విస్తరిస్తున్న కుష్ఠు | Leprosy Is Expanding In Joint Adilabad District | Sakshi
Sakshi News home page

ఆందోళనకర స్థాయిలో కుష్ఠు, క్షయ

Published Mon, Aug 26 2019 10:42 AM | Last Updated on Mon, Aug 26 2019 10:47 AM

Leprosy Is Expanding In Joint Adilabad District - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌:  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కుష్ఠు వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. కుష్ఠు వ్యాధిగ్రస్తులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో కుమురం భీం రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. దీనికి తోడు జిల్లాలో క్షయ వ్యాధి సైతం ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ అసంక్రమిక వ్యాధులను గు ర్తించిన ప్రభుత్వం నివారణ దిశగా కృషి చేస్తోంది. కుష్ఠు, క్షయ వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేటి నుంచి సెప్టెంబర్‌ 13 వరకూ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే శిక్షణ, ఇతర ఏర్పాట్లను పూర్తి చేశారు.      

గతంతో పోల్చితే క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తుల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. దీని నివారణకు ప్రభుత్వం ఇప్పటికే పలురకాల కార్యక్రమాలను చేపట్టింది. ఖరీదైన మందులను కూడా రోగులకు అందిస్తుంది. కొందరు మధ్యలోనే మందులను మానేస్తుండడంతో వ్యాధి తీవ్రమవుతుందని జిల్లా అధికారులు పేర్కొం టున్నారు. మధ్యలో మానేసిన వారిని గుర్తించి తిరిగి మందులు వాడేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రధానంగా ప్రవేట్‌ ఆసుపత్రుల్లో చికి త్స పొందుతున్న వారి వివరాలను తెలియజేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రవేట్‌ వైద్యులు పట్టించుకోవడం లేదు. తాజాగా నిర్వహించే సర్వే ద్వారా జిల్లాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పూ ర్తిగా తెలియనుంది. గతంలో నిర్వహించిన లెక్క ల ప్రకారం జిల్లాలో 130 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు, 690 మంది క్షయ రోగులు ఉన్నారు.  

సర్వేకు 760 బృందాలు..
ఇంటింటా సర్వే నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 760 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక ఆశా కార్యకర్తతో పాటు స్వచ్ఛంద సంస్థ కార్యకర్త(పురుషుడు)తో ఒక బృందాన్ని ఏర్పాటు చేశా రు. వీరు ప్రతిరోజూ ఉదయం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకూ తమ పరిధిలో ఉం డే 20 నివాసాలను సందర్శిస్తారు. ఆ నివాసాల్లో ఉన్నవారి పిల్లలు మెదలు వృద్ధుల వరకూ అం దరినీ క్షుణ్ణంగా పరీక్షించి వివరాలు సేకరిస్తారు  .జిల్లాలో ఉన్న 760 ఆశా కార్యకర్తలు, 114 ఏ ఎ న్‌ఎంలు, 35 సూపర్‌వైజర్లు ఈ సర్వేలో భాగసా ట్వ టములవుతున్నారు. బృందా లను పెంచే ఆస్కారముందని అధికారులు చె బుతున్నారు. సర్వే సిబ్బందికి ఒక్కొక్కరికీ రోజు కు రూ.75 చొప్పున పారితోషకం అందించనున్నారు.

ఎలా పరీక్షిస్తారంటే..
మొదట కుటుంబ సభ్యుల వివరాలు సేకరి స్తారు. ఆశా కార్యకర్త మహిళను, స్వచ్ఛంద కా ర్యకర్త పురుషుల దేహాన్ని పరీక్షిస్తారు. ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా అనేది చూస్తారు. ఒకవేళ కు ష్ఠు ప్రాథమిక లక్షణాలైన తెల్లమచ్చలు వీపుపై ఉంటే తెలుసుకోవడం కష్టం. ఈ మేరకు నిశీతంగా పరిశీలిస్తారు. మచ్చలు ఉన్నట్లు గుర్తిస్తే వివరాలను సదరు పీహెచ్‌సీకి నివేదిస్తారు. వైద్యులు మరోసారి పరీక్షించి నిర్దారణ చేస్తే చికిత్స ప్రారంభిస్తారు. ఇక క్షయ వ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం జ్వరం వంటి లక్షణాలు ఉంటే తెమడ తీయడానికి ఒక డబ్బాను ఇసా ్తరు. అందులో సేకరించిన తెమడను క్షయ నియంత్రణ విభాగానికి చెందిన ల్యాబ్‌లో పరీక్షస్తారు. 

పెరుగుతున్న కేసులు..
ఇటీవల కాలంలో క్షయ కేసులు పెరుగుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. గతంతో పోల్చితే నిర్దేశించిన లక్ష్యం మేరకు పరీక్షలు నిర్వహిస్తుండగా కేసులు బయటపడుతున్నాయి. గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కుష్ఠుతో పాటు క్షయ రోగుల లెక్క తెలిస్తే చికిత్స అందించవచ్చని అధికారులు తెలుపుతున్నారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు రక్తంతో కూడిన తెమడ రావడం క్షయ వ్యాధి లక్షణాలు. వీటికి సంబంధించిన లక్షణాలు బయటపడితే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మందులు తీసుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు రోజూ మందులతో పాటు పోషకాహారం తీసుకోవాలి. 

ఇంటింటా సర్వే నిర్వహిస్తాం 
నేటి నుంచి సెప్టెంబర్‌ 13 వరకూ ప్రతి ఇంటా సర్వే నిర్వహిస్తాం. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కుష్ఠు, క్షయ వ్యాధిపై సర్వే చేయాలని తెలిపాం. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో బృందాలు సర్వే చేస్తాయి. ఈ బృందాలను పర్యవేక్షించడానికి సూపర్‌వైజర్లు ఉంటారు. చికిత్సతో నయమయ్యో వ్యాధులు, అవగాహణలోపంతో బయటపడడం లేదు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం.
– కుమురం బాలు, డీఎంహెచ్‌వో  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement