బంధువులు దూషించారని మనస్తాపంతో యువతి ఆత్మహత్య | Adilabad: Girl Ends Her Life For Relatives Scolding In Asifabad | Sakshi
Sakshi News home page

బంధువులు దూషించారని మనస్తాపంతో యువతి ఆత్మహత్య

Published Mon, Jul 12 2021 10:23 PM | Last Updated on Mon, Jul 12 2021 10:39 PM

Adilabad: Girl Ends Her Life For Relatives Scolding In Asifabad - Sakshi

మౌనిక ఫైల్‌ ఫోటో

రెబ్బెన(ఆసిఫాబాద్‌): ఇంటి స్థలం వివాదంలో యువతిని తోటి బంధువులు దూషించడంతో మనస్తాపానికి గురై యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం మండలం లోని లక్ష్మిపూర్‌ పంచాయతీలోని గొల్ల గూడలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం... మౌనిక (18) రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చ దువుతోంది.

మౌనిక తండ్రి బట్టమేకల మల్లయ్యకు, సమీప బంధువైన పాపయ్యకు మధ్య వారం రోజులుగా ఇంటి స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సర్పంచ్‌ సమక్షంలో  పంచాయితీ నిర్వహించాలని భావించారు. పాపయ్య పంచాయితీకి రాలేదు. తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా మౌనిక ఇంట్లో ఉండడాన్ని గమనించిన పాపయ్యతో పా టు అతడి కుమారుడు రాజేష్, కూతుళ్లు శశికళ, సరోజ మౌనికను దూషించారు. మనస్థాపానికి గురైన మౌనిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. తల్లి సత్తక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement