ఆర్డీఓ విశ్వేశ్వరరావు
రెండు వర్గాలకు కౌన్సెలింగ్
తుని రూరల్ : బాధిత దళితులకు అధికార యంత్రాంగం అండగా నిలుస్తుందని పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారి వి.విశ్వేశ్వరరావు అన్నారు. శనివారం సీఐ చెన్నకేశవరావు, తహసీల్దార్ సూర్యనారాయణలతో కలసి ఆయన గ్రామంలో పర్యటించారు. దాడి ఘటనపై పంచాయతీ కార్యాలయంలో నిందుతుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో సమావేశమై ఇలాంటి దురాచారాలకు పాల్పడితే పుట్టగతుల్లేకుండా పోతారని, యువతను అదుపు చేసే బాధ్యత ఆయా తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు.
దళితులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలకు గురవుతారని హెచ్చరించారు. అంతకు ముందు బాధితులు, దళిత నాయకులతో చర్చించారు. అన్నిరకాలుగా బాధితులను ఆధుకుంటామని, రక్షణ కల్పించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి పనుల కల్పన, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. నష్టపరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. దాడికి పాల్పడినవారందరినీ అదుపులోకి తీసుకుని కోర్టుకు అప్పగిస్తామని సీఐ అన్నారు. మాల మహానాడు జాతీయ అధికార ప్రతినిధి ధనరాశి శ్యాంసుందర్, నాయకులు శివకోటి ప్రకాష్, గారా శ్రీనివాస్, కృపానందం, ధారకొండ వెంకటరమణ పాల్గొన్నారు.
బాధిత దళితులకు అండగా ఉంటాం
Published Sun, Apr 10 2016 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM
Advertisement