మంత్రి ఫోన్ సంభాషణలు రికార్డు! | manikyalarao phone conversation recorded by TDP worker | Sakshi
Sakshi News home page

మంత్రి ఫోన్ సంభాషణలు రికార్డు!

Published Fri, Jun 12 2015 8:22 AM | Last Updated on Tue, Oct 9 2018 5:03 PM

మంత్రి ఫోన్ సంభాషణలు రికార్డు! - Sakshi

మంత్రి ఫోన్ సంభాషణలు రికార్డు!

హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్‌, సంభాషణల రికార్డింగ్‌ ఘటనలు సృష్టించిన ప్రకంపనలు ఆగకముందే దాదాపు అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సంభాషణను ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త రికార్డ్‌ చేయడం సంచలనం సృష్టించింది. అయితే ఇది గమనించిన మంత్రి భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లోనే జరిగిన ఈ ఘటనపై మంత్రి షాక్‌ తిన్నట్లు తెలుస్తోంది.

కాగా శ్రీశైలం పాలక మండలిలో పార్టీకి చెందిన ఓ నేతకి అవకాశం కల్పించే విషయాన్ని మంత్రి మాణిక్యాల రావు కర్నూలు జిల్లా నేతలు, ఇతర కార్యకర్తలతో ఫోన్ లో మాట్లాడుతుండగా ఓ కార్యకర్త రహస్యంగా ఈ సంభాషణలను రికార్డు చేశాడన్న వార్త కలకలం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement