'కాల్ మనీపై చంద్రబాబు సమాధానం చెప్పాలి'
విజయవాడ: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాల్ మనీ-సెక్స్ రాకెట్' వ్యవహారంపై సీబీసీఐడీచే విచారణ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పద్మావతి కోరారు. కృష్ణా జిల్లా విజయవాడలో మీడియాతో ఆదివారం ఆమె మాట్లాడారు. టీడీపీ నేతలే సూత్రధారులుగా ఉండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఉప్పులేటి కల్పన అన్నారు. కాల్ మనీ ముసుగులో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఏపీ అసెంబ్లీలో నిలదీస్తామని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, పద్మావతి పేర్కొన్నారు.
అధికార పార్టీ అండదండలతో ఐదేళ్లుగా చీకటి దందా నడుపుతున్న కాల్‌మనీ ముఠాకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిపై కేసు నమోదైంది. యలమంచిలి రామచంద్రమూర్తి అలియాస్ రాముతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, నగర ప్రముఖులు కలిసి ఈ భాగోతాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించిన విషయం అందరికీ విదితమే.