
ఏపీ మంత్రి మాణిక్యాలరావు, బీజేపీ నేత (ఫైల్ ఫొటో)
సాక్షి, అమరావతి : టీడీపీతో పొత్తుపై బీజేపీ నేత మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో విడిపోతే టీడీపీకే ఎక్కువ నష్టమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని టీడీపీ వదులుకునే అవకాశం లేదని చెప్పారు. టీడీపీ తమపై దుష్ప్రచారాం చేస్తోందని, దానిని తాము తిప్పికొడతామని అన్నారు.
తమ అధిష్టానానికి తాము రెండు ఆప్షన్లు ఇచ్చామని స్పష్టం చేశారు. టీడీపీతో తెగదెంపులు చేసుకోకమునుపే తాము ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశామో చెబుతామని, ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. అలా కుదరకుంటే ఒకసారి ఏపీ బడ్జెట్ సమావేశాల్లోపే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని తీసుకొచ్చి ఇప్పటి వరకు ఏపీకి ఇచ్చిన నిధుల గురించి చెప్పిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment