veligonda project
-
ఏపీలో వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం అశ్రద్ధ..! ఆగ్రహం వ్యక్తంచేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్..
-
వెలిగొండ ప్రాజెక్టుపై ఎందుకంత నిర్లక్ష్యం?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కరవుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో రెండు టన్నెళ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు. కోవిడ్ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో టన్నెల్–1, జనవరి 2024లో టన్నెల్–2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశామని వివరించారు. తద్వారా 2005లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైఎస్సార్ కలలను సాకారం చేశామన్నారు. ఇంకా నిర్వాసితులకు పునరావాసం (ఆర్ అండ్ ఆర్) కల్పనను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సీజన్లోనే ఆర్ అండ్ ఆర్కు కావాల్సిన సుమారు రూ. 1,200 కోట్లు చెల్లిస్తే.. ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చునన్నారు. ఆర్ అండ్ ఆర్ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశామని గుర్తుచేశారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్ సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అంచనాలు పెంచడంపైనే యావ..గతంలోనూ, 2014–19 మధ్య కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని వైఎస్ జగన్ విమర్శించారు. అమాంతంగా పనుల (సివిల్ వర్క్స్) అంచనాలు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద చంద్రబాబుకు ఉన్న యావ.. నిర్వాసితులను ఆదుకోవడంలో ఎప్పుడూ కనిపించలేదన్నారు. గండికోటకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి.. నీళ్లు నింపడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపారని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్ రెండవ సొరంగ మార్గం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే నిర్వాసితులకు చెల్లింపులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు రూ. 1,000 కోట్లు చెల్లించి, పునరావాసం కల్పించి.. పూర్తిస్థాయిలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని గుర్తుచేశారు. అలాగే చిత్రావతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ కింద రూ. 250 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని వివరించారు. బ్రహ్మంసాగర్‌కు కూడా రూ. 60 కోట్ల ఖర్చుతో డయాఫ్రం వాల్ పూర్తి చేసి, శ్రీశైలం నుంచి తెలుగుగంగ కెనాల్ లైనింగ్ కూడా పూర్తి చేసి, 17వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లగలిగామని.. తద్వారా బ్రహ్మంసాగర్‌లో 17 టీఎంసీల పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయగలిగామని గుర్తు చేశారు. ఎప్పుడో పూర్తయిన పులిచింతల ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్‌ను కూడా చంద్రబాబు అప్పట్లో పట్టించుకోలేదని.. దాని కోసం కూడా రూ. 140 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఖర్చు చేసి పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేసి, కృష్ణా డెల్టా రైతులకు ప్రయోజనం చేకూర్చామని వివరించారు.ఈ సీజన్లోనే నల్లమల సాగర్‌ను నింపండి..ప్రస్తుతం కరువు నేలకు అందాల్సిన కృష్ణా వరద జలాలన్నీ కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కడలిపాలు అవుతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండ ఆర్ అండ్ ఆర్ అంశంపై దృష్టి పెట్టాలని.. వెంటనే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని.. ఈ సీజన్లోనే వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌ను కృష్ణా జలాలతో నింపి ప్రకాశం జిల్లాకు సాగు, తాగునీటిని అందించాలని చంద్రబాబును వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
వెలిగొండపై పడిన రామోజీ తాత కన్ను
-
Fact Check: వెలిగొండంత అక్కసు..
సాక్షి, అమరావతి: ఏ రోగానికైనా మందు ఉంటుందేమోగానీ ఈనాడు రామోజీని పీడిస్తున్న ‘కడుపుమంట’కు మాత్రం మందులేదు. నిత్యం ఆయన్ను దహించివేస్తున్న ఆ వ్యాధి రోజురోజుకూ ముదిరిపోతోంది. దాని నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశ కూడా కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఫలితంగా ఆయన రోజూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దీంతో.. కొంతలో కొంతనైనా ఉపశమనంగా ఉంటుందని ఆయన రోజూ తన క్షుద్ర పత్రిక ఈనాడులో సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక అశుద్ధ కథనాన్ని వండివారుస్తూ ఉదయం తనివితీరా చూసుకుని తన బాధను చల్లార్చుకుంటున్నారు. తాజాగా.. వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన జంట సొరంగాలను పూర్తిచేసిన సీఎం వైఎస్ జగన్ బుధవారం వాటిని జాతికి అంకితం చేయడాన్ని రామోజీరావు తట్టుకోలేకపోతున్నారు. చాలా పనులు మిగిలే ఉన్నాయని.. ఆయకట్టుకు నీళ్లిచ్చే ఆస్కారమే లేదంటూ ‘వెలికొండంత పెండింగ్’ శీర్షికన తన ఆక్రోశాన్ని, కడుపులో పేరుకుపోయిన విషాన్ని గురువారం ఎప్పటిలాగే కక్కేశారు. నిజానికి.. వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ వడివడిగా పూర్తిచేస్తుండటంతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంత రైతుల దశాబ్దాల కల సాకారమవుతోంది. దాంతో ఆ ప్రాంత రైతుల్లో సీఎం జగన్‌పై ఆదరణ మరింతగా పెరిగింది. ఇది చంద్రబాబు రాజకీయ ఉనికికే ప్రమాదకరంగా మారడంతో రామోజీరావుకు నిద్రపట్టడంలేదు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కనికట్టు చేసి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆయనిలా నానా అవస్థలు పడుతున్నారు. వెలిగొండను పిండేసిన బాబు.. వాస్తవానికి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా 2004, అక్టోబరు 27న వెలిగొండ ప్రాజెక్టుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తన హయాంలోనే రూ.3,610.38 కోట్లు ఖర్చుచేసి.. 37.587 కిమీల పొడవైన జంట సొరంగాల్లో 20.333 కి.మీ.ల పనులు.. ఆ ప్రాజెక్టులోనే అంతర్భాగమైన నల్లమలసాగర్‌ను పూర్తిచేశారు. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2014–19మధ్య ఈ ప్రాజెక్టుకు రూ.1,385.81 కోట్లు వ్యయంచేసినా కేవలం 6.686 కి.మీ.ల మేర మాత్రమే జంట సొరంగాల పనులు చేశారు. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టడాన్ని ఇటీవల కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక బయటపెట్టింది. వెలిగొండకు ఖర్చుచేసిన నిధులను చంద్రబాబు మింగేయడంవల్లే ఎక్కడి పనులు అక్కడే మిగిలిపోయాయి. యుద్ధప్రాతిపదికన సొరంగాలు పూర్తి ఇక సీఎం వైఎస్ జగన్ రూ.978.02 కోట్లు ఖర్చుచేసి.. అందులో ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుని వెలిగొండ జంట సొరంగాల్లో మిగిలిన 10.568 కి.మీ.ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి, జాతికి అంకితం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రెండు మూడు నెలల్లోనే నల్లమలసాగర్‌కు కృష్ణాజలాలను తరలిస్తామని ఆయన చెప్పారు. వచ్చే జూలై, ఆగస్టులలో నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించేలోగా రూ.1,200 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని స్పష్టంచేశారు. తొలిదశ కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అలాగే, ప్రాజెక్టును మొత్తం ఒకేసారి పూర్తిచేసి ఆయకట్టు మొత్తానికి ఒకేసారి నీళ్లందించిన దాఖలాలు చరిత్రలో ఎక్కడాలేవు. ఎక్కడైనా ప్రాజెక్టును దశలవారీగా పూర్తిచేస్తూ అయకట్టుకు నీళ్లందిస్తారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులే అందుకు నిదర్శనం. వెలిగొండ ప్రాజెక్టులో కూడా మిగతా పనులను పూర్తిచేసి దశలవారీగా మొత్తం ఆయకట్టుకు నీళ్లందిస్తారు. అసలు వెలిగొండ ఒక్కటే కాదు.. 2022 సెప్టెంబరు 6న నెల్లూరు, సంగం బ్యారేజ్‌లు.. 2023 సెప్టెంబరు 19న హంద్రీ–నీవాలో అంతర్భాగమైనమైన లక్కసాగరం ఎత్తిపోతల.. 2023 నవంబరు 30న గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్.. 2024 ఫిబ్రవరి 26న హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిచేసి, జాతికి అంకితం చేసినప్పుడు కూడా రాజగురువు ఇలాగే విషం చిమ్మారు. -
ఆంధ్రప్రదేశ్‌లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
ఇది దేవుడి స్క్రిప్ట్..నాన్న మొదలుపెడితే..నేను పూర్తి చేశా
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే ఆయన కుమారుడిగా ఒక్కొక్కటి దాదాపు 18 కి.మీ. పైగా ఉన్న రెండు టన్నెళ్లను పూర్తి చేసి జాతికి అంకితం చేయడం నిజంగా దేవుడు రాసిన స్క్రిప్టే అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది? వెలిగొండ మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న మన ప్రభుత్వమే పూర్తి చేయగా రెండో సొరంగం పనులను కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం. దశాబ్దాల స్వప్నాన్ని నెరవేరుస్తూ ఆ టన్నెల్లో ప్రయాణించే అదృష్టాన్ని కల్పించిన దేవుడికి సదా రుణపడి ఉంటా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మూడు జిల్లాల్లో ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంత ప్రజల కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 30 మండలాలకు తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా జంట టన్నెళ్లతో శరవేగంగా పూర్తి చేసిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు–ఎగువ చెర్లోపల్లి వద్ద బుధవారం ప్రారంభించారు. దివంగత వైఎస్సార్ హయాంలో చేపట్టిన 37.6 కి.మీ పొడవైన వెలిగొండ రెండు టన్నెళ్లలో చంద్రబాబు అధికారంలో ఉండగా 6.6 కి.మీ. పనులు మాత్రమే చేయగా మిగతావి 31 కి.మీ మేర పనులు వైఎస్సార్, సీఎం జగన్ పాలనలోనే జరగడం గమనార్హం. గిద్దలూరు నియోజకవర్గానికి ప్రయోజనం చేకూరుస్తూ 13,500 ఎకరాలకు సాగునీటిని అందించే రెండు ఎత్తిపోతల పథకాలకు కూడా సీఎం జగన్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఏమన్నారంటే.. మళ్లీ మనం రాగానే నీళ్లు నింపుతాం.. ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలో ఐదు, కడప జిల్లాలో రెండు మండలాలు కలిపి మొత్తం 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సమస్యకు పరిష్కారం చూపిస్తూ వెలిగొండ రెండు సొరంగాలు వేగంగా పూర్తయ్యాయి. దీంతో వచ్చే ఖరీఫ్‌లో శ్రీశైలం నుంచి నల్లమలసాగర్‌కు నీళ్లు తీసుకొచ్చి నింపుతున్న దృశ్యం జూలై–ఆగస్టులో ఆవిష్కృతమవుతుందని సంతోషంగా చెబుతున్నా. దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్‌ను పూర్తి చేశాం. 8,500 క్యూసెక్కుల క్యారీయింగ్ కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయింది. అంటే శ్రీశైలంలో మట్టం 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు తీసుకురాగలిగే గొప్ప పరిస్థితి ఈ రోజుతో వచ్చింది. జూలై–ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో రూ.1,200 కోట్లు ఖర్చు చేసి ఎల్ఏ, ఆర్అండ్ఆర్ కూడా పూర్తి చేస్తాం. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టమైన రెండు టన్నెళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రిజర్వాయర్ కూడా పూర్తయిపోయింది. ఇక మిగిలినవి పెద్దగా ఏమీ లేవు. మళ్లీ మనం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రెండు మూడు నెలల్లోనే ఎల్ఏ, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపుతాం. దుర్భిక్ష ప్రాంతానికి మేలు చేయని బాబు.. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా, యర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు నియోజకవర్గాలకు మేలు జరుగుతుందని తెలిసినా బాబు హయాంలో టన్నెళ్లు పూర్తి చేయకుండా పనులు నత్తనడకన సాగాయి. ఇందులో ఒక్కొక్కటి 18.8 కి.మీ. పొడవుతో 37.6 కి.మీ పొడవైన 2 టన్నెళ్లున్నాయి. దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులతో సింహభాగం పనులు చేయగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల పనులు జరిగాయి. ఆ తర్వాత మీ బిడ్డ సీఎం అయ్యాక జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ 2 టన్నెళ్లను వడివడిగా పూర్తి చేసి వెలిగొండను సాకారం చేశాడని చెప్పేందుకు గర్విస్తున్నా. రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన గిద్దలూరు నియోజకవర్గానికి మేలు చేసే 2 ఎత్తిపోతల పథకాలకు వెలిగొండ టన్నెళ్ల పైలాన్ సమీపంలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అర్ధవీడు మండలం పాపినేనిపల్లి, వెలగలపాయ ఎత్తిపోతల పథకాలకు భూమి పూజ నిర్వహించారు. రెండు ఎత్తిపోతల పథకాలకు రూ.53 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. దీని ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. టన్నెల్లో కలియదిరిగి... పైలాన్‌ను ఆవిష్కరించి నిర్మాణం పూర్తి చేసుకున్న వెలిగొండ టన్నెళ్ల వద్దకు మధ్యాహ్నం 11.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సీఎం జగన్ జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి వెలిగొండ నిర్మాణంలో భాగస్వాములైన అధికారులతో ఫొటోలు దిగి పేరుపేరునా అభినందించారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి జంట సొరంగాల పైలాన్ వద్దకు సీఎంను తోడ్కొని వెళ్లారు. జంట సొరంగాల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్ వెలిగొండ వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి టన్నెళ్లను వీక్షించారు. అనంతరం రెండో టన్నెల్ లోపలకు వెళ్లి కలియదిరిగి పరిశీలించారు. మెగా ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరెడ్డి, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ రాంబాబు టన్నెళ్ల పనులు, సాంకేతిక అంశాలను తెలియచేశారు. అనంతరం వెలిగొండ సావనీర్‌ను సీఎం ఆవిష్కరించారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రిన్స్‌పల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా సీఈ ఆర్ మురళీనాథ్‌రెడ్డి తదితరులు ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిమను జ్ఞాపికగా సీఎం జగన్‌కు అందించగా పాదరక్షలను విడిచిపెట్టి భక్తి భావంతో స్వీకరించారు. అంతకుముందు హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగు నాగార్జున, మంత్రి ఆదిమూలపు సురేష్, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. సీఎం వెంట హెలికాప్టర్లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వచ్చారు. -
వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
వెలిగొండ ప్రాజెక్టుతో 4లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు
-
నాన్నగారు మొదలుపెట్టారు కొడుకుగా నేను పూర్తి చేశాను...
-
నాడు తండ్రి శంకుస్థాపన.. నేను కొడుకు ప్రారంభోత్సవం
-
వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ దృశ్యాలు
-
యుద్ధప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్ జంట సొరంగాలు పూర్తి
-
వెలిగొండ ప్రాజెక్ట్ టన్నల్స్ పనులను రూట్ మ్యాప్ ను పరిశీలిస్తున్న సీఎం జగన్
-
వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్
-
Veligonda: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్
-
నాడు వైఎస్సార్.. నేడు నేను.. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్: సీఎం జగన్
Live Updates.. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్ధాల కల నెరవేరింది. టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించింది. అద్భుతమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్‌తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం. ఈ టెన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్‌తో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నెరవేరిన 20 ఏళ్ల కల నాడు తండ్రి వైఎస్సార్ శంకుస్థాపన.. నేడు కొడుకుగా సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రారంభోత్సవం వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్ యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్ జంట సొరంగాలు పూర్తి ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్ ♦ వెలిగొండ చేరుకున్న సీఎం జగన్ ♦ వెలిగొండ ప్రాజెక్ట్ వద్దకు బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ♦ కాసేపట్లో వెలిగొండ ప్రాజెక్ట్ టెన్నెన్ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్. ♦ సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు. ♦ మొదట దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్.. ♦ 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 58 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనావల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. అలాగే, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తిచేయించారు. ♦ ఇక రెండో సొరంగం మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దుచేసిన సీఎం జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ.ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ♦రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. 7.685 కి.మీల పొడవున తవ్వకం పనులు, హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ♦ఇక టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను చేపట్టిన సీఎం వైఎస్ జగన్ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ♦ ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.978.02 కోట్లను సీఎం వైఎస్ జగన్ ఖర్చుచేశారు. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. నల్లమలసాగర్.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తు (సుంకేశుల డ్యామ్)తో.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తు (గొట్టిపడియ డ్యామ్)తో 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు (కాకర్ల డ్యామ్)తో మూడు డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీ.ల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. -
వెలిగొండ.. కల సాకారం
సాక్షి, అమరావతి: ప్రజాసంకల్ప పాదయాత్రలో రైతులకిచ్చిన మరో మాటను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన సీఎం జగన్.. రెండో టన్నెల్ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తిచేయించారు. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాల (ఇరిగేషన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తిచేయడం ద్వారా ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ జంట సొరంగాలను బుధవారం సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. వచ్చే సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరి, నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు చేరుకున్న వెంటనే వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రభావిత 30 మండలాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 15.25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి ద్వారా సీఎం జగన్ శాశ్వత పరిషారం చూపారు. చంద్రబాబు దోపిడీని కడిగేసిన కాగ్.. ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ కోసం మాత్రమే. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014–2019 వరకూ రూ.1,385.81 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీవో–63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లను దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతు చేయకపోవడంవల్ల టీబీఎంలు ఎందుకూ పనికిరాకుండాపోయాయి. ఇక 2018, 2019 నాటికి పూర్తిచేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, కమీషన్లు వసూలుచేసుకుని ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు దోచేయడాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగిపారేసింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్.. ♦ 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 58 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనావల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. అలాగే, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తిచేయించారు. ♦ ఇక రెండో సొరంగం మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దుచేసిన సీఎం జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ.ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ♦రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. 7.685 కి.మీల పొడవున తవ్వకం పనులు, హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ♦ఇక టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను చేపట్టిన సీఎం వైఎస్ జగన్ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ♦ ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.978.02 కోట్లను సీఎం వైఎస్ జగన్ ఖర్చుచేశారు. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. నల్లమలసాగర్.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తు (సుంకేశుల డ్యామ్)తో.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తు (గొట్టిపడియ డ్యామ్)తో 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు (కాకర్ల డ్యామ్)తో మూడు డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీ.ల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. దుర్భిక్ష ప్రాంతాల రూపురేఖల్లో సమూల మార్పు.. ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన దొనకొండ వద్ద 24,358 ఎకరాల్లో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ఇందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేయడానికి వెలిగొండ ప్రాజెక్టులో 2.58 టీఎంసీలను ప్రభుత్వం కేటాయించింది. పామూరు, పెద్దచెర్లోపల్లి మండలాల్లో, ఉప్పలపాడు పరిసర ప్రాంతాల్లో 14 వేల ఎకరాల్లో నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ జోన్) ఏర్పాటుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు వెలిగొండ ప్రాజెక్టులో 1.27 టీఎంసీలు కేటాయించింది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో మెగా ఇండస్ట్రియల్ హబ్, నిమ్జ్‌లలో భారీఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. తద్వారా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మరోవైపు.. సాగునీటి సరఫరా చేయడంవల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తవడంతో ఈ జిల్లాల రూపురేఖలు సమూలంగా మారిపోతాయని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన జంట సొరంగాలను సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధి, అంకితభావంవల్లే పూర్తి చేయగలిగాం. టీబీఎంలు పనిచేయకపోవడంతో సంప్రదాయ పద్ధతి (బ్లాస్టింగ్ చేయడం, మనుషుల ద్వారా తవ్వడం)లో పనులు చేపట్టాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సంప్రదాయ పద్ధతిలో పనులు చేపట్టడంవల్లే రెండు సొరంగాలను పూర్తి చేయగలిగాం. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ ఇదో మహోజ్వల ఘట్టం వెలిగొండ ప్రాజెక్టును మహానేత వైఎస్సార్ చేపడితే.. ఆయన తనయుడు సీఎం జగన్ పూర్తిచేసి బుధవారం జాతికి అంకితం చేయనున్నారు. తండ్రి చేపట్టిన ప్రాజెక్టును తనయుడు పూర్తిచేసి జాతికి అంకితం ఇవ్వడం నీటిపారుదలరంగ చరిత్రలో మహోజ్వల ఘట్టం. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సీఎం జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు.– సి.నారాయణరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్, ఏపీ జలవనరుల శాఖ మహానేత వైఎస్సార్ ముందుచూపునకు తార్కాణం శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో... రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీ.ల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్‌కు నీటిని తరలించి ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని 1993–94లో డీపీఆర్ రూపొందించారు. కానీ, 2004 వరకూ పట్టించుకోలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ డీపీఆర్‌ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో నిల్వచేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిç³డియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో వైఎస్సార్ 2004, అక్టోబర్ 27న శ్రీకారం చుట్టారు. రూ.3,610.38 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో చాలావరకు పనులు పూర్తిచేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసేలా 23 కి.మీల పొడవున ఫీడర్ చానల్ పనులను చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. నల్లమలసాగర్ రిజర్వాయర్సమగ్ర స్వరూపం ♦ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 53.85 టీఎంసీలు ♦ వినియోగించే జలాలు 43.50 టీఎంసీలు ♦ గరిష్ఠ నీటి మట్టం 244 మీటర్లు (సముద్ర మట్టానికి) ♦ కనీస నీటి మట్టం214.3 మీటర్లు ♦ డెడ్ స్టోరేజ్ 10.35 టీఎంసీలు ♦ పంటలకు అవసరమైన జలాలు 38.57 టీఎంసీలు ♦ తాగునీటికి కేటాయించినవి 1.57 టీఎంసీలు ♦ ఆవిరి నష్టాలు3.36 టీఎంసీలు వెలిగొండ ప్రాజెక్టు పనులకు వ్యయం ఇలా.. ♦ ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.10,010.54 కోట్లు ♦ పరిపాలన అనుమతి: రూ.8,043.85 కోట్లు ♦ 2004–14 (మహానేత వైఎస్ హయాంలో) వ్యయం: రూ.3,610.38 కోట్లు పనులకు రూ.2,890.17 కోట్లు భూసేకరణకు రూ.262.64 కోట్లు పునరావాసం కల్పనకు రూ.20.53 కోట్లు అటవీ అనుమతులకు రూ.437.04 కోట్లు ♦ 2014–19 మధ్య వ్యయం (చంద్రబాబు హయాంలో) : రూ.1,385.81 కోట్లు పనులకు రూ.1,208.35 కోట్లు, భూసేకరణకు రూ.114.89 కోట్లు పునరావాసం కల్పనకు రూ.62.57 కోట్లు ♦ 2019 మే 30 నుంచి ఇప్పటివరకూ (సీఎం జగన్ హయాంలో) వ్యయం: రూ.978.02 కోట్లు పనులకు రూ.822.08 కోట్లు భూసేకరణకు రూ.79.21 కోట్లు పునరావాసం కల్పనకురూ.76.73 కోట్లు ♦ మొత్తం వ్యయం: రూ.5,974.21 కోట్లు ♦ ప్రాజెక్టు పూర్తికి ఇంకా అవసరమైన నిధులు: రూ.4,036.33 కోట్లు -
వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో టీడీపీ కొండంత అవినీతి
-
వెలిగొండను తొలిచిన తొండ!
సాక్షి, అమరావతి: ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లో 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో టీడీపీ సర్కార్ కొండంత అవినీతికి పాల్పడిందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కడిగి పారేసింది. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయడం, బీమా ఛార్జీలను తిరిగి చెల్లించడం, ధరల వ్యత్యాసం (జీవో 22తో అదనంగా రూ.630.57 కోట్ల చెల్లింపు) రూపంలో కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చిందని ఎండగట్టింది. నాడు అవినీతి.. నేడు ఆదా వెలిగొండ మొదటి సొరంగంలో ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో అప్పగించిన పనులను ఆలస్యంగా చేస్తున్నారనే సాకుతో 2018 ఆగస్టులో 3.6 కి.మీ. పనులను పాత కాంట్రాక్టర్ నుంచి తొలగించి ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో కట్టబెట్టడం ద్వారా రూ.117.97 కోట్ల మేర లబ్ధి చేకూర్చారని తూర్పారబట్టింది. ఇక రెండో సొరంగంలో రూ.421.29 కోట్ల విలువైన 8.097 కి.మీ. పనులను ఈపీసీ విధానంలో చేస్తున్న పాత కాంట్రాక్టర్ నుంచి తొలగించి ఎల్ఎస్ ఓపెన్ పద్ధతిలో రూ.470.78 కోట్లకు పెంచి కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా రూ.49.49 కోట్లను దోచిపెట్టారు. ఈ పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.61.67 కోట్లను మిగిల్చిందని కాగ్ పేర్కొంది. వెలిగొండలో 2017–18 నుంచి 2020–21 మధ్య జరిగిన పనులు, చెల్లింపులపై కాగ్ తనిఖీలు నిర్వహించి రూపొందించిన నివేదికను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. కాగ్ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. ♦ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 30 రోజుల్లో 43.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే లక్ష్యంతో 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. శ్రీశైలం నుంచి 160.64 క్యూసెక్కులు తరలించే సామర్థ్యంతో మొదటి సొరంగం, 322.68 క్యూమెక్కులు తరలించే సామర్థ్యంతో రెండో సొరంగం, వాటి నుంచి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమలసాగర్‌కు తరలించేలా ఫీడర్ ఛానల్, డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థ ఏర్పాటు పనులను ఆరు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు. ♦ 2014 నాటికే నల్లమలసాగర్, ఫీడర్ ఛానల్, సొరంగాలు సహా చాలా వరకూ పనులు పూర్తయ్యాయి. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ తక్షణమే పూర్తి చేసి ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందిస్తామంటూ ఖజానాను కాంట్రాక్టర్లతో కలిసి దోచుకుంది. ♦ మొదటి, రెండో సొరంగాల్లో రూ.29.35 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి తొలగించి వాటి వ్యయాన్ని రూ.95.44 కోట్లకు పెంచేసి కొత్త కాంట్రాక్టర్‌కు 2017 ఆగస్టులో టీడీపీ సర్కార్ అప్పగించింది. దీని ద్వారా కాంట్రాక్టర్‌కు రూ.66.09 కోట్లను అప్పనంగా దోచిపెట్టింది. ♦ మొదటి, రెండో సొరంగంలో ఈపీసీ విధానంలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారనే నెపంతో వారిపై వేటు వేసి అంచనా వ్యయాన్ని పెంచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు లబ్ధి, ఖజానాపై భారం పడిందే కానీ పనుల్లో ఎలాంటి పురోగతి సాధించలేదు. -
చరిత్ర సృష్టించిన సీఎం జగన్ సర్కార్
-
ఇలా ‘వెలిగొండ’గా మరో కల సాకారం
నాడొక కల.. నేడొక నిజం.. అదే వెలిగొండ ప్రాజెక్టు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. ప్రాజెక్టులో మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించిన ఆయన.. రెండో టన్నెల్ తవ్వకం పనులు మంగళవారం పూర్తయ్యాయి. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాల (ఇరిగేషన్ టన్నెల్స్)ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడం ద్వారా సీఎం జగన్ చరిత్ర సృష్టించారని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ రెండు సొరంగాలను ఫిబ్రవరి మొదటి వారంలో జాతికి అంకితం చేయనున్నారు. దీంతో వచ్చే సీజన్లో శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు.. ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. - సాక్షి, అమరావతి వరదాయినికి మహానేత వైఎస్ శ్రీకారం.. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమల సాగర్‌లో నిల్వచేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో ఉన్న 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో దివంగత సీఎం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004, అక్టోబర్ 27న ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో చాలావరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసేలా.. 23 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులనూ చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. వెలిగొండ.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లంవాగు వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను జలవనరుల శాఖ చేపట్టింది. తొలి టన్నెల్ ఏడు డయామీటర్ల వ్యాసార్థంతో, రెండో టన్నెల్ 9.2 డయామీటర్ల వ్యాసార్థంతో తవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. నల్లమల పర్వతశ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో పశ్చిమాన విస్తరించిన వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియల వద్ద కొండల మధ్యన ఖాళీ ప్రదేశాల (గ్యాప్)లను కలుపుతూ 378.5 మీటర్లు, 356 మీటర్లు, 587 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్‌లు నిర్మించడం ద్వారా 53.85 టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంటుంది. అతితక్కువ వ్యయంతో ఇన్ని టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్‌ను నిర్మించడాన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలి‘కొండంత’ చిత్తశుద్ధి.. ఇక వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గత 56 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావంవల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా అదే ఏడాది పూర్తిచేయించారు. రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో.. 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. మంగళవారం నాటికి 7.698 కి.మీల పొడవున రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. హెడ్ రెగ్యులేటర్ పనులు సైతం పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. సీఎం రమేష్‌కు కట్టబెట్టిన రెండో సొరంగం మిగిలిన పనులను రద్దుచేసిన సీఎం జగన్.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ఇక తీగలేరు హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. ఇలా ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.1,046.46 కోట్లను సీఎం జగన్ ఖర్చుచేశారు. ప్రతిపైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. బాబు దోపిడీ కొండంత.. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే.. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయంచేశారు. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ రూ.1,414.51 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించకపోవడం చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీఓ–63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. అలాగే, 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తిచేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వచ్చే సీజన్లో నీరు విడుదల ఇక ఈ ప్రాజెక్టు అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉండడంతో వన్య ప్రాణులకు సైతం ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని నిర్మాణ సంస్థ మేనేజర్ పి.రాంబాబు తెలిపారు. అలాగే, కరోనా సమయంలో కూడా ప్రభుత్వ సహకారంతో పనులు చేపట్టామని ఆయన చెప్పారు. జలవనరుల శాఖ ఈఈ పురార్ధనరెడ్డి వెలిగొండ టన్నెల్ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సీజన్లో నీటిని ఈ సొరంగాల ద్వారా విడుదల చేస్తామని చెప్పారు. మాది చెప్పింది చేసే ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా మోసపు హామీలు చెప్పటం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం పనులు చేసే ప్రభుత్వం మాది. మాటిస్తే మడమ తిప్పని నైజం మా సీఎం జగనన్నది. గతంలో సంక్రాంతి, దసరా, ఉగాదికి పూర్తిచేస్తాం అని టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసగించింది. అలాకాకుండా.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి నిధుల మంజూరుతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షలతో ఈ ప్రాంత వాసుల కోసం పాటుపడి ఈరోజు ప్రాజెక్టు పూర్తి కావటానికి దోహదపడిన సీఎం జగనన్నకు కృతజ్ఞతలు. పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎప్పటికీ జగనన్నకు రుణపడి ఉంటారు. త్వరలోనే సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మంత్రి రికార్డు సమయంలో పూర్తి.. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడంలో సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి వెలిగొండ ప్రాజెక్టు నిదర్శనం. మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13 నాటికి.. రెండో సొరంగాన్ని రికార్డు సమయంలో మంగళవారం నాటికి పూర్తిచేశాం. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాలను ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూర్తిచేయడానికి సీఎం జగన్ దిశానిర్దేశం ఎంతో దోహదం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి, ఆయకట్టుకు నీళ్లందిస్తాం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వెలిగొండను ఆయన తనయుడు పూర్తిచేసి, జాతికి అంకితం చేస్తుండటం నీటిపారుదలరంగ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టంగా నిలిచిపోతుంది. – మురళీనాథ్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్, వెలిగొండ ప్రాజెక్టు -
తుది దశకు 'వెలిగొండ'
-
వాయువేగంగా వెలిగొండ
-
వాయువేగంతో వెలిగొండ
సాక్షి, అమరావతి: ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఫలాలను అందించే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారనడానికి మరో తార్కాణమిది. ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో సొరంగం పనులను శరవేగంగా కొలిక్కి తెస్తోంది. ఇప్పటికే 17.924 కి.మీ. పొడవున సొరంగం తవ్వకం పనులు పూర్తి కాగా మిగతా 876 మీటర్ల పనులను అక్టోబర్‌లోగా పూర్తి చేసేలా ముమ్మరం చేసినట్లు సీఈ మురళీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. శ్రీకారం చుట్టిన వైఎస్సార్ ఈ ఏడాదే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌కు తరలించి తొలి దశ పూర్తి చేసే దిశగా పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులను తరలించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్‌లో నిల్వ చేసి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టి పడియ కాలువ ద్వారా 9,500, గుండ్ల బ్రహ్మేశ్వరం రిజర్వాయర్ ద్వారా 3,500, రాళ్లవాగు ద్వారా 1,500) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చే లక్ష్యంతో దివంగత వైఎస్సార్ 2004 అక్టోబర్ 27న వెలిగొండకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్‌తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులను పూర్తి చేశారు. సొరంగాలను నల్లమల సాగర్‌తో అనుసంధానించి 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక 1996 లోక్‌సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే అదికూడా శంకుస్థాపన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయం చేశారు. 2014లో మళ్లీ అధికారంలో ఉండగా వెలిగొండను చంద్రబాబు కామధేనువులా మార్చుకున్నారు. రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి లేకపోవడం గత సర్కారు లూటీకి నిదర్శనం. జీవో–22(ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ని వర్తింపజేసి కాంట్రాక్టర్లకు అప్పనంగా రూ.650 కోట్లకుపైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి కమీషన్లు రాబట్టుకున్నారు. 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిచ్చిన చంద్రబాబు చివరకు రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి అంచనా వ్యయాన్ని పెంచేశారు. అనంతరం వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. స్వప్నాన్ని సాకారం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దివంగత వైఎస్సార్ చేపట్టిన వెలిగొండను పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీ. పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేశారు. శ్రీశైలం నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తి చేశారు. ► గత సర్కారు అంచనా వ్యయం పెంచిన రెండో సొరంగంలో మిగిలిన పనులను రద్దు చేసిన సీఎం జగన్ వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. నాడు టీడీపీ సర్కార్ నిర్దేశించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువ వ్యయంతో పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ. సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ► వైఎస్సార్ హయాంలోనే నల్లమల పర్వత శ్రేణుల్లో ప్రకాశం జిల్లాలో విస్తరించిన వెలిగొండ కొండల మధ్య సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద కాంక్రీట్ ఆనకట్టలు నిర్మించి 53.85 టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్‌ను పూర్తి చేశారు. ► శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా విడుదల చేసిన నీటిని నల్లమలసాగర్‌కు తరలించేందుకు వీలుగా 23 కి.మీ. పొడవున ఫీడర్ ఛానల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ► వెలిగొండ పనులకు ఇప్పటిదాకా రూ.953.12 కోట్లను వ్యయం చేసి ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేసేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ► రెండో సొరంగంలో కాలం చెల్లిన టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) స్థానంలో గతేడాది మనుషుల ద్వారా పనులను చేపట్టారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద మనుషుల ద్వారా సొరంగాన్ని తవ్విస్తున్నారు. ఇప్పటికే 6.822 కి.మీ. పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా పూర్తి చేసింది. మిగిలిపోయిన మరో 876 మీటర్ల పనులు అక్టోబర్‌లోగా పూర్తవుతాయి. -
సెప్టెంబర్ నెలాఖరుకు వెలిగొండ పూర్తి
పెద్దదోర్నాల /శ్రీశైలం టెంపుల్: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ నెలాఖరుకి నిర్మాణం పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆయన మంగళవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి కొల్లంవాగు వద్ద, మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న సొరంగం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు పుష్కలంగా జలాలు వస్తాయని తెలిపారు. ఈ జిల్లాల్లోని 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, లక్షలాది మందికి తాగు నీరు అందుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో స్టేజ్–1 కింద 1.20 లక్షల ఎకరాలకు, స్టేజ్–2 కింద 2.55 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని వివరించారు. సుంకేశుల నుంచి తీగలేరు కెనాల్‌కు నీరు తరలించడం ద్వారా యర్రగొండపాలెం నియోజకవర్గంలో 62 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి సొరంగం నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, రెండో సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మరో కిలోమీటరు మేర పనులు జరగాల్సి ఉందన్నారు. ఈ పనులన్నీ మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు నష్టపరిహారాన్ని అందించిన తర్వాతే నల్లమల సాగర్‌లో దశల వారీగా నీటిని నింపుతామని చెప్పారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరితగతిన పూర్తి చేస్తున్నారని అన్నారు. సాధ్యమైనంత త్వరలో నల్లమల సాగర్‌ను నింపి ప్రజలకు నీరందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. 19 కిలోమీటర్లు సొరంగ మార్గంలోప్రయాణించిన మంత్రులు మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్ వెలిగొండ సొరంగంలో సాహస యాత్ర చేశారు. కొల్లంవాగు నుంచి మండల పరిధిలో వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పనులు జరుగుతున్న కొత్తూరు వరకు దాదాపు 19 కిలోమీటర్లు సొరంగ మార్గంలోనే ప్రయాణించారు. మంగళవారం శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మంత్రులు రోప్‌వే ద్వారా పాతాళగంగకు చేరుకున్నారు. అనంతరం బోట్లో కృష్ణా నదిలో ప్రయాణించి కొల్లంవాగుకు చేరుకున్నారు. అక్కడ హెడ్ రెగ్యులేటర్, ఇతర పనులను పరిశీలించారు. అక్కడి నుంచి బొలెరో వాహనాల్లో మొదటి సొరంగం గుండా 13 కిలోమీటర్లు ప్రయాణించారు. అనంతరం 6 కిలోమీటర్లు రెండో సొరంగం గుండా ప్రయాణించి కొత్తూరు చేరుకున్నారు. గాలి కూడా ఉండని ఇరుకు సొరంగ మార్గాల గుండా మంత్రులు ప్రయాణించటం సాహసమేనని పలువురు అధికారులు పేర్కొన్నారు. మంత్రుల వెంట మంత్రి సురేష్ తనయుడు విశాల్, ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్‌రెడ్డి ఉన్నారు.