chintamaneni prabhakar
-
జనసేన నేతలపై టీడీపీ శ్రేణులు దాడి
-
దెందులూరులో పరాకాష్టకు చేరిన ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు
-
పోలీసులపై చింతమనేని అనుచరులు దాడి
-
దెందులూరులో పరాకాష్టకు చేరిన చింతమనేని అరాచకాలు
-
అట్లుంటయ్.. చింతమనేని వేధింపులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికారులు, ఉద్యోగులపై టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులకు ఇదో మచ్చుతునక. ఏలూరు జిల్లావ్యాప్తంగా 63 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు రాగా 57 మంది కొత్త స్థానాల్లో చేరారు. తన నియోజకవర్గానికి చెందిన మిగిలిన ఆరుగురి పదోన్నతికి మాత్రం చింతమనేని మోకాలడ్డు పెడుతున్నారు. ఆ ఆరుగురిని టార్గెట్ చేసి వారిని రిలీవ్ చేయడానికి వీల్లేదంటూ ఉన్నతాధికారులకు అధికారపార్టీ ఎమ్మెల్యే హుకుం జారీచేశారు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరో 3 రోజులు జాప్యం జరిగితే వచ్చిన పదోన్నతులు దక్కకపోగా స్థానికంగా తీవ్ర అవమానాలు, భౌతిక దాడులు భరిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏలూరు జిల్లాలో ఈనెల 8న 63 మంది గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–2 పదోన్నతి దక్కింది. పదోన్నతి ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి 15 రోజుల్లోగా కొత్త స్థానంలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పదోన్నతుల వ్యవహారం సజావుగా సాగింది. దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ 12 మందికి పదోన్నతి దక్కితే ఆరుగురు నానా తంటాలు పడి గత వారంలో రిలీవ్ అయి కొత్త స్థానంలో విధుల్లో చేరారు. మిగిలిన ఆరుగురిని మాత్రం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టార్గెట్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించారని, స్థానిక నేతలతో సన్నిహితంగా ఉన్నారని, ఇలా రకరకాల ముద్రలు వేసి ఆ ఆరుగురు పదోన్నతులు అడ్డుకున్నారు. తనకు చెప్పకుండా వారిని రిలీవ్ చేయడానికి వీల్లేదని జిల్లా పంచాయతీ అధికారికి ఆయన ఆదేశించారు. దీంతో ఆ ఆరుగురి భవితవ్యం గాలిలో ఉంది. రెడ్‌బుక్ రాజకీయాలుదెందులూరు మండలంలో రామారావుగూడె, పెదవేగి మండలంలోని విజయరాయి, నడిపల్లి, భోగాపురం, జగన్నాథపురం, ఏలూరు రూరల్ మండలంలో మల్కాపురం పంచాయతీ కార్యదర్శులను వేధిస్తూ ఎమ్మెల్యే రెడ్‌బుక్ రాజకీయాలకు తెరతీశారు. కక్ష సాధింపులతో నిరంతరం అవమానాలకు గురిచేయడంతో పాటు మాటలతోనూ వేధిస్తున్నారు. వీరిలో ఒక పంచాయతీ కార్యదర్శిపై కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో 40 నిమిషాల పాటు బహిరంగ వేదికపైనే తీవ్రస్థాయిలో చింతమనేని విరుచుకుపడ్డారు.ప్రొటోకాల్ పాటించలేదనే కారణంతో సదరు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డీపీఓను ఆదేశించడంతో డీపీఓ ఆగమేఘాలపై సస్పెన్షన్‌కు ఫైల్ రెడీ చేశారు. మరో పంచాయతీ కార్యదర్శి రిలీవ్ కోసం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఆ కార్యదర్శిని మందలించి మరీ పంపినట్లు సమాచారం. -
పసుపు పూసుకున్న పోలీసులు
-
పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోయిన చింతమనేని
-
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
-
పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. పోలింగ్ రోజు రెండు మూడు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినా ఎక్కడా ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో ఆయనపై కేసులు నమోదు కాలేదు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఈ నెల 13న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని అదే రోజు భారీ సంఖ్యలో అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సినీ ఫక్కీలో పోలీసులపై దౌర్జన్యం చేసి నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచాఫ్ చేశారు. అక్కడ నుంచి తాడేపల్లి ప్రాంతం వెళ్లి బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. నూజివీడు డీఎస్పీ కేసు పర్యవేక్షిస్తున్నారు. 94కు చేరిన కేసుల సంఖ్య...చింతమనేనిపై ఈ నెల 16న ఐపీసీ సెక్షన్ 353, 224, 225, 143, 149 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 93 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది. చింతమనేని బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకుని ప్రత్యేక టీమ్‌లను అక్కడికి పంపారు. హైదరాబాద్‌కు కూడా మరో టీమ్‌ను పంపినట్టు సమాచారం. చింతమనేని తీసుకువెళ్లిన నిందితుడు రాజశేఖర్‌ను శుక్రవారమే అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. -
రౌడీయిజం, గూండాగిరీ చేసేవారంతా పచ్చ పార్టీలోనే..!
కౌరవ సంతతి మొత్తం తెలుగుదేశంలోనే ఉందా? మహిళల మీద దాడులు చేసేవారు, దళితులను నీచంగా చూసేవారు, రౌడీయిజం, గూండాగిరీ చేసేవారంతా పచ్చ పార్టీలోనే సెటిల్ అయ్యారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే ఇలాంటి నికృష్ట పనులకు కేరాఫ్‌గా నిలిచారు. మహిళా తాహసీల్దార్ మీద దాడి నుంచి ఎన్నికల్లో దాడుల వరకు ఆ మాజీ మీద ఎన్నో నేరారోపణలున్నాయి. తాజాగా పోలీస్ స్టేషన్ మీదపడి అరెస్టయిన తన మనిషిని తీసుకెళ్లిపోయేంతగా తెగించాడు. ఇంతకీ ఈ అరాచక పచ్చ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం.ఏపీ రాజకీయాల్లో గోదావరి జిల్లాల పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే నాయకులు కొందరుంటారు. వారిలో రాజకీయాల్లో మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందినవారు కొందరైతే.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, గూండాయిజంతో అందరిపైనా చిందులు తొక్కుతూ వార్తల్లో నిలిచేవాళ్ళు మరికొందరున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులోని పచ్చ పార్టీలో ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన నేరాల్లో సెంచరీ కొట్టేందుకు తహతహలాడుతున్నాడు. గూండాగిరీతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యే దెందులూరు నుంచి రెండుసార్లు టీడీపీ తరపున గెలిచి తన అధికార అహంకారాన్ని ప్రజలకు చూపించాడు. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గట్టిగా గుణపాఠం చెప్పారు. తాజా ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని అర్థం కావడంతో తన గూండాగిరీతో అటు ప్రజల్ని..ఇటు పోలీసులను కూడా బెదిరించే స్థాయికి చేరాడు చింతమనేని ప్రభాకరచౌదరి.ఎంపీపీ దగ్గర నుంచి మొదలుపెట్టి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యేంతవరకూ చింతమనేని నేరాలు, దౌర్జన్యాల చిట్టా విప్పితే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. దశాబ్దాల రాజకీయ చరిత్రలో చింతమనేని అంటే దెందులూరులో ఒక రౌడీగా గుర్తింపు వచ్చిందే గాని రాజకీయ నాయకుడిగా, ఒక మంచి ప్రజాప్రతినిధిగా పేరు తెచ్చుకోలేకపోయారు.చింతమనేని దురాగతాలపై పలు కేసులు నమోదు అయినా ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతనుంచి మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే చింతమనేని తన నోటి దురుసు, దుడుకుతనంతో నిరంతరం వివాదాల్లో చిక్కుకుంటున్నారు.2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తన అక్రమ ఇసుక దందాను అడ్డుకున్నందుకు మహిళా తాహసీల్దార్ వనజాక్షిని నదిలో ఇసుకలో ఈడ్చుకుంటూ వెళ్ళి దాడి చేసిన విషయం రాష్ట్రంలో సంచలనం రేపింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభుత్వ అధికారిపై దాడి చేసినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోగా..ఆ తాహసీల్దార్‌నే తప్పుపట్టారు.ఇక అప్పటినుంచి చింతమనేని అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. ప్రజల మీద, ప్రత్యర్థుల మీద దాడులు చేయడం, పోలీసులనే బెదిరించడం నిత్యకృత్యంగా మారింది. దళితులంటే ఆయనకు ఎంత చిన్నచూపంటే..మీకు రాజకీయాలెందుకురా? రాజకీయాలు చేస్తే మేమే చేయాలంటూ.. మా బ్రీడ్ వేరు..మా బ్లడ్ వేరని తిక్కగా మాట్లాడే నందమూరి బాలకృష్ణలా అహంకారంతో కూడిన డైలాగ్స్ వదిలారు.ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఏలూరు టిడిపి ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏలూరు కలెక్టరేట్ కు వెళ్లిన చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన చింతమనేని పోలీసులతో ఓవరాక్షన్ చేయవద్దని..అలా చేస్తే ఏం చేయాలో తనకు తెలుసంటూ వారిని బెదిరించాడు. తమను అడ్డుకోవద్దని పోలీసులకు హెచ్చరికలు చేశారు. దీంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది. చింతమనేని మాటలకు ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులు అయ్యారు. ఎంతకాలం అయినా చింతమనేని ధోరణి మారకపోవడంతో పోలీసులు అతని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.. 13వ తేదీన పోలింగ్ జరుగుతున్నపుడు దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం..కొప్పులవారిగూడెంలో పంచాయతీ సర్పంచ్ సంజీవరావు కుమారుడు రవిపై టిడిపి కార్యకర్త రాజశేఖర్ కత్తెరతో దాడి చేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముద్దాయిపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ నుండి కోర్ట్ కు తీసుకువెళ్లే క్రమంలో ముద్దాయిని కస్టడీలో ఉంచారు. మూడు వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు పోలీసులతో ఘర్షణపడ్డారు. సీఐ తోపాటు పోలీస్ స్టేషన్ సిబ్బందిని దుర్భాషలాడుతూ...హత్యాయత్నం చేసి పోలీస్ కస్టడీలో ఉన్న టీడీపీ కార్యకర్తను చింతమనేని ప్రభాకర్ తన కారులో అక్కడి నుంచి తీసుకుని పరారయ్యాడు. అరెస్టయిని ముద్దాయిని పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర చౌదరిపై కేసుల చిట్టా భారీగా ఉంది. బహుశా రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థిపైనా లేనన్ని కేసులు చింతమనేనిపై ఉన్నాయి. రౌడీషీట్ తో పాటు 93 కేసులు తనపై నమోదయ్యాయని చింతమనేని తన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో తెలిపారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన ఉదంతం రాష్ట్రం మరచిపోదు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్‌పై దాడిచేసిన కేసులో ప్రభాకర్ కు రెండేళ్ళ జైలు శిక్ష పడింది. తాజాగా పెదవేగి పోలీస్ స్టేషన్ విధ్వంసం సృష్టించడంతో మరో కేసు నమోదు అయింది.తమ బిడ్డపై దాడి చేసిన వ్యక్తిని చింతమనేని దౌర్జన్యంగా స్టేషన్ నుండి తీసుకుపోవడంపై కొప్పులవారి గూడెం సర్పంచ్ సంజీవరావు.. వైఎస్ఆర్సిపి శ్రేణులు పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని చింతమనేనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు..లేనపుడు కూడా చింతమనేని ప్రభాకర చౌదరి రౌడీయుజం, గూండాగిరీ ఏమాత్రం ఆగడంలేదు. ఆఖరుకు ఎన్నికల్లో కూడా అహంకారపూరితంగానే వ్యవహరిస్తున్నాడు. శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు అతనికి శిరచ్ఛేదం చేశాడు. మరి ఇప్పటికి 93 కేసులు తనపై ఉన్నాయని స్వయంగా చెప్పిన చింతమనేని అహంకారం ఎప్పుడు దిగుతుందా అని దెందులూరు ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224,225,353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని గూండాగిరిహత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పెదవేగి పోలీస్‌స్టేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ బలవంతంగా తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఈనెల 13న పోలింగ్ కేంద్రంలో గ్రామ ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు చలపాటి రవిపై నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ దాడి చేయగా.. పోలీసులు బుధవారం రాజశేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌కు రమ్మని ఆదేశించారు.ఈ క్రమంలో గురువారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ అతడి తండ్రి డేవిడ్ గురువారం ఉదయం 8:30 సమయంలో పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు అతడిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రాజశేఖర్ టీడీపీ కార్యకర్తల ద్వారా చింతమనేనికి తెలియజేశాడు. దీంతో చింతమనేని తన అనుచరులతో కలిసి స్టేషన్‌కు వచ్చి సీఐ, ఎస్ఐలపై తిరగబడి దౌర్జన్యంగా రాజశేఖర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. -
చింతమనేని గూండాగిరి
-
పచ్చ ముఠాల విధ్వంస కాండ
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఓటమి భయంతో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఫ్యాక్షన్ , రౌడీ మూకలతో కలిసి బీభత్సం సృష్టించారు. కర్రలతో దండెత్తారు. కత్తులతో విరుచుకుపడ్డారు. ఏకంగా బాంబు దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్య ఓటర్లపై యథేచ్ఛగా దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు బరితెగించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఇళ్లు, వాహనాలపై దాడులకు తెగబడి విధ్వంస కాండతో చెలరేగిపోయారు. సామాన్య ప్రజానీకాన్ని హడలెత్తించారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ విధ్వంసానికి దిగారు. ఈ గొడవలన్నింటికీ కర్త, కర్మ, క్రియ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే. సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పోలింగ్ సరళి టీడీపీకి వ్యతిరేకంగా ఉందనే విషయం స్పష్టం కావడంతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ బెంబేలెత్తిపోయారు. దాంతో ముందస్తు పన్నాగంతో సిద్ధం చేసిన తమ రౌడీమూకలకు పచ్చ జెండా ఊపారు. ఆ వెంటనే టీడీపీ, జనసేన రౌడీలు యథేచ్ఛగా దాడులకు తెగబడి రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించారు. ఉదయం మొదలైన ఈ దాడులు, దౌర్జన్య కాండ అర్ధరాత్రి వరకు కొనసాగింది. తెగబడ్డ టీడీపీ, జనసేన సోమవారం ఉదయం పోలింగ్ మొదలు కాగానే రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వారిలో మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉండటం విశేషం. అంటే ఓటింగ్ సరళి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉందన్నది స్పష్టమైంది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు.. విధ్వంసం సృష్టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్రలు, కత్తులతోపాటు పెట్రోల్ బాంబులు కూడా ముందుగానే సమకూర్చుకోవడం టీడీపీ, జనసేన కుట్రకు నిదర్శనం. చంద్రబాబు ఆదేశించగానే.. టీడీపీ, జనసేన రౌడీలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడ్డారు. చోద్యం చూసిన ఈసీ టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి విధ్వంసానికి పాల్పడి పోలింగ్‌కు ఆడ్డంకులు సృష్టించినా ఎన్నికల కమిషన్(ఈసీ) నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం నివ్వెర పరుస్తోంది. వారం రోజుల ముందు నుంచే టీడీపీ ఎన్నికల ప్రలోభాలపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా వుయ్ యాప్ పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటంపై పూర్తి ఆధారాలను కూడా సమరి్పంచింది. టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఉదంతాలను.. పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించేందుకు పదును పెడుతున్న కుట్రలను కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. అయినా సరే పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో ఈసీ పూర్తిగా విఫలమైంది. అసలు టీడీపీ, జనసేన గూండాలు వీధుల్లోకి వచ్చి చెలరేగిపోతున్నా, పోలింగ్ కేంద్రాల్లో ప్రవేశించి బెదిరింపులకు పాల్పడుతున్నా.. ఈవీఎంలను ధ్వంసం చేసినా.. ఏకంగా బాంబు దాడులకు పాల్పడినా సరే ఈసీ మాత్రం క్రియాశీలంగా స్పందించనే లేదు. పైగా వైఎస్సార్సీపీ నేతలనే కట్టడి చేసేందుకు యత్నించడం విభ్రాంతి కలిగిస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నబత్తున శివకుమార్‌ను మాత్రమే గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఏకపక్షంగా ఆదేశించడం విస్మయ పరిచింది. ఆయన్ను దూషించిన టీడీపీ కార్యకర్తపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంపై టీడీపీ రౌడీలు దాడికి పాల్పడి, అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేశాయి. కానీ ఈసీ మాత్రం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచమని పోలీసులను ఆదేశించడం విడ్డూరంగా ఉంది. మచ్చుకత్తితో దాడి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం కుసుమవారిపల్లిలో స్లిప్పుల పంపిణీ కోసం టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ శిబిరం వద్దకు ఓటర్లు వెళ్లడంతో ఓర్చుకోలేని టీడీపీ కార్యకర్త ఇడగొట్టు రంగప్ప మచ్చుకత్తితో వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంద్రప్పను పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై పేగులు బయటకు వచ్చాయి. ఈ సంఘటనతో భయబ్రాంతులకు గురైన ఓటర్లు చెల్లాచెదురయ్యారు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురంలో ఎంపీపీ పురుషోత్తంరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పురుషోత్తం రెడ్డి కారు ధ్వంసమైంది. వైఎస్సార్సీపీ కార్యకర్త నవీన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ ఏజెంట్లపై హత్యాయత్నం పల్నాడు జిల్లా కారెంపూడి మండలం ఒప్పిచర్ల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల రిలీవ్ ఏజెంట్‌గా ఉన్న వైఎస్సార్సీపీ నేత పాలకీర్తి నరేంద్ర, అతడి తమ్ముడిపై టీడీపీ మూకలు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రాణ భయంతో వారు తప్పించుకుని బయటకు పరుగులు తీశారు. దాదాపు 300 మంది టీడీపీ గూండాలు వెంట పడటంతో కారెంపూడి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటన అనంతరం పొట్టి శ్రీరాములు కాలనీలోని ఎన్నికల బూత్‌ల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగి రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు ఇరికెదిండ్ల లాజర్‌తో పాటు పలువురికి గాయాలయ్యాయి. కారెంపూడిలోని 288 నెంబర్ బూత్‌లో ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న గోగుల సాంబశివరావు తమ్ముడిపై టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడడంతో దాడిని అడ్డుకునే యత్నంలో సాంబశివరావు తలకు గాయమైంది. వైఎస్సార్ జిల్లా వేముల మండలం మబ్బుచింతలపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. టీడీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న నూలి భాస్కర్‌రెడ్డిని వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం రాళ్ల దాడి చేశారు. కాగా, టీడీపీ వర్గీయుల రాళ్ల దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన లావనూరు హనుమంతురెడ్డి కారు అద్దాలు పగిలాయి. రాళ్ల దాడిలో జల్లా సునంద అనే మహిళకు చేయి విరిగింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూతలపట్టులో తెలుగు తమ్ముళ్ల వీరంగం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని మూడు పోలింగ్ బూత్‌లతో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై పచ్చ మూక దాడులకు పాల్పడింది. పేటగ్రహారానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రవినాయుడు పోలింగ్ బూత్‌లోకి వెళ్లే సమయంలో టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. అనంతరం పేటపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు గురుస్వామినాయుడుపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో గురుస్వామి నాయుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వావిల్‌తోట పంచాయతీ సీఎం కండ్రిగ పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా వున్న హరిబాబుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే జిల్లా సోమల మండలం కందూరు పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ నాయకుడు సురే‹Ùరెడ్డిపై టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు దాడికి పాల్పడ్డాడు. పోలింగ్ కేంద్రంలో వద్ద ఏర్పడిన వివాదంతో సుబ్రమణ్యం నాయుడు తన అనుచరులతో కలసి దాడి చేశాడు. గంగాధర్ నెల్లూరు మండలం జంగాలపల్లి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నాయకులు గ్రామస్తులపై దౌర్జన్యం చేశారు. చిత్తూరు మండలం పెరుమాళ్ళ కండ్రిగలో టీడీపీ నాయకులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దాడి చేశారు. కారును ధ్వంసం చేసి ఓ నాయకుడిని తీవ్రంగా గాయపరిచారు. తొలుత టీడీపీ నాయకులు ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ రోడ్డుకు అడ్డంగా పందిరి వేశారు. దీనిని పోలీసులు తీసి వేయడంతో జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. ఇనుప రాడ్లు, కొయ్యలతో పలువురిని తీవ్రంగా గాయపరిచారు. పసుపు కండువాతో ‘గంటా’ హల్చల్ భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పసుపు కండువాతో హల్చల్ చేశారు. తన అనుచరులతో కలిసి పోలింగ్ స్టేషన్లోకి వెళుతుండగా వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్నపల్లి పోలింగ్ బూత్‌లో ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ దాడిలో వైఎస్సార్సీపీ నాయకులు చింతాడ జీవరత్నం, యతేంద్ర, సంపతిరావు సూర్యనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లడంతో టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీకి చెందిన మల్లాడి చిన ధర్మారావు, మల్లాడి నర్సింహులు, అరదాని శ్రీను తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేశారు. రామకృష్ణారావుపేటలో కొందరు టీడీపీ సానుభూతిపరులు చేసిన దాడిలో మాజీ కార్పొరేటర్ రోకళ్ళ సత్యనారాయణతో పాటు మరికొందరు గాయపడ్డారు. రూరల్ కరప మండలం పెదకొత్తూరులో పోలింగ్ బూత్ వద్ద జనసేన కార్యకర్తలు వైఎస్సార్ సీపీకి చెందిన చింతా సత్యనారాయణపై దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కొని వివాదం సృష్టించారు. పిఠాపురం నియోజకవర్గం విరవ, విరవాడ ప్రాంతాల్లో కూడా జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఘర్షణకు దిగారు.‘చింతమనేని’ వర్గీయులు కత్తెరతో దాడి పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో వైఎస్సార్సీపీకి చెందిన చలపాటి రవిపై చింతమనేని అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన రవి భుజంపై కత్తెరతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన రవి ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆసుపత్రికి చేరుకుని రవిని పరామర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట ప్రభుత్వ బాలికల హైస్కూలులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా వచ్చారు. అప్పుడే అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలపై లాఠీఛార్జి చేశారు. పొన్నూరు రోడ్డులోని అంజుమన్ పాఠశాల బూత్‌లో డీఎస్పీ మల్లికార్జునరావు వైఎస్సార్ సీపీకి చెందిన బూత్ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేశారు. వారి గుర్తింపు కార్డులను లాక్కొని బయటకు వెళ్లాలంటూ ఆదేశించారని బూత్ ఏజెంట్లు పలువురు ఆరోపించారు. పొత్తూరివారిపేటలో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడి చేసేందుకు ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోలేదు. కత్తిపోటు నుంచి రాళ్ల దాడుల వరకూ..> పోలింగ్ మొదలైన కాసేపటికే టీడీపీ రౌడీలు చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ఏజంట్‌పై కత్తితో దాడి చేశారు. అనంతరం పోలింగ్ శాతం పెరుగుతున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన దాడుల తీవ్రతను అమాంతం పెంచుకుంటూ పోయాయి. > వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల 14వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్చార్జి షాహీద్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. వీరపునాయునిపల్లె మండలంలోని యు.వెంకటాపురం, బుసిరెడ్డిపల్లె గ్రామాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. కడపలో ఓట్లు వేసేందుకు క్యూలో ఉన్న ముస్లింలపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో అక్కడకు చేరుకుని ఉద్రిక్తతలను మరింతగా రెచ్చగొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. > రాయచోటి నియోజకవర్గంలోని నక్కవాండ్లపల్లి 175 పోలింగ్ కేంద్రంలో టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడటంతో వైఎస్సార్సీపీ నేత తిరుపాల్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. దప్పేపల్లి గ్రామం మేడిమాకల గుంతరెడ్డివారిపల్లె పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజంట్లపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ హైమావతి, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. > మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైమరీ స్కూల్ వద్ద టీడీపీ నాయకులు కండువా, పసుపు చొక్కాలు ధరించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్ధించారు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
జనసేన పరువు తీసిన చింతమనేని
-
చింతమనేని దాష్టీకంపై భగ్గుమంటున్న దెందులూరు
ఏలూరు, సాక్షి: ఎన్నికల వేళ.. దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ సంక్షేమ ప్రభుత్వం గురించి మాట్లాడిన దళితులపై తన అనుచరులతో దాడి చేయించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. క్షతగాత్రులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతమనేని తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. శుక్రవారం పెదవేగి మండలం లక్ష్మీపురం కూచిపూడి రామసింగవరం గ్రామాల్లో చింతమనేని, తన అనుచరులతో ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో యర్ర చంటిబాబు అనే యువకుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కోపోద్రిక్తులైన చింతమనేని అనుచరులు అతనిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన మరికొందరు యువకులపైనా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ ఐదుగురు యువకుల్ని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరిలు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. చింతమనేనిపై దెందులూరు ప్రజానీకం, దళిత సంఘాలు ఆగ్రహం వెల్లగక్కుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చాయి. మరోవైపు ఈ ఉదయం దాడి ఘటనపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ‘‘చింతమనేని ఏమాత్రం విలువల్లేని నాయకుడు. చింతమనేని తన హయాంలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. 93 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్. ఎన్నికల ప్రచారంలోనూ తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోలేదు. దెందులూరులో గొడవలతో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.... ప్రచారంలో భాగంగా దళితవాడలోకి వెళ్లి మరీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. సీఎం జగన్ హయాంలోనే తనకు మంచి జరిగింది అన్నందుకు ఓ దళిత యువకుడిపై బూతులు తిడుతూ దాడి చేయించాడు. అతని కన్నతల్లిని దుర్భాషలాడారు. ఆ యువకుల్ని చంపే ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యక్తికి బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు. చంద్రబాబు ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?. దళిత యువకులపై దాడి హేయనీయం. చింతమనేని అరాచకాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. చింతమనేని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ‘చింతమనేని.. ఎవరి పేగులు లాగేస్తావ్?. ఇలాంటి ప్రవర్తనను కొనసాగిస్తే నువ్వు ప్రచారం చేయలేవ్. ప్రజలపై విశ్వాసం లేని మూర్ఖుడివి నువ్వు. చంద్రబాబూ.. చింతమనేనిని ఎన్నికల ప్రచారానికి పంపావా? లేదంటే దళితులపై దాడిచేయమని పంపవా?.. చింతమనేని.. ఇక నుంచి దెందులూరులోని ప్రజలు గ్రామాల్లోకి రానియకుండా నిన్ను కట్టడి చేస్తారు. జాగ్రత్త.. చంద్రబాబు, చింతమనేని ఇద్దరూ బాధితులకు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హెచ్చరించారు. -
దళితులపై మరోసారి చింతమనేని దాష్టీకం
-
రౌడీఛీటర్ చింతమనేని
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘మీరు దళితులు, మీరు వెనుకబడిన వారు, మీరు షెడ్యూల్డ్ కాస్ట్ వారు... రాజకీయాలు మాకుంటాయి..మాకు పదవులు... మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా గొడవలు...’’ ఇదీ ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలోని దళిత పేటలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళిత సామాజికవర్గంపై తీవ్ర అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలు. ‘‘పవన్‌కళ్యాణ్.. వాడి వల్ల ఏం అవుతుంది. వాడి అన్న చిరంజీవి లాంటి వాడినే గెలిపించుకోలేనివాడు.. మమ్మల్ని ఏమి చేస్తాడు... మేము గతంలో 2014లో వాడి బొమ్మపై గెలిచామా..’’ అంటూ దురహంకారపూరిత వ్యాఖ్యలు. దెందులూరులోని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద జనసేన నేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలివి. దెందులూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని నోటి దురుసుతో పాటు తీవ్ర వివాదాస్పద వైఖరితో ప్రతి ఒక్కరిపై దాడులు చేయడంలో సిద్ధహస్తుడు. జర్నలిస్టు మొదలుకొని మంత్రి వరకు అందరిపై దాడి చేసిన ఏకైక రికార్డు కలిగిన రాజకీయ నేత. 85కి పైగా కేసులు చింతమనేనిపై ఉన్నాయని గత డీజీపీ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 40కి పైగా క్రిమినల్ కేసులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న చింతమనేనిపై ఏలూరు త్రీటౌన్‌లో రౌడీషిట్ తెరిచారు. అత్యంత వివాదాస్పద వ్యక్తిగా రాష్ట్రంలో గుర్తింపు ఉన్న చింతమనేని అన్ని వర్గాలను దూషించి, అందరితో ఘర్షణలకు దిగినా కనీసం క్షమాపణలు కూడా చెప్పని తలపొగరు రాజకీయం సాగిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొల్లేరు అక్రమ చేపల సాగు, పోలవరం కుడికాల్వ, తమ్మిలేరు ఇసుకను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుని వందల కోట్ల సహజ సంపద బహిరంగంగా దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి యతి్నంచిన పోలీస్, అటవీ శాఖ, రెవెన్యూ, మైనింగ్ శాఖ సిబ్బందిపై దాడులుకు దిగిన ఘటనలు కోకొల్లలున్నాయి. 10 ఏళ్ళ ఎమ్మెల్యే పదవి కాలంలో వందల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి. పోలవరం గట్లు మాయం పోలవరం కుడికాల్వ గట్టు 20 కిలోమీటర్ల మేర ఐదేళ్లలో పూర్తిగా మాయం చేసిన ట్రాక్ చింతమనేనిది. పోలవరం నుంచి 180 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం ఉండగా దెందులూరు నియోజకవర్గం చల్లచింతలపూడి నుంచి పెదపాడు మండలం వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర ఉంది. 240 అడుగుల వెడల్పుతో కాల్వను నిరి్మంచడానికి భూసేకరణ చేసి 240 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో 80 అడుగుల మేర కాల్వ తగ్గి, కుడి, ఎడమ వైపు 80 అడుగుల మేర పోలవరం గట్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 అడుగుల లోతుతో కాల్వను తవ్వారు. కాల్వను తత్విన మట్టితో పాటు కుడి, ఎడమ వైపు తత్విన గట్లపై ఉన్న గ్రావెల్‌నూ కొల్లగొట్టారు. దెందులూరు నియోజకవర్గంలోనే లక్ష క్యూబిక్ మీటర్ల మేర మట్టిని కొల్లగొట్టినట్టు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అప్పటి విజిలెన్స్, ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. 17 క్యూబిక్ మీటర్ల చొప్పున ఒక లారీ లోడు దింపి ప్రతిరోజూ 200 టిప్పర్లు, కొన్నేళ్ళపాటు నిరాటంకంగా నిర్వహించి మట్టి దోపిడీకి పాల్పడ్డారు. 85కుపైగా కేసులు అన్ని రకాల కేసులు 85కు పైగానే చింతమనేనిపై ఉన్నాయి. వీటిలో సగం కేసులు కోర్టుల్లో కొట్టి వేయగా, మరికొన్ని నడుస్తున్నాయి. 26 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో ట్రాఫిక్ వి«ధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్ఐ, సీపీఓలపై దాడిచేసిన కేసుతోపాటు తెలంగాణలోనూ కోడిపందేల కేసులు ప్రభాకర్‌పై నమోదు కావడం విశేషం. ప్రధానంగా తహసీల్దార్ వనజాక్షిపై దాడి కేసులో చింతమనేని, ఆయన గన్‌మెన్, మరో 58 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 353, 332, 379, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. 2011 నవంబర్ 26న దెందులూరులో జరిగిన రచ్చబండలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చింతమనేని దాడి చేసిన ఘటనలో ఐపీసీ సెక్షన్ 506, 353, 332, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. భీమడోలు కోర్టులో రెండేళ్లు జైలుశిక్ష విధించారు. దీనిపై ప్రస్తుతం ఏలూరు జిల్లా కోర్టులో అప్పీల్ కేసు కొనసాగుతోంది. మాజీ మంత్రి వట్టి వసంత్‌పై దాడి 2011 నవంబర్ 26న దెందులూరు ఉన్నత పాఠశాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అప్పటి రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత్ కుమార్‌పై అప్పటి ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. వట్టి వసంత్‌కుమార్‌తో మాటామాటా పెరిగి చింతమనేని అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదై భీమడోలు జూనియర్ సివిల్ కోర్టులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు నిర్ధారణ కావడంతో జడ్జి కె.దీపదైవకృప రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై చింతమనేని అప్పీల్‌కు వెళ్లారు. తమ్మిలేరును మింగేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా ఏలూరు నగరం నుంచి కొల్లేరు వరకు విస్తరించి ఉన్న తమ్మిలేరు ప్రధాన కాల్వను చింతమనేని అండ్ ముఠా మింగేసింది. దెందులూరు నియోజకవర్గంలో తమ్మిలేరు ఎక్కువగా ఉండటం, తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో నాణ్యత ఉన్న ఇసుక ఉండటంతో దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని తమ్మిలేరు పరీవాహక ప్రాంతాలంతా గట్టిగా కొల్లగొట్టారు. ప్రధానంగా పెదవేగి మండలంలో విజయరాయి నుండి ప్రారంభమై నడిపల్లి, బలివే, సూర్యారావుపేట, తమ్మిలేరు, చింతలపూడి నియోజకవర్గం వలసపల్లి వద్ద తమ్మిలేరు 24 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఒక రాత్రికి 200 లారీలు చొప్పున దాదాపు 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచేశారు. దోపిడీ ప్రస్థానాన్ని దెందులూరుతో పాటు పక్క నియోజకవర్గమైన నూజివీడులో కూడా చొరబడి ముసునూరు మండలంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే 2015 జూన్‌లో ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. తహసీల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకుని దాడి 2015 జూలై 11న ముసునూరులో చింతమనేని అనుచరులు అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో అప్పటి ముసునూరు తహసీల్దార్ వనజాక్షి ఇసుక ట్రాక్టర్లకు అడ్డుపడి గట్టిగా నిలువరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న చింతమనేని హుటాహుటిన అక్కడకు చేరి మహిళా అధికారి, మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా జుట్టుపట్టి ఈడ్చి పక్కకు పడేసి దాడి చేయడంతో పాటు నానా దుర్భాషలాడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కేసు నమోదైన వెంటనే బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం, రెవెన్యూ తిరుగుబాటుతో చంద్రబాబు దిగి వచ్చి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశారు. చింతమనేనిపై 2015లో ఏలూరు త్రిటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచారు. అలాగే ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీ శాఖాధికారిపై దాడి, ఐసీడీఎస్‌లో పనిచేసే మహిళా అధికారులపై బెదిరింపులకు దిగడం, 2016 ఫిబ్రవరి 10న కానిస్టేబుల్ మధుపై దాడి ఘటనలకు చింతమనేని పాల్పడ్డారు. కొల్లేరులో చేపలు మాయం కొల్లేరులో చేపలను మాయం చేసిన ఘనత చింతమనేనిది. అటవీ శాఖ అధికారులను బెదిరించి మరీ కొల్లేరులో ఆక్రమణలకు దిగి చెరువులను స్థానిక టీడీపీ నేతలతో సాగు చేయించారు. అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు.. కొన్ని సమయాల్లో చెక్‌పోస్టుల వద్ద పోలీసులపై తన నోటికి, చేతికి పని చెప్పడంతో కేసులు నమోదైన ఘటనలు అనేకం. మొత్తం 1,860 ఎకరాల్లో చేపల చెరువులు పూర్తిగా చింతమనేని కనుసన్నల్లోనే సాగైనట్టు అంచనా. ఒక్క కొల్లేరులోనే సగటున రూ.వంద కోట్లకుపైగా దోచినట్లు సమాచారం. పెదవేగి మండలం పెదవేగి (సూర్యారావుపేట) లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేయకుండా దాదాపు 70 ఎకరాల్లో గ్రావెల్ దోచేశారు. పెదపాడు మండలం ఏపూరు, కలపర్రు గ్రామాల్లో మట్టిని కొల్లగొట్టారు. -
ఒరేయ్ చింతమనేని నీకే చెప్తున్న...పోసాని స్ట్రాంగ్ వార్నింగ్
-
YSRCP చేసిన అభివృద్ధిపై బాబుతో చర్చకు సిద్ధం: MLA
-
చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
-
మొదటి లిస్ట్ లో చోటు దక్కని చింతమనేని..హాట్ కామెంట్స్
-
సీనియర్లు.. ఎదురు‘తన్నులు’
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు అవమానాలే తప్ప సీట్లు దక్కే పరిస్థితి లేదు. సమీకరణలు, పొత్తుల పేరుతో సుదీర్ఘకాలం పార్టీ కోసం పని చేసిన వారిని చంద్రబాబు పక్కనపెడుతున్నారు. తొలి జాబితాలో చాలామందికి సీటు నిరాకరించగా వారికి దాదాపు అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సీటు నిరాకరించిన చంద్రబాబు ఆయన కుటుంబంలో ఒకరికి సీటు ఇచ్చే యోచనలో ఉన్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుందనే సాకుతో చింతమనేనిని పక్కనపెట్టారు. చంద్రబాబుకు గట్టి మద్ధతుదారుగా ఉన్న తనకు తగిన గుణపాఠం చెప్పారని ఆయన రగిలిపోతున్నారు. చింతమనేని స్థానంలో ఆయన కుమార్తెకి సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. దీంతో తనను అవమానిస్తున్నారని, పార్టీ కోసం ఇన్నాళ్లూ పని చేయించుకుని ఇప్పుడు పక్కనపెడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర కీలక నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు సీటు ఖరారు చేయని చంద్రబాబు ఆయన మద్ధతుదారులను సైతం పక్కనపెట్టారు. యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే కోణంలో ఆయనకు సీటు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడు వంటి వారికి సీటిచ్చి తనను కాదనడం అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కళాకు సర్దిచెబుతున్నా ఆయన మాత్రం ఒప్పుకోకుండా తన సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు. లాబీయింగ్ వదలని గంటా.. చంద్రబాబు ససేమిరా ! మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పరిస్థితి మరీ ఇరకాటంగా మారింది. ఆయన్ను విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆయన ధన బలం, తన సామాజికవర్గ బలాన్ని చూపిస్తూ అధిష్టానాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం గంటాను విజయనగరం పంపించడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గంటా మాత్రం భీమిలి స్థానం కోసం అన్ని రకాలుగా లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. జనసేన పొత్తులో విశాఖ జిల్లా పెందుర్తిలో తన సీటు ఎగిరిపోతుండడంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తనకు సీటు ఇవ్వకపోతే తన తడాఖా చూపిస్తానని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానంలో వలస నేత వసంత కృష్ణప్రసాద్‌కు మైలవరంలో అవకాశం ఇస్తుండడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. తనకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని కృష్ణప్రసాద్ అందరికీ చెబుతూ మద్ధతు కోరుతున్నారు. దేవినేని ఉమా మాత్రం చివరి నిమిషంలో అయినా తనకే సీటు ఖరారు చేస్తారనే ఆశతో తిరుగుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఉమాను పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. యరపతినేనికి ఎసరే! ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావును గురజాల నుంచి తప్పించాలనే నిర్ణయంతో పల్నాడు ప్రాంత టీడీపీలో అయోమయం నెలకొంది. యరపతినేని స్థానంలో వలస నేత జంగా కృష్ణమూర్తిని పోటీకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు మింగుడుపడడంలేదు. ఆయన్ను నర్సరావుపేట ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నా దానిపైనా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ప్రస్తుతం యరపతినేని గాల్లో ఉన్నారు. మరోవైపు పొత్తులో తెనాలి సీటు జనసేకు పోవడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా తన పరిస్థితి ఏమిటని ప్రశి్నస్తున్నా ఆయన్ను పట్టించుకున్న వారే లేరు. -
మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి టీడీపీ, జనసేన నేతల షాక్
-
పరువు పోతుంది.. చింతమనేనికి టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చింతమనేని ప్రభాకర్‌పై టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతుండగా, మరోవైపు చింతమనేని వద్దే వద్దని జనసేన నేతలు అంటున్నారు. కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండగా, తనకు టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఓడిస్తానంటూ చింతమనేని బెదిరింపులకు దిగుతున్నారు. చింతమనేని నోటి దురుసుతో పార్టీ పరువు పోతుందని.. దెందులూరు టికెట్ చింతమనేనికి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన నేత కొఠారు ఆదిశేషుకు దెందులూరు టికెట్ ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. మరోవైపు చింతమనేనికి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరిపై ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు ఇలా వ్యతిరేక పవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. -
చింతమనేని సీట్ సిరిగిపోయిందా ?
రౌడీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైను వేసుకోవడానికి తెగ ఇష్టపడే దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది.. 'ఆయనొద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ తెలుగు తమ్ముళ్లు అక్కడక్కడా ఫ్లెక్సీలు కట్టడం తెలుగుదేశాన్ని.. చంద్రబాబును కలవరపరుస్తోంది. నోటి దురుసుకు చేయి జోరుకు మారు పేరుగా నిలిచిన చింతమనేని గతంలో టీడీపీ హయాంలో ఉన్నపుడు మహా ఉజ్వలంగా వెలిగిపోయారు. తన దెందులూరు నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గనులు.. ఇలా అన్ని శాఖలకూ ఆయనే అధిపతి. అడ్డొస్తే అడ్డంగా నరికేసినంత పని చేసేవారు. ఆ దూకుడులో భాగంగానే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని ఈడ్చి కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తరువాత అనుమతులు లేకుండా అడవీ భూముల్లో రోడ్లు వేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. అంతేకాకుండా అధికారంలో ఉన్నపుడు నోటి దురుసును అడ్డూ అదుపూ లేకుండా పోయేది. 'ఏంటీ పవన్ కళ్యాణ్ మద్దతుతో కదా మీరు గెలిచారు' అని అడిగితే.. 'హహ.. పవన్.. ఒక సన్నాసి.. సొంత అన్నను పాలకొల్లులో గెలిపించలేనివాడు మా చంద్రబాబును గెలిపిస్తాడా..? ఊరుకోండయ్యా..' అని సెటైర్లు వేశారు. 'ఒరేయ్ మీరు ఎస్సీలు..! మీకెందుకురా రాజకీయాలు..? మేము రాజకీయాలు చేస్తాం' అని ఓపెన్ సభలో చెప్పడం కూడా ఆయనకే చెల్లింది. ఆ తరువాత ప్రభుత్వంతో పాటు అతనూ ఓడిపోయినా కూడా.. అయన జోరు తగ్గకపోయేసరికి పోలీస్ కేసుల్లో పడ్డారు. మళ్ళీ బయటకు వచ్చాక అదే దూకుడు చూపడం మొదలైంది. మొన్నటికి మొన్న తన వ్యవసాయ భూముల్లో మేకలు మేస్తున్నాయని కొందరు మేకలకాపరులమీద దాడి చేయడమే కాకుండా రెండు మేకలు సైతం తన కార్లో ఎత్తుకెళ్ళి తనకు ఎదురే లేదని మరోమారు చాటిచెప్పారు. అది కాస్తా వివాదంగా.. యాదవులు సంఘటితమై గళం ఎత్తేసరికి ఆయన కాస్త వెనక్కితగ్గారు. ఇదిలా ఉండగా ఆయనకు మళ్ళీ దెందులూరు టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది కాస్తా చింతమనేని ప్రభాకర్‌కు ఇబ్బందికరంగా మారింది. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి మీద ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికలకోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు ఇలా వ్యతిరేకపవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. మరి చంద్రబాబు ఆయనను మారుస్తారో.. కొత్తవాళ్లను తీసుకొస్తారో.. లేదా 'రౌడీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే ఎలా ? వాళ్ళే కదా అసలైన నాయకులూ' అని భావించి మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారో చూడాలి. -- సిమ్మాదిరప్పన్న ఇవి చదవండి: చంద్రబాబు.. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్