prostitution racket
-
లాడ్జీలో హైటెక్ వ్యభిచారం.. 12 మంది మహిళల అరెస్టు
కొరుక్కుపేట: మంబాయి తరహాలో తిరుపూర్‌లో హైటెక్ వ్యభిచారం సాగుతోంది. దీంతో ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ప్రక్కా ప్రణాళికతో లాడ్జీలల్లో ఉన్న 12 మందిమహిళలను రక్షించి, ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘనట తిరుపూర్‌లో కలకలం రేపింది. వివరాలు.. తమిళనాడులోని తిరుపూర్ సెంట్రల్ బస్ స్టేషన్ వెనుక ఉన్న లాడ్జీలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మహిళలను వేధింపులకు గురిచేస్తున్నట్లు సౌత్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంబంధిత లాడ్జిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో లాడ్జీల్లోని గదుల్లో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను చూసి పోలీసులు అవాక్కయ్యారు . ఇందులో 12 మంది మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. ఆ తర్వాత పోలీసులు మొత్తం 12 మందిని రక్షించి షెల్టర్‌కు అప్పగించారు. ఇక లాడ్జీ యజమాని సంపత్ కుమార్ వ్యభిచారానికి అనుమతి ఇచ్చినట్లు తేలడంతో అతడితో పాటు మేనేజర్ నీలా కందన్ (44)పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా వ్యభిచారం నిర్వహిస్తున్న 12 మంది మహిళలు ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. -
అమెరికాలో తెలుగు యువకుల అరెస్ట్
ఆస్టిన్: అమెరికా టెక్సాస్ స్టేట్‌లో వ్యభిచార ముఠాను అక్కడి పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించి.. అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నారు. బలవంతపు వ్యభిచారాన్ని కట్టడి చేసేందుకు హాయ్‌లాండ్ విలేజ్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్‌లోని డెంటన్లో ఈ ముఠా అరెస్ట్ అయ్యింది. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి తెలుగు వారిగా అక్కడి పోలీసులు గుర్తించారు. వీళ్లంతా ఉన్నత విద్య కోసమే వచ్చినట్లు నిర్ధారించారు.**PRESS RELEASE** pic.twitter.com/LnYMYNoktZ— Denton Co Sheriff (@DentonCoSheriff) August 19, 2024 -
బెంగళూరు: రేవ్‌పార్టీ ముసుగులో వ్యభిచార దందా?
బెంగళూరు, సాక్షి: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పార్టీ మాటున సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్ దొరకడం, పైగా డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్ పార్టీ నిర్వహించడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. బెంగళూర్ ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ జరిగింది. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో బర్త్‌డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు అర్ధరాత్రి జరిగిన పార్టీలో పాల్గొన్నారు. మరోవైపు దొరికిన వంద మందిలో 30 మంది యువతులే ఉన్నారు. నిర్వాహకులే వాళ్ల కోసం టికెట్లు వేసి విమానాల్లో రప్పించినట్లు తెలుస్తోంది. దీంతో రేవ్ పార్టీలో వ్యభిచార దందా నిర్వహించి ఉంటారని, నిర్వాహకులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్వహకుల నేర చరిత్ర పై కూపి లాగుతున్నారు.ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!మరోవైపు.. ఈ కేసులో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా, ఇతర మాదకద్రవ్యాలను వినియోగించారు. దీంతో ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు. శాంపిల్స్ ఫలితాలు ఇవాళేడ్రగ్స్ తీసుకున్నారనే అనుమానాల మధ్య పార్టీకి హాజరైన వాళ్ల నుంచి శాంపిల్స్‌ను సేకరించారు పోలీసులు. వీటి ఫలితాలు ఇవాళ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ పార్టీలో తాను లేనని తెలుగు సినీ నటి హేమ చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఆమె వాదనను ఖండిస్తున్నారు. ఆమె కూడా పార్టీలో పాల్గొన్నారంటూ ఓ ఫొటోను విడుదల చేశారు. అంతేకాదు ఆమె కూడా శాంపిల్స్ ఇచ్చారని ప్రకటించారు. -
కలకత్తా యువతులతో వ్యభిచారం
అబిడ్స్: కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అబిడ్స్ ఫార్చూన్ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు, యువతులు, విటులను నగర టాస్‌్కఫోర్స్, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. హైటెక్ తరహాలో అందరి కళ్లుగప్పి వ్యభిచారం నిర్వహిస్తున్న వారందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అఖిలేష్ (36) (అఖిలేష్ ఫహిల్వాన్) అనే వ్యక్తి అబిడ్స్‌లో ఫార్చూన్ లాడ్జిని కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. సమాచారం అందుకున్న నగర సెంట్రల్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. లాడ్జి యజమాని అఖిలే‹Ù, మేనేజర్ రఘుపతి, 16 మంది యువతులు, 6 మంది విటులను అరెస్టు చేశారు. వీరిలో యువతులను తుక్కుగూడలోని రెస్క్యూహోమ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ నర్సింహరాజు తెలిపారు. మిగతా వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసును అబిడ్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మోడల్స్‌తో వ్యభిచారం.. నటి అరెస్ట్
ముంబైలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై కాస్టింగ్ డైరెక్టర్, నటి ఆర్తీ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.సినిమాలో అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలు, మోడల్స్‌ను వేశ్య వృత్తిలోకి దింపుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై నిఘా ఉంచారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు డమ్మీ కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించారు. పక్కా సమాచారంతో దాడులు జరిపగా ఈ తతంగమంతా సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది అని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పక్కా ఆధారాలతోనే ఆర్తీ మిట్టల్‌ను అరెస్ట్ చేశామని, ఈ ఘటనలో ఇద్దరు మోడల్స్‌ను రక్షించి పునరావాస కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. నిందితురాలు ఆర్తి మిట్టల్ సినిమా అవకాశాలు, డబ్బు ఆశ చూపి వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు పోలీసు ఇన్స్పెక్టర్ మనోజ్ సుతార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. Maharshtra | Mumbai Crime Branch Unit 11, Dindoshi police busted a sex racket running in Goregaon area. Two models were rescued from the spot and a 30-year-old casting director, Aarti Mittal was arrested in this case: Mumbai Crime Branch — ANI (@ANI) April 17, 2023 -
Hyderabad: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడుకాకుండా ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గౌలిదొడ్డిలోని కాన్క్లేవ్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో సైబరాబాద్ యాంటీ హ్యుమన్ ట్రాకింగ్ యూనిట్ సభ్యులు శుక్రవారం రాత్రి 7.30 గంటలకు దాడి చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులతో డేటింగ్ యాప్ ద్వారా విటులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ఆర్గనైజర్లు పూర్ణిమా కుమారి (22), మనీష్ కుమార్ పాండే (20), హోటల్ మేనేజర్ శ్రీమంత కలిట (35), విటుడు ఎల్.రవీంద్రరెడ్డిలను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ప్రధాన నిందితుడు ప్రిన్స, ఆర్గనైజర్ అజయ్ అలియాస్ రాహుల్ పరారీలో ఉన్నారు. మహారాష్ట్ర, బీహార్‌కు చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. రూ.1200 నగదు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: (చిత్తూరు: రొంపిచర్లలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు) -
మహిళల అవసరమే ఆసరాగా వ్యభిచారం.. పరారీలో మమత
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని న్యూహౌజింగ్‌బోర్డు కాలనీలో 15రోజులుగా మమత అనే మహిళ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతోంది. చుట్టుపక్కల ఉండే పేద మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకొని వారితో వ్యభిచారం చేయిస్తోంది. బుధవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీ సులకు సమాచారం అందడంతో కాలనీలో ఆమె అద్దెకు ఉంటున్న నివాసంలో దాడి చేశారు. ఇద్దరు మహిళలతో పాటు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డారు. ఆ సమయంలో వ్యభిచార గృహ నిర్వాహకురాలు మమత పరారైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. చదవండి: (Swetha: ఫేస్బుక్ ద్వారా మగాళ్లకు రిక్వెస్టులు పంపుతూ..) -
Mysuru: పక్కా ప్లాన్‌తో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
సాక్షి, మైసూరు: మైసూరు భుగతహళ్లి శివార్లలోని వెంకటగిరి లేఔట్లో ఉన్న ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులు శ్రీధర్ రెడ్డి, సందీప్‌లను అరెస్ట్ చేసి ఓ మహిళను రక్షించారు. ఓ వ్యక్తి పరారయ్యాడు. మైసూరు మహిళా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. చదవండి: (ఉపాధ్యాయ వృత్తికే మచ్చ.. విద్యార్థి తల్లితో సన్నిహితంగా ఉంటూ..) -
కొమరంభీం జిల్లా: మూసేసిన ఫ్యాక్టరీలో గప్‌చుప్‌గా వ్యభిచారం
సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: జిల్లా రెబ్బెన మండల పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రాస్ రోడ్లో మూసివేసిన ఓ పరిశ్రమలో వ్యభిచార గృహాలను నిర్వహించడాన్ని గుర్తించారు. నిందితుడిని జనగాం జిల్లాకు చెందిన మడసి రమేష్ కుమార్‌గా నిర్ధారించారు పోలీసులు. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ నుండి మహిళలను తెప్పించి గుట్టుచప్పుడు వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం తో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్విస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రెబ్బెన పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. -
Bhimavaram: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్
సాక్షి, భీమవరం (ప్రకాశం చౌక్): మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పట్టణంలోని ఓ మసాజ్ సెంటర్‌పై శుక్రవారం రాత్రి దాడి చేసి నిర్వాహకులు, ఏడుగురు మహిళలు, ఒక విటుడిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ బి.శ్రీనాథ్ చెప్పారు. శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. భీమవరం టూటౌన్ సీఐ బి.కృష్ణకుమార్, సీసీఎస్ సీఐ ఎ.రఘుకు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఉప్పాడ రవిప్రకాష్ అదేశాల మేరకు శుక్రవారం రాత్రి పట్టణంలోని టూటౌన్ ఏరియా కెనరా బ్యాంక్ సమీపంలో ఏ9 బ్యూటీ సెలూన్, స్పాపై దాడి చేశారన్నారు. దీనిలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బురద ఝాన్సీలక్ష్మి అలియాస్ నందినితో సహా ఏడుగురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి రూ.31,500 నగదు, చెక్కు బుక్, స్వైపింగ్ మెషిన్ వస్తువులను సీజ్ చేశామన్నారు. చదవండి: (Hyderabad: అర్థరాత్రి తప్పతాగి ఎస్ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..) స్పా నిర్వహణలో ఝూన్సీలక్ష్మీతోపాటు పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన ఇంటి రాహూల్ కూడా ఉన్నట్లు గుర్తించామని, ఇతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. మిగిలిన ఏడుగురు అమ్మాయిలను విజయవాడ హోమ్‌కు తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మసాజ్, స్పా సెంటర్లపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. వీటిపై పర్యవేక్షణ, అకస్మాతు దాడులకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఇటీవల ఓ స్పా సెంటర్‌పై కూడా దాడి చేసి అక్కడ వ్యభిచారం చేస్తున్న వారి కూడా అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేశామన్నారు. ఈ రెండు మసాజ్, స్పా సెంటర్లపై సకాలంలో దాడులు నిర్వహించి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని చాకచక్యంగా పట్టుకున్న సీఐలు కృష్ణకుమార్, రఘు, సిబ్బందిని డీఎస్పీ అభనందించారు. వీరికి అవార్డు, రివార్డుల కోసం ఎస్పీకి సిఫారసు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై వి.రాంబాబు పాల్గొన్నారు. చదవండి: (పెళ్లింట విషాదం.. కొద్దిక్షణాల్లో పెళ్లనగా పెళ్లికుమార్తె ఆత్మహత్య) -
క్రైమ్ సెల్ఫోన్లో బుకింగ్: విటుల వద్దకే అమ్మాయిల డోర్ డెలివరీ!
సాక్షి, యాదాద్రి: ఇద్దరు బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠా ఒకటి పట్టుబడటం యాదగిరిగుట్టలో మరోసారి సంచలనం సృష్టించింది. బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపి వారిని పలు విధాలుగా హింసించిన ఘటన 2018 జూలైలో బయటపడింది. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత గుట్టలో మళ్లీ వ్యభిచారం జరుగుతోందనే అనుమానం కొంతకాలంగా ఉంది. ఆ అనుమానాలు నిజం చేస్తూ ముఠా పట్టుబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ఈ ముఠాకు చెందిన మరి కొంతమంది బాలికలు కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, హైదరాబాద్ జిల్లాల్లో ఉన్నారని అనుమానిస్తున్నారు. వ్యభిచార నిర్వాహకులు సాంకేతికతను ఉపయోగించుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా విటుల వద్దకే అమ్మాయిలను పంపిస్తున్న వైనం వెలుగుచూసింది. ఈ కారణంగానే అనుమానితుల ఇళ్లలో పోలీసులు దాడులు చేసినా ఎలాంటి ఆ«ధారాలూ లభించడం లేదు. సెల్‌ఫోన్ ద్వారా బుక్ చేసుకున్న వారు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు పంపించగానే అమ్మాయిలను పంపిస్తూ దందా కొనసాగిస్తున్నారు. ఇలా ఈ నెల 2వ తేదీన విటుని వద్దకు పంపించే క్రమంలోనే ఒక బాలిక యాదగిరిపల్లి నుంచి తప్పించుకుంది. సిరిసిల్ల వెళ్లేందుకు ప్రయత్నించి.. విటుని వద్దకు వెళ్లాల్సిన బాలిక.. అనసూయ తనను తరచు కొడుతూ హింసిస్తుండటంతో, తనను బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో సిరిసిల్లలో ఉండే వ్యభిచార నిర్వాహకుడు కంసాని శ్రీనివాస్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది. యాదగిరిపల్లి పక్క గ్రామమైన వంగపల్లికి కాలిబాటన చేరుకున్న బాలిక అక్కడ రూ.20 అడుక్కుని జనగామ బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడినుంచి సిరిసిల్ల వెళ్లేందుకు విద్యార్థులను డబ్బులు అడుగుతుండగా విద్యార్థులు 100 నంబర్‌కు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి వివరాలు అడగడంతో ఆ బాలిక కంసాని అనసూయ పేరు చెప్పింది. దీంతో యాదగిరిగుట్టలో మూడేళ్లుగా సాగుతున్న వ్యభిచారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ సమాచారంతో సీపీ అలర్ట్ మైనర్ బాలిక వ్యభిచార కూపంలో చిక్కుకున్న విషయం పోలీసులు మీడియాకు వెల్లడించకముందు (ఈ నెల 3న) కలెక్టర్ పమేలా సత్పతి రాచకొండ సీపీ మహేష్ భగవత్ దృష్టికి తీసుకుపోయారు. ఆయన వెంటనే వ్యభిచార కూపంలో ఉన్న బాలికలను రక్షించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో షీ టీం, ఎస్ఓటీ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నాలుగు చోట్లకు వెళ్లారు. హుస్నాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, కోరుట్లలో ఏకకాలంలో అనుమానితుల ఇళ్లపై మెరుపు దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే మరో మైనర్ బాలిక దొరికింది. ఇద్దరు బాలికలను ప్రస్తుతం అధికారులు సఖి కేంద్రంలో ఉంచారు. చిత్రహింసలతోనే వెలుగులోకి.. యాదగిరిపల్లిలో ఉంటున్న కంసాని అనసూయ వ్యభిచారం చేయిసూ్తనే తిండి పెట్టకుండా, కొట్టడం, తిట్టడం చేస్తుండడంతో అది భరించలేని బాలిక తప్పించుకుంది. ఈ బాలికతో పాటు మరో బాలికను కూడా చిన్నతనంలోనే అనసూయ ఎక్కడినుంచో తెచ్చుకుని తన చెల్లెలు కూతుళ్లని చెప్పి పెంచింది. వారికి కొంత వయసు రాగానే వ్యభిచార కూపంలోకి దించింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఉంటున్న కంసాని శ్రీనివాస్‌కు వద్దకు కూడా పంపిస్తూ మూడేళ్లుగా వ్యభిచారం చేయిస్తోంది. వ్యభిచార నిర్వాహకులు ఎక్కడినుంచో చిన్నారి బాలికలను తెచ్చి తమ బ«ంధువుల పిల్లలుగా పెంచడం, తర్వాత వ్యభిచార కూపంలోకి దించడం యాదగిరిగుట్టలో ఎప్పటినుంచో జరుగుతోంది. 2018 జూలై 30న ఐదేళ్ల చిన్నారిని చిత్రహింసలు పెడుతుంటేనే వ్యభిచార ముఠాగుట్టు రట్టుఅయ్యింది. అప్పట్లో ఏకంగా 34 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. తాజాగా వ్యభిచార కూపం నుంచి బయటపడిన ఓ బాలిక తనకు తల్లిదండ్రులు ఉన్నారని చెప్పింది. నాన్న తాగి వచ్చి అమ్మను కొట్టేవాడని, తనను చిన్నతనంలోనే అమ్మేశారని తెలిపింది. మరో బాలిక తన వివరాలను వెల్లడించలేదు. -
హైటెక్ సెక్స్ రాకెట్
సాక్షి, హైదరాబాద్/హఫీజ్‌పేట్: హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఉద్యోగాల పేరుతో దేశ, విదేశీ మహిళలను ఆకర్షించి, బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పలు వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం 14,190 మంది యువతుల ఫొటోలు, వివరాలు పెట్టి.. కాల్‌సెంటర్ల ద్వారా విటులను ఆకర్షిస్తున్న ఈ గ్యాంగ్.. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా ఈ దందా సాగిస్తోంది. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్ మేనేజర్ రాకేష్ సహా 18 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఈ ముఠా వివరాలను ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ దార కవితతో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ కవిత హోటల్ వర్కర్‌గా పనిచేస్తూ వ్యభిచారం దందా వైపు.. బేగంపేటకు చెందిన మహ్మద్ సల్మాన్ ఖాన్ అలియాస్ సమీర్ 2016–19 మధ్యకాలంలో సోమాజిగూడలోని కత్రియా, పార్క్ హోటళ్లలో పనిచేశాడు. అప్పట్లో వ్యభిచార ముఠా బాధితురాలు ఒకరు ఓ హోటల్లో బస చేయడం గమనించిన సమీర్..సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్స్ అలవాటు ఉన్న సమీర్‌కు మరో డ్రగ్ వినియోగదారుడు, మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన మహ్మద్ అదీమ్ అలియాస్ అర్నవ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి 2016 నుంచి సోమాజిగూడ కేంద్రంగా వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టారు. వీరితో పాటు మొత్తం 17 మంది ప్రధాన ఆర్గనైజర్లు వేర్వేరు రాష్ట్రాలలో వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా దందా సాగిస్తున్నారు. ఒక్కో వాట్సాప్ గ్రూప్‌లో 300 మంది ఆర్గనైజర్లు సభ్యులుగా ఉన్నారు. వీటిద్వారా మొత్తం 14,190 మంది యువతులతో వ్యభిచారం సాగిస్తున్నారు. ముఠా దొరికింది ఇలా... ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన యువతులను విచారించిన పోలీసులు.. గత నెల 15న బేగంపేటకు చెందిన సల్మాన్, పీఅండ్‌టీ సన్‌సిటీకి చెందిన మహ్మద్ అబ్దుల్ కరీంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఆర్గనైజర్ల జాబితా వెలుగులోకి వచ్చింది. దీంతో యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ టీమ్‌తో బృందాన్ని ఏర్పాటు చేసి.. సల్మాన్, కరీంతో పాటు పలువురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరిలో రాడిసన్ బ్లూ హోటల్ మేనేజర్ రాకేష్‌తో పాటు మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన అర్నవ్, టోలిచౌకికి చెందిన మహ్మద్ సమీర్, సోమాజిగూడకు చెందిన హర్బిందర్ కౌర్ అలియాస్ సిమ్రాన్ కౌర్, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన యరసారి జోగేశ్వర్రావు, బాలానగర్‌కు చెందిన నడింపల్లి సాయిబాబా గౌడ్, సన్‌సిటీకి చెందిన శైలేంద్ర ప్రసాద్, యూసుఫ్‌గూడకు చెందిన మహ్మద్ అఫ్సర్, కూకట్‌పల్లికి చెందిన పసుపులేటి గంగాధరి, ఆసిఫ్‌నగర్‌కు చెందిన రిషీ, బీరంగూడకు చెందిన కోడి శ్రీనివాస్, గోల్కొండకు చెందిన అలీసామ్, అనంతపురానికి చెందిన మహ్మద్ ఫయాజ్, కర్ణాటకకు చెందిన విష్ణు, సాయి సుధీర్, ఒడిశాకు చెందిన సర్భేశ్వర్ రౌట్లు ఉన్నారు. వీరు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లలో 39 కేసులలో నిందితులుగా ఉన్నారు. తాజాగా వీరిపై గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి ఠాణాలలో ఐదు కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.95 వేల నగదుతో పాటు 34 సెల్ఫోన్లు, 3 కార్లు, ల్యాప్‌టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ (మాదకద్రవ్యం)ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఆధార్లు.. విటులతో సంప్రదింపుల కోసం నిర్వాహకులు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కోల్‌కతా, అసోం రాష్ట్రాల యువతులతో పాటు థాయ్‌లాండ్, నేపాల్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, రష్యా దేశాల మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విదేశీ మహిళలకు నకిలీ పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు సృష్టించి వివిధ నగరాలకు తరలిస్తున్నారు. దందా సాగుతోందిలా.. ఆర్గనైజర్ల కింద ఉండే బ్రోకర్లు ఉద్యోగా లిప్పిస్తామంటూ పేద మహిళలకు ఎర వేస్తా రు. వారి వివరాలను సేకరిస్తారు. ఆపై బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతా రు. విటులను ఆకర్షించేందుకు బాధిత అమ్మాయిల ఫొటోలు, ఇతర వివరాలు దేశవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లలో పెడతారు. లొకాంటో, స్కోక్కా, మైహెవెన్మోడల్స్.కామ్ నటాషారాయ్. ఇన్ వంటి కాల్‌గర్ల్స్ వెబ్సైట్లలోనూ వాటిని పోస్ట్ చేస్తారు. వీటిని చూసిన విటులు తమకు నచ్చిన యు వతుల కోసం అందులోని వాట్సాప్ నంబ ర్లకు ఫోన్ చేస్తారు. కాల్ సెంటర్ల ప్రతినిధు లు అమ్మాయిల వివరాలు, రేట్లను తెలిపి.. ఏ హోటల్‌కు వెళ్లాలో సూచిస్తారు. ఓకే అనుకున్నాక ఆ ప్రతినిధి విటుడిని ఆర్గనైజర్‌తో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిస్తారు. డీల్ కుది రాక స్టార్ హోటళ్లలో గదులు, ఓయో రూ మ్స్, అవసరమైతే విమాన టికెట్లు బుక్ చేస్తారు. విటులు నగదు లేదా ఆన్లైన్లో చెల్లింపులు చేయాలి. అందులో 30% యువతికి, 35% అమ్మాయిల ఫొటోలను ప్రచారం చేసేవారికి, కాల్‌సెంటర్ ప్రతినిధులకు ఇస్తా రు. 35 శాతం నిర్వాహకులు వాటాలుగా పంచుకుంటారు. ఈ దందాలో ఒక్కో ఆర్గనైజర్ రూ.40 లక్షల వరకు ఆదాయం ఆర్జించినట్లు డీసీపీ కవిత తెలిపారు. -
ఆర్ఎంపీ వైద్యం చేస్తూ.. యువతులతో వ్యభిచారం
