santanutalapadu
-
నిశ్చితార్థానికి హాజరైన వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు
సాక్షి, ప్రకాశం(చీమకుర్తి): వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ కుమారుడు దుంపా ఇంద్రసేనారెడ్డి, దివ్యజ్యోతిల నిశ్చయ తాంబూలాల వేడుకను శనివారం ఒంగోలులోని విష్ణుప్రియ ఫంక్షన్ హాలులో వైభవంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఇనగంటి పిచ్చిరెడ్డి, మారం వెంకారెడ్డి, పలు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ స్థానిక నాయకులు, జిల్లాలోని పలువురు అధికారులు హాజరై ఇంద్రసేనారెడ్డి, దివ్యజ్యోతి జంటను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: (డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో కల్వర్టును ఢీకొన్న కారు.. వరుడు సహా..) -
Prakasam District: ట్రిపుల్ ఐటీ విద్యార్థికి రూ.22 లక్షల ప్యాకేజీ
సాక్షి, చీమకుర్తి: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని ట్రిపుల్ ఐటీ విద్యార్థి పంతగాని అజయ్ రూ.22 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న సింగపూర్‌కు చెందిన గోజెక్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అజయ్.. ఏడాదికి రూ.22 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు కంపెనీ వారు ఆఫర్ లెటర్‌ను పంపారు. దీనిని ట్రిపుల్ ఐటీ కళాశాల డైరెక్టర్ బి.జయరామిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థి అజయ్ మంగళవారం కళాశాలలో అందుకున్నారు. కాగా, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ జయరామిరెడ్డి మాట్లాడుతూ.. 2021–22 విద్యాసంవత్సరంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పలు కంపెనీలు నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్‌లలో మొత్తం 774 మంది తమ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. మరో 125 మంది విద్యార్థులు ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, ఆఫర్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. చదవండి: (అంతా నారాయణ ఆదేశాలతోనే..) -
వైఎస్సార్ సీపీని గెలిపించండి
సాక్షి, చీమకుర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతనూతలపాడు అసెంబ్లీ అభ్యర్థిగా టీజేఆర్ సుధాకర్‌బాబు, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగం సురేష్లను గెలిపించాలని ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఏలూరివారిపాలెం, కూనంనేనివారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబుతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలతోనే సాధ్యమన్నారు. జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సంతనూతలపాడు అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అధికార పార్టీ అప్పులపాలు చేసిందని, సుబాబులు, జామాయిల్ రైతులను నట్టేట ముంచారని తెలిపారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని బూచేపల్లి కుటుంబం సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సుధాకర్‌బాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తొలుత కూనంనేనివారిపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 250 మంది కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, టీజేఆర్ సుధాకర్‌బాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరివారిపాలెం, కూనంనేనివారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడింది. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, మండల కన్వీనర్ దాసరి లక్ష్మినారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు గోగినేని వెంకటేశ్వర్లు, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, మేడగం రామకృష్ణారెడ్డి, మల్లినేని వెంకటేశ్వర్లు, పేరం శ్రీను, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, పులి వెంకటరెడ్డి, ఏలూరి సుబ్బారావు, బక్కా కోటేశు, మన్నం హరి, తిమోతి, కొల్లూరి శింగయ్య, బొడ్డపాటి హరిబాబు, నల్లూరి నారాయణ, వేమా బాలకోటేశ్వరరావు, మాదాల శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చీమకుర్తిలో టీడీపీ ప్రచారం.. సూర్యనగర్‌లో మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ కౌత్రపు రాఘవరావు, కందిమళ్ళ గంగాధర్, స్థానిక కౌన్సిలర్ గంగుల పార్వతి, ముఖర్జీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి బీఎన్.విజయ్‌కుమార్‌ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్ పర్యటనను జయప్రదం చేయండి.. జగన్మోహన్రెడ్డి సంతనూతలపాడు పర్యటనను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ సంతనూతలపాడు అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబు పిలుపునిచ్చారు. బుధవారం సంతనూతలపాడులో పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల కార్యకర్తలు, నాయకులతో జగన్ పర్యటన గురించి సమీక్షించారు. ఈ నెల 29న ఉదయం 9–10 గంటల మధ్య జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో సంతనూతలపాడుకు చేరుకుంటారని తెలిపారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని సంతనూతలపాడుతో పాటు చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా గ్రామాలలో బూత్‌కమిటీ కన్వీనర్లు చైతన్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ మండలానికి ఆ మండల కన్వీనర్ బాధ్యతగా తీసుకొని జగన్ పర్యటనను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మద్దిపాడు ఎంపీపీ నారా విజయలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, నాలుగు మండలాల కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, దాసరి లక్ష్మినారాయణ, మండవ అప్పారావు, దివి పున్నారావుతో పాటు సీనియర్ నాయకులు బొల్లినే కృష్ణయ్య, దుంపా యలమందారెడ్డి, కుమారస్వామి, బీ.శివకుమారి, కుమారస్వామి, పూర్ణచంద్రరావు, తన్నీరు మోహన్‌రావు, తలారి కోటయ్య, క్రిష్టిపాటి శేఖరరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు.. మద్దిపాడు: మండలంలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. మండలంలోని బూరేపల్లి పునరావాస కాలనీకి చెందిన దాసరి రాజు, కావూరి ఏసోబు నాయకత్వంలో కాలనీకి చెందిన 25 కుంటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రబాబు మోసపు మాటలు విని అవినీతి పాలనతో విసిగి పోయామని జగన్మోహనరెడ్డి నవరత్నాల పథకాలు తమకు బాగా నచ్చాయని తెలిపారు. పార్టీలో చేరిన 25 కుటుంబాలకు చెందిన 100 మందికి సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టీజేఆర్ సుధాకర్‌బాబు పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో కొమ్మూరి సుధాకర్ మాదిగ, మండల కన్వీనర్ మండవ అప్పారావు, మాజీ ఎంపీపీ కుమారస్వామి, వెంకటాద్రి, కురిచేటి శ్రీను, హనుమంతరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పేరునే మార్చేశారు..
-సంతనూతలపాడు ఎమ్మెల్యే ఎ.సురేశ్ - సర్కారు జీవోలో బి.ఎన్.విజయ్‌కుమార్ అమరావతి: ప్రజాస్వామ విలువలకు పాతరేసి రాజ్యాంగ నిబంధనలను, చట్టాలను తుంగలో తొక్కుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రజాప్రతినిధుల పేర్లను కూడా మార్చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి విచక్షణాధికారంతో మంజూరు చేసే ప్రత్యేక అభివృద్ధి నిధుల్లో అధికార దుర్వినియోగానికి, వివక్షకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిమూలపు సురేశ్‌నే రాష్ట్ర సర్కారు మార్చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేగా కూడా గుర్తించడానికి బాబు సర్కారు ఇష్టపడటం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంలో సీసీ రహదారుల నిర్మాణానికి రూ.2కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయ కుమార్ వినతి మేరకు సీసీ రహదారులకు నిధులు మంజూరు చేసున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రణాళికా శాఖ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి సంజయ్‌గుప్తా జీవో ఆర్టీ.236 జారీ చేశారు. సంతనూతలపాడు నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఎ.సురేశ్ ఎన్నికైనప్పటికీ జీవోలో ఎమ్మెల్యేగా ఎన్నిక కాని విజయ్‌కుమార్‌ను ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అధికార యంత్రాంగమే విస్తుపోతోంది. ప్రధాన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేయకుండా చంద్రబాబు వివక్షతో వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వినతిపత్రాలను సమర్పించినప్పటికీ పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, లేదా ఇన్చార్జ్ నాయకుల పేరుతో నిధులను మంజూరు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31న హడావుడిగా ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి 31 నియోజకవర్గాలకు రెండేసి కోట్ల చొప్పున రూ.62 కోట్లను విడుదల చేస్తూ 31 జీవోలను జారీ చేయడం గమనార్హం. మాడుగుల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ ఎమ్మెల్యేను కాదని మాజీ ఎమ్మెల్యే పేరుతో నిధులను మంజురు చేశారు. అలాగే మార్కాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే పేరుతో నిధులను విడుదల చేశారు. -
చంద్రబాబు చంద్రబాబే!
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిజెపి పట్ల తన కుయుక్తులు మరోసారి ప్రదర్శించారు. పొత్తు ధర్మం తప్పారు. కమలనాథులకు షాక్ ఇచ్చారు. ముందు కేటాయించిన ఒక శాసనసభ స్థానం వదులుకొని బిజెపి ఎంత సామరస్యంగా వ్యవహరించినప్పటికీ చంద్రబాబు చంద్రబాబే అనిపించుకున్నారు. బిజెపికి కేటాయించిన స్థానాల్లో పోటీకి దిగిన ఇద్దరు టిడిపి అభ్యర్థులకు చంద్రబాబు పార్టీ బిఫారాలు ఇచ్చారు. టిడిపి నేతలకు దిమ్మతిరిగిపోయింది. టిడిపి-బిజెపి పొత్తులో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, వైఎస్ఆర్ జిల్లా కడప శాసనసభ స్థానాలను బిజెపికి కేటాయించారు. బిజెపి సంతనూతలపాడు స్థానం దారా సాంబయ్యకు, కడప స్థానం కె.హరినాథ్‌రెడ్డికి కేటాయించింది. ఆ రెండు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారికి టిడిపి బిఫారాలు కూడా ఇచ్చేశారు. చంద్రబాబు వైఖరిపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిడిపితో పొత్తు వద్దని స్థానిక నేతలు చెబుతున్నప్పటికీ బిజెపి అధిష్టానం వారి మాటలను పెడచెవిన పెట్టింది. నామినేషన్లు వేసే సమయంలో పొత్తు బెడిసి కొట్టింది. బిజెపితో పొత్తులేదని నిన్న, మొన్న టిడిపి నేతలు ప్రచారం చేశారు. నిన్న రాత్రి మళ్లీ ఇరు పార్టీ నేతల మధ్య చర్చలు జరిగాయి. ఇచ్ఛాపురం శాసనసభ స్థానంను బిజెపి వదులుకొని టిడిపికి కేటాయించింది. బిజెపి 4 లోక్‌సభ, 13 శాసనసభ స్థానాలకే పరిమితమైంది. నరసరావుపేట, కోడుమూరులలో అభ్యర్థులను మార్చడానికి కూడా బిజెపి అంగీకరించింది. మళ్లీ పొత్తు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. తెల్లారిన తరువాత మళ్లీ కథ మొదలు. చంద్రబాబు తన నైజం చూపారు. బిజెపి అంత దిగి వచ్చినా ఆయన తన శైలి మార్చుకోలేదు. చంద్రబాబు చంద్రబాబే అనిపించుకున్నారు.