
ఆర్డీవో దత్తు కాళ్లు పట్టుకున్న సర్పంచ్ అహాల్యాదేవి
సాక్షి, ఆసిఫాబాద్: మండల కేంద్రం మీదుగా చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని అహాల్యాదేవి, బాధితురాలు వందన శుక్రవారం ఆర్డీవో సిడాం దత్తు కాళ్లపై పడి వేడుకున్నారు.
రోడ్డు విస్తరణలో ఉన్న కొద్దిపాటి గూడు కూడా కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ ఆదీనంలో ఏడెకరాల ప్రభుత్వ మిగులు భూమిని రోడ్డు విస్తరణలో కోల్పోతున్న వాళ్లకు ఇళ్లు, దుకాణాలకు కేటాయించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
చదవండి: టూర్‌లకు డిమాండ్.. హైదరాబాద్ నుంచి పారిస్, లండన్, స్విట్జర్లాండ్‌కు
Comments
Please login to add a commentAdd a comment