asifabad district
-
ఎక్కడ ఆ పులి.. ఇక్కడ ఆడ బెబ్బులి..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్–టి మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే పరిసర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. అయితే, అదే మండలంలోని పులిదాడి జరిగిన దుబ్బగూడ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఏమాత్రం వణుకులేకుండా ఎద్దుల బండిని తోలుతూ వ్యవసాయ పనులకు వెళ్తుండటం ఆమె ధైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి అలజడి
-
‘దారి’లేక.. ఆస్పత్రికి చేరలేక
ఆసిఫాబాద్ రూరల్/నెన్నెల, వేములవాడ రూరల్: ‘దారీ’తెన్నూ లేని పల్లెలు.. వాగులు దాటి వైద్యం అందుకోలేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరుచోట్ల రోడ్డు సరిగా లేక, అంబులెన్స్‌ల రాకకు వాగులు అడ్డొచి్చన క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీ దినోత్సవం నాడే ఓ ఆదివాసీ మహిళకు పుట్టెడు గర్భశోకం మిగిలింది. కడుపులో ఇద్దరు బిడ్డలను మోస్తూ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తూ.. వాగు ఒడ్డునే బిడ్డను ప్రసవించింది. పుట్టిన గంటకే బిడ్డ కన్నుమూసింది. కడుపులోని మరో బిడ్డతో ఆ మహిళ చికిత్స పొందుతోంది. ఈ దారుణం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా, మరో రెండు ఘటనల్లో ఓ యువకుడు, వృద్ధురాలు సైతం సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు ప్రాణాలు మోస్తూ.. ఆసిఫాబాద్ మండలం బండగూడకు చెందిన ఆత్రం కొండు, ఆత్రం ధర్మూబాయి దంపతులు రైతులు. వీరికి రెండేళ్ల పాప ఉండగా.. ప్రస్తుతం ధర్మూబాయి ఏడు నెలల గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. గ్రామానికి వెళ్లే దారిలో వాగు అడ్డుగా ఉండడంతో 108 వాహనం వాగు ఒడ్డు వరకే వచి్చంది. స్థానికులు గర్భిణిని గ్రామం నుంచి కిలోమీటరున్నర దూరం నడిపించి వాగు దాటించారు. ఆ సమయంలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో భయాందోళనకు గురైన ధర్మూబాయికి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.ఈ క్రమంలోనే వాగు ఒడ్డున ఆడశిశువుకు జన్మనిచి్చంది. కడుపులో మరో శిశువు ఉన్నట్లు గుర్తించిన 108 సిబ్బంది తల్లీబిడ్డను ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే పుట్టిన శిశువు మృతిచెందింది. కడుపులోని మరో శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని అదే వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శస్త్రచికిత్స చేసి ఆ బిడ్డను కాపాడారు. పుట్టిన శిశువు బరువు 800 గ్రాములే ఉండటంతో ఎన్‌ఎన్‌సీలో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు ఎంసీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ భీష్మ తెలిపారు. కాగా గతేడాది వర్షాకాలంలో ఈ వాగు దాటుతున్న సమయంలో వరదలో కొట్టుకుపోయి ఓ యువతి మృత్యువాత పడింది. అంబులెన్స్ వచ్చే దారిలేక.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోణంపేటకు చెందిన జింజిరి జశ్వంత్ (17) పొలం పనులు ముగించుకుని ఇంటికొస్తూ ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. 108 అంబులెన్స్ వచి్చనా.. బురద కారణంగా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. వాహనం నిలిపిన చోటికి యువకుడిని తీసుకురావాలని అంబులెన్స్ సిబ్బంది సూచించారు. గ్రామస్తుల సహకారంతో జశ్వంత్‌ను ఎడ్లబండిలో తీసుకెళ్లారు. అంబులెన్స్‌లోకి ఎక్కించిన యువకుడిని సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతిచెందాడని చెప్పారు. రోడ్డు సరిగా ఉండుంటే జశ్వంత్ ప్రాణాలు దక్కేవని బంధువులు విలపించారు. సకాలంలో వైద్యం అందక..వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన ఐత లచ్చవ్వ (65) ఆస్తమాతో బాధపడుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె భర్త నారాయణ 108కు సమాచారమిచ్చాడు. నక్కవాగుపై వంతెన పూర్తికాకపోవడంతో వాగుకు అవతలి వైపే అంబులెన్స్ ఆగిపోయింది. లచ్చవ్వను గ్రామస్తులు ఇంటి నుంచి వాగుకు ఇటువైపు గడ్డ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్ట్రెచర్‌పై దాదాపు 400 మీటర్ల దూరాన ఉన్న అంబులెన్స్ వరకు మోసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ.. పరిస్థితి విషమించి లచ్చవ్వ మృతి చెందింది. -
5 జిల్లాల్లో 43 డిగ్రీల పైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జోగుళాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డిలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 20 గ్రామాల్లో 43 డిగ్రీలు దాటిపోయింది. ఈ జిల్లాలోని మాడుగులపల్లి మండల కేంద్రంతోపాటు మునుగోడు మండలం గూడాపూర్‌లో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దామరచర్ల మండల కేంద్రం, అనుముల మండలం ఇబ్రహీంపేట, కనగల్ మండల కేంద్రం, మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామాల్లో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండలు తీవ్రం కావడంతో వడదెబ్బ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన గాదె జయపాల్‌రెడ్డి (55) గురువారం వడదెబ్బకు గురికాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ తండా గ్రామానికి చెందిన ధరావత్ మంచ్యా (55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత (45) రెండ్రోజుల క్రితం నిజామాబాద్‌లో పెళ్లికి హాజరైంది. ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. నిర్మల్‌కు వచి్చన తర్వాత గురువారం రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మర్రిపల్లి ఈరయ్య (70) పొలం పనులకు వెళ్లి ఎండ దెబ్బతగలడంతో గురువారం మృతి చెందాడు. -
గొంతెండిపోతోంది
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గుడమామిడి పరిధి మాన్కుగూడ. ఇక్కడ మిషన్‌భగీరథ నీరు సరిగా రాకపోవడంతో బావి నీటిపైనే గ్రామస్తులు ఆధారపడుతున్నారు. వేసవిలో బావి నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నారు. పటా్నపూర్లోనూ ఇదే సమస్య ఉంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటికి గోస తప్పడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో నీటి కటకట నెలకొంది. బావులు, చేతి పంపులు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావులనుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా జరగాల్సి ఉన్నా.. అంతర్గత పైపులైన్లు, పంపింగ్ మోటార్ల నిర్వహణ లోపంతో పాటు లీకేజీల కారణంగా పల్లెలు అలాగే పట్టణాల్లోనూ తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. చేతి పంపులు, బావుల నుంచి ఎడ్ల బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నామనిఈ ప్రాంతాల ప్రజలుచెబుతున్నారు. అనేకచోట్ల అడుగంటిన బావుల నుంచి పూడిక తీస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి ‘భగీరథ’నీరు సక్రమంగా రాకపోవడంతో ఉన్న ఒకేఒక చేతిపంపు వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాంగూడ, చిత్తగూడ, గట్టెపల్లి, సాలెగూడకు తాగునీటి సమస్య ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలకు భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నీటి కోసం పని మానేస్తున్నాం గట్టేపల్లి, చిత్తగూడ గ్రామాలకు నీళ్లు రావడం లేదు. ఉన్న ఒక్క చేతిపంపు,బావి నుంచి ఎడ్ల బండ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నాం. అన్ని పనులు మానేసి నీటి కోసమే సమయం వెచ్చిస్తున్నాం. –కొడప కర్ణు, గట్టేపల్లి, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా బోరు నీళ్లే తాగుతున్నాం భగీరథ నీళ్లు అన్ని ఇళ్లకు రావడం లేదు. బోరింగ్ పంపు నీళ్లే తాగుతున్నాం. అయితే ఊరిలో ఒకే చేతిపంపు ఉండడంతో నీటి కోసం ఎంతో ఇబ్బంది అవుతోంది. –రాథోడ్ సరితా బాయి, లింగాపూర్, ఆసిఫాబాద్ జిల్లా -
కంటైనర్ ఢీకొని తల్లీ, కొడుకు మృతి
ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ రహదారి నెత్తురోడింది. జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాగజ్‌నగర్ మండలం బట్టుపెల్లికి చెందిన తల్లి, కొడుకు సహెరాభాను(35), షేక్ ఆసిఫ్(16) దుర్మరణం చెందారు. తండ్రి సర్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సర్వర్ తన భార్య, కుమారుడితో కలసి శనివారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం మోటార్‌సైకిల్‌పై తిరిగి బట్టుపెల్లికి బయల్దేరారు. జాతీయ రహదారి ఎగ్జిట్ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఓ కంటైనర్ లారీ.. సర్వర్ మోటార్‌సైకిల్‌పై నుంచి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కంటైనర్ వెనక టైర్ కిందికి వచ్చిన తల్లి, కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. సర్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, బైక్‌పై నుంచి దూసుకెళ్లిన కంటెయినర్ లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని కూడా ఢీకొట్టింది. దీంతో ఆ లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నేషనల్ హైవేకు చెందిన 1033 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృత దేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సైలు మహేందర్, ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎగ్జిట్ దారి మూసి వేయాలని ధర్నా.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేట చెక్‌పోస్టు మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గాన్ని మూసి వేయాలని స్థానికులు ప్రమాదస్థలం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని గుండి రహదారి.. ఆపై సర్విస్ రోడ్డు మీదుగా జాతీయ రహదారిపైకి వాహనాలు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
పట్టాలిచ్చిన వారికే ‘సరిహద్దు’ ఓటు
కెరమెరి(ఆసిఫాబాద్): రెండు రాష్ట్రాల గొడవలో 15 సరిహద్దు గ్రామాలు నలిగిపోతున్నాయి. సాగు భూములకు ఇప్పటికీ పట్టాలు అందకపోవడంతో అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న జనాభాలో 20 శాతం ఉన్న గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం పోడు పట్టాలిచ్చి ‘రైతుబంధు’ అమలు చేస్తోంది. అయితే 70 శాతం ఉన్న ఎస్సీలు, 10 శాతం ఉన్న బీసీలను రెండు ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజనేతరులకు పట్టాలందించి, గ్రామాల్లో సమస్యలు పరిష్కరించిన వారికే ఓటు వేస్తామని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని వివాదాస్పద గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓటుహక్కు కలిగి ఉన్న వీరు ఈ నెల 30న తెలంగాణలో నిర్వహించే ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఓటు వేయనున్నారు. మొత్తంగా వీరి ఓట్ల సంఖ్య 3,566. సరిహద్దుల గుర్తింపు ఇలా.. 1955– 56లో ఫజల్అలీ కమిషన్ సరిహద్దులను గుర్తించింది. ఈ క్రమంలో పరందోళి, కోటా, పరందోళి తండా, శంకర్‌లొద్ది, లేండిజాల, మహరాజ్‌గూడ, ముకదంగూడ, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఏసాపూర్, నారాయణగూడ, భోలాపటార్, లేండిగూడ, గౌరీ గ్రామాలు మహారాష్ట్రలోకి వెళ్లాయి. 1965 నుంచి ఇవి మహారాష్ట్రలోని నోకేవాడ, పుడ్యాన్‌మోదా జీపీల్లో ఉన్నాయి. అయితే 1990లో అక్కడి ప్రభుత్వం పరందోళి, అంతాపూర్ జీపీలను ఏర్పాటు చేసి 15 గ్రామాలను విడదీసింది. 1995లో ఇక్కడ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓటింగ్ నమోదైంది. 1978లో మరోసారి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉమ్మడిగా సరిహద్దులు గుర్తించాయి. ఆర్టికల్ 3 ద్వారా 15 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆ«దీనంలో ఉంటాయని ఇరురాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1980 నుంచి ఏపీ గవర్నమెంట్ అక్కడ ఎన్నికలు నిర్వహిస్తుండగా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోలేదు. అనంతరం ఏపీ ప్రభుత్వం కూడా పరందోళి, అంతాపూర్ జీపీలను గుర్తించి 1994లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల్లో స్థానికులు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. 1980 నుంచి ఉద్యమం... వివాదాస్పద గ్రామాలను ఏపీలో కలపొద్దని 1980 నుంచే ఉద్యమం చేస్తున్నట్టు ముకదంగూడ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రాందాస్ నర్వడే తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో 1983లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. అయితే 1978లో చేసిన హద్దుల ప్రకారం గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని ఆ కమిటీ నివేదించింది. 1990 జూలై 7న గ్రామాలు ఏపీకి చెందుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ మరోసారి ఉద్యమం మొదలైంది. 15 గ్రామాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారని, భాషా ప్రతిపాదికన నిర్ణయం తీసుకోవాలని అడ్వొకేట్, రాజూరా ఎమ్మెల్యే వాన్‌రావు చటప్‌తో కలిసి ఆందోళనలు చేపట్టారు. ఈ విషయం అక్కడి అసెంబ్లీలో చర్చకు రావడంతో మహారాష్ట్ర సర్కార్ 1993 ఆగస్టు 5న 1990లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఆ గ్రామాలు మహారాష్ట్రలోనే కొనసాగుతాయని తేల్చిచెప్పింది. ఆ తర్వాత 1996 ఏప్రిల్ 3న ఏపీ ప్రభుత్వం దీనిపై హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రతిగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 1996 ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏపీ గవర్నమెంట్ 1997 ఆగస్టు 21న పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటివరకు 15 గ్రామాల కోసం ఎలాంటి కేసులు దాఖలు చేయలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. రెండు ఓట్లు.. రెండు రేషన్‌కార్డులు ఇక్కడి ప్రజలకు ఇరు రాష్ట్రాలకు చెందిన రెండు రేషన్‌కార్డులు, రెండు ఓట్లు ఉన్నాయి. వీరు ఇద్దరేసి సర్పంచ్‌లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. రెండు ప్రభుత్వాలు పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. పరందోళి గ్రామంలో కొందరికి ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరయ్యాయి. అయితే లబ్దిదారులకు తెలియకుండా కొంతమంది బిల్లులు కాజేశారు. అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నా లబ్దిదారులకు న్యాయం జరగలేదు. ప్రస్తుతం మిషన్ భగీరథ నీరు కూడా సరఫరా చేస్తున్నారు. 2014 నుంచి ఇక్కడి రైతులకు పట్టాలు లేక రుణాలు అందటం లేదు. మరో వైపు రెవెన్యూ, అటవీశాఖ మధ్య భూవివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం గిరిజనులకు పోడు పట్టాలు అందినా గిరిజనేతరులకు ఎలాంటి భరోసా లేకుండా పోయింది. 80 శాతం ఉన్న గిరిజనేతరులకు పట్టాలిచ్చిన వారికే ఓటు వేస్తామని అక్కడి ప్రజలు తేల్చిచెబుతున్నారు. పట్టాలివ్వాలి.. 50 ఏళ్లుగా భూములు సాగుచేసుకుంటున్నా పట్టాల్లేవు. రెండు ప్రభుత్వాలు కూడా పట్టాలు అందించకపోవడంతో సంక్షేమ పథకాలు అందడంలేదు. ఇప్పటికైనా రైతులకు పట్టాలు అందించాలి. – కాంబ్డే లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరందోళి కోర్టు ధిక్కరణే.. 15 గ్రామాలు మహారాష్ట్రకు చెందినవిగా 1997లోనే సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అయినా తెలంగాణ సర్కారు ఇంకా కొనసాగిస్తోంది. ఇది కోర్టు ధిక్కరణవుతుంది. ఓట్ల కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మేం మహారాష్ట్రలోనే కొనసాగుతాం. – రాందాస్ రన్వీర్, సామాజిక కార్యకర్త, ముకదంగూడ -
చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి
కెరమెరి(ఆసిపాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్‌లో బాహుబలి సినిమాలో జరిగినట్లు ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలిని శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటినట్లుగా.. లక్మాపూర్ వాగులో ఓ వ్యక్తి చంటి బిడ్డను ఇలా చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు. గ్రామానికి చెందిన రాథోడ్ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే వీల్లేక మూడు రోజులు వేచి చూశారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాయంకోసం కృష్ణ తన తమ్ముడు సాయిప్ర కాశ్‌ను తీసుకుని బయల్దేరారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయిప్రకాశ్ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గొంతు వరకు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటారు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా వాగుదాటారు. అనంతరం ముగ్గురూ కెరమెరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తిరిగి ఇదే రీతిలో వాగుదాటి ఇంటికి వెళ్లారు. కాగా, ఈ వాగుపై 2016లో వంతెన నిర్మాణం ప్రారంభించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆ ప్రాంతవాసులు చెపుతున్నారు. దీంతో ఏటా వానాకాలంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని లక్మాపూర్ వాసులు వాపోతున్నారు. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి -
క్షణక్షణం పెరుగుతోన్న ప్రాణహిత నది నీటి మట్టం!
-
Asifabad: మూడు రోజుల్లో సీఎం పర్యటన.. భోజన ఖర్చులివ్వండి!
సాక్షి, ఆసిఫాబాద్: ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చిందన్న చందంగా మారింది జిల్లా పోలీసుల తీరు.. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. సీఎం బందో బస్తుకు వస్తున్న దాదాపు 2,500 మంది పోలీసులకు వసతి, భోజన ఏర్పాట్లు చేయడం జిల్లా పోలీసుశాఖకు కత్తిమీద సాములా మారినట్లు సమాచారం. ఇప్పటికే వీరి వసతి కోసం జిల్లా కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలు, ఫంక్షన్‌హాళ్లను తమ ఆధీనంలోకి తీసుకోనున్న పోలీసులకు, వీరందరికి భోజన ఏర్పాట్లు చేయడం తలకు మించిన భారంగా మారింది. వ్యాపారుల నుంచి పోలీసుల భోజన ఖర్చులకు విరాళాలు అడగడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. 2,500 మందితో బందోబస్తు.. సీఎం పర్యటనకు బారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నేతృత్వంలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ స్థాయి అధికారులతోపాటు అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఆర్ఎ స్సైలు, పీసీలు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ, మ హిళా పోలీసులతో మొత్తం 2,500 మందితో బందోబస్తు ఉండనున్నట్లు తెలిసింది. కాగా వీరంతా ఈ నెల 28న జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. వీరందరికీ వసతి, భోజన ఏర్పాట్లు జిల్లా పోలీ సుశాఖ చేపట్టింది. ఇందులో వసతి ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో ఊపిరిపీల్చుకున్న పోలీసు అధికారులకు భోజన ఏర్పాట్ల అంటేనే ఖర్చుతో కూడుకున్న అంశం కావడంతో వ్యాపారుల సాయం కోరినట్లు తెలుస్తోంది. అయితే ఒక్కో వర్తక సంఘానికి రూ.లక్ష చొప్పున టార్గెట్ విధించడంపైనే వ్యాపారుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదనే నిర్ణయానికి వచ్చే వ్యాపారులపై ఒత్తిడి తెచ్చారనే ప్రచారం సాగుతోంది. వ్యాపారుల్లో తర్జన భర్జన.. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమాలతోపాటు కుమురంభీం, కొట్నాక భీంరావు విగ్రహాల ఆవిష్కరణ తదితరాలు కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది జిల్లాకు తరలిరానున్నారు. కార్యక్రమానికి మూడు రోజుల ముందుగానే వీరంతా జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. కాబట్టి వీరందరికి వసతి, భోజన ఏర్పాట్ల బాధ్యతలు స్థానిక పోలీసు ఉన్నతాధికారులపై పడింది. దీంతో పోలీసు అధికారులు వ్యాపారులతో మాట్లాడి.. పోలీసుల భోజన ఖర్చులకు డబ్బులు సమకూర్చాలని కోరినట్లు సమాచారం. ఒక్కో వర్తక సంఘం తరఫున రూ.లక్ష ఇవ్వాలని పోలీసు సిబ్బంది కోరడంతో వ్యాపారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయినా ప్రభుత్వ కార్యక్రమానికి విరాళాలు అడగడం ఏంటి? అన్న చర్చ వ్యాపారుల్లో జరుగుతుండటం గమనార్హం. -
కొమరంభీం జిల్లా: మూసేసిన ఫ్యాక్టరీలో గప్‌చుప్‌గా వ్యభిచారం
సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: జిల్లా రెబ్బెన మండల పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రాస్ రోడ్లో మూసివేసిన ఓ పరిశ్రమలో వ్యభిచార గృహాలను నిర్వహించడాన్ని గుర్తించారు. నిందితుడిని జనగాం జిల్లాకు చెందిన మడసి రమేష్ కుమార్‌గా నిర్ధారించారు పోలీసులు. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ నుండి మహిళలను తెప్పించి గుట్టుచప్పుడు వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం తో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్విస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రెబ్బెన పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. -
కొత్తగూడలోపెద్దపులి సంచారం
చింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసులకు పెద్దపులి భయం పట్టుకుంది. రోజుకో గ్రామంలో పులి ప్రత్యక్షమవుతూ కలవరపెడుతోంది. ఆదివారం చింతలమానెపల్లి మండలం కొత్తగూడ గ్రామ శివారులోని చెరువులో నీళ్లు తాగుతూ స్థానికులకు కన్పించింది. దీంతో వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి చెరువు వద్ద పెద్దపులి అడుగులను గుర్తించారు. పులి నీళ్లు తాగి బాబాసాగర్ గ్రామంవైపు వెళ్లినట్లు తెలుసుకున్నారు. అనంతరం స్థానికులకు అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించారు. కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో పెద్దపులి సంచరిస్తోందని,అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ కూలీలు, రైతులు గుంపులుగా పొలాలకు వెళ్లాలన్నారు. పెద్ద పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం బాబాసాగర్ గ్రామంలో పులి సంచారంపై డప్పు చాటింపు వేయించారు. -
ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి.. 52 గ్రామాలకు రాకపోకలు బంద్
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలోని అందవెల్లి వద్ద పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి బ్రిడ్జి కూలిపోవడంతో కాగజ్‌నగర్, దహేగం మండలాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీంతో, 52 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, గత కొన్ని రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో, బ్రిడ్జి ప్రమాదకరమైన స్థితికి చేరడంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, వాహనల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు.. కూలిన బ్రిడ్జిని తొందరగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. -
Photo Feature: ఏయ్ బిడ్డ.. ఇది మా అడ్డా..
కుమురంభీం జిల్లా పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని అడవులను పెద్ద పులులు అడ్డాగా మార్చుకున్నాయి. పొరుగున మహారాష్ట్రలో ఉన్న తడోబా, తిప్పేశ్వర అభయరణ్యాల నుంచి వస్తున్న పులులు.. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోనిపెంచికల్పేట్ రేంజ్ పరిధిలో నిత్యం సంచరిస్తున్నాయి. గత సంవత్సరం కే8 అనే ఆడపులి పెంచికల్పేట్ రేంజ్‌ను ఆవాసంగా మార్చుకుని మూడు పిల్లలకు జన్మనిచ్చింది. స్థానిక పెద్దవాగు పరీవాహక ప్రాంతంలోని సాసర్‌పిట్‌లో తన బిడ్డతో సేదతీరుతూ.. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇలా చిక్కింది. –పెంచికల్పేట్ -
జ్వరంతో బూరుగూడలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని మృతి
-
డిగ్రీ విద్యార్థిని మృతి.. ఉద్రిక్తత.. హాస్టల్లో ఏం జరిగింది?
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ మండలం బూరుగూడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో సంగీత అనే డిగ్రీ విద్యార్థిని జ్వరంతో ప్రాణాలు కోల్పోయింది. కరీంనగర్లో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందంటూ మృతదేహంతో ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, విద్యార్థి యువజన సంఘాలు ధర్నాకు దిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురు విద్యార్థినిలు జ్వరంతో మృతిచెందిన అధికారులు చర్యలు చేపట్టడం లేదని అధికారుల తీరుపై గిరిజనులు మండిపడుతున్నారు. చదవండి: భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్‌ని ఇంటికి రప్పించి... -
అవి శివుడి గుడి స్తంభాలు.. ఇది హిడింబి ఇసుర్రాయి!
సాక్షి, హైదరాబాద్: మీటర్లకొద్దీ పొడవున్న నిలువు రాళ్లు.. ఏదో పనికోసం యంత్రంతో కోసినట్టుగా చక్కటి ఆకృతులు.. ఒకదాని తర్వాత ఒకటి పడుకోబెట్టినట్టుగా ఉన్న రాతి శిలలు.. అవి శివుడి గుడి స్తంభాలు అంటూ స్థానికంగా ఓ ప్రచారం.. ►దారిపక్కన టన్నుల బరువున్న విశాలమైన రెండు రాళ్లు.. వృత్తాకారంలో ఒకదానిపై మరొకటి పేర్చినట్టు ఆకృతి.. అది ఒకనాటి ఇసుర్రాయి అని, భారతంలో ప్రస్తావించే హిడింబి దాన్ని వాడేదని ఓ గాధ.. ►చిత్రమైన ఆకృతుల్లో, మనం నిత్యం వాడే పరికరాల ఆకారాల్లో ఉండే రాళ్లు జన బాహుళ్యంలో వింత ప్రచారానికి కారణమవుతాయి. అలాంటివే ఈ రాళ్లు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడి మనను ఆకట్టుకుంటున్నాయి. వీటి వెనుక ఎలాంటి చారిత్రక, పౌరాణిక గాథ లేదని తేల్చిన నిపుణులు దీనిపై స్థానికులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. రాతి స్తంభాల ఆకృతిలో.. ఆసిఫాబాద్ జిల్లా బోర్‌లాల్‌గూడ అడవిలో ప్రకృతి చెక్కిన రాతి స్తంభాలు ఉన్నాయి. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద లావా ఉబికివచ్చి కడ్డీల ఆకృతుల్లో ఘనీభవించిన రాతి శిలలు అవి. కాలమ్నార్ బసాల్ట్స్‌గా పేర్కొనే ఈ శిలలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు తిరుపతి మిత్రబృందం గుర్తించింది. తెలంగాణలో తొలిసారిగా ఏడేళ్ల కింద ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ శాంతిపూర్ రిజర్వ్ ఫారెస్టులో కూడా ఇలాంటి రాళ్లను గుర్తించారు. తాజాగా రెండో చోట అవి బయటపడినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని భూభౌతిక స్మారక ప్రాంతంగా గుర్తించాలని కోరారు. కర్ణాటకలోని ఉడిపి సమీపంలో సెయింట్ మేరీ ద్వీపాల్లో ఇలాంటి రాతి స్తంభాలను గుర్తించిన జీఎస్ఐ.. దేశంలో గుర్తింపు పొందిన 34 జాతీయ భూభౌతిక స్మారక ప్రాంతాల్లో ఒకటిగా చేర్చిందని తెలిపారు. బోర్‌లాల్‌గూడలో ఈ లావా శిలలున్న ప్రాంతంలో పురాతన శివలింగం వెలుగుచూడటంతో.. శివుడి గుడి కోసం రూపొందించిన స్తంభాలుగా వీటి గురించిన గాథ ప్రచారంలో ఉందని వెల్లడించారు. ఇసుర్రాయి రూపంలో.. హైదరాబాద్ శివార్లలో ఇబ్రహీంపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో దండుమైలారం వెళ్లేదారిలో రోడ్డు పక్కన భారీ వృత్తాకార రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉన్నాయి. ఇది మహాభారతంలో హిడింబి అనే రాక్షస స్త్రీ వాడిన ఇసుర్రాయిగా ఓ గాథ స్థానికంగా ప్రచారంలో ఉంది. బుద్ధవనం ప్రాజెక్టు డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్, శిల్పి హర్షవర్ధన్‌తో కలిసి చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి వీటిని పరిశీలించి.. అవి సహజసిద్ధంగా ఏర్పడ్డవేనని గుర్తించారు. కోట్ల ఏళ్ల పరిణామ క్రమంలో రాళ్లు ఇలా ఒకదానిపై మరొకటి ఏర్పడటం సహజమని.. వీటిని బ్యాలెన్సింగ్ స్టోన్స్‌గా పిలుస్తారని తెలిపారు. వీటిని కాపాడుకుంటే ఆ ప్రాంతానికి ఓ ప్రత్యేకతగా ఉంటుందని స్థానికులకు సూచించారు. -
పులుల కోసం ఓ వంతెన
సాక్షి, హైదరాబాద్: తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడినుంచే తెలంగాణలోని అడవుల్లోకీ పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్. ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్‌పూర్–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కాబోతోంది. 4 వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ వాటి ప్రాణానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 150 మీటర్ల పొడవుతో ఎకో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. అంటే వన్యప్రాణులు రాకపోకలు సాగించే సమయంలో జాతీయ రహదారిని దాటేందుకు సహజ సిద్ధ వాతావరణం కల్పిస్తూ నిర్మించే వంతెన అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల పరిరక్షణలో మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ తరహా నిర్మాణం తెలంగాణలోనే మొదటిది కానుండటం విశేషం. దీనికి మరో 2 కి.మీ. దూరంలో 200 మీటర్ల పొడవుతో అండర్పాస్నూ నిర్మిస్తున్నారు. మొదటి వంతెన వద్ద వాహనాలు దిగువ నుంచి సాగితే, జంతువు లు పైనుంచి రోడ్డును దాటుతాయి. రెండో నిర్మాణం వద్ద.. వాహనాలు ఫ్లైఓవర్ మీదుగా.. జంతువులు దిగువ నుంచి దాటుతాయి. మూడు రాష్ట్రాలను కలిపే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు సాగే ఈ కారిడార్‌లో తెలంగాణలోని మంచిర్యాల నుంచి విజయవాడ వరకు పూర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెవేగా రోడ్డును నిర్మించబోతున్నారు. దీనికి కేంద్రం నుంచి ఆమోదం వచ్చినందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనివల్ల నాగ్‌పూర్–విజయవాడ మధ్య దూరం 180 కి.మీ. మేర తగ్గనుంది. తెలంగాణ నుంచి విజయవాడకు ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఈ రోడ్డు బిజీగా మారి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తోంది. ప్రతిపాదిత కొత్త రోడ్డు మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేని వాహనాలు అటుగా మళ్లి.. ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారిపై భారాన్ని తగ్గిస్తాయి. వైల్డ్‌లైఫ్ బోర్డు సిఫారసుతో.. ఇందులో మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్–మంచిర్యాల వరకు 2 వరుసల పాత రోడ్డు ఉంది. దాన్నే 4 వరుసలకు విస్తరిస్తారు. మంచిర్యాల నుంచి పూర్తి కొత్త రోడ్డును నిర్మిస్తారు. ఆసిఫాబాద్ మీదుగా విస్తరించే 4 వరుసల రహదారితో వన్యప్రాణులకు ఇబ్బందిగా మారడంతో అటవీశాఖతోపాటు ప్రత్యేకంగా వైల్డ్‌లైఫ్ బోర్డు నుంచి క్లియరెన్సు తీసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ దరఖాస్తు చేసుకోగా, గతేడాది వైల్డ్‌లైఫ్ కమిటీ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని సర్వే చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప అనుమతులు సాధ్యం కాదని తేల్చారు. అనంతరం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త బిలాల్ హబీబ్ నేతృత్వంలోని బృందం పర్యటించి మహారాష్ట్ర–ఆసిఫాబాద్ సరిహద్దు వద్ద 150 మీటర్ల మేర ఎకో బ్రిడ్జిని, ఆ తర్వాత 200 మీటర్ల మేర అండర్‌పాస్ కట్టాలని సిఫారసు చేసినట్టు అధికారులు చెప్పారు. నాయిస్ బారియర్స్ ఏర్పాటు ఎక్స్‌ప్రెస్ వే కావడంతో వాహనాలు 150 కి.మీ. వేగంతో దూసుకుపోతాయి. అప్పుడు విపరీతమైన శబ్దం వస్తుంది. అది వన్యప్రాణులను బెదరగొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకోసం ప్రతిపాదిత బ్రిడ్జి, అండర్‌పాస్ వద్ద వాహనాల శబ్దాన్ని వెలుపలికి బాగా తగ్గించి వినిపించేలా నాయిస్ బారియర్స్ ఏర్పాటు చేయాలని కూడా వైల్డ్ లైఫ్ బోర్డు ఆదేశించింది. దాంతోపాటు ఎకో బ్రిడ్జి మీదుగా జంతువులు దాటే ప్రాంతంలో ఎక్కడా అది ఓ కట్టడం అన్న భావన రాకుండా చూస్తారు. సాధారణ నేల, దానిపై చెట్లు ఉండేలా డిజైన్ చేస్తారు. అది మామూలు భూమే అనుకుని జంతువులు రోడ్డును సురక్షితంగా దాటుతాయి. -
న్యాయం చేయాలని ఆర్డీవో కాళ్లు మొక్కిన మహిళా సర్పంచ్
సాక్షి, ఆసిఫాబాద్: మండల కేంద్రం మీదుగా చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని అహాల్యాదేవి, బాధితురాలు వందన శుక్రవారం ఆర్డీవో సిడాం దత్తు కాళ్లపై పడి వేడుకున్నారు. రోడ్డు విస్తరణలో ఉన్న కొద్దిపాటి గూడు కూడా కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ ఆదీనంలో ఏడెకరాల ప్రభుత్వ మిగులు భూమిని రోడ్డు విస్తరణలో కోల్పోతున్న వాళ్లకు ఇళ్లు, దుకాణాలకు కేటాయించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. చదవండి: టూర్లకు డిమాండ్.. హైదరాబాద్ నుంచి పారిస్, లండన్, స్విట్జర్లాండ్‌కు -
ఒకరితో ప్రేమ, మరోకరితో పెళ్లి నిశ్చయం..అడిగితే రెండు రోజుల్లో వస్తానని చెప్పి
సాక్షి, ఆసిఫాబాద్ అర్బన్: ప్రియుడు మోసగించాడని ఓ యువతి శుక్రవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో ప్రియుని ఇంటి ఎదుట భైఠాయించింది. మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన యువతి, పట్టణంలోని జన్కాపూర్ కు చెందిన ఓ యువకుడు ఏడాదికాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడు. దీంతో వారం రోజుల క్రితం సదరు యువతి ఆసిఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం మళ్లీ వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఎంతకూ రాకపోవడంతో శుక్రవారం ఆసిఫాబాద్‌కు వచ్చినట్లు పేర్కొంది. సదరు యువకుడికి వివాహం నిశ్చయించినట్లు తెలిసి న్యాయం చేయాలని అతని ఇంటి ఎదుట బైఠాయించింది. మహిళా సంఘాల సభ్యులు మద్దతు తెలిపారు. -
కాలమేదైనా కాలినడకే..
ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోని ‘గోవెన’గూడేలు తాగునీటికి నీటి చెలిమలే ఆధారం.. కరెంటు లేదు.. రోడ్డు లేదు.. బడి లేక పిల్లలు చదువులకు దూరం తిర్యాణి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యా ణి మండలం గోవెన గ్రామపంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ పంచాయతీ పరిధిలో ఐదు గూడేలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి గోవెనగా పిలుస్తారు. 361 మంది జనాభా ఉన్నారు. దశాబ్దాలుగా ఈ గూడేలు ఉనికిలో ఉన్నా.. ఇప్పటివరకు ఎలాంటి మౌలిక సదుపాయాలులేవు. కరెంటు సౌకర్యం లేదు. నాయకపుగూడ, కుర్సిగూడ గ్రామాలైతే అత్యంత వెనుకబడి ఉన్నాయి. పదేళ్ల క్రితం ఐటీడీఏ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా.. నిర్వహణ లేక ఐదేళ్ల క్రితం చెడిపోయాయి. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేసిన నాలుగు సోలార్ లైట్లు మాత్రమే ప్రస్తుతం వీరికి వెలుగునిస్తున్నాయి. ఈ గూడేలకు తాగునీటి సౌకర్యం లేదు. కనీసం ఒక్క చేతిపంపు కూడా వేయలేదు. మిషన్ భగీరథ ట్యాంకులు అలంకారప్రాయంగా మిగిలాయి. నాయకపుగూడ వాసులు సమీపంలోని వాగులో చెలిమ తవ్వి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వానాకాలంలో వాగు లో ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు చెలిమ నీరు కూడా దొరకదు. మిగతా నాలుగు గూ డేల వారు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. కాలినడకనే ప్రయాణం ఐదు గూడేల ప్రజలు ఏ అవసరమున్నా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. ప్రతినెలా రేషన్, పింఛన్, ఆస్పత్రి, సామగ్రి కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు వాగులను దాటుకుంటూ.. ఐదు కిలోమీటర్లు నడిచి ఆసిఫాబాద్ మండలం బలాన్పూర్కు చేరుకుంటారు. లేదా ఆరు కిలోమీటర్లు నడిచి లింగాపూర్ మండలం రాఘవపూర్‌కు వెళ్లి.. అక్కడి నుంచి వాహనాల ద్వారా తిర్యాణికి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో పోలీసులు బలాన్పూర్ మీదుగా గోవెనకు మట్టిరోడ్డు నిర్మించినా.. వరదలతో నామరూపాల్లేకుండా పోయింది. అత్యవసర సమయంలో ఆస్పత్రులకు వెళ్లడానికి 108 వాహనం రాలేని పరిస్థితి. పంచాయతీ పరిధిలో అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. నాయకపుగూడలో తలపెట్టిన పాఠశాల భవనం నేటికి అసంపూర్తిగానే ఉంది. ఇక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. మాగోస ఎవరికీ రావొద్దు: ముత్తినేని రాజమ్మ, నాయకపుగూడ మాకు సర్కారు నుంచి రేషన్ బియ్యం తప్ప ఎలాంటి లబ్ధి జరగడం లేదు. తాగడానికి నీళ్లు, కరెంటు, రోడ్డు లేవు. ఎవరూ పట్టించుకోవడం లేదు. చెలిమ నీళ్లే తాగుతున్నం. ఆపద వస్తే కిలోమీటర్ల దూరం నడిచి ఆస్పత్రులకు పోతున్నాం. కరెంటు కోసం అధికారులను అడిగితే ఫారెస్టు అనుమతులు రావట్లేదని చెప్తున్నారు. మా గోస ఎవరికీ రావొద్దు. చేతి పంపులైనా వేయాలె.. మా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేదు. పిల్లలకు పౌష్టికాహరం కోసం ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. కనీసం తాగునీటి కోసం గ్రామంలో చేతి పంపు అయినా వేయాలి. రోడ్డు సౌకర్యం కల్పించాలి. – కొడప లచ్చుబాయి, గోండుగూడ ఈ ఫొటోలో కంకర రాళ్ల కుప్పలా కనిపిస్తున్నది ఏమిటో తెలుసా? ఓ గ్రామానికి వెళ్లే రోడ్డు! ఇది నిజమే.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన పంచాయతీకి వెళ్లేందుకు దారి ఇదే. రాత్రిపగలు.. ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా.. ఈ దారి మీదుగా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. -
సిర్పూర్ ఆదివాసీ కోటను కాపాడండి!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది గోండుల కోట. సిర్పూర్ ఒకప్పుడు గోండు (కోయ) రాజుల ఏలుబడిలో వున్న ప్రాంతం. దీనినే పూర్వ కాలంలో సూర్యపురంగా పిలిచేవారు. 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని గోండు (కోయ) రాజు భీమ్ బల్లాలా పాలించాడు. ఈయన కాలంలోనే సిర్పూర్ కోట నిర్మితమైంది. ఈ రాజ్యానికి సరిహద్దుగా సిరోంచా, చంద్రపూర్, ఊట్నూర్, అహేరి, ఆసిఫాబాద్ కేంద్రాలుగా గోండు రాజ్యాలుండేవి. ముస్లిం, బ్రిటిష్ సైన్యాలు దండయాత్రలు చేసి ఈ రాజ్యాలను ఆక్రమించి కొల్ల గొట్టాయి. అయినా అలనాటి గోండు రాజ్యాల ఆనవాళ్ళు నేటికీ సజీవంగానే ఉన్నాయి. అందుకు ఉదాహరణ ఊట్నూర్, సిర్పూర్ టౌన్లలో ఉన్న కోటలు. ఈ చారిత్రక కోటలు నేడు కబ్జాకోరల్లో చిక్కుకొని ఆనవాళ్ళు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. సిర్పూర్ టౌన్ కేంద్రంగా ఉన్న గోండు రాజుల కోట దాదాపుగా 10 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఉండేది. ప్రస్తుతం కోటగోడ, కోట స్థలంలో ఉన్న శిథిలావస్థకు చేరిన కొలను చూడవచ్చు. ఆ కోట భూములు రికార్డుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. కానీ కోట నేడు భూ కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుంది. (చదవండి: రాజకీయాలు మారేదెన్నడు?) తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ కట్టడ గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ప్రభుత్వానికి మన చరిత్ర, సంస్కృతుల పట్ల ఉన్న మక్కువకు ఇది నిదర్శనం. అటువంటి ప్రభుత్వం ఉన్న కాలంలోనూ సిర్పూర్ కోట ఆక్రమణలకు గురవ్వడం బాధాకరం. ఇప్పుడు ఆ భూమిలో గ్రామ పంచాయితీ, హస్పిటల్, రోడ్లు, ప్రైవేట్ వ్యక్తులు ఇళ్ళు ఉన్నాయి. కోటను భూకబ్జాదారుల నుంచి కాపాడి, రాష్ట్ర పురావస్తు శాఖ పరిరక్షణ కిందికి తేవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) – పోలేబోయి అశోక్ ఆదివాసీ చరిత్ర అధ్యయన వేదిక, సిర్పూర్ కాగజ్‌నగర్ -
ఒకేరోజు ఒక్కటైన 111 జంటలు
పెంచికల్పేట్(ఆదిలాబాద్): మూడు ముళ్లు.. ఏడడుగులతో అగ్ని సాక్షిగా 111 జంటలు ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో ఆదివారం ఏకమయ్యాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప–రమాదేవి దంపతులు సామూహిక వివాహాలు జరిపించారు. జయమంగళ నది (పెద్దవాగు) తీరాన శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకకు కోనేరు కోనప్ప దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వధూవరులకు తాళి బొట్టు, మెట్టెలు, పట్టు వస్త్రాలు, వంట సామగ్రి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ సురేశ్‌కుమార్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
పిట్ట నడక.. చూద్దాం రండి!
సాక్షి, మంచిర్యాల: ‘‘ఓ పుల్లా, ఓ పుడకా, ఎండుగడ్డి, చిన్నకొమ్మ, చిట్టిగూడు.. పిట్ట బతుకే ఎంతో హాయి’’ అంటూ తన పాటతో పక్షుల జీవితాన్నో ఉత్సవం చేశాడు ప్రజావాగ్గేయకారుడు గోరటి. అలాంటి పక్షుల జీవితాన్ని చూడాలనుకునేవారికో మంచి అవకాశం బర్డ్‌వాక్ ఫెస్టివల్. సహజ సిద్ధ ఆవాసాల్లో పక్షుల కిలకిల రాగాలు, విభిన్న పిట్టల గుంపులు, జంట పక్షుల తుళ్లింతలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం అటవీశాఖ కల్పిస్తోంది. ఈ నెల 8, 9న రెండోవిడత బర్డ్‌వాక్ ఫెస్టివల్‌ను ఆసిఫాబాద్ జిల్లా అటవీఅధికారులు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల పాటు కవ్వాల్ టైగర్ రిజర్వు, ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ఈ బర్డ్‌వాక్ సాగనుంది. కాగజ్‌నగర్ అడవుల్లో పక్షుల సందడి పాలరాపుగుట్ట సహా... తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అడవుల్లో పక్షుల ఆవాసాలు చూడొచ్చు. దేశంలో అంతరించిపోయే స్థితిలో ఉన్న పొడుగు ముక్కు రాబంధుల ఆవాసమైన పాలరాపుగుట్టతో సహా ఎంపిక చేసిన 21 ప్రాంతాల్లో ఈ బర్డ్ వాక్ జరగనుంది. సిర్పూర్, బెజ్జూరు, పెంచికల్‌పేట, మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో ఎన్నో అరుదైన పక్షులున్నాయి. 250పక్షి జాతులు సందర్శకులను కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే కర్ణాటక, నాగ్‌పూర్, చంద్రాపూర్, హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి వన్యప్రాణి, ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు తమ ఆసక్తిని చూపించారు. రిజిస్ట్రేషన్ ఆధారంగా అవకాశం.. కోవిడ్ నేపథ్యంలో పరిమితంగా ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఒకరికి రూ.2వేలు ఫీజు. వివరాలకు డీఎఫ్‌వో (ఆసిఫాబాద్) 9440810099, ఎఫ్‌డీవో(జన్నారం) 9440810103 నంబరులో సంప్రదించవచ్చు. ఈ నెల 7న కాగజ్‌నగర్ అటవీ ఆఫీసులో నేరుగా మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. వీక్షకులకు అంతర్గత రవాణా, వసతి సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. పక్షుల సంరక్షణకు దోహదం పక్షుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజెప్పడంతో పాటు కొత్త పక్షుల గుర్తింపు, అధ్యయనం కోసం ఈ బర్డ్‌వాక్ దోహదపడుతుంది. ఎంపిక చేసిన ప్రాం తాల్లో సందర్శకులు అధికారుల సమక్షంలో పక్షులను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. వన్యప్రాణి నిపుణులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు, పక్షి ప్రేమికులు పాల్గొనవచ్చు. – ఎస్.శాంతారామ్, జిల్లా అటవీ అధికారి, ఆసిఫాబాద్ -
పెద్దలు పెళ్ళికి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: పెద్దలు పెళ్ళికి నిరాకరించారని యువ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలోని వాంకిడి మండలం రాంనగర్ గ్రామానికి చెందిన నౌగడే శ్రీకాంత్ (22), గీత(19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారి ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పి వివాహం చేయమని కోరారు. దీంతో అబ్బాయి ఇంట్లో ఒప్పుకున్నప్పటికి ,గీతా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. చివరకు ఈ విషయం గ్రామ పెద్దలు వరకు వెళ్లింది. దీంతో ఇరు కుటుంబాల వారికి నచ్చజెప్పి, కొంత సమయం వేచి చూడాల్సిందిగా పెద్దలు చెప్పారు కొన్ని రోజులు వేచి చూసిన శ్రీకాంత్, గీతలు ఇక తమకు వివాహం జరపరని మనస్తాపానికి గురై గత సోమవారం ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అయితే సోమవారం పొలం పనుల కోసం అకిని గ్రామ సమీపంలోని పత్తి చేనుకు వెళ్ళిన కూలీలకు ప్రేమ జంట చెట్టుకు ఉరి వేసుకుని శవాలై కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. శవాలు కుళ్ళిన స్థితిలో ఉండటంతో 3 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: చికిత్స సమయంలో భార్య మృతి చెందిందని డాక్టర్‌ను షూట్ చేశాడు!