Delhi Station Sakshi Ahuja Death: Victim Father Slams Govt Railways, Details Inside - Sakshi
Sakshi News home page

అబ్బో వందేభారత్‌లు.. ఐదు లక్షల మందికి ఒక ఆంబులెన్స్‌ కూడా ఉండదా?.. ఓ తండ్రి ఆవేదన

Jun 27 2023 7:24 AM | Updated on Jun 27 2023 9:20 AM

Delhi Station Sakshi Ahuja Death: Victim Father Slams Govt Railways

వందల కోట్లు ఖర్చు పెట్టి వందేభారత్‌కు ఘనంగా ప్రచారం చేసుకుంటూ..

ఢిల్లీ: కోట్లు ఖర్చు చేసి వందేభారత్‌ రైళ్లను ప్రారంభిస్తూ.. ఘనంగా చాటింపు వేసుకుంటారు. కానీ, సాధారణ ప్రయాణికులు తిరిగే రైల్వే స్టేషన్‌లలోనే కనీస వసతులు ఉండవు. ఐదు లక్షల మందికి కనీసం ఒక ఆంబులెన్స్‌ ఉండదా?.. ఏదైనా జరిగి ప్రాణం పోయినప్పుడు డబ్బులిస్తే సరిపోతుందా?. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారకులకు శిక్ష పడాల్సిన అవసరం ఉండదా?.. ఇదెక్కడి న్యాయం?.. ఢిల్లీకి చెందిన లోకేష్‌ కుమార్‌ చోప్రా ఆవేదన ఇది..

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాక్షి ఆహూజా(34) అనే మహిళ కరెంట్‌ షాక్‌తో ప్రాణం కోల్పోయింది. అంతా చూస్తుండగానే విద్యుత్‌ ఘాతానికి గురైన ఆమెకు చికిత్స అందించడానికి అక్కడ ఒక్క డాక్టర్‌ కూడా అందుబాటులో లేరు. సమయానికి కరెంట్‌ ఆఫ్‌ చేసి ఆమెను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా చికిత్స కోసం దాదాపు 40 నిమిషాల తర్వాత ఆంబులెన్స్‌ అందుబాటులోకి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసింది. 

దేశ రాజధానిలో నిత్యం కనీసం ఐదు లక్షల మంది తిరిగే ఆ రైల్వే స్టేషన్‌లో డాక్టర్లు, ఆంబులెన్స్‌ల మాటెరుగు.. కనీసం ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ కూడా లేదంట!. 

హైక్వాలిటీ రైళ్లంటూ కోట్లు ఖర్చుచేసి వందేభారత్‌ రైళ్లను తయారు చేసి గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ, లక్షల మంది తిరిగే స్టేషన్‌లలో కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది మాత్రం చూడం!. అంతా చూస్తుండగానే.. నా కూతురి ప్రాణం పోయింది. ఘటనపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు మాకు చెప్పారు. కానీ, ఇంతవరకు ఏదీ ముందుకు జరగలేదు. ప్రభుత్వాలు జనాలకు కొత్తగా ఏం అక్కర్లేదు..  ఉన్నంతలో సౌకర్యాలను ప్రజలకు మెరుగ్గా అందిస్తే సరిపోతుంది కదా?. గొప్పలను మాత్రమే మీడియాలో ఎందుకు చూపించుకుంటారు? ఇలాంటి వాటి విషయంలోనూ స్పందించాలి కదా అని ప్రభుత్వాల్ని ఆ తండ్రి ఆవేదనభరితంగా నిలదీస్తున్నారు.

బాధితురాలి తండ్రిగా డబ్బు అందుకునేందుకు నేను సిద్ధంగా లేను. నాకు కావాల్సింది న్యాయం. దీనికి కారకులను కఠినంగా శిక్షించాలి అంతే.. అని లోకేష్‌ చోప్రా డిమాండ్‌ చేస్తున్నారు. 

► ఢిల్లీ  రైల్వేస్టేషన్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందట. దానిపై ఫిర్యాదులు వెళ్లినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడ పని చేసే కూలీలు చెబుతున్నారు. 

► ఈస్ట్‌ ఢిల్లీ ప్రీత్‌ విహార్‌లో టీచర్‌గా పని చేస్తున్న సాక్షి అహూజా తన పిల్లలు, సోదరి కుటుంబంతో కలిసి ఛండీగఢ్‌ వెళ్లే క్రమంలో ఆదివారం వేకువఝామున ఢిల్లీ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే.. స్టేషన్‌ ఎగ్జిట్‌ వద్ద నిలిచిన నీటి గుంత నుంచి తప్పుకునే క్రమంలో ఆమె అక్కడే ఉ‍న్న ఓ పోల్‌ను తాకారు. అయితే అప్పటికే అక్కడ తెగిపడి ఉన్న వైర్లు ఆమెను లాగేసి.. విద్యుత్‌ ఘాతంతో ఆమె విలవిలలాడిపోయారరు. ఆ సమయంలో ఆమె ఇద్దరు పిల్లలూ ఆమె కూడా ఉండగా.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. 

► ఆమె సోదరి, అప్పటికే లగేజ్‌ తీసుకుని లోపలికి వచ్చిన ఆమె తండ్రి.. ఆ దృశ్యాలను చూసి సాయం కోసం కేకలు వేశారు. కరెంట్‌ షాక్‌తో కొన్ని నిమిషాలు విలవిలలాడిపోయి ఆమె కిందపడిపోయారు.  దాదాపు 30-40 నిమిషాలపాటు ఆమె అలాగే స్పృహ లేకుండా పడి ఉండిపోగా.. అప్పుడు ఆంబులెన్స​ వచ్చి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే.. మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసింది. 

ఈ ఘటనపై భారతీయ రైల్వేస్‌ విచారం వ్యక్తం చేసింది. ఘటనపై దర్యాప్తునకు ఓ కమిటీ నియమిస్తున్నట్లు తెలిపింది. ఇక ఘటన సమయంలో ఆమె సోదరి మాధవి కూడా వెంట ఉండగా.. వెంటనే ఆమె విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు సైతం నమోదు అయ్యింది.  సాక్షి మరణం తర్వాత ఢిల్లీ అధికారులు అక్కడి కరెంట్‌ పోల్స్‌కు మరమ్మత్తులు చేపడుతుండడం గమనార్హం.

Video Credits: Times Now Navbharat

ఇదీ చదవండి: భార్యను చదివించిన భర్త.. ఆమె మాత్రం మరో వ్యక్తితో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement