జిల్లా పశ్చిమప్రాంత వాసుల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. రూ4500 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లోని 4.38లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగు నీరు అందుతుంది. అలాగే మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మించి 2008లో జాతికి అంకితం చేశారు.
చీమకుర్తి వద్ద నిర్మించిన రామతీర్థం ప్రాజెక్టు వల్ల జిల్లాలోని 72974 ఎకరాలకు సాగు నీరు అందుతోంది, 56 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు మంచి నీరు తరలిస్తున్నారు. ఉలిచి చెక్ డ్యాం పూర్తయింది. పాలేరు రిజర్వాయర్, యర్రంచినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకాలు నిర్మాణంలో ఉన్నాయి. సాగర్ ఆధునికీకరణకు రూ298 కోట్లు, ఓగేరు పథకానికి రూ45 కోట్లు, భవనాశి రిజర్వాయర్‌కు రూ27 కోట్లను వైఎస్ కేటాయించారు. చంద్రబాబు మాత్రం ప్రాజెక్టుల గురించి మరచిపోయారు.
రూ.148.19 కోట్ల ‘విద్యుత్ వెలుగులు’
వైఎస్ హయాంలో జిల్లాలో 86,207 వ్యవసాయ కనెక్షన్లుండగా.. 71321 మంది రైతులు ఉచిత విద్యుత్ వల్ల లబ్ధిపొందారు. విద్యుత్ కనెక్షన్ల క్రమబద్ధీకరణ నిమిత్తం రూ88.69 కోట్లను వైఎస్ విద్యుత్ శాఖకు అందించారు. అంటే ఏడాదికి సగటున రూ17.84 కోట్ల రూపాయలను నాటి వైఎస్ ప్రభుత్వం భరించింది. అంతే కాకుండా చంద్రబాబు హయాంలో 63,559 మంది రైతులకు చెందిన రూ59.50 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేశారు. చంద్రబాబు పాలనలో మాత్రం కరెంటు కోసం ధర్నాలు, రాస్తారోకోలతో రైతులు సతమతమయ్యేవారు. కరెంటు లేక పంటలన్నీ ఎండిపోయేవి.
అదనంగా 1.7 లక్షలకు పెరిగిన పెన్షనర్లు
చంద్రబాబు హయాంలో ఉన్న 1.08 పింఛనుదారులు ఇక్కట్లు పడేవారు. కేవలం నెలకు రూ75 రూపాయలతో విసిగిపోయేవారు. వీరిలో కేవలం 2200 మంది వికలాంగులే లబ్ధిపొందేవారు. అయితే వైఎస్ సీఎంగా వచ్చాక జిల్లాలో 1.78 లక్షలమందికి అదనంగా పెన్షన్లు మంజూరు చేశారు. వృద్ధులు, వితంతువులు, చేనేతలకు ఇచ్చే రూ75ను రూ200 పెంచారు. ఆ తర్వాత వికలాంగుల పింఛన్‌ను రూ500కు పెంచారు. ఇలా వికలాంగులు సంఖ్య 26వేలకు పైగా చేరింది. ఇక వైఎస్ జిల్లాకు ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ వచ్చేలా చేశారు. దీనికోసం రూ125 కోట్లు కేటాయించారు.
అభ్యున్నతి సాధించిన పొదుపు మహిళలు
పావలా వడ్డీ పథకంతో పొదుపు గ్రూపుల్లోని 43341 స్వయం సహాయక సంఘాలకు వైఎస్ హయాంలో రూ852.34 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు. దీనికోసం వారికి పావలా వడ్డీ కింద రూ180.9 కోట్ల రాయితీ లభించింది. మెప్మా ద్వారా 4213 సంఘాలకు రూ42.80 కోట్ల రుణాలు, రూ85.98 లక్షల పావలా వడ్డీ రాయితీ లభించింది. ఆమ్‌ఆద్మీ యోజన ద్వారా 1.89 లక్షల మంది రైతులకు రూ67.90 లక్షలు అందాయి. అభయహస్తం ద్వారా ఎంతోమంది లబ్ధిపొందారు. చంద్రబాబు పాలనలో మాత్రం 22010 స్వయం సహాయక సంఘాలకు కేవలం రూ109.89 కోట్ల రుణాలు అందజేశారు.
నాటి స్వర్ణయుగంలో ప్రకాశం
Published Sun, May 4 2014 2:41 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement