నువ్వు మనిషివా.. పశువువా? | YSRCP Leader Suresh Fires On AP Govt Over Chintamaneni Prabhakar Comments | Sakshi
Sakshi News home page

నువ్వు మనిషివా.. పశువువా : నందిగం సురేష్‌

Published Wed, Feb 20 2019 2:39 PM | Last Updated on Wed, Feb 20 2019 4:51 PM

YSRCP Leader Suresh Fires On AP Govt Over Chintamaneni Prabhakar Comments - Sakshi

చింతమనేని అనే రౌడీషీటర్‌ను లోకేష్‌ పెంచి పోషిస్తున్నాడు.

సాక్షి, విజయవాడ : చింతమనేని ప్రభాకర్‌ లాంటి రౌడీ షీటర్‌ను మంత్రి లోకేష్‌ పెంచి పోషిస్తున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల పార్లమెంట్‌ సమన్వయకర్త నందిగం సురేష్‌ అన్నారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని, నోరు అదుపులో పెట్టుకోవాలని చింతమనేనిని హెచ్చరించారు. చింతమనేని ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, ఆయన మీద జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.(మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు)

మనిషివా, పశువువా?
‘చంద్రబాబు, చింతమనేని మీకు దళితులంటే ఎందుకు అంత చులకన. చింతమనేని నీ ఆటలు సాగనివ్వం.. నువ్వు మనిషిగా పుట్టావా, పశువుగా పుట్టావా.. నీ వీడియో అంతా నిజం. నీకు తగిన బుద్ధి చెబుతాం. టీడీపీలో ఉన్న దళిత నేతలు ఇంకా బానిసలుగా బతుకుతున్నారు.. చింతమనేని లాంటి నీచుడిని ఇంకా భరిస్తారా.. ఇది రౌడీ షీటర్‌ల ప్రభుత్వమా’ అంటూ అధికార పార్టీ తీరుపై సురేష్‌ నిప్పులు చెరిగారు.(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement