేకాటకు ఏసీ గదులు మచిలీపట్నం : పందేల నిర్వహణ ఈసారి కొత్త పుంతలు తొక్కనుంది. గన్నవరం, హనుమాన్‌జంక్షన్‌ల మధ్య ఉన్న అంపాపురంలోని ఓ వెంచర్లో పేకాట ఆడేందుకు ఏసీ గదులను ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల నేతృత్వంలో ఈ శిబిరాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సినిమా సెట్టింగ్ పరికరాలు తీసుకొచ్చి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోడిపందేల కోసం ప్రత్యేక గ్యాలరీ ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. కైకలూరుకు చెందిన అధికార పార్టీ నాయకులు ఆదివారం కొల్లేటికోటలో సమావేశం నిర్వహించి భారీ ఎత్తున బరులు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ నాయకులు కోడిపందేలను ప్రారంభించేందుకు గుర్తుగా కోడిపందేలను ప్రారంభించి పందెం రాయుళ్లకు ఆహ్వానం పలికారు. గుడివాడ, గుడ్లవల్లేరు, పెదపారుపూడి, నందివాడ మండలాల్లో మండలానికి ఒకటి, రెండు చొప్పున కోడిపందేల బరులు ఉంటాయని, పేరుకే కోడిపందేలైనా కోత ముక్క తదితరాలు ఉంటాయని, ఆడేందుకు అనుమతులుంటాయని సమాచారాన్ని పంపుతున్నారు. -
సత్యానందానికి రిమాండ్
-
'చంద్రబాబు కొన్ని లక్షల తప్పులు చేశారు'
హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వం 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఏపీ ప్రజలకు 2015లో ఒక్క తీపి జ్ఞాపకం కూడా మిగలలేదని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని లక్షల తప్పిదాలు చేశారని ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్, కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, ఇసుక మాఫియా... ఇలా వందలాది మాఫియాలకు నిలయంగా విజయవాడను మార్చారని దుయ్యబట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మహిళలు, పేదల వ్యతిరేక పాలనగా చంద్రబాబు పాలన కొనసాగుతోందని మండిపపడ్డారు. కొత్త సంవత్సరంలోనైనా మంచి పాలన అందించాలని చంద్రబాబుకు రాంబాబు హితవు పలికారు. -
'చంద్రబాబు కొన్ని లక్షల తప్పులు చేశారు'
-
'డబ్బులివ్వకపోతే లాడ్జీకి పంపిస్తానని బెదిరింపు'
-
ఇద్దరు ‘కాల్’ నాగుల అరెస్టు
విశాఖలో టీడీపీ నేత ‘గుడివాడ’ దందాలు వెలుగులోకి సాక్షి, విశాఖపట్నం, విజయవాడ: ధనార్జనే ధ్యేయంగా అధిక వడ్డీలకు డబ్బులు తిప్పుతూ బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు ‘కాల్‌మనీ’ వ్యాపారులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరు టీడీపీ నేత కాగా మరొకరు వ్యాపారి.పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడితో సన్నిహితంగా ఉంటూ, టీడీపీ నాయకుడిగా చలామణి అవుతూ కాల్‌మనీ కేసులు ఎదుర్కొంటున్న గుడివాడ రామకృష్ణను విశాఖ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 37 చెక్‌లు, 39 ప్రామిసరీ నోట్లు, నాలుగు కత్తులు, ఎల్ఐసీ బాండ్లు, కారు, ద్విచక్రవాహనంను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ త్రివిక్రమవర్మ వెల్లడించారు. నిందితుడిపై వరుసగా కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు తిరుపతి వెళ్లి వస్తూ ప్రత్యేక పోలీసు బృందానికి చిక్కాడు. రామకృష్ణ తన కారుకు టీడీపీ జెండాను అమర్చుకుని తిరుగుతున్నాడు. మంత్రి అయ్యన్నతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు అతడి నివాసంలో దొరికాయి. పోలీసులు మాత్రం రికార్డుల్లో రామకృష్ణ ఏ పార్టీకీ చెందని వాడిగా పేర్కొంటున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనానికి ఉన్న టీడీపీ జెండాను కూడా తొలగించారు. బెజవాడలో ఉద్యోగులకు బెదిరింపులు ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతున్న ఆరోపణలపై కాల్‌మనీ వ్యాపారి రాంపిళ్ల పాపారావును విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ కమిషనరేట్‌లో కాల్‌మనీ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాక తొలి అరెస్టు ఇదే. డీసీపీ ఎల్.కాళిదాస్ విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. -
కాల్‌మనీ కేటుగాడు అరెస్ట్
అల్లిపురం: కాల్‌మనీ కేసులో తప్పించుకు తిరుగుతు న్న బడా ఫైనాన్షియర్ గుడివాడ రామకృష్ణను ఆరి లోవ, ఎంవీపీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించారు. అతని వద్ద నుండి 37 బ్లాంక్ చెక్కులు, 39 ప్రామిసరీ నోట్లు, 4 కత్తులు, ఎల్ఐసీ బాండ్లు, కారు, స్కూటర్, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర శాంతిభద్రతల డీసీపీ టి.త్రివిక్రమవర్మ వివరాలు వెల్లడించారు. లాసన్స్‌బే కాలనీకి చెందిన గుడివాడ రామకృష్ణ రియల్ ఎస్టేట్, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారాలు చేస్తుంటాడు. ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు, విలువైన డాక్యుమెంట్లు తీసుకుని నూటికి రూ.6 వడ్డీ చొప్పున అప్పులు ఇస్తుంటాడు. అప్పు తీర్చేసినా డాక్యుమెంట్లు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు తిరిగి ఇవ్వకుండా అప్పు తీసుకున్న వారిని ఇబ్బంది పెట్టటమే కాకుండా మహిళలను లైంగిక వే ధింపులకు గురి చేయటం, చంపేస్తానని, వారి కు టుంబసభ్యులను కిడ్నాప్ చేస్తానని బె దిరించటం చేస్తుంటాడు. ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఆదర్శనగర్‌కు చెందిన దీప్తి శారద అనే మహిళ, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కుమారి అనే మహిళ రామకృష్ణపై ఫిర్యాదు చేశారు. తాను తీసుకున్న రూ.5 లక్ష ల అప్పుకుగాను రూ.35 లక్షల ఇంటిని స్వాధీనం చేసుకున్నారని పెదవాల్తేరుకు చెందిన బి.వి.ఆర్.కె.సి.కిషోర్ ఎంవీపీ కాలనీ స్టేషన్లో ఈ నెల 18న ఫిర్యాదు చేశారు. మధురవాడ ఏసీపీ దాసరి రవి బాబు పర్యవేక్షణలో ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు, ఎంవీపీ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ కాంతారా వు, ఇతర సిబ్బందితో నిందితుడిని 2 రోజుల క్రితం తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. గురువారం నగరానికి తీసుకువచ్చి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు గుడివాడ రామకృష్ణపై 1993 లో టూటౌన్లో మోటారు సైకిల్ దొంగతనం కేసు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు రివార్డులను అందజేశారు. రామకృష్ణ వేధింపులు భరించలేనివి డబ్బులు ఇవ్వకపోతే తనతో ఒక రోజు గడపమనేవాడని, అలా అయితే అప్పును వదులుకుంటానని వేధించేవాడని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలా కానిపక్షంలో పిల్లలను కిడ్నాప్ చేస్తానని బెదిరించేవాడని వాపోయారు. తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తరువాత కూడా కాసానిబాబా అనే వ్యక్తితో బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. భార్యాభర్తలను విడదీస్తామని, కాపురాలు కూల్చుతామని నిత్యం టార్చర్ పెడుతుండేవాడని తెలి పారు. ఏసీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ ‘అలాంటివి కామనే’ అని కొట్టి పారేశారన్నారు. తమలా చాలా మంది బాధితులు ఉన్నారని వారు తెలిపారు. బాధితులు 1090కి ఫిర్యాదు చేయవచ్చు గుడివాడ రామకృష్ణ బాధితులు ఎవరైనా ఉంటే 1090 నంబరుకు ఫోన్ చేసిగాని, నేరుగా గాని ఫిర్యాదు చేయవచ్చని డీసీపీ టి.త్రివిక్రమవర్మ తెలిపారు. బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకునేందుకు 24 గంటలు ఈ నంబరు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. -
సెక్స్ రాకెట్ నిందితుడి ఫామ్‌హౌస్ పై దాడి
-
డిప్యూటీ సీఎంకు ‘బంధువుల’ బెడద
► చినరాజప్ప పేరు యథేచ్ఛగా వాడుకుంటున్న నేరగాళ్లు ► కాల్‌మనీ కేసుల్లోనూ వాడేస్తున్న వైనం రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ‘బంధువుల’ బెడద పట్టుకుంది. అది కూడా నేరగాళ్ల రూపంలో. ‘హోం మంత్రి ఎవరనుకుంటున్నావు? మా బంధువే! చెప్పింది చెయ్యి’ అంటూ తమ నేరాల గురించి ప్రశ్నించిన పోలీసులను సైతం కొందరు బెదిరించిన దాఖలాలున్నాయి! తాజాగా కాల్‌మనీ కేసుల్లోనూ హోం మంత్రి తమ బంధువంటూ పలువురు నిందితులు చెప్పుకుంటున్నారు. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తుల పేర్లను ఇలా ఇష్టానుసారం ఉపయోగిస్తే.. రియాక్షన్ కూడా సీరియస్‌గానే ఉండాలి. కానీ, రాజప్ప సాక్షాత్తూ రాష్ర్ట పోలీసు శాఖకు బాస్ అయినా.. అటువంటి వ్యక్తులపై ఆ స్థాయిలో స్పందిస్తున్న దాఖలాలు కానరావడం లేదు. మెతకగా ఉంటూ కేవలం ఖండనలకే పరిమితమవుతున్నారంటూ ఆయన వైఖరిని పలువురు విమర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఇటీవల వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్నవారు డిప్యూటీ సీఎం చినరాజప్ప పేరును యథేచ్ఛగా వాడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సౌతిండియా చైర్మన్‌నని, హోం మంత్రి రాజప్ప బంధువునని హడావుడి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్ర గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో ఆయనకు సలాం చేసిన అమాయకులు.. పోలీ సులకు పట్టుబడిన తరువాత అతడో మోడగాడని గ్రహించారు. గత ఏడాది మార్చి నెలలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అవినాష్ పూర్వీకుల స్వస్థలం కోనసీమలోని పి.గన్నవరం మండలం పోతవరం. చినరాజప్ప కూడా కోనసీమలోని అమలాపురం ప్రాంతానికి చెందినవారే. ఆయన వివరాలన్నీ అవినాష్ చెబుతూండటంతో అంతా రాజప్ప బంధువేనని నమ్మేవారు. కొంతమంది అధికారులు కూడా ఆయనకు బాగానే సహకరించేవారు. ఇదే అదనుగా అతడు తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. గంజాయి, పులిచర్మాల స్మగ్లింగ్ చేసేవాడు. చివరకు పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ సమయంలో కూడా హోం మంత్రి ఖండించడం తప్ప అవినాష్‌పై వ్యక్తిగతంగా ఎటువంటి కేసూ నమోదు చేయించలేదు. తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో అడపాదడపా ఆయన పేరును కొంతమంది వాడుకున్నా పోలీసులు కఠిన చర్యలు చేపట్టలేదు. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోకన్నా ఆయన నివాసం ఉంటున్న అమలాపురంలోనే ఎక్కువమంది నేరగాళ్లు తాము ఆయన బంధువులమని బాహాటంగా చెప్పుకుంటున్నారు. పోలీసులతో పాటు ప్రభుత్వాధికారులను కూడా బెదిరిస్తున్నారు. కాల్‌మనీ కేసుల్లోనూ.. జిల్లాలో అమలాపురం కేంద్రంగా వడ్డీ వ్యాపారం భారీస్థాయిలో జరుగుతోంది. వడ్డీ వసూళ్లు, సెటిల్మెంట్లలో వేలు పెట్టే రౌడీషీటర్లు, దందాబాబులకు ఇది అడ్డాగా మారింది. డిప్యూటీ సీఎంకు చెందిన ప్రాంతంలోనే వారు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేరగాళ్లలో చాలామంది ప్రతి చిన్న విషయానికీ రాజప్ప పేరు చెప్పి తప్పించుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇటీవల విజయవాడలో కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో.. జిల్లాలోనూ పలువురు బాధితులు బయటకొచ్చారు. ఇచ్చిన రుణానికి పదిరెట్లు గుంజుతున్నా, భయపెట్టి ఆస్తులు లాక్కుంటున్నా నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం బంధువునంటూ అమలాపురానికి చెందిన వడ్డీ వ్యాపారి ఒకరు, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఎన్.కొత్తపల్లికి చెందిన ఆక్వా రైతు ఏలూరు డీఐజీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రాజప్ప స్పందించినా.. వారు తన బంధువులు కాదంటూ ఖండనకే పరిమితమయ్యారు. తప్పుడు సంకేతాలు ఇలా పలువురు నేరగాళ్లు, క్రిమినల్ కేసుల్లో నిందితులు రాజప్ప పేరు వాడేస్తున్నా.. అటు ఆయన కానీ, ఇటు పోలీసులు కానీ కేసులు నమోదు చేయడంలేదు. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన రైతు దేశంశెట్టి సత్తిబాబు... గత నెలలో కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన ఆవేదనతో ఫ్లెక్సీ పెట్టిన విషయం తెలిసిందే. ఈమార్రానికే పోలీసులు అతడిని స్టేషన్‌కు లాగారు. అలాంటిది డిప్యూటీ సీఎం పేరును వాడుకుంటున్నవారిపై కేసులు పెట్టడంలేదు. కనీసం రాజప్ప నుంచి కూడా ఫిర్యాదులు ఉండడంలేదు. ఇలాంటి నేరాల విషయంలో డిప్యూటీ సీఎం వ్యవహార శైలి తప్పుడు సంకేతాలు ఇచ్చేదిగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
10 మందిపై కాల్‌మనీ కేసులు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, మట్కా నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నవీన్‌గులాఠి తెలిపారు. బుధవారం ఆయన ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్లను రూపుమాపడానికి నిరంతరం దాడులు కొనసాగిస్తామని చెప్పారు. టాస్క్ ఫోర్సు దాడుల నేపథ్యంలో జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా బాగా తగ్గిందన్నారు. కాల్ మనీ వ్యవహారంలో జిల్లా వ్యాప్తంగా అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై దాడులు చేశామని ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాలో 9 కేసులు నమోదు చేసి 10 మందిని అరెస్ట్ చేశామన్నారు. ధర్మ వడ్డీకి ఇస్తున్న వారి జోలికి వెళ్లబోమన్నారు. వడ్డీకి డబ్బు ఇవ్వడమనేది నేరం కాదని, అయితే రూ. 1 లక్ష అప్పుగా ఇచ్చి వారి నుంచి రూ.4-5 లక్షలు వసూలు చేయడం పెద్ద నేరమని చెప్పారు. -
సెక్స్‌రాకెట్ బాధిత మహిళల కన్నీళ్ల మాటేమిటి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల మండిపాటు సాక్షి, హైదరాబాద్: ‘వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏదో అన్నారని ఓ దళిత ఎమ్మెల్యేతో అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టించారు.. మరి రాష్ట్రవ్యాప్తంగా కాల్‌మనీ సెక్స్ రాకెట్ ఉచ్చులో పడి వేలాది మంది మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు.. వారి కన్నీళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. మంగళవారం ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మహిళా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, విశ్వాస రాయి కళావతి, పుష్పశ్రీవాణి, రాజేశ్వరిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వడ్డీకి తీసుకున్న మహిళల్నే కాదు వారి కూతుళ్లను కూడా చెరపట్టి వ్యభిచార రొంపిలోకి దించిన నాయకులపై, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘జగన్ కుటుంబంలో మహిళకు ఇలాంటి అవమానం జరిగితే ఊరుకుంటారా అని ఎమ్మెల్యే అనితతో మాట్లాడించారు..మరి రాష్ట్రవ్యాప్తంగా ఇంత మంది సెక్స్‌రాకెట్‌లో ఇరుక్కుని బాధిత మహిళలుగా మిగిలారు. ఇలాంటి పరిస్థితి చంద్రబాబు ఇంట్లో మహిళలకు జరిగితే ఊరుకుంటారా?’ అని ప్రశ్నిస్తున్నామన్నారు. బాబు మాటలకు చేతలకు పొంత ఉందా?: సీఎం చంద్రబాబు మాటలకు చేతలకు అసలేమైనా పొంతన ఉందా అని మరో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. ‘విశాఖపట్నంకు సీఎం వచ్చినప్పుడు బాక్సైట్ విషయంలో అన్యాయం జరగనివ్వం అన్నారు, ఆ తర్వాత మూడు రోజులకే నవంబర్ 5న జీవో నెం.97ను ఇచ్చారు...బాబు మాటలను ఎవరైనా నమ్ముతారా’ అని మండిపడ్డారు. -
'టీడీపీ ఎమ్మెల్యేలు ఆ అంశంపై ఎందుకు మాట్లాడరు?'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, కళావతి, పుష్పశ్రీవాణి, రాజేశ్వరి ఆరోపించారు. మంగళవారం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తమ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో ఈ రోజు కన్నీరు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. కాల్ మనీ వ్యవహారంపై చర్చకు నిరాకరించడం, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్‌ను ఎత్తివేయనందుకు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బాయ్‌కాట్ చేసిన సంగతి తెలిసిందే. -
కాల్‌మనీ కేసులో బుద్దా వెంకన్న సోదరుడికి బెయిల్
వన్‌టౌన్ (విజయవాడ): కాల్‌మనీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావుకు వన్‌టౌన్ పోలీసులు గురువారం స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వన్‌టౌన్ పోలీసులు బుద్దా నాగేశ్వరరావు కేసును చీఫ్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టారు. దానిపై స్పందించిన న్యాయమూర్తి.. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలకు స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చని, కోర్టులో ఎందుకు పెడుతున్నారని అంటూ కేసును రిటర్న్ చేశారు. దాంతో వన్‌టౌన్ పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదించారు. అనంతరం నాగేశ్వరరావుకు స్టేషన్ బెయిల్‌ను మంజూరు చేశారు. -
కాల్ మనీ...! ఇంతటితో ముగించండి...!!
ఇంతటితో ఈ అంశాన్ని ముగించాలని స్పీకర్‌ను కోరిన చంద్రబాబు కాల్ మనీ-సెక్స్ రాకెట్‌పై చర్చకు వైఎస్సార్సీపీ డిమాండ్ ఉదయం సభ నుంచి వైఎస్సార్సీపీ మొత్తం సభ్యుల సస్పెన్షన్ నిరసన చెప్పినందుకు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన అధికార పక్షం జగన్ చూపిన ఆధారాలపై స్పందించని చంద్రబాబు జగన్ మాట్లాడుతున్న దశలోనే జోక్యం చేసుకున్న సీఎం హైదరాబాద్ః కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంపై రెండోరోజు కూడా శాసనసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్షం మధ్య నిరసనలు, నినాదాల మధ్య అసెంబ్లీ హోరెత్తింది. ఎప్పటిలాగే అధికార టీడీపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి కొనసాగించింది. శుక్రవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే ఈ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం సభ్యులను అంబేద్కర్ అంశంపై చర్చ ముగిసే వరకు అంటూ సస్పెండు చేసింది. మళ్లీ మధ్యాహ్నం సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షం కాల్ మనీ - సెక్స్ రాకెట్‌పై సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టగా, ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారంటూ అధికార పార్టీ అడ్డుతగిలింది. దాంతో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి నిరసనలతో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా, ఆగ్రహించిన చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు ఆర్ కె. రోజాను ఏకంగా ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండు చేయించారు. నిందితులపై నోరు విప్పని బాబు రోజంతా నిరసనలు నినాదాల మధ్య ప్రతిపక్షం కొంత దిగొచ్చినప్పటికీ ముఖ్యమంత్రి సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ఈ అంశంపై ముందుగా సీఎం ప్రకటన చేస్తామన్న అంశానికి ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి అంగీకరించారు. అయితే ఆ తర్వాత జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడినప్పుడు పలు ఆధారాలను ఫోటోలతో సహా ప్రదర్శించారు. కాల్‌మనీ వ్యవహారంలో నిందితుడు ముఖ్యమంత్రితో, ఇంటలిజెన్స్ చీఫ్‌తో కలిసి దిగిన ఫోటోలను ఒకటికి నాలుగుసార్లు చూపించారు. ఎమ్మెల్యేతో కలిసి విదే శాలకు వెళ్లిన మరో నిందితుడు తిరిగి స్వదేశానికి రాకపోవడంలోని ఆంతర్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలను పదేపదే సభ దృష్టికి తీసుకురావడమే కాకుండా ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని జగన్ ప్రశ్నించినప్పటికీ ముఖ్యమంత్రి తన సమాధానంలో ఆ విషయాలనెక్కడా ప్రస్తావించలేదు. సస్పెన్షన్ల పర్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే ఇద్దరు ప్రతిపక్ష సభ్యులను సస్పెండు చేసిన ప్రభుత్వం రెండోరోజూ సస్పెన్షన్ల పర్వాన్ని కొనసాగించింది. కాల్ మనీ- సెక్స్ రాకెట్‌పై చర్చ జరగాలని పట్టుబట్టినందుకు అంబేద్కర్‌పై చర్చ ముగిసే వరకు ప్రతిపక్ష సభ్యులందరినీ సభ నుంచి సస్పెండు చేశారు. మధ్యాహ్నం వరకు ఏకపక్షంగా ప్రభుత్వం ప్రతిపాదించిన చర్చ అనంతరం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే మరోసారి కాల్ మనీ - సెక్స్ రాకెట్ అంశంపై ముందు చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు మూకుమ్మడిగా స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలియజేశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంట్లో ఆర్కే రోజా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా, అది జరిగిన గంటకు సభలో అధికార పార్టీకి చెందిన ఒక సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేసి రోజాను ఏడాది పాటు సస్పెండు చేయాలని ప్రతిపాదించారు. వెంటనే స్పందించిన సభా వ్యవహారాల శాఖ మంత్రి తీర్మానం ప్రతిపాదించడం, రోజాకు గానీ విపక్షానికిగానీ దానిపై వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా అదికూడా ఏడాది పాటు శాసనసభ నుంచి రోజాను సస్పెండు చేశారు. చర్చ కోసం ప్రకటనకు అంగీకరించిన జగన్ రోజంతా కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారం అసెంబ్లీని కుదిపేయగా, దీనిపై చర్చ కోసం ప్రభుత్వం చెబుతున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేయడానికి జగన్ అంగీకరించారు. కాల్ మనీ వ్యవహారంలో ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేసిందీ, ఎవరెవరిని అరెస్ట్ చేసిందీ ముఖ్యమంత్రి వివరించారు. ఈ వ్యవహారంలో ఏ పార్టీకి చెందిన వారు ఎంత మంది ఉన్నారన్న వివరాలను చెప్పారు. ఇంతకన్నా ఆధారాలేం కావాలి ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత మాట్లాడిన జగన్... ముద్దాయిలు ముఖ్యమంత్రి పక్కన, ఇంటలిజెన్స్ చీఫ్ పక్కన కూర్చొని ఫోటోలు దిగిన విషయాన్ని ప్రస్తావించారు. మరో నిందుతుడు టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి విదేశాలకు వెళ్లడం, ఈ వ్యవహారం తెరమీదకు రావడంతో విదేశాల నుంచి ఎమ్మెల్యే మాత్రమే తిరిగొచ్చి అతడితో వెళ్లిన ముద్దాయి రాకుండా పోవడాన్ని ప్రశ్నించారు. జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పని బాబు ఇలా ఫోటోలను చూపించి ఇంతకన్నా ఆధారాలేం కావాలని జగన్ ప్రశ్నించినప్పటికీ చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేదు. వారిపై చర్యలు తీసుకుంటామని హామీ పక్కనపెడితే అసలు వాటి ప్రస్తావన కూడా సభలో చేయలేదు. ఈ చర్చలో జగన్ మాట్లాడినంత సేపు మధ్యమధ్యలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు జోక్యం చేసుకుని జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సబ్జెక్టును క్లోజ్ చేయండి అధ్యక్షా... ఈ అంశంపై చర్చలో జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ముద్దాయిలకు సంబంధించి తాను లేవనెత్తిన అంశాలను మరోసారి ప్రస్తావిస్తుండగా, ఆ దశలో ముఖ్యమంత్రి జోక్యం వాటికి సమాధానం చెప్పకపోగా... ఇంతటితో ఈ సబ్జెక్టును క్లోజ్ చేయండి... అధ్యక్షా అంటూ స్పీకర్‌ను కోరారు. అంతే అంతటితో సభను స్పీకర్ మరుసటి రోజుకు వాయిదా వేశారు. -
కేసును నీరుగార్చేందుకే చర్చకు సీఎం విముఖత
పాలకొల్లు అర్బన్ : విజయవాడ కాల్‌మనీ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, నాయకులకు ప్రత్యక్ష సంబంధాలున్న కారణంగానే అసెంబ్లీలో చర్చించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కదారి పట్టించినట్టు వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్ ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కాల్‌మనీపై చర్చకు తీసుకురావాలని పట్టుబట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిస్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత లేవనెత్తిన అంశాలపై చర్చించకుండా ముఖ్యమంత్రి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కాల్‌మనీ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్‌మనీ దోషులపై వెంటనే అసెంబ్లీలో చర్చించి నిందితుల్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టాలన్నారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు దళితుల పరువు తీస్తున్నారని విమర్శించారు. తన శాఖలో జరిగిన లోపాలను సరిదిద్దలేని స్థితిలో ఆయనున్నారని ఆనందప్రకాష్ ఎద్దేవా చేశారు. -
అందర్నీ వేధించండి.. మావాళ్లను రక్షించండి
పోలీసులకు సర్కారు ఆదేశం టీడీపీ నేతల కాల్‌మనీ కేసును నీరుగార్చే కుట్ర అర్ధరాత్రి సోదాలతో హడావుడి చేస్తున్న పోలీసులు మాధవధారలో ఓ వడ్డీ వ్యాపారి ఇంటిలో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు సోదాలు జరిపారు. ఆధారాలేవీ లభించకపోయినా అతన్ని తమతో తీసుకుపోయారు. వన్‌టౌన్ పరిధిలో ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకుని తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి మరోవైపు : ఇద్దరు బాధితురాళ్లు గుడివాడ రామకృష్ణ అనే వ్యాపారి వేధింపులపై నవంబర్‌లో ఫిర్యాదు చేసినా పోలీసుల ఉదాసీనత. సదరు వ్యాపారి మంత్రికి సన్నిహితుడు కావడం.. అధికార టీడీపీకి చెందిన వాడు కావడమే దీనికి కారణం. బాధితులు బీజేపీ ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో కేసు నమోదు చేయకతప్పలేదు. అయితే అతను పరారీలో ఉన్నట్లు చూపుతున్నారు. ..ఈ మూడు ఉదంతాలు పాలకుల దుర్నీతికి దర్పణం పడుతున్నాయి. విజయవాడ కాల్‌మనీ కేసులను నీర్చుగార్చేందుకు.. జనం దృష్టి మళ్లించి తెలుగు తమ్ముళ్లను రక్షించేందుకు సర్కారు పన్నిన పన్నాగంలో పోలీసులు పావులుగా.. ‘కాల్’ నాగులుగా మారి అమాయక వడ్డీ వ్యాపారులను కాటేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజంగా వేధింపులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు ఉన్న వారిపై చర్యలు చేపట్టకుండా.. అందరు వ్యాపారులపై దాడులకు పాల్పడటం.. ‘అందర్నీ వేధించి.. తమ వారిని రక్షించుకునే ధోరణి కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం: విజయవాడలో వెలుగుచూసిన టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నేతల కాల్‌మనీ దురాగతాల కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నింది. పరిమితికి లోబడి వడ్డీ వ్యాపారం చేసే వారిపై కూడా దాడులు చేయాలని పోలీసులను ఆదేశించింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టి మళ్లించి తమ నేతలను రక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందర్నీ ఒకే గాటన కట్టేయడం ద్వారా టీడీపీ నేతల దురాగతాల కేసును నీరుగార్చాలన్నది అసలు పన్నాగం. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు జిల్లాలో వడ్డీ వ్యాపారులను తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తూ హడలెత్తిస్తున్నారు. టీడీపీ తమ్ముళ్ల కేసు నీరుగార్చేందుకే.... విజయవాడలో కాల్‌మనీ అకృత్యాలకు పాల్పడినవారికి సీఎం చంద్రబాబు, లోకేష్‌ల అండదండలు ఉన్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. దాంతో ఈ కేసును నీరుగార్చి తమ పార్టీ నేతలను కాపాడటానికి సీఎం చంద్రబాబు పన్నాగం పన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేసి వేధించాలని పోలీసులను ఆదేశించారు. అత్యధిక వడ్డీ వసూలు చేస్తూ వేధించేవారిని, మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ పరిమితికి లోబడే వడ్డీలు వసూలు చేసే వ్యాపారులను, వేధింపులకు గురి చేయని వారినీ వేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. సందట్లో సడేమియాగా అన్ని కేసులతోపాటు విజయవాడలో టీడీపీ నేతల అకృత్యాల కేసును కూడా నీరుగార్చాలని ఎత్తుగడ వేశారు. దాడులు... వేధింపులు సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు జిల్లాలో వడ్డీ వ్యాపారులపై విరుచుకుపడుతున్నారు. ఫిర్యాదు లేకపోయినప్పటికీ అర్ధరాత్రిళ్లు ఇళ్లలో సోదాలు చేస్తూ హడలెత్తిస్తున్నారు. ఆధారాలు లభించకపోయినా సరే వ్యాపారులను అనధికారికంగా నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. మాధవధారలో ఓ వడ్డీవ్యాపారి ఇంటిలో మంగళవారం రాత్రి పోలీసులు సోదలు చేశారు. అత్యధిక వడ్డ వసూలు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోయినా ఆయన్ని తమతోపాటు తీసుకుపోయారు. వన్ టౌన్ పరిధిలో ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తెల్లకాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ నేత కేసులో ఉదాసీనత నిబంధనల మేరకు వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిని వేధిస్తున్న ప్రభుత్వం టీడీపీ నేతలకు మాత్రం రక్షాకవచంగా నిలుస్తోంది. విజయవాడలో మాదిరిగానే విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీకి చెందిన గుడివాడ రామకృష్ణ అనే వ్యాపారి మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చింది. మంత్రి అయ్యన్నపాత్రుడుకు సన్నిహితుడైన ఆయన తన వాహనానికి టీడీపీ జెండా పెట్టుకుని తిరుగుతుంటారు. ఆయన ఓ మహిళకు రూ.100కు రూ.30 వడ్డీపై అప్పు ఇచ్చారు. అప్పు తీర్చాలని లేకపోతే తన కోరిక తీర్చాలని వేధిస్తున్నారు. బాధితురాలు నవంబర్ 21న అతనిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. మరో మహిళ ఇచ్చిన అప్పు తీర్చినప్పటికీ ప్రామిసరీ నోటు ఇవ్వాలంటే తన కోరిక తీర్చమని రామకృష్ణ వేధిస్తున్నారు. ఆమె కూడా నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణ మంత్రి అయ్యన్నకు సన్నిహితుడు కావడంతో పోలీసులు పట్టించుకోలేదు. విజయవాడ కాల్‌మనీ దురాగతాలు బయటపడిన తరువాత బాధితులు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజును మంగళవారం ఆశ్రయించారు. ఎమ్మెల్యే చెప్పడంతో రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఆయన పరారీలో ఉన్నారని చెబుతున్నారు. అమాయకులైన వడ్డీవ్యాపారులపై ప్రభుత్వ వేధింపులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలను రక్షించుకోవడానికే..! కాల్‌మనీ సంఘటనలు వెలుగులోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వారందరినీ ముందుగా అరెస్టు చేసి కేసు పూర్వాపరాలు పరిశీలించాలి. మిగిలిన జిల్లాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఎలా ఉన్నాయో నివేదిక రప్పించుకోవాలి. అంతేగానీ దాడులకు పురిగొల్పి అందరినీ పోలీస్ స్టేషన్‌కు రప్పించుకుని విచారించడం అసలు కేసును పక్కదోవపట్టించడానికే. టీడీపీ నేతలను రక్షించుకోవడానికే. కేస్ టు కేస్ పరిశీలించకుండా మొత్తం అందరినీ ఒకే రీతిన ఇబ్బంది పెట్టాలను కోవడం ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోంది. చట్టవ్యతిరేకంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న అందరినీ శిక్షించాలి. అంతే కానీ అందరికీ ఒకే శిక్ష అనడం సరైంది కాదు. -జేవీ సత్యన్నారాయణ మూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, సీపీఐ ఫిర్యాదులుంటే చర్యలు చేపట్టండి..! టీడీపీ నేతల ఆరాచకాల కేసును.. పక్కదారి పట్టించేందుకే ఇలా అందర్నీ వేధిస్తున్నారు. ఫిర్యాదులుంటే వడ్డీ వ్యాపారులపై చర్యలు చేపట్టండి. ఫిర్యాదులు రాకపోతే బాధితులకు మనోధైర్యం కల్పించి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాతే కేసులు పెట్టండి. అంతే గానీ చట్టపరంగా వ్యాపారం చేసుకునే వారిపై కూడా కాల్‌మనీ ముసుగులో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం సరైంది కాదు. లెసైన్స్ హోల్డర్లు చట్టపరంగా చేస్తున్నారో లేదో పరిశీలించండి. బాధితుల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి. -నండూరి రామకృష్ణ ఎంవీపీకాలనీ 12 సెక్టార్ల అధ్యక్షుడు -
'కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది'
హైదరాబాద్: కాల్ మనీ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ...కాల్ మనీ కేసును చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కేసులో బడా బాబులను వదిలేసి చిన్న చిన్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారని కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 25 రోజుల నుండి నెల రోజులు పాటు జరపాలని...ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆమె హెచ్చరించారు. -
'కాల్‌మనీ కేసుపై అసెంబ్లీలో చర్చిస్తాం'
హైదరాబాద్: ప్రజలను పీడించి, వేధింపులకు గురిచేసిన కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో బుధవారం వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. ఏం చెప్పారంటే.. కాల్ మనీ కేసుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తాం నిరుద్యోగ సమస్యలను, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం వీఆర్ఏ, అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలను ప్రస్తావిస్తాం విచ్చలవిడి కల్తీమద్యం అమ్మకాలు, అమాయకులు చనిపోయిన ఘటనపై చర్చిస్తాం ఏపీలో మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తాం గిరిజనుల మనుగడుకు నష్టం వాటిల్లేలా ఉన్న బాక్సైట్ విధానాన్ని మార్చాలి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తాం ఆకాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి ప్రజా సమస్యలన్నింటీపై చర్చ జరిగి పరిష్కారం చూపేంతవరకు అసెంబ్లీ సమావేశాలు జరగాలి శాసనమండలిలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తాం -
సెలవు రద్దు చేసుకున్న సీపీ గౌతమ్ సవాంగ్
-
సెలవు రద్దు చేసుకున్న సీపీ గౌతమ్ సవాంగ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసును వెలుగులోకి తీసుకొచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్.. తన దీర్ఘకాలిక సెలవును రద్దు చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు 15 రోజులు సెలవు కావాలని దరఖాస్తు చేసుకున్న సవాంగ్, ఆ ఆలోచనను విరమించుకుని బుధవారం విధులకు హాజరయ్యారు. కాల్ మనీ కేసు విచారణను మీరే చేపట్టాలంటూ బాధితులు విన్నవించడంతో సవాంగ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. ముక్కుసూటి వ్యక్తిగా పేరున్న సవాంగ్ రాజకీయ ఒత్తిళ్లతో సెలవుపై వెళ్లారని, ఆయన స్థానంలో ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబుకు బాధ్యతలు అప్పగించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గౌతమ్ సవాంగ్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ''సెలవు రద్దు చేయాలని నేనే అడిగాను. దాంతో డీజీపీ కూడా వెంటనే రద్దు చేశారు. పండగ సమయంలో కుటుంబ సభ్యులంతా ఆస్ట్రేలియాలో కలవాలని అనుకున్నాం. కానీ కేసు తీవ్రత చూసిన తర్వాత, ప్రజలంతా కూడా నన్ను ఉండాలని ఒత్తిడి చేయడంతో సెలవు రద్దుచేసుకున్నాను. ఇందులో రాజకీయం ఏమీ లేదు, ఒత్తిళ్లు కూడా లేవు. చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే మేం మాత్రం ఈ కేసును వ్యవస్థాగతంగా, లాజికల్‌గా విచారణ చేస్తున్నాం. తొందర పడటం లేదు. ఏరకమైన ఒత్తిడి కూడా లేదు. రాజకీయం కూడా ఏమీ లేదు. దయచేసి అలాంటి మాటలు తీసుకురావద్దు. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అది పూర్తయ్యేవరకు దీని గురించి మాత్రం ఏమీ చెప్పలేను. ఈ కేసులో మోసం, ఎక్స్టార్షన్, అన్నీ ఉన్నాయి. డాక్యుమెంట్లు తీసుకోవడం, ఖాళీ పత్రాల మీద సంతకాలు తీసుకోవడం తగదు. సీపీ కార్యాలయం గేటు దగ్గరకు చాలా మంది వస్తున్నారు. ఇది పెద్ద సమస్య. దీన్ని తప్పకుండా పరిష్కరిస్తాం. ఇందులో పెద్ద మొత్తాలు ఉన్నాయి కాబట్టి ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా విషయం చెప్పాల్సి ఉంటుంది'' అని సీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. వాస్తవానికి సీపీ గౌతమ్ సవాంగ్ గత వారం రోజులుగా ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఎంత పెద్దవాళ్లయినా వదిలిపెట్టేది లేదని ఆయన చెబుతూ వస్తున్నారు. టీడీపీ నాయకుల గుట్టును రట్టు చేశారు. ఇంతలో అకస్మాత్తుగా ఆయన సెలవు విషయం బయటకు వచ్చింది. ఈనెల 27న తాను మళ్లీ విధుల్లో చేరుతానని చెప్పారు. పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. కేసును తప్పుదోవ పట్టించేందుకే సవాంగ్‌ను సెలవులో పంపారని ఆరోపణలు వచ్చాయి. వీటిని డీజీపీ జేవీ రాముడు, స్వయంగా గౌతమ్ సవాంగ్ కూడా ఖండించినా, కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నవాళ్లు మాత్రం ఇది బలవంతపు సెలవేనని అనడంతో.. తప్పనిసరి పరిస్థితులలో ఆయన సెలవు రద్దయింది. -
'ఆయన' కోసం రంగంలోకి దిగిన ఎన్నారై
విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాల్ మనీ' కేసులో దోషులను తప్పించేందుకు పలువురు ప్రముఖులు రంగంలోకి దిగి చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు. ఈ కేసులో కీలక వ్యక్తుల్లో ఒకరైన విద్యుత్ శాఖ డీఈ సత్యానందంను తప్పించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలైంది. సత్యానందాన్ని తప్పించేందుకు ఇప్పటికే ఓ ఎన్నారై ప్రముఖుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. సదరు ఎన్నారై తానాలో కీలక పదవిలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఆ ఎన్నారైకి మంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఎన్నారైల వ్యవహారాలను చూస్తున్న టీడీపీ రాజ్యసభ ఎంపీ ద్వారా ఎన్నారై ఇప్పటికే లాబీయింగ్ ప్రారంభించారని తెలిసింది. గతంలో సత్యానందంకి కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు కూడా ఈ ఎన్నారై రంగంలోకి దిగారు. కానీ అది సాధ్యపడలేదని సమాచారం. కాల్ మనీ వ్యవహారంలో ఇప్పటికే సత్యానందంపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
పోలీసుల అదుపులో కాల్ నాగులు
-
ఎల్లో ఎమ్మెల్యే.. ఎన్ని దందాలో..
♦ కాల్‌మనీ ముఠాతో సన్నిహిత సంబంధాలు ♦ వాళ్ల కార్యాలయాల్లో సెటిల్మెంట్లు ♦ బినామీలతో ఇసుక దందాలు ♦ బిల్డర్ల నుంచి రూ. కోటికి పైగా వసూళ్లు ♦ డిగ్రీ కోసం వేరే వ్యక్తితో పరీక్షలు రాయించినట్లు ఆరోపణలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాల్‌మనీ వ్యాపారం పేరుతో విజయవాడ నగరంలో మహిళల చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న వారితో అధికారపార్టీకి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నవారికి డబ్బులు ఇవ్వడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అన్ని రకాలుగా అండగా ఉన్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనను వేధిస్తున్న కాల్‌మనీ వ్యాపారులకు ఎమ్మెల్యే అండ ఉందని ఓ మహిళ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. పటమటలోని కాల్‌మనీ ఆఫీస్‌కు ఎమ్మెల్యే తరచూ వెళుతుంటారని, కొన్ని కేసులను ఆయన అక్కడే సెటిల్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోరంకిలోని తన గెస్ట్‌హౌస్‌లో కూడా ఎమ్మెల్యే పలు సెటిల్మెంట్లు చేస్తుంటారని తెలిసిన వారు అంటుంటారు. సెలబ్రిటీలు వచ్చినపుడు ఎమ్మెల్యే తన అనుచరులు, సహచరులతో కలసి వారికి విందు వినోదాలు ఏర్పాటు చేస్తుంటారని తెలుస్తోంది. బినామీలతో ఇసుక దందా పెనమలూరు మండలం పెద్దపులిపాక ఇసుక క్వారీల్లో ఎమ్మెల్యే పలువురు బినామీలను ఏర్పాటుచేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అలా ఇసుక దందాలో వచ్చిన డబ్బునే ఆయన కాల్‌మనీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టేవాడని వినిపిస్తోంది. గతంలో డీఆర్డీఏ అధికారులు నాలుగున్నర లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను క్వారీ నుంచి తీసేందుకు అనుమతి ఇచ్చారు. ఇందులో డీఆర్డీఏ సిబ్బంది నామమాత్రం. వారు కేవలం కంప్యూటర్ ఆపరేటర్లుగా మాత్రమే పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రసాద్ అనుచరులే నేరుగా టిప్పర్లకు పొక్లెయిన్ల ద్వారా ఇసుకను నింపేవారు. ప్రభుత్వం అప్పట్లో క్యూబిక్ మీటరు ఇసుకను టిప్పర్లోకి నింపినందుకు రూ.50 చొప్పున ఇచ్చేందుకు అనుమతిచ్చింది. ఈ విధంగా లెక్క వేస్తే నాలుగున్నర లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను టిప్పర్లలో నింపడం ద్వారా ఎమ్మెల్యే బినామీల అకౌంట్లకు కోట్లాది రూపాయాలు జమ అయ్యాయి. ఇప్పటికీ ఈ క్వారీలో డీఆర్డీఏ వారు, ఎమ్మెల్యే అనుచరులే ఇసుకను లారీలు, టిప్పర్లలోకి నింపుతున్నారు. ఇలా 2.25 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుకను తోడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఇసుక తరలిస్తే బినామీల అకౌంట్లలోకి మరిన్ని కోట్లు జమ అవుతాయి. బిల్డర్ల నుంచి కోటికిపైగా.. యనమలకుదురులో పంచాయతీ అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించిన బిల్డర్ల వద్ద నుంచి ఎమ్మెల్యే దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అదంతా దుష్ర్పచారం అని ఖండిస్తూనే తాను ఏమి చేసినా గ్రామాభివృద్ధి కోసమేనని, అభివృద్ధి ఫండ్ కింద వారు ఇచ్చిన డబ్బులు తీసుకుంటే తప్పేమిటని ఎమ్మెల్యే పంచాయతీ పెద్దలను ప్రశ్నిస్తుంటారట. డిగ్రీ పరీక్షలోనూ నకిలీ... గత ఏడాది దూరవిద్య ద్వారా డిగ్రీ పొందేందుకు మరో వ్యక్తితో ఎమ్మెల్యే పరీక్ష రాయించిన విషయం మీడియాలో వచ్చింది. రెండు రోజుల పాటు అజ్ఞాత వ్యక్తి పరీక్ష రాసిన తరువాత మూడోరోజు మీడియా వారు గుర్తించి పట్టుకున్నారు. అయితే కాలేజీ వారు ఆ వ్యక్తిని కాలేజీ నుంచి దాటించారు. కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్థానంలో కూర్చొని పరీక్ష రాసిన వ్యక్తి ఫొటోలతో కథనాలు వచ్చాయి. ఎమ్మెల్యే పెనమలూరు జిల్లా పరిషత్ హైస్కూలులో 10వ తరగతి చదివారు. కర్ణాటకలో పాలిటెక్నిక్ మధ్యలో వదిలేశారని సమాచారం. ఆస్తులు-వ్యాపారాలు పోరంకిలో రెండు సినిమా హాళ్లు ఇబ్రహీంపట్నం దొనబండలో క్రషర్ పోరంకిలో 2 ఎకరాల విలువైన భూమి (రూ.20 కోట్లు) పోరంకిలో అతిథి గృహం, ఇల్లు ఉన్నాయి. వైష్ణవి కన్స్ట్రక్షన్స్ (బిల్డర్). ప్రస్తుతం పోరంకిలో అపార్టుమెంట్ నిర్మాణం చేస్తున్నాడు. గతంలో ప్రైవేటు బస్సులు, లారీలు ఉండేవి. రాజకీయ నేపథ్యం 2001లో పోరంకి సర్పంచిగా పోటీచేసి పరాజయం 2006లో పోరంకి వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచిగా పని చేశారు. ఇప్పుడు పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో పదవులు యలమంచిలి నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. టీడీపీ పోరంకి గ్రామ అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ పెనమలూరు మండల అధ్యక్షుడిగా పనిచేశారు. -
'కాల్‌మనీపై అసెంబ్లీలో చర్చిస్తాం'
-
పోలీసుల అదుపులో 10మంది వడ్డీ వ్యాపారులు
విజయనగరం: రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంలో బుధవారం వేకువ జామున విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. దుబ్బాడ, య్యన్నపేట, విజయనగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా వారి నుంచి పలు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘కాల్‌మనీ’పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
-
'స్నేహితుడే కానీ.. అతనితో సంబంధం లేదు'
-
టీడీపీ నేతల్ని రక్షించుకోవడానికే సవాంగ్‌ను సెలవుపై పంపారు
♦ చంద్రబాబుపై అంబటి రాంబాబు ధ్వజం ♦ నిష్పాక్షికంగా ఉండే అధికారుల్ని మార్చడం బాబుకు కొత్తకాదు ♦ బాబు, కేసీఆర్ మధ్య సయోధ్య కుదరడం వెనుక కథేంటో చెప్పాలి? సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం సెలవుపై పంపడం దారుణమని, అధికారపార్టీ వారిని రక్షించుకునేందుకే ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంవద్ద మీడియాతో మాట్లాడుతూ సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో సవాంగ్‌ను సెలవుమీద పంపడంపై ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. సవాంగ్‌కు ముక్కుసూటిగా వెళ్లే అధికారిగా పేరుందని నేరస్తులు ఎవరైనా శిక్షపడేలా చేస్తారనే నమ్మకం ప్రజలకుందని, ఆయనుంటే ఇబ్బందులెదురవుతాయనే.. సెలవుపై పంపినట్లుగా ఉందన్నారు. తమమాట వినకుండా నిష్పాక్షికంగా వ్యవహరించే పోలీసు ఉన్నతాధికారుల్ని మార్చడం బాబుకు కొత్తేం కాదని, అమరావతి ప్రాంతంలో పొలాలు కాలిపోయినపుడు గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలను కూడా బదిలీ చేశారన్నారు. పాలనపై బాబుకు పట్టు లేదు చంద్రబాబుకు పాలనపై పూర్తిగా పట్టు సడలిందని, కేవలం తమ పార్టీవారిని కుంభకోణాల నుంచి కాపాడుకునే దుస్థితిలో ప్రస్తుతమున్నారని అంబటి అన్నారు. కాల్‌మనీలో పీకల్లోతున టీడీపీ నేతలంతా మునిగిపోతే ఆత్మరక్షణలో పడిపోయిన బాబు ఇతరపక్షాలపైనా బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో తమ పార్టీ యువజన నేత కావటి మనోహర్‌నాయుడు ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించడమే అందుకు పరాకాష్టన్నారు. మనోహర్‌నాయుడు ఇంట్లో వారికేమీ దొరకలేదన్నారు. ప్రభుత్వాలు ఇవాళుండి, రేపు పోతాయని, ఎప్పటికీ సర్వీసులో ఉండే పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. నిన్నటి దాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదించుకున్న ఉభయరాష్ట్రాల సీఎంలు కేసీఆర్, బాబుల మధ్య హఠాత్తుగా ఆ సయోధ్య ఎలా కుదిరిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో తిరుగులేని సాక్ష్యాధారాలున్నాయని నిన్నటివరకూ కేసీఆర్ చెప్పారని, ఇప్పుడవి ఉలవచారులో మునిగిపోయాయా? అని ప్రశ్నించారు. -
'స్నేహితుడే కానీ.. అతనితో సంబంధం లేదు'
ఏలూరు (మెట్రో): విజయవాడ కాల్‌మనీ కేసులో ఏ-6 నిందితునిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ తన మిత్రుడేనని పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు స్పష్టం చేశారు. ఏలూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..కాల్‌మనీ సిండికేట్‌లో తాను రూ.కోటి పెట్టుబడి పెట్టినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ఆ కేసులో ఏ-6గా ఉన్న శ్రీకాంత్ తనకు స్నేహితుడే కానీ ఇటీవల కాలంలో అతనితో ఆర్థిక సంబంధాలు నెరపలేదని చెప్పారు. మూడు రోజుల క్రితం వరకు శ్రీకాంత్ వాడిన ఇన్నోవా వాహనం తనదేనని బాపిరాజు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ కారు విక్రయించాలని రాజమండ్రిలో ఉన్న స్నేహితునికి ఇస్తే అతను విజయవాడలో ఉన్న శ్రీకాంత్‌కు ఇచ్చాడని, ఈ విషయం తనకు మూడు రోజుల కిందటే తెలిసిందని చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఆ కేసులో నిందితునిగా ఉన్నాడని తెలియడంతో వెంటనే ఆ కారును తెచ్చుకున్నానని చెప్పారు. శ్రీకాంత్ మంగళవారం ఉదయం వరకూ నల్లజర్లలోని మీ ఇంటికి సమీపంలోనే ఆశ్రయం పొందారన్న వాదనలు వినిపిస్తున్నాయిగా అని ఓ విలేకరి ప్రస్తావించగా, ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సరైన సమాధానం చెప్పకుండానే మీరు నిరూపిస్తారా అంటూ ఎదురు ప్రశ్నించారు. -
'ప్రభుత్వ కనుసన్నల్లోనే కాల్ మనీ వ్యాపారం'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో అన్నీ అరాచకాలే జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ...కాల్ మనీ వ్యవహారం ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు. కేసు సీరియస్‌గా ఉన్న సమయంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను సెలవుపై పంపడం ఎంతవరకు సబబని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మధు డిమాండ్ చేశారు. -
అందుకే సవాంగ్‌ను సెలవుపై పంపారు
-
గౌతమ్ సవాంగ్‌పై కాల్‌మనీ దెబ్బ
కాల్ మనీ గ్యాంగ్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్‌పై వేటు పడింది. కాల్ మనీ వ్యవహారంలో అధికార పార్టీ నేతల పేర్లు ఎవరివీ బయటకు రాకూడదంటూ గత రెండు రోజులుగా గౌతమ్ సవాంగ్‌పై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలతో పాటు కీలక నేత నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన అంగీకరించలేదని తెలిసింది. దాంతో సెలవుల్లో వెళ్లాల్సిందిగా పై స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో విధిలేని పరిస్థితుల్లో పక్షం రోజుల పాటు సెలవుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. కాల్ మనీ వ్యవహారం దర్యాప్తు నిర్వహించినప్పుడు అత్యంత భయానక విస్మయకర విషయాలెన్నో ఒక్కొక్కటికీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో బాధితులు కూడా ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ కీలక సమయంలో కాల్ మనీ గ్యాంగ్ పెద్దల తరఫున అధికార పార్టీ కీలక నేతలు జోక్యం చేసుకుని గౌతమ్సవాంగ్పై ఒత్తిళ్లు పెంచారు. విజయవాడలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎస్పీల సమీక్షా సమావేశం జరుగుతున్న సందర్భంగానే గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్లడమన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్ మనీ వ్యవహారంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, అధికారులెవరూ తలొగ్గరాదంటూ చెప్పుకొచ్చారు. అలా మాట్లాడి 24 గంటలు కూడా తిరక్కముందే కాల్ మనీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి కేసు దర్యాప్తు ప్రారంభించిన విజయవాడ కమిషనర్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. ఎస్పీల కాన్ఫరెన్స్ జరుగుతున్న సందర్భంగానే పైస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గౌతమ్ సవాంగ్ 15 రోజుల సెలవు కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. డీజీపీ రాముడు దాన్ని వెంటనే ఆమోదించడమే కాకుండా గౌతమ్ సవాంగ్ స్థానంలో ఏడీజీ ఆపరేషన్స్ విభాగం అధిపతి సురేంద్రబాబుకు బాధ్యతలు అప్పగించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. -
గౌతమ్ సవాంగ్‌పై కాల్‌మనీ దెబ్బ
-
వడ్డీ పేరిట పీల్చి పిప్పి చేసేస్తున్నారు..
♦ కమిషనరేట్‌కు క్యూ కడుతున్న కాల్‌మనీ బాధితులు ♦ బొండా ఉమా సహా పలువురిపై ఆరోపణలు సాక్షి ప్రతినిధి, విజయవాడ/విజయవాడ సిటీ: ఆడపిల్ల పెళ్లి.. కొడుకు చదువు.. వ్యాపార విస్తరణ.. ఇళ్ల కొనుగోలు.. ఇలా ఒకటేమిటి అనేక అవసరాల కోసం కాల్‌మనీ కేటుగాళ్ల బారిన పడి వీధుల పాలైన అనేక మంది విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు క్యూ కడుతున్నారు. కాల్‌మనీ బాధిత మహిళలు గుండెలవి సేలా రోదిస్తున్న తీరు కమిషనరేట్‌లో పోలీసులను సైతం కదిలించివేస్తోంది. ఐదు రోజుల కిందట వెలుగులోకి వచ్చిన ఈ సెక్స్ రాకెట్లో ప్రాథమికంగా ఏడుగురు నిందితులను గుర్తించి కేసు నమో దు చేయగా, వీరిలో యలమంచిలి శ్రీరామమూర్తి అలి యాస్ రాము, దూడల రాజేష్‌ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టిసారించినట్టు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. సీపీ ప్రకటనతో బాధితుల్లో ఆశలు చిగురించాయి. తమను ఈ ఊబి నుంచి బయటపడేయాలంటూ ప్రాధేయపడుతున్నారు.ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కాల్‌మనీ వ్యాపారులకు అండగా ఉంటున్నాడంటూ బాధితులు ఆరోపించారు. బెజవాడలో లెక్కలేనన్ని కాల్‌మనీ సెంటర్లు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే బొండా సపోర్టు... రామకృష్ణాపురానికి చెందిన మానేపల్లి రణధీర్ వద్ద వ్యాపార అవసరం కోసం రూ. 2.95 లక్షలు అప్పుగా తీసుకున్నాను. తొలుత నెలవారీ వడ్డీ అని చెప్పి కొద్ది రోజుల తర్వాత కాల్‌మనీ అన్నాడు. నెలకు రూ.90 వేల చొప్పున వడ్డీ కింద రూ. 5.60 లక్షలు చెల్లించాను. అసలు కింద రూ. 3 లక్షలు కట్టాను. ఐనా అప్పు తీరలేదంటూ ముందు తీసుకున్న చెక్కులతో మన్నెం కనకవల్లి అనే మహిళ ద్వారా కోర్టులో కేసులు వేయిస్తున్నాడు. పైగా పొలం కూడా అతని ఆధీనంలోనే ఉంది. ముందు పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామన్నారు. తర్వాత సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పోలీసులపై ఒత్తిడి తేవడంతో వారు పట్టించుకోవడం లేదు. - డి.కిరణ్, దుర్గాపురం కాల్‌మనీతో సంబంధం లేదు: బోడె కంకిపాడు: కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న బోడె ప్రసాద్ సోమవారం సాయంత్రం కృష్ణాజిల్లా కంకిపాడులోని పసుపుకోటలో విలేకరులతో మాట్లాడారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసులో ఐదో నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనని చెప్పారు. అతనితో కలసి విదేశీ పర్యటనలకు వెళ్లినంత మాత్రాన ఈ వ్యవహారంతో సంబంధం అంటగట్టడం తగదన్నారు. విదేశీ పర్యటనలో తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలను సైతం మార్ఫింగ్ చేసి సంబంధాలు న్నట్లుగా ప్రయత్నించడం శోచనీయమన్నారు. తాళిబొట్టూ గుంజుకున్నారు... కుటుంబ అవసరాల కోసం సమీప ప్రాంతానికి చెందిన అక్కా చెల్లెళ్లు దుర్గ, లక్ష్మి, విజయ, ఝాన్సీ నుంచి రూ. లక్ష తీసుకున్నాను. కొన్నాళ్లు వడ్డీ కట్టాను. ఆర్థిక ఇబ్బందులతో తర్వాత కట్టలేకపోయాను. దీంతో రూ.5 లక్షలు విలువ చేసే ఇంటిని గుంజుకున్నారు. ఇంకా చాలవంటూ మెడలోని పుస్తెల తాడు సహా నగలు గుంజుకొని ప్రైవేటు ఫైనాన్స్‌లో తనఖా పెట్టుకున్నారు. అయినా నా వద్ద తీసుకున్న ఖాళీ నోట్లు ఇవ్వడం లేదు. అదేమంటే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డ్రైవర్ పేరిట బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయండి. - కాజ సులోచన, రాజీవ్‌నగర్ డబ్బులు కట్టినా స్థలం గుంజుకుంది కష్టపడి దాచుకున్న డబ్బులతో మంటాడలో సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా. డబ్బు లు చాలకపోవడంతో కానూరుకు చెందిన చివులూరు విజయలక్ష్మి వద్ద రూ.4 లక్షలు అప్పు చేశాం. సక్రమంగానే వడ్డీ కట్టేవాళ్లం. స్టీరింగ్ ఆటోలను నగరంలోకి అనుమతించకపోవడంతో కొన్నాళ్లు ఇబ్బందులు పడ్డాం. దీంతో కొన్న ఇంటి స్థలాన్ని కూతురు పేరిట బెదిరించి రాయించుకుంది విజయలక్ష్మి. తీసుకున్న చెక్కులు, నోట్లు కూడా ఇవ్వలేదు. అదేమంటే మా ప్రభుత్వమే అధికారంలో ఉందికాబట్టి ఎవరూ ఏం చేయలేరని బెదిరిస్తోంది. - పట్టపు సత్యనారాయణ, వరలక్ష్మి, కానూరు, తులసీనగర్. -
రెండు వర్గాలుగా బెజవాడ టీడీపీ
-
కాల్‌మనీ కలర్ ఎల్లో!
-
ఇల్లు ఖాళీ చేయమన్నందుకు చితకబాదారు
-
'కాల్ మనీపై చంద్రబాబు సమాధానం చెప్పాలి'
-
'కాల్ మనీ' నిందితుల అరెస్ట్
విజయవాడ: ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాల్ మనీ-సెక్స్ రాకెట్' కేసులో నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అదుపులోనికి తీసుకున్న నిందితులను మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్ మనీ కేసులో ఏ4 నిందితుడు ఎలక్ట్రిసిటీ డీఈ సత్యానందంపై సస్పెన్షన్ వేటు పడింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎండీ హెచ్.జె.దొర జారీ చేశారు. -
'కాల్ మనీపై చంద్రబాబు సమాధానం చెప్పాలి'
విజయవాడ: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాల్ మనీ-సెక్స్ రాకెట్' వ్యవహారంపై సీబీసీఐడీచే విచారణ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పద్మావతి కోరారు. కృష్ణా జిల్లా విజయవాడలో మీడియాతో ఆదివారం ఆమె మాట్లాడారు. టీడీపీ నేతలే సూత్రధారులుగా ఉండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఉప్పులేటి కల్పన అన్నారు. కాల్ మనీ ముసుగులో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఏపీ అసెంబ్లీలో నిలదీస్తామని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, పద్మావతి పేర్కొన్నారు. అధికార పార్టీ అండదండలతో ఐదేళ్లుగా చీకటి దందా నడుపుతున్న కాల్‌మనీ ముఠాకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిపై కేసు నమోదైంది. యలమంచిలి రామచంద్రమూర్తి అలియాస్ రాముతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, నగర ప్రముఖులు కలిసి ఈ భాగోతాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించిన విషయం అందరికీ విదితమే. -
నాకు ఎలాంటి సంబంధం లేదు
-
కాల్ మనీ కేసులో మరో ఆరుగురు అరెస్ట్
-
కాల్‌మనీ కేసులో కీలక మలుపు
-
కాల్‌మనీ కేసులో కళ్లు చెదిరే నిజాలు
విజయవాడ: అధికార పార్టీ అండదండలతో ఐదేళ్లుగా చీకటి దందా నడుపుతున్న కాల్‌మనీ ముఠాలో ఏడుగురిపై కేసు నమోదైంది. యలమంచిలి రామచంద్రమూర్తి అలియాస్ రాముతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, నగర ప్రముఖులు కలిసి ఈ భాగోతాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా.. అవసరాల్లో ఉన్న వారికి వడ్డీకి డబ్బులిస్తూ లోబరుచుకుని చీకటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్.. గుట్టుగా సాగుతున్న ముఠా చీకటి వ్యాపారంపై నిఘా పెట్టింది. ఈ కేసులో యలమంచిలి రాము, భవానీ శంకర్, చెన్నుపాటి నివాస్, విద్యుత్ శాఖ డీఈ సత్యానంద్, టీడీపీ నేతలు వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్‌పై కేసులు నమోదయ్యాయి. డబ్బు ముసుగులో మహిళల మానప్రాణాలతో ఆడుకుంటున్న వీరందరిపై.... ఐపీసీ సెక్షన్ 420, 376, 354a(1)(2), 384, 506, రెడ్‌విత్ 34, 120(బీ) కింద విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని అధికార పార్టీ నేతల అనుచరులుగా గుర్తించారు. మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా కీలక సూత్రధారి అయిన వెనిగళ్ల శ్రీకాంత్‌కు విజయవాడ సమీప ఎమ్మెల్యేతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెలువెత్తాయి. కాల్‌మనీ ముఠా డబ్బుతో సదరు ఎమ్మెల్యేను రెండు సార్లు విదేశాలకు పంపినట్టు పోలీసులు తెలిపారు. తాజాగా సదరు ఎమ్మెల్యేతోనే శ్రీకాంత్ ఉన్నట్టు సమాచారం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలకు కాల్‌మనీ ముఠా సన్మానాలు చేసినట్టు తెలిసింది. దొంగనోట్ల ముఠాతో, కాల్‌మనీ ముఠాకు సంబంధమున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకోకుండా స్థానిక సీఐ పోస్టింగ్ ఇప్పించుకున్నారని సమాచారం. గతంలో కాల్‌మనీ కార్యాలయాన్ని ఖాళీ చేయమని చెప్పిన ఇంటి యాజమానిపై దాడికి పాల్పడ్డారు. అయినా దీనిపై సదరు పోలీస్ అధికారి కేసు నమోదు నమోదు చేయలేదు. కాల్‌మనీ ముఠాకు సాయం చేస్తున్న పోలీస్ అధికారిపై పోలీస్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే నిందితుల్ని వదిలేయాలంటూ ఒత్తిళ్లు వచ్చినట్టు తెలిసింది. ఫైనాన్స్ వ్యాపారంలో ముసుగులో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న శ్రీరామ్మూర్తితో పాటు..... మరికొందర్నీ వదలాలంటూ కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తీసుకొచ్చారని సమాచారం. ఈ దందాలో అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు....పలువురు టీడీపీ నేతలకు భాగస్వామ్యం ఉందని తెలిసింది. అయితే ఎమ్మెల్యే పేరు ఎఫ్ఐఆర్లో లేకపోవడం అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమని సమాచారం. ముఠా అంతర్గత గుట్టును బయటకు లాగేందుకు అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉండగా, కాల్‌మనీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భర్తను టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్బంధించారంటూ యలమంచిలి రాము భార్య హల్చల్ చేసింది. తన భర్తను వదిలేయాంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో సెర్చ్ వారెంట్ పిటిషన్ దాఖలు చేసింది. రామును అరెస్ట్ చేయలేదని, ఎక్కడున్నాడో తమకు తెలియదంటూ టాస్క్‌ఫోర్స్ వివరణ ఇచ్చింది.