pensioners
-
ఏపీలో నెలనెల తగ్గిపోతున్న పింఛన్లు
-
ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు? దామోదర: ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం. సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు. సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్‌లపై దృష్టిసారిస్తాం.సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. -
‘పెన్షన్ ఆగిపోతుంది’.. బురిడీకొట్టిస్తున్న కొత్త స్కామ్!
పెన్షనర్లను మోసగాళ్లు కొత్త స్కామ్‌తో బురిడీకొట్టిస్తున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (CPAO) అధికారులమని చెప్పుకుంటూ పెన్షనర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ మోసగాళ్లు ఫేక్ వాట్సాప్ సందేశాలు పంపి తప్పుడు ఫారమ్‌లను నింపమని కోరుతున్నారు. పాటించకపోతే వారి పెన్షన్ చెల్లింపులను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు.వార్తా నివేదికల ప్రకారం.. బ్యాంకు ఖాతా వివరాలు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడమే లక్ష్యంగా మోసగాళ్లు ఈ స్కామ్ చేస్తున్నారు. ఈ సమాచారంతో వారు పెన్షనర్ల వివరాలను దొంగిలించి ఆర్థిక మోసానికి పాల్పడవచ్చు. ఈ నేపథ్యంలో పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.సీపీఏఓ పేరుతో ఏదైనా సందేశం వస్తే దాని ప్రామాణికతను పరిశీలించుకోవాలి. అధికారిక ఏజెన్సీలు వాట్సాప్ లేదా ఇతర అనధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వ్యక్తిగత వివరాలను అడగవు. మీ పీపీఓ నంబర్, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు. అనుమానం వస్తే సీపీఏఓ లేదా బ్యాంక్ వారిని అధికారిక సంప్రదింపు వివరాలను ఉపయోగించి సంప్రదించండి. -
టీచర్లకు జీతాల్లేవు..పెన్షనర్లకు పెన్షన్ లేదు
సాక్షి, అమరావతి: ప్రతీ నెలా ఒకటో∙తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కారు మాట తప్పింది. సెప్టెంబర్ నెల ఉద్యోగుల వేతనాలను మంగళవారం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మినహా మిగతా ఉద్యోగులు, టీచర్లకు మంగళవారం వేతనాలు చెల్లించలేదు.మున్సిపల్ శాఖతోపాటు పలు శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షన్ కూడా చెల్లించలేదు. మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,000 కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు చేరిన తరువాతే వేతనాలు, పెన్షన్ చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం గాంధీ జయంతి సెలవు కారణంగా గురువారం రూ.3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది. దీంతో గురు, శుక్రవారం వరకు వేతనాలు, పెన్షన్‌కు ఎదురు చూడక తప్పదు. -
క్యాష్ లెస్.. యూజ్ లెస్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అటకెక్కింది. నగదు రహిత వైద్యసేవలు అందక ఉద్యోగులు, పింఛన్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. నగదు రహిత ఆరోగ్య కార్డుతో వైద్యం చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. డబ్బులు చెల్లించనిదే అడ్మిట్ చేసుకోవడం లేదని ఉద్యోగులు వా పోతున్నారు. ఉద్యోగులు గత్యంతరం లేక లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం పొందుతున్నారు. ఆరోగ్య పథకంతో తమకు ప్రయోజనం పెద్దగా ఉండటం లేదని వాపోతున్నారు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా, పూర్తిస్థాయిలో పరిష్కారం కనుగొనడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టడం లేదని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు బకాయిలతో.. ఈహెచ్ఎస్ పరిధిలో సుమారు 5.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 20 లక్షల మంది ఈ పథకంలోకి వస్తారు. ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఫీజులేమీ తీసుకోకుండానే అడ్మిషన్ ఇచ్చి వైద్యం చేయాలనేది ఈ పథకం ఉద్దేశం. ఆస్పత్రులకు ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆస్పత్రులు నగదు రహిత వైద్యం అందించడంపై ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగ సంఘాల నేతల లెక్కల ప్రకారం.. ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దాదాపు రూ. 500 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. రీయింబర్స్‌మెంట్‌తో మరింత సమస్య ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకంతోపాటు రీయింబర్స్‌మెంట్‌ను కూడా అమలు చేస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో సొంత డబ్బుతో చికిత్స చేయించుకోవాలి. తర్వాత ఆస్పత్రి బిల్లులను ప్రభుత్వానికి సమరి్పస్తే.. ఆ సొమ్ము రీయింబర్స్మెంట్ అవుతుంది. కానీ దీనితో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. రూ.10 లక్షల బిల్లు అయితే.. రూ.లక్ష, లక్షన్నర మాత్రమే వెనక్కి ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలల నుంచి రెండేళ్ల సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు రహిత వైద్య పథకం సరిగా అమలవకపోవడం, రీయింబర్స్మెంట్ పూర్తిగా రాకపోవడంతో.. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామని, ఏటా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రీమియం కట్టాల్సి వస్తోందని ఉద్యోగులు అంటున్నారు. కాంట్రిబ్యూటరీ స్కీమ్‌పై అస్పష్టత గత ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందు ‘ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ)’ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి.. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత, ప్రభుత్వం నుంచి కొంత కలిపి జమ చేయాలని పేర్కొంది. అది అమల్లోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఈ స్కీంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నగదు రహిత వైద్యం అందేలా చూడాలి హెల్త్‌కార్డులు నిరుపయోగంగా మారాయి. రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తి మొత్తం అందడం లేదు. ఉపాధ్యాయుల మూల వేతనంలో ఒక శాతం ప్రీమియం చెల్లిస్తామని, ప్రత్యేక ట్రస్టుతో పథకం అమలు చేయాలని గత ప్రభుత్వాన్ని కోరాం. అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. విధివిధానాలు ఖరారుకాలేదు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. - ఎం.పర్వత్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయడంలేదు హెల్త్‌కార్డులు నామ్ కే వాస్తేగా మారాయే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు అందించేలా చూడాలి. – కొమ్ము కృష్ణకుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ జిల్లా బిల్లు కట్టి.. ఎదురుచూపులు నిజామాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ పెన్షనర్ ప్రభుదాస్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా.. రూ.లక్ష బిల్లు అయింది. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలైంది. ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. తల్లికి చికిత్స చేయించి.. నిజామాబాద్ జిల్లాలోని డీఆర్డీవో ఆఫీసులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రూ.లక్షకుపైగా బిల్లు అయితే సొంతంగా చెల్లించారు. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని, మూడు నెలలైనా ఇంకా రాలేదు. రూ.28 వేలు ఖర్చయితే.. రూ.12 వేలు వచ్చాయి మా అమ్మగారికి కంటి ఆపరేషన్ చేయించడం కోసం రూ.28 వేలు ఖర్చయ్యాయి. రీయింబర్స్మెంట్ కింద మెడికల్ బిల్లులు సమర్పించినప్పుడు రూ.12 వేలు మాత్రమే, అదీ ఏడాది తర్వాత అందాయి. ప్రభుత్వం నగదు రహిత చికిత్సఅందిస్తేనే.. ఏమైనా ప్రయోజనం ఉంటుంది. – బుర్ర రమేష్, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం -
ఏపీలో పెన్షన్.. టెన్షన్
అమరావతి, సాక్షి: ‘అమ్మో ఒకటో తారీఖు..’ అనుకుంటున్న ఏపీ పెన్షనర్లను ఆ ‘టెన్షన్’ ఇప్పుడు ఒకరోజు ముందుగానే పలకరించబోతోంది. కూటమి ప్రభుత్వం వరుసగా 3వ నెల పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈసారి ఒక రోజు ముందే పెన్షన్ రానుంది. దీంతో.. అకారణంగా లిస్టు నుంచి తమ పేరును తొలగిస్తారేమో అనే ఆందోళన పింఛన్‌దారుల్లో నెలకొంది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరిట రెండో నెల(ఆగష్టు 1వ తేదీన) జరిగిన ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడింది.గడిచిన రెండు నెలల కాలంలో ఏపీలో పెన్షనర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.జులైలో 65 లక్షల 18 వేల 496 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు.ఆగష్టు నెలకొచ్చేసరికి 64 లక్షల 39 వేల 41 మందికి తగ్గిపోయింది (ఏటీఆర్ కలిపితే ఆ సంఖ్య 64,82,052)జులై కంటే ఆగష్టులో ఏకంగా 79, 455 పెన్షన్లు తగ్గించింది ప్రభుత్వం. జగన్ హయాంలో ఏ నెల ఫించన్‌దారుల్లో కోతలు విధించిన దాఖలాలు లేవు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం రెండు నెలల కాలంలోనే పెన్షనర్లను భారీగా తగ్గించింది. దీనిపై సిబ్బందిని ఆరా తీస్తే.. నిబంధనల పేరుతోనే ఇలా పెన్షన్లను తగ్గిస్తున్నారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కోత మరింత భారీగా ఉండొచ్చని చంద్రబాబు సర్కార్ సూత్రప్రాయంగా సంకేతాలిస్తోంది.వలంటీర్ల ఊసేది?ఏపీలో ఇంటింటికే పెన్షన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పడేసింది. వలంటీర్లు లేకుండానే రెండు నెలలు పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే సన్నద్ధం చేసింది. ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా.. ‘అసలు వలంటీర్లు అవసరం ఏముంది?’ అనే ధోరణితో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను కొనసాగించడం కన్నా.. ఏదో ఒక రకంగా రద్దు చేయాలని చూస్తోంది.మమ్మల్ని ముంచేశారుప్రతిపక్షంలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్‌గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.ఇబ్బందులమయంగా పంపిణీ..చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని ఆదేశాలిప్పిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సర్వర్‌లో ఇబ్బందులతో సచివాలయ ఉద్యోగులు సతమతమవుతుండగా.. ఫించన్‌దారుల నిలదీతతో ఇబ్బందికర పరిస్థితి టీడీపీ ఈవెంట్‌గా.. పెన్షన్ల పంపిణీని గత ప్రభుత్వం ఏనాడూ రాజకీయ కార్యక్రమంగా చూడలేదు. కానీ, చంద్రబాబు మాత్రం దాన్ని టీడీపీ ఈవెంట్‌గా మార్చేశారు. టీడీపీలో చోటా లీడర్ల దగ్గరి నుంచి మంత్రుల స్థాయిదాకా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. లబ్ధిదారులతో ఉత్తుత్తి పంపిణీ ఫొజులు ఇచ్చి.. సోషల్ మీడియాలో పోస్టర్లు వేయించుకుంటున్నారు. పెన్షన్ వచ్చేనా?ఏపీలో దివ్యాంగుల్లో 8 లక్షల మంది పెన్షన్ పొందుతుండగా.. వారిలో 60 వేల మందికి మళ్లీ వైకల్య పరీక్షలు జరపాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అందువల్ల వాళ్లకు పెన్షన్ వస్తుందా అనేది అనుమానమే. వృద్ధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇస్తున్న పెన్షనర్ల విషయంలోనూ రివిజన్ నిర్వహించాలని బాబు సర్కార్ యోచిస్తోంది. తద్వారా రకరకాల నిబంధనల పేరుతో మరికొందరిని జాబితా నుంచి తొగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లుంది. ఈసారి ఒకరోజు ముందుగానే ఆగస్టు 31న పెన్షన్ పంపిణీ చేస్తునప్పటికీ.. పెన్షన్ ఇవ్వడానికి ఎవరూ రాకపోతే ఎలా? అనే ఆందోళన లబ్దిదారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పెన్షన్ రాకపోతే.. సచివాలయాల చుట్టూ తిరగండి. అసలు మీ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోండి.. లేకపోతే ఇక అంతే.. అంటూ అధికారులు చెబుతున్నారని పెన్షనర్లు వాపోతున్నారు. -
ఏపీలో పెన్షనర్లకు షాక్..
-
పెన్షనర్లపై బాబు కొత్త కుట్ర..
-
డబుల్ పెన్షనర్ల నుంచి రూ.10 లక్షలు రికవరీ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ సర్వీసు పెన్షన్లు, సామాజిక ఆసరా పెన్షన్.. రెండూ పొందుతున్న పది మంది రూ.10 లక్షలను తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. జిల్లాలో 71 మంది రెండు పెన్షన్లు పొందుతున్నట్లుగా పేర్కొంటూ జూలై 6న ‘సాక్షి’లో ‘ప్రభుత్వ పెన్షనర్లకు ఆసరా’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో రెండు పెన్షన్లు పొందుతున్న వారికి పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీచేశారు. రెండు పెన్షన్లు పొందుతున్న వారు ఆసరా పెన్షన్ డబ్బులను తిరిగి చెల్లించాలని ఆదేశించారు.కాగా, ఏళ్ల తరబడి పొందిన ఆసరా పెన్షన్ డబ్బులను ఒకేసారి చెల్లించడం ఇబ్బందిగా ఉండడంతో రికవరీకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వారికి వెసులుబాటు కలి్పంచారు. ఇప్పటికే 10 మంది రూ.10 లక్షలు చెల్లించగా.. ఇంకా 61 మంది, రూ.47.75 లక్షల మేరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని దశలవారీగా రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆసరా పెన్షన్లు నిలిపివేసి, సరీ్వసు పెన్షన్ నుంచి ఆ సొమ్మును దశలవారీగా రికవరీ చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయకుండా వాయిదా పద్ధతిలో వసూళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. -
పింఛన్లకు ‘అధికార’ గ్రహణం
బత్తలపల్లి/గాండ్లపెంట/పుట్టపర్తి అర్బన్/కోటనందూరు: రాష్ట్రంలో పెన్షన్లకు ‘అధికార’ గ్రహణం పట్టింది. టీడీపీ నేతలు పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారుల్ని అడ్డుకుంటున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని చెప్పి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అర్హులకు కూడా పింఛన్ నగదు అందకుండా చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్‌ను ఇప్పుడు ఇవ్వకపోవడంతో బాధితులు నిరసన తెలుపుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలో 40 మందికి పింఛన్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు బుధవారం వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఎంపీడీవో శివనాగప్రసాద్ వారితో చర్చించారు. పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్ అసిస్టెంట్ ఫ్రాన్సిస్‌ను ఆరాతీశారు. అందరికీ పింఛన్లు ఇవ్వాలని తాము భావించామని, అయితే టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని వారు వాపోయారు. ప్రస్తుతానికి సైట్ క్లోజ్ అయిందని, వచ్చేనెల రెండునెలల పింఛన్ మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఇస్తారన్న గ్యారెంటీ ఏమిటని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో కలెక్టర్‌ను కలవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. ⇒ గాండ్లపెంట మండలం ఎలుగూటివారిపల్లిలో దివ్యాంగులైన నలుగురు లబ్ధిదారులకు పింఛన్ మంజూరైనా అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో బాధితులు కె.రమాదేవి, ఎం.నారాయణరెడ్డి, ఎం.లక్ష్మీదేవి, బి.లక్ష్మీదేవి బుధవారం ఎంపీడీవో రామానాయక్‌కు ఫిర్యాదు చేయాలని కార్యాలయానికి ఎంపీడీవో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా తీసుకుంటున్న పింఛన్‌ను ఇప్పుడు నిలిపేశారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. ⇒ స్థానిక టీడీపీ నాయకులను కలిసి వస్తేనే పింఛన్ ఇస్తామంటూ మూడురోజుల నుంచి తిప్పుకొన్న సచివాలయ సిబ్బంది చివరకు సైట్ క్లోజ్ అయిందంటూ పింఛన్ సొమ్ము ఎగ్గొట్టారని రామగిరి మండలం ఎంసీపల్లి 1, 2 సచివాలయాలకు చెందిన పెన్షన్‌దారులు బుధవారం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఏ రోజూ ఇలా జరగలేదని, వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్ మొత్తాన్ని ఇచ్చేవారని చెప్పారు. ప్రభుత్వం మారగానే పింఛన్ ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సిబ్బంది సూచన మేరకు వారు డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పీడీ నరసయ్య లేకపోవడంతో అధికారి శివమ్మ వద్ద గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం ఇచ్చారు. దీనిపై డీఆర్డీఏ పీడీ నరసయ్యను వివరణ కోరగా .. ఈ విషయాన్ని పరిశీలించాలని రామగిరి ఎంపీడీవోని ఆదేశించామని, వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ⇒ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎల్డీపేటలో 18 మంది పింఛనుదారులకు అధికారులు పింఛన్ నిలిపేశారు. సోమ, మంగళవారాల్లో లబ్ధిదారుల ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వకపోగా సచివాలయానికి వెళ్లినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి ఏడుగంటల వరకు సచివాలయంలోనే ఉన్నామని, ఎందుకు ఆపేశారని అడిగినా అధికారులు సమాధానం చెప్పలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు సమస్యను బుధవారం ఎంపీపీ లగుడు శ్రీనివాసుకి వివరించారు. పింఛన్లు ఇప్పించాలని కోరుతూ ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీడీవో జయమాధవికి వినతిపత్రమిచ్చారు. దీనిపై ఎంపీడీవో జయమాధవిని వివరణ అడగగా.. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు తీసుకుంటున్నారని 18 మందిపై ఫిర్యాదు అందడంతో వారికి పింఛన్లు ఆపేశామన్నారు. విచారించి వారు అర్హులైతే వచ్చేనెల నుంచి ఇస్తామని చెప్పారు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు ఇంత దారుణం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో ఒక్కనెల కూడా ఇలా ఇబ్బంది పెట్టలేదు. కలెక్టర్ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి. - సిద్ధయ్య, ఎంసీపల్లి, రామగిరి మండలం అప్పుడు ఎవరికీ తొలగించలేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ పెన్షన్ తొలగించలేదు. ఒకవేళ మా నాయకులు తప్పుచేస్తే నాకు చెప్పండి లేదా కోర్టుకు వెళ్లండని చెప్పిన గొప్ప నాయకుడు. అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం టీడీపీ వాళ్లు అందుకు భిన్నంగా చేస్తున్నారు. - నరసింహారెడ్డి, ఎంసీపల్లి, రామగిరి మండలం సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? నా కుమార్తె నందివర్ధినీబాయికి తలసేమియా పెన్షన్ వస్తోంది. పాపను ఎత్తుకుని నా భార్య మూడురోజుల పాటు సచివాలయం చుట్టూ తిరిగింది. టీడీపీ వాళ్లను కలిసి ఫోన్‌చేయిస్తే ఇస్తామని చెప్పారు. లోకల్ లీడర్ల ప్రెజర్ ఉందని, వాళ్లను కలవాలని సెక్రటరీ, ఎంపీడీవో చెప్పడం అన్యాయం. సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? గతంలో సుగాలీల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు స్పందించి నందివర్ధినీబాయికి బాసటగా నిలవాలి. - ముత్యాలనాయక్, ఆర్.కొత్తపల్లి, రామగిరి మండలం -
పెన్షన్ దారులకు వెన్ను పొట్లు బాబు మార్క్ కుట్ర
-
మా పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు ఇక రాకూడదు
-
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
-
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
-
అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద
-
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
-
ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల కష్టాలు
గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్ కో బ్యాచ్ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.Heartbreaking to see pensioners in Andhra Pradesh struggling after Chandra Babu's removal of the volunteer system. These are the very people who've contributed their entire lives to the state's growth. pic.twitter.com/buLKhTihU9— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 2, 2024 చంద్రబాబు కుట్రలకు పెన్షన్‌దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.Pensioners reaching banks for withdrawal #PensionersVsTDP pic.twitter.com/Y55Sov3J0I— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) May 2, 2024వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.Enough is enough! @JaiTDP must answer for their mistreatment of pensioners. Join the call for accountability! #PensionersVsTDP pic.twitter.com/uRPpHOOnSW— Prabal (@Prabal8_) May 2, 2024చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. -
పెన్షన్ దారులకు తప్పని కష్టాలు..
-
ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర
కడప కార్పొరేషన్: ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్ ఏడాదిలో ఏడెనిమిది సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీఏ, ఏపీజీఎల్ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా, ఎందుకు జరిగిందో ఉద్యోగులకూ తెలుసన్నారు. రెండేళ్లు కోవిడ్ వల్ల ప్రపంచం యావత్తు అల్లాడిపోయిందని, రాష్ట్రానికి రూ.76 వేల కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. 10,177 మంది రెగ్యులరైజ్ రాష్ట్ర బడ్జెట్ లక్షా ఇరవై ఐదు వేల కోట్లుగా ఉంటే అందులో 95 వేల కోట్లు జీతాలకే పోతోందని, మిగిలిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా పీఎఫ్ బకాయిలను క్లియర్ చేశారని తెలిపారు. కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లుతూ రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయనడం దారుణమన్నారు. 11వ పీఆర్సీ అరియెర్స్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్ తగ్గిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ఐఆర్ 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్ష¯Œన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 10,177 మందిని రెగ్యులరైజ్ చేశారని, వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న 11 వేల మందికి 010 పద్దు కింద జీతాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. లక్షా ముప్పై ఐదు వేల మందిని సచివాలయాల్లో నియమించిన సీఎం జగన్.. 12వ పే రివిజన్ కమిషన్ కూడా వేసి జూలై నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మే నెలతో పాటు ఒక డీఏ ఇస్తున్నారని, జూన్‌లో మరో డీఏ ఇస్తారని చెప్పారు. సీపీఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారని వివరించారు. కీలకమైన విద్య, వైద్యరంగాల్లో ఖాళీలన్నీ భర్తీ చేశారని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారని, చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నారని చెప్పారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికీ 16 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేశారన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని చేసిన జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, పెన్షనర్లపై ఉందని చెప్పారు. వలంటీర్లపై నిత్యం చంద్రబాబు అక్కసు.. 2014లో చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేశారని, తాజాగా ఆయన ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే అదనంగా లక్షా యాభై వేల కోట్లు కావాలన్నారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. అధికారంలోకొస్తే రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభల్లోనే అధికారులను తిడితే ఎంతో మంది గుండెపోటుకు గురయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడూ రెడ్ బుక్‌లో నోట్ చేస్తున్నాం.. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం.. అంటూ పోలీసులు, ఉద్యోగులను బెదిరిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని అడిగితే.. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను గానీ డీఏలు ఇచ్చేది లేదని మొండికేసిన విషయం ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదని చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు. -
అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్‌కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు, దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్‌దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్‌చైర్‌కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది. -
అవ్వాతాతలూ ఆలోచించండి.. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే: సీఎం జగన్
వాళ్లు ఎలాగూ చేసేది లేదు కాబట్టి చెప్పడానికేముంది? నోటికి అడ్డేముంది? అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే చాలు.. ఎలాగూ చేసేది లేదు కదా! అనే మనస్తత్వం వాళ్లది. మీ బిడ్డ అలా కాదు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ప్రభుత్వం పెట్టే మొదటి సంతకం వలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడమే. – పింఛన్‌దారులతో సీఎం జగన్ సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ‘‘పేదలకు గానీ, అవ్వాతాతలకు గానీ, పిల్లలకు గానీ, ఏ వర్గానికైనా సరే.. మంచి చేసే విషయంలో జగన్‌తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే ఎక్కడా మీ బిడ్డ తగ్గడు. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు అని స్పష్టంగా చెబుతున్నా. మన ప్రమాణ స్వీకారం రోజు వలంటీర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమంపైనే మొట్ట మొదటి సంతకం చేస్తా’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మీ బిడ్డకు అబద్ధాలు ఆడటం, మోసం చేయడం తెలియదు కాబట్టి బాబు, ఆయన కూటమితో ఈ రెండు విషయాల్లో మాత్రం పోటీ పడలేడని వ్యాఖ్యానించారు. సోమవారం ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే.. అవ్వాతాతలపై ప్రేమతో... ఈరోజు అవ్వాతాతలతోపాటు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలపై ఆలోచన చేయమని కోరుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ ఇచ్చిన పెన్షన్ రూ.1,000 మాత్రమే. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించుకుంటేనే అందిన దుస్థితి. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అప్పట్లో నెలకు వెచ్చించిన వ్యయం కేవలం రూ.400 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ అవ్వాతాతల గురించి, వారి కష్టాలు, ఆత్మగౌరవం గురించి ఆలోచన చేశాడు. అధికారంలోకి రాగానే దేశంలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామంలో సచివాలయాలను నెలకొల్పి వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా 1వ తారీఖునే అది సెలవు రోజైనా, ఆదివారమైనా సరే ఇంటివద్దే నేరుగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్లు పెట్టిన పరిస్థితి 56 నెలలు మన ప్రభుత్వం హయాంలోనే జరిగింది. గతంలో 39 లక్షలు మంది మాత్రమే íపింఛనుదారులుండగా ఈరోజు వివక్ష లేకుండా 66.34 లక్షల మందికి ఠంఛన్‌గా పెన్షన్ అందిస్తున్నాం. అది కూడా గత సర్కారు హయాంలో మాదిరిగా రూ.వెయ్యి కాకుండా ఏకంగా రూ.3 వేల దాకా పెంచుకుంటూ వెళ్లి అవ్వాతాతలకు మంచి చేశాం. ఈ తేడాను ఒక్కసారి గమనించండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఆ అవ్వలు, తాతలు, అభాగ్యుల పట్ల మనసులో నిజమైన ప్రేమ ఉంటేనే ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయి. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి సభకు హాజరైన అవ్వాతాతలు బాబు ఆ ఆలోచనే చేయలేదు.. మీరంతా గత పాలకులను చూశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు పరిపాలన చేశానని చెబుతుంటారు. కానీ ఏ ఒక్క రోజైనా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఆయన ఆలోచన చేశాడా? అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలనే తాపత్రయం, మనసులో ప్రేమ ఉంటేనే చేతల్లో బయటకు వస్తుంది. ఇవాళ రాజకీయాలు పాతాళానికి దిగజారాయి. విలువలు, విశ్వసనీయత లేవు. ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ తొలిసారిగా అడుగులు వేగంగా వేశాడు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఏకంగా 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధితో మీ ముందుకు వచ్చాడు. మీ బిడ్డకు అబద్ధాలు, మోసాలు తెలియవు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. మీ ముందు ఉంచుతున్న వాస్తవాలపై ఆలోచన చేయమని అందరినీ కోరుతున్నా. దేశంలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనదే జనాభా ప్రకారం చూస్తే ఐదు కోట్ల మందిలో 66.34 లక్షల మందికి పెన్షన్లు, అత్యధికంగా పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న రాష్ట్రం మనదే. నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల కోసం నెలకు రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు నెలకు రూ.2 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే అందచేస్తున్నాం. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్నాం. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలిపితే ఏకంగా రూ.90 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు చేతిలో పెట్టినట్లయింది. ఏటా రూ.24 వేల కోట్లు పింఛన్ల కోసం ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా బిహార్‌లో రూ.4300 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో రూ.5,160 కోట్లు, కర్ణాటకలో రూ.4,700 కోట్లు, పక్కన తెలంగాణలో రూ.8,180 కోట్లు చొప్పున ఏటా పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే అవ్వాతాతలను మోసం చేసేందుకు రూ.4 వేలు.. రూ.5 వేలు.. రూ.6 వేలు అని చెబుతారు. ఇంకా అవసరం అయితే ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికీ రూ.8 వేలు అని కూడా అంటారు. మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా చేయగలిగిందే చెప్పాలి. చెయ్యలేనిది నా నోట్లో నుంచి రాదు. ఈ 58 నెలల పాలన చూస్తే చెప్పనివి కూడా చాలా చేసిన పరిస్థితి మీ అందరికీ కనిపిస్తుంది. బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు. మీ అందరికీ అందుకే చెబుతున్నా. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పే వాళ్లను నమ్మొద్దండీ. మీ బిడ్డ పేదల సంక్షేమానికి సంవత్సరానికి దాదాపుగా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా మీ బిడ్డ సమూల మార్పులు తేవడంతో ఈరోజు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని నమ్మబలుకుతున్న చంద్రబాబు హామీలు రూ.1.40 లక్షల కోట్లు దాటుతున్నాయి. సునాయాసంగా నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. మీలో ఎవరైనా నాకు సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్లిప్పులో రాసి బాక్సులో వేస్తే నావద్దకు వస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు చంద్రబాబు చేసిన పనికి... నాకు కాలు విరగడంతో ఆపరేషన్లు జరిగాయి. అన్ని పథకాలు కలిపి రూ.3.40 లక్షలు అందాయి. నీ మేలు ఎప్పుడూ మరవలేం. చంద్రబాబు చేసిన పనికి చాలా కష్టం అయింది. నాకు ఆయాసం ఉంది. మూడుసార్లు కూర్చుని లేచి సచివాలయానికి వెళ్లా. తోడు కోసం ఓ పాపను తీసుకెళితే రాయి తగిలి కింద పడటంతో ఆమె ముక్కుకు గాయం అయింది. మమ్మల్ని ఇంత కష్టపడేలా చేసింది చంద్రబాబే. రైతుభరోసా సహా నాకు ఎన్నో పథకాలు అందాయి. మొన్ననే కంటి ఆపరేషన్ చేయించుకున్నా. నీవల్లే ధైర్యంగా బతుకుతున్నా. – కర్నాటి సుబ్బులు, కుర్చేటి మండలం, అగ్రహారం ఎంత ఇబ్బంది బాబూ.. ఇన్నాళ్లూ వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే రూ.3 వేల పెన్షన్ మా చేతుల్లో పెడితే ఈనెలలో మాత్రం మూడు చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళితే అక్కడ కాదన్నారు. ఇంకో చోటకు వెళితే అక్కడా కాదన్నారు. మోకాళ్ల నొప్పితో ఎన్నిచోట్లకు తిరిగానో, ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ బాబు! ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే అడ్డుపడుతున్నారు. మాకు వలంటీర్లు, వలంటీర్ల వ్యవస్థ కావాలి. కరోనాలో మాసు్కలతో సహా ఇంటివద్దకే పంపించారు. ఇంటింటికీ రేషన్ పంపిస్తున్నారు. గడప గడపకు పథకాలు అందుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థను తొలగిస్తే ఒప్పుకోం. – పట్రా ప్రభావతి, దర్శి దివ్యాంగులు, వృద్ధులపై అక్కసు.. టీడీపీ హయాంలో దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. మీరు (సీఎం జగన్) పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలిచ్చారు. అందులో ఇవ్వని హామీ ఒకటి ఏమిటంటే దేవుడి దూతలా వలంటీర్లను పంపించడం. వారు ఇంటింటికీ వచ్చి దివ్యాంగులకు పెన్షన్లే కాకుండా సదరం సర్టిఫికెట్ నుంచి ఆధార్ కార్డు దాకా ప్రతి ఒక్కటీ అందేలా చేశారు. బాబు మిమ్మల్ని ఏమీ చేయలేక అక్కసుతో దివ్యాంగులు, వృద్ధుల మీద పడ్డారు. పిటిషన్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కచ్చితంగా చెబుతున్నా వాళ్లు మట్టి కొట్టుకుపోతారు. 70 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్తూ మండుటెండలో సొమ్మసిల్లి పడిపోవటాన్ని నేను కళ్లారా చూశా. దీనికి ఎవరు కారణమనేది అందరూ ఆలోచన చేయాలి. – నర్సింహారావు, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు నిన్నే నమ్ముకున్నానయ్యా.. నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది. నాకు, నా కోడలికి వైఎస్సార్ ఆసరా వచ్చింది. నా కొడుక్కి రైతుభరోసా వచ్చింది. మాకు అన్నీ వచ్చాయి. నాకు వైఎస్సార్ ఇల్లు కట్టించాడు. నాకు నలుగురు కొడుకులున్నా నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉన్నావ్ నువ్వు. నాకు రూ.3 వేలు పెన్షన్ వస్తోంది బ్యాంకుల నుంచి రూ.23 వేలు వచ్చాయి. నేను నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా. – గంగిరెడ్డి మంగమ్మ, బొట్టపాలెం దోమలు కుడుతున్నా.. పింఛన్ కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి మాకు పెన్షన్ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్‌కు వెళ్లేవాడిని. నాకన్నా ముందే నలుగురు ఉండేవాళ్లు. అక్కడ 10 కుర్చీలే ఉండేవి. దోమలు కుడుతున్నా బయటకు వెళ్తే కుర్చీ పోతుందనే భయంతో వెళ్లేవాడ్ని కాదు. కండువా తీసుకుని ఆ దోమలను కొట్టుకుంటూ వుండేవాడ్ని. సిబ్బంది 8 గంటలకు వచ్చేవారు. అన్ని పూర్తి చేసేసరికి 9 గంటలు అయ్యేది. అప్పటికే దాదాపు రెండు మూడొందల మంది వచ్చి పుస్తకాలు పెట్టేవారు. తర్వాత వచ్చేవాళ్లను తరువాత రావాలని పంపేవారు. అలా వారం రోజులు పెన్షన్లు ఇచ్చేవారు. ఈ బాధ ఎప్పుడు పోతుందా అని అనుకునేవాడ్ని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన బంగారు మెదడు నుంచి వచ్చిన ఆలోచనలే. అటువంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి వారికి మే 13న ప్రజాకోర్టు శిక్ష వేస్తుంది. జూన్ 4న శిక్ష అమలు జరుగుతుంది. – వెంకటపతి, దర్శి పల్లెటూళ్లకు పాలన తెచ్చారు.. నవరత్నాల పథకాల వల్ల మాలాంటి పేదలకు నాలుగు వేళ్లు నోట్లోకి పోతున్నాయి. నాడు పరిపాలన కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. నేడు పల్లెటూళ్లకు పరిపాలన తెచ్చిన ఘనత మన జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా మండల ఆఫీస్‌కు వెళ్లాల్సిందే. ఇప్పుడు అన్నీ గ్రామాల్లోనే లభిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నీలాంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడ్ని చూసి భయపడుతున్నారు. – శ్రీనివాస్‌రెడ్డి, బసిరెడ్డిపాలెం గ్రామం నీ నీడన మేం ఉండాలి.. నా పెనిమిటి మరణించి 15 ఏళ్లు అయింది. నాకు ఇల్లూ వాకిలీ లేదు. ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. ఇప్పటి వరకూ రూ.1.30 లక్షల మేర లబ్ధి పొందా. ఈనెల పెన్షన్ వలంటీర్ ఇవ్వలేదు. నా కుమారుడిని అడిగితే దర్శి వెళ్లి తెచ్చుకోవాలన్నాడు. నా ఆరోగ్యం బాగాలేదు. నడవలేను. ఎవరినో బతిమాలి వెళ్లి పెన్షన్ తెచ్చుకున్నా. జగనన్నా మళ్లీ నువ్వే రావాలి. 175కి 175 రావాలి. నీ నీడన మేం ఉండాలి. మంచి మనసున్న మారాజు నువ్వు. సొంత కొడుకులు, కోడళ్లు పదెకరాల ఆస్తి ఇచ్చినా మనల్ని చూడరు. కానీ అందరినీ చూసే మంచి మనసున్న మనిషి దైవబలంతో ఆ తల్లికి జన్మించాడు. అలాంటి జగనన్నను మనం గెలిపించుకోవాలి. – వెంకాయమ్మ, శివాజీ నగరం వార్డు, దర్శి, వితంతు పెన్షన్ లబ్ధిదారు ఐదు గద్దలు మాపై పడ్డాయి.. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలు అరకొర పెన్షన్లు ఇవ్వడంతోపాటు ఒక íపింఛనుదారుడు చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలు మంజూరు చేసేవి. వలంటీర్లను అడ్డుకునేందుకు రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి లాంటి ఐదు గద్దలు తోడయ్యాయి. ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసి నాలాంటి గుడ్డోళ్లు, ముసలోళ్లను దెబ్బ తీశారు. పది మంది చూపు పడితే బండ రాళ్లైనా పగిలిపోతాయి. 69 లక్షల మంది చూపు పడి ఆ ఐదుగురూ నామరూపాలు లేకుండా పోతారు. – శ్రీను, పెద ఉయ్యాలవాడ, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు -
పింఛన్ల లబ్ధిదారులపై అక్కసు వెళ్లగక్కుతున్న టీడీపీ నేతలు
-
అవ్వాతాతలకు ఇంటి దగ్గర పెన్షన్ రాకుండా చేసిన పచ్చ గ్యాంగ్
-
బాబు నిర్వాకం వల్లే సచివాలయాలకు వెళ్లే దుస్థితి: పెన్షన్ దారులు
-
జగన్ సీఎం అయ్యాకే సక్రమంగా పింఛన్: వృద్ధులు