ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు దళితులకు చేసిందేమి లేదని వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక దళితులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల జీవో దళితుల పొట్ట కొట్టేదిగా ఉందని మండిపడ్డారు.