లాంఛనమే
ఏలూరు : జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. జెడ్పీలో పూర్తిస్థాయి మెజార్టీ టీడీపీకే ఉండటంతో ఒకటి నుంచి ఏడు స్థాయూ సంఘాల ఎన్నిక ప్రశాంతంగా ముగియనుంది. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. పాలకవర్గం ఎన్నికైన 60 రోజుల్లోగా స్థాయూ సంఘాలను ఎన్నుకోవాల్సి ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా పరిషత్‌లో 43మంది టీడీపీ సభ్యులు, ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు. వీరితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఏదో ఒక స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉంటారు.
1, 7 స్థాయూ సంఘాలకు జెడ్పీ చైర్మన్ అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. మిగిలిన ఐదు సం ఘాలకు చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆయూ సంఘాల చైర్మన్లుగా ఎవరూ ఉండాలనే దానిపై కసరత్తు పూర్తరుు్యంది. ఈ నేపథ్యంలో స్థాయూ సంఘాల ఎన్నిక సమావేశం ప్రారంభమైన గంటలోపే పూర్తయ్యే అవకాశం ఉంది. వీటిలో ఆర్థిక స్థాయూ సంఘం మొదటిది కాగా, వరుసగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్య సేవలు, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం, అభివృద్ధి పనుల తీరుతెన్నులపై స్థాయూ సంఘాలను ఎంపిక చేస్తారు. స్థాయూ సంఘాలుమూడు నెలలకొకసారి సమావేశమై ఆయూ అంశాలపై కీలక నిర్ణయూలు తీసుకుంటాయి.
నివేదికలు సిద్ధం
స్థాయూ సంఘాల ఎన్నికల అనంతరం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో 60 శాఖలకు సంబంధించిన ప్రగతిపై సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఆయూ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేది కలు సిద్ధం చేశారు. ఆ శాఖల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఆధారంగా వీటిని రూపొందించారు. రానున్న రోజుల్లో చేపట్టే అభివృద్ధి పనులకు జెడ్పీలో నిధులు లేకపోవడంతో సమావేశం తూతూమంత్రం గానే సాగే పరిస్థితి కనిపిస్తోంది.