Nandigam Suresh Babu
-
నందిగం సురేష్ బాబు ప్రెస్ మీట్
-
‘అజ్ఞాని పవన్.. నీ అభిమానులే ఛీ కొడుతున్నారు’
గుంటూరు, సాక్షి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతున్న అశేష ప్రజాదరణ చూసి చంద్రబాబు, పవన్‌లో అసహనం తారాస్థాయికి చేరుకుందని.. తాడేపల్లిగూడెం సభలో వాళ్ల ప్రసంగాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించిందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ బాబు అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జెండా సభ అంటూ తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఏదో వీరంగం వేసి మమ అనిపించారు. ఆ మీటింగ్‌లో మాట్లాడిన ప్రతీ మాటలో జగన్నామస్మరణ చేశారు. వాస్తవానికి వారిద్దరూ ‘జగన్’ అనే బ్రాండ్ పేరు వింటేనే భయపడుతోన్నారు. చంద్రబాబు సొంత కొడుకు ఎక్కడికెళ్లాడో గానీ.. పెంచుకున్న కుమారుడు పవన్ కల్యాణ్ మాత్రం నిన్న పరిగెత్తుకుంటూ పోయి మైకు పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడాడు. మా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నోరుపారేసుకున్నాడు. పావలా బిళ్లను నేలమీద పడేస్తే పెద్ద గోల చేస్తుంది కదా..? మరి, అదే రూ. వందనోటో.. రూ. ఐదొందల నోటునో కిందపడేస్తే శబ్ధం చేస్తాయా..? అంటే, చేయవని అందరూ చెబుతారు. దీన్నిబట్టి అందరికీ నిన్నటి పవన్ కల్యాణ్ ప్రవర్తన తీరును చూస్తే.. అల్లరి చిల్లర పావలాబిళ్ల పవన్ కల్యాణ్ అని తెలిసిపోయింది. పవన్ ఫ్రస్టేషన్‌కు కారణం అది జగన్‌గారి మీద పవన్ కల్యాణ్‌కు అంత ఫ్రస్టేషన్ ఎందుకు..? ఆయనకు మా నాయకుడు జగన్ గారు చేసిన ద్రోహమేంటి..? అని పవన్ అభిమానుల్లో చర్చ మొదలైంది. రేపోమాపో 60 ఏళ్ల వయస్సు నిండి.. ముసలోడయ్యి.. చంద్రబాబు సహవాసిగా మిగిలిపోయే సందర్భంలో.. తాను పార్టీ పెట్టి 12 ఏళ్లయినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాయనే ఆవేదన పవన్ కల్యాణ్‌లో ఉంది. తనను నాయకుడిగా ఎవరూ గుర్తించలేకపోవడం.. మరోవైపు తమకన్నా చిన్నవయసున్న జగన్మోహన్రెడ్డి గారికి ప్రజాదరణ వెల్లువెత్తడంతో వారికి ఫ్రస్టేషన్ పీక్కు వెళ్తుందని ప్రజలు కూడా గమనించారు. నీ మాటలు, చేష్టలకు భీతిల్లిన నీ అభిమానులు, జనసేన కార్యకర్తలే రేపటి ఎన్నికల్లో మరోమారు నిన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. అతనో సన్నాసి అభిమానుల్ని పట్టించుకోకుండా.. చంద్రబాబు కాళ్లు ఎందుకు వత్తుకుంటూ కూర్చొన్నావని అతన్నెవరూ ప్రశ్నించకూడదంట. ఎవరి సలహాలు అతనికి అవసరం లేదంట. తాను మాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా తనను నమ్ముకున్నోళ్లు ఏమైనా పర్వాలేదనే తత్వంతో .. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ ఉంటాడంట. నిజానికి, ఎవరి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. ఎవరి సలహాలు స్వీకరించకుండా ఉన్నందునే పవన్ కల్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీని పెట్టి 12 ఏళ్లయినా.. ఏమాత్రం ఎదుగూబొదుగు లేకుండా ఒంటరిగా సన్నాసిగా మిగిలిపోయాడు. నీ అభిమానులే నిన్ను నమ్మడం లేదు ఈ నిమిషాన కూడా నిన్ను నాయకుడిగా గుర్తించే స్థితిలో నీ అభిమానులే లేరు. అలాంటి సందర్భంలో నువ్వు మా నాయకుడి మీద కోతలు కోస్తావా..? రాష్ట్రంలో 175 స్థానాలకూ 175 స్థానాలూ మేము గెలుచుకుంటున్నామని ఈరోజు మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు దమ్ముగా చెబుతున్నారు. తాను నిల్చోబెట్టిన ఇద్దరు అభ్యర్థులపై ఓడిన వ్యక్తివి నువ్వు. గతంలో నువ్వు ఎవరిమీదనైతే ఓడావో.. వారిద్దరూ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో ఉన్నారంటే.. ఎవరి బలం ఎంత ఉందో బేరీజు వేసుకుని మాట్లాడితే మంచిది. చంద్రబాబు ప్యాకేజీతో పొత్తుకు సిద్ధమైనప్పుడే నువ్వు జనసేన పార్టీ జెండాను మడతపెట్టేశావని నీ అభిమానులకూ తెలిసిపోయింది. ముసలోళ్లతో సహవాసి కనుకే బీపీ పెరుగుతోంది చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ సొమ్మే నీకు ముఖ్యం కాబట్టి.. నిన్నెవరూ ప్రశ్నించకూడదు.. సలహాలివ్వకూడదంటు న్నావ్..? 75 ఏళ్ల ముసలినక్కతో సహవాసం చేసే నీకూ అవే ముసలి లక్షణాలు అబ్బుతాయనే చెప్పాలి. చేతులూ, కాళ్లు ఊపుకుంటూ రంకెలేస్తే బీపీ పెరిగి జరగరానిదేదో జరిగిందంటే నిన్ను కాపాడేవారెవ్వరూ ఉండరని తెలుసుకో.. హరిరామ జోగయ్య, ముద్రగడ నీకు శత్రువులా? వంగవీటి రంగా గారిని చంపిన, ముద్రగడను అవమానించిన చంద్రబాబుతో అంటకాగొద్దని సలహానిచ్చే హరిరామ జోగయ్య, ముద్రగడలు నీకు శత్రువులా..? వారి పేర్లను ఉదహరించక పోయినా.. వారు పంపే లేఖల్ని.. వాటిల్లో నిన్ను నిలదీసే అంశాల్ని ప్రస్తావిస్తూ తెగ ఊగిపోయావెందుకు..? నిన్న ఆ సభలో నీ ప్రవర్తన అత్యంత జుగుప్సాకరంగా ఉందని నీ అభిమానులే నిన్ను ఛీ కొడుతున్నారని తెలుసుకుంటే మంచిది. బాబు పార్టీకి నువ్వొక జెండా కూలీవి! జెండా కూలీలుగా ఇన్నాళ్లూ నిన్ను అభిమానించే నాయకుల్ని ఏమార్చావు. కార్యకర్తల్ని కూడా ఏమార్చావు. నిన్న చంద్రబాబు పార్టీ జెండా పట్టుకుని నువ్వు కూడా పెద్ద జెండా కూలీగా మారావు. దీన్నిబట్టి నువ్వు, చంద్రబాబు ఎంత అవమానకర పరిస్థితిలో ఉన్నారో తెలుసా..? మీ పార్టీల జెండాల్ని పక్కనబెట్టి పక్క పార్టీల జెండాల్ని పట్టి ఊపడం వంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాజకీయాల్లో మీ ఇద్దరికీ మాత్రమే సాధ్యం. వేరే ఇతర ఏ రాజకీయ పార్టీకీ అలాంటి దుస్థితి రానుగాక రానేరాదు. అవమానించినోళ్లే నీకు మంచోళ్లుగా కనిపిస్తారా..? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని, మీ అన్న చిరంజీవి గారిని, వారి కుమార్తెను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా వాళ్లు చేసిన రోత ప్రచారం నీకు గుర్తుందా పవన్..? అదే సందర్భంలో ఆనాడు చంద్రబాబు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా..?. నీ వాళ్లను తిట్టి అవమానించిన వాళ్లనూ మంచోళ్లుగా చిత్రీకరించుకుంటావ్.. నీకు ఏమాత్రం సంబంధంలేనోళ్లనూ నీకు శత్రువులుగా చిత్రీకరించుకుంటావ్.. ఎదుటి వ్యక్తి ఎవరైనా నీకు తప్పుడోళ్లుగానే కనిపించడమనేది నీచంగా ఉందని గ్రహించుకో.. మగాళ్లతో నీకు సంసారమేంటి..? ఇన్నాళ్లూ నీ పెళ్లిళ్లు.. విడాకుల మీద చాలా వార్తలు వచ్చాయి. నీ మోసంతో కొందరు మహిళలు మోసపోయారని విన్నాం. ఇప్పుడేమో, ఆడవాళ్లను కాకుండా మగవాళ్లతోనూ సంసారం అంటున్నావు. అసలు, నీ మానసిక స్థితేంటో.. ఎవరికీ అర్ధం కావట్లేదు. అంటే, నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావో ఆలోచించుకుంటే మంచిది. బాబు, పవన్‌లను తరిమికొట్టే రోజులొచ్చాయి పావలా వాటాకూ సరిపోని నువ్వు .. పూటకో మాటతో రాజకీయాల్లో గందరగోళం సృష్టించే నువ్వు.. ఏ రకమైన రాజకీయంతో జనసేనను నడుపుతున్నావో ఆలోచించుకోవాలి పవన్. చంద్రబాబు చంకలో వ్యక్తిగా ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలుగా మారవు.. అబద్ధాలు నిజాలవ్వవు. మహిళలు సిగ్గు పడే విధంగా మాట్లాడటానికి నీకు సిగ్గుండాలి. నాడు కుల రాజధాని.. నేడు నీకు ఇంద్రప్రస్థంగా కనిపిస్తుందా..? నాడు కులరాజధానిగా కనిపించిన అమరావతి నేడు నీకు ఇంద్రప్రస్థంగా కనిపిస్తుందా..? ఇప్పటికైనా నీ నోరు కంట్రోల్ పెట్టుకుని మాట్లాడకపోతే జీవితంలో మరిచిపోలేని పరాభవాన్ని రుచి చూస్తావని హెచ్చరిస్తున్నాను. రేపటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ పార్టీలకు శాశ్వత సమాధికట్టి.. నీకు, చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. -
కుట్ర రాజకీయాలకు చెక్
ఒంగోలు/సాక్షి, అమరావతి/గుడివాడ రూరల్: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. అక్కడ పేదలు నివసించకూడదని చంద్రబాబు అండ్ కో ఎన్ని కుట్రలు పన్నినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు అవి నిలవలేదని చెప్పారు. ఇది సీఎం జగన్, పేదల విజయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్, మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. కుట్ర రాజకీయాలకు ఈ తీర్పు చెక్ పెట్టిందని చెప్పారు. అమరావతి భూముల్లో పేదలకు పట్టాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న చంద్రబాబు ఆలోచన విధానమేంటో స్పష్టమవుతోందన్నారు. బాబు కుట్ర బట్టబయలు పేద, బడుగు, బలహీన వర్గాలు, దళితుల సొంతింటి కల నెరవేర్చడానికి సీఎం వైఎస్ జగన్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. చేసిన పోరాటం దళితులు, పేదలకు స్ఫూర్తిదాయకం. ఏపీసీఆర్డీఏ చట్టం సెక్షన్ 53(1)(డి) ప్రకారం 5 శాతం భూమిని పేదల నివాసాలకు కేటాయిస్తామని పేర్కొన్నారు. కానీ ఆ చట్టంలో ఉన్న అంశాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు ఆర్–5 జోన్‌ను ఏర్పాటు చేస్తే దానిని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ అమరావతి రైతుల ముసుగులో పోరాటం చేసింది. ఇవ్వకూడదని భావించినప్పుడు చట్టంలో ఎందుకు పొందుపరిచారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. కేవలం వారి బినామీల భూములను కాపాడుకునేందుకు, భవిష్యత్‌లో రియల్ వ్యాపారం చేయాలనే దుర్మార్గమైన కుట్రతోనే అమరావతి భూ కుంభకోణం జరిగింది. ఈ స్కాం నిగ్గు తేల్చేందుకు న్యాయ స్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం కూడా శుభదాయకం. 51 వేల మంది పేదలకు 900 ఎకరాల్లో పట్టాలు ఇచ్చే ప్రక్రియ మరో వారం పది రోజుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది. తాము చేసిన మంచిని చూసి, ఓటు వేయండని మా నాయకుడు అడుగుతున్నారు. తాను చేసిన మంచి పని ఒక్కటీ చెప్పలేక చంద్రబాబు పొత్తులు, కుట్రలపై ఆధారపడ్డాడు. – ఆదిమూలపు సురేష్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి న్యాయం ఎప్పుడూ పేదల పక్షానే పేదల పక్షాన న్యాయం ఉంటుందనడానికి ఈ తీర్పే నిదర్శనం. అమరావతిలో పేదలు ఉండకూడదని మూడేళ్లుగా అడ్డుకుంటున్న ధనిక వర్గాల కుట్రల నుంచి వేలాది మంది పేదలకు న్యాయం చేసిన కోర్టులకు ధన్యవాదాలు. ధనిక వర్గాలకే పరిమితమయ్యేలా స్వర్ణనగరంగా ఉండాలన్న పిడి వాదన నుంచి అమరావతి బయటపడటం సంతోషంగా ఉంది. మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించడానికే సీఎం వైఎస్ జగన్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని టీడీపీ నాయకులు ఎలా అనగలుగుతున్నారు? అంటే పేదలు ఉన్న చోట లోకేశ్ ఓడిపోతాడని టీడీపీ నేతలు కూడా నమ్ముతున్నారా? నిజ జీవితంలో హీరో అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని పెట్టి తీసే సినిమాలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడును విలన్‌గా, 420 బ్యాచ్‌ను ఆయనకు అసిస్టెంట్లుగా పెట్టాలి. అవసరమైతే దర్శకుడు రాంగోపాల్ వర్మతో నేను స్వయంగా మాట్లాడుతాను. 2024 ఎన్నికల తర్వాత పవన్‌కు మిగిలేది ప్యాకేజీ డబ్బు, సినిమాలే. సునీల్ పకోడి (ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ ధియోధర్) లాంటి వాళ్ల వల్లే కర్ణాటకలో బీజేపీ పరిస్థితి దిగజారింది. చేసిన మంచి గురించి చెప్పకుండా, ఇక్కడకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇలాంటి వారిపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టి పెట్టాలి. – కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), గుడివాడ ఎమ్మెల్యే పేదలు ఉండొద్దనడానికి వారెవరు? సీఆర్డీఏ పరిధిలో 50 వేల మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుండటం దారుణం. అక్కడ పేద వారు ఉండకుండా చేయడానికి కుయుక్తులు పన్నుతున్నారు. రాజ్యాంగం తెలిసిన వారెవరూ ఇలాంటి చర్యలకు పూనుకోరు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా వారు కళ్లు తెరవాలి. టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతిలో పేదలకు కేటాయించిన ఇళ్ల నుంచి తరిమి కొడతామని ఇటీవల అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం దుర్మార్గం. ఆ ప్రాంతంలో అసలు పేదలు ఉండొద్దనడానికి వారెవరు? మా ప్రభుత్వం పేదల పక్షానే నిలబడుతుంది. సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలు పొందిన వారందరికీ అవసరమైన వసతులు కల్పిస్తాం. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి బాబు అండ్ కో కు చెంపపెట్టు అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉందని తీర్పు వెలువరించడం చంద్రబాబు అండ్ కోకు చెంపపెట్టు. పవన్.. పేదల పక్షమా? బాబు పక్షమా? అన్నది చెప్పాలి. సీఎం జగన్ గట్టిగా పేదల పక్షాన నిలచారు కాబట్టే పేదలకే ఇళ్ల స్థలాలు దక్కాయి. పేదల మట్టి, చెమట వాసన అమరావతిలో ఉండకూడదా చంద్రబాబూ? అమరావతి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ల సొత్తు కాదు. తాటి చెట్టంత వయసొచ్చినా బాబులో మాత్రం మార్పు రాలేదు. రాష్ట్రంలో తిరగడానికి చంద్రబాబు, లోకేశ్‌లు అనర్హులు. ఈ రాష్ట్రానికి దిక్సూచి ఒక్క సీఎం వైఎస్ జగనే. దుర్మార్గపు ఆలోచనలకు టీడీపీ మూల్యం చెల్లించుకుంటుంది. – నందిగం సురేష్, ఎంపీ ఈ పెత్తందార్లకు పేదలంటే ద్వేషం సుప్రీం తీర్పు చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. పేదలకు సెంటు స్థలం ఇస్తుంటే ఓర్వలేని నాయకులు రాజకీయాలకు అనర్హులు. పేదలకు నివాసం కల్పించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా చంద్రబాబు అండ్ కో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పెత్తందార్లకు పేదలంటే ఎందుకంత ద్వేషం? సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవాలని కాంక్షిస్తే వీరు వ్యతిరేకించారు. పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే ఈ మేధావులు, వామపక్షాల నేతలు ఎందుకు స్వాగతించరు? – డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీ -
చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సైకోలే: ఎంపీ నందిగం సురేష్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు లాంటి బాధ్యత లేని వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సైకోలేనిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సైకో ఇజంతోనే ఆనాడు ఎన్టీఆర్ పదవిని చంద్రబాబు లాక్కున్నారని తెలిపారు. 'చంద్రబాబు అనేక మోసాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వని వ్యక్తులు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు. చంద్రబాబు ప్రచార సభల్లో పదకొండు మంది చనిపోయినా పవన్ కల్యాణ్‌కి కనపడటంలేదా?' అని ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. చదవండి: (పెనుకొండ టీడీపీలో ముసలం) -
అందుకే దత్తపుత్రుడితో కలిసి బాబు కుయుక్తులు: ఎంపీ నందిగం సురేష్
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వాల హయాంలో అగ్రవర్ణాలకు మాత్రమే పదవులు దక్కేవని.. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది అన్నారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఒక పక్క పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. పేదలకు డబ్బులిస్తే సోంబేరుల్లా మారుతారని వ్యాఖ్యానించడం వాళ్ల(ప్రతిపక్ష నేతల) ఆలోచనా ధోరణికి నిదర్శనమని అన్నారాయన. అలసిపోయిన వర్గాలకు బాసటగా ఉంటుందని సీఎం జగన్ ఆలోచన చేశారని, కానీ, ప్రతిపక్షానికి అది సహించడం లేదని ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. ఇంటింటికి తిరిగి.. ‘రండి.. కలసి రండి’ అని అడుక్కుంటున్నాడు. సింగిల్‌గా వచ్చే దమ్ము ఆయనకు లేదని స్పష్టం అవుతోంది. అందుకే ‘దత్తపుత్రుడి’తో కలిసి కుయుక్తులు పన్నుతున్నారు. కానీ, ఎంత మంది వచ్చినా వైఎస్ జగన్‌ను కదిలించలేరని వ్యాఖ్యానించారు. గతంలో రెండుసార్లు వైఎస్ జగన్.. ఎలాంటి పొత్తు లేకుండా 2014, 2019 ఎలక్షన్స్‌లో పోటీచేశారని, తెలుగు దేశంలాగా పొత్తుల కోసం వెంపర్లాడలేదని అన్నారు. ఇక టీడీపీ సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తోందని. అత్యాచారాలు,మహిళలపై దాడుల పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించాలని చూస్తోందని పేర్కొన్నారు. కానీ, గత ప్రభుత్వంలోనే రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అంతా సంతోషంగా ఉన్నారు. కాబట్టి, ప్రజా క్షేమం కోసం మళ్లీ వైఎస్సార్సీపీనే అధికారంలోకి వచ్చేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలను, ముఖ్యనేతలను ఉద్దేశించి ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. -
టీడీపీ నిజ నిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. సిద్ధమేనా
-
‘టీడీపీ నిజ నిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. సిద్ధమేనా’
సాక్షి, తాడేపల్లి: ‘దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్లారు.. దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర ఉంది’ అని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు మరోసారి దళిత ద్రోహి అని నిరూపించుకున్నారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్లారు. దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర కూడా ఉంది’’ అని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘దేవినేని అబద్ధాలను నిజం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే చంద్రబాబు గొల్లపల్లి వచ్చారు. 2004లో వసంత నాగేశ్వరరావు కారును దగ్ధం చేసింది గుర్తులేదా. 2016 డిసెంబర్ 4న 143 సర్వే నంబర్లో దేవినేని మైనింగ్ ప్రారంభించారు.. అవి అసలు రెవిన్యూ భూములా.. ఫారెస్ట్ భూములా అనే విషయం తేల్చాలి. 2018లో దేవినేని ఉమా క్రషర్ ప్రారంభించారో లేదో చెప్పాలి. దేవినేని ఉమ తప్పు చేశాడన్న విషయం చంద్రబాబుకు తెలుసు. దేవినేని నీచ పనులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు. అబద్ధాలను నిజం చేసేందుకే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. దేవినేని ఉమను సమర్ధిస్తున్న చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. మరో ఎమ్మెల్యే జోగి రమేష్ ‘‘చంద్రబాబు బుద్ధి కొంచెం కూడా మారలేదు. దళితులపై దాడి చేసిన దేవినేని ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారు. చంద్రబాబుకు కొంచెం కూడా అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. మీరు సిద్ధమేనా. మైనింగ్‌లో దోచుకుంది ఎవరో మొత్తం తేలుస్తాం’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. ‘‘పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టారు. ఎన్నికల్లో ఓడించారనే కక్షతోనే దళితులపై దాడులు చేస్తున్నారు. దళితులపై దాడి చేసిన వారిని పరామర్శించడమేంటి’’ అని ప్రశ్నించారు. -
తాగటం .. వాగటం
సాక్షి,అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు రోజూ తాగటం, వాగటమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. ఆయనకు నైతిక విలువలు, ధైర్యం, రోషం ఉంటే రాష్ట్రంలోకి వచ్చి ప్రజల మధ్య తిరగాలని సూచించారు. త్వరలోనే ఆయన పాపం పండుతుందన్నారు. బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు దోచుకుతిన్న రఘురామ కృష్ణరాజు నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ స్పీకర్ తక్షణమే ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. అనర్హత వేటు నోటీస్ ఇచ్చినప్పుడల్లా తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం లేదని, ఏ తప్పూ చేయలేదని నమ్మబలుకుతున్నారని, ఢిల్లీలో ఎల్లో మీడియాతో నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో ఆయన నిజ స్వరూపం బయటపడిందన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనతోపాటు ఒక పద్ధతి, విధానం లేని రఘురామకృష్ణరాజుకు బుద్ధి చెప్పేలా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే వైఎస్సార్సీపీ ఆయన్ను విడిచిపెట్టబోదని హెచ్చరించారు. దిగజారుడు వ్యక్తి.. రఘురామకృష్ణరాజు రాక్షస బ్యాచ్‌తో చేరి శునకానందం పొందుతున్నారని నందిగం సురేష్ ధ్వజమెత్తారు. ఆయన ఓ నయవంచకుడు, దిగజారిన మనిషి అని మండిపడ్డారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే రాజకీయాలు ప్రమాదకరంగా మారుతాయన్నారు. ఆయనపై సీబీఐ, ఏసీబీ కేసులున్నాయని, వాటి నుంచి బయటపడేందుకు ఇతర పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అయితే ఆయన్ను ఎవరూ కాపాడలేరని, జైలుకెళ్లక తప్పదన్నారు. రఘురామకృష్ణరాజుకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సూచించారు. ఢిల్లీలో మకాం వేసిన పిచ్చి కుక్క లాంటి ఆయన్ను అంతమొందించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. సీఎం జగన్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సాయంత్రానికే కొట్టివేశారని తెలిపారు. సీఎం జగన్ రాముడు లాంటి వ్యక్తి కాబట్టే ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రాజకీయ వ్యభిచారి .. రఘురామకృష్ణరాజు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, బ్యాంకులను మోసగించిన ఆయనకు రుణాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసని ఎంపీ సురేష్ చెప్పారు. ఢిల్లీలో కూర్చుని ప్రెస్మీట్లు కాకుండా రోషం, ఆత్మగౌరవం, పౌరుషం ఉంటే ఏపీకి వచ్చి మాట్లాడాలన్నారు. అవకాశం రావడంతో మూడేళ్లు పబ్బం గడుపుకునేందుకు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్నీ గాలికి వదిలేసిన చంద్రబాబు, రాఘురామ, ఎల్లో మీడియాను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలేదన్నారు. పరిషత్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి వారిని ఛీ కొట్టడం ఖాయమన్నారు. -
సిగ్గులేని రాతలు; నిజాల సమాధే ‘స్టింగా’?
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని ప్రాంతంలో దళితులకు చేసిన అన్యాయం వెలుగులోకి రాకుండా ఎల్లో మీడియా కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. స్టింగ్ ఆపరేషన్ పేరుతో ఆంధ్రజ్యోతి, ఈనాడు నిస్సిగ్గుగా వ్యవహ రించాయని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. అన్యాయం చేసిన వాళ్లను కాపాడటం స్టింగ్ ఆపరేషన్ ఎ లా అవుతుందని ప్రశ్నించారు. సీఐడీకి ఫిర్యాదు చేసిన రైతులను అదిరించి, బెదిరించి తమకు అనుకూలంగా చెప్పించుకున్నారని, వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు. బెదిరించి జబ్బలు చరుచుకుంటున్నారు: ఆర్కే ల్యాండ్ పూలింగ్ పేరుతో తమను చంద్రబాబు మోసగించారని రైతులు నాకు చెప్పారు. దీన్ని సీఐడీ అధికారులూ రికార్డు చేశారు. ఇప్పుడు వాళ్లను బెదిరించి, అనుకూలంగా మాట్లాడించి స్టింగ్ ఆపరేషన్ అని జబ్బలు చరుచుకోవడం ఆ రెండు పత్రికలకే చెల్లింది. చంద్రబాబు మోసం చేశారని 2015 అక్టోబర్‌లో పలువురు దళిత రైతులు చెప్పినట్లు పత్రికల్లో వచ్చింది. 2016 ఫిబ్రవరి 19న సీపీఎం నేత బాబురావుతో కలసి దళితులకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో అప్పటి ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. మరికొంతమంది దళితులు కూడా అన్యాయంపై సీఐడీకి ఫిర్యాదు చేయబోతున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడుకు దమ్ము ధైర్యం ఉంటే చట్టాలను అతిక్రమించి చంద్రబాబు దళితులను ఎలా మోసగించారో వెలుగులోకి తేవాలి. దళితులను తరిమేసే కుట్ర: నందిగం సురేష్ రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన మోసాలు ఈనాడు, ఆంధ్రజ్యోతికి కనిపించకపోవడం దారుణం. అసైన్డ్ భూములకు ఏమీ ఇవ్వకుండా తీసుకుంటారని టీడీపీ నేతలు దళితులను భయపెట్టారు. వాళ్ల నుంచి భూములన్నీ చంద్రబాబు, ఆయన బినామీలు తీసుకున్నాక అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలు చెల్లుతాయ ని జీవో 41 ఇచ్చారు. అసైన్డ్ రైతులను ముష్టివారి కంటే హీనంగా చూశారు. రాజధాని శంకుస్థాపన సమయంలో దళితులను ఆ ప్రాంతానికి కూడా రానివ్వకుండా వేల మంది పోలీసులను అడ్డుపెట్టారు. చంద్రబాబు సామాజిక వర్గాన్ని మాత్రం సగర్వం గా సత్కరించి ఆహ్వానించారు. దళితులను నిజాలు చెప్పనివ్వకుండా బెదిరిస్తున్నారు. పచ్చ మీడియా సిగ్గూ శరం వదిలేసి అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. రాజధానిలో దళితులు, మైనార్టీలు, బీసీలు ఉండకూడదనేదే టీడీపీ దురాలోచన. -
ట్రాక్టర్‌నే కాదు, పార్టీని కూడా కొల్లేరులోకే!!
-
చంద్రబాబు దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా?
-
'అక్కడ ఎనిమిదో వింత ఉన్నట్లుగా ఫీలవుతున్నారు'
-
చంద్రబాబు దళితులను అడుగడుగునా అవమానించారు
-
ఆయన వెనక ఎవరున్నారో తేలిపోతుంది
సాక్షి, అమరావతి: డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించడం మంచిదేనని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. సుధాకర్ వెనుక ఏదో పెద్ద సపోర్టు ఉంది కాబట్టే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నుద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని, దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఆయన చెప్పారు. హైకోర్టు మంచిపనే చేసిందని, లేదంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాబట్టి వారికి ఇష్టమొచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ రాసుకున్నారని టీడీపీ నాయకులు మాట్లాడే పరిస్థితి లేకపోలేదని అభిప్రాయపడ్డారు. ఎవరి తప్పు ఏంటో సీబీఐ విచారణలో బయటకు వస్తాయన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సురేష్ విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► హైకోర్టు ఇచ్చే తీర్పు పది నిమిషాలముందే చంద్రబాబుకు తెలుస్తుంది. మొదట చంద్రబాబును విచారించాలి. ఆయన కాల్ లిస్టు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నా. ► కోర్టు తీర్పు సందర్భంగా పదిమంది టీడీపీ దళిత నేతలు పరిగెత్తుకొచ్చి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటూ మాట్లాడారు. వారు వెనక్కు తిరిగి చూస్తే.. చంద్రబాబు దళితుల గురించి ఏం మాట్లాడారో.. వారికే అర్థమవుతుంది. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు అన్నారు.. దళితులు చదువుకోరని, శుభ్రంగా ఉండరని టీడీపీ మంత్రులు అప్పట్లో మాట్లాడారు. ఇవన్నీ మర్చిపోయి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని టీడీపీలోని దళిత నేతలే మాట్లాడడం విడ్డూరం. ► ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబే.. ఆయన ఫొటోకు దండ వేసినట్టుగా.. దళితుల్ని అవమానించే టీడీపీనే ఆ పార్టీ దళిత నేతలు వెనకేసుకురావడం శోచనీయం. ► చంద్రబాబు వ్యవస్థలను, హైకోర్టును మేనేజ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఈరోజున తీర్పు వస్తే ప్రభుత్వానికి చెంపపెట్టు అంటున్నారు. ఎంతసేపూ మేనేజ్‌మెంట్లతోనే ఒడ్డెక్కే చంద్రబాబు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. దీనికేమంటారు? సుధాకర్‌ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు ► సుధాకర్ ముఖం మీద దళితుడు, డాక్టర్ అని రాసి ఉండదు. వాస్తవానికి అక్కడ పోలీసుల ఓపికకు దండం పెట్టాలి. శాడిస్టులా బూతులు మాట్లాడుతూ, కార్ల కింద చొరబడుతూ ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తికి చంద్రబాబు సపోర్టు చేస్తున్నారు. సుధాకర్‌ను అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ► ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని టీడీపీ రకరకాల కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. పరిపాలన కుంటుపడేలా తీర్పులు తేవాలని తయారయ్యారు. ప్రజలు ఓడించి ఇంటికి పంపినా చంద్రబాబుకు బుద్ధిరాలేదు. ఆయనది క్రిమినల్ మైండ్. బాబు కుట్రలను సాగనివ్వం. ప్రజాక్షేత్రంలో ఎప్పటికైనా విజయం మాదే. -
అదంతా చంద్రబాబు ఆడించిన నాటకమే!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆడించిన నాటకంలో భాగంగానే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ మద్యం తాగి వీరంగం చేశారని ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ కుట్రలకు దళితులను బలి పశువులను చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఆదివారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ముగ్గురు ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే.. ఆ ఎపిసోడ్ వెనుక చంద్రబాబే: నందిగం ► 2019 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసేందుకు డాక్టర్ సుధాకర్ ప్రయత్నించారు. ► అందుకోసం అప్పట్లో డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. టీడీపీ సీటు రాకపోవడంతో రాజీనామా లేఖను వెనక్కి తీసుకున్నారు. డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ వెనకున్న పెద్ద ఆర్టిస్ట్ చంద్రబాబే. దళితుల్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారు. ► చంద్రబాబు దళిత ద్రోహి. కుల రాజకీయాలు చేయటంలో దిట్ట. మోసం చేయటం ఆయన పేటెంట్ హక్కు. దళితులకు విలువ లేకుండా చేయాలన్నదే బాబు ఆలోచన. పథకం ప్రకారమే: ఎమ్మెల్యే మేరుగ ► పథకం ప్రకారం డాక్టర్ సుధాకర్‌ను చంద్రబాబు వాడుకుంటూ బలి పశువును చేస్తున్నారు. ► ఈ నాటకంలో చంద్రబాబు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి పాత్ర ఉంది. వారందరిపైనా డీజీపీ విచారణ జరిపించాలి. ► కరోనా కాలంలోనూ ప్రభుత్వం వైరస్ నియంత్రణ సహా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. ఎక్కడా ఏమీ అనడానికి అవకాశం లేక డాక్టర్ సుధాకర్‌ను తీసుకొచ్చి చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు ఈ నాటకానికి తెర తీశారు. చంద్రబాబు స్క్రిప్ట్: ఎమ్మెల్యే టీజేఆర్ ► డా. సుధాకర్ ఆడిన నాటకానికి స్క్రిప్ట్ రచించింది చంద్రబాబే. ఆ స్క్రిప్ట్ అమలు చేయడం కోసం మతిస్థిమితం లేని డాక్టర్ సుధాకర్‌ను వాడుకున్నారు. ► ఇదంతా చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి పద్ధతులను దళిత సమాజం వ్యతిరేకిస్తుంది. ► 16వ తేదీన సంఘటన జరిగితే ఒకరోజు ముందే చంద్రబాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇదంతా చంద్రబాబు కార్యాలయంలో తయారైంది. -
ఎంపీ నందిగం సురేష్‌పై దాడి
సాక్షి, గుంటూరు : అమరావతి జేఏసీ ముసుగులో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మహిళలను ముందుపెట్టి టీడీపీ నాయకులు ఈ దాడి చేయించారు. ఎంపీతో పాటు గన్మెన్ల కళ్లలో కారం కొట్టారు. అమరావతి మండలం లేమల్లెలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అమరావతిలో ఆదివారం జరిగిన రథమహోత్సవంలో పాల్గొన్న ఎంపీ నందిగం సురేష్ అనంతరం రోడ్డు మార్గంలో గుంటూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో లేమల్లె గ్రామంలో దుండగులు ఎంపీపై దాడికి పాల్పడ్డారు. జై అమరావతి అంటూ నందిగం సురేష్‌తో పాటు సిబ్బందిపై దాడి దిగారు. పథకం ప్రకారమే మాపై దాడి : నందిగం సురేష్ పథకం ప్రకారమే టీడీపీ నేతలు తమపై దాడి చేశారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతన్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసి తట్టుకోలేకనే చంద్రబాబు అండ్ కో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధులపైనే దాడులు చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
‘అంటరానితనం చంద్రబాబు ఒంట్లో ఉంది’
సాక్షి, తాడేపల్లి: ఎంపీ నందిగం సురేష్‌పై పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ దాడి చేయించిందని.. దాడికి చంద్రబాబునాయుడు, లోకేష్ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ దిశగా సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తుంటే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళిత ప్రజా ప్రతినిధులపై దాడులకు ప్రేరేపిస్తున్న చంద్రబాబు, లోకేష్‌పై కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీ సురేష్‌పై వ్యూహం ప్రకారం దాడి చేయించారని నాగార్జున ధ్వజమెత్తారు. ఎంపీ నందిగం సురేష్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉందని.. దాడులతో రాజధానిలో దళితులను మభ్యపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలనలో దళితులు అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఎంపీ సురేష్‌పై దాడి చంద్రబాబు అకృత్యాలకు నిదర్శనమని నాగార్జున దుయ్యబట్టారు. దళిత ఎమ్మెల్యేలుపై వరుసుగా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బాపట్ల ఎంపీ సురేశ్‌పై టీడీపీ నేతల దాడి పామర్రు ఎమ్మెల్యే అనిల్, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిలో రైతులకు ఒక ప్యాకేజీ, దళితులకు ఒక ప్యాకేజీ ఇచ్చి వివక్ష చూపించారని నాగార్జున విరుచుకపడ్డారు. దళితులు కోసం చంద్రబాబు ఒక మంచి పథకమైన పెట్టావా అని ఆయన ప్రశ్నించారు. తన చెంచా మీడియా ద్వారా సీఎం జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని తెలిపారు. అంటరానితనం అనేది చంద్రబాబు ఒంట్లో ఉందని.. దళితులను భయపెట్టడం చంద్రబాబు తరం కాదని ఆయన అన్నారు. మేము ఉద్యమం చేస్తే చంద్రబాబు, టీడీపీ నేతలు పారిపోతారని ఎమ్మెల్యే మెరుగు నాగార్జున ఎద్దేవా చేశారు. -
‘అంటరానితనం చంద్రబాబు ఒంట్లో ఉంది’
-
క్షతగాత్రుడికి ఎంపీ సురేష్ చేయూత
ప్రకాశం ,సంతమాగులూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చేయూతనందించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సోమవారం గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. గుంటూరు జిల్లా లాం ఫాం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడే అటు వైపుగా వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తన కారు ఆపి క్షతగాత్రుడి వద్దకు వెళ్లి స్వయంగా సపర్యలు చేశారు. అంతేగాకుండా క్షతగాత్రుడిని స్వయంగా మోసి 108లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లే వరకూ అక్కడే ఉండి మానవత్వం చాటుకుని స్థానికుల మన్ననలు అందుకున్నారు. -
‘పంచభూతాలను దోచుకుతిన్న వ్యక్తి చంద్రబాబు’
సాక్షి, విజయవాడ : ఈ ప్రపంచంలో పంచభూతాలను దొచుకుతిన్న ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునేనని వైఎస్సార్సీపీ బాపట్ల అభ్యర్థి నందిగం సురేష్ ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో కృష్ణానదిని అక్రమంగా పూడ్చుతున్నారని తెలిపారు. చుక్కపల్లి ప్రసాద్, కుశలవ సత్యప్రసాద్ అధ్వర్యంలో నదిని పూడ్చడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకూ అమరావతిలో ఆలయ భూములను, కృష్ణా నది ఇసుకను దోచుకున్నారని.. ఇప్పుడు బాబు డైరెక్షన్లో ఏకంగా నదినే పూడ్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుతినడానికి చంద్రబాబుకు పర్మిషన్ ఎవరిచ్చారని సురేష్ ప్రశ్నించారు. రాజధానిలో దాదాపు 2 వేల కోట్ల విలువైన 150 ఎకరాల భూమిని కాజేస్తుంటే చంద్రబాబుకు కనిపించలేదన్నారు. తన కుమారుడి కోసం చంద్రబాబు ఏకంగా కృష్ణా నది రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కృష్ణానదిని పూడ్చడం ఆపాలని.. లేదంటే తామే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. -
‘పంచభూతాలను దోచుకుతిన్న వ్యక్తి చంద్రబాబు’
-
సామాన్యుడి స్వరం వినిపిస్తా..
సాక్షి, బాపట్ల (శ్రీకాకుళం): ‘బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నేను నిలబడాలని జగనన్న చెబితే మొదట్లో అర్థం కాలేదు. సామాన్యుడినైన నాకు ఎంపీ టికెట్టా అని అడిగితే.. ఏ..? సామాన్యుడు ఎంపీ కాకూడదా అంటూ జగనన్న చిరునవ్వుతో బదులిచ్చారు. మా అధినేత నింపిన స్ఫూర్తితో బాపట్ల ఎంపీగా గెలుస్తా. బాపట్ల గల్లీ వాణిని ఢిల్లీ వేదికగా దేశ ప్రజలకు వినిపిస్తా’... అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్‌బాబు పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని.. తాను ఎంపీగా గెలుపొందిన వెంటనే నీటి సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఒక సామాన్యుడు ఎంపీ స్థాయికి ఎదగడం అంటే కోహినూర్ వజ్రాన్ని సొంతం చేసుకున్నట్లేనని పేర్కొన్నారు. ఎంతో మంది సామాన్యులు తామే ఎంపీ అభ్యర్థిగా ఉన్నామని భావిస్తూ తన గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నారని సురేష్‌బాబు సంతోషం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వెల్లడించారు. ఆ వివరాలు... సాక్షి : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేయడాన్ని ఏ విధంగా భావిస్తున్నారు? సురేష్‌బాబు : ఎంతో మంది ప్రముఖులు గెలుపొందిన ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం రావడాన్ని గొప్పగా భావిస్తున్నా. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తా. బాపట్లను కచ్చితంగా అభివృద్ధివైపు పరుగులు తీయిస్తా. సాక్షి : ప్రస్తుత ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? సురేష్‌బాబు : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎక్కడకు వెళ్లినా మా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలపైనే జోరుగా చర్చ సాగుతోంది. ప్రజలు కూడా నవరత్నాలపైనే విశ్వాసంగా ఉన్నారు. సామాన్యుడినైనా నాకు ఎంపీగా అవకాశం రావడంతో నేను ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ కనిపిస్తోంది. నా గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడుతున్నాయి. కచ్చితంగా గెలిచి తీరుతా. సాక్షి : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో సమస్యలను గుర్తించారా? సురేష్‌బాబు : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంపై నాకు ఎంతో పట్టు ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించి పట్టుసాధించా. ఈ నియోజకవర్గంలో తాగు, సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు కృషి చేస్తా. నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి చూపేందుకు పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా శ్రమిస్తా. సాక్షి : ఎన్నికల ప్రచారం ఎలా సాగింది? సురేష్‌బాబు : ఎన్నికల ప్రచారం చాలా చక్కగా జరిగింది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాపట్ల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తిచేశా. ఎక్కడ చూసినా ఫ్యాన్ జోర్ తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే సంక్షేమ పాలన అందుతుందని ప్రజలు భావిస్తున్నారు. నవరత్నాలు ఎప్పుడు అందుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. సాక్షి : నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సురేష్‌బాబు : బాపట్ల పార్లమెంటు స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా సొంతం చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్న శ్రీరామ్‌మాల్యాద్రి ఐదేళ్లుగా ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రజలను కలిసి ఓట్లు అడిగారు.. ఆ తర్వాత కనిపించలేదు. దీంతో ప్రజలు ఆయనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇది నాకు కలిసొచ్చే అంశం. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంపై కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రానికి దిక్సూచి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని భావిస్తున్నారు. సాక్షి : ఎంపీగా గెలిచాక ఎలా ఉంటారు? సురేష్‌బాబు : బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ చరిత్రలోనే ఒక సామాన్యుడు ఎంపీ అభ్యర్థిగా వస్తాడని ప్రజలు ఊహించలేదు. నేను ఒక సామాన్యుడిగా ప్రజల ముందుకు వచ్చాను. నన్ను ప్రజలు గెలిపిస్తే వారి మధ్యనే ఉంటా. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా. బాపట్ల గల్లీ వాణిని ఢిల్లీలో వినిపిస్తా. ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉండి చూపిస్తా. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్ వేదికగా పోరాడతా. -
ఢిల్లీ గడ్డపై బాపట్ల వాణి వినిపిస్తా
సాక్షి, బాపట్ల : ‘బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నిలబడాలని జగనన్న చెబితే మొదట్లో అర్థంకాలేదు... సామాన్యుడినైన నాకు ఎంపీ టిక్కెట్టా అని అడిగితే.. సామాన్యుడు ఎంపీ కాకూడదా అంటూ జగనన్న చిరునవ్వుతో బదులిచ్చారు. మా అధినేత నింపిన స్ఫూర్తితో బాపట్ల ఎంపీగా గెలుస్తా. బాపట్ల గల్లీ వాణిని ఢిల్లీ వేదికగా దేశ ప్రజలకు వినిపిస్తా..’ అని బాపట్ల పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్‌బాబు అన్నారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సాగు, తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని... తాను ఎంపీగా గెలుపొందిన వెంటనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఒక సామాన్యుడు ఎంపీ స్థాయికి ఎదగటం, ప్రజాసేవ చేసే అవకాశం రావడం తమ పార్టీ అధినేత గొప్పతనమని అన్నారు. ఎంతో మంది సామాన్యులు తామే ఎంపీ అభ్యర్థిగా ఉన్నామని భావిస్తూ తన గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. ప్రశ్న: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడాన్ని ఏవిధంగా భావిస్తున్నారు. జవాబు : ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, చీరాల, అద్దంకి, పర్చూరు, గుంటూరు జిల్లాలోని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాలతో కూడిన బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయటం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో మంది ప్రముఖులు గెలుపొందిన ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నా. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచనలేకుండా పనిచేస్తా. బాపట్లను కచ్చితంగా అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తా. ప్రశ్న: ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? జవాబు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోంది. సీఎం చంద్రబాబునాయుడి పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎక్కడకు వెళ్లినా మా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలపైనే జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రజలు కూడా నవరత్నాలపైనే విశ్వాసంగా ఉన్నారు. సామాన్యుడినైన నాకు ఎంపీగా అవకాశం రావడంతో నేను ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ కనిపిస్తోంది. నా గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడుతున్నాయి. కచ్చితంగా గెలిచి తీరుతా. ప్రశ్న: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో సమస్యలను గుర్తించారా? జవాబు: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంపై నాకు పట్టు ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించి పట్టుసాధించా. ఈ నియోజకవర్గంలో తాగు, సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తా. నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి చూపేందుకు పారిశ్రమికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు శ్రమిస్తా. ప్రశ్న: ప్రచారం ఎలా సాగుతోంది? జవాబు: ఎన్నికల ప్రచారం చాలా చక్కగా సాగుతోంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. బాపట్ల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాటికే ప్రచారం పూర్తిచేశా. ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలి వీస్తోంది. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే సంక్షేమ పాలన అందుతుందని భావిస్తున్నారు. నవరత్నాలు ఎప్పుడు అందుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రశ్న: నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? జవాబు: బాపట్ల పార్లమెంటు స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా సొంతం చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్న శ్రీరామ్‌మాల్యాద్రి గత ఐదేళ్లు ఎంపీగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో ప్రజలను కలిసి ఓట్లు అడిగారు. ఆ తరువాత ప్రజలకు కనిపించలేదు. దీంతో ప్రజలు ఆయనపై తీవ్రవ్యతిరేకతతో ఉన్నారు. ఇది నాకు కలిసొచ్చే అంశం. ప్రజలు చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రానికి దిక్సూచి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని భావిస్తున్నారు. ప్రశ్న: ఎంపీగా గెలిచాక ఎలా ఉంటారు? జవాబు: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం చరిత్రలోనే ఒక సామాన్యుడు ఎంపీ అభ్యర్థిగా వస్తారని ప్రజలు ఊహించలేదు. నేను ఒక సామాన్యుడిగా ప్రజల ముందుకు వచ్చాను. నన్ను ప్రజలు గెలిపిస్తే వారి మధ్యనే ఉంటా. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా. బాపట్ల గల్లీ నుంచే ఢిల్లీకి నా వాణిని వినిపిస్తా. ఒక నాయకుడు ఏవిధంగా ఉండాలో అదే విధంగా ఉండి చూపిస్తా. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతా. -
బాపట్లలో గెలుపు ఎవరిది?
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. 2004 వరకు జనరల్ సెగ్మెంట్‌గా ఉన్న బాపట్ల 2009 పునర్విభజన నేపథ్యంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారిపోయింది. ఇక్కడ నుంచి గెలిచిన వారిలో నలుగురు ఎంపీలు కేంద్రమంత్రులుగా పనిచేయగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాలు : గుంటూరు జిల్లాలోని వేమూరు, రేపల్లె, బాపట్ల,ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. సీఎంను అందించిన బాపట్ల బాపట్ల పార్లమెంట్ నుంచి ఎంపీలుగా గెలుపొందిన పి.అంకినీడు ప్రసాద్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి వంటి వారు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ఇక్కడ నుంచి 1998లో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బాపట్ల నుంచి పనబాక లక్ష్మి ఇక్కడ నుంచి పోటీ చేసి 69వేల భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందడమే కాకుండా కేంద్ర మంత్రిగా పనిచేశారు. పి. అంకినీడు ప్రసాద్ మినహా మిగతా తొమ్మిది మంది కొత్తవారికి ఇక్కడి ప్రజలు అవకాశం కల్పిస్తూ వచ్చారు. 11 సార్లు ఎన్నికలు జరగ్గా ఆరు సార్లు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు, ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. సామాన్యునికే పట్టం కట్టనున్న ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీలో నిలిచిన నందిగం సురేష్ మాత్రం పార్టీలో సామాన్య కార్యకర్త. ఆర్థిక బలం, అంగబలం పెద్దగా లేని సురేష్‌కు వైఎస్.జగన్ టిక్కెట్టు కేటాయించడంతోపాటు, ఎంపీ అభ్యర్థుల జాబితాను సురేష్‌తో చదివించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సురేష్‌ను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో భారీ స్థాయిలో చేసిన అభివృద్ధి పనుల కారణంగా ప్రజలు వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపనున్నారు. మాల్యాద్రికి గడ్డుకాలమే.. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన శ్రీరామ్ మాల్యాద్రిని 2014లో బాపట్ల పార్లమెంట్ ప్రజలు గెలిపించారు. అయితే ఐదేళ్లలో ప్రజల సమస్యలు తీర్చడం మాట అటుంచితే కనీసం ముఖం కూడా చూపించని పరిస్థితి. కొన్ని గ్రామాల్లోని ప్రజలకు వాళ్ల ఎంపీ ఎవరో తెలియదంటే మాల్యాద్రి ప్రజలకు ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నారో అర్థమవుతోంది. దీనికి తోడు గుంటూరు జిల్లాలోని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో టీడీపీలో అంతర్గత విభేదాలతో నాయకులు పార్టీని వీడుతుండటం, ప్రకాశం జిల్లాలోని చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్సీపీలో చేరడం, మాజీ ఎంపీ, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్సీపీలో చేరి పర్చూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనుండటంతో ఈ సారి మాల్యాద్రి ఓటమి ఖాయంగా కనిపిస్తుంది. అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు తొలుత టిక్కెట్టు ఇచ్చారు. అయితే కార్యకర్తల్లో నిరసన వ్యక్తం కావడంతో శ్రీరామ్ మాల్యాద్రికి కేటాయించారు. – నక్కా మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు -
టీడీపీ ప్రజలకు తీరని అన్యాయం చేసింది
-
వైఎస్సార్ సీపీని గెలిపించండి
సాక్షి, చీమకుర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతనూతలపాడు అసెంబ్లీ అభ్యర్థిగా టీజేఆర్ సుధాకర్‌బాబు, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగం సురేష్లను గెలిపించాలని ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఏలూరివారిపాలెం, కూనంనేనివారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబుతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలతోనే సాధ్యమన్నారు. జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సంతనూతలపాడు అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అధికార పార్టీ అప్పులపాలు చేసిందని, సుబాబులు, జామాయిల్ రైతులను నట్టేట ముంచారని తెలిపారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని బూచేపల్లి కుటుంబం సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సుధాకర్‌బాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తొలుత కూనంనేనివారిపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 250 మంది కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, టీజేఆర్ సుధాకర్‌బాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరివారిపాలెం, కూనంనేనివారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడింది. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, మండల కన్వీనర్ దాసరి లక్ష్మినారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు గోగినేని వెంకటేశ్వర్లు, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, మేడగం రామకృష్ణారెడ్డి, మల్లినేని వెంకటేశ్వర్లు, పేరం శ్రీను, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, పులి వెంకటరెడ్డి, ఏలూరి సుబ్బారావు, బక్కా కోటేశు, మన్నం హరి, తిమోతి, కొల్లూరి శింగయ్య, బొడ్డపాటి హరిబాబు, నల్లూరి నారాయణ, వేమా బాలకోటేశ్వరరావు, మాదాల శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చీమకుర్తిలో టీడీపీ ప్రచారం.. సూర్యనగర్‌లో మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ కౌత్రపు రాఘవరావు, కందిమళ్ళ గంగాధర్, స్థానిక కౌన్సిలర్ గంగుల పార్వతి, ముఖర్జీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి బీఎన్.విజయ్‌కుమార్‌ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్ పర్యటనను జయప్రదం చేయండి.. జగన్మోహన్రెడ్డి సంతనూతలపాడు పర్యటనను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ సంతనూతలపాడు అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబు పిలుపునిచ్చారు. బుధవారం సంతనూతలపాడులో పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల కార్యకర్తలు, నాయకులతో జగన్ పర్యటన గురించి సమీక్షించారు. ఈ నెల 29న ఉదయం 9–10 గంటల మధ్య జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో సంతనూతలపాడుకు చేరుకుంటారని తెలిపారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని సంతనూతలపాడుతో పాటు చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా గ్రామాలలో బూత్‌కమిటీ కన్వీనర్లు చైతన్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ మండలానికి ఆ మండల కన్వీనర్ బాధ్యతగా తీసుకొని జగన్ పర్యటనను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మద్దిపాడు ఎంపీపీ నారా విజయలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, నాలుగు మండలాల కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, దాసరి లక్ష్మినారాయణ, మండవ అప్పారావు, దివి పున్నారావుతో పాటు సీనియర్ నాయకులు బొల్లినే కృష్ణయ్య, దుంపా యలమందారెడ్డి, కుమారస్వామి, బీ.శివకుమారి, కుమారస్వామి, పూర్ణచంద్రరావు, తన్నీరు మోహన్‌రావు, తలారి కోటయ్య, క్రిష్టిపాటి శేఖరరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు.. మద్దిపాడు: మండలంలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. మండలంలోని బూరేపల్లి పునరావాస కాలనీకి చెందిన దాసరి రాజు, కావూరి ఏసోబు నాయకత్వంలో కాలనీకి చెందిన 25 కుంటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రబాబు మోసపు మాటలు విని అవినీతి పాలనతో విసిగి పోయామని జగన్మోహనరెడ్డి నవరత్నాల పథకాలు తమకు బాగా నచ్చాయని తెలిపారు. పార్టీలో చేరిన 25 కుటుంబాలకు చెందిన 100 మందికి సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబు పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో కొమ్మూరి సుధాకర్ మాదిగ, మండల కన్వీనర్ మండవ అప్పారావు, మాజీ ఎంపీపీ కుమారస్వామి, వెంకటాద్రి, కురిచేటి శ్రీను, హనుమంతరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
చచ్చిపోదామనుకున్నా.. కానీ ఎంపీ అభ్యర్థినయ్యా..
సాక్షి, అమరావతి బ్యూరో : ‘మూడు పూటలా తినేందుకు స్తోమత లేని కుటుంబం నుంచి వచ్చిన నాకు జగనన్న బాపట్ల ఎంపీ టిక్కెట్ ఇవ్వడం ఇప్పటికీ కలగానే ఉంది. ఆ విషయం నమ్మలేకపోయాను. తప్పుడు కేసులు పెట్టి పోలీసులు చిత్రహింసలకు గురిచేసినప్పుడు ఒక దశలో చనిపోదామా! అనుకున్నా. అప్పుడు జగనన్నే అండగా ఉండి ధైర్యం చెప్పి సొంత తమ్ముడిలా ఆదరించారు. నాకు ఏకంగా వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కల్పించారు. కొన్నాళ్ల క్రితం వరకూ ఎవరైనా నాయకులు కనిపిస్తే సెల్ఫీ కావాలని అడిగేవాడిని. ఇప్పుడు పలువురు సెల్ఫీ కావాలని నన్ను అడుగుతుంటే ఈ జన్మకిది చాలనిపిస్తుంది. వైఎస్ జగన్‌కు దళితుల పట్ల ఎంత ప్రేమ ఉందో చాటిచెప్పేందుకు నా సంఘటనే ఉదాహరణ’ అని బాపట్ల నుంచి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందిగం సురేష్ చెప్పారు. ఆయన తన అంతరంగాన్ని సాక్షితో పంచుకున్నారు. వైఎస్ అంటే అభిమానం ‘‘మాది గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం. మా తల్లిదండ్రులు పౌలు, సంతోషమ్మలు. మేం ఐదుగురు పిల్లలు.. పేద కుటుంబం కావడంతో స్తోమత లేక నన్ను, మా అన్నయ్యను చదువు కోసం బంధువులు పనిచేసే ఎస్సీ హాస్టల్లో చేర్పించారు. పది చదివాక.. ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపేశాను. పూట గడవడం కోసం అన్నయ్యతో కలిసి కూలి పనులకు వెళ్లేవాడిని. ఫొటోగ్రఫీ నేర్చుకుని ఫొటోలు తీస్తూ వచ్చే కొద్దిపాటి డబ్బులతో నెట్టుకొచ్చేవాడిని. తరువాత రియల్ ఎస్టేట్‌లో కమిషన్ వ్యాపారం చేసి కొంత నిలదొక్కుకున్నా. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పుణ్యాన ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాం. రెండున్నర ఎకరాల పొలంపై తీసుకున్న రుణాలు రూ.4 లక్షలకు చేరడంతో.. పొలం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మళ్లీ మహానేత దయవల్ల రుణమాఫీ జరగడంతో పొలం మిగిలింది. రాజశేఖరరెడ్డి అంటే నాకు పిచ్చి అభిమానం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశాక ఆ పార్టీ జెండాలు పట్టుకుని ప్రచారం చేశాను. చిత్రహింసలు పెట్టారు.. రాజధాని ప్రాంతంలో దుండగులు అరటి తోటను తగులపెట్టినప్పుడు మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. డబ్బులిస్తాం.. జగన్మోహన్రెడ్డే పంట పొలాలు తగులబెట్టమన్నారని చెప్పాలంటూ హింసించారు. కాలుస్తామని బెదిరించారు. కాళ్లతో తన్నారు. బట్టలు విప్పించి చిత్రహింసలకు గురిచేశారు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. పిల్లలు గుర్తొచ్చి ఆగిపోయా. నన్ను జైల్లో పెట్టారన్న విషయం తెలిసి పలకరించేందుకు, ఫోను చేసేందుకు మా ఊర్లో అంతా భయపడ్డారు. స్టేషన్ నుంచి ఇంటికెళ్లేసరికి మా పిల్లలు, అన్న పిల్లలు పలక మీద డాడీ వెల్కమ్ అని రాసుకుని నిద్రపోవడం చూసి ఏడుపొచ్చింది. ఏం కావాలో చెప్పబ్బా! అన్నారు ఆ సమయంలో జగనన్న నాకు పూర్తి అండగా నిలబడ్డారు. 47 మంది ఎమ్మెల్యేల్ని మా ఇంటికి పంపారు. వారంతా నన్ను ఓదార్చి అండగా ఉంటామన్నారు. వైఎస్ జగన్ మా ఊరు వచ్చినప్పుడు నన్ను స్టేజీపైకి పిలిచి ఏం జరిగిందని అడిగారు. పోలీసులు ఎలా చిత్రహింసలకు గురిచేశారో చెప్పా. ఆ సమయంలో జగనన్న కళ్లల్లో బాధ, ఆవేదనను చూశాను. నీకు నేనున్నా. నువ్వు నా తమ్ముడివి అంటూ భరోసా ఇచ్చారు. ఆయన ల్యాండ్ లైన్ నంబరు, పీఏ ఫోన్ నంబరు ఇచ్చి ఏ అవసరమొచ్చినా ఫోన్ చేయమని చెప్పారు. ఆ తర్వాత నేను జగనన్నను కలిసినప్పుడు.. ‘‘ఏం కావాలో చెప్పబ్బా’’ అని అడిగారు. అన్నా నాకేమీ వద్దు.. మీరు సీఎం అయ్యేవరకు మీ వెంటే తిరుగుతానన్నాను. సీఎం అయ్యాక ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు మీ వెనుక పెట్టుకోండి చాలన్నా. సీఎం పక్కన కూర్చున్నాడని మా ఊరోళ్లు అనుకుంటే చాలని చెప్పా. న్యాయంగా పోరాడేవారికి అన్యాయం జరగకూడదు. నేనున్నా అని జగనన్న నాతో అన్నారు’’ గొప్ప వ్యక్తిత్వం ఒకసారి జగనన్న నన్ను పిలిచి పార్లమెంట్‌కు పోటీ చేయాలని చెప్పారు. అన్నా.. అనుభవం లేదు.. డబ్బులు లేవు అన్నా. ‘‘అవన్నీ వదిలేయ్! నేను చూసుకుంటా. అనుభవం దానంతటదే వస్తుంది’’ అని చెప్పారు. నాకు ఎంపీ సీటును ఖరారు చేశాక నోటిమాట పెగల్లేదు. కళ్లంట నీళ్లు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ఆదినారాయణరెడ్డి, వర్ల రామయ్య, చింతమనేని దళితుల్ని కించపరుస్తూ మాట్లాడారు. ఒక సామాన్యుడికి జగనన్న ఎంపీ సీటిచ్చి అరుదైన గౌరవం కట్టబెట్టారు. నాతో అభ్యర్థుల జాబితా చదివించారు. నన్ను విమర్శించిన వారందరికీ నేను ఒకటే విషయం చెప్పా.. జగన్మోహన్రెడ్డి మానవత్వం గల మనిషి, దళితుల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి కాబట్టి ఇంత గౌరవం ఇచ్చారని చెప్పాను. – ఓబులరెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో -
ఎన్నికల బరిలో నవ కెరటాలు
రాజకీయాల్లో యువతను ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉన్నారు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. అత్యున్నత విద్యనభ్యసించిన వారినే కాకుండా సామాన్య పేద కుటుంబాల్లో జన్మించి ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారికి టికెట్లిచ్చారు. జిల్లా రాజకీయ యవనికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కొత్త తరం నాయకులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కొండారెడ్డి గారి అబ్బాయి మార్కాపురం: పశ్చిమ ప్రకాశంలో అందరికీ కేపీ కొండారెడ్డి, ఉడుముల కుటుంబాలు సుపరిచితమే. వారి కుటుంబం నుంచి రాజకీయ వారసుడొచ్చాడు. మార్కాపురం నియోజకవర్గం నుంచి నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కుందురు పెద్ద కొండారెడ్డి తనయుడు కుందురు నాగార్జున రెడ్డి రాజకీయ అరంగ్రేటం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మార్కాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన ఈయన అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం తొలిసారే అయినా రాజకీయాల్లో దశాబ్దాలుగా రాణిస్తున్న కుటుంబం కావడం, తన మామ ఉడుముల శ్రీనివాసరెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే కావడం నాగార్జున రెడ్డికి కలిసొచ్చే అంశంగా మారింది. తన తండ్రే తనకు రోల్ మోడల్ అని చెబుతున్న ఈయన.. మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయించి కరువు, ఫ్లోరైడ్ సమస్యలు నివారించేందుకు పాటుపడతానని పేర్కొన్నారు. పేదల వైద్యుడు.. ప్రజాసేవకొచ్చారు కొండపి: నిరుపేద కుటుంబంలో జన్మించిన మాదాసి వెంకయ్య అనేక ఆటుపోట్లు ఎదుర్కొని వైద్య విద్యను అభ్యసించారు. టంగుటూరు మండలం కారుమంచిలో జన్మించిన ఈయనను తల్లి కోటమ్మ కూలీ పనులు చేసి రెక్కల కష్టంతో చదివించారు. గుంటూరు ప్రభుత్వ కళాశాల నుంచి ఎంబీబీఎస్, ఎంఎస్ పట్టా పొందిన ఈయన బాంబే టాటా మెమోరియల్ వైద్యశాలలో సైతం శిక్షణ పొందారు. కార్పొరేట్ వైద్యశాలలో చేరకుండా దశాబ్ద కాలం ఉలవపాడు ప్రభుత్వ వైద్యశాలతోపాటు మరో పదేళ్లు రిమ్స్‌లో వైద్యునిగా, అధ్యాపకునిగా పనిచేసి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ వైద్యునిగా గుర్తింపు పొందారు. ఇప్పటికీ ఉలవపాడులో కేవలం 20 రూపాయల ఓపీతో పేదలకు వైద్యం చేస్తున్న వైద్యుడు ఈయన ఒక్కరే. మానవ సేవే మాధవసేవగా భావించి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. లక్షల మంది రోగులకు ఆపరేషన్లు చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన వెంకయ్య 2014లో రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ముగ్గురు గవర్నర్లు, వైఎస్సార్‌తోపాటు ఆ తర్వాత అధికారం చేపట్టిన ముగ్గురు ముఖ్యమంత్రుల మీదుగా అవార్డులు స్వీకరించారు. 2016లో నేషనల్ మెడికల్ టూరిజం మెంబరుగా ఎంపికయ్యారు. ప్రభుత్వ, ప్రేవేట్ ఆస్పత్రుల్లో వందకు పైగా అవార్డులు పొందిన డాక్టర్ వెంకయ్య అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ స్ఫూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈయన ఎస్సీ రిజర్వుడు నియోజకవ్గం అయిన కొండపి నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. పోరాటాలు మలిచిన నాయకుడు టీజేఆర్ చీమకుర్తి: సామాన్య పేద కుటుంబంలో జన్మించిన టీజేఆర్ సుధాకర్‌బాబు విద్యార్థి దశ నుంచే పోరాట పంథాతో ముందుకు సాగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల వైపు ఆకర్షితుడైన ఈయన 1991 నుంచి కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల్లో క్రియాశీలకంగా పనిచేశారు. వైఎస్సార్ మరణానంతం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం వేధింపులకు గురిచేయడం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో సుధాకర్ బాబు జగన్ వెంట నడిచారు. సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగుతున్న సుధాకర్ బాబు.. ప్రజా సమస్యలపైనా పోరాటాలు చేయడం ద్వారా మరింత గుర్తింపు పొందారు. ప్రజల ఆశిర్వాదంతో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం ద్వారా వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మళ్లీ అమలు చేసి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని టీజేఆర్ పేర్కొన్నారు. బాపట్ల బరిలో సామాన్యుడు ఒంగోలు సిటీ: సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన నందిగం సురేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. తమ కుటుంబానికి ఉన్న ఎకరాన్నర పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే రాజకీయాలపై ఆసక్తితో జగన్ వెంట నడిచారు. ఈ క్రమంలోనే అధికార టీడీపీ దుర్మార్గాలకు తెరలేపింది. ఏపీ రాజధాని అమరావతిలో భాగమైన తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు పంట పొలాలు తగలబెట్టి ఆ కేసును వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మెడకు చుట్టేందుకు పక్కాగా ప్లాన్ వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నందిగం సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మానసికంగా, శారీరకంగా చిత్రవదకు గురిచేశారు. తుపాకీ ఎక్కుపెట్టి చంపుతామని బెదిరించారు. పంట పొలాల దహనం కేసులో వైఎస్ జగన్ పేరు చెప్పాలని బలవంతం చేశారు. కానీ నందిగం సురేష్ పోలీసుల బెదిరింపులకు లొంగలేదు. తదనంతరం వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో సురేష్ కూడా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులై ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించిన తనను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన వైఎస్ జగన్ నమ్మకాన్ని వమ్ము చేయబోనని, ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేసేది లేదని సురేష్ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు.. దళితులను నానా రకాలుగా దుర్భాషలాడుతున్న తీరును రాష్ట్రంలోని దళితులు యావగించుకుంటున్నారని చెప్పారు. -
అరటి తోటలు తగులబెట్టించింది చంద్రబాబే..
విజయవాడ సిటీ: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్కన కూర్చుని ఓ దళితుడు పార్టీ అభ్యర్థులను ప్రకటించడాన్ని సీఎం చంద్రబాబునాయుడు జీర్ణించుకోలేక తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడని బాపట్ల వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్ ధ్వజమెత్తారు. నీచ సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీలో దళితులకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో నందిగం సురేష్ విలేకరులతో మాట్లాడారు. అటూ ఇటూ నేరగాళ్లతో కలిసి వైఎస్ జగన్ అభ్యర్థులను ప్రకటించారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సురేష్ అభ్యంతరం తెలిపారు. సాధారణంగా పార్టీ అధ్యక్షులే.. అభ్యర్థులను ప్రకటిస్తారని, కానీ దేశానికి మార్గనిర్దేశం చేసేలా దళితుడైన తనతో అభ్యర్థులను ప్రకటించారని ఆనందం వ్యక్తం చేశారు. తనను రాష్ట్ర రాజధానిలో జరిగిన విధ్వంసంలో నిందితుడని, అరటి తోటలు తగలుబెట్టిన కేసులో తాను ఉన్నట్లు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సురేష్ తీవ్రంగా తప్పుపట్టారు. ఒకవేళ నిజంగా తాను అలా చేసి ఉంటే ఇన్నాళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘రాజధానిలో అరటి తోటలను తగులబెట్టించింది నీవు కాదా చంద్రబాబూ’ అని నిలదీశారు. ‘నీ మనవడిని తీసుకురా.. నా పిల్లల్ని నేను తీసుకొస్తా. ఏదైనా గుడికిగాని, చర్చికిగాని వెళ్లి అరటి తోటలు ఎవరు తగులబెట్టారో ప్రమాణం చేద్దాం’ అని సవాల్ విసిరారు. రూ. 50 లక్షలు ఇస్తాం.. ఒప్పుకోమని బెదిరించలేదా? రాజధాని భూముల కోసం పోరాటం చేస్తే.. అరటి తోటలు తగులబెట్టింది వైఎస్సార్సీపీ వాళ్లేనని చెప్పమంటూ పోలీసులు తనను తుపాకీతో బెదిరించారని నందిగం సురేష్ వెల్లడించారు. తనను భూజాలపై ఎగిరి తన్నారని గుర్తు చేశారు. వాళ్లు చెప్పినట్లు చేస్తే రూ. 50 లక్షలు ఇస్తామని బెదిరింపులకు దిగారని వివరించారు. ‘చంద్రబాబు వద్దకు తీసుకెళతాం. సీఎం నీకు ఏం కావాలంటే అది ఇస్తాడని ఆశపెట్టారు. వినకపోతే తీవ్రంగా ఒత్తిడి తేవడమే కాకుండా మానసికంగా కుంగదీయడానికి తన కుటుంబ సభ్యులను కూడా డీఎస్పీ నానా మాటలన్నారు. మాట వినకపోతే ఒక దశలో ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు.’ అని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. మంత్రి పుల్లారావుతో పాటు దళిత ఎమ్మెల్యే శ్రావణ్ కూడా తనను చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు పోలీసు స్టేషన్లో పెట్టి అరటి తోటలు తగులబెట్టించింది వైఎస్ జగనే అని చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. ఇంతగా వేధించినా తాను ఒప్పుకోకపోవడంతో చివరికి చేసేది లేక వదిలేశారని వివరించారు. అరటి తోటల విధ్వంసంపై విచారణ జరిపే దమ్ము చంద్రబాబుకు లేదని, ఎందుకంటే పంటలు తగులబెట్టింది ఆయనేనని రైతులందరికీ కూడా తెలుసునని వెల్లడించారు. -
‘దళితులకు సీటు ఇస్తే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు’
-
‘అలా చెప్తే 50 లక్షలు లంచం ఇస్తానన్నారు’
సాక్షి, విజయవాడ : దళితుడైన తనను బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్ అన్నారు. వైఎస్సార్ సీపీలో దళితులకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... తాను విధ్వంసాలకు పాల్పడ్డానని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ నిజంగా తాను అలా చేసి ఉంటే ఇన్నాళ్లు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు కాబట్టే ఇలా చేస్తున్నారని విమర్శించారు. వారిద్దరు నన్ను చంపేస్తామని బెదిరించారు.. రాజధాని భూముల కోసం పోరాటం చేస్తే అరటి తోటలు తగులబెట్టింది వైఎస్సార్ సీపీ వాళ్లేనని చెప్పమంటూ పోలీసులు తనను గన్‌తో బెదిరించారని నందిగం సురేష్ అన్నారు. ‘ వాళ్లు చెప్పినట్టు చేస్తే 50 లక్షలు ఇస్తామని బేరసారాలు ఆడారు. మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్ కూడా నన్ను చంపేస్తామని బెదిరించారు. పంట తగులబెట్టిన కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలంటూ నా భుజాలపై తన్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అరటి తోటల విధ్వంసంపై విచారణ జరిపే దమ్ము చంద్రబాబుకు లేదని, ఎందుకంటే పంటలు తగులబెట్టింది ఆయనేనని రైతులందరికీ కూడా తెలుసునని పేర్కొన్నారు. 2019లో చంద్రబాబుకు ఛలో సింగపూర్ తప్పదని సురేష్ వ్యాఖ్యానించారు. -
‘చంద్రబాబు కరకట్టపై కాపలా పెట్టకున్నారు’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ అడ్డదారిలో మంత్రి అయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నందిగం సురేశ్ విమర్శించారు. బుధవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోరుంది కదా అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నను హెచ్చరించారు. బుద్ధా వెంకన్న అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని ఆరోపించారు. చంద్రబాబుకు ఓడిపోతామనే భయం పట్టుకుందని.. ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబుకు అర్థమైందని అన్నారు. ఓటుకు కోట్లు కేసు, ఇటీవల ఐటీ గ్రిడ్స్ కేసు తర్వాత ఏ క్షణాన అరెస్ట్ చేస్తారో అనే భయంతో చంద్రబాబు కరకట్టపై కాపలా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐకి నో ఎంట్రీ బోర్డులు తీసేసి.. విచారణకు సిద్దపడ్డాలని సవాలు విసిరారు. దొంగతనం చేసి కేకలు పెట్టినంత మాత్రాన ఏమి జరగదని వ్యాఖ్యానించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకు చంద్రబాబు అండ్ కో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఎల్లో మీడియాలో అబద్ధాలను ప్రచారం చేసినంతా మాత్రనా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. -
బాబు అండ్‌కో జైలుకు వెళ్లడం ఖాయం
-
చింతమనేనిని అరెస్ట్ చేయాలి!
-
నువ్వు మనిషివా.. పశువువా?
సాక్షి, విజయవాడ : చింతమనేని ప్రభాకర్ లాంటి రౌడీ షీటర్‌ను మంత్రి లోకేష్ పెంచి పోషిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్త నందిగం సురేష్ అన్నారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని, నోరు అదుపులో పెట్టుకోవాలని చింతమనేనిని హెచ్చరించారు. చింతమనేని ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, ఆయన మీద జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.(మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) మనిషివా, పశువువా? ‘చంద్రబాబు, చింతమనేని మీకు దళితులంటే ఎందుకు అంత చులకన. చింతమనేని నీ ఆటలు సాగనివ్వం.. నువ్వు మనిషిగా పుట్టావా, పశువుగా పుట్టావా.. నీ వీడియో అంతా నిజం. నీకు తగిన బుద్ధి చెబుతాం. టీడీపీలో ఉన్న దళిత నేతలు ఇంకా బానిసలుగా బతుకుతున్నారు.. చింతమనేని లాంటి నీచుడిని ఇంకా భరిస్తారా.. ఇది రౌడీ షీటర్ల ప్రభుత్వమా’ అంటూ అధికార పార్టీ తీరుపై సురేష్ నిప్పులు చెరిగారు.(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత) -
'చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు'
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తే సీఎం చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి మరొకరు కనిపించరని వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్ మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన అందించినవారు లేరని నిప్పులు చెరిగారు. అలాంటి చంద్రబాబు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. 'మేం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఓ కార్యక్రమం చేపట్టాం. దానికి కౌంటర్‌గా నిన్ను నమ్మాం బాబు అని పోస్టర్ పెట్టుకుంటున్నారు. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మిమ్మల్ని నమ్మం అని లోటస్ పాండ్ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు మీ భాష మార్చుకోండి. వైఎస్ జగన్ గురించి మాట్లాడేసమయంలో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నిన్ను నమ్మం బాబూ అని మీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ఇక చాలు వెళ్లండి. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఆయనకు వయసైపోయింది.కుట్ర, కుళ్లు రాజకీయాలు, మనషులు చనిపోయిన దగ్గరకు కూడా వెళ్లి రాజకీయాలు చేసే నైజం మీది. 2014లో 600 చిల్లర హామీలు ఇచ్చారు. అధికారం కోసం ఏది పడితే అది మాట్లాడారు. ఇప్పుడు తిరిగి అధికారం కోసం మా పథకాలు అన్నీ కాపీ కొట్టారు. ఈ విషయం ప్రజలకు తెలిసిపోయింది. మీ పార్టీ నుంచి అందరు వెళ్లిపోవడం చూసి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అందుకే అయోమయానికి గురవుతున్నారు. మీ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను నమ్మం బాబూ దిగిపో అనే పరిస్థితి రాబోతుంది. ఇక సర్దుకోండి. 2019లో ప్రజలు బట్టలూడదీసి కొడతారు. జాగ్రత్తగా మాట్లాడండి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ మాలోకంకి ఆ సత్తా లేదు కాబట్టి సర్దుకుంటే బాగుంటుంది. చంద్రబాబు తన సామాజిక వర్గానికి తప్ప మిగిలినవారందరికి అన్యాయం చేస్తున్నారని ఆయన వద్ద ఉన్న నేతలే చెబుతున్నారు. చంద్రబాబు నేను మారాను. నాకు ఓట్లేయండి అని గతంలో అడిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. చంద్రబాబుకు మీడియా మేనేజ్మెంట్ తప్ప మరోటి తెలియదు' అని అన్నారు. -
చంద్రబాబూ..నీ భాష మార్చుకోవాలి
-
‘దొరికిపోతాడు కాబట్టే లోకేష్ ట్విటర్ పోస్టులు’
-
‘దొరికిపోతాడు కాబట్టే లోకేష్ ట్విటర్ పోస్టులు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మైకు ముందు మాట్లాడితే దొరికిపోతాడు కాబట్టే ట్విటర్లో పోస్టులు పెడుతూ.. చివరకు ట్విటర్ పక్షిగా మారిపోయాడని వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్ బాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీతో జతకట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నాడు రాహుల్ గోబ్యాక్ అన్నారని, నేడు చంద్రబాబు, రాహుల్‌తో జతకట్టి మోదీ గోబ్యాక్ అంటున్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీతో యుద్ధం చేస్తారంటూ లోకేష్ అంటున్నారని, యుద్ధం చేసేది ఎక్కడ.. టీడీపీ నేత ఒక్కరన్నా మోదీని అడ్డుకునే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ప్రత్యేకహోదా గురించి ఎవరు పోరాడుతున్నారో ప్రజలకు తెలుసునన్నారు. హోదా సజీవంగా బతికుందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటాల వల్లనేనని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ విచారణ జరిపితే సింగపూర్, మలేషియా ఇతర దేశాలకు పారిపోతారని, లేదా జైళ్లకు వెళ్తారన్నారు. లోకేష్ ఇతర దేశాలకు వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి కాదు.. తెలుగు నేర్చుకోవడం కోసమేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు బుద్ది చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. చంద్రబాబు..మోదీతో జతకట్టి రేపు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని అన్నారు. -
‘దళితుల పొట్ట కొట్టేలా అసైన్డ్ భూముల జీవో ’
-
‘దళితుల పొట్ట కొట్టేలా అసైన్డ్ భూముల జీవో ’
సాక్షి, విజయవాడ : ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు దళితులకు చేసిందేమి లేదని వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక దళితులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల జీవో దళితుల పొట్ట కొట్టేదిగా ఉందని మండిపడ్డారు. లంక భూములకు ఒక ప్యాకేజీ, పట్టా భూములకు ఓ ప్యాకేజీ ఇస్తూ దళితులను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో ఉన్న వ్యవసాయ కూలీలకు సైతం పనులివ్వకుండా బీహర్ తదితర రాష్ట్రాల నుంచి తెస్తూ స్థానికులు అన్యాయం చేస్తున్నారన్నారు. రాజధానిలో దళిల కూలీలకు గృహాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్‌తోనే దళితులకు న్యాయం జరుగుతుందని సురేష్ చెప్పారు. దళితుల పట్ల చిన్న చూపు చూస్తున్న చంద్రబాబుకు.. వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు. -
పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!
సాక్షి, విజయవాడ : ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభను చూసి టీడీపీ నేతలకు చెమటలు పడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి నందిగం సురేశ్ విమర్శించారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన మంత్రులు వైఎస్ జగన్ పాదయాత్ర మీద అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. చంద్రబాబు ఎలా పాదయాత్ర చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని, ఆయన రాత్రిపూట కిలోమీటరు నడిస్తే.. ఆరు కిలోమీటర్లు బస్సు ఎక్కేవారని, టీడీపీ వైఖరి దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉందని ఎద్దేవా చేశారు. మంత్రి దేవినేని ఉమాకి వైఎస్ జగన్ పాదయాత్ర గురించి మాట్లాడే అర్హత ఉందా? అని నిలదీశారు. చంద్రబాబుని ప్రజలను నమ్మరని తెలిసి.. ఇపుడు వైఎస్ జగన్ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిజాలు బయటకొస్తాయనే ఎన్ఐఏ విచారణకు భయపడ్డారని, ఇప్పుడు హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో టీడీపీ నేతలు ఇంకా భయపడిపోతున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని విషయంలో చంద్రబాబు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని మరో నాలుగు నెలల్లో ఇంటికి పంపబోతున్నారని, 2019 ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలు అని పేర్కొన్నారు.