Electrocute
-
‘‘అబ్బో వందేభారత్‌లు.. ఎవరి కోసమండీ?’’
ఢిల్లీ: కోట్లు ఖర్చు చేసి వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తూ.. ఘనంగా చాటింపు వేసుకుంటారు. కానీ, సాధారణ ప్రయాణికులు తిరిగే రైల్వే స్టేషన్లలోనే కనీస వసతులు ఉండవు. ఐదు లక్షల మందికి కనీసం ఒక ఆంబులెన్స్ ఉండదా?.. ఏదైనా జరిగి ప్రాణం పోయినప్పుడు డబ్బులిస్తే సరిపోతుందా?. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారకులకు శిక్ష పడాల్సిన అవసరం ఉండదా?.. ఇదెక్కడి న్యాయం?.. ఢిల్లీకి చెందిన లోకేష్ కుమార్ చోప్రా ఆవేదన ఇది.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆదివారం సాక్షి ఆహూజా(34) అనే మహిళ కరెంట్ షాక్‌తో ప్రాణం కోల్పోయింది. అంతా చూస్తుండగానే విద్యుత్ ఘాతానికి గురైన ఆమెకు చికిత్స అందించడానికి అక్కడ ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు. సమయానికి కరెంట్ ఆఫ్ చేసి ఆమెను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా చికిత్స కోసం దాదాపు 40 నిమిషాల తర్వాత ఆంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసింది. ► దేశ రాజధానిలో నిత్యం కనీసం ఐదు లక్షల మంది తిరిగే ఆ రైల్వే స్టేషన్లో డాక్టర్లు, ఆంబులెన్స్‌ల మాటెరుగు.. కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేదంట!. ► హైక్వాలిటీ రైళ్లంటూ కోట్లు ఖర్చుచేసి వందేభారత్ రైళ్లను తయారు చేసి గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ, లక్షల మంది తిరిగే స్టేషన్లలో కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది మాత్రం చూడం!. అంతా చూస్తుండగానే.. నా కూతురి ప్రాణం పోయింది. ఘటనపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు మాకు చెప్పారు. కానీ, ఇంతవరకు ఏదీ ముందుకు జరగలేదు. ప్రభుత్వాలు జనాలకు కొత్తగా ఏం అక్కర్లేదు.. ఉన్నంతలో సౌకర్యాలను ప్రజలకు మెరుగ్గా అందిస్తే సరిపోతుంది కదా?. గొప్పలను మాత్రమే మీడియాలో ఎందుకు చూపించుకుంటారు? ఇలాంటి వాటి విషయంలోనూ స్పందించాలి కదా అని ప్రభుత్వాల్ని ఆ తండ్రి ఆవేదనభరితంగా నిలదీస్తున్నారు. ► బాధితురాలి తండ్రిగా డబ్బు అందుకునేందుకు నేను సిద్ధంగా లేను. నాకు కావాల్సింది న్యాయం. దీనికి కారకులను కఠినంగా శిక్షించాలి అంతే.. అని లోకేష్ చోప్రా డిమాండ్ చేస్తున్నారు. ► ఢిల్లీ రైల్వేస్టేషన్లో గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందట. దానిపై ఫిర్యాదులు వెళ్లినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడ పని చేసే కూలీలు చెబుతున్నారు. ► ఈస్ట్ ఢిల్లీ ప్రీత్ విహార్‌లో టీచర్‌గా పని చేస్తున్న సాక్షి అహూజా తన పిల్లలు, సోదరి కుటుంబంతో కలిసి ఛండీగఢ్ వెళ్లే క్రమంలో ఆదివారం వేకువఝామున ఢిల్లీ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే.. స్టేషన్ ఎగ్జిట్ వద్ద నిలిచిన నీటి గుంత నుంచి తప్పుకునే క్రమంలో ఆమె అక్కడే ఉన్న ఓ పోల్‌ను తాకారు. అయితే అప్పటికే అక్కడ తెగిపడి ఉన్న వైర్లు ఆమెను లాగేసి.. విద్యుత్ ఘాతంతో ఆమె విలవిలలాడిపోయారరు. ఆ సమయంలో ఆమె ఇద్దరు పిల్లలూ ఆమె కూడా ఉండగా.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ► ఆమె సోదరి, అప్పటికే లగేజ్ తీసుకుని లోపలికి వచ్చిన ఆమె తండ్రి.. ఆ దృశ్యాలను చూసి సాయం కోసం కేకలు వేశారు. కరెంట్ షాక్‌తో కొన్ని నిమిషాలు విలవిలలాడిపోయి ఆమె కిందపడిపోయారు. దాదాపు 30-40 నిమిషాలపాటు ఆమె అలాగే స్పృహ లేకుండా పడి ఉండిపోగా.. అప్పుడు ఆంబులెన్స వచ్చి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే.. మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసింది. ఈ ఘటనపై భారతీయ రైల్వేస్ విచారం వ్యక్తం చేసింది. ఘటనపై దర్యాప్తునకు ఓ కమిటీ నియమిస్తున్నట్లు తెలిపింది. ఇక ఘటన సమయంలో ఆమె సోదరి మాధవి కూడా వెంట ఉండగా.. వెంటనే ఆమె విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు సైతం నమోదు అయ్యింది. సాక్షి మరణం తర్వాత ఢిల్లీ అధికారులు అక్కడి కరెంట్ పోల్స్‌కు మరమ్మత్తులు చేపడుతుండడం గమనార్హం. #RailwayStation पर #SakshiAhuja की मौत ने उठाए 'सिस्टम' पर सवाल सब्सक्राइब करें #TimesNowNavbharat👉 https://t.co/ogFsKfs8b9#TimesNowNavbharatOriginals #TNNOriginals #DelhiNews pic.twitter.com/HCDMyLfvWd — Times Now Navbharat (@TNNavbharat) June 26, 2023 Video Credits: Times Now Navbharat ఇదీ చదవండి: భార్యను చదివించిన భర్త.. ఆమె మాత్రం మరో వ్యక్తితో.. -
ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ఆరుగురు మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ విద్యుత్తు తీగకు తగిలి కరెంట్ షాక్‌తో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని మసుపుర్ గ్రామంలో సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్థులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపులో ఉపయోగించిన బండిలో ఏర్పాటు చేసిన ఇనుప రాడ్ హైఓల్టేజ్ విద్యుత్తు తీగకు తగిలి కరెంట్ సరఫరా అయినట్లు స్థానికులు తెలిపారు. కరెంట్ షాక్‌తో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో బాలుడు అరఫాత్(10) ఆసుపత్రిలో మృతి చెందగా.. మృతుల సంఖ్య ఆరుకు చేరినట్లు వెల్లడించారు. మృతుల్లో సుఫియా(12), ఇల్యాస్(16), టబ్రేజ్(16), అష్రఫ్ అలీ(30)లుగా గుర్తించారు. పలువురు గ్రామస్థులకు సైతం కరెంట్ షాక్ తగిలినట్లు చెప్పారు. ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఆప్’ మంత్రి రాజీనామా -
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి.. అదే రోజు సాయంత్రం ప్రియురాలు..
తిరువొత్తియూరు(చెన్నై): రాసిపురం సమీపంలో విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన అతని ప్రియురాలు ఉరివే సుకొని ఆత్మహత్య చేసుకుంది. నామక్కల్ జిల్లా, రాసిపురం సమీపంలోని అత్తిపాలగనూర్ ప్రాంతానికి చెందిన మురుగన్ కుమారుడు సూర్య (21) సమీపంలోని ఓ కోళ్లఫారంలో పని చేస్తున్నాడు. కోళ్లఫారంలో పందికొక్కుల నియంత్రణకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి సూర్య సోమవారం మృతి చెందాడు. చదవండి: విద్యార్థినులకు లైంగిక వేధింపులు.. టీచర్, మాజీ హెచ్ఎం అరెస్ట్ రాసిపురం పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని రాసిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, సూర్య మృతదేహాన్ని తమకు చెప్పకుండా శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సూర్యను ప్రేమిస్తున్న పదవ తరగతి విద్యార్థిని అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పసి ప్రాణం తల్లడిల్లిపోయింది
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం): చిన్ని ప్రాణం తల్లడిల్లిపోయింది. సూది గుచ్చుకుంటేనే తట్టుకోలేని వయసులో 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైరు తలగడంతో ఆ గుండె ఆగిపోయింది. మండలంలోని మారుమూల పొల్లగిరి జన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఐదో తర గతి చదువుతున్న మండంగి ప్రవీణ్‌కుమార్ (11) బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. విద్యార్థి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆశ్రమ పాఠశాల నుంచి బయటకు వెళ్లా డు. అతడు నడుచుకుంటూ వెళ్తున్న దారిలో 11కేవీ హైటెన్షన్ వైరు తెగి పడి ఉంది. అది ఓ ఐరన్‌పోల్‌కు తాకి ఉండడం, విద్యార్థి ఆ స్తంభానికి సమీపంలోకి వెళ్లడంతో షాక్ తగిలిందని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థిది పాలకొండ మండలం వంతవాడ కాలనీ గ్రామం. తండ్రి సూర్యారా వు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తల్లి సత్య వతి కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా రు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నవాడు ప్రవీణ్ పొల్లలో తాత ఇంటి వ ద్ద ఉంటూ ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్నా డు. కొడుకు చనిపోయాడనే వార్త విని ఆమె గుండెలవిసేలా రోదించారు. పొల్ల సర్పంచ్ ఆరిక గంగారావుతో పాటు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీఓ నవ్య, గిరిజన సంక్షేమాధికారులకు స్థానికులు సమాచారం అందించారు. ఏటీడబ్ల్యూఓ వెంకటరమణ పొల్ల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థి దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించినట్టు గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమల తెలిపారు. దోనుబాయి ఎస్ఐ కిశోర్‌వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పిడుగు పడి 12 మందికి షాక్
మహబూబాబాద్ (వరంగల్): పిడుగుపాటుతో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండా వాసులు మంగళవారం తండా శివారులో దాటుడు పండుగ జరుపుకున్నారు. తండావాసులంతా పండుగ సంబరాల్లో మునిగిపోయిన సమయంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో కొంతమంది సమీపంలో ఉన్న పశువుల కొట్టంలోకి వెళ్లారు. అదే సమయంలో పశువుల కొట్టం సమీపంలో పిడుగు పడింది. ఆ పిడుగు ప్రభావానికి కొట్టంలో ఉన్న భూక్య నరేష్, భూక్య సోమ్లా, భూక్య బుల్కి, కల్పన, మోహన్, బాజు, రామ, చీన్యా, సోమ్లితో పాటు మరో ముగ్గురు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.