![Tamil Nadu: Lover Ends His Life In Girl House - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/2/Aunty.jpg.webp?itok=O1XbgY19)
ప్రతీకాత్మక చిత్రం
చెన్నై: కోయంబత్తూరులో ప్రియురాలి పుట్టినరోజు వేడుకల కోసం ఆమె ఇంటికి వచ్చిన ఓ యువకుడు మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన ప్రియురాలు కూడా ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. వివరాలు.. నీలగిరి జిల్లా మసినగుడి మేయర్ ప్రాంతంకి చెందిన శ్రీనివాసన్ కుమారుడు ప్రదీప్ (26). ఇతను మైసూరులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాడు. మసనకుడి లక్ష్మీనగర్ 2వ వీధికి చెందిన రమేష్ కూతురు కావ్య (26). ఈమె ప్రదీప్ స్కూల్ ఫ్రెండ్.
వీరు గత 6 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. కావ్య కోవై శరవణం పట్టి నెహ్రూ నగర్ 3వ రోడ్డులో అద్దెకు ఉంటూ బీలమెట్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కావ్య పుట్టినరోజు సంబరాలు చేసుకోవడానికి ప్రదీప్ కావ్య ఇంట్లో బస చేశాడు. మంగళవారం ఉదయం కావ్య తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేందుకు మేడపైకి వెళ్లింది. అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా వంటగదిలో ప్రదీప్ ఉరివేసుకుని కనిపించాడు.
దీంతో షాక్‌కు గురైన కావ్య కేకలు వేసింది. అనంతరం పక్కనే ఉన్నవారి సహాయంతో ప్రదీప్‌ను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రదీప్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కావ్య ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కావ్యను రక్షించి కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరవణంపాటి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి భర్త కోసం త్యాగం.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత బాగుంటుందో!
Comments
Please login to add a commentAdd a comment