Revenue Division Officer
-
కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఆర్డీవో(రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్) వ్యవస్థను రద్దు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, తర్వాత వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో త్వరలో ఆర్డీవో వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన రెవెన్యూ డివిజన్ అధికారి పోస్ట్ కాలగర్భంలో కలిసిపోనుంది. ఇప్పటికే VRA, VRO వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా రెవెన్యూ డివిజన్ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇటీవల కొంత మందికి ప్రమోషన్ల కూడా ఇచ్చారు. దాదాపు 90 మంది వరకు ఆర్డీవోలు పనిచేస్తున్నారు. వీరందరికి కొత్త పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. త్వరలో ఆర్డీవో వ్యవస్థను తీసివేసి వీరిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా నియమించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆర్డీవోల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వాటికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో 300 బెడ్స్ ఉన్నాయి. కాగా, ఆస్పత్రికి వచ్చే రోగికి వైద్య సేవలు ఎక్కడ అందుతున్నాయి?. వైద్య సేవలు అందని పక్షంలో ఎవరిని సంప్రదించాలో తెలియక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికి ఆర్డీవోలను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ శాసన మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. కాగా, రాష్ట్రంలో సర్కారు దవాఖానాలకు పట్టిన నిర్లక్ష్యం జబ్బుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త ట్రీట్మెంట్ ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇది కూడా చదవండి: నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా? -
న్యాయం చేయాలని ఆర్డీవో కాళ్లు మొక్కిన మహిళా సర్పంచ్
సాక్షి, ఆసిఫాబాద్: మండల కేంద్రం మీదుగా చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని అహాల్యాదేవి, బాధితురాలు వందన శుక్రవారం ఆర్డీవో సిడాం దత్తు కాళ్లపై పడి వేడుకున్నారు. రోడ్డు విస్తరణలో ఉన్న కొద్దిపాటి గూడు కూడా కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ ఆదీనంలో ఏడెకరాల ప్రభుత్వ మిగులు భూమిని రోడ్డు విస్తరణలో కోల్పోతున్న వాళ్లకు ఇళ్లు, దుకాణాలకు కేటాయించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. చదవండి: టూర్లకు డిమాండ్.. హైదరాబాద్ నుంచి పారిస్, లండన్, స్విట్జర్లాండ్‌కు -
బాధిత దళితులకు అండగా ఉంటాం
ఆర్డీఓ విశ్వేశ్వరరావు రెండు వర్గాలకు కౌన్సెలింగ్ తుని రూరల్ : బాధిత దళితులకు అధికార యంత్రాంగం అండగా నిలుస్తుందని పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారి వి.విశ్వేశ్వరరావు అన్నారు. శనివారం సీఐ చెన్నకేశవరావు, తహసీల్దార్ సూర్యనారాయణలతో కలసి ఆయన గ్రామంలో పర్యటించారు. దాడి ఘటనపై పంచాయతీ కార్యాలయంలో నిందుతుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో సమావేశమై ఇలాంటి దురాచారాలకు పాల్పడితే పుట్టగతుల్లేకుండా పోతారని, యువతను అదుపు చేసే బాధ్యత ఆయా తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. దళితులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలకు గురవుతారని హెచ్చరించారు. అంతకు ముందు బాధితులు, దళిత నాయకులతో చర్చించారు. అన్నిరకాలుగా బాధితులను ఆధుకుంటామని, రక్షణ కల్పించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి పనుల కల్పన, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. నష్టపరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. దాడికి పాల్పడినవారందరినీ అదుపులోకి తీసుకుని కోర్టుకు అప్పగిస్తామని సీఐ అన్నారు. మాల మహానాడు జాతీయ అధికార ప్రతినిధి ధనరాశి శ్యాంసుందర్, నాయకులు శివకోటి ప్రకాష్, గారా శ్రీనివాస్, కృపానందం, ధారకొండ వెంకటరమణ పాల్గొన్నారు.