
ప్రతీకాత్మక చిత్రం
తిరువళ్లూరు(చెన్నై): ఇంటిని శుభ్రం చేయలేదని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పుదుపట్టు గ్రామానికి చెందిన సభాపతి(42) తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య కవియరసి పిల్లలు రాకేష్(16), దర్శినిక(15), సంజిత్(12) ఉన్నారు.
ముగ్గురు పన్నూరులోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. కాగా గ్రామంలో ఆదివారం జాతర జరిగింది. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేయాలని కుమార్తె దర్శినికను తల్లి కవియరసి ఆదేశించింది. అయితే దర్శినిక ఇంటిని శుభ్రం చేయకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన దర్శినిక ఇంట్లో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి సభాపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment