ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మైకు ముందు మాట్లాడితే దొరికిపోతాడు కాబట్టే ట్విటర్‌లో పోస్టులు పెడుతూ.. చివరకు ట్విటర్ పక్షిగా మారిపోయాడని వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్ బాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీతో జతకట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నాడు రాహుల్ గోబ్యాక్ అన్నారని, నేడు చంద్రబాబు, రాహుల్‌తో జతకట్టి మోదీ గోబ్యాక్ అంటున్నారని పేర్కొన్నారు.