
మంత్రి మాణిక్యాల రావు వర్సెస్ ముళ్లపూడి బాపిరాజు
పశ్చిమ గోదావరి జిల్లా : టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఈ నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయిన బీజీపీ నేత మాణిక్యాల రావు మీద టీడీపీ నేత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మండిపడ్డారు. మంత్రి మాణిక్యాల రావును ఆయన నియోజకవర్గ ప్రజలు పిచ్చోడని అంటున్నారని బాపిరాజు ఎద్దేవా చేశారు. నిట్‌కు సంబంధించి శంకుస్థాపన సమయంలో వేసిన శిలాఫలకం మినహా ఇప్పటి వరకూ ఒక్క రాయి కూడా వేయలేని అసమర్ధుడు మంత్రి మాణిక్యాల రావు అని సంబోధించారు.
మంత్రి గారి అనుచరుల వల్లే అవినీతి పెరిగిందని ఆరోపించారు. ఆరుగోలను గ్రామంలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమంలో మంత్రి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తాడేపల్లి గూడెం, నల్లజర్ల మండలాల్లో జరిగిన అభివృద్ధి దేశవ్యాప్తంగా మరెక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. తాను అవినీతి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment