చిత్తూరు: అధికారంలో ఉన్నా బీజేపీ కార్యకర్తలకు ఇబ్బందులు తప్పడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం చిత్తూరుకు వచ్చిన మంత్రి స్థానిక బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు తమను ఖాతరు చేయడం లేదని, తాము ఏమీ చెప్పినా పరిగణనలోకి తీసుకోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
అందుకు స్పందించిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, బీజేపీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామో.. లేమో తెలియని పరిస్థితిలో ఉన్నామని వ్యాఖ్యానించారు. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవిచ్చిన్నకర శక్తులకు మద్దతు పలుకోందని విమర్శించారు. కన్నయ్యకుమార్‌ను కాంగ్రెస్ హీరోలా చూపిస్తోందన్నారు.
'అధికారంలో ఉన్నా ఇబ్బందులు తప్పడం లేదు'
Published Sun, Apr 3 2016 8:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement