రైల్వే కోడూరులో కుష్ఠు రోగుల ఆందోళన | Leprosy Patients dharna over pensions | Sakshi
Sakshi News home page

రైల్వే కోడూరులో కుష్ఠు రోగుల ఆందోళన

Published Tue, Dec 8 2015 12:08 PM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

Leprosy Patients dharna over  pensions

రైల్వే కోడూరు: ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్లను సాంకేతిక కారణాలతో తీసేస్తున్నారంటూ వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు లో కుష్టురోగులు మంగళవారం ఎంపీడీవో ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. రైల్వే కోడూరు జ్యోతి కాలనీలో కుష్టు రోగులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. వారు దాదాపు నలభై ఏళ్ల నుంచి పింఛన్లు తీసుకుంటున్నారు.
 
ఐరీష్‌లో వేలి ముద్రలు పడటం లేదని వారి పింఛన్లు అధికారులు తొలగించారు. దీంతో ఆగ్రహం చెందిన వారు మంగళవారం ఉదయం ఎంపీడీవో ఆఫీసు ఎదటు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుష్టు రోగులైన మాకు వేలిముద్రలు పడటం లేదని పింఛన్లు తొలగించడం అన్యాయమని వారు వాపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement