
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: జిల్లా రెబ్బెన మండల పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రాస్ రోడ్‌లో మూసివేసిన ఓ పరిశ్రమలో వ్యభిచార గృహాలను నిర్వహించడాన్ని గుర్తించారు. నిందితుడిని జనగాం జిల్లాకు చెందిన మడసి రమేష్ కుమార్‌గా నిర్ధారించారు పోలీసులు.
ఆసిఫాబాద్, కాగజ్ నగర్ నుండి మహిళలను తెప్పించి గుట్టుచప్పుడు వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం తో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్విస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రెబ్బెన పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment