ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, నాగార్జునరెడ్డి
ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హతే టీడీపీ నేతలకు లేదని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, కుందురు నాగార్జునరెడ్డి చెప్పారు. వైఎ స్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో అభివృద్ధి జరగలేదని, వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాయడంపై మండిపడ్డారు. ఒంగోలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. చంద్రబాబు స్క్రిప్టుపై సంతకాలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు చేతగానివారని మరోమారు నిరూపించుకున్నారని విమర్శించారు.
లేఖలు రాయడం కాదని, చేతనైతే చంద్రబాబు ఐదేళ్ల పాలన, తమ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనపై ఒంగోలు చర్చిసెంటర్‌లో మీడియా సాక్షిగా బహిరంగచర్చకు రావాలని సవాల్ చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ను 3.300 కిలోమీటర్లు మాత్రమే తవ్వారని, తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే 3.500 కిలో మీటర్లు తవ్వి మొదటి టన్నెల్‌ను పూర్తిచేశామని చెప్పారు. బాబు పాలనలో వెలిగొండకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.700 కోట్లు కేటాయించిందని తెలిపారు.
వెలిగొండ కోసం అంటూ దీక్షలు చేయడం కాదని, చేతనైతే ఎందుకు నిర్లక్ష్యం చేశారో చెప్పాలంటూ బాబును నిలదీయాలన్నారు. రామాయపట్నం పోర్టు, మైనింగ్ యూనివర్సిటీ, ఆసియా పేపర్‌మిల్లు, దొ నకొండ సెజ్‌లో విమాన విడిభాగాల పరిశ్రమలు ఎ క్కడ నిర్మించారో చూపించాలన్నారు. శనగలన్నీ కో ల్డు స్టోరేజీల్లో ఉండిపోతే క్వింటాలుకు రూ.4,750 చొప్పున తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. పొగాకు రైతుకు కిలోకి కనీసం రూ.110 ఇప్పించామని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment