leprosy patients
-
ఆ తొమ్మిది మంది ఎక్కడ?
యేసుప్రభువు ఒకసారి సమరయ ప్రాంతం మీదుగా యెరూషలేముకు వెళ్తుండగా, పది మంది కుష్టు రోగులు ఎదురై, తమను కరుణించమంటూ దూరం నుండే కేకలు వేశారు. ఆ కాలంలో కుష్టు చాలా భయంకరమైన వ్యాధి..కుష్టు వ్యాధిగ్రస్థులు కుటుంబ, సామాజిక బహిష్కరణకు గురై జీవచ్ఛవాల్లాగా ఉరికి దూరంగా నిర్జన స్థలాల్లో బతికేవారు. మామూలు మనుషులు ఎదురైతే కుష్టు రోగులు దూరం నుండే మాట్లాడాలి. అలాంటి ఆ పదిమంది కుష్టురోగుల మీద ప్రభువు జాలి పడి, వారి వ్యాధి బాగు చేసి, వెళ్లి యాజకులకు చూపించుకొమ్మని చెబితే, వాళ్ళు వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్తుండగా బాగుపడ్డారని బైబిల్ చెబుతోంది( లూకా 17:14). అయితే కొద్ది సేపటికి ఆ పది మందిలో అస్పృశ్యుడు, సమరయుడైన ఒకడు తిరిగొచ్చి ప్రభువుకు సాగిలపడి కృతజ్ఞత వెలిబుచ్చగా,’ శుద్ధులైన మిగిలిన తొమ్మండుగురు ఎక్కడ?’ అని ప్రభువు ప్రశ్నించాడు. సమరయులను యూదులు ముట్టుకోరు, వారితో సాంగత్యం అసలే చేయరు. అయితే సామాజిక బహిష్కరణకు గురైన తర్వాత కుష్టు వ్యాధిగ్రస్తులుగా అంతకాలం యూదులైన 9 మంది, సమరయుడైన ఆ వ్యక్తి కలిసే జీవించారు. కానీ ప్రభువు కృపతో శుద్ధులై యాజకులను కలిసేందుకు వెళ్తున్నపుడు బహుశా వారిలో వారికి భేదాభిప్రాయాలు వచ్చాయి. సమరయుడైన ఆ వ్యక్తి అంటరానివాడని, పైగా అతనికి ఆలయప్రవేశం కూడా నిషిద్ధమని యూదులైన తొమ్మండుగురికి గుర్తుకొచ్చి అతన్ని వెలివేస్తే, అతను వెనక్కొచ్చి ప్రభువు పాదాలనాశ్రయించాడు. విచిత్రమేమిటంటే, కుష్టువ్యాధి వారిని కలిపితే, స్వస్థత విడదీసింది. కాకపోతే సమరయుడికి దాని వల్ల ఎంతో మేలు జరిగింది. ఆ తొమ్మండుగురికి శారీరక స్వస్థత, ఆలయ ప్రవేశం మాత్రమే దొరికింది. కాని స్వస్థత పొంది తిరిగొచ్చిన సమరయుడికి, ఆలయంలో ఆరాధనలందుకునే దేవుడే యేసుప్రభువుగా, రక్షకుడుగా దొరికాడు, ఆయన మాత్రమే ఇచ్చే పరలోక రాజ్యంతో కూడిన శాశ్వతజీవం కూడా సమృద్ధిగా దొరికింది. ఆ తొమ్మిది మంది కుష్టువ్యాధి నయమై మామూలు మనుషులయ్యారు, కాని కృతజ్ఞతతో తిరిగొచ్చిన సమరయుడు ప్రభువు సహవాసంలో గొప్ప విశ్వాసి అయ్యాడు. ఆ తర్వాత అపొస్తలుడై ప్రభువు సువార్త ప్రకటించి వందలాది ఆత్మలు సంపాదించి హత సాక్షి కూడా అయ్యాడని చరిత్ర చెబుతోంది. కుష్టు నయమైనా దాని కన్నా భయంకరమైన ‘కృతజ్ఞతారాహిత్యం’ అనే వ్యాధి నుండి మాత్రం ఆ తొమ్మండుగురికీ విముక్తి దొరకలేదు. ‘ఆ తొమ్మండుగురు ఎక్కడ?’ అన్న తన ప్రశ్నకు, ‘ఇంకెక్కడ? కుష్టు నయమై కూడా వాళ్ళు నరకంలో ఉన్నారు’ అన్నదే జవాబని ప్రభువుకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే యేసుప్రభువిచ్చే స్వస్థత పొందడం వేరు, యేసుప్రభువునే రక్షకుడుగా పొందడం వేరు. పరలోకరాజ్యార్హత తో కూడిన ఆ ధన్యత, పదిమందిలో అంటరాని వాడు, అన్యుడైన సమరయుడికి ఒక్కడికే దొరికింది. లంకె బిందెలు దొరికితే, వాటిలోని బంగారం, వెండి, వజ్రవైఢూర్యాది విలువైన సామాగ్రినంతా పారేసి, కేవలం ఖాళీ ఇత్తడి బిందెల్ని ఇంటికి తీసుకెళ్లిన వాళ్ళు ఆ తొమ్మిది మంది కాగా, ఐశ్వర్యంతో సహా లంకె బిందెల్ని తీసుకెళ్లిన వాడు ఆ అన్యుడు, సమరయుడు !! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకుడు – ఆకాశధాన్యం -
నేటినుంచి అసంక్రమిత వ్యాధులపై సర్వే
సాక్షి, పెద్దపల్లి: పూర్తిగా నిర్మూలించినట్లు భావిస్తున్న కుష్ఠు బయటపడుతోంది. నియంత్రిస్తున్నామనుకుంటున్న క్షయ విస్తరిస్తోంది. చికిత్సతో నయమయ్యే ఈ రెండు అంటువ్యాధులు పూర్తిగా నియంత్రించవచ్చు. నిర్మూళన కోసం ప్రత్యేక వ్యవస్థలు కృషి చేస్తున్నప్పటికీ.. కొత్త కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఏకకాలంలో ఈ రెండు వ్యాధులపై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు సర్వే చేపట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. పక్షం రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్న ఈ ప్రక్రియకు కసరత్తు చేపట్టారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు పూర్తి ఆరోగ్యం తో ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అసంక్రమిత వ్యాధులపై సర్వే నిర్వహించాలని నిర్ణయించిం ది. పెద్దపల్లి జిల్లాలో ఈనెల 26 నుంచి సర్వే ప్రారంభించనున్నారు. సెప్టెంబర్12వరకు కొనసాగనుంది. ప్రతీరోజు ఉదయం పూట 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఏఎన్ఎంలు.. మగ వలంటీర్లు ఇంటింటా తిరిగి వివరాలు సేకరించనున్నారు. ఈ విషయమై ఇప్పటికే శిక్షణకూడా పూర్తి చేశారు. నెలకు 100కుపైగా క్షయ కేసులు ఇటీవల క్షయ కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు గుర్తించారు. జిల్లాలో ఇప్పటికే 1000కిపైగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. నెలకు 100కుపైగా కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. గాలితోనే వచ్చే ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. కుష్ఠుతో పాటే క్షయ రోగుల సంఖ్య పక్కగా లెక్కతీస్తే చికిత్స అందించవచ్చన్నది వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆలోచన. జిల్లాలో 49 కుష్ఠు వ్యాధి కేసులు పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 49 కుష్ఠు వ్యాధి కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఇంకా అక్కడక్కడ కుష్ఠు వ్యాధి కేసులు ఉండచ్చేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. శ్వాసతో వ్యాప్తిచెందడానికి ఆస్కారమున్న వ్యాధికి ప్రాథమికస్థాయిలో చికిత్స అందించకపోతే... శరీరంలో ముక్కు, కాలి, చేతి వేళ్లు కొరికేసినట్లు కరిగిపోతాయి. వైకల్యం ఏర్పడుతుంది. పుండ్లతో ఇబ్బందిగా మారుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకయ్యే వ్యాధిని నిలువరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏకకాలంలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. సర్వేకు 1258 మంది.. కుష్ఠు, క్షయ రోగుల లెక్క తేల్చడానికి ఏకకాలంలో సర్వే చేపట్టడానికి ఒక ఆశా కార్యకర్త, మరో పురుషుడిని కార్యకర్తతో ఒక బృందంగా ఏర్పాటు చేశారు. ప్రతీ రోజూ వీరి పరిధిలోని 20నివాసాలు సందర్శించి, పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు క్షుణ్ణంగా పరీక్షించి వివరాలు సేకరించాలి. జిల్లావ్యాప్తంగా సుమారు 8లక్షల జనాభా ఉండగా, ఇందులో 2లక్షల పైచిలుకు నివాసాలున్నాయి. రోజువారీగా పీహెచ్‌సీలకు అనుమానస్పద కేసుల వివరాల సమాచారాన్ని తెలియజేయాలి. జిల్లా వ్యాప్తంగా 514 మంది ఆశా కార్యకర్తలు ఉండగా, వారికి సహాయకులుగా మరో 514 మంది పురుషులను బృందాలుగా నియమించారు. వీ రిపై 230 ఏఎన్ఎంలు పర్యవేక్షణ చేపట్టనున్నా రు. సర్వే చేసే సిబ్బందికి ఒక్కోక్కరికి రూ.75 చొప్పున పారితోషికం అందించనున్నారు. ఇలా పరీక్షిస్తుంది బృందం సర్వే కోసం అధికారులు ఏర్పాటు చేసిన బృందం ఒక ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తారు.ఇప్పటికే కుటుంబసభ్యుల వివరాలు ఆరోగ్య కార్యకర్త వద్ద సిద్ధంగా ఉండడంతో వాటికి ఆధార్‌నంబర్లు జోడించాల్సిఉంది. ఆశా కార్యకర్త మహిళలను, స్వచ్ఛంద కార్యకర్త పురుషుల దేహంపై క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఎక్కడన్నా మచ్చలున్నాయా అన్నది చూస్తారు. ఒకవేళ కుష్ఠి వ్యాధికి ప్రాథమిక లక్షణమైన తెల్లమచ్చలు వీపుపై ఉంటే తెలుసుకోవడం కష్టం. అందుకే నిశిత పరిశీలన చేస్తారు. మచ్చలు ఉన్నట్లు గుర్తిస్తే, వారి వివరాలను పీహెచ్‌సీకి అందజేస్తారు. వైద్యులు మరోసారి పరీక్షించిన తర్వాత నిర్ధారిస్తే చికిత్స ప్రారంభిస్తారు. ఇక ‘క్షయ’ వ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. ఒకవేళ రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం జ్వరంవంటి లక్షణాలు ఉంటే వారికి తెమడ తీయడానికి ఒక డబ్బా ఇస్తారు. ఆ డబ్బాలో సేకరించిన తెమడను క్షయ నియంత్రణ విభాగానికి చెందిన డీఎంసీల్లో పరీక్షలు చేపడుతారు.వ్యాధి నిర్ధారణ అయితే వైద్యుల సమక్షంలో చికిత్స ప్రారంభించే ప్రణాళిక రూపొందిస్తారు. సర్వేతో కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి కుష్ఠు, క్షయ వ్యాధులపై ఏకకాలంలో సర్వే నిర్వహించడం ద్వారా కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి. సోమవారం నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్వే చేపట్టాల్సిన తీరుపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చాం. సర్వే బృందాలకు ప్రజలు సహకరించాలి. – డాక్టర్ ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్ఓ, పెద్దపల్లి -
విస్తరిస్తున్న కుష్ఠు
సాక్షి, ఆసిఫాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుష్ఠు వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. కుష్ఠు వ్యాధిగ్రస్తులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో కుమురం భీం రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. దీనికి తోడు జిల్లాలో క్షయ వ్యాధి సైతం ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ అసంక్రమిక వ్యాధులను గు ర్తించిన ప్రభుత్వం నివారణ దిశగా కృషి చేస్తోంది. కుష్ఠు, క్షయ వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేటి నుంచి సెప్టెంబర్ 13 వరకూ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే శిక్షణ, ఇతర ఏర్పాట్లను పూర్తి చేశారు. గతంతో పోల్చితే క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తుల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. దీని నివారణకు ప్రభుత్వం ఇప్పటికే పలురకాల కార్యక్రమాలను చేపట్టింది. ఖరీదైన మందులను కూడా రోగులకు అందిస్తుంది. కొందరు మధ్యలోనే మందులను మానేస్తుండడంతో వ్యాధి తీవ్రమవుతుందని జిల్లా అధికారులు పేర్కొం టున్నారు. మధ్యలో మానేసిన వారిని గుర్తించి తిరిగి మందులు వాడేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రధానంగా ప్రవేట్ ఆసుపత్రుల్లో చికి త్స పొందుతున్న వారి వివరాలను తెలియజేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రవేట్ వైద్యులు పట్టించుకోవడం లేదు. తాజాగా నిర్వహించే సర్వే ద్వారా జిల్లాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పూ ర్తిగా తెలియనుంది. గతంలో నిర్వహించిన లెక్క ల ప్రకారం జిల్లాలో 130 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు, 690 మంది క్షయ రోగులు ఉన్నారు. సర్వేకు 760 బృందాలు.. ఇంటింటా సర్వే నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 760 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక ఆశా కార్యకర్తతో పాటు స్వచ్ఛంద సంస్థ కార్యకర్త(పురుషుడు)తో ఒక బృందాన్ని ఏర్పాటు చేశా రు. వీరు ప్రతిరోజూ ఉదయం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకూ తమ పరిధిలో ఉం డే 20 నివాసాలను సందర్శిస్తారు. ఆ నివాసాల్లో ఉన్నవారి పిల్లలు మెదలు వృద్ధుల వరకూ అం దరినీ క్షుణ్ణంగా పరీక్షించి వివరాలు సేకరిస్తారు .జిల్లాలో ఉన్న 760 ఆశా కార్యకర్తలు, 114 ఏ ఎ న్‌ఎంలు, 35 సూపర్వైజర్లు ఈ సర్వేలో భాగసా ట్వ టములవుతున్నారు. బృందా లను పెంచే ఆస్కారముందని అధికారులు చె బుతున్నారు. సర్వే సిబ్బందికి ఒక్కొక్కరికీ రోజు కు రూ.75 చొప్పున పారితోషకం అందించనున్నారు. ఎలా పరీక్షిస్తారంటే.. మొదట కుటుంబ సభ్యుల వివరాలు సేకరి స్తారు. ఆశా కార్యకర్త మహిళను, స్వచ్ఛంద కా ర్యకర్త పురుషుల దేహాన్ని పరీక్షిస్తారు. ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా అనేది చూస్తారు. ఒకవేళ కు ష్ఠు ప్రాథమిక లక్షణాలైన తెల్లమచ్చలు వీపుపై ఉంటే తెలుసుకోవడం కష్టం. ఈ మేరకు నిశీతంగా పరిశీలిస్తారు. మచ్చలు ఉన్నట్లు గుర్తిస్తే వివరాలను సదరు పీహెచ్‌సీకి నివేదిస్తారు. వైద్యులు మరోసారి పరీక్షించి నిర్దారణ చేస్తే చికిత్స ప్రారంభిస్తారు. ఇక క్షయ వ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం జ్వరం వంటి లక్షణాలు ఉంటే తెమడ తీయడానికి ఒక డబ్బాను ఇసా ్తరు. అందులో సేకరించిన తెమడను క్షయ నియంత్రణ విభాగానికి చెందిన ల్యాబ్‌లో పరీక్షస్తారు. పెరుగుతున్న కేసులు.. ఇటీవల కాలంలో క్షయ కేసులు పెరుగుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. గతంతో పోల్చితే నిర్దేశించిన లక్ష్యం మేరకు పరీక్షలు నిర్వహిస్తుండగా కేసులు బయటపడుతున్నాయి. గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కుష్ఠుతో పాటు క్షయ రోగుల లెక్క తెలిస్తే చికిత్స అందించవచ్చని అధికారులు తెలుపుతున్నారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు రక్తంతో కూడిన తెమడ రావడం క్షయ వ్యాధి లక్షణాలు. వీటికి సంబంధించిన లక్షణాలు బయటపడితే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మందులు తీసుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు రోజూ మందులతో పాటు పోషకాహారం తీసుకోవాలి. ఇంటింటా సర్వే నిర్వహిస్తాం నేటి నుంచి సెప్టెంబర్ 13 వరకూ ప్రతి ఇంటా సర్వే నిర్వహిస్తాం. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కుష్ఠు, క్షయ వ్యాధిపై సర్వే చేయాలని తెలిపాం. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో బృందాలు సర్వే చేస్తాయి. ఈ బృందాలను పర్యవేక్షించడానికి సూపర్వైజర్లు ఉంటారు. చికిత్సతో నయమయ్యో వ్యాధులు, అవగాహణలోపంతో బయటపడడం లేదు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. – కుమురం బాలు, డీఎంహెచ్‌వో -
నిజమేనా ?!
సాక్షి, పాలమూరు: జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న కుష్టు వ్యాధి(లెప్రసీ) సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమానించినట్లే వేగంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. అంతరించి పోయిందనుకున్న తరుణంలో చాపకింద నీరులా వ్యాధి విస్తరిస్తున్నట్లు తేలుతుండడంతో గమనార్హం. గతనెల 28వ తేదీన సర్వే ప్రారంభించగా ఇప్పటివరకు(గురువారం వరకు) 3,89,602 గృహాలకు గాను 2,70,885 గృహాల్లో సిబ్బంది సర్వే పూర్తి చేశారు. ఈ సందర్భంగా 2,648 అనుమానిత కేసులను గుర్తించడం గమనార్హం. ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే నిరక్షరాస్యులు, అవగహన లేని వారి కారణంగా వ్యాధి జిల్లాలో పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. కాగా, అనుమానితుల కేసులన్నీ కుష్టు వ్యాధిగా భావించలేమని.. ప్రత్యేక వైద్యపరీక్షల్లో ఇందులో ఎక్కువ శాతం సాధారణ చర్మ వ్యాధులుగా తేలే అవకాశముందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. నిఘా కరువవడంతో... కుష్టు వ్యాధి నివారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం 2010 ముందు వరకు పని చేసింది. ప్రపంచ దేశాల్లోకెల్లా మన దేశంలోనే అధికంగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ద్వారా వెల్లడైంది. దీంతో నివారణకు కేంద్ర ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంతో వ్యాధి విస్తృతి గణనీయంగా తగ్గిపోయింది. ప్రతి పది వేల మందిలో ఒక్క శాతానికి వ్యాధి(ప్రివిలెన్స్ రే టు) తగ్గింది. దీంతో రాష్ట్రంలో కుష్టు వ్యాధి విభాగాన్ని ప్రజారోగ్య శాఖలో విలీనం చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో నిఘా లేక నివారణ చర్యలు కొరవడ్డాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ లెప్రసీ బృందం ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న సర్వేలో వ్యాధి విస్తరిస్తున్నట్లు గుర్తించారు. దేశ ప్రివిలెన్స్ రేటు 2.3 శాతానికి చేరడంతో మేల్కొన్న కేంద్రం తాజాగా సర్వేకు ఆదేశించింది. వందల్లో అనుమానిత కేసులు జిల్లాలో వందల సంఖ్యలో కుష్టు వ్యాధి అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. సర్వే ఈనెల 4 వరకు కొనసాగించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని 70శాతం కుటుంబాల్లో ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించాయి. జిల్లాలో సగటున రోజుకు 100నుంచి 120మధ్యలో అనుమానిత కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. వీటిలో సగానికి పైగా చర్మవ్యాధులు, పుండ్లు, గాయాలైన మచ్చలు ఉంటున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వెనుకబడిన మండలాల్లో వ్యాధి తీవ్రత బాగా ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఈ సర్వే ద్వారా తేలిన అనుమానిత కేసులను ఈనెల 5నుంచి లెప్రసీ వైద్యుల బృందం ప్రత్యేకంగా పరిశీలించనుంది. పెరగనున్న రోగుల సంఖ్య అక్టోబర్ 22నుంచి ప్రారంభమైన సర్వే ఈనెల 4వ తేదీతో ముగుస్తుంది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు, అంగన్ వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ఉదయం 6 నుంచి ఉదయం 9గంటల వరకు సర్వే చేస్తున్నా రు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 20 ఇల్లు, అర్భన్ ప్రాంతాల్లో 25ఇళ్లను పరిశీలించడానికి 3,891 మందితో 1,510 బృందాలను ఏర్పాటుచేశారు. ఇంట్లో ఉన్న ప్రతీ ఒక్కరిని శరీరంపై ఏమైనా తెల్లమచ్చలు, రాగివర్ణపు మచ్చలు ఉంటే గుర్తిస్తు న్నారు. చర్మం రంగు మారడం, మొద్దుబారి పోవడం, స్పర్శ తెలియకపోవడం వంటి సమస్యలు ఉంటే ప్రత్యేకంగా నమోదు చేసుకుంటున్నారు. సర్వేలో భాగంగా మహిళ, పురుష సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందాలు ప్రతీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేస్తున్నారు. అక్టోబర్ 22నుంచి నిర్వహిస్తున్న కుష్టు గుర్తింపు సర్వేకు ముందు ఈ వ్యాధి బాధితులు జిల్లాలో 74మంది ఉండగా ఈ సర్వే అనంతరం గణనీయంగా పెరిగే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 2,648 అనుమానిత కేసులను గుర్తించారు. వీరందరికీ ఈనెల 5న వైద్య బృందాలు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయనున్నాయి. ఈ పరీక్షల సందర్భంగా ఎక్కువ శాతం సాధారణ చర్మవ్యాధులుగా తేలుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే నిజమైతే మంచిదే కానీ.. వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే మాత్రం నివారణ చర్యల్లో వేగం పెంచాల్సి ఉంటుంది. ఇలా వ్యాపిస్తుంది కుష్టు వ్యాధి ‘మైక్రో బ్యాక్టీరియం లెప్రీ’ సూక్ష్మ క్రిమి ద్వారా సంక్రమిస్తోంది. ఇది చాలా సందర్భాల్లో అంటువ్యాధి. వ్యాధి సోకిన తర్వాత దాని ప్రభావం రెండు నుంచి మూడేళ్ల వరకు కనిపించదు. వచ్చిన వెంటనే గుర్తించకపోతే నష్టం జరుగుతుంది. వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, లాలాజలం తుంపర్ల ద్వారా ఇతరులకు కూడా సోకుతుంది. రోగితో సన్నిహితంగా మెలిగినా వచ్చే అవకాశముంది. వయస్సు భేదం లేకుండా అందరికీ వ్యాపించే కుష్టు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా వ్యాపి చెందే అవకాశముంది. విస్తృత ప్రచారం చేస్తాం జిల్లా వ్యాప్తంగా కుష్టు వ్యాధి పై విస్తృతంగా ప్రచారం చేసి అపోహలను తొలగించడానికి కృషి చేస్తాం. ప్రస్తుతం చేపట్టిన సర్వే ఆదివారంతో ముగియనుంది. ఎన్ని అనుమానిత కేసులు వస్తాయి, వాటిలో ఎన్ని నిర్ధారణ అయితాయో చూడాల్సి ఉంది. అనుమానిత కేసులు అధికంగా వస్తున్నా ప్రత్యేక పరిశీలనలో అవి సాధారణ చర్మవ్యాధులుగా వెల్లడవుతాయని నమ్మకం. – డాక్టర్ రజిని, డీఎంహెచ్ఓ -
మహమ్మారి పడగ
జిల్లాలో 290 మంది కుషు్ఠవ్యాధిగ్రస్తులు అందులో చిన్నారులు 36 మంది భర్తీకాని వైద్యుల పోస్టులు జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వైద్యం కోసం పాలకులు రూ.కోట్లు వెచ్చిస్తున్నామని చెబుతున్నా.. ఆచరణలో అరకొర సౌకర్యాలు, చాలని వైద్య సిబ్బందితో రోగులకు సేవలందక వ్యాధి ప్రభావం పెరుగుతోంది. కాకినాడ వైద్యం : ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం జిల్లాలో ఫిబ్రవరి నెలాఖరుకు 290 మంది కుషు్ఠవ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇందులో 36 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం పదివేల మంది జనాభాకు 0.53 శాతం మందికి వ్యాధి తీవ్రతను తగ్గించినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. 1987 సంవత్సరం నాటికి జిల్లాలో 26,028 వ్యాధిగ్రస్తులు ఉండగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు 95,966 మందికి చికిత్స అందించినట్టు అధికారులు చెబుతున్నారు. రోగులకు మల్టీ డ్రగ్ థెరపీ (ఎండీటీ) చికిత్స అందించడంతో వ్యాధి తీవ్రతను తగ్గించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. . 2015–16 సంవత్సరంలో జిల్లాలో 390 వ్యాధిగ్రస్తులుండగా, ఇందులో 48 మంది చిన్నారులు ఉన్నారు. ఈ వ్యాధి తీవ్రతతో అంగవైకల్యానికి గురైన 1,853 మంది బాధితులకు సామాజిక పింఛన్లు, 999 మందికి వృద్ధాప్య పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. ఇదికాకుండా 2,095 మందికి అంత్యోదయ కార్డులను మంజూరు చేసింది. వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో 16 కాలనీలను నిర్మించింది. వ్యాధి నియంత్రణ, గుర్తింపు కోసం పారా మెడికల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి కుషు్ఠవ్యాధిగ్రస్తుల సంఖ్యను గుర్తించాలి. అయితే ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో బాధితులకు సకాలంలో సేవలు అందించలేకపోతున్నారు. ఫలితంగా పూర్తిగా తగ్గిపోయిందనుకున్న కుషు్ఠవ్యాధి మెల్లమెల్లగా విజృంభిస్తోంది. అరకొర సిబ్బందితో వైద్యసేవలు జిల్లాలో కుషు్ఠవ్యాధి నిర్మూలన కోసం 35 మంది డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్లు పని చేయాల్సి ఉండగా, 23 మందితోనే గత కొన్నేళ్లుగా నెట్టుకొస్తున్నారు. అలాగే 72 మంది అసిస్టెంట్ పారా మెడికల్ ఆఫీసర్స్ పని చేయాల్సి ఉండగా 24 మందితోనే రోగులకు సేవలు అందిస్తున్నారు. డీపీఎంవోలు, ఏపీఎంలు జిల్లాలో ఉన్న 28 ప్రధాన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. 4–5 పీహెచ్‌సీలను కలిపి ఒక మెయి¯ŒS పీహెచ్సీగా కుషు్ఠవ్యాధిగ్రస్తులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పారా మెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ కాకపోవడంతో గ్రామస్థాయిలో సర్వే చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా బాధితుల సంఖ్య నానాటికీ పెరిగే అవకాశం ఉంది. తక్షణం సిబ్బంది భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలోని కుషు్ఠవ్యాధి వార్డు అధ్వానంగా తయారైంది. ఇక్కడ బెడ్స్ రోగులు పడుకునేందుకు అనువుగా లేవు. వార్డులో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. చికిత్స ఇలా స్టేజ్–1 పీబీ (పోసిబుల్ బాసీ) ∙ 1–5 మచ్చలు, చర్మపు పూత వస్తే ఆరు నెలల చికిత్స మల్టీ డ్రగ్ థెరఫీ (ఎండీటీ) అందిస్తారు. ఇందులో రిపాంసిన్, లేంప్రిన్, దార్సూ¯ŒS అనే మూడు మందులు ఉంటాయి. వీటినే ఎండీటీ అంటారు. స్టేజ్–2 మల్టీబాసీ ∙ ఆరు అంతకు పైన వచ్చే మచ్చలు, 2 పైన నరాలకు వ్యాధిసోకితే 12 నెలల పాటు చికిత్స అందిస్తారు. వీరికి కూడా ఎండీటీ చికిత్స అందిస్తారు. ∙ కుషు్ఠవ్యాధి నిర్మూలనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి విజయవాడ ఏపీఎస్ఎల్వోకు డ్రగ్స్ సరఫరా అవుతాయి. విజయవాడ నుంచి ప్రతి మూడు నెలలకోసారి జిల్లాకు మందులు సరఫరా అవుతుంటాయి. సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకోవాలి వ్యాధి తీవ్రతను గుర్తించేందుకు ప్రభుత్వం పారా మెడికల్ వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి. గతంలో సర్వేలు చేపట్టేవారు. ప్రస్తుతం అప్పుడప్పుడూ నిర్వహిస్తున్నారు. నేను నలభై సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతున్నా. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నా. వార్డులో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలి. – జి.భద్రరావు, బాధితుడు, జగ్గంపేట అపోహలు విడనాడాలి కుషు్ఠవ్యాధి పట్ల అపోహలు వీడాలి. ఈ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. ప్రజల్లో ముఖ్యంగా ఏజెన్సీలో కుషు్ఠవ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు జనవరి 30వ తేదీన స్పర్శ అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 32 కేసులను గుర్తించాం. ఈ ఏడాది పాక్షిక అంగవైకల్యం కలిగిన 27 మందికి రీకనస్ట్రక్టివ్ సర్జరీ ద్వారా రోగాన్ని నయం చేశాం. అర్హులైన వారికి సామాజిక పింఛన్లను అందిస్తున్నాం. – డాక్టర్ ఎం.పవ¯ŒSకుమార్, జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి(ఎయిడ్స్, లెప్రసీ) -
రైల్వే కోడూరులో కుష్ఠు రోగుల ఆందోళన
రైల్వే కోడూరు: ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్లను సాంకేతిక కారణాలతో తీసేస్తున్నారంటూ వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు లో కుష్టురోగులు మంగళవారం ఎంపీడీవో ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. రైల్వే కోడూరు జ్యోతి కాలనీలో కుష్టు రోగులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. వారు దాదాపు నలభై ఏళ్ల నుంచి పింఛన్లు తీసుకుంటున్నారు. ఐరీష్‌లో వేలి ముద్రలు పడటం లేదని వారి పింఛన్లు అధికారులు తొలగించారు. దీంతో ఆగ్రహం చెందిన వారు మంగళవారం ఉదయం ఎంపీడీవో ఆఫీసు ఎదటు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుష్టు రోగులైన మాకు వేలిముద్రలు పడటం లేదని పింఛన్లు తొలగించడం అన్యాయమని వారు వాపోయారు.