కేవీ.పాలెంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబు
సాక్షి, చీమకుర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతనూతలపాడు అసెంబ్లీ అభ్యర్థిగా టీజేఆర్ సుధాకర్‌బాబు, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగం సురేష్‌లను గెలిపించాలని ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఏలూరివారిపాలెం, కూనంనేనివారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబుతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతోనే సాధ్యమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సంతనూతలపాడు అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అధికార పార్టీ అప్పులపాలు చేసిందని, సుబాబులు, జామాయిల్ రైతులను నట్టేట ముంచారని తెలిపారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని బూచేపల్లి కుటుంబం సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సుధాకర్‌బాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తొలుత కూనంనేనివారిపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 250 మంది కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, టీజేఆర్ సుధాకర్‌బాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరివారిపాలెం, కూనంనేనివారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడింది.
కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, మండల కన్వీనర్ దాసరి లక్ష్మినారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు గోగినేని వెంకటేశ్వర్లు, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, మేడగం రామకృష్ణారెడ్డి, మల్లినేని వెంకటేశ్వర్లు, పేరం శ్రీను, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, పులి వెంకటరెడ్డి, ఏలూరి సుబ్బారావు, బక్కా కోటేశు, మన్నం హరి, తిమోతి, కొల్లూరి శింగయ్య, బొడ్డపాటి హరిబాబు, నల్లూరి నారాయణ, వేమా బాలకోటేశ్వరరావు, మాదాల శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
చీమకుర్తిలో టీడీపీ ప్రచారం..
సూర్యనగర్‌లో మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ కౌత్రపు రాఘవరావు, కందిమళ్ళ గంగాధర్, స్థానిక కౌన్సిలర్ గంగుల పార్వతి, ముఖర్జీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి బీఎన్.విజయ్‌కుమార్‌ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు.
జగన్ పర్యటనను జయప్రదం చేయండి..
జగన్‌మోహన్‌రెడ్డి సంతనూతలపాడు పర్యటనను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ సంతనూతలపాడు అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబు పిలుపునిచ్చారు. బుధవారం సంతనూతలపాడులో పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల కార్యకర్తలు, నాయకులతో జగన్ పర్యటన గురించి సమీక్షించారు. ఈ నెల 29న ఉదయం 9–10 గంటల మధ్య జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌లో సంతనూతలపాడుకు చేరుకుంటారని తెలిపారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని సంతనూతలపాడుతో పాటు చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా గ్రామాలలో బూత్‌కమిటీ కన్వీనర్‌లు చైతన్యం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏ మండలానికి ఆ మండల కన్వీనర్ బాధ్యతగా తీసుకొని జగన్ పర్యటనను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మద్దిపాడు ఎంపీపీ నారా విజయలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, నాలుగు మండలాల కన్వీనర్‌లు దుంపా చెంచిరెడ్డి, దాసరి లక్ష్మినారాయణ, మండవ అప్పారావు, దివి పున్నారావుతో పాటు సీనియర్ నాయకులు బొల్లినే కృష్ణయ్య, దుంపా యలమందారెడ్డి, కుమారస్వామి, బీ.శివకుమారి, కుమారస్వామి, పూర్ణచంద్రరావు, తన్నీరు మోహన్‌రావు, తలారి కోటయ్య, క్రిష్టిపాటి శేఖరరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు..
మద్దిపాడు: మండలంలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. మండలంలోని బూరేపల్లి పునరావాస కాలనీకి చెందిన దాసరి రాజు, కావూరి ఏసోబు నాయకత్వంలో కాలనీకి చెందిన 25 కుంటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రబాబు మోసపు మాటలు విని అవినీతి పాలనతో విసిగి పోయామని జగన్‌మోహనరెడ్డి నవరత్నాల పథకాలు తమకు బాగా నచ్చాయని తెలిపారు. పార్టీలో చేరిన 25 కుటుంబాలకు చెందిన 100 మందికి సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబు పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో కొమ్మూరి సుధాకర్ మాదిగ, మండల కన్వీనర్ మండవ అప్పారావు, మాజీ ఎంపీపీ కుమారస్వామి, వెంకటాద్రి, కురిచేటి శ్రీను, హనుమంతరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment