టీడీపీ అంటేనే పుకార్ల ఫ్యాక్టరీ! | tdp is rumors factory, says ysrcp mals | Sakshi
Sakshi News home page

టీడీపీ అంటేనే పుకార్ల ఫ్యాక్టరీ!

Published Mon, Jun 13 2016 11:33 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

టీడీపీ అంటేనే పుకార్ల ఫ్యాక్టరీ! - Sakshi

టీడీపీ అంటేనే పుకార్ల ఫ్యాక్టరీ!

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అంటేనే పచ్చి అబద్ధాలను వండి వార్చే పుకార్ల ఫ్యాక్టరీ అని, అందుకే ఏపీ సర్కారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి అడ్డుకుంటున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన మండిపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబు.. తమ పార్టీపై అభాండాలు వేయకుండా ఉంటారని తాము ఆశించడం లేదని కొడాలి నాని, ఉప్పులేటి కల్పన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగం.. ఈ మూడింటిలోనూ ఏపీని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు చేతగానితనానికి పతిపక్ష నేత బాధ్యత వహించాలా? అని వారు నిలదీశారు. వైఎస్ఆర్‌ సీపీ ఎమ్మెల్యేల ప్రతికా ప్రకటన ఇది...


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement