Manikyala Rao Pydikondala
-
మాజీ మంత్రి పైడికొండల కన్నుమూత
సాక్షి ప్రతినిధి, ఏలూరు, తాడేపల్లిగూడెం/సాక్షి నెట్వర్క్: మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు(60) అనారోగ్యంతో కన్నుమూశారు. విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్–19 వైరస్‌తోపాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మధుమేహం ఆయన ఆరోగ్యాన్ని కుంగదీశాయి. గత నెల 3వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ రాగా, ఈ వ్యాధికి భయపడాల్సిందేమి లేదని, ఆరోగ్యంగా తిరిగి వస్తానంటూ వీడియో సందేశం ఇచ్చి ఆసుపత్రికి వెళ్లారు. పది రోజులక్రితం పరీక్షించగా కరోనా నెగిటివ్ వచ్చింది. మనోధైర్యంతో పోరాడి కరోనాను జయించి నప్పటికీ.. ఇతర సమస్యల కారణంగా శనివారం ఒక్కసారిగా ఆరోగ్యంలో మార్పు రావడంతో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన భౌతిక కాయానికి తాడేపల్లిగూడెం మామిడాల చెరువు వద్ద ఉన్న స్మశానవాటికలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో అంత్యక్రియలు జరిపారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. ప్రధాని మోదీతో మాణిక్యాలరావు (ఫైల్) ఉప రాష్ట్రపతి, గవర్నర్, సీఎం సంతాపం ► మాణిక్యాలరావు మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తన సంతాపం తెలియజేస్తూ.. ఎమ్మెల్యేగా, మంత్రిగా మాణిక్యాలరావు ఏపీకి మంచి సేవలందించారని కొనియాడారు. పైడికొండల మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. ► మాణిక్యాలరావు మృతి పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ థియోధర్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కూడా సంతాపం తెలియజేశారు. స్వయం సేవక్ నుంచి మంత్రి వరకూ.. మాణిక్యాలరావు స్వయం సేవక్‌గా రాష్ట్రీయ స్వయం సేవక్‌లో చురుగ్గా పనిచేస్తూ 1989లో భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ కేబినెట్లో ఆయన దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. -
‘వీడియోలో మాట్లాడినప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నారు’
తాడేపల్లిగూడెం: కరోనా మహమ్మారికి మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు బలికావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సహృదయుడైన మాణిక్యాలరావు మనల్ని విడిచివెళ్లిపోవడం చాలా బాధను మిగిల్చిందన్నారు. మాణిక్యాలరావు మృతివార్తను తెలుసుకుని ఎంతో కలత చెందానన్నారు. మాణిక్యాలరావు మృతిపై కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘క్రమశిక్షణ, నిబద్దత గల మాణిక్యాలరావు.. కరోనా వచ్చినపుడు కూడా ఎంతో మనోధైర్యంతో భయపడకుండా వీడియోలో మాట్లాడారు. (మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత) ఉదయం కూడా వారి అల్లుడి తో ఫోన్ లో మాట్లాడి యోగక్షేమాలు కనుక్కుంటే బాగానే ఉందని చెప్పగా ఎంతో సంతోషపడ్డాం. భారతీయ జనతా పార్టీలో పేరెన్నిన నాయకుడు. ఇలాంటి పరిస్థితుల్లో దూరమవ్వడం చాలా బాధాకరంగా ఉంది. మాణిక్యాలరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని సంతాపం వ్యక్తం చేశారు. ఎంతోమంది కరోనాను జయించి తిరిగి వస్తున్న సందర్భంలో మాణిక్యాలరావు ఇలా మృతి చెందడం విచారించదగ్గ విషయమన్నారు. కొన్ని రోజుల క్రిత కరోనా వైరస్ బారిన పడ్డ పైడి కొండల మాణిక్యాలరావు శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.(‘ఈరోజు ఉదయమే ఆయన కూతురితో మాట్లాడా’) -
‘ఉదయమే ఆయన కూతురితో మాట్లాడా’
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మికంగా లోకాన్ని విడిచివెళ్లిపోవడంపై వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావుగారు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధత గల కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా చిత్తశుద్ధితో ప్రజల సమస్యల పరిష్కారానికి వారు చేసిన కృషి అభినందనీయం. ఈరోజు ఉదయమే వారి కూతురు సింధుతో మాట్లాడి మాణిక్యాలరావుగారి ఆరోగ్యం గురించి వాకబు చేశాను. ఇంతలోనే ఇలా జరగడం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీటర్ ద్వారా వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. పైడికొండ మాణిక్యాలరావు శనివారం కన్నుమూశారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. (మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత) ఈ రోజు ఉదయమే వారి కూతురు సింధుతో మాట్లాడి శ్రీ మాణిక్యాలరావుగారి ఆరోగ్యం గురించి వాకబు చేశాను. ఇంతలోనే ఇలా జరగడం విచారకరం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. — Vice President of India (@VPSecretariat) August 1, 2020 -
మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత
-
మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత
సాక్షి, అమరావతి : బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) మృతిచెందారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి విజయం సాధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేసి.. చివరి వరకూ అదే పార్టీలో కొనసాగారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత బాధాకరం : డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రా o తి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడును ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. ‘సౌమ్యుడు.. మంచివారు. సుమారుగా మూడున్నర దశబ్దాల పాటు ప్రజా జీవితంలో నిబద్దత.. నిజాయితీగా అంకిత భావంతో పని చేసిన నాయకుడు. పశ్చిమగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రములోనే మంచి గుర్తింపు కలిగిన నాయకుడు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని సమయంలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంలో పెద్దలతో ఉన్న పరిచయంతో తాడేపల్లి గూడెంలో నిట్ విద్యా సంస్థ నెలకొల్పడం లో పైడికొండల కీలక పాత్ర పోషించారు. సేవా భావం...ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించే వ్యక్తి మాణిక్యాలరావు మృతి తీరని లోటు’ అని విచారం వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు మృతి బాధాకరం: సోము వీర్రాజు 1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేశారు. జిల్లాస్థాయి నాయకుడి నుంచి మంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా మాణిక్యాలరావు ఎదిగారు. నేటి రాజకీయాల్లో విలువలతో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం పని చేసిన వారి పదవులు వస్తాయని చెప్పేందుకు మాణిక్యాలరావు ఉదాహరణ. దేవదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని అనేక ఆలయాలు అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు బీజేపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆకస్మిక మరణం పట్ల సంతాపం : ఎంపీ జీవీఎల్ బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర మంత్రి, స్నేహ శీలి, ఆప్త మిత్రులు మాణిక్యలరావు చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. ఇది మా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు అత్యంత బాధాకర పరిణామం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాను. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన మరణం బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటుగా చిరకాలం మిగిలి పోతుంది. ఆయన మరణం పట్ట చింతిస్తున్నా.. విష్ణువర్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాల రావుగారు మరణం రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి తీర్చలేనిది. 20 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి పనిచేసిన సమయంలో వారికి పార్టీ పట్ల నిబద్ధత క్రమశిక్షణ అంకిత భావాన్ని నేను మర్చిపోలేను. వారు నేడు మామధ్య లేరనే విషయాన్ని సగటు కార్యకర్తగా జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. సందర్భంగా వారి మరణానికి చింతిస్తూ నివాళులర్పిస్తున్నాను. మాజీ మంత్రి మాణిక్యాల రావు మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాణిక్యాలరావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు ప్రజలకు తీరని లోటు : కృష్ణం రాజు మాజీ మంత్రి మాణిక్యాలరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మొదలయి అంచలంచలుగా ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడు మాణిక్యాలరావు. భారతీయ జనతా పార్టీకి ఆయన చేసిన సేవను మరువలేము. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. -
అచ్చెనాయుడు వందలకోట్లు దోచుకున్నారు
-
'మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారు'
సాక్షి, తాడేపల్లిగూడెం : మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, బీజేపీలో గుర్తింపుకోసం చవకబారు ప్రకటనలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శనివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు మర్చిపోవడంతో ఏదోక రకంగా గుర్తింపు కోసం సంబంధం లేకుండా మాణిక్యాలరావు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లు చూసి బీజేపీ మర్చిపోతుందేమోనన్న భయంతో అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ2 లా వైఎస్సార్సీపీ మారిందని మాణిక్యాలరావు అనడం విడ్డూరంగా ఉందన్నారు. దేవదాయ శాఖ భూముల్ని తాడేపల్లిగూడెంలో ఆక్రమించి అమ్ముకొని, వాటాలు తీసుకోవడం మినహా ఆ శాఖ అభివృద్ధికి ఆయన చేసింది సున్నా అని అన్నారు. దేవదాయ శాఖ భూముల్ని పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. కార్పొరేట్ ద్రోహులను కాపాడుతున్నారు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాష్ట్రంలో పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉందని చెబుతుంటే మాణిక్యాలరావు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. రివర్స్ టెండరింగ్ విధానంపై అవగాహన లోపంతో మాట్లాడుతున్నారన్నారు. రాజధాని భూములపై అప్పటి సీఎం చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడితే చోద్యం చూశారని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే వలంటీర్ల వ్యవస్థని కించపర్చేలా మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ ద్రోహులను కాపాడుతున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. అవినీతికి చిరునామాగా మారిన టీడీపి ఎంపీలను చేర్చుకొని రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎరువుల మాఫియాకు, దొంగనోట్లు మార్చే వారికి మాత్రమే మాణిక్యాలరావు న్యాయం చేశారన్నారు. అధికారం ఉన్న సమయంలో అహంకారంతో అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టించిన సంగతులు మరిచిపోయి రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం దృష్టికి గోయంకా కళాశాల అంశం పట్టణంలోని డీఆర్ గోయంకా మహిళా కళాశాల విషయంపై సీఎంతో మాట్లాడానని ఎమ్మెల్యే కొట్టు తెలిపారు. ఈ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారని, దాతల మనోభావాలు, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రయత్నాలు జరుగుతాయన్నారు. ఎస్టీవీఎన్ హైస్కూలు విషయంపై పరిశీలన చేస్తున్నామన్నారు. ఎస్వీ రంగారావు విగ్రహ ఆవిష్కరణకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నామన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో సినీనటుడు చిరంజీవి తనతో పలుమార్లు మాట్లాడారని, అక్టోబరు మొదటి వారంలో ఆవిష్కరణ జరగవచ్చన్నారు. విలేకర్ల సమావేశంలో పార్టీ నాయకులు కర్రి భాస్కరరావు, నిమ్మల నాని, కొట్టు విశాల్, గుండుబోగుల నాగు, గొర్రెల శ్రీను, మానుకొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా..!
సాక్షి, తాడేపల్లిగూడెం: బీజేపీలో గుర్తింపు కోసమే మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..తాడేపల్లిగూడెంలో దేవాదాయ భూములను విచ్చలవిడిగా ఆక్రమించుకుని అమ్ముకున్న మాణిక్యాలరావు.. వాటాలు తీసుకోవడం మినహా ఆ శాఖ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు. దేవాదాయ శాఖ భూములను ప్రజలకు పంపిణీ చేస్తామని ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదని స్పష్టం చేశారు. బీజేపీ.. టీడీపీ ఎజెండాను మోస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి ఐవైఆర్ కృష్ణారావు చెబుతుంటే.. మాణిక్యాల రావు మాత్రం గుర్తింపు కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా..! వైఎస్ జగన్ పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు కితాబునిస్తుంటే.. మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని భూములపై చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి ట్రేడింగ్ వ్యవహారానికి తెర లేపితే చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా అని నిప్పులు చెరిగారు. జన్మభూమి కమిటీలు, వాలంటీర్ల వ్యవస్థ ఒక్కటేనంటూ అహగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాణిక్యాలరావును విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో అందించే వాలంటరీ వ్యవస్థ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపించారు. అవినీతికి కేరాఫ్ అడ్రసుగా మారిపోయిన టీడీపీ ఎంపీలను బీజేపీలో సభ్యులుగా చేర్చుకొని రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎరువుల మాఫియాకు, దొంగనోట్లు మార్చే వ్యక్తులకు మాత్రమే మాణిక్యాలరావు న్యాయం చేశారని ఎమ్మెల్యే సత్యనారాయణ ఎద్దేవా చేశారు. -
‘ఇంకో మూడు నెలల్లో టీడీపీ శాశ్వతంగా మూతే’
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి నూకలు దగ్గర పడ్డాయని, మరో మూడు నెలల్లో ఆ పార్టీ శాశ్వతంగా మూతపడుతుందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదని అన్నారు. రాజధాని మార్పు విషయంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొందని, వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని మార్పుపై స్పష్టత నివ్వాలని కోరారు. -
ఎన్నికల ఫలితాల్లో చంద్రబ్బబుకు భంంగపాటు తప్పదు
-
2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఖాయం
అన్నవరం (ప్రత్తిపాడు): 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పది లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోతుందని దేవదాయ, ధర్మదాయ శాఖ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పి.మాణిక్యాలరావు అన్నారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో శ్రీసత్యదేవుని దర్శించి పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పారన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనుక కేంద్ర నిధులు ఉన్నాయన్నారు. ప్రధాని పర్యటనను ఎవరూ అడ్డుకోలేరు... జనవరి ఆరో తేదీన గుంటూరులో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభ జరిగి తీరుతుందని, ఈ సభను ఎవరూ అడ్డుకోలేరని మాణిక్యాలరావు అన్నారు. ఆయన దేశం మొత్తానికి ప్రధాని అని ఎక్కడైనా సభ పెట్టుకునే అధికారం ఆయనకు ఉంటుందన్నారు. ప్రధాని బహిరంగ సభకు భద్రత, తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. సమావేశంలో పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్ చిలుకూరి రామ్‌కుమార్, అన్నవరం దేవస్థానం ట్రస్టీ శింగిలిదేవి సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘మాణిక్యాలరావు గృహనిర్బంధం చట్ట విరుద్ధం’
సాక్షి, అమరావతి : బీజేపీ నేతలు పైడికొండల మాణిక్యాల రావు గృహ నిర్బంధం.. కన్నా లక్ష్మీ నారాయణ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ నాయకులు ఖండించారు. అనంతరం డీజీపీని కలిసి.. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సత్యమూర్తి విలేకరులతో మాట్లాడుతూ.. స్పీకర్ అనుమతి లేకుండా మాణిక్యాలరావుని గృహ నిర్బంధం చేయడం చట్ట విరుద్ధమన్నారు. దేశమంతా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటున్న సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారంటూ మండి పడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. బాబు చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తామని డీజీపీ హామీ ఇచ్చారన్నారు. -
మణిక్యాలరావును హౌస్అరెస్ట్ చేసిన పోలీసులు
-
‘ఐటీ దాడులంటే అంత భయమేందుకు బాబు..’
సాక్షి, తాడేపల్లి గూడెం : ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు.. ఎన్నికల్లో పంచడం కోసం దాచుకున్న డబ్బులు బయటపడతాయనా అంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాల రావు ప్రశ్నించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు కనీసం 10శాతం ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. టీడీపీకి పూర్తిగా అండగా నిలబడిన పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఇప్పటికైన పశ్చిమ నేతలు బాబుకు భజన చేయడం ఆపితే మంచిదని వ్యాఖ్యనించారు. గోదావరి జిల్లాలలో విద్యావ్యవస్థపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని.. గోదావరి ఆధునీకికరణను కూడా పట్టించుకోలేదని.. వీటన్నింటికి బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరుతో బాబు రైతులను అప్పుల్లో ముంచేత్తారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులను పట్టించుకోని టీడీపీ ఇప్పుడు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి పేరుతో కొత్త నాటకానికి తెర తీసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు.. ఎన్నికల కోసం దాచుకున్న డబ్బులు బయటపడతాయనా అంటూ మాణిక్యాలరావు ప్రశ్నించారు. -
గవర్నర్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు
-
అది చంద్రబాబుకే నష్టం: సోము వీర్రాజు
సాక్షి, హైదరాబాద్ : చట్టం తమ చేతుల్లో ఉందనే వైఖరిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. అలిపిరి దాడి ఘటన చంద్రబాబు కుట్రేనని ఆయన ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల మీద భౌతిక దాడులు చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. దాడులకు పాల్పడితే చంద్రబాబుకే నష్టమన్నారు. తమ డిమాండ్లపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కాగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై దాడి తర్వాత, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టడంపై వారు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అమిత్ షా పర్యటన అనంతరం జరిగిన సంఘటనలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. గవర్నర్‌ను కలిసినవారిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీమంత్రి, ఎమ్మెల్యే మాణిక్యాలరావు, దినేష్ రెడ్డి ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే అమిత్ షా పై దాడి గవర్నర్‌తో భేటీ అనంతరం మాణిక్యాలరావు మాట్లాడుతూ... ‘ఉద్దేశపూర్వకంగానే అమిత్ షా మీద దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. అమిత్ షా కు రక్షణగా ఉన్న మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని ...తమ అధికారంతో తుంగలోకి తొక్కుతున్నారు. చంద్రబాబు దుశ్చర్యను తిప్పికొడతాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి వ్యక్తిని బీజేపీతో లింక్ పెడుతున్నారు. టీటీడీలో అక్రమాలు జరిగాయంటే... అది పట్టించుకోకుండా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. టీటీడీలో అక్రమాలపై దర్యాప్తు చేయకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. విచారణ పారదర్శకంగా జరిపించాలి.’ అని డిమాండ్ చేశారు. -
జాతీయ అధ్యక్షుడికే రక్షణ లేకపోతే..
సాక్షి, పశ్చిమగోదావరి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణుల చేసిన రాళ్ల దాడి దారుణమని మాజీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. జాతీయ అధ్యక్షుడికే రక్షణ లేకపోతే.. సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై గవర్నర్ వెంటనే సమీక్షించి.. శాంతి భద్రతల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను మాజీ మంత్రి మాణిక్యాలరావు కోరారు. ఈ ఘటనను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. అధికార టీడీపీపై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలు తెలిపి, గో బ్యాక్ నినాదాలు చేశారు. అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర షా కాన్వాయ్‌పై రాళ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే. -
పవన్ ఒక సినిమాలో నటిస్తే 10 నుంచి 30 కోట్లు..
తాడేపల్లిగూడెం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు పంచాయితీ కార్యాలయంలో జరిగిన సభలో పవన్, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావులపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాలుగు సంవత్సరాల క్రితమే బీజేపీ నుంచి బయటకు వచ్చేసివుండవలసింది అని పవన్ కల్యాణ్ అంటున్నాడు..అది మూర్ఖత్వంగా అనిపిస్తోందన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లింది రాష్ట్రాభివృధ్ధికోసమే..ఎన్నాళ్లని కాళ్లు పట్టుకుంటాం..అందుకోసమే పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ.. ‘ నీకేమయ్యింది ఒక సినిమాలో నటిస్తే 10 నుంచి 30 కోట్ల రూపాయలు వస్తాయి. నువ్వు నీ పెళ్లాలు సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు నష్టపోతారు. మిత్రధర్మం ముగిసిన తర్వాత మా కార్యకర్తలను కాపాడుకోవాలి కదా అందుకే తాడేపల్లిగూడెం వచ్చాను. నన్ను అడగకుండా నా నియోజకవర్గానికి రావద్దని మాణిక్యాల రావు అనేవారు. మిత్ర ధర్మం ముగిసిపోయింది. ఇక నుంచి 15 రోజుల కొకసారి తాడేపల్లిగూడెం వస్తాను. ఇక్కడి కార్యక్రమాలు నా భుజాన వేసుకుంటాను. మాణిక్యాల రావు నిన్న మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అంతులేని అవినీతి జరిగిందని, లోకేష్ ఎన్నోకోట్ల రూపాయలు తినేశాడని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడని, ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ చెబితే కానీ అవినీతి నీకు కనపడలేదా ? నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ప్రక్కన మంత్రిగా పనిచేసినపుడు కనపడని అవినీతి మంత్రి పదవి పోగానే తెలిసిందా. పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఎంక్వైరీ వేయమంటావా, నీకు దమ్ముంటే అవినీతి నిరూపించు, దేవాదాయశాఖ మంత్రిగా నీకు భక్తి ఉంటే రుజువు చెయ్. రాజకీయాలు వదలి మేము వెళ్లిపోతాం’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి
-
కాపు నేతకే ఏపీ బీజేపీ పగ్గాలు
-
ఆపరేషన్ ద్రవిడ వెనుక ఎవరున్నారు..
సాక్షి, అమరావతి: హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని ఏపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు డీజీపీని కోరారు. ఈ మేరకు డీజీపీ మాలకొండయ్యకి ఆయన లేఖ రాశారు. ఆపరేషన్ ద్రవిడ పేరుతో కుట్రలు జరుగుతున్నాయన్న అపోహలు ప్రజలకు పోవాలంటే విచారణ జరిపించాలన్నారు. ఆపరేషన్ ద్రవిడ కోసం రూ.4800 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ శివాజీ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. శివాజీ మాటల ప్రకారం ఏపీలో అరాచకాలు, కుట్రలు జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందని.. అందుకే ఆపరేషన్ ద్రవిడ వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకు తెలియాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని లేఖలో డీజీపీని కోరినట్లు మాణిక్యాలరావు వివరించారు. సినీ నటుడు శివాజీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఓ జాతీయ పార్టీ ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టబోతోందని శివాజీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ ద్రవిడ’లో ఇదొక భాగమన్నారు. ఏపీ, తెలంగాణకు చెంది ‘ఆపరేషన్ గరుడ’.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ రావణ’.. కర్ణాటకలో ‘ఆపరేషన్ కుమార’ను ఆ పార్టీ చేపట్టబోతోందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు అనుసంధానకర్తగా ఓ రాజ్యాంగ శక్తి వ్యవహరిస్తోందన్నారు. ఫలితంగా ఆయన పదవీ కాలం పొడగించబోతున్నారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం రూ.4,800 కోట్లు కేటాయించారని, ఇందులో సగం ఇప్పటికే పంపిణీ జరిగిందంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. -
బీజేపీ మంత్రుల రాజీనామా
సాక్షి, అమరావతి: బీజేపీకి చెందిన మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీని వాస్‌లు గురువారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఉదయం అసెంబ్లీలో సీఎంను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించేందుకు భేటీ అయిన మంత్రివర్గ సమావేశానికి ఇరువురు మంత్రు లు హాజరు కాలేదు. తర్వాత సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విష్ణుకుమార్‌రాజు, సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, పీవీఎన్ మాధవ్‌లతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఇరువురు నేతలు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. వీరి రాజీనామాలను ఆమోదించాలని సీఎం చేసిన సిఫార్సును గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. కొంత మంది రాజకీయాల్లో ఎంట్రీ చాలా బాగుంటుంది కానీ ఎగ్జిట్ బాధగా ఉంటుందని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన అనంతరం కామినేని అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో విధిలేని పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలోనూ, తర్వాత కూడా వెంకయ్యనాయుడును చాలామంది ద్రోహిగా చిత్రీకరించడం బాధగా ఉందని పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ఎంతో చేశారని, దేశంలోనే ఎక్కువ గ్రామాలు తిరిగిన ఘనత ఆయనదని, అలాంటి వ్యక్తిని కూడా ద్రోహిగా పేర్కొనడం దారుణమన్నారు. -
ఏపీ మంత్రుల రాజీనామాలు ఆమోదం
సాక్షి, అమరావతి : ఏపీ కేబినెట్ నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు సమర్పించిన రాజీనామాలు ఆమోదం పొందాయి. బీజేపీ మంత్రుల రాజీనామాలు గవర్నర్ నరసింహన్ ఆమోదించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ అంగీకరించినట్లు సీఎం కార్యాలయానికి సమాచారం అందింది. కాగా, టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిల రాజీనామాలు ఆమోదం పొందాయా.. లేదా అనేది తమకు తెలియదని పరకాల చెప్పారు. 'ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణలో సీఎం చంద్రబాబు పూర్తి వివరాలు తెలిపారు. మా డిమాండ్లపై కేంద్రం అవమానకరంగా వ్యవహరించడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్రుల అందరి హక్కు. వీటిపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అవమానకరంగా వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ ప్రజలు అసహనంతో ఉన్నారని' పరకాల తెలిపారు. కాగా, నేటి ఉదయం కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు ఏపీ కేబినెట్ నుంచి వైదొలగిని విషయం తెలిసిందే. ఆ మేరకు తమ రాజీనామా లేఖలను బీజేపీ నేతలు గురువారం ఉదయం అసెంబ్లీలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు. సీఎం ఛాంబర్లో కామినేని భేటీ అయి రాజీనామా లేఖ ఇచ్చారు. రాజీనామా లేఖ ఇచ్చిన మూడు నిమిషాల్లోనే మంత్రి మాణిక్యాలరావు వెనుదిరిగారు. బీజేపీ మంత్రులు తమ అధికారిక వాహనాలు, ఐడీ కార్డులను సంబంధిత అధికారులకు అప్పగించారు. -
‘టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం’
సాక్షి, అమరావతి : రాజ్యసభలో మొదట హోదా గళం వినిపించింది వెంకయ్యనాయుడేనని, చంద్రబాబు అప్పుడు నోరుమెదపలేదని మంత్రి పదవికి రాజీనామా చేసిన మాణిక్యాలరావు అన్నారు. ఏపీకి అండగా నిలవాలన్న తమ పార్టీని దోషిగా చూపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విభజన ద్వారానే రాష్ట్రానికి మేలు జరిగిందన్నారు. బీజేపీని నిందిస్తూ టీడీపీ చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొడతామని చెప్పారు. తాను మంత్రి అయ్యేందుకు వెంకయ్యనాయుడే కారణమని అన్నారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్నందుకే తాము రాజీనామా చేశామని చెప్పారు.మంత్రిగా తాను అవినీతికి తావివ్వలేదని తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హోదాకు దీటుగా ప్యాకేజితో ఏపీని ఆదుకునేందుకు బీజేపీ ముందుకొచ్చిందన్నారు. ఏపీ అభివృద్ధికి మోదీ సహకరిస్తారని చెప్పుకొచ్చారు. మంత్రి పదవికి రాజీనామా చేసినా తన నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరారు. -
బీజేపీ మంత్రుల రాజీనామా
-
ఏపీ: బీజేపీ మంత్రుల రాజీనామా
సాక్షి, అమరావతి : ఏపీ కేబినెట్ నుంచి బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు వైదొలిగారు. రాజీనామా లేఖలను గురువారం ఉదయం అసెంబ్లీలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు. సీఎం ఛాంబర్లో కామినేని భేటీ అయి రాజీనామా లేఖ ఇచ్చారు. రాజీనామా లేఖ ఇచ్చిన మూడు నిమిషాల్లోనే మంత్రి మాణిక్యాలరావు వెనుదిరిగారు. బీజేపీ మంత్రులు అధికార వాహనాలను, ఐడీ కార్డులను వదులుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం తేల్చిచెప్పడంతో కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్న క్రమంలో ఏపీ కేబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు అధిష్టానం ఆదేశాలతో బీజేపీ మంత్రులు సంసిద్ధమయ్యారు. అనుకున్న విధంగా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే సభలోనే మంత్రులు కామినేని, మాణిక్యాలరావు ముఖ్యమంత్రికి తమ రాజీనామా లేఖలను అందచేశారు. -
ఏపీ కేబినేట్‌కు బీజేపీ మంత్రులు రాజీనామా
-
ఏపీ కేబినేట్‌కు బీజేపీ మంత్రులు రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినేట్‌కు భారతీయ జనతా పార్టీ మంత్రులు రాజీనామా చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు గురువారం రాజీనామాలు చేస్తారని తెలిపారు. రేపు జరగనున్న కేబినేట్ భేటీలో కూడా మంత్రులు పాల్గొనరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమేం చేసిందో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కలసి వివరిస్తారని తెలిపారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో బీజేపీ నాయకులు చంద్రబాబు ప్రకటనపై అత్యవసరంగా భేటీ అయ్యారు. -
‘ ఆ మంత్రిని పిచ్చోడని అంటున్నారు’
పశ్చిమ గోదావరి జిల్లా : టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఈ నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయిన బీజీపీ నేత మాణిక్యాల రావు మీద టీడీపీ నేత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మండిపడ్డారు. మంత్రి మాణిక్యాల రావును ఆయన నియోజకవర్గ ప్రజలు పిచ్చోడని అంటున్నారని బాపిరాజు ఎద్దేవా చేశారు. నిట్‌కు సంబంధించి శంకుస్థాపన సమయంలో వేసిన శిలాఫలకం మినహా ఇప్పటి వరకూ ఒక్క రాయి కూడా వేయలేని అసమర్ధుడు మంత్రి మాణిక్యాల రావు అని సంబోధించారు. మంత్రి గారి అనుచరుల వల్లే అవినీతి పెరిగిందని ఆరోపించారు. ఆరుగోలను గ్రామంలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమంలో మంత్రి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తాడేపల్లి గూడెం, నల్లజర్ల మండలాల్లో జరిగిన అభివృద్ధి దేశవ్యాప్తంగా మరెక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. తాను అవినీతి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. -
బీజేపీని టీడీపీ వదులుకునే అవకాశం లేదు
-
మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : టీడీపీతో పొత్తుపై బీజేపీ నేత మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో విడిపోతే టీడీపీకే ఎక్కువ నష్టమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని టీడీపీ వదులుకునే అవకాశం లేదని చెప్పారు. టీడీపీ తమపై దుష్ప్రచారాం చేస్తోందని, దానిని తాము తిప్పికొడతామని అన్నారు. తమ అధిష్టానానికి తాము రెండు ఆప్షన్లు ఇచ్చామని స్పష్టం చేశారు. టీడీపీతో తెగదెంపులు చేసుకోకమునుపే తాము ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశామో చెబుతామని, ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. అలా కుదరకుంటే ఒకసారి ఏపీ బడ్జెట్ సమావేశాల్లోపే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని తీసుకొచ్చి ఇప్పటి వరకు ఏపీకి ఇచ్చిన నిధుల గురించి చెప్పిస్తామని తెలిపారు. -
హరిబాబు వర్సెస్ లక్ష్మీపతి
-
మంత్రి తన మాటలు వెనక్కి తీసుకోవాలి
-
'ఆ మంత్రిని ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అనలేదు'
సాక్షి, తాడేపల్లిగూడెం: మంత్రి మాణిక్యాలరావును ఉద్దేశించి తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, మాణిక్యాలరావును ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని అనలేదని, ఆఫ్టర్ ఫొటోగ్రాఫర్ మంత్రి అని మాత్రమే అన్నానని తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రే తమను ఉద్దేశించి ఆఫ్ట్రాల్ కౌన్సిలర్లు అని ఎద్దేవా చేశారని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ముదురుతున్న సంగతి తెలిసిందే. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు మద్దతుగా మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపై విమర్శలు చేశారు. ఆయనను ఉద్దేశించి ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని పేర్కొనడం దుమారం రేపింది. బొలిశెట్టి వ్యాఖ్యలపై స్పందించిన మాణిక్యాలరావు.. తాను నిరంతర శ్రామికుడినని, అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చానని అన్నారు. ‘నన్ను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని మున్సిపల్ చైర్మన్ కామెంట్ చేశాడు. అవును నేను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్‌నే. నేను ఈరోజుకీ ఫోటోగ్రాఫర్‌ననే అందరికీ చెప్తా. 24 గంటల్లో 18 గంటలు పనిచేసే నిరంతర శ్రామికుడిని. కష్టపడ్డావోడు సిగ్గుపడక్కర్లేదు, కన్నాలేసేవాడే సిగ్గుపడాలి. నాపై కామెంట్లు చేస్తున్న నీవు నీ చరిత్ర ఏంటో తెలిసుకో, నేను నీ చరిత్ర బయటకు తీయడానికి క్షణం పట్టదు. నీకు దమ్ముంటే నా చరిత్ర గురించి తెలుసుకో. నువ్వెంత వెతికినా నా వెనుక నా కష్టమే కనపడుద్ది. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఫోటోగ్రాఫర్‌గా పనిచేసి అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చా. నేను ఫొటోగ్రాఫర్‌కు ఫొటోగ్రాఫర్‌ని, ఆటోడ్రైవర్‌కు ఆటో డ్రైవర్, కూలీకి కూలీని. నేనెప్పుడూ కష్టపడే జీవినే, నిరంతర శ్రామికుడినని గర్వంగా చెబుతాన’ని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. -
ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
మంత్రి మాణిక్యాలను బర్తరఫ్ చేయాలి
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావును బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాంత్రిక పూజలు ఎవరికోసం చేశారో చెప్పాలని కోరారు. తాంత్రిక పూజల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ప్రధాని నరేంద్ర మోదీ కంట్రోల్ చేస్తున్నారని, మోదీ నియంత పోకడలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయని, మోదీకి అనుకూలంగా లేకపోతే సీబీఐతో దాడులు చేయించటం పరిపాటిగా మారిందన్నారు. -
గజల్ కు మద్దతు.. మాట మార్చేశారు!
సాక్షి, తాడేపల్లిగూడెం : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గజల్ గాయకుడు శ్రీనివాస్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట మార్చారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్‌పై నిప్పులు చెరిగారు. చిన్ననాటి నుంచి బాగా తెలిసిన వ్యక్తి కావటంతో శ్రీనివాస్‌పై ఆరోపణలను ఖండించానని ఆయన తెలిపారు. అయితే మహిళల పట్ల అతని వికృత చర్యలు చాలా బాధించాయని మంత్రి చెప్పుకొచ్చారు. గజల్ అనే నాణానికి ఇంతకాలం ఒకవైపే చూశా కానీ, రెండోవైపు కోణం చాలా జుగుప్సాకరంగా ఉందంటూ మంత్రి వ్యాఖ్యానించడం విశేషం. కాగా, నిన్న ఇదే మాణిక్యాలరావు గజల్ చాలా మంచి వ్యక్తి అని.. అతనిపై కావాలనే కుట్ర చేశారంటూ మద్దతు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో మీడియాపైనే ఆయన చిర్రుబుర్రులాడారు కూడా. -
మంత్రితో వేగలేం
తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లను జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి పోగొడతారేమోనన్న అనుమానం వస్తోందని తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 15వ వార్డులో టీడీపీ అధికారిక కౌన్సిలర్‌ను కాదని ప్రతిపక్ష పార్టీవారికి ప్రాధాన్యత ఇస్తున్నందుకు నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్టు చుక్కా కన్నమనాయుడు రాజీనామా పత్రాన్ని మున్సి పల్ చైర్మన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 15వ వార్డులో మంత్రి మాణిక్యాలరావు ఓటమికి పనిచేసిన వారికి మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ కౌన్సిలర్ రాజీనామా చేస్తున్నారన్నారు. కౌన్సిలర్‌కు తెలియకుండా మంత్రి అనుచరులు ప్రతిపక్ష పార్టీ వ్యక్తి ద్వారా అధికారులను వెంటబెట్టుకుని ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఇది ఎంత వరకు సమంజసమన్నారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి వరకు ఎన్నిక విధానం ఒకటేనన్నారు. ఎవ్వరికైనా ప్రజలు ఓట్లేసి నెగ్గించాలి్సందేనన్నారు. ఎంపీ సీట్లో మంత్రి కూర్చోలేరు. మంత్రి సీట్లో ఎంపీ కూర్చోలేరు. నా సీట్లో ఎమ్మెల్యే వచ్చి కూర్చోలేరని బొలిశెట్టి అన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలన్నారు. మంత్రిని గౌరవిస్తూ వస్తున్నామన్నారు. ప్రతీ అభివృద్ధి పనికి మంత్రి మాణిక్యాలరావుకు సహకరిస్తున్నామని ఆయన అన్నారు. కౌన్సిలర్లు కలిసిఉండటం మంత్రికి ఇష్టంలేదన్నారు. గతంలో నలుగురు బీజేపి కౌన్సిలర్లకు 40 లక్షల రూపాయల నిధులు ఇచ్చారు. ఇటీవల సీఎం ఇచ్చిన కోటి రూపాయల నిధులను ఆరుగురు కౌన్సిలర్లకు మంత్రి ఇచ్చారన్నారు. కనీసం మునిసిపల్ చైర్మన్‌కు, అధికారులకు తెలియకుండా మంత్రి ఇలా నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. మంత్రి ఈ విధంగా పంచుకుంటూ వెళితే మిగిలిన కౌన్సిలర్లకు ఏం సమాధానం చెప్పాలన్నారు. సీఎం గూడెంకు సంబంధించిన పనులు, నిధులు నాకు అప్పగిస్తే మంత్రి ఎలా ఫీలవుతారో.. తనకు తెలియకుండా మున్సిపాలిటీలో నిధులు, పనులు చేస్తే తాను కూడా అదేవిధంగా ఫీలవుతానన్నారు. అవసరమైతే సామూహిక రాజీనామా మంత్రి మాణిక్యాలరావు వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే తేల్చుకుంటామని బొలిశెట్టి చెప్పారు. ఈ మేరకు కౌన్సిలర్లతో కలిసి విజయవాడ బయలుదేరి వెళ్లారు. సీఎం కనుక మాణిక్యాలరావు కరెక్టు అని చెబితే ఆయన చేతికే రాజీనామా సమర్పించి వస్తానని చైర్మన్ స్పష్టం చేశారు. మంత్రి వైఖరికి నొచ్చుకొని రాజీనామా చేసిన చుక్కా కన్నమనాయుడు రాజీనామాను ఆమోదిస్తే. ఆయనకు మద్దతుగా సామూహిక రాజీనామా చేస్తామని బొలిశెట్టి చెప్పారు. సమావేశంలో వైస్‌చైర్మన్ కిల్లాడి ప్రసాద్ , టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
టీడీపీ మంత్రుల మధ్య బెల్ట్ వార్
-
‘బెల్టు’ తీయాల్సిందే
తాడేపల్లిగూడెం : పేదల ప్రాణాలను బలిగొంటున్న బెల్టు షాపులను తక్షణం మూసివేయాల్సిందేనని, అధికారులు స్పందించకుంటే పోలీసు విధులను నియోజకవర్గంలో తానే నిర్వహిస్తానని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు బెల్టు షాపుల రద్దుపై చాలా స్పష్టంగా ఉన్నారన్నారు. బెల్టు దుకాణాల కారణంగా తమ కుటుంబాలు నాశనమవుతున్నాయని అనేకమంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. బెల్టుషాపులను తొలగించాలని ఎక్సైజ్ అధికారులకు స్పష్టంగా ఆదేశాలిచ్చామన్నారు. మద్యం మహమ్మారి బారినపడి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో బెల్టు దుకాణాల వల్ల కుటుంబాల ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని తనకు చాలామంది బా«ధితులు వివరించారన్నారు. వీటి నిరోధానికి ఎక్సైజ్ అధికారులు సరైన రీతిలో స్పందించకుంటే నియోజకవర్గంలో బెల్టుషాపుల నిరో«ధానికి తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. బెల్టు షాపుల వివరాలు తెలపండి నియోజకవర్గంలో బెల్టు షాపుల వివరాలను తమకు తెలియచేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. ఏయే ప్రాంతాల్లో మద్యం గొలుసుదుకాణాలు నడుస్తున్నాయో తమ క్యాంపు కార్యాలయంలో వివరాలు తెలియచేయాలన్నారు. మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ యెగ్గిన నాగబాబు. బీజేపీ పట్టణ అ««ధ్యక్షుడు కర్రి ప్రభాకర బాలాజీ, ప్రధాన కార్యదర్శి ఐనం బాలకృష్ణ పాల్గొన్నారు. -
త్వరలో దేవాదాయ శాఖకు వెబ్సైట్
గుంతకల్లు రూరల్: దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్‌సైట్‌ను రూపొం దించి, ఆలయాల సమగ్ర సమాచారాన్ని అందులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. కర్ణాటకలోని సింధనూరులో జరిగిన బీజేపీ సమావేశాలకు హాజరైన ఆయన తిరిగి విజయవాడకు వెళ్తూ మంగళవారం సాయంత్రం గుంతకల్లులోని రైల్వే కోజీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆలయాల నిర్వహణ, ఆదాయ, వ్యయాలు, ఉద్యోగుల పనితీరు, సీసీ కెమెరాల నిఘా విభాగం, తదితర వివరాలతో కూడిన సమగ్ర సమాచారం నిరంతరం అందుబాటులో ఉండేవిధంగా త్వరలో ఒక వైబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆలయాల్లో భక్తుల సంఖ్య ఆధారంగా ఏసీ క్యాడర్లో ఉన్న ఆలయాలను డీసీ క్యాడర్‌లోకి, అదేవిధంగా డీసీ క్యాడర్లో ఉన్న ఆలయాలను ఆర్జేసీ క్యాడర్‌లోకి మారుస్తామని చెప్పారు. కసాపురం దేవస్థానానికి త్వరలోనే టూరిజం ప్యాకేజీ ప్రకటిస్తామని తెలిపారు. -
భార్య గొంతు కోసి పరారైన భర్త
చిలకలూరిపేట(గుంటూరు): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్య గొంతుకోసి పరారైన సంఘటన జిల్లాలోని చిలకలూరిపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని కుమ్మరకాలనీకి చెందిన శిఖ వనజాక్షి(40), మాణిక్యరావు దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసైన మాణిక్యరావు మద్యానికి డబ్బివ్వాలని వనజాక్షిని వేధిస్తున్నాడు. దీనికి ఆమె నిరాకరించడంతో.. ఆమె నిద్రిస్తున్న సమయంలో కొడవలితో ఆమె గొంతు కోసి, అనంతరం కూరగాయలు కోసే కత్తితో ఆమై పై దాడి చేసి చచ్చిందో లేదో నిర్ధరించుకోవడానికి ఆమె ముఖంపై దిండు వేసి హత్యచేశాడు. ఇది గుర్తించిన ఆమె చిన్న కూతురు తండ్రిని అడ్డుకోబోగా.. చేతిలో ఉన్న కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కత్తితో భార్య గొంతు కోశాడు
గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట కుమ్మరిపేటలో ఆదివారం ఉదయం దారుణం జరిగింది. మాణిక్యాలరావు అనే వ్యక్తి కుటుంబకలహాలతో భార్య శిఖా వనజాక్షి (40)ని కిరాతకంగా చంపాడు. నిద్రిస్తున్న వనజాక్షి గొంతుకోసి హత్యచేశాడు. గత కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరిగేవని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు మాణిక్యాలరావు పరారీలో ఉన్నాడు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘నిట్’కు త్వరలో శాశ్వత డైరెక్టర్
తాడేపల్లిగూడెం : ఏపీ నిట్‌కు త్వరలో శాశ్వత డైరెక్టర్ నియామకం కానున్నారని, ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శనివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వరంగల్ నుంచి వచ్చే అడ్‌హక్ ఫ్యాకల్టీల రాకలో ఇబ్బందులు, బోర్డు ఆఫ్ గవర్నెన్స్ తదితర సమస్యలపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిశానన్నారు. నిట్‌కు సంబంధించిన అన్ని సమస్యలను ఆయనకు వివరించానని చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి శుక్రవారం స్పందించారని, నిట్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. నిట్ కార్యకలాపాల కోసం త్వరలో శాశ్వత కమిటీని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. డైరెక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారని, 30 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రాబోయే విద్యాసంవత్సరానికి రెండు వేల మంది విద్యార్థులకు సరిపడే బస, భోజన సదుపాయాల కోసం నిట్ ప్రాంగణంలో తాత్కాలిక నిర్మాణాలు పూర్తికానున్నాయన్నారు. ఆటోనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణానికి స్థలం కేటాయింపు ప్రక్రియ పూరై్తందని మంత్రి చెప్పారు. -
‘నిట్’కు త్వరలో శాశ్వత డైరెక్టర్
తాడేపల్లిగూడెం : ఏపీ నిట్‌కు త్వరలో శాశ్వత డైరెక్టర్ నియామకం కానున్నారని, ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శనివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వరంగల్ నుంచి వచ్చే అడ్‌హక్ ఫ్యాకల్టీల రాకలో ఇబ్బందులు, బోర్డు ఆఫ్ గవర్నెన్స్ తదితర సమస్యలపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిశానన్నారు. నిట్‌కు సంబంధించిన అన్ని సమస్యలను ఆయనకు వివరించానని చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి శుక్రవారం స్పందించారని, నిట్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. నిట్ కార్యకలాపాల కోసం త్వరలో శాశ్వత కమిటీని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. డైరెక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారని, 30 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రాబోయే విద్యాసంవత్సరానికి రెండు వేల మంది విద్యార్థులకు సరిపడే బస, భోజన సదుపాయాల కోసం నిట్ ప్రాంగణంలో తాత్కాలిక నిర్మాణాలు పూర్తికానున్నాయన్నారు. ఆటోనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణానికి స్థలం కేటాయింపు ప్రక్రియ పూరై్తందని మంత్రి చెప్పారు. -
ఫ్లెక్సీ వివాదానికి హత్యాయత్నం కేసా
-
ఫ్లెక్సీల వివాదంలో పోలీసుల అత్యుత్సాహం
ఏలూరు: ఫ్లెక్సీల వివాదంలో తాడేపల్లిగూడెం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ వివాదంలో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సత్యనారాయణ అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఒత్తిడి మేరకే సత్యనారాయణను అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఐని బండ బూతులు తిట్టిన మంత్రి మాణిక్యాలరావును వదిలి.. సత్యనారాయణను అరెస్ట్ చేయడమేంటంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. -
పేరుకే మంత్రి..ప్రాధాన్యత కరువు!!
-
మూడెకరాల భూమి, ఇల్లు కలేనా?
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఇతర పథకాలకు మళ్లింపు నామమాత్రంగా భూ పంపిణీ ప్రభుత్వ మోసాలపై ఉద్యమాలు నిర్మిస్తాం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం 2014 ఆగస్టులో ఆర్భాటంగా ప్రకటించిన దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు కలగానే మిగిలే పరిస్థితి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మాణిక్యం అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన సీపీఎం డివిజన్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో 10 లక్షల దళితు కుటుంబాలు ఉన్నాయని, సీఎం హామీ అమలు కావాలంటే 30 లక్షల ఎకరాల భూమి అవసరమన్నారు. ఇప్పటి వరకు కేవలం 3 వేల ఎకరాల కూడా పంపిణీ చేయలేదన్నారు. జిల్లాలో 16 వేల దళిత కుటుంబాలు ఉంటే కేవలం 550 మందికి మాత్రమే భూమి ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే దళితులు సాగు చేసుకుంటున్న భూములను దళారులు కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల సంగతి అటుంచితే గతంలో నిర్మించుకున్న ఇళ్లకు నేటికీ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దళిత వాడల అభివృద్ధికి కేటాయించాలని, కానీ వీటిని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇతర పథకాలకు మళ్లించి దళితులకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళితులను సంఘటితం చేసి ఉద్యమాలను నిర్మిస్తామని మాణిక్యం హెచ్చరించారు. లాఠీచార్జీ చేసిన పోలీసులపై కేసులు పెట్టాలి శివ్వంపేట మండలం ధర్మా తండాకు చెందిన గిరిజనుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు కబ్జాలకు పాల్పడుతుంటే అడ్డుకున్న గిరిజనులపై కక్షగట్టి అర్ధరాత్రి పోలీసులు తండాపై దాడిచేసి లాఠీచార్జీ శారని మాణిక్యం అన్నారు. అమాయక గిరిజనులపై దౌర్జన్యాలు చేస్తూ 50 మందిపైన కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గిరిజనులపై దాడులకు పాల్పడిన సీఐ, ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చిరంజీవి, నర్సింహులు, సంగమేశ్వర్, రాములు, మోషప్ప, అరుణ్ పాల్గొన్నారు. -
మట్టిలో మాణిక్యం
ఎన్నో షీల్డులు సాధించినా.. ప్రోత్సాహం సున్నా! కూలి చేస్తున్న జాతీయ స్థాయి యోగా క్రీడాకారుడు మెదక్ రూరల్: క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వాలు గ్రామీణ క్రీడాకారుల పట్ల చిన్నచూపే చూస్తున్నాయి. ఎంతో ప్రతిభ గల క్రీడాకారులు ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం లేక అట్టడుగునే ఉండిపోతున్నారు. ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్న క్రీడాకారులు ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణలేక కూలీనాలి చేసుకుంటూ దుర్భర జీవనం సాగిస్తున్నారు. అలాంటి ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన యోగా క్రీడాకారుడు అబ్రబోయిన మల్లేశం. మెదక్ మండలం బూర్గుపల్లి గ్రామానికి అబ్రబోయిన మల్లమ్మ-లింగయ్య దంపతులకు నలుగురు సంతానం. వారిలో చిన్నవాడైన మల్లేశం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి, అక్కడే యోగాపై శిక్షణ పొందాడు. పాఠశాల స్థాయి నుంచే స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి ఎన్నో పతకాలు సాధించాడు. పతకాలు సాధించిన మల్లేశంను చూసి చప్పట్లు కొట్టేవారే కానీ ప్రతిభను ప్రోత్సహించిన వారే లేరు. మరిచిపోయారు. పేదకుటుంబంలో పుట్టిన మల్లేశం అర్థాకలితో అలమటిస్తూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. ప్రస్తుతం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ వరకు చదివిన మల్లేశం ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆరు నెలల క్రితం తండ్రి మరణించగా, అన్నలిద్దరూ బతుకు దెరువుకోసం పొట్ట చేతపట్టుకొని వలస వెళ్లారు. దీంతో మల్లేశం గ్రామంలోని చిన్నపాటి పూరి గుడిసెలో తల్లితోపాటు ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూలీనాలి చేసుకుంటూ తల్లికి తోడుగా ఉంటున్నాడు. రెండుసార్లు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతులు సాధించగా, రాష్ట్రస్థాయి యోగాలో పదిసార్లు పాల్గొనగా 4సార్లు పతకాలు చేజిక్కించుకున్నాడు. 2006లో ఢిల్లీ, 2008లో జార్ఖండ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు, సర్టిఫికెట్లు సాధించాడు. ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తాను నేర్చుకున్న యోగా ప్రతిభను చూపేందుకు అధికారులను పలుమార్లు వేడుకున్నాడు. దీంతో అతనికి ఐదు నిమిషాలపాటు అవకాశం ఇవ్వడంతో వందలాది మంది జనాలు, ఆర్డీఓస్థాయి అధికారులు, వేలాది మంది విద్యార్థులు మల్లేశం ప్రతిభను చూసి ఎప్పటిలాగే చప్పట్లతో సరిపెట్టారు. తన ప్రతిభను చూసైనా తనను ప్రోత్సాహించాలంటూ మల్లేశం పదే పదే వేడుకుంటున్నాడు. ఇంతటి ప్రతిభ గల మల్లేశం పూరిగుడిసెలో కనీసం కరెంట్ వెలుగుకు కూడా నోచుకోకుండా దుర్భర జీవితం గడుపుతున్నాడు. ఇలాంటి మట్టిలోని మాణిక్యాలను మన ప్రభుత్వం గుర్తిస్తే ప్రపంచస్థాయి క్రీడల్లో మనదేశ పేరుప్రతిష్టలను నిలబెడతారని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి: మల్లేశం ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే అంతర్జాతీయస్థాయిలో రాణిస్తా. నిరుపేద కుటుంబంలో పుట్టిన నాకు ఎలాంటి ఆదరణలేదు. నాన్న ఆకాల మరణంతో డిగ్రీకూడా చదవలేని దుస్థితిలో ఉన్నా. నాకు చిన్ననాటి నుండి యోగా అంటే ప్రాణం. అధికారులు, పాలకులు నాకు ప్రోత్సాహం అందిస్తే కఠోరమైన సాధనచేసి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తా.. -
కృష్ణమ్మకు మంత్రి మాణిక్యాలరావు పూజలు
కోడూరు : హంసలదీవి సమీపంలోని పవిత్ర కృష్ణా సాగర సంగమ ప్రాంతం వద్ద రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. సాగర సంగమాన్ని దర్శించడం పూర్వ జన్మ సుకృతమని మంత్రి అన్నారు. నదీమ తల్లికి పసుపు, కుంకుమతో పాటు నూతన వస్త్రాలు సమర్పించారు. రైస్మిలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. పుష్కరాలకు మంచి ఏర్పాట్లు చేశాం విజయవాడ(వన్‌టౌన్) : పుష్కరాలకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసిందని దేవాదాయ ధర్మాదాయ శా మంత్రి పీ మాణిక్యాలరావు అన్నారు. పుష్కరాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆయన దుర్గాఘాట్‌ను పరిశీలించారు. మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడు తూ నీటిలో ఎటువంటి బ్యాక్టిరీయా లేదని అది కేవలం పుకారు మాత్రమేనన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తం చేసినట్లు చెప్పారు. -
సీఎం అలా ఎందుకన్నారో: మాణిక్యాలరావు
నరసాపురం: ‘రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని సీఎం చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయడం లేదంటూ ఆయన ఎందుకు వ్యాఖ్యానించారో అర్థం కావడం లేదు’ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అంత్య పుష్కరాల ప్రారంభ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. -
కేంద్రం సాయం చేస్తున్నదని సీఎం చాలా సార్లు చెప్పారు
‘రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలాసార్లు చెప్పారు. ఆ విషయం అందరికీ తెలసు. మరి రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయడం లేదంటూ ఎందుకు వ్యాఖ్యానించారో అర్ధంకావడం లేదు’ అని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అంత్యపుష్కరాల ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, ఏపీకి అన్యాయం ఏమీ జరగడం లేదని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి అనేక విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రానికి 12 సెంట్రల్ ప్రాజెక్ట్‌లు మంజూరయ్యాయని, వాటిలో ఐదు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలలను ఉద్దేశ పూర్వకంగా, తెలంగాణలో కలిపిన రోజు, కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ చొరవతోనే పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిశాయని స్పష్టం చేసారు. దేశంలో ఏ రాష్ట్రానికి చేయని సాయం మోదీ ఏపీకి చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య దూరం పెరుగుతుందా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. -
'సదావర్తి భూములను మళ్లీ వేలం వేస్తాం'
అద్దంకి(ప్రకాశం): సదావర్తి భూములను గతంలో పాడిన పాట కన్నా ఎక్కువ పాట పాడడానికి ఎవరైనా ముందకు వస్తే, మరలా బహిరంగ వేలం నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. ఇందుకు ఈ నెల 30 వరకు గడువు ఉందని చెప్పారు. ఎక్కువ నగదు వస్తే సంతోషమేనని, ఆ నగదుతో మరిన్ని సేవలను అందిస్తామన్నారు. శనివారం శ్రీశైలం వెళ్తూ మార్గంమధ్యలో ప్రకాశం జిల్లా అద్దంకిలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సదావర్తి భూములను తక్కువకు కట్టబెట్టారని పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. అలా ఎవరికీ కట్టబెట్టలేదని, భూములకు న్యాయబద్ధంగానే బహిరంగ వేలం నిర్వహించి ఎక్కువ పాట పాడిన వారికి ఇచ్చినట్టు చెప్పారు. మొదటి సారిగా 1885 నుంచి ఆక్రమణలో ఉన్న భూములను గుర్తించి వేలం నిర్వహించగలిగామని చెప్పారు. ఆక్రమణల్లో ఉన్న దేవాదాయ శాఖ భూములను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, ఇంకా ఆక్రమణలో ఉన్న భూములను గుర్తించేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తుల సలహాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయ భూములను ఆక్రమించిన వారి పేర్లను ఇప్పటికే దేవస్థానాల వద్ద బోర్డులపై రాసి ప్రదర్శిస్తున్నామని, త్వరలో వెబ్సైట్లో పెడతామని మంత్రి వెల్లడించారు. -
'ఆలయాల కూల్చివేత అంశం సెటిలైపోయింది'
కాకినాడ : కృష్ణ పుష్కరాల పనులు చివరి దశలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో ఈ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. గురువారం కాకినాడలో పి.మాణిక్యాలరావు మాట్లాడుతూ... విజయవాడ నగరంలో ఆలయాల కూల్చివేతలో అధికారుల అత్యుత్సాహంతో పోరపాటు జరిగిన మాట వాస్తవమే అని ఆయన ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని సవరించుకుని కమిటీ వేసిన విషయాన్ని మాణిక్యాలరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఘటనపై మరోసారి మంత్రుల కమిటీ రేపు సమావేశం కానుందని చెప్పారు. ఆలయాల కూల్చివేత అంశం సెటిలైపోయిందని మాణిక్యాలరావు తెలిపారు. -
ఉంగరం కోసం చేతినే కోసేశారు
విశాఖ: నిద్రపోతున్న వ్యక్తి ఉంగరాన్ని అపహరించేందుకు ప్రయత్నించిన దొంగలు ఉంగరం రాకపోవడంతో ఏకంగా కత్తితో చేతినే గాయపరిచి పరారైన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. విశాఖపట్నం రైల్వే న్యూకాలనీకి చెందిన మాణిక్యం.. ఉత్సవం సందర్భంగా కశింకోటలోని అత్తమామల ఇంటికి వచ్చాడు. ఆరుబయట పడుకున్న మాణిక్యంపై రాత్రి 2 గంటల సమయంలో దొంగలు అతని చేతి ఉంగరాన్ని అపహరించేందుకు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఉంగరం రాకపోవడంతో మత్తు మందు చల్లి కత్తితో ఉంగరపు వేలు కోశారు. అయినప్పటికీ రాకపోవడంతో వేళ్ల దిగువ భాగాన్ని కత్తితో కోసి చీల్చేశారు. ఇంతలో మెలకువవచ్చి కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారని బాధితుడు తెలిపాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. వరుస దొంగతనాలతో కశింకోట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
'ఆ ఆవేదన ఏదో ఒకరోజు ఆగ్రహంలా మారుతుంది'
తెనాలి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మాదిగల జపాన్ని చేసి, రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో మాలల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఇచ్చిన హామీలను విస్మరించి మాదిగల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాడని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాదిగ విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీకి అండగా ఉన్న మాదిగలకు అన్యాయం చేస్తు కొందరు మాలసోదరులను అందలం ఎక్కిస్తున్నాడన్నారు. మాదిగలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఆవేదన చెందుతున్నారని, ఆ ఆవేదన ఏదో ఒక రోజు ఆగ్రహంలా మారి టీడీపీని, చంద్రబాబును భూస్థాపితం చేస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాలలకు, దళితులకు నాయకుడి కాని కారెం శివాజీకి అప్పగించి చంద్రబాబు పెద్ద తప్పుచేశారని ఆరోపించారు. ఆయన వల్ల ఎస్సీ, ఎస్టీలకు భవిష్యత్‌లో న్యాయం జరగకపోగా కమిషన్‌ను చంద్రబాబుకు తొత్తులా మార్చుతారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 18, 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయాల వద్ద నిరసనలు, రాస్తారోకోలు చేయాలని, 21న ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దహనాలు, 23న కలెక్టరేట్ల వద్ద అందోళన, సీఎం దిష్టిబొమ్మల దహనాలు చేయాలని శుక్రవారమిక్కడ జరిగిన ఎమ్మార్పీఎస్ అత్యవసర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. మాదిగలు, ఉపకులాలవారు, మేధావులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ, జిల్లా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావుమాదిగ, జిల్లా ఇన్చార్జి షాలెంరాజు మాదిగ, రాష్ట్ర కమిటీ సభ్యుడు చిలకా కిరణ్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
'అధికారంలో ఉన్నా ఇబ్బందులు తప్పడం లేదు'
చిత్తూరు: అధికారంలో ఉన్నా బీజేపీ కార్యకర్తలకు ఇబ్బందులు తప్పడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం చిత్తూరుకు వచ్చిన మంత్రి స్థానిక బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు తమను ఖాతరు చేయడం లేదని, తాము ఏమీ చెప్పినా పరిగణనలోకి తీసుకోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అందుకు స్పందించిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, బీజేపీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామో.. లేమో తెలియని పరిస్థితిలో ఉన్నామని వ్యాఖ్యానించారు. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవిచ్చిన్నకర శక్తులకు మద్దతు పలుకోందని విమర్శించారు. కన్నయ్యకుమార్‌ను కాంగ్రెస్ హీరోలా చూపిస్తోందన్నారు. -
ఉగాది నుంచి ఉచిత ఆలయ దర్శనం
- 1.30 లక్షల మందికి వర్తింపు - కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన దేవాదాయ శాఖ తిరుపతి(చిత్తూరు జిల్లా) ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఆలయ దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆదివారం ప్రకృతి వ్యవసాయ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 1.30 లక్షల మందికి ఐదు మార్గాల ద్వారా రాష్ట్రంలోని ఆలయాలను దర్శించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి భోజనం, వసతి, వాహన సదుపాయం ఉచితంగా ఏర్పాటుచేస్తామన్నారు. ఐదు రూట్లుగా విభజించి ఆలయాల దర్శనానికి ఏర్పాట్లు చేశామన్నారు. -
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
-
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
♦ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి ♦ ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబరు ♦ 1800 425 6656 ప్రారంభం సాక్షి, హైదరాబాద్: పవిత్ర కృష్ణా పుష్కరాలు ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ ప్రారంభమై 23వ తేదీతో ముగుస్తాయని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. పుష్కరాల నేపధ్యంలో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 173 పుష్కర ఘాట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి వివరించారు. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధలతో కలసి మంత్రి శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల నిర్వహణ, పర్యవేక్షణకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థాయిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రుల కమిటీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తారని తెలిపారు. అనంతరం ఆలయాల్లో భక్తులకు ఎదురయ్యే అసౌకర్యాలపై శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరు 1800 425 6656ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇంటి వద్దకే దేవుడి పూజలు తిరుమలలో ఇటీవల జరిగిన హిందూ సాధు సంతుల సమ్మేళనంలో వ్యక్తమైన సూచనల మేరకు పలురకాల సేవలను భక్తుల ఇంటి వద్దకే తీసుకెళ్లాలని దేవాదాయ శాఖ నిర్ణయించినట్టు మాణిక్యాలరావు తెలిపారు. ఈ ఏడాది ఉగాది పండుగ నుంచి ఏడు సందర్భాల్లో గుడి పూజారి.. భక్తుని ఇంటి వద్దకే వచ్చి దేవుడి ఆశీస్సులు అందజేస్తార న్నారు. కొత్త దంపతులకు, గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమం చేసేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, నామకరణం, అన్న ప్రాసన, అక్షరాభ్యాసం వంటి సమయాల్లో గుడి పూజారి దేవుడి పటంతో భక్తుల ఇంటికే వెళ్లి దీవెనలు, అమ్మవారి కుంకుమ అందజేస్తారని తెలిపారు. అలాగే మరణించిన వ్యక్తి ఇంటికి శివుడికి అభిషేకించిన జలాలతో వెళ్లి ఆ ఇంటిని శుద్ధి చేసే కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు.ఆసక్తి ఉన్న వారికి మాత్రమే ఇలాంటి సేవలు అందజేస్తామని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. -
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు 12 వ తేదీ నుంచి పవిత్ర కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 12 వ తేదీన ప్రారంభమై 23 వ తేదీతో ఈ పుష్కరాలు ముగుస్తాయి. పుష్కరాల ఏర్పాట్ల కోసం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాయి. పుష్కరాల కోసం కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొత్తం 173 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు శనివారం వెల్లడించారు. పుష్కరాల కోసం మూడు జిల్లాల్లోని 326 దేవాలయాలను ఆధునీకరిస్తామని చెప్పారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6656 ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇకపోతే దేవాలయాల్లో జరిగే పూజలకు సంబంధించి భక్తుల ఇళ్ల వద్దే దేవుడి ఆశీస్సులు అందించే కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. ఉగాది పండుగ నుంచి ఏడు సందర్భాల్లో పూజారులు భక్తుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆశీర్వాదాలు అందించే కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు. పిల్లలు పుట్టిన వేళ, వారికి నామకరణం, అన్న ప్రాసన వంటి కార్యాలను గుడి పూజారి దేవుడి చిత్రపటంతో భక్తుడి ఇంటికెళ్లి దీవెనలిస్తారని తెలిపారు. వివాహం జరిగినప్పుడు కొత్త దంపతులను ఆశీర్వదించడం, గర్భవతులకు సీమంతం చేసినప్పుడు అమ్మవారి కుంకుమ అందజేయడం వంటివి చేస్తారని చెప్పారు. -
'ఉగాది నుంచి ఇంటింటికీ ఉచిత పూజలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఉగాది నుంచి ఇంటింటికీ ఏడు ఉచిత పూజలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు శనివారం వెల్లడించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పిల్లలు పుట్టినప్పుడు, శ్రీమంతాలు, వివాహాలు, చనిపోయిన సందర్భాల్లో పండితులే ఇంటికి వచ్చి పూజలు నిర్వహిస్తారన్నారు. ఆగస్టు 12 నుండి 28 వరకు కృష్ణా పుష్కరాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. -
కృష్ణా పుష్కరాలకు 170 కొత్త ఘాట్లు
పెడన: కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొత్తగా 170 ఘాట్లు నిర్మిస్తామని దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు. గురువారం ఆయన కృష్ణాజిల్లా పెడనలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి పుష్కరాల అనుభవంతో కృష్ణా పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన అపశ్రుతి పునరావృతం కాకుండా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కరాలను నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని మంత్రి వ్యాఖ్యానించారు. అతడి మృతికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీలను బాధ్యుల్ని చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేసి విద్యార్థుల్ని రెచ్చగొట్టడం మంచిపద్ధతి కాదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి చిరువోలు బుచ్చిరాజు, ఉపాధ్యక్షులు కట్టా జోతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
'దేవాలయ భూములను కాపాడుకుంటాం'
వైఎస్సార్ జిల్లా: అన్యాక్రాంతమైన దేవాలయ భూములను కాపాడుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన... బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రవీంద్రరావు స్వగ్రామమైన ఎర్రవారిపాలెంకు విచ్చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ... సుమారు 20 వేల ఎకరాల భూ ఆక్రమణల అంశం ఇప్పటికే కోర్టుల్లో ఉందని మాణిక్యాలరావు తెలిపారు. 'మీ ఇంటికి - మీ భూమి' కార్యక్రమంలో భాగంగా దేవాలయ భూములకు సంబంధించి 30వేల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్టు లెక్క తేలిందన్నారు. ఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, భూములను స్వాధీనం చేసుకుంటామని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. -
మంత్రి 100 అడిగితే...10 ఇచ్చారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు దీనస్థితి మరోసారి చర్చనీయంశమైంది. దేవాదాయశాఖలో అధికారులదే అధిపత్యంగా నడుస్తుంది. మంత్రిని ఇటు ఏపీ ప్రభుత్వం, అటు అధికారులు పూర్తిగా పక్కనపెట్టేశారు. మంత్రి మాణిక్యాలరావు నోటీసులో లేకుండానే అధికారులు జీవోలు జారీ చేస్తున్నారు. తాజాగా స్వయనా దేవాదాయ శాఖమంత్రి లేఖలను టీటీడీ పట్టించుకోలేదు. దర్శనం కోసం మంత్రి సిఫార్సు లేఖలు ఇచ్చినా టీటీడీ బుట్టదాఖలు చేసింది. సాక్షాత్తూ టీటీడీ కొత్త సంవత్సరం దేవుడి డైరీలు దక్కకపోవడంపై ఆయన ఆవేదన చెందారు. 100 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు కావాలని మాణిక్యాలరావు ఆర్డర్ చేస్తే కేవలం పదే డైరీలు, క్యాలెండర్లు ఇచ్చి టీటీడీ చేతులు దులుపుకుంది. దీంతో మంత్రి తీవ్ర అసహానానికి గురైనట్లు తెలుస్తుంది. గోదావరి పుష్కరాల్లోనూ మంత్రి మాణిక్యాలరావు ప్రమేయం పరిమితం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
దూడ కాదు... ఆవు!
కొచ్చి: కేరళలోని కొజికోడ్‌లో ‘మాణిక్యం’ ఇప్పుడొక సెలబ్రిటీ. తనను చూడటానికి లోకల్ జనాలే కాదు... విదేశాల నుంచి కూడా అనేకమంది వస్తున్నారు. మరి మాణిక్యం ఎవరు? ప్రత్యేకత ఏమంటే... ఫొటోలో ఒక ఆవు పక్కన దూడలా కనిస్తున్న ఆవు పేరే ‘మాణిక్యం’. భూమిపై అత్యంత పొట్టి ఆవు(షార్టెస్ట్ కౌ ఇన్ ది ప్లానెట్)గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది ఈ ఆవు. కేవలం రెండు అడుగుల ఎత్తుతో, 40 కిలోల బరువుతో ఉండే మాణిక్యం రెండు పూటలా పుష్కలంగా పాలిస్తుంది. పొట్టి ఆవుల జాతిలోకెళ్లా పొట్టిగా మాణిక్యం రికార్డు పుటల్లోకెక్కింది. దీంతో అనునిత్యం ఎంతో మంది స్థానికులు, జాతీయ అంతర్జాతీయ మీడియా వాళ్లు కూడా వచ్చి మాణిక్యంను కళ్లారా చూసి ఫొటోలు తీసుకొని వెళుతున్నారు. -
షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే
-
షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే: బాలకృష్ణ
హైదరాబాద్: సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే తిరుపతిలో జరిగిన దిశానిర్దేశక సదస్సుకు హాజరు కాలేకపోయినట్లు సినీ నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుతో శుక్రవారం సాయంత్రం బాలకృష్ణ భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాలకు కేంద్రమంత్రులను, సీఎంలను ఆహ్వానిస్తామన్నారు. తొలుత డిసెంబర్ 27, 28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించాలని గతంలో ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం చేపడతామని బాలకృష్ణ వెల్లడించారు. అనంతపురం జిల్లా హిందుపూర్ నియోజకవర్గంలోని లేపాక్షి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా ప్రభుత్వం ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. -
ఏం జనంరా.. బాబూ !
‘అబ్బో.. ఏం జనంరా బాబూ..! ఇంతకు ముందెప్పుడూ చూళ్లేదు’ తనయుడితో తల్లి. ‘మరేమనుకున్నావ్.. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నిన్న ఒక్కరోజే మన జిల్లాకు 20 లక్షలు దాటిపోయి జనమొచ్చారంట’ తనయుడి సమాధానం. ‘ఆళ్లందర్నీ గోదారమ్మ తల్లి చల్లగా చూడాలి. అందరిళ్లల్లో సిరిసంపదలు బాగుండాలి. ఆడోళ్లంతా జీవితకాలం సౌభాగ్యంతో బతకాలి. పుష్కరాలకొచ్చినోళ్లంతా సంతోషంగా ఇంటికెళ్లాల’ంటూ గోదారమ్మతోపాటు దేవుళ్లందరినీ ఆ తల్లి ప్రార్థించింది. జిల్లాలో ప్రతిచోట.. ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. జన జాతర నడుమ పుష్కరోత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : మఖ నక్షత్రం.. ఆదివారం వేళ పుష్కర సంబరం అంబరాన్ని తాకింది. రెండు రోజులుగా యాత్రికులను నరకయాతనకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్యను కొంతమేర అధిగమించడంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా పుష్కర పర్వం ఒకింత సాఫీగానే సాగింది. శనివారం రోజంతా కొవ్వూరు, నరసాపురం పట్టణాలకు కిలోమీటర్ల దూరంలో వాహనాలు ఆగిపోవడం.. యాత్రికులు పుష్కర ఘాట్లకు చేరుకోలేక ప్రత్యక్ష నరకం చవిచూసిన పరిస్థితుల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచే అధికారులు ట్రాఫిక్ నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. చెన్నై, విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలను రాజమండ్రి, కొవ్వూరు వైపు రానివ్వకుండా రావులపాలెం, జొన్నాడ, రాజోలు మీదుగా విశాఖ వైపు మళ్లిం చారు. ఏలూరు-కొవ్వూరు-రాజమండ్రి మార్గంలో వచ్చే భారీ వాహనాలను మళ్లించి ప్రయాణికుల కార్లను, ఆర్టీసీ బస్సులను మాత్ర మే అనుమతించారు. గుండుగొలను మీదుగా రాజమండ్రి వెళ్లే వాహనాలను జాతీయ రహదారి మీదుగా, కొయ్యలగూడెం నుంచి రాజ మండ్రి వెళ్లే వాహనాలను నాలుగో వంతెన మీదుగా మళ్లించారు. శనివారం ప్రయాణికుల అనుభవాలు, అవస్థలు మీడియాలో హోరెత్తిన నేపథ్యమే కావొ చ్చు గానీ ఆదివారం భక్తుల తాకి డి అంచనాలకు మించి లేదనే చెప్పాలి. పుష్కరాల తొలిరోజు నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వేళల్లోనే పిండప్రదానాలు చేస్తున్నారు. ఆదివారం విపరీతమైన రద్దీ ఉంటుందని భావించిన యాత్రికులు, భక్తులు శనివారం అర్ధరాత్రి కూడా పిండప్రదానాలు చేశారు. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా పుష్కర ఘాట్లన్నీ కిటకిటలాడాయి. కొవ్వూరు ఘాట్లకు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. బస్సుల కోసం ఎదురుచూపులు ఆర్టీసీ బస్సులు అవసరానికి తగ్గ సంఖ్యలో లేకపోవడంతో నరసాపురంలో భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు. ఉదయం పుష్కర స్నానాలు పూర్తి చేసుకున్న యాత్రికులు సాయంత్రం వరకు బస్టాండ్‌లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నరసాపురం పట్టణంలో ఆదివారం ఏ వీధిలో చూసినా భక్తుల సందడి కనిపించింది. లక్షలాదిగా జనం రోడ్లపైకి రావడంతో అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. ట్రాఫిక్ విషయంలో ఉన్న ఇబ్బందులను కొంతమేర అధిగమించగలిగారు. వాహనాలను పాలకొల్లు రోడ్డులో నిలుపుదల చేయడంతో ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉత్పన్నం కాలేదు. ఘాట్ల వద్ద భక్తులు స్నానాల కోసం ఎండలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. దీంతో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి దంపతులు నరసారురంలో పుష్కర స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. పెరవలిని వదలని ట్రాఫిక్ సమస్య పెరవలిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకపోవడంతో భక్తులు నరకయాతన పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణకు అదనపు పోలీసులను నియమిం చాల్సిన అవసరం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం శాపంగా మారింది. పోలవరంలో లాంచీలు సరిపోక గంటల తరబడి భక్తులు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఘాట్ల వద్ద రద్దీ కారణంగా చిన్నపాటి తోపులాటలు చోటు చేసుకున్నాయి. రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇక్కడి ఘాట్లను పరిశీలించారు. యలమంచిలిలో అదే జోరు యలమంచిలి మండలంలో భక్తుల జోరు కొనసాగింది. లక్ష్మీపాలెం ఘాట్‌లో పైకిలేచిన రాళ్లవల్ల భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక్కడా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. భారీగా వస్తున్న జనాన్ని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. ఇక్కడ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పుష్కర స్నానం ఆచరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, రాజమండ్రి ఘటనలో మృతి చెందిన వారికి పిండప్రదానాలు చేశారు. యలమంచిలి ఘాట్‌లో ఓ ముస్లిం కుటుంబం పుష్కర స్నానమాచరించింది. సిద్ధాంతం కేదారీ ఘాట్‌లో వీల్చైర్లు లేక వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. రాత్రి 8 గంటలకే ఉచిత బస్సులు నిలిపివేత పుష్కర యాత్రికుల అవస్థలు కొవ్వూరు: పుష్కరాలకు తరలివచ్చే భక్తులను స్నానఘట్టాలకు చేరవేసేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ, ప్రైవేటు ఉచిత బస్సులను ప్రతిరోజు రాత్రి 8 గంటల తరువాత నిలిపివేస్తుండటంతో భక్తులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఉదయం 7నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నారు. కొవ్వూరు ప్రాంతానికి ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు రాత్రివేళ ఎక్కువగా వస్తున్నాయి. ఏలూరు, ఖమ్మం ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు సైతం ఎక్కువగా తిరుగుతుంటాయి. రాత్రివేళ రైళ్లు, బస్సుల నుంచి దిగుతున్న యాత్రికులతోపాటు ప్రైవేటు వాహనాల్లో పార్కింగ్ జోన్లకు చేరుకున్న వారంతా సుమారు ఐదారు కిలోమీటర్ల దూరం నడిచి పుష్కర ఘాట్లకు చేరుకోవాల్సి వస్తోంది. అప్పటికే ప్రయాణం చేసి అలసిపోయిన యాత్రికులు కాలినడకన ఘాట్లకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. పగటిపూట 250 ఉచిత బస్సులను నడుపుతున్న ప్రభుత్వం రాత్రివేళ కనీసం వాటిలో సగం బస్సులనైనా ఘాట్లవరకు నడపాలని యాత్రికులు కోరుతున్నారు. -
సీఎం చంద్రబాబుకు మంత్రి ఝలక్
-
'పుష్కరాలకు 18 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతి'
ఢిల్లీ: జులై 5 వరకు గోదావరి పుష్కరాల పనులు పూర్తవుతాయని ఏపీ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం లోపం లేదని, పుష్కరాలకు కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకే వచ్చానని చెప్పారు. పుష్కరాలకు రాజమండ్రికి 18 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చిందని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. -
ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే!
ఒక్కసారి కాదు... వందసార్లు చూసినా... బాషా పంచ్‌లు... మళ్లీ మళ్లీ పిడికిళ్లు బిగించేలా చేస్తూనే ఉంటాయి. చాలా కాలం తరువాత... ‘బాషా’ వచ్చాడు తెర పైకి మళ్లీ. కొన్ని వేడిలోనే బాగుంటాయి. కొన్ని చల్లబడిన తరువాత కూడా మునపటి కంటే ఎక్కువ వేడితో, వాడితో బాగుంటాయి. కొన్ని రెండిట్లోనో మహా మహా బాగుంటాయి. బాషా... వేడిలోనే కాదు... ఆ వేడి తగ్గిన కాలంలోనూ మళ్లీ వేడెక్కిస్తాడు. బాషాను చూసి చాలా కాలమే అయ్యుండవచ్చు. కానీ ఇప్పటికీ చూస్తే... ఇప్పుడే చూసినట్లు ఉంటుంది. ‘మాణిక్యం’ క్యారెక్టర్ గుండెలో తడిని తడుముతున్నట్లే ఉంటుంది. బాషా క్యారెక్టర్ కళ్లలో అగ్నులను ఉత్తేజితం చేస్తున్నట్లుగానే ఉంటుంది. ‘‘నేను మాణిక్యమైపోవాలి’’ అనుకుంటాం. మాణిక్యాన్ని బంగారం చేసింది కుటుంబం మీద అతని ప్రేమ. ఆ ప్రేమను మనకు తెలియకుండానే సొంతం చేసుకుంటాం. ఉన్నట్టుండి మనం మాణిక్యాలమై పోతాం. కుటుంబాన్ని ఇంకా... ఇంకా ప్రేమిస్తాం. తన చెల్లిని వేధించినవాడిని చావబాదుతుంటే... మనం మన సీట్లో నుంచి లేచి మాణిక్యంలో ఐక్యమైపోతాం. ఆ గూండాను-‘‘రేయ్... అంటోని గురించి నా దగ్గర చెప్పొద్దు’’ అని హెచ్చరిస్తాం. అప్పటికీ మన ఆవేశం చల్లారదు. ‘‘నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు..’’ అని కాలరు పట్టుకొని వాడి చెంప చెళ్లుమనిపిస్తాం. అంతేనా... మాణిక్యంతో పాటు బాంబే వెళ్లిపోతాం. బాషా అయిపోతాం. బాషాలా చిటికేస్తాం. గొంతు పెంచి- ‘‘ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినపట్లే’’ అని గర్జిస్తాం. గాండ్రిస్తాం. చూస్తూ ఉండగానే బాషా మనల్ని ఆవహిస్తాడు. పేదోడి జోలికి వచ్చే వాడి పీక నొక్కేస్తాం. పేదోడి కడుపు కొట్టే రాబందులను నల్లుల్లా నలిపేస్తాం. ఆవేశం ఆవేశం... ఒంటి నిండా ఆవేశం... అమ్మ తల్లి పూనినట్లు... బాషా మనల్ని పూనుతాడు. వినాయకుడి గుడిలో బాంబు పెట్టడానికి వచ్చిన గుండాను మట్టికరిపించి- ‘‘నాకు పని పెట్టొద్దు. నిజం చెప్పు... తెలుసుగా... ఈ బాషా ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’’ అని ఊగిపోతాం. బాషా మనల్ని పూనాడు కదా... ఇక భయమెందుకు? డాన్ ఆంటోని అయితేనేం... వాడి తాత అయితేనేం? ‘‘రేయ్ నువ్వు చావాలి. లేదా నేను చావాలి. నీ వాళ్లు చావాలి. లేదా నా వాళ్లు చావాలి. ప్రజలు కాదు... అమాయక ప్రజలు కాదు చావాల్సింది. ఇప్పుడు తెలిసింది... నువ్వు పిరికి వెధవ్వి. ఒక పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు. ఈ బాషాకు... మాణిక్ బాషాకు నచ్చదు. ఇంకా ఏడే రోజుల్లో నీ కథ ముగిస్తా. ఈ బాషా ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే! ఒక్క డైలాగ్... ఒకే ఒక్క డైలాగు... మనల్ని ఏకం చేస్తుంది... మన ధైర్యాన్ని ఏకం చేస్తుంది. మన అడుగుల్ని ఏకం చేస్తుంది. గుండెలో రగిలే రణధ్వనిని ఏకం చేస్తుంది. కొందరు భావోద్వేగాలే మనుషులైనట్లు ఉంటారు. కొందరు అవి మచ్చుకైనా లేనట్లు ఉంటారు. అంతమాత్రాన... వాళ్లు రాతిగోడలు కాదు. రాతి గోడలో కూడా తేమ ఉంటుందని గంభీరంగా నిరూపించే వాళ్లు. మనలో భావోద్వేగాల మాణిక్యాలు ఉండొచ్చు. దెబ్బకు దెబ్బ తీసే మాణిక్ బాషాలు ఉండొచ్చు. ‘‘మంచి వాడు మొదట కష్టపడతాడు... కానీ ఓడిపోడు’’ అది బాషా చెప్పిన భాష్యమే కాదు... నిజ జీవిత సత్యం అని మన జీవితాల్లో ఎన్నో ఉదాహరణలు సజీవంగా చెబుతుంటాయి. ‘‘ చెడ్డవాడు మొదట సుఖపడతాడు... కానీ ఓడిపోతాడు’’ ఓడిపోయిన చెడ్డ వాళ్లు మన ముందు దీనంగా క్యూ కడుతూనే ఉంటారు. బాషా ఒక్కడే- కానీ ఎప్పుడు వచ్చినా వందలుగా వస్తాడు. అందరినీ .... పంచ్ పవర్‌తో ఏకం చేస్తూనే ఉంటాడు. బాషా అంటే ఏకవచనం కాదు... అందరిని ఏకం చేసే సర్వనామం! సింహనాదం!! -
టీడీపీపై అమిత్ షాకు ఏపీ మంత్రి ఫిర్యాదు!
న్యూఢిల్లీ: టీడీపీ - బీజేపీల మధ్య నిట్ ఏర్పాటుపై పంచాయితీ జరుగుతుంది. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రతిపాదనలు చేశారు. మంత్రి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్రం కమిటీ అందుకు ఆమోదం తెలిపింది. అయితే ఇందులో తిరకాసు లేకపోలేదు. అదేమంటే.. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేస్తే బీజేపీకి మంచి మార్కులు వస్తాయని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు సూచించారు. అయితే నిట్ విషయంలో టీడీపీ వ్యవహారంపై మంత్రి మాణిక్యాలరావు మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మంత్రి మాణిక్యాలరావు ఫిర్యాదుచేశారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మాణిక్యాలరావు బెదిరించడంతో టీడీపీ వర్గీయులు వెనక్కి తగ్గారన్నట్లు విశ్వసనీయ వర్గా సమాచారం. గడువు తీరిన తర్వాత లేఖ పంపి ఏపీ సర్కారు పొడిచిందని మాణిక్యాలరావు ఆవేదన చెందినట్లు సమాచారం. తమ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఎదగనీయకుండా టీడీపీ కుట్ర పన్నుతుంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. -
మంత్రి ఫోన్ సంభాషణలు రికార్డు!
-
మంత్రి ఫోన్ సంభాషణలు రికార్డు!
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్, సంభాషణల రికార్డింగ్ ఘటనలు సృష్టించిన ప్రకంపనలు ఆగకముందే దాదాపు అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సంభాషణను ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త రికార్డ్ చేయడం సంచలనం సృష్టించింది. అయితే ఇది గమనించిన మంత్రి భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లోనే జరిగిన ఈ ఘటనపై మంత్రి షాక్ తిన్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీశైలం పాలక మండలిలో పార్టీకి చెందిన ఓ నేతకి అవకాశం కల్పించే విషయాన్ని మంత్రి మాణిక్యాల రావు కర్నూలు జిల్లా నేతలు, ఇతర కార్యకర్తలతో ఫోన్ లో మాట్లాడుతుండగా ఓ కార్యకర్త రహస్యంగా ఈ సంభాషణలను రికార్డు చేశాడన్న వార్త కలకలం రేపింది. -
సువర్ణ కలశ ప్రతిష్ఠోత్సవం
-
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి లతో పాటు హైకోర్టు న్యాయమూర్తి నాగేశ్వర రెడ్డి లు ఉన్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వారు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
'రెండు నెలల్లో టీటీడీ పాలకమండలి ఏర్పాటు'
తిరుమల: రెండు నెలల్లో టీటీడీ పాలకమండలి ఏర్పాటు కానున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఆదివారం శ్రీవారి ఆలయం ముందు మహామణి మండపాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి మండపాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సూచించిందని మాణిక్యాలరావు చెప్పారు. -
చంద్రబాబుతో మాకెటువంటి ఇబ్బంది లేదు..
-
కాంగ్రెస్‌లో బ్రిటీష్ భావజాలం
దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు విమర్శ యర్రగొండపాలెం : భారత్ నుంచి బ్రిటీష్ పాలకులు వెళ్లి పోయిన తర్వాత 60 ఏళ్లపాటు పాలించిన స్వదేశీయుల్లో బ్రిటీష్ భావజాలం గల వ్యక్తులున్నారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. యర్రగొండపాలెంలో గురువారం భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. బ్రిటీష్ రాజుల భావాజాలంతో ఉన్న వ్యక్తులు దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పాలించడం వల్లే అభివృద్ధికి నోచుకోలేదని ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను దుయ్యబట్టారు. పవిత్రమైన భావాజాలంతో దేశ ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్లో అడుగుపెట్టారని చెప్పారు. పనికిమాలిన 70 చట్టాలను మోదీ రద్దు చేశారన్నారు. గుజరాత్ అల్లర్ల విషయంలో ప్రపంచ మీడియా ఆసరాగా చేసుకుని మోదీని ఒక క్రూరుడిగా చిత్రికరించారన్నారు. భారతీయ యువశక్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతున్న మోదీ నాయకత్వంలో.. బీజేపీ పేదల పార్టీగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ కోసమే రాష్ట్ర విభజన రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొట్టారని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి డబ్బు తప్ప అభివృద్ధి తెలియదని విమర్శించారు. ముందుగా వైపాలెంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇమ్మడిశెట్టి సుబ్బారావు, ఆయన సోదరుడు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘాల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి సత్యనారాయణలను మంత్రి మాణిక్యాలరావు బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ ఆలిండియా ప్రధాన కార్యదర్శి యక్కలి రాఘవులు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి జీ రవీంద్రరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణారావు, పార్టీ నాయకులు బత్తిన నరసింహారావు, భీమని మీనాకుమారి, కందుకూరి వెంకటసత్యనారాయణ, రేగుల రామాంజనేయులు, ఉలిసి ఏసుబాబు, ఆరె రమణయ్య, గోలి నాగేశ్వరరావు, శాసనాల సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని స్ఫూర్తితో ముందుకు
బోడుప్పల్: ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్దామని గోవాగర్నర్ మృదుల సిన్హా పేర్కొన్నారు. మేడిపల్లిలోని మేకల బాల్‌రెడ్డి పంక్షన్ హాల్లో గురువారం జరిగిన సాధీ సౌత్ రీజనల్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రం, ఆరోగ్యం, అభివృద్ధిలో మిగతా దేశాలకు దీటుగా నిలవాలన్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచ దేశాలు భారత దేశాన్ని ఆదర్శంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ సాధీ నెట్ వర్క్ సేవలు మరింత విస్తరించాలని ఆయన సూచించారు. చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి, తెలంగాణ కోఆర్డినేటర్ శాడకొండ శ్రీకాంత్‌రెడ్డి, జహీదబేగంతో పాలు పలువురికి సాధీ సేవా పురస్కార అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాధీ సౌత్ ఇన్చార్జ్ మంకన శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ ఆర్బి సిన్హా, సాధీ నెట్ వర్క్ స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు మోహినిగార్గ్, ఏపీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మల్లారెడ్డి, కర్ణాటక ఇన్చార్జ్ కరుణాకర్, సింగరేస్ కాలరీస్ డెరైక్టర్ విజయకుమార్, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
తిరుపతమ్మ ఆలయ చైర్మన్ పదవి కోసం ‘తెలుగు తమ్ముళ్ల’ ఆరాటం
రేసులో 13మంది ! ప్రజాప్రతిధుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం రెండుగా చీలిన టీడీపీ నాయకులు? పెనుగంచిప్రోలు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పాలకవర్గ చైర్మన్ పదవి కోసం ‘తెలుగు తమ్ముళు’్ల ఆరాట పడుతున్నారు. ఈ పదవిపై ఎప్పటి నుంచో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు కన్నేశారు. ఇప్పటి వరకు ఉన్న పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అనంతరం రెండు వారాల్లో ఆలయాలకు నూతన పాలవర్గాలను నియమిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రకటించడంతో చైర్మన్ పదవి ఆశిస్తున్న స్థానిక నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవి కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. సుమారు 13 మంది రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, మరికొందరు మాజీ మంత్రి నెట్టెం రఘురాం ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకరిద్దరు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఆశ్రయించినట్లు సమాచారం. చైర్మన్ పదవి రేసులో నీటి సంఘం మాజీ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, పార్టీ గ్రామ అధ్యక్షుడు, ఇటీవలనే పార్టీలోకి వచ్చిన వారు ఉన్నారు. దీంతో చైర్మన్ పదవి విషయంలో గ్రామంలో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద పదవి ఎవరికి లభిస్తుందనే విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
తెలంగాణకు ప్రత్యేక కోటా ఏమీ లేదు
హైదరాబాద్ : రెండు వారాల్లోగా అన్ని దేవాలయాల్లో పాలకమండళ్లు నియమిస్తామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ టీటీడీకి స్పెసిఫైడ్ అథార్టీ కమిటీని నియమించే యోచన లేదన్నారు. సెప్టెంబర్ 2వ వారంలో టీటీడీ పాలకవర్గం నియామకంతో పాటు వచ్చేనెలాఖరుకల్లా అన్ని దేవాలయాల పాలక వర్గాలను నియమిస్తామన్నారు. టీటీడీలో సభ్యుల సంఖ్య 15 నుంచి 18కి పెంచుతామన్నారు. ప్రతి దేవాలయ కమిటీలో ఇద్దరు సభ్యులు, ఒక ఎక్స్ అఫిషియో మెంబరు పెంపు ఉంటుందన్నారు. టీటీడీ పాలకవర్గంలో తెలంగాణకు ప్రత్యేక కోటా ఏమీ లేదని మాణిక్యాలరావు తేల్చి చెప్పారు. -
ఫొటోగ్రఫీకి ఎంతో ప్రాధాన్యత
కానూరు(పెనమలూరు) : నేటి సమాజంలో ఫొటోగ్రఫీకి ఎక్కడలేని ప్రాధాన్యత ఉందని, ప్రతి విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపేది ఫొటోనే అని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి పి.మాణిక్యాలరావు అన్నారు. ఆయన బుధవారం కానూరులో జరుగుతున్న మేగాఫొటో ట్రేడ్‌షోను సందర్శించి ప్రసంగించారు. సమాజంలో ఫొటోగ్రఫీ అనేక సమస్యలకు పరిష్కారమార్గం చూపుతుందని చెప్పారు. వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి, సమాజానికి ఫొటోగ్రఫీకి విడదీయరాని బంధం ఉందని తెలిపారు. నేడు ఫొటోగ్రఫీలో అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో రావడంతో ఆ రంగం సరికొత్త పుంతలు తొక్కుతుందన్నారు. రాష్ట్ర ఫ్రభుత్వం ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేసే విధంగా తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. మాదాల రమేష్, జి.శ్రీనివాస్, టి.జానకిరామయ్య పాల్గొన్నారు. నేటితో ట్రేడ్‌షో ముగింపు.. కానూరులో రెండు రోజులుగా జరుగుతున్న ఫొటో ట్రేడ్‌షో నేటితో ముగుస్తుంది. -
భూములను పరిశీలించిన మంత్రులు
తాడేపల్లిగూడెం : పట్టణంలో విమానాశ్రయ భూములను రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పి.నారాయణ, పీతల సుజాత మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ భూములలో వ్యవసాయ యూనివర్సిటీ నిర్మించాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో పరిశీలనకు ప్రాధాన్యత వచ్చింది. తర్వాత వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీని మంత్రుల బృందం సందర్శించింది. వర్సిటీ ప్రాంగణంలో పరిశోధన, విస్తరణలపై తీసుకునే చర్యలను వర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, ఎస్టేట్ ఆఫీసర్ పీఆర్పీ రాజు మంత్రులకు వివరించారు. ఈ మేరకు రూపొందించిన మ్యాప్‌లను చూపించారు. మూడు నియోజకవర్గాల పరిధిలో వర్సిటీ ఉందని, ఇక్కడ అదనంగా వర్సిటీ వస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు మంత్రులకు తెలిపారు. వైఎస్సార్ వర్సిటీ పరిశోధన, విస్తరణ కోసం 800 ఎకరాలు పోను, సుమారు 2,200 ఎకరాల పైచిలుకు భూమి అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. ఉద్యోగుల, పరిశోధనాశాలలు, తదితర వివరాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. బత్తాయి, కొబ్బరి పరిశోధన శాలలు, కొవ్వూరు అరటి పరిశోధనా శాల, డెరైక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్, వర్సిటీకి అదనంగా భూమిని దఖలు పరిస్తే ఏం చేస్తారనే మంత్రుల ప్రశ్నలకు అధికారులు బదులిచ్చారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ ఆలస్యంగా రావడంతో చీకటిలోనే విమానాశ్రయ భూముల మ్యాప్‌లను పరిశీలించారు. అనంతరం వర్సిటీలో మ్యాప్‌లను చూశారు. మంత్రి మాణిక్యాలరావు ఇంటికి వెళ్లిన మంత్రి ఘంటా శ్రీనివాస్ యూనివర్సిటీ ఏర్పాట్లపై చర్చించి తిరిగివెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, కలెక్టర్ కె.భాస్కర్, ఏలూరు ఆరీవో బి.శ్రీనివాసు తదితరులు ఉన్నారు. -
'ఇకపై ఆన్లైన్లో మాత్రమే విక్రయం'
తిరుపతి : వెంకన్నసామాన్య భక్తులకు కష్టాలు తీరనున్నాయి. తిరుపతి దర్శనం టిక్కట్ల కోసం ఇక రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తిరుమలకు చేరుకున్న భక్తులకు శీఘ్ర దర్శనం టికెట్ల కోసం టీటీడీ ప్రత్యేక ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. శీఘ్రదర్శనం టికెట్లు కూడా ఇకపై ఆన్లైన్లో మాత్రమే విక్రయించనున్నారు. ఆన్లైన్లో ప్రత్యేక దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం త్వరలో కల్పిస్తామని తిరుమల జేఈవో శ్రీనివాస రాజు మంగళవారం తెలిపారు. అలాగే తిరుమలలో వీఐపీ దర్శనాలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా వీఐపీ సిఫార్సు లేఖలను తగ్గిస్తూ చివరకు పూర్తిగా రద్దు చేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు కూడా వెల్లడించారు. -
ఆస్తులన్నీ వెబ్సైట్లో!
హైదరాబాద్: అన్నిదేవాలయాల ఆస్తులు, ఆదాయవ్యయాలు వెబ్సైట్లో పొందుపరుస్తామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. టీటీడీలో వీఐపీ దర్శనాల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నామన్నారు. రోజుకు 800 నుంచి వెయ్యి వరకూ మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారు. త్వరలో 300 రూపాయల దర్శనాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందేనన్నారు. వీఐపీ లెటర్లు ఇకపై చెల్లవని చెప్పారు. ఈ విషయంలో తనపై చాలా ఒత్తిడి ఉందని, అయినా సరే అమలు చేసి తీరుతామన్నారు. దేవాదాయశాఖను ఆర్టీఐ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలో హిందూసనాతన ధర్మం సబ్జెక్ట్‌గా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటుచేస్తామన్నారు. దాతల సహకారంతో వాటిని నిర్వహిస్తామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. -
తిరుమలలో వీఐపీ చిట్టీలకు చెల్లుచీటీ...
సాక్షి, హైదరాబాద్: తిరుమలలో వీఐపీ దర్శనాలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా వీఐపీ చిట్టీలను తగ్గిస్తూ చివరకు పూర్తిగా రద్దుచేయాలని భావి స్తోంది. ఇటీవల ఏపీ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇచ్చిన సిఫారసు లేఖలను టీటీడీ రెండుసార్లు తిరస్కరించింది. సోమవారం మంత్రిమండలి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు దృష్టికి తీసుకువచ్చారు. దేవాదాయ మంత్రి బుధవారం టీటీడీ అధికారులను హైదరాబాద్‌కు పిలిచి తిరుమలపై సమీక్ష నిర్వహించారు. గత కొన్నేళ్లుగా తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య ఏ మేరకు ఉందో అంచనా వేశారు. రానున్న కాలంలో రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాకు వచ్చారు. వీఐపీ చిట్టీలతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోందని, దర్శన సమయం 30 గంటలకు పైగా పడుతోందని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ సమయాన్ని సాధ్యమైనంతమేర తగ్గించాలన్న అభిప్రాయానికి వచ్చారు. నడకదారి భక్తుల సంఖ్య పెరగటం కూడా టీటీడీకి ఇబ్బందిగా మారుతోంది. శీఘ్రదర్శనం టికెట్లు కూడా ఇకపై ఆన్లైన్లో మాత్రమే విక్రయించనున్నారు. తిరుమలకు చేరుకున్న భక్తులకు శీఘ్రదర్శనం టికెట్లకోసం ప్రత్యేక ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. కాగా దేవాలయాలన్నిటినీ సమాచారహక్కు చట్టం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయాలు భక్తుల కానుకలతో నడుస్తున్నాయన్న ఉద్దేశంతో తొలుత ఈ చట్టం పరిధిలోకి చేర్చలేదు. -
ఇక రెండు గంటల్లో వెంకన్న దర్శనం!
కడప : నెల రోజుల్లో తిరుమలలో సామాన్య భక్తుడు రెండు గంటల్లో స్వామివారిని దర్శించుకునేలా చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఆయన బుధవారం వైఎస్ఆర్ జిల్లాలో దేవుని కడప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి సత్వర దర్శనానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే భూకబ్జాకు గురైన దేవాలయ భూముల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. -
ఆరోపణలున్న వ్యక్తికే అందలమా..?
సాక్షి, హన్మకొండ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తినే విచారణ అధికారి పోస్టులో నియమించేందుకు పైరవీలు సాగుతున్నాయి. తెలంగాణ ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖలోనే ఇలాంటి పోస్టింగ్ పైరవీలు తీవ్రంగా జరుగుతుండడం చర్చనీయాంశమైంది. వైద్య ఆరోగ్యశాఖ వరంగల్ రీజనల్ డెరైక్టర్(ఆర్డీహెచ్)గా ప్రస్తుతం కొనసాగుతున్న డాక్టర్ మాణిక్యరావు ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. మరో రెండు రోజుల్లో ఖాళీ కానున్న ఈ కీలకమైన పోస్టులో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనేది ఇప్పుడు వైద్య శాఖలో ఆసక్తికరంగా మారింది. వరంగల్ వైద్య ఆరో గ్య శాఖ రీజినల్ డెరైక్టర్ పరిధిలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు ఉంటాయి. కీలకమైన ఈ పోస్టు కోసం జిల్లా వైద్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ పి. సాంబశివరావు ప్రయత్నిస్తున్నారు. గత ఐదేళ్లు గా ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి రాజయ్యతో ఉన్న పరిచయాలతో ఈ ప్రయత్నా లు ఊపందుకున్నాయని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ పి.సాంబశివరావుపై పలు అవినీతి ఆరోపణలు విచారణ దశలో ఉండడంతో ఈ పోస్టు విషయంలో ఉప ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉంటుందనేది మరో మూడు రోజుల్లో తేలనుంది. ఆరోపణలపై విచారణ.. మన జిల్లాలో 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 2012 డిసెంబరులో ప్రతి ఆరోగ్య కేంద్రానికి రెండు చొప్పున ఇన్వర్టర్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఇన్వర్టర్కు రూ.40 వేలు చెల్లించారు. ఇన్వర్టర్ల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దు ర్వినియోగమయ్యాయని ఆరోపణలు వచ్చా యి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ పి.సాంబశివరావు ఉన్నప్పుడే ఇన్వర్టర్ల కొనుగోలు ప్రక్రియ అంతా జరిగింది. ఎస్సీ, ఎస్టీ జిల్లా అసోసియేషన్‌తోపాటు పలువురు వ్యక్తులు ఈ అంశంపై 2013లో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలంటూ ఆందోళనలు జరిగాయి. 2013 జులైలో అప్పటి ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జిల్లాకు వచ్చి దీనిపై విచారణకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డెరైక్టర్ మాణిక్యరావును విచారణ అధికారిగా నియమించారు. ఇందుకు సంబంధించిన విచారణ సైతం పూర్తయింది. రెండు రోజుల్లో ఈయన ఉద్యోగ విరమణ చేస్తున్నా.. విచారణ నివేదికను వెల్లడించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా ఉన్న డాక్టర్ పి.సాంబశివరావు రీజినల్ డెరైక్టర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. సాంబశివరావును రీజినల్ డెరైక్టర్ పోస్టులో నియమిస్తే... అక్రమాలపై విచారణ అంశాన్ని పక్కనబెట్టినట్లే అవుతుందని వైద్య శాఖలో చర్చ జరుగుతోంది. రీజినల్ డెరైక్టర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్న ప్రస్తుత జిల్లా వైద్య అధికారి... విచారణ నివేదిక వెలుగుచూడకుండా చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన రీజినల్ డెరైక్టర్ పోస్టులో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
'రాష్ట్ర రాజకీయ నేపథ్యాన్ని తిరగ రాస్తా'
తిరుమల: దేవాదాయ మంత్రిగా పనిచేస్తే ఇక రాజకీయ భవిష్యత్ ఉండదన్న రాష్ట్ర రాజకీయ నేపథ్యాన్ని తిరగ రాస్తానని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. దేవుడికి సేవ చేసే అవకాశం వచ్చిందని....కనుక భక్తులకు దేవుడిని మరింత దగ్గర చేస్తానని ఆయన తెలిపారు. 25000 ఎకరాల దేవాదాయశాఖ భూములు అన్యాక్రాంతమైపోయాయని, వాటన్నింటిని తిరిగి రప్పిస్తామని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. అందుకోసం రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేసి విచారణ జరిపిస్తామని ఆయన ప్రకటించారు. తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రశాంతంగా దర్శనమయ్యేలా చేస్తానని సాక్షి టీవికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాణిక్యాలరావు స్పష్టం చేశారు. కాగా కొన్ని శాఖలను తీసుకోవాలంటే మంత్రులే భయపడతారు. గతంలో ఆ శాఖలు తీసుకున్న మంత్రులు తరువాతి కాలంలో రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా చేసినవారు అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు కనీసం ఎమ్మెల్యేగా గెలవకపోవడం వంటి సందర్భాలున్నాయి. ఈ శాఖను తీసుకోవడానికి మంత్రులు అంతగా ఆసక్తి చూపరు. అయితే ఆ సెంటిమెంట్‌ను తిరగ రాస్తానని మంత్రి మాణిక్యాలరావు చెప్పటం విశేషం. -
గూడెంలో మరో యూనివర్సిటీ
- నేడు తన ప్రసంగంలో వెల్లడించనున్న గవర్నర్ - విమానాశ్రయ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి శాశ్వత పట్టాలు - దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి. తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెంలో మరో యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన శనివారం వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ తాడేపల్లిగూడెం విమానాశ్రయ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి శాశ్వత పట్టాలు ఇచ్చే విషయమై శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించినట్టు మంత్రి వెల్లడించారు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంగల విమానాశ్రయ భూముల్లో వేలాదిమంది ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారని, వీరికి మునిసిపాలిటీ మౌలిక సదుపాయాలు కల్పిం చినా ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. వీటికోసం 30 ఏళ్లుగా ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రికి నివేదించానని చెప్పారు. సమీపంలోని గన్నవరం, రాజమండ్రిలో విమానాశ్రయాలు ఉన్న దృష్ట్యా ఇక్కడ విమానాశ్రయం పునరుద్ధరించాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాలను సావధానంగా విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు. యూనివర్సిటీకి ఓకే! తాడేపల్లిగూడెంలోని ఏయూ క్యాంపస్‌లో గోదావరి యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయుక్తంగా ఉండే కోర్సులతో యూనివర్సిటీ రానుందని చెప్పారు. శనివారం నాడు గవర్నర్ ప్రసంగంలో తాడేపల్లిగూడెంలో యూనివర్సిటీ నెలకొల్పే అంశం ఉంటుందని తెలిపారు. ఈ విషయం తెలియడంతో జిల్లాలో విద్యారంగానికి చెందిన వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మా అమ్మను ఇండియాకు రప్పించరూ..
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్‌సెంటర్) : ఉపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడుతున్న తన తల్లిని ఇండియూకు రప్పించాలని కుమార్తె బుధవారం తాడేపల్లిగూడెంలో కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావుకు విజ్ఞప్తి చేసింది. పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన ఇంటి సత్యవతి ఉపాధి కోసం 2013లో కువైట్ వెళ్లింది. అక్కడ యజమానులు జీతం కూడా ఇవ్వకుండా తరచూ వేధింపులకు గురిచేస్తున్నారని తన తల్లి సత్యవతి ఫోన్లో ఆవేదన చెందినట్లు కుమార్తె జయప్రద కన్నీటి పర్యంతమైంది. ఇదిలా ఉంటే ఈనెల 16న తన తండ్రి బాబూరావు వడగాల్పులకు గురై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందినట్లు చెప్పింది. ఈ విషయం తన తల్లికి తెలియజేయగా ఆమె యజమానిని ఇండియాకు పంపమని వేడుకున్నా నికారించారని జయప్రద ఆవేదన చెందింది. తన తల్లిని ఇండియాకు రప్పించాలని మాణిక్యాలరావుకు వినతి పత్రం అందజేసింది. విదేశీ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి సత్యవతిని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఆమె వెంట ఇంటి రాజశేఖరన్, ఇందిరా దేవి, కైండ్‌నెస్ సొసైటీ సభ్యులు లచ్చిరెడ్డి సత్యనారాయణ, పాండురంగారావు, గట్టిం ప్రవీణ్ కృష్ణ ఉన్నారు. -
వర్షాల కోసం పూజలు చేయండి
-
వర్షాల కోసం పూజలు చేయండి
రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. ఇంకేముంది, వర్షాలు పడతాయని రైతన్నలు ఎంతగా ఎదురు చూసినా చుక్క వర్షం కూడా కురవలేదు. దీంతో వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 19, 20, 21 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో వరుణ జపాలు, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అధికారులకు ఆదేశాలిచ్చారు. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉండటం, ఎండలు మండిపోతూ వడదెబ్బకు పలువురు మృత్యువాత పడుతుండటంతో వర్షాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. నాలుగు వర్షపు చినుకులు ఎప్పుడు పడతాయో, వాతావరణం ఎప్పటికి చల్లబడుతుందోనని జనం అల్లాడిపోతున్నారు. మళ్లీ వర్షాలు పడని రోజులు వచ్చేశాయంటూ వాపోతున్నారు. -
‘బంగారం’పై లేనట్టే
సాక్షి, ఏలూరు : నవ్యాంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయూలు జిల్లా ప్రజలను విస్మయానికి గురి చేశాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సుమారు 7గంటలపాటు ఏకబిగిన సాగిన సమావేశంలో జిల్లా ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలపై ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, స్త్రీ, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం, భూగర్భ గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఈ సమావేశంలో పాల్గొన్నారు. ద్వారకాతిరుమలలోని శ్రీవెంకటేశ్వర దేవ స్థానంలో నిత్యాన్నదానం పథకం కొనసాగింపు మినహా జిల్లాకు ఒక్క వరం కూడా లభించలేదు. రాష్ట్రంలో 7 దేవాలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించగా, వాటిలో చిన్నతిరుపతి కూడా ఉంది. మంత్రివర్గ సమావేశంలో 9 అంశాలపై చర్చ జరిగింది. వాటిలో ప్రధానాంశం వ్యవసాయ రుణాల మాఫీ. దీనిపై కేవలం కమిటీ వేయూలని మాత్రమే నిర్ణయించడంతో జిల్లా రైతుల గుండెల్లో పిడుగుపడ్డట్టయ్యింది. రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామంటూ బ్యాంకర్లు చెబుతున్నారు. ఇలా కమిటీలు, నివేదికలని కాలయాపన చేస్తే ఖరీఫ్ రుణాలు ఎప్పుడు ఇస్తారని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయూల్సిన అవసరం లేదని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కావాలనే వారితో కేబినెట్ సమావేశంలో ఆ విధంగా మాట్లాడించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలు చెల్లించవద్దని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాట తప్పేందుకే ఇలా చేయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయానికి 7గంటలు మాత్రమే విద్యుత్ ఇవ్వగలమని, 9గంటలు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పడం ద్వారా ఇప్పట్లో ఆ హామీ నెరవేరే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు కొత్త రాజధాని నిర్మాణానికి 20 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించటం ద్వారా ప్రజలకిచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చే అవకాశం లేదని తేల్చిచెప్పినట్టయియంది. -
మంత్రులకు ఏ శాఖలిస్తారో
సాక్షి, ఏలూరు : రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కిన పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాతకు ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపైనే అందరి దృష్టి ఉంది. వీరికి ఏ శాఖలపై ఆసక్తి ఉందనే అంశంపై చంద్రబాబు మంగళవారం ఆరా తీశారు. వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఏ శాఖ కేటాయించాలనే దానిపై ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బుధవారం ఉదయానికి వారికి కేటాయించిన శాఖలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేవాదాయ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలలో ఒక శాఖను లేదా రెండిటిని మాణిక్యాలరావుకు కేటాయించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. తనకు ఏ శాఖ ఇచ్చినా సమ్మతమేనని చంద్రబాబుతో చెప్పానని, తమనుంచి అభిప్రాయాలు తీసుకోవడం మినహా ఏ శాఖ ఇస్తారనేది గోప్యంగా ఉంచారని మంత్రి మాణిక్యాలరావు ‘సాక్షి’తో అన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి జిల్లాలో ఏకైక మహిళా ఎమ్మెల్యే అరుున పీతల సుజాతకు సాంఘిక సంక్షేమ, మహిళా సంక్షేమ శాఖలలో ఒక దానిని లేదా రెండిటినీ కేటారుుంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆమెకు కేబినెట్లో స్థానం దక్కినప్పటినుంచీ చంద్రబాబు కోటరీని వెన్నంటే ఉంటున్నారు. ప్రాధాన్యత గల శాఖను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోన్లో సైతం అత్యంత ముఖ్యలకు మినహా ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. -
అర్ధంతరంగా శవదహనం నిలిపివేత
భర్త మృతిపై భార్య అనుమానం కశింకోట, న్యూస్‌లైన్: భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అర్థంతరంగా శవదహనాన్ని నిలిపి వేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నరసింగబిల్లికి చెందిన కోన నూకినాయుడు(70) మాణిక్యం దంపతులు. స్పర్ధలు రావడంతో భర్తతో విడిపోయి మాణిక్యం దూరంగా ఉంటోంది. దీంతో నూకినాయుడు ఏకైక కుమార్తె సత్యవేణిని పెంచి, పెళ్లి చేశారు. అల్లుడ్ని ఇల్లరికం తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 2011లో పక్షవాతం వచ్చి నూకినాయుడు మంచాన పడటంతో తన పేరున ఉన్న ఎకరం భూమిని కుమార్తె పేరున రాసిచ్చారు. విషయం తెలియడంతో భార్య కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో నూకునాయుడు శనివారం మృతి చెందారు. దహనసంస్కారాలకు తీసుకెళుతుండగా శవాన్ని చూపాలని మాణిక్యం అడ్డుకోగా ఇది సంప్రదాయం కాదంటూ బంధువులు దహనసంస్కారాలు జరిపించారు. దీంతో భర్త మృతిపై అనుమానాలున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ కె.రమామణి ఆధ్వర్యంలో కాలుతున్న శవాన్ని నీటితో ఆర్పించి, పోస్టుమార్టం నిర్వహించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. -
భర్త మృతిపై భార్య అనుమానం
కశింకోట,న్యూస్‌లైన్: భర్త మృతిపై అనుమానాలున్నాయని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శవ దహనాన్ని అర్థంతరంగా నిలిపి వేశారు. శవానికి పంచనామా జరిపి మళ్లీ దహన సంస్కారాలు చేశారు. నరసింగబిల్లికి చెందిన కోన నూకినాయుడు(70)కు, అదే గ్రామానికి చెందిన మేనమామ కుమార్తె మాణిక్యంతో 40 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 30 ఏళ్ల కిందట సత్యవేణి అనే ఏైకైక కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో నూకినాయుడుతో విడిపోయి మాణిక్యం దూరంగా ఉంటోంది. దీంతో కుమార్తెనపు పెంచి, పెళ్లి చేసి అల్లుడ్ని ఇల్లరికం తెచ్చుకొని నూకినాయుడు జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2011లో పక్షవాతం వచ్చి నూకినాయుడు మంచాన పడటంతో తన పేరున ఉన్న సుమారు ఎకరం భూమిని కుమార్తె పేరున రాశారు. ఈ విషయం తెలియడంతో మాణిక్యం కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నూకునాయుడు శనివారం మృతి చెందారు. ఈ విషయం అదే గ్రామంలో ఉంటున్న మాణిక్యంకు తెలియజేయలేదు. శవాన్ని దహనానికి తీసుకెళుతుండగా శవాన్ని చూపాలని మాణిక్యం అడ్డుకొంది. దీంతో ఇది సంప్రదాయం కాదంటూ అల్లుడు, బంధువులు శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. దీంతో శవాన్ని తనకు చూపించలేదని, తనపై చేయి చేసుకున్నారని, భర్త మృతిపై అనుమానాలున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ విజయకుమార్, తహశీల్దార్ కె.రమామణిల ఆధ్వర్యంలో పోలీసులు శ్మశానానికి చేరుకొని కాలుతున్న శవాన్ని నీటితో అర్పించి, పోస్టుమార్టం జరిపించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పంచనామా అనంతరం నూకునాయుడు శవాన్ని దహనం చేశారు.