telugudesham party
-
చరిత్ర ఏం చెబుతుందంటే.. విపక్షాలవి పగటి కలలే.!
సాక్షి, ఆంధ్రప్రదేశ్: 1956–2014 మధ్య ఉనికిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌లో 1982లో తెలుగుదేశం ఏర్పాటయ్యాకే రెండు ప్రధాన రాజకీయపక్షాల మధ్య అధికారం కోసం గట్టి పోటీ జరిగే పరిస్థితులు వచ్చాయి. అంటే, 1983 ఏపీ శాసనసభ ఎన్నికల నుంచి మాత్రమే ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షానికి 30 శాతానికి పైగా ఓట్లు రావడం మొదలైంది. 1953–56 మధ్య మూడేళ్లు ఉనికిలో ఉన్న ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఒకే ఒక ఎన్నికల్లో ప్రతిపక్షానికి పడిన ఓట్లు 30 శాతం దాటాయి. 1955లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)కి 31.13% ఓట్లు దక్కాయి. అయితే, దాదాపు మూడో వంతు శాతం ఓట్లు దక్కించుకున్నాగాని కమ్యూనిస్టులకు ఈ ఎన్నికల్లో మొత్తం 190 సీట్లకుగాను కేవలం 15 స్థానాలే లభించాయి. కాంగ్రెస్ కూటమికి, సీపీఐకి మధ్య దాదాపు అన్ని చోట్లా పోటీ తీవ్రంగా ఉండడమే ఈ అసాధారణ ఫలితాలకు కారణం. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో 1983 ఎన్నికల ముందు వరకూ ఇలా దాదాపు మూడో వంతు ఓట్లు (30%) దక్కించుకున్న ప్రధాన ప్రతిపక్షం ఏదీ లేదు. 1957, 62, 67, 72 ఉమ్మడి ఏపీ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌కు దాదాపు ఎదురులేని పరిస్థితి. ఈ నాలుగు ఎన్నికల్లోనూ చివరి మూడు ఎన్నికలే రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. 1957లో తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 105 స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షమైన సీపీఐ 25.73% ఓట్లతో 22 సీట్లు సంపాదించగలిగింది. విశాల తెలుగురాష్ట్రంలో మొదటిసారి అంతటా జరిగిన 1962 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ అత్యధికంగా 19.13% ఓట్లు సంపాదించి, 51 సీట్లు సాధించింది. అయితే, అప్పటికీ బలహీనపడిన సీపీఐ నాటి ఏపీ అసెంబ్లీలోని మొత్తం 300 సీట్లకు గాను 136 సీట్లలో మాత్రమే పోటీచేయగలిగింది. ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (1967, 1972) ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి కనీసం 10% ఓట్లు దక్కలేదు. 1978 ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ కాసు బ్రహ్మానందరెడ్డి, ఇందిరాగాంధీ నాయకత్వంలో రెండు పార్టీలుగా దేశవ్యాప్తంగా చీలిపోయింది. ఈ చీలిక తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన 1978 ఫిబ్రవరి ఎన్నికల్లో మాత్రమే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా పార్టీకి రాష్ట్రంలో 28.85 శాతం ఓట్లు, 60 సీట్లు దక్కాయి. (ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (ఆర్) తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు నాయకత్వంలోని పార్టీకి 17% ఓట్లు, 30 సీట్లు దక్కాయి.) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1983 ఎన్నికలకు ముందు ఒక ప్రతిపక్ష పార్టీకి పాతిక శాతం వరకూ ఓట్లు వచ్చిన ఏకైక సందర్బం ఇదే. మూడో పక్షానికి 15% ఓట్లు దాటిన ఏకైక సందర్భం 2009 అసెంబ్లీ ఎన్నికలే! 1980ల ఆరంభంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షానికి (కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్) ప్రతిసారీ 30 శాతానికి పైగానే ఓట్లు లభించాయి. 1994 ఏపీ పదో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 26 సీట్లు (మొత్తం 294కు) మాత్రమే దక్కించుకున్నప్పుడు కూడా ఈ పార్టీకి పోలైన ఓట్లలో 33.85% వచ్చాయి. ఈ పదో శాసనసభ ఎన్నికల తర్వాత మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలోకి దిగిన ప్రాంతీయపక్షానికి 15 శాతానికి మించిన ఓట్లు లభించిన సందర్భం 2009 అసెంబ్లీ ఎన్నికలే. ఈ ఎన్నికలకు 8 మాసాల ముందు ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)కి 16.2 శాతం ఓట్లు, 18 సీట్లూ ఈ ఎన్నికల్లో లభించాయి. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలోగాని, రెండు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ)గాని మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల పోరుకు దిగిన ఏ పార్టీకి కనీసం 15 శాతం ఓట్లు దక్కలేదు. 2023 నవంబర్–డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ మూడో ఎన్నికల్లో తృతీయ ప్రత్యామ్నాయంగా భావించిన బీజేపీకి గరిష్ఠంగా 13.9 శాతం ఓట్లు, 8 సీట్లూ దక్కాయి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లోనూ (2014, 2019) మూడో ప్రధాన పార్టీగా బరిలోకి దిగిన ఏ రాజకీయపక్షం కూడా కనీసం ఆరు శాతం ఓట్లు సంపాదించుకోలేదు. ఇలా తెలుగునాట రెండు ప్రధాన రాజకీయపక్షాలే ఒకదాని తర్వాత మరొకటి (ఒక్కోసారి వరుసగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాగాని) సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాయేగాని మూడో ప్రత్యామ్నాయ పార్టీకి లేదా కూటమికి అవకాశం ఇవ్వలేదు. విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP ఇవి చదవండి: ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ -
ఓటమి భయంతో రెండు నాల్కలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాటలను వింటే, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియడం లేదని ఎవరికైనా అనుమానం కలుగుతుంది. జగన్ ప్రభుత్వంపై పోరాడమంటారు, కానీ ఎందుకు పోరాడాలో చెప్పరు. సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయిందంటారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే అంతకంటే ఎక్కువ అమలు చేస్తానని చెబుతారు. రాష్ట్ర పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టామని చెబుతూనే, వస్తున్న పరిశ్రమలను అడ్డుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని ఎన్నికల్లోనూ వరుస పరాజయాలు, పరాభవాల తర్వాత ఆయన చేతులెత్తేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కానీ దాన్ని బహిరంగంగా ఒప్పుకోలేరు. అందుకే దేన్ని విమర్శిస్తున్నారో కూడా ఆయనకు స్పష్టత లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రకటనలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన ఒక ప్రసంగం చూస్తే... ఇదేమిటి? చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మళ్లీ గెలిచే అవకాశం లేదా అని ఆ పార్టీ కార్యకర్తలకే అనుమానం వస్తుంది. పైకి గంభీరంగా మాట్లాడుతున్నా, లోపల చంద్రబాబు నాయుడులోని గుబులు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాడాలని ఆయన అంటారు. అంతవరకు తప్పు లేదు. కానీ ఎందుకు పోరాడాలి అన్నదానిపై ఆయనకే క్లారిటీ లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విమర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయిందని అంటారు. కానీ వైఎస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు తాను అమలు చేస్తాననీ, వాటికి రెట్టింపు ఇస్తాననీ ఆయన చెబుతారు. దీనిని ఎవరైనా నమ్ముతారా? అంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏడాదికి తల్లులకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు. మరి తాను ముప్పై వేలు ఇస్తానని చంద్రబాబు చెబుతారా? అంటే ఆ మాట చెప్పరు. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయి పోయిందని ఆరోపించారు కదా? మరి చంద్రబాబు నాయుడు ఎలా రెట్టింపు పథకాలు ఇస్తారన్న ఆలోచన కాస్త విజ్ఞత ఉన్నవారికి ఎవరి కైనా వస్తుంది. అలాంటిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాదా? అంటే దాని అర్థం అటు జగన్ ప్రభుత్వ పథకాలను కాదనలేకా, ఇటు అవుననలేకా ఆయన సతమతమవుతూ, తన సహజ లక్షణం ప్రకారం డబుల్ టాక్ చేస్తున్నారన్నమాట! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అని చెప్పడం ప్రతిపక్షాలకు ఒక ఫ్యాషన్ అయింది. ఏ విధంగా నాశనం అయింది? జగన్ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేయడం వల్లా? మరేదైనా కారణమా? అన్నదానిపై ఒక్క విపక్ష నేత కూడా ఇంతవరకూ మాట్లాడలేక పోయారు. కేవలం ద్వేషంతో ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. పోలీసులు లేకుండా వస్తే వైసీపీనో, టీడీపీనో తేల్చుకుందామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమిటి దీని అర్థం? నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం కలిగిన వృద్ధనేత ఈ మాటలు అనడం సరైనదేనా? ఇది సాధ్యమేనా? ఆయన తన చుట్టూ ఉన్న ఎస్పీజీ సెక్యూరిటీ వంద మందిని పక్కనబెట్టి ఎక్కడైనా తిరుగుతున్నారా? తాను సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నాననీ, రోడ్డు మీద తేల్చు కుందామనీ అనగలరా? అలా చెప్పరు. కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం రోడ్ల మీదకు వెళ్లి తన్నుకు చావాలన్నమాట. తమ పోరాటాల ద్వారా పోలీసులతో కార్యకర్తలు కేసులు పెట్టించుకోవాలట. అవసరమైతే కోట్లు ఖర్చు పెట్టడానికి ఆయన వెనుకాడరట. ఇది ఏమైనా పద్ధతేనా? కోర్టులలోనే కేసులు గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టగలిగిన చంద్రబాబు నాయుడు ఎన్నికలలో మరెన్ని కోట్లు వ్యయం చేస్తారన్న ప్రశ్న వస్తే ఆయన సమాధానం ఇస్తారా? చంద్ర బాబు చివరికి కేసులు, కోర్టుల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారన్నమాట! చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి నిజం గానే ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి పిచ్చిపిచ్చి చేష్టలకు పాల్పడితే నష్టపోయేది వారే. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడూ సురక్షితమైన కోట వంటి ఇళ్లలో, వందల మంది భద్రత మధ్య నివసిస్తుంటారు. ఆయనకేమీ కాదు. కార్యకర్తలు ప్రజలలోకి వెళ్లి పనిచేయాలని చెప్పవచ్చు. కానీ పరోక్షంగా గొడవలు చేసి కేసులు పెట్టించుకోవాలని ఆయన చెబుతుంటే తెలివైన కార్యకర్త ఎవరైనా అందుకు సిద్ధపడతారా? ఎన్నికలు త్వరగా వస్తే పీడ పోతుందట. అంటే గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఓడించి ప్రజలు పీడ వదిలించుకున్నారని చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా? తెలుగుదేశం పార్టీని చూస్తే జగన్‌కు వెన్నులో వణుకు వస్తోందట. ఇలాంటి మాటలు ఎవరికి వర్తిస్తాయి? అన్ని ఎన్నికలలోనూ పరాజయం చెందినవారికీ, పరా భవం పొందినవారికి కదా భయం కలగలవలసింది? చంద్రబాబు తాను భయపడుతున్న విషయాన్ని బహిర్గతం కాకుండా ఉండడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కుప్పంలోనే స్థానిక ఎన్నిక లన్నిటిలో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను చూసి భయపడుతుండడం వల్లే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు అర్థంకావడం లేదా? మరో సందర్భంలో తనకు తెలియకుండానే చంద్రబాబు ఒక వాస్తవం ఒప్పుకున్నారు. ఇంతవరకూ జరిగిన రాజకీయం ఒక ఎత్తు... ఇకపై మరో ఎత్తు అని అన్నారు. చంద్రబాబు ఇది అనుభవ పూర్వకంగానే చెబుతున్నారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి చేదు ఫలితాలను ఆయన ఎన్నడూ చూడలేదు. అందుకే దుర్మార్గుడిని ఎదుర్కునే శక్తి మనకు ఉంటేనే నిలబడగలుగుతాం అనీ, యోధుల్లా పోరాడుతున్న కార్యకర్తలను నాయకులు కడుపులో పెట్టుకుని కాపా డాలనీ ఆయన కోరుతున్నారు. కార్యకర్తలు యుద్ధానికి సన్నద్ధం కావాలట. ఎవరిపై యుద్ధం చేస్తారు? అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ ఏ రకంగా దుర్మార్గుడు అవుతారు? చెప్పిన హామీలను వేటినీ అమలు చేయని చంద్రబాబు కదా దుర్మార్గుడు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సందేహం రాదా? రాష్ట్రం పునర్మిర్మాణంపైనే దృష్టి నిలిపామనీ, పొత్తులపై తానెప్పుడూ మాట్లాడలేదనీ చంద్రబాబు అంటున్నారు. పొత్తులు కూడా అవసరాన్ని బట్టి సమయానుకూలంగా నిర్ణయం చేద్దామని ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడమా? ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయ వనరులు లేకుండా కేవలం వంద కోట్లే మిగిల్చి వెళ్లడమా? వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వ వద్దని లేఖలు రాయడమా? రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఉండవచ్చు. కానీ దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. ఈ విషయంలో చంద్రబాబు మాట మార్చి నంతగా దేశంలో ఇంకెవరూ మార్చలేరేమో. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలను ఆయన ఎన్నిసార్లు దూషించారు? అయినా మళ్లీ వాటితో పొత్తు పెట్టుకున్నారు. జనసేన పార్టీతో తాము వన్ సైడ్ లవ్ చేస్తున్నామని ఎందుకు బాధపడిపోయారు? ఇప్పుడు సిద్ధాంతాలు, విధానాలతో సంబంధం లేకుండా అవసరాన్ని బట్టి, సమయాను కూలంగా పొత్తులు పెట్టుకుందామని చెప్పగలిగారంటే అది ఆయనకే చెల్లింది. ఇంత చెప్పినా తెలుగుదేశం పార్టీ నాయకులలో అంత విశ్వాసం రావడం లేదని ఆయన మాటలే చెబుతున్నాయి. పార్టీ నేతలు బద్దకం వీడాలనీ, ప్రజలలోకి వెళ్లాలనీ, పని చేయాలనీ పదే పదే కోరారు. ఇంతవరకు తప్పులేదు. కాకపోతే తాను మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి వస్తానని చెప్పాననీ, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలనీ చంద్రబాబు చెబుతున్నారు. దీని అర్థం ఏమిటి? తెలుగుదేశం వచ్చే ఎన్నికలలో కూడా అధికారం సాధించలేకపోతే, తాను అసెంబ్లీకి గెలిచినా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన దయనీయంగా పార్టీ కార్యకర్తలకు వివరి స్తున్నారా? మళ్లీ గెలవలేమేమో అన్న భయం, సందేహాల మధ్య చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్న సంగతి మామూలు వ్యక్తులకు కూడా అర్థం అవుతుంది. అలాంటిది చంద్రబాబును దగ్గరగా చూస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అర్థం కాదా? కొమ్మినేని శ్రీనివాసరావు (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) -
కథ ముగిసింది.. కల చెదిరింది
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 80 శాతం గ్రామాలను గెలుచుకుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆ పార్టీ సోషల్ ఇంజినీరింగ్ ఈ విజయానికి దోహదపడ్డాయి. అయితే, ఏ ఒక్క నియోజకవర్గంలోనూ టీడీపీ అధిక సర్పంచ్ పదవులను గెలుచుకుందని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో టీడీపీ గెలవడం కూడా ఓ అద్భుతమైన విషయంగా ప్రచారం చేసుకునే దుస్థితి ఆ పార్టీకి దాపురించింది. దీనికి విరుద్ధంగా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ హవా కొనసాగింది. ఈ ఊపు చూస్తుంటే వచ్చే మున్సిపల్, మండల, జడ్పీ ఎన్నికలతోపాటు, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి తిరుగు ఉండదన్న భావన కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్ని కల ఘట్టం పూర్తయింది. పార్టీ రహిత ఎన్నికలే అయినా, గతంలో ఎన్నడూ లేనంత సీరియస్‌గా ఈసారి పార్టీలు పోటీపడ్డాయని చెప్పాలి. ఆయా పార్టీలు తమ మద్దతుదారులను రంగంలో దించి పంచాయతీలను గెలుచుకునే యత్నం చేశాయి. ఏ పార్టీ ఎన్ని పంచాయతీలు గెలిచిందన్న లెక్కలు ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఒక ప్రమాణం ఏమిటంటే వైఎస్సార్ కాంగ్రెస్ ఒక వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా ప్రారంభించి, గ్రామాలలో గెలిచిన తమ పార్టీ మద్దతు దారుల ఫొటోలు, పేర్లు తదితర వివరాలను ఉంచడమే కాకుండా, వాటిలో తప్పుంటే చెప్పాలని సవాల్ చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయమై ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. కానీ తెలుగుదేశం వైపు నుంచి స్పందన లేదు. అయినా తాము ఇన్ని గెలిచాం అని ఏవో లెక్కలు చెప్పడం మానలేదు. చివరికి ప్రతిపక్ష నేత నియోజకవర్గం కుప్పంలో కూడా 74 పంచాయతీలను వైసీపీ గెలుచుకోవడం ఒక పెద్ద సంచలనం. మిగిలిన ఫలితాల సంగతి ఎలా ఉన్నా, ఈ ఒక్కటి చంద్రబాబును విపరీతంగా డ్యామేజీ చేసిందంటే ఆశ్చర్యం కాదు. నాలుగు దశలలో కలిపి 4,230 సర్పంచ్ పదవులు దక్కాయనీ, మొత్తం మీద నలభై శాతం పైగా గెలుచుకున్నామనీ మేకపోతు గాంభీర్యంతో చెప్పారు కానీ వాటికి నిర్దిష్ట ప్రాతిపదిక, ఆధారాలు చూపించలేకపోయారని అనిపిస్తుంది. అందులో ఏమాత్రం నిజం ఉన్నా, ఆయనకు మద్దతిచ్చే పత్రికలు, చానళ్లు జిల్లాలు, మండలాల వారీగా టీడీపీ విజయాలను ప్రచారం చేసి ఉండేవి. మొదటి దశల్లో టీడీపీ బాగా పుంజుకుందని ప్రచారం చేసిన ఈ మీడియా తన పరువు పోతోందని గ్రహించిందో, లేక మరే కారణమో తెలియదు గానీ ఇది టీడీపీ లెక్క, అది వైసీపీ లెక్క అంటూ ప్రచారం చేసి ఊరుకున్నాయి. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే చంద్ర బాబు స్వగ్రామం నారావారిపల్లెలో టీడీపీ గెలవడం అద్భుతమైన విషయమన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఒకటి వాస్తవమే. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆయన సొంత గ్రామంలో కూడా తెలుగుదేశం ఓడిపోతే మరింత నష్టం జరిగేది. అది జరగకుండా చంద్రబాబు కొంత జాగ్రత్తపడ్డారని అనుకోవాలి. అయితే అదే సమ యంలో చంద్రగిరి నియోజకవర్గంలో 90 శాతం పంచాయతీలు వైసీపీ వశం అవడం కూడా గమనించదగిన అంశమే అవుతుంది. రాష్ట్రంలో ఫలానా నియోజకవర్గంలో టీడీపీ అధిక సర్పంచ్ పద వులను గెలుచుకుందని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం 13,097 గ్రామాలకు ఎన్నికలు జరిగితే 10,382 సర్పంచ్ పదవులను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుందనీ, 2,062 గ్రామాలను టీడీపీ గెలుచు కుందనీ, 475 గ్రామాలలో ఇతర పార్టీలు విజయం సాధించాయని వైసీపీ పేర్కొంది. ఆరు నియోజకవర్గాలలో టీడీపీ ఒక్క సర్పంచ్ పద విని కూడా దక్కించుకోలేదు. 39 నియోజకవర్గాలలో పది లోపు గ్రామాలకే అది పరిమితం అయింది. చంద్రబాబు సైతం వైసీపీ మెజా రిటీ స్థానాలు గెలుచుకుందని పరోక్షంగా అంగీకరిస్తూనే, తమకు వచ్చిన స్థానాలను రెట్టింపు చేసి ప్రచారం చేసుకున్నట్లు కనిపిస్తుంది. తద్వారా పార్టీ ఉనికి రక్షించుకునే యత్నం చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో పార్టీ క్యాడర్ మరీ నీరుగారిపోకుండా ఉండటానికి ఆయన తంటాలు పడుతున్నారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ మంచి జోష్‌లో ఉంది. పల్లెల్లో వచ్చిన ఈ సానుకూల ఫలితాల ఊపుతో పట్టణాలలో కూడా పట్టు బిగిం చాలని ప్రయత్నాలు ఆరంభించింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం చెప్పుకోవాలి. రాజధాని ప్రాంతంగానో, పరిసర ప్రాంతంగానో పరి గణనలోకి తీసుకునే గుంటూరు, కృష్ణా జిల్లాలలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ అధిక స్థానాలలో జయకేతనం ఎగురవేసింది. గుంటూరు జిల్లాలో 744 గ్రామాలను వైసీపీ కైవసం చేసుకుంటే టీడీపీకి 162 మాత్రమే దక్కాయి. అలాగే కృష్ణా జిల్లాలో 680 గ్రామాలను వైసీపీ గెలుచుకుంటే టీడీపీ 168 గ్రామాలను దక్కించుకుంది. అమరావతి రాజధానికి ప్రజల పూర్తి మద్దతు ఉందని ఇంతకాలమూ టీడీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. ఎన్నికలకు రావాలని పలుమార్లు సవాల్ చేసింది. కానీ ఈ రెండు జిల్లాలలోనూ టీడీపీ ఆధిక్యత తెచ్చుకోలేక పోవడం దేన్ని సంకేతిస్తుంది? రాజధాని అమరావతి పేరుతో గతంలో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారమనీ, దానికి ప్రజల మద్దతు ఉందన్న వాదనలో వాస్తవం లేదనీ అర్థం అవుతోంది. అంతేగాక అమ రావతి మహోద్యమం అంటూ ప్రచారం చేసిన టీడీపీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు ఇది జీర్ణించుకోలేని విషయమే అవుతుంది. రాజధాని గ్రామాలు అధికంగా ఉండే తాడికొండ నియోజకవర్గంలో సైతం వైసీపీ ఎక్కువ పంచాయతీలను గెలుచుకుందన్న సమాచారం వచ్చింది. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో, దుగ్గిరాల మండలం లోనూ వైసీపీదే గెలుపు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ 696 గ్రామాలను కైవసం చేసుకుంటే తెలుగుదేశం అతి తక్కువగా 71 స్థానాలకే పరిమితం అయింది. ముఖ్య మంత్రి ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో కూడా టీడీపీ గెలవలేకపోవడం, 108 పంచాయతీలను అన్నింటినీ వైసీపీ గెలుచుకోవడం ఒక రికార్డుగా కనిపిస్తుంది. అలాగే చిత్తూరు జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పుంగనూరు నియో జకవర్గంలోనూ వంద శాతం వైసీపీ అభ్యర్థులే సర్పంచ్ పదవులను గెలుచుకున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1,161 పంచాయతీలను గెలుచుకుంటే, 188 పంచాయతీలకే టీడీపీ పరిమితం అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి పునరావృతం అయ్యాయని అనుకోవాలి. గ్రామాలలో ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన పలు పథకాలు బాగా పనిచేశాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలతో పాటు సోషల్ ఇంజినీరింగ్ కూడా జగన్ సమర్థంగా చేయగలిగారనీ, మిగిలిన వర్గాలతో పాటు బీసీలను కూడా బాగా ఆకట్టుకోవడం వల్లే కుప్పంతో సహా అన్ని నియోజకవర్గాలలో విజయం సాధ్యమైందనీ చెబుతున్నారు. ఈ గెలుపు ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగింది. పల్లె ప్రజలు వైసీపీ పట్ల, ముఖ్యమంత్రి జగన్ పట్ల అచంచల విశ్వాసాన్ని కనబరిచారు. ఇదే సోషల్ ఇంజినీరింగ్‌ను జగన్ కొనసాగించగలిగితే భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికలలో గానీ, మండల, జడ్పీ ఎన్నికలలో గానీ, తదుపరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సైతం తిరుగు ఉండదన్న భావన కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ వైఫల్యం చెందిందో గుర్తించలేక, అధికార దుర్వినియోగమనీ, అరాచకమనీ ఏవేవో ఆరోపణలు చేయడానికి చంద్రబాబు తంటాలు పడుతున్నారు. అవి ఏ మాత్రం నిజం కాదని చెప్పడానికి ఎన్నికల కమి షనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలు ఉదాహరణ అవుతాయి. పంచాయతీ ఎన్నికలు పూర్తి సజావుగా జరిగాయని ఆయన ప్రకటిం చారు. ఇది చంద్రబాబుకు నచ్చడం లేదు. మొన్నటి దాకా ఎన్నికల కమిషనర్‌ను ఆకాశానికి ఎత్తేసిన చంద్రబాబు ఇప్పుడు ఆయన్ని కింద పడేసి, ఎన్నికల కమిషన్ వైఫల్యం అని ప్రచారం చేస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు ఈ విషయంలోనూ అలాగే చేశారని అనుకోవచ్చు. సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కరోనా వైరస్ నిరోధానికి టీకాలు ఇవ్వాలనీ, ఎన్నికలు వాయిదా వేద్దామనీ ప్రతిపాదిస్తే, ఎన్ని కల కమిషన్ గానీ, తెలుగుదేశం పార్టీ గానీ ససేమిరా అన్నాయి. తీరా ఎన్నికలు జరిగితే పరిస్థితి ఇలా మారింది. దీన్నే పడుకున్న ఎద్దును లేపి తన్నించుకోవడం అంటారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అర్థవంతంగా ఉందని అనుకోవాలా? కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
టీడీపీ నేతలు నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు
విజయవాడ: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ఎన్నికల కమీషన్ మధ్య రగడ మొదలైంది. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికలు వద్దని, ప్రాణాలు పణంగా పెట్టి తాము ఎన్నికల విధులు నిర్వహించలేమని తాను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు వక్రీకరిస్తున్నారని ప్రభుత్వోద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ప్రాణాలను రక్షించుకునే హక్కు రాజ్యాంగం తమకు కల్పించిందని, మా ప్రాణాలకు రాజ్యాంగం ఏం విలువ ఇచ్చిందని మాత్రమే తాను ప్రశ్నించానని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ఉన్న అంశాలను కాదనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కొందరు టీడీపీ నేతలు తనను వాడూ వీడూ అని సంబోధిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఆయన వాపోయారు. తనను విమర్శించే నేతలను తాను కూడా అరేయ్ ఒరేయ్ అనగలనని, అలా మాట్లాడి తన స్థాయి దిగజార్చుకోలేనని అన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వాతవరణమే లేదని, ఈ విషయం నిమ్మగడ్డకు కూడా తెలుసునని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఎన్నికలు జరపమని తీర్పు ఇచ్చినా, నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితే కూడా లేదని వివరించారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్న ఉద్యోగులతో ఎన్నికలు జరుపుకుంటే తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులను రాజకీయ అనసరాల కోసం వాడుకుంది టీడీపీనేనని, ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నం అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఓ మాజీ ఉద్యోగ సంఘ నేత వల్లే ఉద్యోగులకు రాజకీయాలతో ముడి పెట్టడం మొదలైందని అన్నారు. అతనితోనే ఆ రాజకీయం ఆగిపోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారని, అందుకే ఆయన ఉద్యోగులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారన్నారు. తనపై దాడికి టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయంపై రేపు డీజీపీని కలిసి వినతి పత్రాన్ని సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీజీఈఎఫ్ జనరల్ సెక్రటరీ అరవపాల్ పాల్గొన్నారు. -
దర్శి టీడీపీలో దోబూచులాట
ఒంగోలు సబర్బన్: దర్శి అసెంబ్లీ టిక్కెట్ విషయంలో అధికార తెలుగుదేశం పార్టీలో ఇంకా దోబూచులాట కొనసాగుతూనే ఉంది. సాధారణ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఇంకా దర్శి టీడీపీ అభ్యర్ధిపై ఆ పార్టీ నాయకుల్లో సందేహాలు వీడనే లేదు. జిల్లాలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి మాత్రం ఒకేసారి 12 మంది అసెంబ్లీ అభ్యర్ధులను, ముగ్గురు పార్లమెంట్ అభ్యర్ధులు ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శికి ప్రాతినధ్యం వహిస్తూ, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న శిద్దా రాఘవరావును ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలవంతంగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించిన విషయం విధితమే. దీంతో దర్శి అసెంబ్లీ అభ్యర్ధి విషయంలో అధికార టీడీపీకి అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చివరకు ముఖ్యమంత్రి బావమరిది, సినీనటుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన కనిగిరి ఎమ్మెల్యేకు ఆ సీటు విషయంలో చుక్కెదురైంది. దీంతో చివరకు దర్శి నుంచి పోటీ చేయాలని కదిరి బాబూరావును అధిష్టానం ఆదేశించింది. దీనికి సుముఖంగా లేని కదిరి తన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టారు. అందులో భాగంగా ఇటీవల ఒంగోలు నగరంలో అఖిల భారత కాపు సమాఖ్య నాయకులు జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ కూడా టిడిపి సీటు కేటాయించ లేదని, కనిగిరిలో కదిరికి కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనంటూ టీడీపీకి అల్టిమేటం జారీ చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో జిల్లా కాపులకు రెండు సీట్లు కేటాయించారని ఏ ఒక్కరికీ కాపులకు కేటాయించకుండా జిల్లాలో టీడీపీ అభ్యర్ధులు ఏవిధంగా గెలుస్తారని వారు అప్పట్లో ప్రశ్నించారు. ఆ తరువాత కదిరి తన సన్నిహితులతో పామూరులో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి ఇటు కనిగిరిలోనూ, అటు దర్శిలోనూ నామినేషన్లు వేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఆ తరువాత చివరకు దిక్కులేని స్థితిలో దర్శిలో మంత్రి తనయుడు శిద్దా సుధీర్‌ను నిలబెట్టాలని, అందుకు అధిష్టానం కూడా సమ్మతించాలని మంత్రి కోరారు. దీంతో ఇప్పటి వరకు దర్శి టిక్కెట్ విషయంలో అధిష్టానం కూడా కఠినమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. మళ్లీ సుధీర్ దర్శిలో అభ్యర్థిగా ఉండవచ్చన ప్రచారం జోరుగా సాగింది. చివరకు గురువారం ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధిగా మంత్రి శిద్దా రాఘవరావు నామినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందలో భాగంగా తిరిగి కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు శిద్దా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాత్రి శిద్దా నివాసంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు కదిరి బాబూరావు కూడా మంత్రి శిద్దాతో సమాలోచనలు జరిపారు. రెండు గంటలపాటు చర్చల అనంతరం చివరకు దర్శి నుంచి తానే పోటీ చేస్తానని కదిరి బాబూరావు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఇక్కడ జరిపిన సమాలోచనల వ్యవహారం మంత్రి శిద్దా రాఘవరావు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో ఇంకా టిక్కెట్ల పంచాయితీ అధికార టీడీపీలో వీడక పోవటంతో కార్యకర్తలు, నాయకుల్లోనే పూర్తిస్థాయి సంశయం నెలకొంది. -
రాజరికమా.. జనహితమా.!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తరతరాల రాజరిక వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఒకవైపు.. గెలుపోటములతో ప్రమేయం లేకుండా ప్రజా సేవకే ప్రాధాన్యత ఇచ్చిన కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మరో వైపు ఈ ఎన్నికల్లో విజయనగరం నుంచి తలపడుతున్నారు. కేంద్రమంత్రిగా, ఎంపీగా ఉంటూ నియోజకవర్గ ప్రజలను, జిల్లా సమస్యలను ఏమాత్రం పట్టించుకోని అశోక్‌గజపతిరాజు తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా తీసుకురావడం కోసం జిల్లాలోనూ, నియోజకవర్గంలోనూ అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచారు. చెమట విలువేంటో, పేదవాళ్ల బాధలెలా ఉంటాయో కూడా కనీస అవగాహన లేని తన కుమార్తెను రాజకీయ అరంగేట్రం చేయించి నియోజకవర్గ ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దాలనుకుంటున్నారు. ఆది నుంచీ రాజరికమే.. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా ఉన్న సమయంలో 1953లో విజయనగరం నియోజకవర్గం రూపాంతరం చెందింది. మొదటి సారిగా నిర్వహించిన ఎన్నికల్లో ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసిన పీవీజీ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడేళ్ల వ్యవధిలో 1955లో నిర్వహించిన ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంగా కొనసాగుతోంది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో పూసపాటి వంశానికి చెందిన పీవీజీ రాజు, పి.అశోక్గజపతిరాజులు ఎక్కువసార్లు గెలుపొందినప్పటికీ.. ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం చొరవ చూపించలేదు. దాని ఫలితమే ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలు తాగునీటికి కూడా అల్లాడాల్సిన పరిస్థితి. అధికార పార్టీకి చెందిన అభ్యర్థి పేరును ప్రతి ఎన్నికలకు ముందుగానే ఖరారు చేస్తుండగా, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని నిన్నటి వరకూ ప్రకటించలేకపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన మీసాల గీతను కాదని తన కుమార్తె అధితి గజపతికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకునేందుకు ఎంపీ అశోక్‌గజపతిరాజు ప్రయత్నించడం వల్ల ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో చంద్రబాబు తేల్చుకోలేకపోయారు. ఎట్టకేలకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రీకూతుళ్లే టికెట్లు సాధించుకున్నారు. అధితికీ అన్నీ ప్రతికూలతలే.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న అశోక్ గజపతిరాజు విజయనగరం నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్ మిల్లులు మూతపడి సుమారు 12 వేల కార్మిక కుంటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలున్నా విజయనగరంలో మాత్రం ఏర్పాటు కాలేదు. ఎన్నికలొస్తునాయని ఇటీవలే మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 3 లక్షలకు పైగా జనాభా కలిగిన విజయనగరం పట్టణ వాసులకు తాగు నీటి సమస్య వేధిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం పట్టణ వాసులుకు 36 ఎంఎల్డీ నీరు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తుండగా.. ఆ స్థాయిలో వనరులను పెంపొందించుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. 2015 జూలై నెలలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా... స్థానిక పాలకులు తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఉత్తర్వులను అమల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. ఇవన్నీ అధితికి ప్రతికూలతలుగా మారనుండగా... ప్రత్యర్థి పార్టీకి ప్రచారాస్త్రాలు కానున్నాయి. కేవలం టీడీపీకి, తన తండ్రి అశోక్‌కు ఉన్న సంప్రదాయ ఓటింగ్‌పైనే అధితి ఆధారపడాల్సి వస్తోంది. చరిత్రను తిరగరాయగల కోలగట్ల.. పాదయాత్ర సందర్భంగా విజయనగరంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ అయిన కోలగట్ల వీరభద్రస్వామిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. నిజానికి పూసపాటి వంశీకుల కంచుకోటగా పేరొందిన విజయనగరం నియోజకవర్గంలో ఆ వంశానికి చెందిన వారే అత్యధిక సార్లు ఎన్నికల్లో గెలిచారు. అయితే రాజ వంశీకులపై స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ, విజయనగరం నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2004లో చారిత్రాత్మక విజయాన్ని చేజిక్కించుకుని చరిత్రను తిరగరాశారు. ఇప్పుడు మళ్లీ అదే పునరావృతం అవుతుందనే ధీమాతో కోలగట్ల ఉన్నారు. అంతేకాకుండా గెలుపోటములతో సంబంధం లేకుండా కోలగట్ల నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నా అని పిలిస్తే పలుకుతున్నారు. ఆపదలో ఉన్నవారికి అత్యవసర వైద్యం, రక్తం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇవన్నీ ఆయనకు అనుకూలతలుగా మారనున్నాయి. మొత్తం ఓటర్లు 2,10,695 పురుషులు 1,03,669 స్త్రీలు 1,07,026 ఇతరులు 27 -
అపనమ్మకం.. అభద్రతా భావం.!
సాక్షిప్రతినిధి, విజయనగరం: టీడీపీ అధినేతకు విజయంపై నమ్మకం సన్నగిల్లిందా...? పార్టీ విజయావకాశాలపై అభద్రతా భావం వెంటాడుతోందా..? ఇటు జిల్లాలోనూ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయావకాశాలపై అపనమ్మకం ఉందా..? చంద్రబాబు వరుస పర్యటనలు, ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఔననే మాట ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన అనంతరం ఇప్పటి వరకు రెండు సార్లు జిల్లాలో పర్యటించడం వెనుక ఓటమి భయమే కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 17న విజయనగరం పట్టణంలోని అయోధ్య మైదానంలో జరిగిన సభకు హాజరైన ముఖ్యమంత్రి మళ్లీ మూడు రోజుల వ్యవధిలోనే గురువారం విజయనగరం పట్టణంలో రోడ్‌షో ద్వారా ఓటర్లను ఆకర్షించే పని పెట్టుకోవటంపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఎన్నికలకు ముందు ఒక్కసారి వచ్చి వెళ్లిపోయే వ్యక్తి ఈ ఎన్నికల్లో వరుస పర్యటనలు చేస్తుండటం వెను క పార్టీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడమే కారణమని తెలుస్తోంది. పార్టీ పరిస్థితిపై కలవరం 2019 సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా విజయనగరం అభ్యర్థిగా పి.అశోక్‌గజపతిరాజు కుమార్తె, అదితి గజపతి పేరు ప్రకటించటంపై నియోజకవర్గంలోని బీసీ నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుండటం చంద్రబాబును కలవరపెడుతోంది. జిల్లాలోనూ భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించకూడదనుకున్నా... గత్యంతరం లేక పలువురికి అవకా శం కల్పించినా... విజయనగరం ఎమ్మెల్యే మీ సాల గీతకు మాత్రం మొండి చెయ్యి చూపిం చారు. చీపురుపల్లిలో కె.త్రిమూర్తులురాజు, విజయనగరంలో మీసాల గీత బాధ్యతను తాను తీసుకుంటానంటూ బజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ చీపురుపల్లి సభకు త్రిమూర్తులురా జు రాలేదు. విజయనగరం సభకు గీత వచ్చినా అన్యమనస్కంగానే కనిపించారు. ఇదిలా ఉండగా విజయనగరం, సాలూరు, చీపురుపల్లి రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు ప్రజా సమస్యలపై ప్రస్తావించకపోవటం ప్రజలను నిరాశ పరచింది. విపక్షనేతపై వ్యక్తిగత విమర్శలు మూడు సభల్లో ఆయన విపక్ష నేతను టార్గెట్ చేసుకున్నారు. తాజాగా జరిగిన సంఘటనలను ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలోనూ... హైదరాబాద్‌లోనూ... ఎంతో అభివృద్ధి జరిగిందనీ, దానంతటికీ తానే కారణమంటూ ఎప్పటి మాదిరిగా సొంత డబ్బాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ప్రజలు తనను అనుమానిస్తున్నారేమోనని ఎన్నో చేశానని చెప్పేందుకు తెగ తాపత్రయపడ్డారు. అంతేనా... మొన్న వచ్చినపుడు ఓ వృద్ధురాలి కాలికి నమస్కారం పెట్టడమే గాకుండా... ఈసారి పర్యటనలో ప్రజలకు వంగి... వంగి దండాలు పెట్టడం విశేషం. -
రెబల్‌తో బోణీ..
సాక్షి, చీపురుపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు పర్వానికి తెర లేచిన మొదటి రోజునే బోణీ పడింది. చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా కె.త్రిమూర్తులురాజు నామినేషన్ దాఖ లు చేశారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునను అధిష్టానం ఎంపికగా చేయగా... దానిని వ్యతిరేకిస్తూ త్రిమూర్తులురాజు సోమవారం ఉదయం నామినేషన్ వేశారు. పట్టణంలోని ఆంజనేయపురంలో గల ఆయన నివాసం నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయిలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సాల్మన్‌రాజ్‌కు అందజేశారు. అంతకుముందు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 2014లో పార్టీ అధిష్టానం మృణాళినిని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించి గెలిపించాలని ఆదేశిస్తే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గెలిపించామనీ, ఆమె గెలిచిన తరువాత నియోజకవర్గంలో పార్టీ భ్రష్టుపట్టిపోయిందని, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందనీ పేర్కొన్నారు. మూడేళ్లుగా ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెబుతున్నా కనీసం పట్టించుకోలేదనీ, ఆమెకు ఈసారి టిక్కెట్టు ఇవ్వొద్దని సమన్వయ కమిటీలో 80 శాతం మంది వ్యతిరేకించామనీ, అయినా ఆమె కుమారుడికి ఇవ్వడం తమను బాధించిందని చెప్పారు. మరో ఐదేళ్లు బాధలు అనుభవించలేమని, కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు అనుగుణంగా పోటీకి వెళ్లాలని భావించినట్లు తెలిపారు. ఆయనకు చీపురుపల్లి జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఎంపీపీ భర్త, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్ మద్దతు తెలిపారు. -
టీడీపీలో రె‘బెల్స్’
తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది.అభ్యర్థుల ఎంపిక వివాదాస్పదమైంది. ఇప్పటివరకూ ప్రకటించిన ఏడింట్లో అప్పుడే రెండుచోట్ల రెబల్స్‌పుట్టుకొచ్చారు. అందులో ఒకచోట అప్పుడే నామినేషన్‌కూడా వేసేశారు. ఇంకా ప్రకటించాల్సిన రెండింటి విషయంలోనూ వివాదం చెలరేగే అవకాశం కనిపిస్తోంది.అక్కడ కూడా రెబల్స్‌కు అవకాశం ఉందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలోనే ఇన్ని వివాదాలు తలెత్తితే... ఇక ముందు ముందు ఎలాంటి విచిత్రాలు చోటు చేసుకుంటాయోనన్నసందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీలో నామినేషన్ల పర్వం రెబల్స్‌తో మొదలైంది. అభ్యర్థుల ఎంపికలోనే తడబడుతున్న అధికార పార్టీ ఇప్పటికీ జిల్లాలోని రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ నియోజకవర్గానికి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేకపోతోంది. నాదంటే నాదేనంటూ సీటు కోసం ఈ పార్టీ నేతలు ఆశలు పెట్టుకుంటున్నా వారికి అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో తాము వద్దన్న వారికే మరలా టిక్కెట్టు ఇవ్వడంపై తీవ్ర మనస్థాపానికి గురైన టీడీపీ అసంతృప్త నేతలు రెబల్స్‌గా మారుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తోంది. చీపురుపల్లిలో రెబల్‌గా త్రిమూర్తులురాజు చీపురుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జునకు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె.త్రిమూర్తులరాజు సోమవారం రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. త్రిమూర్తులు ఏపీజీవీబీ మేనేజర్, ఆ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009లో బొత్స సత్యనారాయణపై గద్దె బాబూరావు ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినప్పటికీ మృణాళికి పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. అప్పుడు కూడా ఇలాగే రెబల్‌గా నామినేషన్ వేశారు. కానీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అశోక్‌గజపతిరాజు బుజ్జగించి నామినేషన్ వెనక్కుతీసుకునేలా చేశారు. తీరా అశోక్ ఎంపీ అయిన తర్వాత మాటతప్పి త్రిమూర్తులు రాజును మోసం చేశారు. ఐదేళ్లుగా ఇస్తామన్న ఎమ్మెల్సీగానీ, మరే ఇతర పదవిగానీ ఇవ్వలేదు. దీంతో ఈసారైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పట్టుబట్టారు. చివరి నిమిషం వరకూ పోరాడారు. అయినా మళ్లీ పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో మరలా రెబెల్ అవతారం ఎత్తారు. ఈ పట్టుదల చివరి నిమిషం వరకూ ఉంటుందో... లేక అధిష్టానం ఆదేశాలతో విరమించుకుంటారో చూడాలి. ఈసారి పోటీ నుంచి తప్పుకుంటే మాత్రం పదవి కోసమే ఈ డ్రామాలనే విషయం జనానికి అర్థమై, ఇప్పటి వరకూ ఆయనపై ఉన్న గౌరవాన్ని కోల్పోవాల్సి ఉంటుందని ఆయన వర్గీయులే అభిప్రాయపడుతున్నారు. గజపతినగరంలోనూ అదే తీరు... జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో టీడీపీకి గజపతినగరం సమస్యాత్మకంగా మారింది. టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడుకు వ్యతిరేకంగా అతని సోదరుడు కొండబాబు రెబల్‌గా నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. నెల్లిమర్ల టిక్కెట్టుపై కూడా అధిష్టానం ఏ నిర్ణయాన్ని ప్రకటించలేకపోతోంది. ఇక్కడ కూడా పతివాడ నారాయణస్వామినాయుడు లేదా అతని కుమారుడు అప్పలనాయుడుకు టిక్కెట్టు ఇస్తే టీడీపీలో రెబల్స్ పుట్టుకొచ్చే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ప్రశ్నార్థకంగా గీత భవితవ్యం విజయనగరంలో దాదాపుగా టిక్కెట్ కోల్పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం రాత్రి ఇంటికి పిలిపించుకున్న అశోక్ గజపతి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అదితిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నానని, ఆమెకు కొత్త గనుక వెనకుండి ప్రచారం చేయాలని గీతను కోరారు. తాను ఉండగా ఇదేమిటని, అధిష్టానం తనకే టిక్కెట్టు ఇస్తుందనే నమ్మకం ఉందని సమాధానం చెప్పి గీత వెనుదిరిగారు. విజయనగరం టిక్కెట్ల ఖరారు బాధ్యతను అశోక్‌కే చంద్రబాబు అప్పగించినందున ఆయన తన కుమార్తెకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేగాదు పార్టీ అధికారిక ప్రకటన వెలువడకపోయినా తన కుమార్తె నామినేషన్ వేసే తేదీని కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో రెబల్‌గా పోటీలో నిలబడాలని గీత వర్గీయులు పట్టుబడుతున్నారు. ఆమె కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేనతోనూ సంప్రదింపులు జరుపుతున్నటికీ టీడీపీతో తెరవెనుక పొత్తుల నేపధ్యంలో అశోక్ కుమార్తెకు వ్యతిరేకంగా గీతకు జనసేన టిక్కెట్టు ఇచ్చే అవకాశం లేదు. -
నామా.. చూపు ఎటువైపు
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఆయన మదిలో ఏముంది? రాజకీయంగా అడుగులు ఎటువైపు వేయనున్నారు.. టీడీపీలోనే కొనసాగుతారా.. మరో పార్టీలోకి వెళతారా.. ఏ పార్టీ అక్కున చేర్చుకుంటుంది.. ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న రాజకీయ పక్షాలకు చేరువవుతారా.. ఇవన్నీ ప్రచారాలేనని కొట్టిపారేస్తారా.. ఇటువంటి అంశాలన్నీ జిల్లాలో రాజకీయ వేడిని రేపుతున్నాయి. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశంపై కొద్ది నెలలుగా అనేక ఊహాగానాలు షికార్లు చేస్తున్నా.. ఆయన రాజకీయ పయనంపై స్పష్టత కొరవడింది. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా టీడీపీలోనే కొనసాగుతున్నా.. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుని మరోసారి ఎంపీ బరిలో దిగుతారన్న ప్రచారం కొద్ది నెలలుగా హోరెత్తుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలుపొందడంతో అప్పటి నుంచి టీడీపీలో రాష్ట్ర రాజకీయాలకు పరిమితమవుతూ జిల్లా రాజకీయాలపై అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి గూడుకట్టుకుంది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు జిల్లా ప్రజల నాడిని పరిగణనలోకి తీసుకుని తనకు అనుకూలంగా రాజకీయాలను మలచుకునే విధంగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని అనేక నెలల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌లో చేరడమా..! లేదా కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ నుంచి పోటీ చేయడమా.. అన్న అంశంపై ఆయన ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాను తీసుకునే నిర్ణయానికి టీడీపీ శ్రేణులతోపాటు తటస్థుల మద్దతు కోసం నామా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తనకు సాన్నిహిత్యం ఉన్న పలు పార్టీల నేతలు, తటస్థులతో తరచూ టచ్‌లో ఉంటూ రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్ణయం ఎలా ఉంటుందో..? వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పలు రాజకీయ పక్షాలు కూటమిగా ఏర్పడి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్రస్థాయిలో యోచిస్తున్నట్లు ప్రచారం జరగడం.. దీనికి టీడీపీ నుంచి సైతం అనుకూలమైన సంకేతాలు ఉన్నాయని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్న నేపథ్యంలో నామా నాగేశ్వరరావు నిర్ణయం ఎలా ఉంటుందన్న అంశం ఎవరికీ ఒక పట్టాన అంతుపట్టడం లేదు. రాష్ట్రస్థాయిలో అనేక రాజకీయ పక్షాలు కాంగ్రెస్‌తో కలిసి నడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ సైతం కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రిని కొనసాగించే అవకాశం ఉందని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నామా కాంగ్రెస్‌లో చేరి.. ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించే అవకాశం ఉన్నా జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక నేతగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని, అదే కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఖరారైతే 2009లో టీడీపీ గెలుపొందిన ఖమ్మం సీటునే మళ్లీ టీడీపీ కోరుకునే అవకాశం ఉందని, అప్పుడు నామా కాంగ్రెస్‌తోపాటు టీడీపీని బలపరిచే రాజకీయ పక్షాల కూటమితో ఎన్నికల బరిలో దిగి విజయం సాధించడం ద్వారా జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని.. ఒకవేళ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినా మిత్రపక్ష ఎంపీగా ఆయనకు మంత్రి పదవి అవకాశం ఉంటుందన్న ముందుచూపుతో ఆచితూచి అడుగులు వేస్తున్నారని, అందుకే ఎన్నికల పొత్తు.. పలు రాజకీయ పక్షాల వైఖరిపై వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నట్లు టీడీపీలోని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎదురు ప్రశ్నలే.. కాంగ్రెస్‌లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు, రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన అంశాలను సైతం నామా తన సన్నిహితులతో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అంశం పార్టీ శ్రేణుల్లో.. అలాగే అభిమానుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2004 ఎన్నికల్లో ఖమ్మం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన నామా.. ఆ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై ఓడిపోయారు. జిల్లా టీడీపీలో నామా, తుమ్మల వర్గాలు కొనసాగగా.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖమ్మం అభ్యర్థిగా పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఓటమి చెందడం.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరడం, తొలుత మంత్రిగా.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, కొద్ది కాలానికే పాలేరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ద్వారా జిల్లా రాజకీయాలపై తుమ్మల మళ్లీ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇక అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న నామా తెలంగాణలో టీడీపీకి వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలను పరిశీలిస్తూ.. రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ఒక పట్టాన నిర్ణయానికి రాలేకపోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో..? ఎవరికి స్నేహ హస్తం అందిస్తుందో తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఎన్నికల పొత్తు వరకు రాజకీయ నిర్ణయం తీసుకోకుండా వేచి చూడటం రాజకీయంగా సరైంది కాదని నామా అనుచరులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా తాను ఎటువంటి నిర్ణయం తీసుకుంటాననే అంశంపై సన్నిహితులకు సైతం స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడంతో ఆయన మనసులో ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా..? వాటి గురించి అన్వేషణ చేస్తున్నారా..? అన్న అనుమానం టీడీపీ వర్గాల్లోనూ.. ఆయన అనుచర గణంలోనూ వ్యక్తమవుతోంది. అయితే జిల్లా రాజకీయాలపై అవగాహన ఉన్న నామా తన రాజకీయ భవితవ్యంపై ఎవరు ప్రశ్నించినా.. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఎదురు ప్రశ్న వేసి రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆయా రాజకీయ పక్షాల బలాబలాలు, ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిపై దృష్టి సారించారని తెలుస్తోంది. -
క్రికెట్ బెట్టింగ్‌లో టిడీపీ నేతలు అరెస్ట్
-
టీడీపీ అంటేనే పుకార్ల ఫ్యాక్టరీ!
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అంటేనే పచ్చి అబద్ధాలను వండి వార్చే పుకార్ల ఫ్యాక్టరీ అని, అందుకే ఏపీ సర్కారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబు.. తమ పార్టీపై అభాండాలు వేయకుండా ఉంటారని తాము ఆశించడం లేదని కొడాలి నాని, ఉప్పులేటి కల్పన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగం.. ఈ మూడింటిలోనూ ఏపీని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు చేతగానితనానికి పతిపక్ష నేత బాధ్యత వహించాలా? అని వారు నిలదీశారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ప్రతికా ప్రకటన ఇది... -
'అధికారంలో ఉన్నా ఇబ్బందులు తప్పడం లేదు'
చిత్తూరు: అధికారంలో ఉన్నా బీజేపీ కార్యకర్తలకు ఇబ్బందులు తప్పడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం చిత్తూరుకు వచ్చిన మంత్రి స్థానిక బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు తమను ఖాతరు చేయడం లేదని, తాము ఏమీ చెప్పినా పరిగణనలోకి తీసుకోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అందుకు స్పందించిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, బీజేపీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామో.. లేమో తెలియని పరిస్థితిలో ఉన్నామని వ్యాఖ్యానించారు. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవిచ్చిన్నకర శక్తులకు మద్దతు పలుకోందని విమర్శించారు. కన్నయ్యకుమార్‌ను కాంగ్రెస్ హీరోలా చూపిస్తోందన్నారు. -
జాతీయ పార్టీగా మారనున్న తెలుగుదేశం!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారనుంది. ఈ నెల 28న టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికకానున్నారు. హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు టీడీపీ 'మహానాడు' జరగనుంది. ఈ సమావేశాల్లో టీడీపీ జాతీయ పార్టీగా ప్రకటించకోనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 14, తెలంగాణ నుంచి 10 తీర్మానాలను టీడీపీ నేతలు ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో ప్రభుత్వ పథకాలు, తెలంగాణలో ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరగనుంది. మహానాడుకు దాదాపు 25 వేలమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. -
టీఆర్ఎస్ వైపు మాధవరం చూపు!
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేరిస్తే టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమని ఆయన సోమవారం మీడియాకు తెలిపారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను ఎన్టీఆర్ భవన్లో కలసిన మాధవరం పార్టీ తెలంగాణ నేతల తీరుపై ఫిర్యాదు చేశారు. బీసీ కులాల జాబితా నుంచి తొలగించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 కులాల విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని తాను అసెంబ్లీలో ప్రస్తావించినా టీడీపీ ఎమ్మెల్యేల నుంచి మద్దతు రాలేదని, ఎవరికి వారే ఎప్పుడు టీఆర్ఎస్లో చేరుదామా అనే ఆలోచనలో ఉన్నారని, అందరూ ఆ పార్టీతో టచ్‌లో ఉన్నారని లోకేశ్‌కు తెలిపారు. తెలంగాణలో పార్టీ బతకాలని టీ నాయకులెవరికీ లేదని, ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారని చెప్పారు. ‘నాకు పార్టీ మారే ఆలోచన లేదు...మన పార్టీ వారే అలా ప్రచారం చేస్తున్నారు. ఆ ఆలోచనే ఉంటే మిమ్మల్ని ఎందుకు కలుస్తాను’ అని లోకేశ్‌కు వివరించినట్టు సమాచారం. -
తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ
తిరుపతి: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ పేరును సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. సుగుణమ్మ తిరుపతి నియోజక వర్గ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ భార్య. నారావారిపల్లెలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికపై చర్చించారు. ఈ ఎన్నిక ఏకగ్రీవం కోసం ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరపాలని పార్టీ నాయకులను ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు.