వాడే కావాలి.. పెళ్లైన ప్రియుడితో బలవంతగా తాళి కట్టించుకున్న యువతి! | Woman Kidnapped And Tied Up With Married Boyfriend Tamil Nadu | Sakshi
Sakshi News home page

వాడే కావాలి.. పెళ్లైన ప్రియుడితో బలవంతగా తాళి కట్టించుకున్న యువతి!

Published Sun, Aug 13 2023 3:33 PM | Last Updated on Sun, Aug 13 2023 4:24 PM

Woman Kidnapped And Tied Up With Married Boyfriend Tamil Nadu - Sakshi

చెన్నై: ప్రియుడికి మరో యువతితో వివాహం జరిగిపోయింది. అయినా సరే పట్టుబటి అతనే కావాలంటే.. కిడ్నాప్‌ చేసి మరీ ప్రియుడితో తాళి కట్టించుకుంది ఓ యువతి.  ఈ వింత ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆమెకు సహకరించిన ముగ్గురు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని వేలచ్చేరికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పార్థిబన్ తన కాలేజీ రోజుల్లో సౌందర్య అనే యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అంగీకరించడంతో వీరి ప్రేమ కథ మొదలైంది.

ఏడేళ్ల వరకు సాఫీగా వీరి లవ్‌ స్టోరీ.. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే గత నెల 5వ తేదీన పార్తీబన్‌కు ఐటీలో పనిచేస్తున్న యువతితో వివాహమైంది. ఈ విషయం సౌందర్య తెలియడంతో పార్తిబన్‌ను మర్చిపోలేనని, అతన్నే వివాహం చేసుకుంటానని తన తల్లి, బంధువులతో చెప్పింది. ఆమె తల్లి ఉమ, బంధువులు రమేష్, శివకుమార్ సహాయంతో యువకుడిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. శుక్రవారం యథావిధిగా కార్యాలయానికి వెళ్లిన పార్తీబన్ కారులో కిడ్నాప్ చేశారు.

అతను తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నేరుగా కాంచీపురంలోని ఆలయానికి తీసుకెళ్లి సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. ఈ విషయం పార్తిబన్‌ భార్యకు తెలియడంతో.. భర్త కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. మాజీ ప్రియురాలు సౌందర్య, ఆమె బంధువులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

చదవండి   పింఛన్‌ ఇస్తామని తీసుకెళ్లి.. ఆపరేషన్‌ చేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement