పింఛన్ కోసం ధర్నా | Pensioners stage dharna for pension | Sakshi
Sakshi News home page

పింఛన్ కోసం ధర్నా

Published Mon, Sep 7 2015 3:34 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

Pensioners stage dharna for pension

తంబళ్లపల్లి (చిత్తూరు) : సామాజిక పింఛన్‌దారులు పింఛన్ కోసం ఆందోళనకు దిగారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో సోమవారం  చోటుచేసుకుంది. మండలంలోని లబ్ధిదారులు ఈ రోజు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

సాంకేతిక కారణాలు చూపుతూ వితంతు, వృద్ధాప్య, వికలాంగు పింఛన్లను ఇప్పటివరకు అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో పింఛన్‌దారులంతా కలసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సకాలంలో పింఛన్ పంపిణీ చేసి ఆదుకోవాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement