Mullapudi Bapiraju
-
‘టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఆ హత్య జరిగింది’
సాక్షి, పశ్చిమ గోదావరి : కొవ్వూరులో బీసీ వర్గానికి చెందిన గోపాల కృష్ణ అనే వ్యక్తి హత్య తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లోనే జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వర రావు ఆరోపించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోపాల కృష్ణ హత్య కేసును న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షిస్తానని టీడీపీ నాయకుడు ముళ్లపూడి బాపిరాజు హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఈ హత్య టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరిగిందని అందరికి తెలుసన్నారు. అందుకే మంత్రి జవహర్, బాపిరాజులు జనాల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఏలూరులో ఇందుమతి అనే రజక స్త్రీ స్నానానికి వెళ్తే నిప్పు పెట్టి హత్య చేశారని వెంకటేశ్వర రావు ఆరోపించారు. ఈ దారుణాన్ని జిల్లా ఎస్పీ ఆత్మహత్యగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఇలాంటి టీడీపీ నాయకులకు బీసీలను ఓట్లు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో 400 మంది బీసీలు లోన్లకు దరఖాస్తు చేస్తే కేవలం ముగ్గిరికి మాత్రమే లోన్ ఇచ్చారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
అధికార పార్టీలో కొలిక్కిరాని సీట్ల లొల్లి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల వ్యవహారం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేల అవినీతి పై కార్యకర్తలు ధ్వజమెత్తుతుండటంతో ఏం చేయాలో తోచని స్థితిలో అధిష్ఠానం ఉంది. వారికి టిక్కెట్లు ఇస్తే తామే ఓడిస్తామని చెబుతుండటంతో ఏం పాలుపోవడం లేదు. మరోవైపు జిల్లాలోని మూడు ఎస్సీ, ఒక ఎస్టీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఏలూరు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థుల కోసం వెదుకులాట మొదలుపెట్టింది. రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న అభ్యర్థులను మార్చితేగాని ఒప్పుకోమంటూ నియోజకవర్గ నేతలు పట్టుపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం సిట్టింగ్‌ల వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ముఖ్యమంత్రి ప్రకటించకపోయినా తమకే సీటు దక్కిందంటూ సిట్టింగ్‌లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేయకపోవడానికి ముఖ్యమంత్రి సామాజిక వర్గం నేతలే కారణం. చింతలపూడి నియోజకవర్గంలో మాజీ మంత్రి పీతల సుజాతకు సీటు ఖరారు చేయలేదు. ఇక్కడ ఏలూరు ఎంపీ మాగంటి బాబు పీతల సుజాతకు సీటు ఇవ్వకుండా అడ్డం పడుతున్నారు. తన మాట వినని సుజాతకు ఎట్టి పరిస్థితుల్లో సీటు ఇవ్వకూడదని ఎంపీ సామాజిక వర్గం పట్టుపడుతోంది. గోపాలపురం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు సీటు ఖరారు కాకపోవడం వెనుక జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఉన్నారు. ఆయన తన అనుచరుడు వెంకటరాజుకు ఇప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ముప్పిడి వెంకటేశ్వరరావుకు సీటు ఇవ్వకుండా బలమైన లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రి జవహర్‌కు చెందిన కొవ్వూరు సీటు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన అచ్చిబాబు వర్గం అడ్డుకోవడం, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం వద్దే ఇరువర్గాలు బాహాబాహీకి తలపడటం తెలిసిందే. దీంతో జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడు సీట్లను ముఖ్యమంత్రి ఖరారు కాకుండా నిలిపివేశారు. ఉన్న ఏకైక ఎస్టీ నియోజకవర్గం పోలవరం విషయంలో కూడా అదే సామాజిక వర్గం నేతలు చక్రం తిప్పుతుండటంతో అక్కడ అభ్యర్థి ఎన్నిక కూడా పెండింగ్‌లో పెట్టారు. ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతల సీట్లను దాదాపు ఖరారు చేసినా రిజర్వుడు సీట్లు ఖరారు చేయకపోవడం వివాదానికి దారితీస్తోంది. మరోవైపు ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కూడా వారికి తలనొప్పిగా మారింది. నర్సాపురం అభ్యర్థిగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణంరాజు వైఎస్సార్సీపీలో చేరడంతో అక్కడ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో పాటు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పోటీలోకి దింపాలని చూశారు. అయితే వారిద్దరు కూడా సుముఖత చూపకపోవడంతో అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీ మోహన్ ఓటమి భయంతో పోటీ చేయడానికి ఇష్టపడని సంగతి తెలిసిందే. ఏలూరు స్థానాన్ని కూడా ఇంకా ఖరారు చేయలేదు. మాగంటి బాబును అసెంబ్లీకి పోటీ చేయించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు నిడదవోలు నియోజకరవ్గంలో టీడీపీ నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యేని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాల్సిందేనని నేతలు పట్టుపడుతున్నారు. ఆయన స్థానంలో ఎవరికి సీటు ఇచ్చినా మద్దతు తెలియచేస్తామని కుందుల సత్యనారాయణ వర్గం చెబుతోంది. ఒకవైపు బూరుగుపల్లి శేషారావు తనకే సీటు వచ్చిందని చెబుతుండగా, కుందుల సత్యనారాయణ ప్రచారానికి శ్రీకారం చుట్టి అక్కడ తన బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. -
చింతమనేని వర్సెస్ ముళ్లపూడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో కుంపట్లు పెరిగిపోతున్నాయి. ఆధి పత్య పోరుతో నాయకులు రోడ్డెక్కడం పరిపాటిగా మారిపోయింది. మద్యం షాపుల గొడవతో ఎడమొహం పెడమొహంగా మారిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య తాజాగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబునాయుడి వ ద్దకు చేరింది. వీరి గొడవకు పంచాయతీరాజ్ డీఈ ఒకరు సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల పెదవేగి మండలం ముండూరులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ గ్రామానికి చెందిన సొసైటీ మాజీ అ ధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ తండ్రికి జిల్లా పరిషత్ చైర్మన్‌తో బంధుత్వం ఉంది. మరోవైపు ప్రొటోకాల్ కూడా ఉండటం తో ఆ శిలాఫలకాలపై జెడ్పీ చైర్మన్ పేరు వేయించారు. అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జెడ్పీ చైర్మన్ పేరు వేస్తే తాను రానని చెప్పడంతో అతని పేరు ఉన్న చోట పెయింటింగ్ వేశారు. అదేచోట స్థానిక ఎంపీటీసీ పేరు వేయాలని చింతమనేని అడగ్గా ముండూరు నాయకులు ససేమి రా అన్నారు. చింతమనేని రానని చెప్పడంతో గ్రామ సర్పంచ్ పేరుతో శిలాఫ లకం తయారు చేసి వారే ప్రారంభోత్సవాలు చేసేశారు. ఈ విషయం జెడ్పీ చైర్మన్ దృష్టికి వెళ్లింది. కలెక్టర్‌కు ఫిర్యాదు ప్రొటోకాల్ ప్రకారం తన పేరు వేయకుండా ఎందుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ జెడ్పీ చైర్మన్ బాపిరాజు పంచాయతీరాజ్ ఎస్ఈని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో దెందులూరు నియోజకవర్గంలో జరిగిన అన్ని ప్రారంభోత్సవాల వివరాలు, ఫొటోలు కావాలని అడిగారు. ఫొటోలు తెప్పించుకుని తనపేరు ఎక్కడా లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకువెళ్లారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి తన పేరు వేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పినట్టు సమాచారం. అధికారులపై చర్య తీసుకుంటారు గాని, విప్‌పై చర్యలు ఏ ముంటాయని ప్రశ్నించిన బాపిరాజు అసలు మీరు ఇచ్చిన చనువు వల్లే ఇలా జరుగుతుందని కలెక్టర్‌పై నిష్టూరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పంచాయతీరాజ్ అధికారులపై ఆగ్రహం విషయం తెలిసిన జిల్లా ఇన్చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు జెడ్పీ చైర్మన్‌కు ఫోన్ చేసి తనను కలవాలని, కూర్చొని వివా దం పరిష్కరించుకుందామని చెప్పారు. అందుకు సుముఖంగా లేని జెడ్పీ చైర్మన్ బాపిరాజు శుక్రవారం రాత్రి అమరావతిలో సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన ఆధీనంలో ఉన్న విభాగాల్లో పనిచేస్తూ ప్రొటోకాల్ ప్రకారం తన పేరు వేయకపోయినా తన దృష్టికి తీసుకురాకపోవడంతో ఏలూరు పంచాయతీరాజ్ డీఈపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన సెలవుపై వెళ్లారు. -
‘ ఆ మంత్రిని పిచ్చోడని అంటున్నారు’
పశ్చిమ గోదావరి జిల్లా : టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఈ నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయిన బీజీపీ నేత మాణిక్యాల రావు మీద టీడీపీ నేత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మండిపడ్డారు. మంత్రి మాణిక్యాల రావును ఆయన నియోజకవర్గ ప్రజలు పిచ్చోడని అంటున్నారని బాపిరాజు ఎద్దేవా చేశారు. నిట్‌కు సంబంధించి శంకుస్థాపన సమయంలో వేసిన శిలాఫలకం మినహా ఇప్పటి వరకూ ఒక్క రాయి కూడా వేయలేని అసమర్ధుడు మంత్రి మాణిక్యాల రావు అని సంబోధించారు. మంత్రి గారి అనుచరుల వల్లే అవినీతి పెరిగిందని ఆరోపించారు. ఆరుగోలను గ్రామంలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమంలో మంత్రి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తాడేపల్లి గూడెం, నల్లజర్ల మండలాల్లో జరిగిన అభివృద్ధి దేశవ్యాప్తంగా మరెక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. తాను అవినీతి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. -
కన్నాలేసేవాడే సిగ్గుపడాలి
-
కన్నాలేసేవాడే సిగ్గుపడాలి: మంత్రి
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు మద్దతుగా తనపై విమర్శలు చేసిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌పై మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. తాను నిరంతర శ్రామికుడినని, అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చానని చెప్పుకొచ్చారు. ‘నన్ను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని మున్సిపల్ చైర్మన్ కామెంట్ చేశాడు. అవును నేను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్‌నే. నేను ఈరోజుకీ ఫోటోగ్రాఫర్‌ననే అందరికీ చెప్తా. 24 గంటల్లో 18 గంటలు పనిచేసే నిరంతర శ్రామికుడిని. కష్టపడ్డావోడు సిగ్గుపడక్కర్లేదు, కన్నాలేసేవాడే సిగ్గుపడాలి. నాపై కామెంట్లు చేస్తున్న నీవు నీ చరిత్ర ఏంటో తెలిసుకో, నేను నీ చరిత్ర బయటకు తీయడానికి క్షణం పట్టదు. నీకు దమ్ముంటే నా చరిత్ర గురించి తెలుసుకో. నువ్వెంత వెతికినా నా వెనుక నా కష్టమే కనపడుద్ది. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఫోటోగ్రాఫర్‌గా పనిచేసి అంచెలంచెలుగా కష్టపడి ఈ స్థాయికొచ్చా. నేను ఫొటోగ్రాఫర్‌కు ఫొటోగ్రాఫర్‌ని, ఆటోడ్రైవర్‌కు ఆటో డ్రైవర్, కూలీకి కూలీని. నేనెప్పుడూ కష్టపడే జీవినే, నిరంతర శ్రామికుడినని గర్వంగా చెబుతాన’ని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. -
మా నాయకులు ఫోన్ చేస్తే మాట్లాడరు..
ఏలూరు (మెట్రో) : అధికారులే లక్ష్యంగా జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాప్రతినిధులు చెలరేగి పోయారు. మాటల తూటాలు పేల్చారు. ప్రభుత్వ లోపాలన్నిటికీ అధికారులే బాధ్యులంటూ విరుచుకుపడ్డారు. ‘మా నాయకులు ఫోన్ చేస్తే మాట్లాడరు.. ఏ పని చెప్పినా చేయడం లేదు.. మమ్మల్నీ లంచాలు అడుగుతున్నారు. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది’ అంటూ నిప్పులు చెరిగారు. ‘మా నాయకులు అడిగే విషయాలకు సమాధానం చెప్పకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షత గురువారం జరిగింది. తొలుత ఉపాధి హామీ పథకం ప్రగతిపై సమీక్ష ప్రారంభించిన ప్రజాప్రతి నిధులు అడుగడుగునా అధికారులపై విరుచుకుపడ్డారు. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో ఆ శాఖ అధికారులపై మూకుమ్మడిగా మాటల యుద్ధం మొదలుపెట్టారు. తన నియోజకవర్గ పరిధిలో వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది లేకుండాపోయారంటూ నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు డీఎంహెచ్‌వో కోటేశ్వరిపై ఒంటికాలిపై లేచారు. ఫోన్ చేసినా సమాధానం చెప్పడం లేదన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మాట్లాడుతూ చిన్న రోగానికీ రిఫరల్ అంటూ వేరే ఆసుపత్రులకు తరలిస్తున్నారని, కనీసం నాడి పట్టుకుని రోగం ఏమిటో కూడా వైద్యులు చూడటం లేదన్నారు. కొవ్వూరు జెడ్పీటీసీ మాట్లాడుతూ లంచం ఇస్తేనే వైద్యం చేస్తున్నారని, తాను ఓ గర్భిణిని వైద్యసేవల కోసం తీసుకెళితే రూ.5 వేలు ఇస్తేనే వైద్యం చేస్తామన్నారని ఆరోపించారు. గోపాల పురం ఎమ్మెల్యే ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఎవరిని బదిలీ చేస్తున్నారో, ఎవరిని నియమిస్తున్నారో కూడా తెలియడం లేదన్నారు. ఫోన్లు కూడా మాట్లాడలేరా ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కల్పించుకుని ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే కూడా మాట్లాడలేని స్థితిలో ఉంటున్నారా.. ఇలాగైతే వేరే చోటు చూసుకోండి’ అన్నారు. ఇలా అయితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వో కోటేశ్వరి మాట్లాడుతూ లోపాలను సవరించుకుంటామన్నారు. సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని, త్వరలోనే కలెక్టర్‌కు నివేదిస్తామని అన్నారు. రుణ మాఫీ పత్రాలెక్కడ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రుణమాఫీ పొందిన రైతులకు రెండోవిడత రుణ మాఫీ పత్రాలు అందలేదన్నారు. కాపు రుణాలకు సబ్సిడీ అందడం లేదన్నారు. ఇదిలావుండగా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పనితీరుపై జెడ్పీటీసీలు విమర్శలు గుప్పించారు. ప్రతినెలా 85 వేల కార్డుదారులకు రేషన్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రతి నెలా సమస్యలు ఎందుకు వస్తున్నాయని విరుచుకుపడ్డారు. నియోజకర్గంలో ఎక్కడ కుట్టుమెషిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు సమాధానమిస్తూ నియోజకర్గంలో ఏదో ఒక మండల కేంద్రంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామనీ, ఇకపై సమాచారాన్ని అందిస్తామని చెప్పారు. జెడ్పీ చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 800 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. కలెక్టర్ భాస్కర్‌భూషణ్ మాట్లాడుతూ జిల్లాలో సాగులో యాంత్రీకరణణు ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇదేం పరిపాలన : ఎమ్మెల్సీ శేషుబాబు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు నేటికీ ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయలేదన్నారు. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు ఇస్తున్నాం, పామాయిల్ ఇస్తున్నాం, అన్ని నిత్యావసరాలు ఇస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కేవలం బియ్యం, పంచదార ఇచ్చి చేతులు దులుపుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ ఇళ్లు అనే నినాదంతో గృహాలు మంజూరు చేసినా జిల్లాలో ఒక్క గృహాన్ని కూడా పేదలకు నిర్మించి ఇవ్వకుండా రాష్ర్ట ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, గన్ని వీరాంజనేయులు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్సీలు కంతేటి సత్యనారాయణ, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు వెంకటరమణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయ్యవరపు రామమూర్తి, జెడ్పీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
రాజీనామా చేస్తానన్న మంత్రి... దిగొచ్చిన బాబు
జెడ్పీ చైర్మన్ బాపిరాజుపై సీఎం ఆగ్రహం మిత్రపక్షంతో ఘర్షణ వైఖరి తగదని హితవు నష్ట నివారణ బాధ్యత కళా వెంకట్రావుకు అప్పగింత ఏలూరు : రాజీనామా చేస్తానన్న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వ్యాఖ్యలతో దిగివచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. జెడ్పీ చైర్మన్ ముళ్ల పూడి బాపిరాజుపై మండిపడ్డారు. భవిష్యత్‌లో ఇటువంటి చర్యలకు పాల్పడవద్దంటూ అక్షింతలు వేశారు. సమస్య పరిష్కార బాధ్యతను ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు, రెడ్డి సుబ్రహ్మణ్యంకు అప్పగించారు. పెంటపాడు మండలం ఆకుతీగపాడు, పడమర విప్పర్రు, అలంపురం గ్రామాల్లో సుమారు రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులు ప్రారంభించడానికి జెడ్పీ చైర్మన్ బాపిరాజు బుధవారం ఏర్పాట్లు చేసుకున్న సంగతి విదితమే. ఈ విషయాన్ని మంత్రి మాణిక్యాలరావుకు తెలియజేయలేదు. దీనిపై ఆగ్రహించిన మంత్రి విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన ఆయన ఒక దశలో పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారనే ప్రచారం జరిగింది. దీంతో కంగుతిన్న టీడీపీ నేతలు రంగంలోకి దిగి సీఎం చంద్రబాబు ఎదుట పంచాయితీ ఏర్పాటు చే శారు. గురువారం రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇరువర్గాలతో సమావేశమయ్యారు. ఫిర్యాదుల కట్టతో సీఎం చెంతకుముఖ్యమంత్రి సమక్షంలో పంచాయితీకి వెళ్లేముందు జెడ్పీ చైర్మన్ బాపిరాజు పెద్ద కసరత్తే చేశారు. తాడేపల్లిగూడెంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీపీలు, ఇతర ముఖ్య నాయకులతో గురువారం ఉదయం సమావేశమయ్యారు. మంత్రికి వ్యతిరేకంగా వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తల క్లిప్పింగులను సేకరించి ఒక ఫైల్ తయారు చేశారు. ఓటుకు నోటు కేసు వెలుగు చూసిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పదవి నుంచి తప్పుకోక తప్పదని మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలు చేశారని, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారనే ఫిర్యాదులను సైతం సిద్ధం చేశారు. ముఖ్యంగా మైనారిటీ నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఇవన్నీ ముఖ్యమంత్రి ఎదుట ఉంచి పంచాయితీ చేయాలని భావించారు. అయితే, చంద్రబాబు అందుకు అవకాశం ఇవ్వలేదని సమాచారం. బాపిరాజు తాడేపల్లిగూడెంకు సంబంధించిన అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేయగా సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ‘నువ్వేం చెప్పవద్దు. గతంలోనే నీకు చెప్పాను. ఇది మంచి పద్ధతి కాదు. మిత్రపక్షాన్ని కలుపుకుపోవాల్సిన సమయంలో సమస్యలు సృష్టించవద్దు’ అని గట్టిగా చెప్పడంతో బాపిరాజు మౌనం వహించినట్టు సమాచారం. ఇదిలావుండగా, జెడ్పీ చైర్మన్ తీరుపై మంత్రి మాణిక్యాలరావు తన వాదనను గట్టిగానే వినిపించినట్టు భోగట్టా. తాను నియోజకవర్గంలో లేని సమయంలోనే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని ఆధారాలతో సహా ముఖ్యమంత్రి ముందు ఉంచారు. తాను మంత్రిని అయినా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేననే కనీస ప్రోటోకాల్ కూడా పాటించకుండా చేపడుతున్న కార్యక్రమాలు ఇబ్బందిగా మారుతున్నాయని మంత్రి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. భవిష్యత్‌లో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ముఖ్యమంత్రి బాధ్యత అప్పగించారు. -
భగ్గుమన్న మిత్రభేదం
టీడీపీ, బీజేపీ మధ్య తారస్థాయికి విభేదాలు మంత్రి మాణిక్యాలరావుకు తెలియకుండా శంకుస్థాపనలు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి వైఖరిపై సీఎంకు ఫిర్యాదు దిగివచ్చిన టీడీపీ అధిష్టానం ముళ్లపూడి దూకుడుకు కళ్లెం వేస్తామని హామీ ఏలూరు : మిత్రపక్షాలు వైరివర్గాలుగా మారాయి. ‘కలిసి మెలిసి విరోధం’ అన్నచందంగా కత్తులు దూస్తున్నాయి. తాజాగా తాడేపల్లిగూడెం కేంద్రంగా టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు బుధవారం మరోసారి భగ్గుమన్నాయి. ఈ నియోజకవర్గంలో మిత్రపక్షాల మధ్య చెలిమి దాదాపు కంచికి చేరింది. నియోజకవర్గంలో తన ముద్ర ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, తమ పట్టు కోల్పోకూడదని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఎవరికి వారే పంతాలకు పోతుండటంతో ఇరువురి మధ్యా రాజకీయ రచ్చ తారస్థాయికి చేరింది. మంత్రి మాణిక్యాలరావుకు తెలియకుండా ముళ్లపూడి బాపిరాజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని పెంటపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం సన్నద్ధం కావడం వివాదానికి దారితీసింది. దీనిపై మంత్రి మాణిక్యాలరావు సీరియస్ అయ్యారు. ప్రారంభోత్సవాలను నిలుపుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అవసరమైతే తాను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోనని అల్టిమేటం ఇచ్చారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పొత్తు ‘పొడిచింది’ పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం స్థానాన్ని టీడీపీ వదులుకుంది. ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో పైడికొం డల మాణిక్యాలరావు పోటీచేసి విజయం సాధించారు. తదనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఇదే సీటును ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి, తప్పని పరిస్థితుల్లో రేసు నుంచి తప్పుకున్న ముళ్లపూడి బాపిరాజుకు మంత్రితో విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముళ్లపూడిని బుజ్జగించి ఆయనకు జెడ్పీ చైర్మన్ గిరీ కట్టబెట్టారు. పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఈలి నాని టికెట్ ఆశించి టీడీపీలో చేరారు. ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. ఎన్నికల నాటి విషయాలు ఇలా ఉంటే.. నియోజకవర్గంలో తనదైన మార్కు కోసం మాణిక్యాలరావు ప్రయత్నించడం, తమను కలుపుకుని వెళ్లడం లేదంటూ టీడీపీ నేతలు కయ్యానికి కాలు దువ్వడంతో విభేదాలు ముదిరాయి. గతంలో రాష్ర్ట ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు సమక్షంలో జెడ్పీ చైర్మన్, మంత్రి ఒకరినొకరు విమర్శించుకున్న సంగతి తెలిసిందే. మంత్రి శిద్ధా రాఘవరావు పెంటపాడు మండలం ప్రత్తిపాడు సర్పంచ్ ఇంటికి మాణిక్యాలరావుతో కలసి వెళ్లారు. అదే సమయానికి అక్కడకు వచ్చిన జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఆవేశంగా.. మీరు ఇటీవలే బీజేపీలో చేరిన సర్పంచ్ భర్త వీర్ల గోవిందు వద్దకు వెళ్తే టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిం టాయని మంత్రి శిద్ధాను ఉద్దేశించి అన్నారు. ఇందుకు మంత్రి మాణిక్యాల రావు అభ్యంతరం చెప్పగా, బాపిరాజు ఆవేశంగా.. ‘చాన్నాళ్లు ఓపికపట్టాం. మీ తీరు భరించలేకే ఇలా మాట్లాడుతున్నాం’ అంటూ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదమంటూ బాపిరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రిది, నాదీ ఒకేస్థాయి. ఆయనకు నీలం బుగ్గ కారు ఉంది. నాకూ ఉంది. అభివృద్ధి కోసం బీజేపీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మాకు జిల్లాలో ఏ మూలకు వెళ్లినా బోల్డంత పార్టీ కేడర్ ఉంది’ అంటూ గతంలో బాపిరాజు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో 15వ వార్డు కౌన్సిలర్ చుక్కా కన్నమనాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి పీతల సుజాత సమక్షంలోనూ మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి హోదాలో మాణిక్యాలరావు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళుతుంటే టీడీపీ నుంచి సర్పంచ్ స్థాయి వ్యక్తి కూడా హాజరు కావడం లేదు. దీంతో తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘ఇక్కడ ప్రైవేటు సామ్రాజ్యం నడుస్తోంది. కేబినెట్ క్యాడర్ కలిగిన మంత్రి వస్తే సర్పంచ్ కూడా రావడం లేదు’ అని మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలు చేసేం తగా విబేధాలు పెరిగిపోయాయి. తాజాగా పెంటపాడు మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంత్రికి ఆహ్వానం లేకపోవడం వివాదాస్పదమైంది. విషయం తెలుసుకున్న మాణిక్యాలరావు వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావుతోపాటు ఉన్నతాధికారులకు ఫోన్లుచేసి బాపిరాజు తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు వెంటనే శంకుస్థాపన కార్యక్రమాలు వాయిదా వేయాలంటూ ముళ్లపూడికి సూచించారు. చంద్రబాబునాయుడు మంత్రితో మాట్లాడుతూ తొందరపడవద్దని, అన్ని విషయాలు మాట్లాడుకుందామని నచ్చచెప్పారు. విజయవాడలో జరిగే కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రానుండటంతో ఆయన వద్దే ఈ పంచాయితీ తేల్చేందుకు మంత్రి మాణిక్యాలరావు సన్నద్ధం అవుతున్నారు. దీనిపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ ఇద్దరి మధ్యా విభేదాలు లేవని, ఆయన ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే తాను జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని పరోక్షంగా హెచ్చరిం చారు. ఇరువురి మధ్య పంచాయితీ సీఎం చెంతకు చేరడంతో దీనికి ముగింపు ఏ విధంగా పలుకుతారనే అంశంపై రాజ కీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
'నీరు-చెట్టు'లో అవినీతి అంతు తేలుస్తా
జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సర్వసభ్య సమావేశం బడ్జెట్ ఆమోదం సాగునీరు, పారిశుధ్యానికి నిధుల పెంపు మహిళా శిశు సంక్షేమ శాఖ నిధుల కోత సాధారణ విద్యకూ నిధుల తగ్గింపే గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు శూన్యం ఏలూరు : నీరు-చెట్టు పథకంలో చోటుచేసుకున్న అవినీతి అంతు తేలుస్తానని పశ్చిమ గోదావరి జిల్లాపరిషత్ చైర్మన్ ముళ్లపూడిబాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులో జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నల్లజర్ల మండలంలో చెరువుల తవ్వకాలపై ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టరు, మధ్యవర్తిత్వం చేసిన ఒక వ్యక్తి కలిసి రూ.9లక్షలకు పూర్తి చేయాల్సిన పనిని రూ.40లక్షలకు పూర్తి చేసినట్లు రికార్డుల్లో చూపించి ప్రభుత్వ ధనాన్ని అడ్డంగా బొక్కేశారని ఆయన మండిపడ్డారు. దీనిపై ఇరిగేషన్ ఎస్ఈని, ఈఈని వివరణ కోరారు. వారి వివరణతో శాంతించని చైర్మన్ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు సూచించారు. కలెక్టర్ స్పందించి చెరువుల నిర్మాణం చేపట్టిన గ్రామాల్లో బహిరంగ విచారణకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. మంగళవారం ఈ మేరకు విచారణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతకుముందు బడ్జెట్‌ను సమావేశం ఆమోదించింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం మూడున్నరగంటల వరకూ సాగింది. బడ్జెట్లో సాగునీరు, పారిశుధ్యానికి పెద్దపీట వేశారు. గత బడ్జెట్లో రూ.99లక్షల నిధులు కేటాయిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక కోటీ 60లక్షలు కేటాయించారు. గత బడ్జెట్లో సాధారణ విద్యకు రూ.88లక్షల 54వేలు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.28లక్షల 70వేలు మాత్రమే కేటాయించారు. మహిళా శిశు సంక్షేమశాఖకు గత బడ్జెట్లో రూ.కోటి 60లక్షలు కేటాయించగా, దానిని ఈ సారి రూ.కోటి 13లక్షలకు కుదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి గత బడ్జెట్లో రూ. రూ.కోటి 48లక్షల 39వేలు కేటాయించగా, ప్రస్తుతం రూ.కోటి 59లక్షలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి గత బడ్జెట్లో రూ.150కోట్లు కేటాయించగా, ఈ సారి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తానికి గత బడ్జెట్‌ను రూ.603కోట్ల 44లక్షల 41వేల 200లతో రూపొందించి దాన్ని రూ. 396కోట్ల 4లక్షల 75వేల 900కు సవరించారు. ప్రస్తుతం గత సంవత్సరం సవరించిన అంచనాల ఆధారంగా కాస్త ఎక్కువగా రూ.360కోట్ల 18లక్షల 59వేల 400ల నిధులతో బడ్జెట్‌ను రూపొందించారు. నామమాత్రపు ఫీజుతో పరీక్షలు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో పలు రకాల పరీక్షలను రూ.110 నామమాత్రపు ఫీజుతో చేయనున్నట్టు కలెక్టర్ వివరించారు. ఆస్పత్రుల్లో వారంలో రోజుకొక రంగు చొప్పున ఏడు బెడ్షీట్లు వాడేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రూ.133 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం అనంతరం జెడ్పీ చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ.. జిల్లాలో రూ. 133 కోట్లతో 700 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తిచేసి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో అన్నిశాఖల అధికారులు పనిచేయాలని సూచించారు. కలెక్టర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ.. పనికి ఆహార పథకం ద్వారా ఇంతవరకూ కోటిపనిదినాలు కల్పించి రూ.180 కోట్లు విలువ గల పనులు పూర్తి చేయడం జిల్లాకే గర్వకారణమన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణాలకు ఇంతవరకూ సబ్సిడీలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జలసిరికి పథకానికి వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇవ్వాలని కోరారు. తణుకు నియోజకవర్గంలో రూ. 5 కోట్లతో అనుమతులు లేకుండా మీట్ అండ్ వెజిటబుల్ ప్రొసెసింగ్ యూనిట్ పేరుతో కబేళాలు నిర్మించి దాని ద్వారా మాంసాన్ని ఇతర దేశాలకు విక్రయం చేస్తున్నారని, దీనివల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, వాటిని వెంటనే ఆపాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సమావేశంలో పలు శాఖల పనితీరుపై అధికారులతో చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, కలెక్టర్ కాటంనేని భాస్కర్ సమీక్షించారు. అనంతరం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సమాధానాలిచ్చారు. -
పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదు
తాడేపల్లిగూడెం : దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపై జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఈ వ్యవహారం కాస్తా బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపింది. బీజేపీ జోలికొస్తే జెడ్పీ చైర్మన్‌కు తమ తడాఖా ఏమిటో చూపిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మంగళవారం హెచ్చరిక జారీ చేశారు. బీజేపీ నాయకులతోకలసి పని చేయడానికి తాము సిద్ధమే కానీ.. టీడీపీ ఓటమికి కృషి చేసిన వారిని అక్కున చేర్చుకుని టీడీపీ నేతలను పక్కన పెడితే చూస్తూ ఊరుకునేది లేదని ముళ్లపూడి బాపిరాజు సవాల్ విసిరారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో మంత్రులు శిద్ధా రాఘవరావు, పైడికొండల మాణిక్యాలరావు సమక్షంలో సోమవారం జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేసిన వ్యాఖ్యలు.. జెడ్పీ చైర్మన్, మంత్రి పైడికొండల మధ్య తలెత్తిన వాగ్వివాదం నేపథ్యంలో మంగళవారం బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు. పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదు : ముళ్లపూడి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ టీడీపీతో పొత్తు లేకుంటే బీజేపీకి సినిమా లేదన్న సంగతి ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో మంత్రి, తనమధ్య కేవలం సమాచార లోపం వల్లే వాగ్వా దం జరిగిందన్నారు. బీజేపీ, టీడీపీ మధ్య గొడవలు అభివృద్ధిపై ప్రభావం చూపుతాయని కొందరు ఆందోళన చెందుతున్నారన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, ఈ విషయంలో కొట్లాడుకునే ప్రశ్న కూడా లేదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి మాణిక్యాలరావు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని, రాష్ట మంత్రి వర్గంలో మంత్రిగా మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్‌గా తాను ఉన్నాం కాబట్టి అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయాలన్నారు. పదేళ్లపాటు అధికారం లేకపోయినా, ఉప ఎన్నికలలో వైఎస్సార్ సీపీ విజయాలు సాధిస్తున్నా, టీడీపీ పోటీ చేస్తే గెలుస్తుందో లేదో అనే అనుమానం ఉన్న సందర్భంలో టీడీపీ విజయానికి కార్యకర్తలు కష్టపడ్డారన్నారు. తాడేపల్లిగూడెం సీటును బీజేపీకి కేటాయించడంతో ఆ అభ్యర్థిని గెలిపించేందుకు టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు కృషి చేశారన్నారు. అలాంటి వారిని దగ్గరకు తీసుకోవాలని మంత్రిని కోరామని చెప్పా రు. బీజేపీలో వేరే పార్టీ వాళ్లను చేర్చుకుని తమపై పెత్తనం చేయవద్దనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. జన్మభూమి కమిటీలు ఉండగా, వారిని కాదని బీజేపీలో చేరిన నాయకులు ప్రవర్తించడం వల్ల గ్రామాలలో వాతావరణం కలుషితమవుతోందన్నారు. ఇది తప్పని చెప్పినా కొందరు బరితెగించి, రాజ్యాంగేతర శక్తులుగా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్నారు. చిల్లర గొడవలు, చిల్లర వ్యక్తులను రెచ్చగొట్టి విలువైన సమయాన్ని వృథా చేయవద్దని జెడ్పీ చైర్మన్ సలహా ఇచ్చారు. మా తడాఖా చూపిస్తాం : శ్రీనివాసవర్మ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ కార్యక్రమాలకు అతిథిగా వచ్చిన వ్యక్తులను గౌరవించడం సంప్రదాయమని, అందుకు విరుద్ధంగా మంత్రి శిద్ధా రాఘవరావును బాపిరాజు అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే రెండు పార్టీలకు జిల్లా కమిటీలు ఉన్నాయని, వాటి సమక్షంలో మనసు విప్పి మాట్లాడుకోవచ్చని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఏఎంసీ పాలకవర్గాన్ని ప్రకటించే సమయంలో మంత్రి మాణిక్యాల రావు అభిప్రాయం తీసుకున్నా, బీజేపీ వారికి కనీసం రెండు డెరైక్టర్ పదవులైనా ఇవ్వలేదన్నారు. సాగునీటి సంఘాల్లోనూ బీజేపీ కార్యకర్తలకు పదవులు ఇవ్వలేదన్నారు. మునిసిపల్ వైస్ చైర్మన్ విషయంలో మంత్రిని సంప్రదిం చారా, ఇది ఏ సంప్రదాయం అని నిలదీశారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరు వచ్చినా బీజేపీలో చేర్చుకుంటామని చెప్పారు. బీజేపీని, పార్టీ నాయకులను చులకనగా చూస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుల కారణంగా రాష్ట్రంలో బీజేపీ నష్టపోయిందన్నారు. ‘బీజేపీతో పొత్తు గురించి మాట్లాడటానికి బాపిరాజుకున్న అర్హత ఏమిటి, బీజేపీ నాయకులుగా మా అనుభవం ఎంత, టీడీపీ నాయకునిగా మీ అనుభవం ఎంత’ అని వర్మ ప్రశ్నిం చారు. ‘జెడ్పీ చైర్మన్‌ను కదా.. లోకేష్ చుట్టూ తిరుగుతున్నా కదా అనుకుంటున్నారేమో. బీజేపీపై పెద్దన్న పాత్ర పోషిద్దామనుకుంటే మా తడాఖా చూపిస్తాం’ అని వర్మ హెచ్చరిం చారు. నిట్‌ను ఏలూరు తరలించేందుకు జెడ్పీ చైర్మన్ ప్రయత్నించడం నిజం కాదా అని నిలదీశారు. తాడేపల్లిగూడెంకు నిట్ తెచ్చి, అమృత్ పథకంలో ఈ మునిసిపాలిటీ పేరు చేర్చి, విమానాశ్రయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న మంత్రి మాణిక్యాలరావును కలుపుకుని వెళ్లడం మాని చీఫ్ పాపులారిటీ కోసం పాకులాడితే వ్యతిరేకిస్తాం అని శ్రీనివాసవర్మ హెచ్చరించారు. టీడీపీ శ్రేణులు కలిసి వచ్చినా, రాకపోయినా రానున్న మూడున్నరేళ్లలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి మంత్రితోపాటు బీజేపీ కూడా పాటుపడుతుందన్నారు. ‘అగ్రెసివ్నెస్ కుటుంబంలో చెల్లుతుంది. ప్రజల్లోను, పార్టీలోను చెల్లదు. టీడీపీ విజయం వెనుక బీజేపీ, జనసేన ఉన్నాయన్న విషయాలను మర్చిపోకూడదు’ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ భిక్షతోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని వర్మ వ్యాఖ్యానించారు. -
ఇద్దరి మధ్య ‘ఇగో’ చిచ్చు
ఏలూరు : పోటాపోటీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు తహతహలాడాల్సిన టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ నాయకులు ‘ఇగో’ సమస్యతో కత్తులు దూస్తున్నారు. ఎక్కడికక్కడ తమ వర్గానిదే పైచేయి కావాలంటూ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, టీడీపీ నేత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య కొన్నాళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. తాజా గా సోమవారం ఆ ఇద్దరూ ఇరు పార్టీల శ్రేణుల సమక్షంలోనే ఆరోపణలు గుప్పించుకున్నారు. తాడేపల్లిగూడెంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, దేవాదాయ శాఖ మం త్రి పైడికొండల మాణిక్యాలరావు పెంటపాడు మండలం ప్రత్తిపాడు వెళ్లారు. అక్కడ పంచాయతీ కార్యాలయంలో వారికి అల్పాహారం ఏర్పాటు చేయగా, అదే సమయానికి జెడ్పీ ముళ్లపూడి బాపిరాజు, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. బాపిరాజు మంత్రి మాణిక్యాలరావును ఉద్దేశించి ‘నమస్కారం మినిస్టర్ గారూ.. మా పార్టీ వాళ్లను కాస్త చూడండి. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి చాలా కష్టాలు పడ్డారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఇటీవల ప్రత్తిపాడులో మీరు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించేందుకు వెళ్లినప్పుడు అక్కడ మా ఎంపీటీసీకి కనీస సమాచారం ఇవ్వలేదు. ఇలాగైతే ఎలా’గని అసహనం వ్యక్తం చేశారు. ‘టీడీపీ శ్రేణులను కాకుండా ప్రతిపక్ష పార్టీల వాళ్లను మీరు వెంటేసుకుని తిరుగుతూ ప్రోత్సహిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఏం మాట్లాడుతున్నారు. 35 ఏళ్లు నేను కూడా ప్రజాసేవలో ఉండే రాజకీయాల్లోకి వచ్చాను. నేనేం చేయాలో మీరు చెబుతారా’ అని మాణిక్యాలరావు ఘాటుగానే మాట్లాడినట్టు తెలిసింది. వాగ్వాదం ముదిరి పరిస్థితి ఒకింత ఉద్రిక్తపూరితంగా మారడంతో మంత్రి శిద్ధా రాఘవరావు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప చేశారు. -
కాల్‌మనీ దందాలో టీడీపీ నేత ముళ్లపూడి
కాలాంతకుల వ్యాపారంలో పెట్టుబడి రూ.కోటి జెడ్పీ చైర్మన్ బాపిరాజు బినామీ ఏ-6 శ్రీకాంత్ విచారణ జరుపుతున్నామన్న మాచవరం సీఐ విజయవాడ : కాల్‌మనీ దందా కేసులో పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు పాత్ర ఉందనే కోణంలో పోలీస్ దర్యాప్తు సాగుతోంది. రూ.కోటి వరకు బాపిరాజు పెట్టుబడి పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. కాల్‌మనీ నిందితుల్లో ఏ-6గా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ బాపిరాజుకు అత్యంత సన్నిహితుడు. అతని పేరుతోనే ఈ పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో ఎంబీఏ చదివినప్పటి నుంచి వారిద్దరూ స్నేహితులు. నల్లజర్ల మండలం సోమాలమ్మ ఆలయం వద్ద ముళ్లపూడి వర్గీయులు గతంలో వేసిన రియల్ వెంచర్లో కూడా పెండ్యాల శ్రీకాంత్ స్లీపింగ్ పార్టనర్‌గా వ్యవహరించాడు. ముళ్లపూడి రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఆర్థిక వ్యవహారాలన్నీ శ్రీకాంత్ చూస్తుంటారన్న ప్రచారం ఉంది. జెడ్పీ చైర్మన్‌గా ప్రభుత్వం ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం వాహనం ఇచ్చిన తర్వాత గతంలో తాను వినియోగించిన ఇన్నోవా కారును శ్రీకాంత్‌కే బాపిరాజు ఇచ్చేశారు. దీన్ని బట్టి వారి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాంత్ దొరికితే స్పష్టత : సీఐ ఉమాహేశ్వరరావు కాల్‌మనీ కేసులో ఏ-6 నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ పట్టుబడితే పశ్చిగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పాత్రపై స్పష్టత వస్తుందని కాల్‌మనీ కేసు పర్యవేక్షిస్తున్న విజయవాడ మాచవరం సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. -
కస్సుబుస్సులు
అధికారులపై దుమ్మెత్తిపోసిన జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి హాజరు కాని వారికి మెమోలు ఇవ్వాలని ఆదేశం మొబైల్ ఏటీఎంల ద్వారా పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామన్న చింతమనేని జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాల తీరిది ఏలూరు (టూ టౌన్) : ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు 50 కిలోమీటర్ల దూరం నుంచి సమావేశానికి వస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉండే అధికారులు మాత్రం ఎందుకు హాజరుకావడం లేదు. సీఎంతో సమావేశం, కలెక్టర్‌తో మీటింగ్ అంటున్నారు. అలాంటివి ఉంటే మాకు చెప్పాల్సిన పనిలేదా’ అంటూ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ స్థాయూ సంఘ సమావేశాలు బుధవారం జెడ్పీ ప్రాంగణంలో జరిగాయి. బాపిరాజు మాట్లాడుతూ సమావేశానికి హాజరుకాని అధికారులకు మెమోలు ఇవ్వాలంటూ సీఈవో డి.సత్యనారాయణను ఆదేశించారు. సమావేశాలకు కిందిస్థారుు అధికారులు హాజరుకావడంతో వారిని వెనక్కి పంపించివేశారు. ఇదిలావుండగా, మత్స్య శాఖకు సంబంధించి ఆ శాఖ అధికారి వివరాలు చెబుతున్నప్పుడు ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ అడ్డు తగిలారు. చేపల చెరువులకు జిల్లా స్థాయి అనుమతుల విషయంలో 8 శాఖలకు చెందిన అదికారులతో కమిటీ వేశారని, దీనివల్ల వారందరి చేతులు తడిపాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై ప్రత్యమ్నాయం ఆలోచించాలని జెడ్పీ చైర్మన్‌కు సూచించారు. సహకార శాఖ డెప్యూటీ రిజిస్ట్రార్ ఆరిమిల్లి శ్రీనివాస్ ఆ శాఖకు సంబంధించి వివరాలు చెబుతుండగా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకరరావు కలగజేసుకుని శనివారపుపేట సహకార సంఘంపై 51 ఎంక్వైరీ చేయించాలని కోరారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మొబైల్ ఏటీఎంల ద్వారా పింఛన్లు పింఛను లబ్ధిదారులకు మొబైల్ ఏటీఎంల ద్వారా సొమ్ము బట్వాడా చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్టు విప్ చింతమనేని ప్రభాకర్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ప్రతినెలా 1న పింఛన్లు అందటం లేదని, దీనివల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారందరికీ ప్రతినెలా 1వ తేదీనే వేలిముద్ర ఆధారంగా ఏటీఎం కార్డు ద్వారా సొమ్ము ఇచ్చేందుకు అనువుగా మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరతామన్నారు. పదేళ్లుగా పింఛన్లు అందక అవస్థలు పడుతున్న వారి పేర్లను ఆన్లైన్లో పొందుపరిస్తే 50 శాతం మందికి మాత్రమే మంజూరు లభించిందని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే నూరు శాతం మందికి పింఛన్లు మంజూరు చేయూలని డీఆర్డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డిని ప్రభాకర్ ఆదేశించారు. గ్రామాల్లో డ్రెయిన్ల అభివృద్ధికి కృషి జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో రూ.150 కోట్లతో డ్రెరుున్లు, ప్రహరీ గోడలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి పల్లెలో కనీసం 2 కిలోమీటర్ల మేర డ్రెయినేజీ, కాంపౌండ్ వాల్స్ నిర్మాణంతోపాటు రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా డెల్టాలో 22 వేల కిలోమీటర్ల మేర గల పంట కాలువలలో పూడిక తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని, మెట్ట ప్రాంతంలో ఫీల్డ్ చానల్స్ ఆధునికీకరణకు రూ.200 కోట్లు ఖర్చు చేసే యోచనలో ఉన్నామని డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, కేఎస్ జవహర్, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కె.చైతన్యరాజు, గృహ నిర్మాణ శాఖ అధికారి ఇ.శ్రీనివాస్, ఉపాధి కల్పనాధికారి వసంతలక్ష్మి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
ఎంపీడీవోల బదిలీ
ఏలూరు (టూటౌన్) : జిల్లాలోని 48 మంది ఎంపీడీవోలకు 40 మందిని బదిలీ చేశారు. ఎనిమిది మందిని మాత్రం అవే స్థానాల్లో ఉంచారు. జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆధ్వర్యంలో ఇన్చార్జి సీఈవో పి. సుబ్బారావు శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ద్వారకాతిరుమల -కె.పురుషోత్తమరావు, భీమడోలు- ఏవీ విజయలక్ష్మి, లింగపాలెం -ఎస్.ఆశీర్వాదం పాలకోడేరు - పి.వెంకటరత్నం, తాళ్లపూడి - ఎస్.వేణుగోపాల్‌రెడ్డి, ఉండ్రాజవరం - బి. వీరాస్వామి, పాలకొల్లు -ఆర్. విజయరాజు, బుట్టాయిగూడెం- టి.వెం కటలక్ష్మిని పనిచేసే చోటే ఉంచారు. పెనుమంట్ర తహసిల్దార్ ఎస్. వెంకటేశ్వరరావును ఆచంటకు, ఆకివీడు తహసిల్దార్ ఎం. కె.ప్రసన్నను పోడూరుకు, ఆచంట నుంచి డీవీఎస్ పద్మినిని పెనుగొండకు, పెరవలి నుంచి బి. రామప్రసాద్‌ను పెనుమంట్రకు, చింతలపూడి నుంచి వై. పరదేశ్కుమార్ను భీమవరానికి, భీమవరం నుంచి పి.జగదాంబను వీరవాసరానికి, చింతలపూడి ఎంపీడీఓగా ఈవోఆర్డీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. చాగల్లు నుంచి పీకే నిర్మలాదేవిని కామవరపుకోటకు, పోడూరు నుంచి పి.శ్రీదేవిని జంగారెడ్డిగూడెంకు, ఏలూరు నుంచి ఎన్.ప్రకాశరావును దెందులూరుకు, పెదవేగి నుంచి కె. శిల్పను పెదపాడుకు, పెదపాడు నుంచి పి.శ్రీనివాస్‌ను పెదవేగికి, దెందులూరు నుంచి కె.శ్రీదేవిని ఏలూరుకు బదిలీ చేశారు. కొయ్యలగూడెం నుంచి కేఆర్ఎస్ కృష్ణప్రసాద్‌ను గోపాలపురానికి, నిడమర్రు నుంచి కె.కోటేశ్వరరావును దేవరపల్లికి, నల్లజర్ల ఎంపీడీఓగా ఎవరినీ నియమించకుండా ఖాళీగా ఉంచారు. తణుకు నుంచి వై. దాసిరెడ్డిని కొవ్వూరుకు, కొవ్వూరు నుంచి జె.వేణుగోపాల్‌ను చాగల్లుకు, మొగల్తూరు నుంచి కె.కన్నమనాయుడును నరసాపురానికి, నరసాపురం నుంచి ఎన్వీఎస్పీ యాదవ్‌ను మొగల్తూరుకు, అత్తిలి నుంచి ఎ.ఆంజనేయులును నిడదవోలుకు, ఇరగవరం నుంచి ఎస్టీవీ రాజేశ్వరరావును పెరవలికి, పోలవరం నుంచి ఆర్సీ ఆనందకుమార్‌ను యలమంచిలికి, యలమంచిలి నుంచి ఏవీ అప్పారావును పోలవరానికి, కుకునూరు నుంచి బి. రామచంద్రరావును జీలుగుమిల్లికి, జంగారెడ్డిగూడెం నుంచి ఎం.రాజును కొయ్యలగూడెంకు బదిలీ చేశారు. టి నరసాపురం ఎంపీడీవోగా సూపరింటెండెంట్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పెంటపాడు నుంచి జీవీకే మల్లికార్జునరావును తాడేపల్లిగూడెంకు, ఉంగుటూరు నుంచి ఎ.రామును పెంటపాడుకు, తాడేపల్లిగూడెం నుంచి జి. రమణను తణుకుకు, పెనుగొండ నుంచి వి.విజయలక్ష్మిని ఇరగవరానికి, నిడదవోలు నుంచి ఎస్.నిర్మలాజ్యోతిని అత్తిలికి బదిలీ చేశారు. సెలవులో ఉన్న ఎంపీడీవో ఏబీపీవీ లక్ష్మిని ఉండికి, ఉండి నుంచి పి.రమాదేవిని కాళ్లకు, నల్లజర్ల నుంచి శ్రీనాధ్నాయిని ఆకివీడుకు బదిలీ చేశారు. దేవరపల్లి నుంచి జె.రేణుకమ్మను ఉంగుటూరుకు, గోపాలపురం నుంచి డి. దామోదరరావును నిడమర్రుకు, కాళ్ల నుంచి జి. పద్మను గణపవరానికి, టి.నరసాపురం నుంచి ఎం.రాజశేఖర్‌ను కుకునూరుకు, వీరవాసరం నుంచి కేవీఎస్ఆర్ రవికుమార్‌ను వేలేరుపాడుకు బదిలీ చేస్తూ సీఈఓ సుబ్బారావు ఆదేశాలు జారీచేశారు. జిల్లా పరిషత్‌లో పనిచేసే 63 మంది సూపరింటెండెంట్లకు 28 మందిని, 108 మంది సీనియర్ అసిస్టెంట్లకు 56 మందిని, 268 మంది జూనియర్ అసిస్టెంట్లకు 100 మందిని బదిలీ చేశారు. 66 మంది టైపిస్టులకు 14 మందిని, 345 రికార్డు, లైబ్రెరీ, లాబ్ అసిస్టెంట్లకు గానూ 42 మందిని, 483 మంది ఆఫీస్ సబార్డినేట్లలో 56 మందిని బదిలీ చేశారు. డ్త్రెవర్లు ఆరుగురిని, ఎన్‌డబ్ల్యూ, ఎస్.డబ్ల్యూ సిబ్బంది 187 మంది ఉండగా వారిలో ఎవరినీ బదిలీ చేయలేదు. -
ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మాగంటి నాగభూషణం.. ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు.. కనీసం కార్యకర్త కూడా కాదు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వమూలేదు. అయినా సరే ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా స్థలాల కేటాయింపుల్లో అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు బహిరంగంగా మద్దతు పలికారు. చీటింగ్ కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. సోదాలు నిర్వహించేందుకు సోమవారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లగా, అక్కడకు చేరుకున్న చింతమనేని పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మేం డీఐజీతో మాట్లాడుతున్నాం.. మీరు ఇక్కడి నుంచి వెళ్లండి.. అంటూ క్లాస్ పీకారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బజ్జి మౌనంగానే ఉన్నా చింతమనేని, ముళ్లపూడిలు మాత్రం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిళ్లతో అధికారపార్టీ నేతలు విధులకు ఒకింత ఆటంకం కలిగించినప్పటికీ పోలీసులు మాత్రం సోదాలు చేపట్టి ఆయన ఇంట్లో సుమారు 240 ఒరిజనల్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒరిజనల్ డాక్యుమెంట్లు ఎప్పటికప్పుడు స్థల విక్రేతలకు ఇవ్వాల్సి ఉండగా, ఏపీఐఐసీ వారికి చూపించి ఇస్తానంటూ మాగంటి తన వద్దే ఉంచుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మూడేళ్ల కిందట మాగంటిపై చింతమనేని ఫిర్యాదు సరిగ్గా మూడేళ్ల కిందట 2011 నవంబర్ 3వ తేదీన ఇదే మాగంటి నాగభూషణం ఆటోనగర్ స్థలాల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వాణిమోహన్‌కు ఫిర్యాదు చేశారు. తన దెందులూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ ఆటోనగర్ స్థలాల అక్రమాలపై బాధ్యత గల ఎమ్మెల్యేగా ఫిర్యాదు చేస్తున్నానని అప్పటి లేఖలో పేర్కొన్నారు. ఏపీఐఐసీ స్థలాలతో రియల్ ఎస్టేట్‌ను తలపించే విధంగా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన వారికి ఇవ్వకుండా తనకిష్టమైన వారికి ప్లాట్లు రాసిచ్చేస్తున్నారని నిందించారు. ఇదేమని అడిగితే తన కూతురి పేరిట 500 గజాల స్థలం ఇస్తానని మాగంటి ఆశ చూపారని కూడా ప్రభాకర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అదే చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు ప్రభుత్వ విప్ హోదాలో మాగంటి నాగభూషణంకు బహిరంగంగా మద్దతివ్వడం గమనార్హం. మాగంటిని అరెస్టు చేయాల్సిందే నినదించిన ఆటోనగర్ బాధితులు తమకు చెందాల్సిన ఆటోనగర్ భూమిని అక్రమ మార్గంలో నాయకులకు, తన కుటుంబ సభ్యులకు, బంధువులకు కేటాయించిన అధ్యక్షుడు నాగభూషణంను వెంటనే అరె స్ట్ చేయాలని ఆటోనగర్ బాధితులు డిమాండ్ చేశారు. మంగళవారం వారంతా ఆయనకు వ్యతిరేకంగా సీపీఎం జిల్లా కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. -
ప్రకృతి విపత్తుల నివారణకు కొత్త ప్రాజెక్టు
ఏలూరు (సెంట్రల్) : రాష్ట్రంలో రూ.1,200 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో నూతన ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వెల్లడించారు. స్థానిక జిల్లా పరి షత్ అతిథి గృహంలో గురువారం ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ప్రకృతి విపత్తుల నివారణ పథకం కింద రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు వెచ్చించడానికి ప్రపంచబ్యాంకు సుముఖత వ్యక్తం చేసిందని వివరించారు. గత ఏడాది పై-లీన్ తుపాను, భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న నిర్మాణాల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రూ.1,200 కోట్లమేర ఆర్థిక సాయం చేయనుందని, ఈ పనులకు తగు అంచనాలు రూపొందించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఈ పథ కం కింద జిల్లాలోని తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, తుపానుల వల్ల దెబ్బతిన్న గ్రామాల్లోని ప్రధాన రహదారులను పునరుద్ధరించేందుకు రూ.300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీమన్నారాయణ, ఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆర్థిక సంఘం నిధులు తెచ్చేందుకు కృషి ఏలూరు : 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు రూ.16 కోట్ల నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి చెప్పారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగే 14వ ఆర్థిక సంఘ సమావేశానికి తనను ఆహ్వానించారని తెలిపారు. మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి మన జిల్లాకు మొదటి దఫాగా రూ.6.60 కోట్లు మంజూరయ్యూయని చెప్పారు. ఈ నిధులు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతున్నాయని, రోడ్లు, డ్రెరుున్లు తదితర పనుల కోసం 14వ ఆర్థిక సంఘం నుంచి ఇచ్చే నిధులను పెంచాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరతామని జెడ్పీ చైర్మన్ చెప్పారు. ఆర్ అండ్ బీ, పంచా యతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ద్వారా జిల్లాకు వివిధ పనుల నిమిత్తం అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని అడుగుతామన్నారు. -
బాపిరాజు అనుచరుడిపై చర్యలకు డిమాండ్
తాడేపల్లిగూడెం రూరల్ : నల్లజర్లలోని ముత్యాలమ్మ చెరు వు నుంచి అక్రమంగా మట్టి తవ్వుకెళ్లిన వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన పాత్రికేయుడికి జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అనుచరుడిగా పేర్కొంటున్న వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడం పత్రికా స్వేచ్ఛ కు విఘాతమని ఏపీయూడబ్ల్యుజే నా యకులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి వారు ఒక ప్రకటన చేస్తూ పాత్రికేయుడిని బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులు రాసే వార్తా కథనాలను సద్విమర్శలుగా స్వీకరించాలని, అభ్యంతకరమైన విషయాలు ఉంటే వాటిని వివరణలో తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇందుకు విరుద్ధంగా ఫోన్లలో బెదిరించడం తగదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలకున్న స్వేచ్ఛను గౌరవించాలే తప్ప వాస్తవ విషయాలను వెలుగులోకి తెచ్చిన విలేకరులను బెదిరించడం గర్హనీయమన్నారు. అవసరమైతే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకాడేది లేదని పేర్కొన్నారు. ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఆ పార్టీ నేతలకు తగు సూచనుల చేసి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీఎస్ఎన్ రాజు, యూనియన్ జిల్లా శాఖ అధ్యక్షుడు జి.రఘురామ్, కార్యదర్శి వానపల్లి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు యడ్లపల్లి మురళీకృష్ణ, సహాయ కార్యదర్శి ఏవీ నరసింహరావు, ఐజేయూ సభ్యుడు అడపా మాణిక్యాల రావు, తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. బెదిరింపులు తగవు ఏలూరు : ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించేలా బెదిరింపులకు పాల్పడటం జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అనుచరులకు తగదని జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు కె.మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శి కె.వినాయకరావు, కోశాధికారి కేబీఎన్ రాజు పేర్కొన్నారు. మంగళవారం వారొక ప్రకటన చేస్తూ ప్రజా సమస్యలను వెలికితీసే కీలక భూమిక పోషించే జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ప్రజాప్రతినిధులపైనా ఉందని వారు పేర్కొన్నారు. నల్లజర్లలోని ముత్యాలమ్మ చెరువులో మట్టి తవ్వకం వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడిని బెదిరించిన వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేసి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలా కానిపక్షంలో జర్నలిస్టులంతా ఉద్యమిస్తారని హెచ్చరించారు. వార్తాంశాల్లో లోపాలు, తప్పులుంటే వివరణలు ఇవ్వాల్సింది పోయి విపరీత ధోరణితో బెదిరించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. -
అలా రాస్తే నిన్ను లేపేస్తాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు వ్యతిరేకంగా వార్త రాస్తావా.. ఏ ఊరు నీది.. ఎక్కడి నుంచి వచ్చావ్.. ఎంతధైర్యం... ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టినా అడిగేవాడు లేడు’ అంటూ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అనుచరుడు, టీడీపీ నేత గొట్టిముక్కల వేణు సాక్షి ప్రతినిధిని ఫోన్లో తీవ్రస్థాయిలో బెదిరించారు. ‘ముళ్లపూడి చెరలో ముత్యాలమ్మ చెరువు’ శీర్షికన నల్లజర్లలోని చెరువునుంచి నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్న వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. అధికార వర్గాల్లోను, టీడీపీ శ్రేణుల్లోను కలకలం రేపిన ఈ కథనంపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు అక్కడ సాగుతున్న వ్యవహారంపై విచారణ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో సాక్షి ప్రతినిధికి సోమవారం సాయంత్రం సెల్ నంబర్ 94407 75588 నుంచి రెండుసార్లు మిస్డ్ కాల్స్ వచ్చాయి. సాక్షి ప్రతినిధి ఆ నంబర్‌కు ఫోన్ చేయగా, ఫోన్ ఎత్తిన వేణు ‘నేను బాపిరాజు మనిషిని.. ఏమి టా వార్త.. నిన్ను లేపేస్తాం.. ఇక్కడ బతుకుదామనే అలాంటి వార్త రాశావా (పచ్చిబూతులు తిడుతూ) నా వాయిస్ మొత్తం రికార్డు చేసినా నన్నెవరూ పీకలేరు..’ అంటూ పత్రికల్లో రాయలేని భాషలో దుర్భాషలాడారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయన్నదే వార్త సారాంశమని, అనుమతి ఉన్నట్టు చూపిస్తే ఆ వార్త కూడా ప్రచురిస్తామని, మీ వివరణ ఏమిటో పంపించాలని ఎన్నిసార్లు, ఏవిధంగా చెప్పినా అతను మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడి ఫోన్ కట్ చేశారు. -
జెడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక ఏకగ్రీవం
ఏలూరు : జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. 1 నుంచి ఏడు సంఘాల అధ్యక్షులు, సభ్యులను ఆదివారం జెడ్పీలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం అరగంటలో ముగిసింది. జెడ్పీ చైర్మన్ స్థాయీ సంఘాల అధ్యక్షులు, సభ్యుల పేర్లను చదివి వినిపించారు. దానికి అనుగుణంగా జెడ్పీటీసీ సభ్యులు ఒకరు ప్రతిపాదించగా, మరొకరు బలపరుస్తూ ఎన్నిక చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. 46 మంది జెడ్పీటీసీ సభ్యులు, 15 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 69 మంది సభ్యులను ఈ సంఘాల్లోకి ఎంపిక చేశారు. ఆర్థిక ప్రణాళిక స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, సభ్యులుగా నల్లూరి వెంకటచలపతిరావు (టి.నర్సాపురం) బోణం వెంకట నరసింహారావు (యలమంచిలి), మొగతడకల లక్ష్మీరమణి (ద్వారకాతిరుమల), బర్రె విజయ (భీమవరం), గారపాటి శ్రీదేవి (కొవ్వూరు), నేతల బేబి (పాలకోడేరు), ఘంటా సుధీర్‌బాబు (పాలకోడేరు), కోడి విజయలక్ష్మి (పాలకొల్లు), రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి పీతల సుజాత, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను ఎన్నుకున్నారు. గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, సభ్యులుగా కిలపర్తి వెంకట్రావు (పెంటపాడు), కైగాల మంగాభవానీ (తాళ్లపూడి), బండి రామారావు (ఆచంట), ఈలి మోహినీ పద్మజారాణి (గోపాలపురం), గుబ్బల వీర వెంకట నాగరాజు (మొగల్తూరు) ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సభ్యులుగా ఎన్నికయ్యారు. వ్యవసాయశాఖ స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా జెడ్పీ ఉపాధ్యక్షురాలు చింతల వెంకట రమణ, సభ్యులుగా కాసరనేని విద్యాసాగర్ (పెదవేగి), మన్నె లలితాదేవి (ఆకివీడు), బాసిన రాజబాబు (జీలుగుమిల్లి), సత్తి సాయి ఆదినారాయణరెడ్డి( పెనుమంట్ర) ముళ్లపూడి శ్రీకృష్ణసత్య (నిడదవోలు), ఏలూరు ఎంపీ మాగంటి బాబు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ ఎన్నికయ్యారు. విద్య, వైద్య సేవలు స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, సభ్యులుగా కూరపాటి మార్తమ్మ (పెదపాడు), కొయ్యలమూడి సుధారాణి(దేవరపల్లి), అల్లూరి విక్రమాదిత్య (చాగల్లు), రొంగల రవికుమార్ (నిడమర్రు), రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎన్నికయ్యారు. మహిళా సంక్షేమ స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా అతికాల వెంకట కుసుమాంజలీ రమ్యశ్రీ (పెరవలి), సభ్యులుగా కరాటం సీతాదేవి (బుట్టాయిగూడెం),కుంజం సుభాషిణి (పోలవరం), కొఠారు అనంతలక్ష్మి (నల్లజర్ల),బర్రె వెంకట రమణ(కాళ్ల), కో ఆప్షన్ సభ్యులు షేక్ సులేమాన్, రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, భీమవరం ఎమ్మెల్యే పులవర్తిరామాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ ఎన్నికయ్యారు. సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా మేడపాటి కృష్ణకుమారి (అత్తిలి), సభ్యులుగా చింతల శ్రీనివాస్(ఉంగుటూరు), కరిమెరక వెంకట సత్యతులసి (ఉండి), వడ్డీ నందమ్మ (గణపవరం), చుక్కా సాయిబాబు (ఇరగవరం), మానుకొండ ప్రదీప్ (వీరవాసరం), కోఆప్టెడ్ మెంబరు గేదెల జాన్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. పనుల స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్ బాపిరాజు, సభ్యులుగా శీలం రామచంద్రరావు (జంగారెడ్డిగూడెం), జి. సత్యవరప్రసాద్ (లింగపాలెం), ఎం.సక్కుకుమారి (దెందులూరు), కె.పెద్దిరాజు (భీమడోలు), ఎ. బుల్లిదొరరాజు(తణుకు), కోమటపల్లి వెంకట సుబ్బారావు (ఉండ్రాజవరం), బొక్కా నాగేశ్వరరావు (పోడూరు), బాలం ప్రతాప్( నర్సాపురం), మట్టా రాజేశ్వరి (ఏలూరు), ఎమ్మెల్సీ అంగర రామ్మోనరావు ఎన్నికయ్యారు. -
లాంఛనమే
ఏలూరు : జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. జెడ్పీలో పూర్తిస్థాయి మెజార్టీ టీడీపీకే ఉండటంతో ఒకటి నుంచి ఏడు స్థాయూ సంఘాల ఎన్నిక ప్రశాంతంగా ముగియనుంది. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. పాలకవర్గం ఎన్నికైన 60 రోజుల్లోగా స్థాయూ సంఘాలను ఎన్నుకోవాల్సి ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా పరిషత్‌లో 43మంది టీడీపీ సభ్యులు, ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు. వీరితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఏదో ఒక స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉంటారు. 1, 7 స్థాయూ సంఘాలకు జెడ్పీ చైర్మన్ అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. మిగిలిన ఐదు సం ఘాలకు చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆయూ సంఘాల చైర్మన్లుగా ఎవరూ ఉండాలనే దానిపై కసరత్తు పూర్తరుు్యంది. ఈ నేపథ్యంలో స్థాయూ సంఘాల ఎన్నిక సమావేశం ప్రారంభమైన గంటలోపే పూర్తయ్యే అవకాశం ఉంది. వీటిలో ఆర్థిక స్థాయూ సంఘం మొదటిది కాగా, వరుసగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్య సేవలు, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం, అభివృద్ధి పనుల తీరుతెన్నులపై స్థాయూ సంఘాలను ఎంపిక చేస్తారు. స్థాయూ సంఘాలుమూడు నెలలకొకసారి సమావేశమై ఆయూ అంశాలపై కీలక నిర్ణయూలు తీసుకుంటాయి. నివేదికలు సిద్ధం స్థాయూ సంఘాల ఎన్నికల అనంతరం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో 60 శాఖలకు సంబంధించిన ప్రగతిపై సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఆయూ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేది కలు సిద్ధం చేశారు. ఆ శాఖల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఆధారంగా వీటిని రూపొందించారు. రానున్న రోజుల్లో చేపట్టే అభివృద్ధి పనులకు జెడ్పీలో నిధులు లేకపోవడంతో సమావేశం తూతూమంత్రం గానే సాగే పరిస్థితి కనిపిస్తోంది.