జెడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక ఏకగ్రీవం
ఏలూరు : జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. 1 నుంచి ఏడు సంఘాల అధ్యక్షులు, సభ్యులను ఆదివారం జెడ్పీలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం అరగంటలో ముగిసింది. జెడ్పీ చైర్మన్ స్థాయీ సంఘాల అధ్యక్షులు, సభ్యుల పేర్లను చదివి వినిపించారు. దానికి అనుగుణంగా జెడ్పీటీసీ సభ్యులు ఒకరు ప్రతిపాదించగా, మరొకరు బలపరుస్తూ ఎన్నిక చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. 46 మంది జెడ్పీటీసీ సభ్యులు, 15 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 69 మంది సభ్యులను ఈ సంఘాల్లోకి ఎంపిక చేశారు.
ఆర్థిక ప్రణాళిక స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, సభ్యులుగా నల్లూరి వెంకటచలపతిరావు (టి.నర్సాపురం) బోణం వెంకట నరసింహారావు (యలమంచిలి), మొగతడకల లక్ష్మీరమణి (ద్వారకాతిరుమల), బర్రె విజయ (భీమవరం), గారపాటి శ్రీదేవి (కొవ్వూరు), నేతల బేబి (పాలకోడేరు), ఘంటా సుధీర్‌బాబు (పాలకోడేరు), కోడి విజయలక్ష్మి (పాలకొల్లు), రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి పీతల సుజాత, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను ఎన్నుకున్నారు.
గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, సభ్యులుగా కిలపర్తి వెంకట్రావు (పెంటపాడు), కైగాల మంగాభవానీ (తాళ్లపూడి), బండి రామారావు (ఆచంట), ఈలి మోహినీ పద్మజారాణి (గోపాలపురం), గుబ్బల వీర వెంకట నాగరాజు (మొగల్తూరు) ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సభ్యులుగా ఎన్నికయ్యారు.
వ్యవసాయశాఖ స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా జెడ్పీ ఉపాధ్యక్షురాలు చింతల వెంకట రమణ, సభ్యులుగా కాసరనేని విద్యాసాగర్ (పెదవేగి), మన్నె లలితాదేవి (ఆకివీడు), బాసిన రాజబాబు (జీలుగుమిల్లి), సత్తి సాయి ఆదినారాయణరెడ్డి( పెనుమంట్ర) ముళ్లపూడి శ్రీకృష్ణసత్య (నిడదవోలు), ఏలూరు ఎంపీ మాగంటి బాబు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ ఎన్నికయ్యారు.
విద్య, వైద్య సేవలు స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, సభ్యులుగా కూరపాటి మార్తమ్మ (పెదపాడు), కొయ్యలమూడి సుధారాణి(దేవరపల్లి), అల్లూరి విక్రమాదిత్య (చాగల్లు), రొంగల రవికుమార్ (నిడమర్రు), రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎన్నికయ్యారు.
మహిళా సంక్షేమ స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా అతికాల వెంకట కుసుమాంజలీ రమ్యశ్రీ (పెరవలి), సభ్యులుగా కరాటం సీతాదేవి (బుట్టాయిగూడెం),కుంజం సుభాషిణి (పోలవరం), కొఠారు అనంతలక్ష్మి (నల్లజర్ల),బర్రె వెంకట రమణ(కాళ్ల), కో ఆప్షన్ సభ్యులు షేక్ సులేమాన్, రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, భీమవరం ఎమ్మెల్యే పులవర్తిరామాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ ఎన్నికయ్యారు.
సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా మేడపాటి కృష్ణకుమారి (అత్తిలి), సభ్యులుగా చింతల శ్రీనివాస్(ఉంగుటూరు), కరిమెరక వెంకట సత్యతులసి (ఉండి), వడ్డీ నందమ్మ (గణపవరం), చుక్కా సాయిబాబు (ఇరగవరం), మానుకొండ ప్రదీప్ (వీరవాసరం), కోఆప్టెడ్ మెంబరు గేదెల జాన్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
పనుల స్థాయీ సంఘానికి అధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్ బాపిరాజు, సభ్యులుగా శీలం రామచంద్రరావు (జంగారెడ్డిగూడెం), జి. సత్యవరప్రసాద్ (లింగపాలెం), ఎం.సక్కుకుమారి (దెందులూరు), కె.పెద్దిరాజు (భీమడోలు), ఎ. బుల్లిదొరరాజు(తణుకు), కోమటపల్లి వెంకట సుబ్బారావు (ఉండ్రాజవరం), బొక్కా నాగేశ్వరరావు (పోడూరు), బాలం ప్రతాప్( నర్సాపురం), మట్టా రాజేశ్వరి (ఏలూరు), ఎమ్మెల్సీ అంగర రామ్మోనరావు ఎన్నికయ్యారు.