విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి.. అదే రోజు సాయంత్రం ప్రియురాలు.. | Tamil Nadu: Girl Suicide Over Love Dies With Electric Shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి.. అదే రోజు సాయంత్రం ప్రియురాలు..

Published Wed, Mar 23 2022 8:21 AM | Last Updated on Wed, Mar 23 2022 11:02 AM

Tamil Nadu: Girl Suicide Over Love Dies With Electric Shock - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(చెన్నై): రాసిపురం సమీపంలో విద్యుత్‌ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన అతని ప్రియురాలు ఉరివే సుకొని ఆత్మహత్య చేసుకుంది. నామక్కల్‌ జిల్లా,  రాసిపురం సమీపంలోని అత్తిపాలగనూర్‌ ప్రాంతానికి చెందిన మురుగన్‌ కుమారుడు సూర్య (21) సమీపంలోని ఓ కోళ్లఫారంలో పని చేస్తున్నాడు. కోళ్లఫారంలో పందికొక్కుల నియంత్రణకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగ తగిలి సూర్య సోమవారం మృతి చెందాడు.

చదవండి: విద్యార్థినులకు లైంగిక వేధింపులు.. టీచర్‌, మాజీ హెచ్‌ఎం అరెస్ట్‌

రాసిపురం పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని రాసిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, సూర్య మృతదేహాన్ని తమకు చెప్పకుండా శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సూర్యను ప్రేమిస్తున్న పదవ తరగతి విద్యార్థిని అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement