uppuleti Kalpana
-
ఉప్పులేటి కల్పనకు ఘోర పరాభవం
-
ఉప్పులేటి కల్పనకు అచ్చిరాని టీడీపీ..
సాక్షి, విజయవాడ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో పార్టీ ఫిరాయించిన వారిని, వారి వారసులను కూడా ప్రజలు తిరస్కరించారు. ఐదేళ్లు వైఎస్సార్ సీపీలోనే ఉండి, తరువాత ఎన్నికల బరిలోకి దిగిన వారికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అచ్చిరాని టీడీపీ ఉప్పులేటి కల్పన 2009లో పామర్రు నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే రెండేళ్లు గడిచిన తరువాత టీడీపీలోకి వెళ్లిపోయారు. తిరిగి 2019లో టీడీపీ తరఫున తిరిగి పామర్రు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాగా రాజకీయాల్లోకి నూతనంగా అడుగుపెట్టిన కైలే అనిల్ కుమార్ చేతిలో 30,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీడీపీ కల్పనకు అచ్చిరాలేదని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయ పడుతున్నాయి. ఖాతూన్‌కు తప్పని ఓటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రాజకీయ జీవితం ముగిసిపోతున్న దశలో 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. అయితే ఏడాది దాటిన తరువాత ఆయన టీడీపీలోకి చేరారు. ఎన్నికల్లో ఆయనకు బదులుగా ఆయన కుమార్తె ఖాతూన్‌కు చంద్రబాబు నాయుడు సీటు కేటాయించారు. నియోజకవర్గ ప్రజలకు ఖాతూన్ కంటే జలీల్ఖాన్ను చూసి ఓటేయాలని కోరారు. అయితే ఖాతూన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో 7,671 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవంగా ఖాతూన్ ఓడిపోయిందనే దాని కంటే జలీల్‌ఖానే పరాజయం చెందారని నియోజకవర్గంలోనూ, టీడీపీలోనూ వినిపిస్తోంది. జనసేనలోకి వెళ్లి దెబ్బతిన్నారు... వైఎస్సార్ సీపీ నాయకుడు భాస్కరరావు భార్య రేవతి నూజివీడు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. ఆయన మేకా ప్రతాప్ అప్పారావుకు కుడిభజంగా ఉండేవారు. అటువంటి భాస్కరరావు వైఎస్సార్ సీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు కేవలం 5,464 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలో జనసేన తుడిచిపెట్టుకుపోయింది. భాస్కరరావు స్వయంకృతాపరాధమే ఆయన కుటుంబ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడిందని నియోజకవర్గంలో వినపడుతోంది. -
సోషల్ మీడియా ఆర్గనైజర్‌పై పోలీసుల వేధింపులు
పామర్రు: సోషల్ మీడియా ఆర్గనైజర్ నాగబాబుపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. అమరావతిలో జరుగుతున్న అక్రమాలు, అధికార పార్టీ నేతల అవినీతిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం వారికి కోపం తెప్పించాయి. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోలీసులపై ఒత్తిడి తేవడంతో నాగబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. నాగబాబును అదుపులోకి తీసుకోవడంతో సోషల్ మీడియా ఆర్గనైజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు కేసులు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, కె. పార్ధసారథి, పామర్రు ఇన్చార్జి కైలా అనీల్ కుమార్‌లు మండిపడ్డారు. పామర్రు పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ తెలిపారు. అక్రమాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు సోషల్ మీడియా గొంతు నొక్కేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే కల్పనకు చేదు అనుభవం..
ఉయ్యూరు (పెనమలూరు) : కలాసమాలపల్లిలో చోటు చేసుకున్న ఘర్షణ ఉయ్యూరులో ఉద్రిక్తతకు దారి తీసింది. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై మహిళలతో పాటు ఆ గ్రామస్తులు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. బాధితులకు న్యాయం కోసం పేదల పక్షాన వైఎస్సార్ సీపీ పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. దీంతో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివరాలిలా ఉన్నాయి. తోట్లవల్లూరు మండలంలోని కలాసమాలపల్లిలో సొసైటీ భూముల వివాదంపై దళితుల్లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు రెండు వర్గాలుగా చీలి బుధవారం తెల్లవారుజామున కర్రలతో దాడులకు తెగబడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన క్షతగాత్రులు ఒకేచోట ఉండటంతో పెద్ద ఎత్తున జనం చేరుకుని వాదోపవాదాలకు దిగారు. దీంతో కొంత మందిని పోలీసులు విజయవాడ తరలించారు. ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కల్పనకు చేదు అనుభవం.. బాధితులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు ఆ గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మీకు న్యాయం చేస్తానంటూ ఎమ్మెల్యే మహిళలతో అంటుండగానే నీ న్యాయం మాకక్కర్లేదు.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. అంటూ రెండు చేతులూ జోడించి నిరసన తెలిపారు. కులం పేరుతో దూషించిన టీడీపీ నాయకుడు మురళీని వెనకేసుకొచ్చి తమను అణగతొక్కాలని చూశారంటూ ఎమ్మెల్యేను నిందించారు. న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించానని ఎమ్మెల్యే చెప్పి వెళ్లిపోయారు. రోడ్డుపై రాస్తారోకో.. తోట్లవల్లూరు మండలం టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు నెక్కలపూడి మురళి ఆస్పత్రిలో ఓవరాక్షన్ దళితుల ఆగ్రహావేశానికి కారణమైంది. తమను కించపరిచేలా మురళి వ్యాఖ్యలు చేశాడంటూ దళితులు ఆందోళనకు ఉపక్రమించారు. ఎమ్మెల్యే కల్పనను, టీడీపీ శ్రేణులను నిలదీసి మురళిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. ఆస్పత్రి ఎదురుగా రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. దళితులకు అండగా వైఎస్సార్ సీపీ నేత అనీల్‌కుమార్ ఆందోళనలో పాల్గొన్నారు. ఈస్ట్ ఏసీపీ విజయభాస్కర్, సీఐ సత్యానందం ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అనీల్‌కుమార్ మాట్లాడుతూ పల్లె వాతావరణాన్ని టీడీపీ పూర్తిగా కలుషితం చేస్తోందని ఆరోపించారు. కులాల మధ్య ఎమ్మెల్యే కల్పన చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బాధ్యతను ఎమ్మెల్యే విస్మరించడంతో కలాసమాలపల్లిలో మాలలు భౌతిక దాడులకు దిగారన్నారు. కేసులు లేకుండా అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలనేదే తన ఉద్దేశ్యమన్నారు. ఆందోళనలో వైఎస్సార్ సీపీ తోట్లవల్లూరు, పామర్రు మండలాల అధ్యక్షులు జొన్నల మోహన్‌రెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, నాయకులు మారపాక మహేష్, యార్లగడ్డ శివయ్య, మర్రెడి శేషిరెడ్డి, ఇంతియాజ్ బాషా పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్-ఉప్పులేటి కల్పన
-
బినామీ పేరుతో ఎమ్మెల్యే సబ్సిడీ వాహనాలు
-
ఉప్పులేటి కల్పనా.. మజాకానా !
సాక్షి, అమరావతి బ్యూరో : పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పలు పథకాలను అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు చేజిక్కించుకుని లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కేంద్రప్రభుత్వ నిధులతో మంజూరైన రాయితీ వాహనాన్ని బినామీ పేరుతో తీసుకుని దర్జాగా వాడుకుంటున్న వైనం వెలుగుచూసింది. నిబంధనలకు పాతర.. కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా సబ్బిడీతో వాహనాలను అందజేస్తోంది. మొవ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతికిరణ్ ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా సుమారు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పేరుతో ఏపీ 16టీపీ 0661 నంబర్‌తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు.అయితే రిజిస్ట్రేషన్ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్ కింద చూపితే ఎల్లో ప్లేట్ ఉండాలి. కానీ కారు యజమానిగా చూపి వైట్ ప్లేట్ వేయించుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పామర్రు ఎమ్మెల్యే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇన్నోవా వాహనంపై పామర్రు ఎమ్మెల్యేగా స్టిక్కర్ వేయించుకుని తిరుగుతున్నారు. దగాని క్రాంతికిరణ్ ఎమ్మెల్యే బినామీ మాత్రమేనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అతని పేరుతో రాయితీతో కూడిన భూమి కొనుగోలు పథకం, వ్యక్తిగత రుణాలు మంజూరు చేయించి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెబ్సైట్లో కారు రిజిష్ట్రేషన్ వివరాలు. ఇందులోనే కారు యజమాని దగాని క్రాంతి కిరణ్ పేర్కొన్న దృశ్యం సొమ్మొకరిది సోకు మరొకరిది కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలలో పేదవర్గాలకు ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద అందించే వాహనాలకు నిధులు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పధకం ద్వారా మంజూరైన వాహనానికి 35% సబ్సిడీ ఉంటుంది. 2% మాత్రం లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగిలిన 63% రుణ సౌకర్యం కల్పిస్తారు. వాహనాన్ని ట్రావెల్స్‌లో తిప్పి రుణం చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఈ వాహనాలను తామే ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేలా వాహనంపై థ్యాంక్యూ సీఎం సార్ పేరుతో స్టిక్కర్లు వేసి పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గతంలో వాహనంపై సీఎం స్టిక్కర్ తొలగిస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం వివాదమైంది. గతంలోనూ నెల్లూరు జిల్లాలో టీడీపీ మాజీ మంత్రి తన డ్రైవర్ పేరుతో ఇన్నోవా వాహనం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. పేదవర్గాల పేరుతో రాయితీ పథకాలను టీడీపీ నేతలు బొక్కేయడంపై దళితులు మండిపడుతున్నారు. పేదలకు పంపిణీ చేశాం కృష్ణా జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి వాహనాలు పంపిణీచేశాం. నిబంధనల మేరకే వాహనాలను మంజూరు చేశాం. లబ్ధిదారుల్లో ప్రజాప్రతినిధుల బినామీలు ఉన్నారన్న విషయం మాకు తెలియదు. – సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, కృష్ణాజిల్లా -
ఉప్పులేటి కల్పనపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు
-
అధికారం నిలుపుకొనేందుకే ఫిరాయింపులు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి, దాడిశెట్టి, విశ్వేశ్వరరెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకునేం దుకే టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై శుక్రవారం ఎమ్మె ల్యేలు దాడిశెట్టి రాజా, విశ్వేశ్వరరెడ్డిలతో కలిసి అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కల్పనపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పిన్నెళ్లి విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ(వైఎస్సార్సీపీ) గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభ పెట్టి, అనధికారంగా చేర్చుకోవడం దారుణమన్నారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు అదే పద్ధతిలో ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశా లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం అసెంబ్లీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా) ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. తెలంగాణలో అనైతికమన్న పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు సిగ్గువిడిచి ఏపీలో ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. -
ఉప్పులేటి కల్పనపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తక్షణమే పార్టీ ఫిరాయించిన ఉప్పులేటి కల్పనపై అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యదర్శిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు పార్టీ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. -
ఎమ్మెల్యే కల్పనకు షాక్
-
ఎమ్మెల్యే కల్పనకు షాక్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు స్థానిక ప్రజాప్రతినిధులు షాకిచ్చారు. ఆమె తనతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన లెక్కలన్నీ తప్పని నియోజకవర్గ నేతలు తేల్చేశారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండల కన్వీనర్లు స్పష్టం చేశారు. తాము ఉప్పులేటి కల్పన వెంట వెళ్లడం లేదని మొవ్వ, పామర్రు జడ్పీటీసీ సభ్యులు విజయశాంతి, పద్మావతి తెలిపారు. కాగా.. చంద్రబాబు నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకుడు పార్థసారథి మండిపడ్డారు. ఉప్పులేట కల్పన పార్టీ మారినా ఆమె వెంట ఎవరూ వెళ్లలేదని చెప్పారు. ఆమె చెప్పిన లెక్కలన్నీ అబద్ధాలేనని తెలిపారు. నిన్నటివరకు చంద్రబాబును తూర్పారబట్టిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు పచ్చ కండువా కప్పగానే చిలుక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. సర్వేలన్నీ తనకే అనుకూలమని చెబుతున్న చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికలకు సిద్ధపడతారా అని సవాలు చేశారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకడం లేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా అనైతిక చర్యలు మానుకుని, ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని పార్థసారథి హితవు పలికారు. -
‘ఉప్పులేటి’ మాదిరి అందరూ టీడీపీలో చేరాలి
పామర్రు ఎమ్మెల్యే చేరిక సందర్భంగా సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాదిరిగా మిగిలిన ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరాలని, అప్పుడు పార్టీకి తిరుగుండదని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో కృష్ణా జిల్లా పామర్రు నుంచి వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో కలసి టీడీపీలో చేరారు. -
ప్రలోభాల పర్వం మళ్లీ ప్రారంభం
- నోట్ల రద్దు విషయంలో చంద్రబాబుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత - ప్రభుత్వంలో రోజురోజుకూ పెరుగుతున్న అవినీతి - మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సభలకు పోటెత్తుతున్న జనం - ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార టీడీపీ యత్నం - అందులో భాగంగా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను పార్టీలో చేర్చుకునే యత్నం.. ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని, భర్తకు మంచి పోస్టింగ్ ఇస్తామని హామీ సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదట స్వాగతించడం, తర్వాత తూచ్ అంటూ మాట మార్చడం, తప్పంతా మీదేనంటూ బ్యాంకర్ల మీదకు నెట్టేయడం... ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి పట్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది. రాజధాని నిర్మాణం నుంచి పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల వరకు.. రోజుకొకటిగా బయటపడుతున్న కుంభకోణాలు, మట్టి మొదలు ఇసుక దాకా అధికార పార్టీ నేతలు సాగిస్తున్న దోపిడీ.. వెరసి రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతిపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడ సభలు నిర్వహించినా పోటెత్తుతున్న జనసందోహం. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉలికిపాటు మొదలైంది. జనం దృష్టిని మళ్లించేందుకు సీఎం చంద్రబాబు మళ్లీ ప్రలోభాల పర్వానికి తెర తీశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకోవడంపై మరోసారి దృష్టి పెట్టారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీలోకి ఇటీవల చేరికలు ఊపందుకున్నాయి. వెల్లంపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, కాసు మహేష్‌రెడ్డి ఇటీవల పార్టీలో చేరారు. పార్టీలో చేరడానికి మరికొంత మంది ఉత్సాహం చూపుతున్నారు. పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అధికార పార్టీ నుంచీ చేరికలు ఉంటాయని ఇటీవల సంకేతాలు వెలువడుతున్నాయి. వైఎస్సార్సీపీలోకి కొనసాగుతున్న చేరికలు అధికార పక్షానికి కన్ను కుట్టాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గాలం వేసి తమ వైపు తిప్పుకోవడానికి ప్రలోభాల పర్వానికి అధికార తెలుగుదేశం పార్టీ తెర లేపింది. తాజాగా కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై ప్రలోభాల వల విసిరారు. ఆమె మీద రకరకాల మార్గాల్లో తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు. ఆమె భర్తకు ఆరోపణల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు మంచి పోస్టింగ్‌లో ఇస్తామని హమీ ఇచ్చినట్లు తెలిసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేశ్ రంగంలోకి దిగి.. ఆమెను పార్టీలో తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉప్పులేటి కల్పన బుధవారం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావుతో భేటీ అయ్యారు. బలహీన వర్గాల శాసనసభ్యులే టార్గెట్ బలహీన వర్గాలకు చెందిన శాసనసభ్యులను అధికార టీడీపీ తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. టీడీపీలో చేరితే రూ.20 కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభ పెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వెల్లడించిన విషయం విదితమే. తాజాగా ఉప్పులేటి కల్పనపై కూడా టీడీపీ వల విసురుతోంది. ఆమె గతంలో రెండుసార్లు టీడీపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
పామర్రులో టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహం
పామర్రు: కృష్ణా జిల్లాలోని పామర్రులో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వ్యవసాయ కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. -
ఆ దాడి చేసింది బీజేపీ, టీడీపీకి చెందినవాళ్లే
విజయవాడ: ఆవును దొంగిలించి, చర్మం వొలిచారన్న నెపంతో ముగ్గురు దళితులపై విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. గోసంరక్షకుల ముసుగులో బీజేపీ, టీడీపీకి చెందినవారే దళితులపై దాడి చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. బుధవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా ప్రభుత్వంగానీ, అధికార పార్టీ నేతలుకానీ స్పందించకపోవడం దారుణమన్నారు. (అమలాపురంలో 'ఆవు'వివాదం: ఉద్రిక్తత) 'బీజేపీ, టీడీపీకి చెందినవారు కావాలనే దళితులను హింసించారు. వాళ్ల ఆవులు తప్పిపోయింది అబద్ధమని తెలిసింది. కొన్ని రాష్ట్రాల్లో గోవధపై నిషేధం ఉండొచ్చు. కానీ ఏపీలో లేదు. నిషేధం ఉన్నా, లేకున్నా గోసంరక్షకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దళితులపై దాడులు చేయడం దారుణం. ఇది ముమ్మాటికి బీజేపీ- టీడీపీల కుట్రే. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న గిరిజన దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. డాన్స్ చేయడం కంటే దళిత, గిరిజనులకు బాబు చేసిన మేలు ఏదైనా ఉందా?'అని కల్పన ప్రశ్నించారు. మమ్మల్నెవరూ ఏమీ చెయ్యలేరనే దైర్యంతో టీడీపీవారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, దాడి జరిగి రెండు రోజులైనా పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడం ప్రభుత్వవైఫల్యమేనని కల్పన వ్యాఖ్యానించారు.పలు ప్రజా సంఘాలు, వేదికలు బాధితులను పరామర్శించాయి. కానీ ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క టీడీపీ నాయకుడు కూడా దళితులను పట్టించుకోకపోడం దారుణమని అన్నారు. -
ఆ దాడి చేసింది బీజేపీ, టీడీపీకి చెందినవాళ్లే
-
'టీడీపీ పాలన త్వరలోనే అంతమవుతుంది'
► అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన జగ్గయ్యపేట అర్బన్: రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే విధంగా ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్సీపీకి చెందిన పామర్రు ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన చెప్పారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో గురువారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను గృహంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, కనీసం ప్రతిపక్షాలు.. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. గతంలో విదేశీయులను దేశం నుంచి తరిమికొట్టాలని ఉద్యమాలు చేస్తే.. ప్రస్తుతం చంద్రబాబు వారితో బేరసారాలు చేస్తూ స్వదేశీ నిపుణులు, కంపెనీలను అవమానపరుస్తున్నారని విమర్శించారు. ఇంతవరకు గ్యాస్ పైపులైన్లే వేయకపోయినప్పటికీ వైజాగ్‌లో చైనా కంపెనీతో గ్యాస్ ఆధారిత ఎరువుల ఫ్యాక్టరీకి ఒప్పందం చేసుకున్నామని మాయమాటలు చెపుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు రాజధాని కోసం అద్దెకు తీసుకున్న భవంతులకు ఎంత అద్దె చెల్లిస్తున్నదీ తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబుపై సీబీఐ కేసులు లేవా? చంద్రబాబుపై హెరిటేజ్ తదితర అనేక రకాలైన సీబీఐ కేసులు ఉండగా.. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుతున్నారు గాని, ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఉదయభాను ప్రశ్నించారు. ఈడీ ఆస్తుల ఎటాచ్మెంట్ గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేస్తున్నారని, దీనిపై ఎవరూ బెంబేలెత్తాల్సిన అవసరం లేదని, అవి కేవలం క్రయవిక్రయాలు చేసుకోకుండా చేయటమేనన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే తనపై ఉన్న కేసుల గురించి విచారణకు సిద్ధం కావాలని చాలెంజ్ చేశారు. అనంతరం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఉప్పులేటి కల్పనను ఘనంగా సత్కరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్(చిన్నా), జిల్లా అధికార ప్రతినిధి మదార్‌సాహెబ్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు జగదీష్, ప్రభాకర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బూడిద నరసింహారావు, పట్టణ అధ్యక్షులు పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు నంబూరి రవి, కౌన్సిలర్లు ఫిరోజ్‌ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టీడీపీ అంటేనే పుకార్ల ఫ్యాక్టరీ!
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అంటేనే పచ్చి అబద్ధాలను వండి వార్చే పుకార్ల ఫ్యాక్టరీ అని, అందుకే ఏపీ సర్కారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబు.. తమ పార్టీపై అభాండాలు వేయకుండా ఉంటారని తాము ఆశించడం లేదని కొడాలి నాని, ఉప్పులేటి కల్పన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగం.. ఈ మూడింటిలోనూ ఏపీని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు చేతగానితనానికి పతిపక్ష నేత బాధ్యత వహించాలా? అని వారు నిలదీశారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ప్రతికా ప్రకటన ఇది... -
'ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు'
ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి ఈ అంశంపై మాట్లాడారు. వాళ్లు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిదని.. రోజా అసెంబ్లీకి వచ్చి, ఎమ్మెల్యేగా తన బాధ్యతలు నిర్వర్తిస్తారని కల్పన అన్నారు. ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ సస్పెన్షన్లకు జడిసి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటామని అనుకుంటారేమో, జడిసేది లేదని, పోరాడుతూనే ఉంటామని తెలిపారు. రోజా కూడా పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్తారని, అంతా కలిసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా చూస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కుట్రపై న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయడమేనని గిడ్డి ఈశ్వరి అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై చాలా చాలా సంతోషంగా ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దారుణంగా రోజాను కేవలం అధికార పార్టీని నిలదీసినందుకు కక్షపూరితంగా సస్పెండ్ చేశారు. ఈ కుట్రపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాయని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం తన హామీలు నెరవేర్చకపోగా, మహిళా ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేసి సస్పెండ్ చేసింది.. చివరకు ధర్మమే గెలిచింది. టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతున్న విషయాలు సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఉన్నాయని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ నుంచి ఏ మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించినా, అటునుంచి మంత్రులకు బదులు అనిత లేచి మాట్లాడతారని తెలిపారు. రోజా విషయంలో మేం గర్వపడుతున్నాం. ఆమెలాంటి ధైర్యవంతురాలు మా పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని పార్టీకి చెందిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ పేర్కొన్నారు. -
'ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందో, ఎప్పుడు ఇచ్చిందో'
హైదరాబాద్: మహిళా సాధికారత అంశంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ అంశంపై వాడివేడిగా జరిగిన చర్చలో ప్రతిపక్ష వైస్ఆర్ సీపీ నేతలు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. మహిళలకు కుట్టుమిషన్లు ఇచ్చామని టీడీపీ ప్రభుత్వం చెబుతోందని... అయితే ఎవరికి ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో ఎవరికీ తెలియదని ఉప్పులేటి కల్పన ఎద్దేవా దేశారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. మొదట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. తర్వాత రూ. 10 వేలు అని, చివరకు కేవలం రూ.3 వేలకు మాఫీ పరిమితం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్వాకంతో డ్వాక్రా గ్రూపులు నిర్వీర్యం అయ్యాయని, ఏ గ్రేడ్ సంఘాలు.. బి గ్రేడ్ కు పడిపోయాయన్న విషయాన్ని సభలో గుర్తుచేశారు. రుణాలు చెల్లించకపోవడంతో కొత్తరుణాలు ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లో ఎంతమంది మహిళలకు రుణాలు ఇచ్చారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీలపై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని, చెప్పిన దాంట్లోనూ కోతలు విధించడమే ఏపీ ప్రభుత్వం పని అంటూ ఉప్పులేటి కల్పన విమర్శించారు. -
అధ్యక్షా.. శుభాకాంక్షలన్నా చెప్పారా!
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంటులో మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. మంగళవారం జీరోఅవర్‌లో కల్పన మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభలో ఈవేళ(మంగళవారం) మహిళలకే ప్రాధాన్యత ఇస్తే బాగుండేదని అంటూ.. స్పీకర్‌గా ఉన్న తమరు కూడా ఇంతవరకూ శుభాకాంక్షలన్నా చెప్పలేదు అధ్యక్షా అని గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళా సాధికార సంస్థ చిరునామా కూడా ఎక్కడుందో తెలియట్లేదని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కాల్‌మనీ పేరిట మహిళలను సెక్స్‌రాకెట్‌లోకి దించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నీళ్లివ్వండి మహాప్రభో: కళావతి గిరిజన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గ ప్రజలు తాగునీటికోసం పడుతున్న ఇక్కట్లను పరిష్కరించాల్సిందిగా ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వి.కళావతి శాసనసభలో డిమాండ్ చేశారు. జీరోఅవర్‌లో ఆమె తన నియోజకవర్గ ప్రజల ఇక్కట్లను సభ దృష్టికి తీసుకొచ్చారు. తాగునీటికోసం జిల్లా కలెక్టర్‌ను ఎప్పుడు నిధులడిగినా లేవంటున్నారని, కనీసం ట్యాంకర్ల ద్వారానైనా సరఫరా చేయించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని ఏరియా ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య దుస్థితిని వైద్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శానిటేషన్ కాంట్రాక్టర్లకు నిధులిచ్చి ఆస్పత్రులను శుభ్రంగా ఉంచాలని కోరారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే జి.సత్యనారాయణ తన నియోజకవర్గంలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీ అంశాన్ని ప్రస్తావించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పాత పెన్షన్ విధానంలోని సమస్యలను ప్రస్తావించారు. గతంలో నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థులకు తక్షణమే ఉద్యోగాలివ్వాలని కోరారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, విశాఖపట్నం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు కూడా పలు సమస్యలను ప్రస్తావించారు. -
'తక్షణమే డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి'
హైదరాబాద్ : డ్వాక్రా మహిళల రుణాల మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ... రుణాలు అందక డ్వాక్రా మహిళలు అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో డ్వాక్రా మహిళలను వేధిస్తున్నారన్నారు. తక్షణమే డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. -
రావెల.. తప్పుకో
* ఎక్కడేం జరిగినా వైఎస్ జగనే బాధ్యుడా? * వైఎస్సార్సీపీ ఎల్పీ ఉపనేత ఉప్పులేటి కల్పన మండిపాటు సాక్షి, హైదరాబాద్: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో అరెస్టయిన కుమారుడు సుశీల్‌ను వెనకేసుకొస్తున్న ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు తక్షణమే పదవికి రాజీనామా చేయాలని, లేదా ఏపీ సీఎం ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కుమారుడు తప్పు చేస్తే దాని వెనుక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హస్తం ఉందని మంత్రి ఆరోపించడమేమిటన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాని వెనుక జగన్ హస్తం ఉందనడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి కుమారుడు మహిళను వేధించి కేసులో ఇరుక్కున్నా జగన్‌కే ఆపాదిస్తారా? కాపు సభలో గొడవ జరిగితే దాని వెనుక కూడా జగన్ హస్తమే ఉందా? కాకి అరిచినా దానికీ జగనే బాధ్యుడా? ఇదంతా ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ఉందని ధ్వజమెత్తారు. బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు కారు రేసింగ్ చేస్తూ ఓ విద్యార్థి మరణానికి కారకుడైతే దాని వెనుకా జగనే ఉన్నాడని నిందించారన్నారు. బాబు పాలనలో మహిళలపై అత్యాచారాలు, వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఆయనతోపాటు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళలంటే గౌరవం లేదన్నారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దం టుందా అని చంద్రబాబు తనకు మహిళలపై ఉన్న చిన్న చూపును చాటుకున్నారని చెప్పారు. మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలి ఎమ్మార్వో వనజాక్షిపై దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే, రిషితేశ్వరి మరణానికి కారకుడైన అగ్రకుల ప్రిన్సిపాల్ బాబూరావును చంద్రబాబు వెనకేసుకొచ్చారని కల్పన మండిపడ్డారు. ఏలూరులో ఇందుమతి అనే యువతిని దహనం చేశారని, ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు. మహిళలను వేధించిన వారిపట్ల పోలీసులు మెతకవైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. అధికారపక్షం చెప్పినట్లు వ్యవహరిస్తూ నిందితులను పట్టించుకోవడం లేదన్నారు. మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అమ్మాయిలు వెంటపడితే కడుపు చేయాలంటూ పచ్చిగా మాట్లాడిన సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరు గర్హనీయమని ఉప్పులేటి ధ్వజమెత్తారు. మహిళలంతా ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. -
'వాపుని బలుపుగా చూపించుకుంటున్నారు'
పామర్రు : ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత మంది ఒత్తిడి తెచ్చినా తాను మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదని ఆ పార్టీ నాయకురాలు, కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. మంగళవారం కృష్ణాజిల్లా పామర్రులోని పార్టీ కార్యాలయంలో ఉప్పులేటి కల్పన విలేకరులతో మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర పార్టీలోకి వెళ్లినందు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా దుకాణం సర్దేసిందని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీ ఆంధ్రలో బలంగా ఉన్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలని గత ఎన్నికల తర్వాత నుంచి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి... బ్లాక్మెయిల్ చేసి... బెదిరించి టీడీపీలోకి తీసుకెళ్లి వాపుని బలుపుగా చూపించుకుంటున్నారని విమర్శించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ప్రాధాన్యమిచ్చి శాసనసభా ప్రజాపద్దుల సమితి (పీఏసీ) చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించినా తన గౌరవాన్ని కాపాడుకోలేకపోయారని అన్నారు. కడప జిల్లా టీడీపీలో ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయాయన్నారు. దీంతో టీడీపీ పతనం అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. తమ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలే వెళ్లారు కాని... పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదని తెలిపారు. భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి అప్పట్లో పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉండగా విజయమ్మతోపాటు స్థానిక మహిళానాయకులతో కలిసి కాంగ్రెస్, టీడీపీలపై పోరు చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూమా పార్టీ మారడంతో శోభానాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఇప్పటికైనా భూమా నాగిరెడ్డి సిగ్గుతెచ్చుకోవాలన్నారు. తమ సొంత లాభాల కోసం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పార్టీని విడిచిపెట్టి వెళ్లారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చంద్రబాబు పార్టీ మారినవారికి ఇచ్చిన హామీలను ఏవిధంగా నెరవేరుస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు రెండేళ్ల నుంచి నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేయని చంద్రబాబు ఓడిపోయినవారికి మాత్రం నామినేటెడ్ పదవులిచ్చి అందలం ఎక్కిస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తు లేని పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీలోకి వెళ్లి సదరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ భవిష్యత్తు లేకుండా చేసుకున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడలేనివారే పార్టీ మారతారని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ మొబీన్, పామర్రు ఉప సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బాబు మది నిండా మురికి ఆలోచనలే
♦ సీఎంను మానసిక వైద్యుడికి చూపించండి ♦ వైఎస్సార్సీపీ ఎల్పీ ఉపనేత ఉప్పులేటి కల్పన సూచన సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ వర్గాలను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే ఆయన మానసిక స్థితి బాగా లేనట్లు అనుమానంగా ఉందని వైఎస్సార్సీపీ శాసన సభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన అన్నారు. చంద్రబాబును మానసిక వైద్యుడికి చూపించి చికిత్స చేయించాలని ఆయన కుటుంబ సభ్యులకు సూచించారు. ఆమె ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మురికివాడల్లో ఉండే వారికి మురికి ఆలోచలే వస్తాయని సీఎం వ్యాఖ్యానించడం సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా ఉందన్నారు. వాస్తవానికి చంద్రబాబు మది నిండా మురికి ఆలోచనలే ఉన్నాయని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ టికెట్లపై గెలుపొందిన ఎమ్మెల్యేలను చేర్చుకుంటే టీడీపీ బలపడుతుందనుకోవడం వట్టి అవివేకమని ఉప్పులేటి కల్పన అన్నారు. ప్రలోభ పెట్టి, పదవుల ఆశ చూపి ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీ పార్టీలోకి చేర్చుకోవచ్చు గానీ ఆ నియోజకవర్గ ప్రజల ఓట్లు కూడా వేయించుకోగలరా? అని ఆమె నిలదీశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేస్తున్నారంటూ అనుకూల మీడియా సహాయంతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయినా ఇప్పటివరకు ఒక్కరు కూడా వెళ్లలేదన్నారు. జగన్ ఉదయించే సూర్యుడైతే చంద్రబాబు అస్తమిస్తున్న సూర్యుడని పేర్కొన్నారు. రెండెకరాల నుంచి రూ.రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారు: ఆర్కే ‘‘సీఎం చంద్రబాబు పుట్టుకలోనే అవినీతి ఉంది. అక్రమ నివాసంలో గడుపుతూ.. అక్రమాలతో సావాసం చేసే చంద్రబాబుకు రాజకీయ విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తన అవినీతి బాగోతాలను, పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆయన నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు.’’ అని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అవినీతికి బార్లా తలుపులు తెరిచారని మండిపడ్డారు. ఆర్కే ఆదివారం మీడియాతో మాట్లాడారు. -
వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడు: ఉప్పులేటి
విజయవాడ : తాను టీడీపీలో చేరతానంటు వస్తున్న వార్తలు అవాస్తవమని ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆమె తెలిపారు. 'చంద్రబాబు అస్తమించే సూర్యుడు.. జగన్ ఉదయించే సూర్యుడు. భవిష్యత్ కావాలనుకునేవారు వైఎస్ఆర్ సీపీని వీడరు' అని ఉప్పులేటి కల్పన అన్నారు. చివరి వరకూ జగన్‌తోనే: ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లాలో తాము ఎవరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. వైఎస్ జగన్ వల్లే తాము గెలిచామని, చివర వరకూ జగన్‌తోనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఖాళీ అయిన విషయాన్ని దృష్టి మల్లించడానికే టీడీపీ నేతలు మాపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నాపై దుష్ప్రచారం: ఎమ్మెల్యే ముత్యాలనాయుడు తెలుగుదేశం పార్టీలో చేరతానంటు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ పార్టీ మారేంత నీతిమాలిన రాజకీయాలు చేయనని ఆయన తెలిపారు. చివరివరకూ వైఎస్ జగన్‌తోనే ఉంటానని ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. -
'ఎస్సీగా ఎందుకు పుట్టాలనుకోలేదో బాబు చెప్పాలి'
హైదరాబాద్: ఎస్సీగా ఎందుకు పుట్టాలనుకోలేదో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దళితులను కించపరిచే మాటలు మాట్లాడతారా అని ప్రశ్నించారు. 'కుల రాజకీయాలు చేస్తున్నారని ఈ మధ్యకాలంలో చాలాసార్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు అయితే కుల రాజకీయాలు చేసింది, కులాల గురించి ప్రస్తావించింది మీరు కాదా' అంటూ ఆమె మండిపడ్డారు. గతంలో దళితులు, బీసీల మధ్య తగాదాలు పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. కులాల గురించి ఇలా మాట్లాడటం ఆయన కుసంస్కారానికి నిదర్శమని పేర్కొన్నారు. ఎస్సీలను అవమానించేలా సీఎం మాట్లాడటం హేయం అన్నారు. 'పేద, ధనిక అని రెండు కులాలున్నాయని బాబు భ్రమపడుతున్నారు. కానీ, నిజానికి రెండే కులాలున్నాయి.. ఒకటి మంచి.. రెండు చెడు అని చెప్పారు. ఎస్సీల ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని అవమానంగా భావిస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. గెలుపే లక్ష్యంగా హామీలే మార్గంగా ఎన్నికల వేళ వ్యవహరించిన బాబు వాటిని తీర్చలేక పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని కల్పన ఆరోపించారు. బీసీ నాయకుడికి చోటిస్తే జిల్లాలో టీడీపీ ఓడిపోయిందట... దళితుడికి సీటిస్తే బలం తగ్గిపోయిందట.. బాబుకు కింద నుంచి పైదాకా కుల వివక్ష ఉంది. అసలు ఆయన ఏం అనుకుంటున్నారో ప్రజలకు ఏమాత్రం అర్థం కావడం లేద' అని కల్పన అన్నారు. -
దళిత విద్యార్థులకు మనుగడే లేదా?
రోహిత్ ఆత్మహత్యపై ఉప్పులేటి కల్పన ఆవేదన సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సృ్మతీ ఇరానీ, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ వైస్ చాన్స్‌లర్ శర్మపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వర్సిటీలో జరిగిన చిన్నపాటి ఘటనకు రాజకీయ రంగు పులిమి సైంటిస్ట్ కావాలని కలలు గన్న ఓ దళిత విద్యార్థిని బలిగొన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దళిత విద్యార్థులకు సమాజంలో మనుగడే లేదా? అని ప్రశ్నించారు. -
'దళిత విద్యార్థులనే సస్పెండ్ చేయడం దారుణం'
హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ...దళిత విద్యార్థులనే కారణంతో హెచ్‌సీయూలో సోషల్ బాయ్‌కాట్ చేయడం దారుణమన్నారు. యూనివర్సిటీ కులాల కంపు రావణ కాష్టంగా మారిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని....మిగిలిన నలుగురి విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. ఈ ఘటనపై ఉన్నత స్ధాయి కమిటీని నియమించి నిజాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఆ అంశంపై ఎందుకు మాట్లాడరు
-
అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ సీపీ పాలాభిషేకం
టీడీపీ నేతలు అంబేద్కర్ ను, రాజ్యాంగాన్ని అవమానపరిచారని.. అందువల్ల శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఉప్పులేటి కల్పన పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయనున్నట్లు ఆమె తెలిపారు. అసెంబ్లీకి వెళ్లే ముందుగా.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు.. ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. అంబేద్కర్, రాజ్యాంగంపై చర్చకు అసెంబ్లీ సమావేశాలను మరో అయిదు రోజుల పాటు పొడిగించాలని ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. -
'కాల్‌మనీ ముఠాతో బాబుకు సంబంధాలు'
హైదరాబాద్: బెజవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్ ముఠాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మట్లాడుతూ.. బడా బాబులను వదిలేసి చిన్నచిన్న వ్యాపారులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని ఉప్పులేటి కల్పన విమర్శించారు. కాగా, గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీప కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో గందరగోళం నెలకొనడంతో పది నిమిషాల పాటు అసెంబ్లీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
'కాల్‌మనీ ముఠాతో బాబుకు సంబంధాలు'
-
'కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది'
హైదరాబాద్: కాల్ మనీ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ...కాల్ మనీ కేసును చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కేసులో బడా బాబులను వదిలేసి చిన్న చిన్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారని కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 25 రోజుల నుండి నెల రోజులు పాటు జరపాలని...ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆమె హెచ్చరించారు. -
'కాల్ మనీపై చంద్రబాబు సమాధానం చెప్పాలి'
-
'కాల్ మనీపై చంద్రబాబు సమాధానం చెప్పాలి'
విజయవాడ: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాల్ మనీ-సెక్స్ రాకెట్' వ్యవహారంపై సీబీసీఐడీచే విచారణ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పద్మావతి కోరారు. కృష్ణా జిల్లా విజయవాడలో మీడియాతో ఆదివారం ఆమె మాట్లాడారు. టీడీపీ నేతలే సూత్రధారులుగా ఉండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఉప్పులేటి కల్పన అన్నారు. కాల్ మనీ ముసుగులో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఏపీ అసెంబ్లీలో నిలదీస్తామని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, పద్మావతి పేర్కొన్నారు. అధికార పార్టీ అండదండలతో ఐదేళ్లుగా చీకటి దందా నడుపుతున్న కాల్‌మనీ ముఠాకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిపై కేసు నమోదైంది. యలమంచిలి రామచంద్రమూర్తి అలియాస్ రాముతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, నగర ప్రముఖులు కలిసి ఈ భాగోతాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించిన విషయం అందరికీ విదితమే. -
కొడాలి నానిని అక్రమంగా అరెస్ట్ చేశారు
విజయవాడ : గుడివాడ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడాలి నానిని అరెస్ట్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆదివారం పామర్రులో స్పందించారు. కొడాలి నానిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించడానికి ఓ పద్దతి ఉంటుందన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా... బలవంతంగా పార్టీ కార్యాలయాన్ని ఎలా ఖాళీ చేయిస్తారని ఆమె ప్రశ్నించారు. తక్షణమే ఎమ్మెల్యే కొడాలి నానిని విడుదల చేయాలని ఉప్పలేటి కల్పన పోలీసులను డిమాండ్ చేశారు. -
'కులగజ్జిలో నాగార్జున వర్సిటీ'
-
'కులగజ్జిలో నాగార్జున వర్సిటీ'
హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయం కులగజ్జితో కుళ్లిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఎస్సీ కులానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. బాబురావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బుధవారం ఆమె అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో సమయంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక నారాయణ కాలేజీలో దాదాపు పదిహేనుమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇవి చదువులకు నిలయాలా చావులకు కర్మాగారాల అని ఆమె నిలదీశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పుతో మరో టీచర్‌ను కొడతారా అని నిలదీశారు. సహచర టీచర్ మీద కనీస గౌరవం లేకుండా చెప్పుతో కొట్టారంటే ఆమె సంస్కారమేమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రిషితేశ్వరిది ఆత్మహత్యకాదని ఇది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. -
భూమాపై కేసులు అక్రమం
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పామర్రు : కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డినిఅధికార పార్టీ నాయకులు స్థానిక అధికారులతో కలిసి కక్ష సాధింపుతో అరెస్టు చేయించడం నీచ రాజకీయానికి నిదర్శనమని పామర్రు ఎమ్మెల్యే, అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన దుయ్యబట్టారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల నాటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆయనపై అక్రమ కేసులు, వేధింపులు చేస్తూనే ఉన్నదన్నారు. భూమా ఆరోగ్యం బాగుండలేకపోయినా 12 గంటలపాటు పోలీ స్స్టేషన్లో ఉంచడం కక్ష సాధింపు చర్య కాదా అని ప్రశ్నిం చారు. నేను ఎమ్మెల్యేని తనను గౌరవించాలని అన్న పదాన్ని అధికార పార్టీ నాయకులు తప్ప డు దారి పట్టించి భూమాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే తన ఆరోగ్యం బాగోలేదని, వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే దా నిని కూడా టీడీపీ నాయకుల సలహాతో ఒప్పుకోకపోవడం అన్యాయన్నారు. భూమానాగిరెడ్డికి ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి, టీడీపీ నాయకులు బాధ్య త వహించాల్సి వస్తుందని కల్పన హెచ్చరించారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ మొబీన్, జిల్లా పార్టీ నాయకులు బొప్పన స్వర్ణలత, పామర్రు ఉప సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కాల్వ శ్రీనివాసులుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్ : ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వశ్రీనివాసులపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన బుధవారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈనెల 18న పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా వైఎస్ జగన్..శాసనసభకు చదివి వినిపించిన డాక్యుమెంట్లను పనికి రానివని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వశ్రీనివాసులు ఆరోపించారు. అయితే కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు అసత్యమైనవంటూ ఉప్పులేటి కల్పన సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. -
'టీడీపీ నేతల ప్రకటనలు విడ్డూరం'
విజయవాడ:కృష్ణా-గుంటూరు జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎవ్వరికీ మద్దతివ్వడం లేదని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ మద్దతిస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటనలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోరాటపటిమ ఉన్న నీతిమంతులనే ఎన్నుకోవాలని ఉప్పులేటి కల్పన ఈ సందర్భంగా తెలిపారు. -
వర్ల రామయ్యకు మతి భ్రమించింది: కల్పన
నామినేటెడ్ పదవి రాలేదనే నిరాశతో టీడీపీ నేత వర్ల రామయ్యకు మతి భ్రమించిందని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. ప్రచారంలో తన భర్త పాల్గొనలేదని, తన కుటుంబంపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలు ఛీత్కరించినా వేదికలు ఎక్కి మాట్లాడటం వర్ల రామయ్యకు సరికాదని ఆమె విమర్శించారు. పోలీసు ఉద్యోగం నుంచి ఆయన ఎందుకు వీఆర్ఎస్ తీసుకున్నారో సమాధానం చెప్పాలని కల్పన డిమాండ్ చేశారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోడానికే ఆయనిలా చేయలేదా అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను కబ్జా చేసి లక్షల రూపాయలు దండుకున్న ఘనత రామయ్యదని ఆమె అన్నారు. దళిత ఎమ్మెల్యేనైన తనను ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి వేధిస్తున్నారని వాపోయారు. వర్ల రామయ్యపై తాను మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని, ఆయన అవినీతి బాగోతంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని హెచ్చరించారు. -
భూముల కోసం రైతులను భయపెడుతున్నారు:కల్పన
విజయవాడ: ఏపీ రాజధాని ప్రతిపాధిత ప్రాంతంలో భూసేకరణ కోసం రైతులను భయపెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. ఆమె ఈ రోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలన అరాచకం సృష్టిస్తోందన్నారు. అధికార పార్టీ చెప్పిందే చట్టం, శాసనం అన్నవిధంగా పాలన సాగుతోందని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడినా, అవి చట్టపరమైనట్లుగా మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ వచ్చిన ఏడు నెలల కాలంలో 22 మంది వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలను హత్య చేశారని ఆమె చెప్పారు. తుళ్లూరు పంటపొలాల ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. రైతులను భయపెట్టడం కోసమే టీడీపీ నేతలు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కల్పన డిమాండ్ చేశారు. -
ఎన్టీఆర్ పార్టీలో ఉండి అలా మాట్లాడతారా?
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు ఖండించారు. కళాకారుడు స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీలో ఉన్న నాయకులు కళాకారులను అవమానించేలా వ్యవహరించడం శోచనీయమని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరకమైన ప్రవర్తన మానుకోవాలని హితవు పలికారు. ఆత్మస్తుతి, పరనింద తరహాలో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభ్యసమాజం తలదించుకునేలా అధికార ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని మరో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరు కళాకారులే కదా అని గుర్తు చేశారు. షరతులతో రుణమాఫీ చేస్తామని ఎన్నికలకుముందు ఎందుకు చెప్పలేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. -
విప్‌గా చింతమనేనిని తప్పించండి
చింతమనేనివి దురహంకారపూరిత వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణ చెప్పాలి సిగ్గులేకుండా పింఛన్లు తీసుకోండి అంటూ ప్రజలను అంటారా?: వైసీపీ నేత కల్పన హైదరాబాద్: ‘సిగ్గులేకుండా పింఛన్లు తీసుకోండి’ అంటూ ప్రజలనుద్దేశించి దురహంకారపూరిత వ్యాఖ్యలు చేసి న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తప్పించడంతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ఏలూరు మండ లం మాదేపల్లి గ్రామంలో సోమవారం జరిగిన జన్మభూమి సభలో మాట్లాడిన ప్రభాకర్.. ‘‘సిగ్గులేకుండా పింఛన్లు తీసుకోండి. ఆ తరువాత చంద్రబాబు ఫొటోకు నమస్కారం పెట్టి వెళ్లం డి’’ అని పింఛన్‌దారులకు చెప్పడం అభ్యంతరకరమని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలను చులకన చేసి మాట్లాడినందుకు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. మంగళవారం ఆమె వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక అధికార టీడీపీ విధానమా అన్నది స్పష్టం చేయాలని కోరారు. వ్యక్తిగతమైనవైతే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలా కాని పక్షంలో ఈ దురహం కార మే టీడీపీ విధానమని అనుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇతర పార్టీల వారు సర్పంచ్‌లుగా ఉన్న గ్రామా ల్లో కూడా అక్కడి టీడీపీ నేతల జోక్యంతోనే జాబితాలు రూపొందిస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి రుణా లు పొందడానికి సిద్ధంగా ఉన్న 2013 సంవత్సరం లబ్ధిదారుల జాబితాను పునఃపరిశీలన పేరుతో ప్రభుత్వం ఆపేయడం దారుణమన్నా రు. పింఛన్లతో సహా అన్ని రకాల సంక్షేమ పథకాల్లో అర్హులైన వారిని పక్కనబెట్టి పచ్చచొక్కాలు తొడుకున్న వారికే ఇస్తున్నారని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ వారికే పథకాలు ఇస్తామని చెప్పడం గర్హనీయమన్నారు. -
'చింతమనేని ప్రభాకర్‌ను సస్పెండ్ చేయండి'
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. పెన్షన్‌దారులను ఉద్దేశించి ప్రభాకర్ అసభ్యంగా మాట్లాడారని కల్పన ఆరోపించారు. ప్రభాకర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక టీడీపీ విధానమా? అని ప్రశ్నించారు. ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కల్పన డిమాండ్ చేశారు. -
''చింతమనేనిపై చర్యలు తీసుకోవాలి''
-
అధికారపార్టీ ఆగడాలకు అంతం లేదా?
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పామర్రు : అధికార పార్టీ నేతల అరాచకాలు, ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయని పామర్రు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ డెప్యూటీ ప్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ కొమరవోలు గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో తాను పాల్గొన్నప్పటికీ తనకు, గ్రామ సర్పంచి పొట్లూరి కృష్ణకుమారికి కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు స్థానిక టీడీపీ నేతల వత్తిడితో పశువైద్యశాలను ప్రారంభించడం తమను అవమానించడమేనని చెప్పారు. దీనికి టీడీ పీ నేత వర్ల రామయ్య, పొట్లూరి కృష్ణబాబు బాధ్యత వహించాలన్నారు. తాము జన్మభూమి కార్యక్రమం ముగించుకుని వెళ్లిన తర్వాత రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలతో కలిసి ప్రారంభించడం వారి కుసంస్కారానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర మంత్రి కూడా స్థానిక ఎమ్మెల్యే లేకుండా ప్రారంభోత్సవం చేయడం విచారకర మని ఎమ్మెల్యే కల్పన విమర్శించారు. -
కొమరవోలు జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తత
మచిలీపట్నం: కృష్ణాజిల్లా పామర్రు మండలం కొమరవోలులో శనివారం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపైకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వచ్చారు. ఆమెతో పాటు వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ కృష్ణకుమారి కూడా వేదికపైకి రావడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆగ్రహించారు. దాంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు. -
టెలి మెడిసిన్ ద్వారా కపిలేశ్వరపురం పీహెచ్సీలో వైద్య సేవలు
కపిలేశ్వరపురం, (పమిడిముక్కల) : కపిలేశ్వరపురం పీహెచ్‌సీని కామినేని హాస్పిటల్స్‌తో అనుసంధానం చేసి టెలి మెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. కపిలేశ్వరపురంలో ఎన్ఆర్హెచ్ఎం నిధులు రూ.68.50 లక్షలతో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రాధాన్యతాక్రమంలో జిల్లా, ఏరియా, పీహెచ్‌సీల్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. రోగులను ఆప్యాయంగా పలకరించాలని , వైద్యులు సమయపాలన పాటించాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారమందిస్తానన్నారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ ఆసుపత్రి చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తానని, అందుకు ఎంపీ, మంత్రి సహకరించాలని కోరారు. ప్రభుత్వాసుపత్రికి ఎక్కువగా వచ్చే పేద వర్గాల వారికి మెరుగైన సేవలందించాలని చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత విషయాన్ని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన శ్రేయో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, చిగులూరి కృష్ణారావు సంఘం తరఫున చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. గ్రామంలోని చెరువులను సొసైటీల నుంచి తప్పించి పంచాయతీలకు అప్పగించాలని సంఘం వారు మంత్రిని కోరగా మత్స్యశాఖ అధికారులతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు. పీహెచ్సీ నిర్మాణానికి కోటి రూపాయల విలువైన స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన దాత తాతినేని వెంకట నరసింహారావును మంత్రి, ఎమ్మెల్యే సత్కరించారు. వైద్యాధికారి బి. లలితను మంత్రి, ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను సంఘ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ఆర్జేడీ షాలినీ దే వి , డీఎంహెచ్ఓ సరసిజాక్షి, క్లస్టర్ అధికారి బాలకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వర్ల రామయ్య , జెడ్పీటీసీ సభ్యుడు ఎం. వెంకటసుబ్బయ్య , ఎంపీపీ ఎం. దుర్గమ్మ , సర్పంచి కె. కోటేశ్వరమ్మ, బిజెపి జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణారావు, మండల వైద్యాధికారి ఎస్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
ఆ వార్తలు అవాస్తవం: కల్పన
విజయవాడ: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవని వైఎస్సార్ సీపీ నాయకురాలు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. కొన్ని పత్రికలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా తనపై వార్తలు ప్రచురించిన పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన హెచ్చరించారు. తాను ఎప్పటికీ వైఎస్సార్ సీపీలో ఉంటానని, వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారథి అన్నారు. వైఎస్సార్ సీపీని ఎవరూ వీడడటం లేదని స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే తన కొడుకుపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. -
‘వర్ల’ వస్తే జన్మభూమిని అడ్డుకుంటాం
రిమ్మనపూడి(పామర్రు) : ప్రజాప్రతినిధి, అధికారులను కాదని టీడీపీ నాయకుడు వర్ల రామయ్యను వేదికపైకి ఆహ్వానిస్తే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాలను అడ్డుకుంటామని స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన హెచ్చరించారు. మండలంలోని రిమ్మనపూడి గ్రామంలో సోమవారం జన్మభూమి కార్య క్రమం జరిగింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంల్రు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వెళ్లిపోయారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వెంటనే స్పందించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జన్మభూమిలో ప్రొటోకాల్ పాటించాలని, సంబంధం లేని వారిని వేదికపైకి ఆహ్వానించవద్దని అధికారులకు సూచించారు. ఎటువంటి సంబంధం లేకపోయినా జన్మభూమి కార్యక్రమంలో వర్ల రామయ్య పాల్గొంటున్నారని విమర్శించారు. ఆయన పాల్గొనడాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తే వారిని బయటకు పంపాలని వర్ల రామయ్య పోలీసులను ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. కొన్నిచోట్ల వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు దిగడం దారుణమన్నారు. సీఎం చద్రబాబు మాటలను కూడా ధిక్కరిస్తున్న వర్ల రామయ్య వల్ల జన్మభూమి కార్యక్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. ఇప్పటికైనా మంత్రులు, టీడీపీ నాయకులు స్పందించి వర్ల రామయ్యను జన్మభూమిలో పాల్గొనకుండా చూడాలని హితవుపలికారు. ఎంపీడీవో రామనాథం టీడీపీ నాయకులతో కలిసి సభాస్థలి నుంచి వెళ్లిపోవడంపై కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు. వృద్ధురాలికి గాయం.. పరామర్శించిన ఎమ్మెల్యే జన్మభూమి సందర్భంగా జరిగిన తోపులాటలో తులశమ్మ అనే వృద్ధురాలిపై పలువురు పడిపోయారు. ఆమె కాలికి గాయమైంది. స్థానిక వైద్యులు చికిత్స చేశారు. తులశమ్మను ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పరామర్శించి పింఛను సొమ్ము రూ.1,000ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బీవీ రాఘవులు, కొలుసు ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
జన్మభూమిని టీడీపీ నీరుగారుస్తోంది: ఉప్పులేటి కల్పన
విజయవాడ: జన్మభూమి జరుగుతున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. జన్మభూమి కార్యక్రమం టీడీపీ ప్రచారం కార్యక్రమంగా సాగుతోందని ఆమె అన్నారు. జన్మభూమి కార్యక్రమ ఉద్దేశాలను టీడీపీ నీరుగారుస్తోందని కల్పన విమర్శించారు. జన్మభూమి ప్రభుత్వ కార్యక్రమంలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను ఆపార్టీ నేతలు ధిక్కరిస్తున్నారని ఉప్పులేటి కల్పన అన్నారు. ఓటమి పాలైన టీడీపీ నేతల చేతుల మీదుగా ఫించన్ల పంపిణీ జరుగుతోందని ఆమె అన్నారు. టీడీపీ నేతలు ప్రజాసమస్యలపై దృష్టిపెట్టకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వర్ల రామయ్యపై చంద్రబాబు ఫైర్
విజయవాడ: టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్యపై ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదివారం ఫైర్ అయ్యారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దంటూ వర్ల రామయ్యకు క్లాస్ పీకారు. నిన్న కనుమూరులో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వర్ల రామయ్యను చంద్రబాబు హెచ్చరించారు. శనివారం కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలోని కనుమూరు గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపై టీడీపీ నేత వర్ల రామయ్య తెగ హడావుడి చేశారు. దీంతో అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన ఏ హోదాతో వేదిక ఎక్కారని రామయ్యను ప్రశ్నించారు. దీంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ రామయ్య హడావుడి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉంది మా ప్రభుత్వం. నేనే కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అది గుర్తుంచుకో అంటూ.. హెచ్చరించారు. అంతేకాదు రేపోమాపో నీవు కూడా మా పార్టీలోకే రావాల్సిందేనన్నారు. రామయ్య మాటలకు ఆగ్రహించిన కల్పన అనవసర వ్యాఖ్యలు చేయొద్దంటూ రామయ్యకు హితవు పలికారు. ఇటీవల పామర్రు శాసన సభకు జరిగిన ఎన్నికల్లో వర్ల రామయ్యపై ఉప్పులేటి కల్పన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
బాబుకు గ్రేడింగ్ ఇస్తే సున్నా
పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పామర్రు : అధికారం చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన 5 హామీల్లో ఇంతవరకు స్పష్టత రాలేదని, ప్రభుత్వం వెంటనే వీటిపై స్పష్టత ఇవ్వాలని పామర్రు ఎమ్మెల్యే ,శాసనసభలో వైఎస్సార్సీపీ డెప్యూటీ ప్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయలలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేయకుండా మార్గదర్శకాల పేరిట కమిటీలను ఏర్పాటు చేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణాలపై సాధికారిత కమిటీలను ఏర్పాటు చేసి సంవత్సరానికి 20శాతం రుణాలను మాత్రమే రద్దు చేస్తామని చెప్పడం వారిని అయోమయానికి గురిచేస్తోందని తెలిపారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు తమ మంత్రులకు గ్రేడింగ్ ఇస్తున్నారని, మరి సీఎంకు గ్రేడింగ్ పెడితే ‘0’ వస్తుందని ప్రజలు వాపోతున్నరన్నారు. జన్మభూమి-మావూరు కార్యక్రమంపై సీఎం తెలిపిన విధి విధానాల ప్రకారం ప్రతీ కార్యక్రమాన్ని ఆయా పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించాలని ఉందన్నారు. కానీ పామర్రు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమంలా లేదన్నారు. ఇది కేవలం టీడీపీ సమావేశంలా ఉందన్నారు. ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించడం లేదన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన చోట ఓడిపోయిన టీడీపీ నాయకులను వేదికలపైకి ఎక్కించి పార్టీల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ పక్కనే ఉన్నా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి వర్ల రామయ్య వేదిక మీదకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘన, ఎమ్మెల్యే హక్కులకు భంగం కల్గించినందుకు, జన్మభూమికి సంబంధం లేని వ్యాఖ్యలు చేసి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరుగనీయనందుకు, ఎమ్మెల్యే, సర్పంచులను అవమానపర్చినందుకు వర్లపై ‘సభా హక్కుల కమిటీ’లో ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమం సక్రమంగా నిర్వహించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరతామని అన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా చేయవద్దని వర్లని హెచ్చరించారు. పామర్రు గ్రామ ఉపసర్పంచి అరేపల్లి శ్రీనివాసరావు, తోట్ల వల్లూరు మండలం ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, కనుమూరు సర్పంచి బొప్పూడి మేరి కమల, కురుమద్దాలి, కొండిపర్రు ఎంపీటీసీలు కొలుసు ఆదిలక్ష్మీ, బీవీ రాఘవులు, నాయకులు ఆర్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వర్లకు మతి భ్రమించింది.... కనుమూరు(పామర్రు) : ప్రజా ప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు టీడీపీకి చెందిన వర్ల రామయ్యను ఏ హోదాలో ఆహ్వానించారని సంబంధిత అధికారిపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘జన్మభూమి-మా వూరు’ కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామ సర్పంచి బొప్పుడి మేరికమలకు అధ్యక్ష స్థానం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధుల విజిట్ పుస్తకంలో వర్ల రామయ్య సంతకం పెట్టడంపై కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ కార్యక్రమం కాదు, వర్ల రామయ్య ప్రజా ప్రతినిధి కాదు అయినా ఆయనతో ఏ హోదాతో సంతకం పెట్టించారని సంబంధిత అధికారిని ప్రశ్నించారు. దీనిపై అధికారులు నీళ్లు నమిలారు. దీంతో వర్ల కల్పనపై విరుచుకు పడారు. వర్ల మాట్లాడుతూ ఇది తమ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమమని, పార్టీ సభ్యుడుగా తాను పాల్గొన్నానని చెప్పారు. ఎమ్మెల్యేనుద్దేశించి అవహేళనగా మాట్లాడారు. దీనిపై ఆగ్రహించిన కల్పన మాట్లాడుతూ ఓటమి చెందడంతో మతి భ్రమించి కుసంస్కారంతో మాట్లాడవద్దని హితవు పలికి సభాప్రాంగణం నుంచి వాకౌట్ చేశారు. -
నేను ఓడిపోయినా... ఇది మా ప్రభుత్వం
విజయవాడ: కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం వేదికగా స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉప్పులేటి కల్పన, టీడీపీ నేత వర్ల రామయ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు .... శనివారం కనుమూరు గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపై టీడీపీ నేత వర్ల రామయ్య తెగ హడావుడి చేస్తున్నారు. దీంతో అక్కడే కల్పన ఏ హోదాతో వేదిక ఎక్కారని రామయ్యను ప్రశ్నించారు. దీంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ రామయ్య హడావుడి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉంది మా ప్రభుత్వం. నేనే కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అది గుర్తుంచుకో అంటూ.. హెచ్చరించారు. అంతేకాదు రేపోమాపో నీవు కూడా మా పార్టీలోకే రావాల్సిందేనని అన్నారు. రామయ్య మాటలకు ఆగ్రహించిన కల్పన అనవసర వ్యాఖ్యలు చేయొద్దంటూ రామయ్యకు హితవు పలికారు. ఇటీవల పామర్రు శాసన సభకు జరిగిన ఎన్నికల్లో వర్ల రామయ్యపై ఉప్పులేటి కల్పన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
'మంత్రిపై నోరుపారేసుకున్న చంద్రబాబు'
హైదరాబాద్: అర్ధంపర్ధంలేని, ఆచరణ సాధ్యంకాని పథకాలు ప్రవేశపెట్టి వివరణ కోరిన మంత్రులపై కూడా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరుపారేసుకుంటున్నారని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శించారు. స్వయంసహాయ బృందాలతో జిల్లాలవారీగా ఏర్పాటు చేసిన వీడియో కన్ఫరెన్స్లో జన్మభూమి కార్యక్రమం గురించి వివరణ కోరగా, స్పష్టత ఇవ్వవలసిన సిఎం వారి మైకులు కట్ చేశారన్నారు. ఎక్కువ మాట్లాడుతున్నారంటూ ఒక దళిత మంత్రిపై చంద్రబాబు నోరుపారేసుకున్నట్లు తెలిసిందన్నారు. చంద్రబాబు వ్యవహార శైలి చేతగాని వారికి కోపం ఎక్కువ అన్నట్లుగా ఉందన్నారు. మంత్రులకే అర్ధంకాని విధంగా ఆయన పథకాలను రూపొందించారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే, ప్రజలపై దాడి చేస్తున్నారన్నారు. మంత్రులు ప్రశ్నిస్తే, ఇప్పుడు వారిపై కూడా దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలలో ప్రతిపక్షం మీద అవాకులు చవాకులు విసిరిన చంద్రబాబు ఇప్పుడు అదే విద్యను స్వయంగా మంత్రుల మీద ప్రదర్శిస్తున్నారన్నారు. చంద్రబాబును మించిన నియంత ప్రపంచంలో మరెవరూ లేరని చెప్పకనే చెప్పినట్లు ఉందన్నారు. చంద్రబాబు అనుసరించే అప్రజాస్వామిక ధోరణులపై ప్రజాస్వామికవాదులు అందరూ తిరగబడాలని కల్పన పిలుపు ఇచ్చారు. ** -
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలిగా ఉప్పులేటి కల్పన
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యురాలి (సీజీసీ)గా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నియమితులయ్యూరు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆమెను ఈ పదవికి ఎంపికచేసి మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే పార్టీ శాసనసభ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆమె కొనసాగుతున్నారు. ఈక్రమంలో కేంద్రపాలక మండలి సభ్యురాలిగా నియమితులయ్యూరు. పార్టీలో ఉప్పులేటి కల్పన క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పామర్రు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేసిన ఆమె ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కల్పనకు ఈ పదవికి రావటంపై జిల్లాలోని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారుు. -
వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులుగా కల్పన, దొర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి(సీజీసీ) సభ్యులుగా ఉప్పులేటి కల్పన, రాజన్నదొరను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులుగా ముక్కు కాశిరెడ్డిని నియమించారు. రాష్ట్ర కార్యదర్శులుగా చాంద్ బాషా, డాక్టర్ నన్నపనేని సుధ, వరుదు కల్యాణి, ఎ.వరప్రసాద్‌రెడ్డి, జి.వెంకట రమణ, వై.మధుసూదన్‌రెడ్డి, నజీర్ అహ్మద్, పేరిరెడ్డి, జీవీ సుధాకర్‌రెడ్డి, గంపా గిరిధర్ నియమితులైనట్టు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. -
మహిళల సమస్యలంటే అంత హేళనా?
టీడీపీపై ధ్వజమెత్తిన రోజా, ఉప్పులేటి కల్పన ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన యనమల నీతులు మాట్లాడుతున్నారు డ్వాక్రా రుణాల మాఫీ గురించి హామీనిచ్చి మాట మారుస్తున్నారు ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మహిళా సమస్యలపై చర్చిద్దామంటే అధికారపక్ష సభ్యులు హేళనగా మాట్లాడుతున్నారని, తమవి సినీ డైలాగులు అంటూ అవమానపరుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం, సభాసంప్రదాయాలు గురించి టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి, అసెంబ్లీలో ఆయన్ను మాట్లాడనీయకుండా గొంతు నొక్కిన అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలపై మాట్లాడటమేంటని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో టీడీపీ హామీనిచ్చిన డ్వాక్రా రుణమాఫీపై మాట్లాడేందుకు చర్చ కోరితే అంగీకరించలేదని, మైక్ ఇవ్వలేదని విమర్శించారు. డ్వాక్రా సభ్యులు వడ్డీల భారంతో రుణమాఫీ జరగకపోవడంవల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నియోజకవర్గాలకు వెళితే నిలదీస్తున్నారని తెలిపారు. సభ నిర్వహణ తీరు సక్రమంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మనం రోడ్ల మీద హోర్డింగ్స్ చూస్తుంటాం. జీరో శాతం వడ్డీ అని రాస్తారు. కానీ కింద చిన్న చుక్క పెడతారు ‘కండిషన్స్ అప్లయ్’ అని. అలాగే వేలుమీద ఓటు సిరా చుక్క పడిన తర్వాత రుణమాఫీకి ‘కండిషన్స్ అప్లయ్’ అంటున్నారు చంద్రబాబు’’ అంటూ ఎద్దేవా చేశారు. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న టీడీపీ అధికారంలోకి వచ్చాక మాట మారుస్తోందని, ప్రజల్ని మభ్య పెడుతుందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు టీవీ చర్చల్లో పాల్గొని జగన్ సమస్యల గురించి మాట్లాడటం లేదని ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సిగ్గు చేటన్నారు. రుణాల కోసం బ్యాంకులకు వెళుతున్న రైతులు, డ్వాక్రా మహిళల్ని దొంగల్లా చూస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ వ్యవహార శైలి వల్ల డ్వాక్రా మహిళలు నానా యాతనలు పడుతున్నారని తెలిపారు. మరో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చించడం లేదని, ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అధికారపార్టీ సభ్యుల వ్యవహారశైలి ఉందన్నారు. ఎస్సీలకు ఇతోధికంగా మేలు చేసిన వైఎస్‌పైనా, జగన్‌పైనా బురద జల్లడమే పనిగా పెట్టుకుని చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడటం హేయమని విమర్శించారు. -
టీడీపీ ఆగడాలపై జగన్‌కు ఫిర్యాదు
గుంటూరు : కృష్ణా జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు పెరిగాయని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. గుంటూరులోని ఇన్స్పెక్షన్ బంగ్లాలో బసచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని శుక్రవారం ఉదయం ఆమె కలసి అధికార పార్టీ నాయకుల ఆగడాలపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షంపై అధికార పార్టీ నేతలు పథకం ప్రకారం దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గడచిన రెండు నెలల్లో టీడీపీ నాయకులు గ్రామాల్లో సామాన్య కార్యకర్తలను సైతం వదలకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు చెప్పారు. జిల్లా పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఈ విషయాలన్నింటిని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. జగన్మోహన్రెడ్డిని కలసిన వారిలో పార్టీ జెడ్పీ ప్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, పెదపారుపుడి జెడ్పీటీసీ సభ్యురాలు మూల్పూరి హరీష తదితరులు ఉన్నారు. -
‘వర్ల’ ఆగడాలు అరికట్టండి
మచిలీపట్నం : టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయని, అరికట్టాలని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మంగళవారం రాత్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన వర్ల రామయ్య.. ఆయనకు ఓటు వేయలేదని ప్రజలను వేధిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు నిర్వహించే సమీక్షా సమావేశాల్లో పాల్గొని పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమె వివరించారు. పోలీసులు సైతం ఆయనకు వత్తాసు పలుకుతున్నారని వివరించారు. ఎమ్మెల్యేనంటూ బెదిరింపులు.. ఎన్నికల్లో ఓటమిపాలైన వర్ల రామయ్య తానే నియోజకవర్గానికి ఎమ్మెల్యేనని, టీడీపీ అధికారంలో ఉందని, అధికారులు తన మాట వినకుంటే మంత్రులతో చెప్పి బదిలీ చేయిస్తానని బెదిరింపులకు దిగుతున్నారని కల్పన తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి టీడీపీకి విరాళాలు ఇవ్వాలని, లేకపోతే ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారని, దీంతో భయపడిన అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసిన వారి జాబితాను రూపొందించుకుని, వారు నియోజకవర్గంలో ఉండకూడదని బాహాటంగానే హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. ఇసుక క్వారీలు తెరిపించండి పామర్రు నియోజకవర్గ పరిధిలోని తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లో ఉన్న తొమ్మిది ఇసుక క్వారీలను తెరిపించాలని కలెక్టర్‌కు ఉప్పులేటి కల్పన వినతిపత్రం అందజేశారు. ఇసుక క్వారీలను తెరిస్తే నియోజకవర్గానికి ఆదాయం వస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తక్కువ ధరకే లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక క్వారీలకు వేలంపాట నిర్వహించేందుకు నూతన పాలసీని తయారు చేస్తోందని చెప్పారు. ఈ నిబంధనల ప్రకారం ఇసుక క్వారీలకు అనుమతులు ఇస్తామని తెలిపారు. వర్ల రామయ్య విషయంపై మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గంలోని అందరు అధికారులకు ఈ అంశంపై తగు సూచనలు, సలహాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మొవ్వ, పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యులు చిమటా విజయశాంతి, మూల్పూరి హరీష, తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లెం వెంకటేశ్వరరెడ్డి, పామర్రు సర్పంచ్ దేవరకొండ రోహిణి, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. -
రుణమాఫీ అంటే రీషెడ్యూలా..?
రైతులను మోసం చేస్తే సహించం ప్రభుత్వమే రైతుల డాక్యుమెంట్లు, నగలు విడిపించాలి ఉప్పులేటి కల్పన పామర్రు : రైతులకు రుణాలు మాఫీ చేస్తారో లేదో చెప్పకుండా రీషెడ్యూలింగ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్రామాలాడుతున్నారని పామర్రు ఎమ్మెల్యే, శాసనసభలో వైఎస్సార్సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే రుణమాఫీపై తొలి సంతకం చేస్తున్నానని రైతులను వంచించారని, నెల గడుస్తున్నా ఈ దిశగా తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై టీడీపీ ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అన్ని హామీలను అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటుంటే ఇక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే అనే అనుమానం ప్రజలకు కలుగుతోందని చెప్పారు. వ్యవసాయ రుణాలు పూర్తి మాఫీ అన్న ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల ఆంక్షలు పెడుతూ రైతులను నిలువునా మోసం చేస్తోందని కల్పన ఆరోపించారు. ముఖ్యమంత్రితో సహా ఆర్థిక, వ్యవసాయశాఖ మంత్రులు రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకడం లేదని, అధిక వడ్డీకి అప్పులు చేయాల్సివస్తోందన్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు రీషెడ్యూల్ దిశగా ఆలోచన చేయడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వమే బ్యాంకులకు హామీ ఇచ్చి రైతుల తాకట్టు పెట్టిన భూమి డాక్యుమెంట్లు, నగలను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలు తీరేలా పూర్తిగా 10 టీఎంసీల నీరు విడుదల య్యేలా ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు శ్రద్ధ చూపాలని కోరారు. రైతులకు అన్యాయం చేస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని వారితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నత్తారవి, కారపాటి కోటేశ్వరరావు, గారపాటి సతీష్, విమలారావు, శ్రీపతి కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బాబు హామీలు నిలుపుకోవాలి
అవనిగడ్డ, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పామర్రు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన కోరారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ ఫైలుపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సంతకం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి సింహాద్రి రమేష్‌బాబు స్వగృహంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతు రుణమాఫీ విషయంపై ఇప్పటికే చంద్రబాబు డొంకతిరుగుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన జరగక ముందు ఈ వాగ్దానం చేశానని రైతులను వంచించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేసేంత వరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారని విమర్శించారు. రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేయాలని కోరారు. వైఎస్సార్సీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించటంతో పాటు ఫ్యాను గుర్తునే కేటాయించటం స్వాగతించదగిన పరిణామమన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ నాయకులు మైండ్‌గేమ్ ఆడుతున్నారని, అయితే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలెవరూ టీడీపీ వైపు మొగ్గుచూపే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమించటంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయటం, రాబోయే కాలంలో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని కల్పన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కడవకొల్లు నరసింహారావు, పార్టీ నాయకుడు మిక్కిలినేని మధు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం
చంద్రబాబు హామీలు నెరవేర్చాలి ఎన్డీఏ, టీడీపీలపై పోరాటం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పులివెందుల/వేంపల్లె, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. నష్టాలు వచ్చినా ప్రజల పక్షానే ఉంటామని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రతిపక్ష పాత్రలో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చే దిశగా ముందుకు పోతామన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో.. మోడి గాలితో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. చంద్రబాబు చెప్పిన హామిలను నెరవేర్చకపోతే వెంటాడుతూ.. అమలుపరిచే విధంగా ముందుకెళతామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే అప్పుడే వైఎస్సార్ సీపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఎవరు ఎన్ని భయాలకు గురి చేసినా తలొగ్గే ప్రసక్తే లేదని, చంద్రబాబు వాగ్దానాలు అమలు చేయకపోతే పదవి నుంచి కిందికి దింపుతామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం, పంట రుణాల మాఫీ చేయడం లాంటివి వెనక్కి తగ్గితే ఉద్యమిస్తామని తెలిపారు. ప్రతిపక్షమంటే ఇలాగుండాలనేలా ప్రజలతో మమేకమవుతామని చెప్పారు. జూన్ 2, 3వ తేదీల్లో రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేసి గెలుపోటములపై సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు.పార్టీ ప్రతిపక్ష హోదాలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించామన్నారు. ఎంపీటీసీ, సర్పంచి, మున్సిపల్ ఎన్నికల తర్వాత వచ్చిన సార్వత్రిక ఫలితాల్లో వైఎస్సార్ సీపీకి భారీగా ఓట్ల శాతం పెరిగిందని, దీంతో గ్రామీణ స్థాయిలోనూ వైఎస్సార్ సీపీకి క్యాడర్ బలంగా ఉందన్న విషయం స్పష్టమైందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు. గతంలో 20మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా.. ఎన్నో ఉద్యమాలు చేశామని, రానున్న 5ఏళ్లల్లో ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతామని తెలిపారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. రాబోయే కాలంలో కాబోయే సీఎం జగన్ అన్నది అక్షర సత్యమని స్పష్టం చేశారు. బుధవారం ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ శాసనసభ పక్ష నేత వైఎస్ జగన్‌ను ఏకగీవ్రంగా ఎన్నుకున్న తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ సీపీ నాయకులు ఇడుపులపాయలో విలేకరులతో మాట్లాడారు. కేసుల కోసం మోడీని కలవలేదు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. టీడీపీ నాయకులు కొంతమంది నరేంద్ర మోడిని జగన్ కేసులు మాఫీ చేసుకునేందుకు కలిశారనడం విడ్డూరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడేందుకు నరేంద్రమోడి దృష్టికి సమస్యలు తెలియజెప్పేందుకే జగన్ ఆయనను కలిశారు. కానీ కేసుల కోసం రాజీ పడి ఉంటే సోనియా గాంధీతో రాజీపడి ఉండేవారు... ఇప్పుడు ఆ సమస్య ఎందుకు వస్తుంది. ఇప్పటికే టీడీపీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయి. కార్యకర్తలకు అండగా ఉంటాం. - మాజీ మంత్రి పార్థసారథి కార్యకర్తలకు అండగా ఉంటాం కార్యకర్తలకు అండగా ఉంటాం. అధికారం లేకపోయినా ప్రజల వెంటే ఉండి కార్యకర్తలను కాపాడుకుంటాం. మోసపూరిత విధానాలకు ప్రజలు కొంతమంది మొగ్గుచూపారు.. కానీ చంద్రబాబు కపట నాటకాలు త్వరలో బయటపడతాయి. జగన్ లాంటి నాయకులు కావాలని ప్రజలు కోరుకునే రోజు త్వరలోనే వస్తుంది. - ఉప్పులేటి కల్పన, పామర్రు ఎమ్మెల్యే -
నిర్ణయాత్మక ప్రతిపక్ష ‘శక్తి’ జగన్
వేమవరం (గుడ్లవల్లేరు), న్యూస్‌లైన్ : రాబోయే టీడీపీ ప్రభుత్వాన్ని అభివృద్ధి విషయంలో గాడిలో పెట్టేందుకు రాష్ట్రంలోనే నిర్ణయాత్మక ప్రతిపక్ష శక్తిగా వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ తరఫున కల్పన గెలుపొందితే వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుంటామని మొక్కుకున్న పెదపారుపూడి మండలం యలమర్రు సర్పంచి సుంకర సత్యనారాయణ ఆదివారం రాత్రి అమ్మవారి సన్నిధిలో మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కల్పన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కైన రాజకీయాలు ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీని ఎదుర్కొనేందుకు కుట్ర, కుతంత్రాలతో ఆ పార్టీలు చేసిన జిమ్మిక్కులు ఇన్నీఅన్నీ కావన్నారు. పార్టీ శ్రేణుల సహకారంతో మున్ముందు తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తుందని తెలిపారు. వారు ఎన్ని గారడీలు చేసినా వాటిని ఛేదించుకుని తన నియోజకవర్గ ప్రజలు తనకు విజయాన్ని అందించారని కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలంతా తనను తోబుట్టువులా భావించి, గెలిపించారని చెప్పారు. తన విజయాన్ని తన నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తున్నానని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో జగన్ నాయకత్వంలో తన నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తానని అన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు కలత చెందవద్దు... వైఎస్సార్ సీపీకి విజయం దక్కిందని పామర్రు నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించేందుకు కాంగ్రెస్, టీడీపీకి చెందిన దుష్టశక్తులు తయారయ్యాయని ఎమ్మెల్యే కల్పన అన్నారు. తమ కార్యకర్తల్ని భయబ్రాంతులకు గురి చేయవచ్చుననే వారి పన్నాగాన్ని సాగనివ్వమని తెలిపారు. అన్యాయంగా కేసులు బనాయిస్తే, కార్యకర్తలకు తాము అండగా ఉన్నామన్నారు. వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆమె వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనరు చిత్తర్వు నాగేశ్వరరావుతో తన నియోజకవర్గంలో కార్యకర్తలపై వేధింపుల గూర్చి వివరించారు. పార్టీ లీగల్ సెల్ పరంగా పార్టీ కార్యకర్తలకు న్యాయపరంగా తమ అండదండలు ఉంటాయని చిత్తర్వు చెప్పినట్లు ఆమె తెలిపారు. యలమర్రు సర్పంచి సుంకర సత్యనారాయణ మాట్లాడుతూ తమ సొంత సోదరిని గెలుపించుకుందామన్నట్లుగా ఎమ్మెల్యే కల్పన వెంట ఉన్నామన్నారు. యలమర్రు ఎంపీటీసీ సభ్యురాలు నాగభవాని, పార్టీ నేత డేవిడ్ తదితరులు సమావేశంలో ఉన్నారు.