సాక్షి, గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఆర్ఎంపీ వైద్యం చేస్తూ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న మహిళపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భవానీపురం స్వాతిరోడ్కు చెందిన రామటెంకి రాధిక భర్త ఆర్ఎంపీగా చేస్తూ కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె ఇంటి వద్దనే వైద్యం చేస్తోంది. దాంతో పాటు వాట్సాప్ ద్వారా పార్టీలను బుక్ చేసుకుని వారికి అమ్మాయిలను పంపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఓ వ్యక్తి రూ.10వేలకు ఓ అమ్మాయిని బుక్ చేసుకున్నాడు. అతనిని గొల్లపూడి స్కూల్ వద్దకు రమ్మని అతని నుంచి రూ.5వేలు తీసుకుని, మిగిలిన డబ్బులు యువతికి ఇవ్వమని ఒప్పందం కుదుర్చుకుంది. స్కూల్ సమీపంలోని బే లీవ్స్ హోటల్లో రూమ్ నంబరు 101 లో ఉన్న ఆ యువతి వద్దకు అతనిని పంపింది. సమాచారం తెలుసుకున్న భవానీపురం సీఐ ఒమర్ సిబ్బందితో హోటల్‌కు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేయిస్తున్న రాధికను అరెస్ట్ చేశారు. బాధితురాలిని హోమ్‌కు తరలించారు. చదవండి: (Hyderabad: మెకానిక్‌తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి!) -
హైదరాబాద్‌లో వ్యభిచార దందా బట్టబయలు
సాక్షి, హైదరాబాద్(పంజగుట్ట): స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడి చేసి సబ్ ఆర్గనైజర్, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... సోమాజిగూడలోని సూర్యానగర్ కాలనీలో ఉన్న నేచ్యురల్ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారం అందుకున్న పంజగుట్ట అడిషనల్ ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు నేతృత్వంలో బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. సబ్ ఆర్గనైజర్ నర్సింహ, ఇద్దరు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలను రెస్క్యూహోంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (గుంటూరులో దారుణం.. బ్యూటీపార్లర్‌లో భార్యను చంపిన భర్త) -
Hyderabad: రాజేంద్ర నగర్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: ఓ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారాన్ని యాంటి హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ బృందం గుట్టురట్టు చేసింది. ముగ్గురు నిందితులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించగా, ఆరుగురు యువతులను రెస్క్యూ హోంకు తరలించనున్నారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న అంజయ్యనగర్‌లోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సైబరాబాద్ యాంటి హ్యూమన్ ట్రాకింగ్ యూ నిట్ బృందం బుధవారం సాయంత్రం 6.30 గంటలకు దాడి చేశారు. ఉజబెకిస్తాన్‌కు చెందిన యువతితో పాటు ఇద్దరు ఢిల్లీ, ఇద్దరు వెస్ట్ బెంగాల్, ఒకరు ముంబైకి చెందిన యువతులకు విముక్తి కలిగించారు. అమీర్‌పేట్ మార్కెట్‌కు చెందిన జితేందర్(35),పుణేకు చెందిన శ్రీకాంత్(47), అపర్ణ సేరెన్ పార్క్ గచ్చిబౌలికి చెందిన యు.లక్ష్మయ్య(42)లను అదుపులోకి తీసుకొని గచ్చిబౌ లి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలంలో 6సెల్ఫోన్లు, 38 కండోమ్ ప్యాకెట్లు, రూ.81,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధిత యు తులను రెస్క్యూ హోంకు తరలించనున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం) -
లాడ్జ్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ముగ్గురు యువతులు, 12మంది..
ఒడిశా(బరంపురం): నగరంలో గత కొద్ది రోజులుగా రహస్యంగా నడుస్తున్న సెక్స్ రాకెట్‌ను ఎస్పీ శరవన్ వివేక్ భగ్నం చేశారు. దీనిని నిర్వహిస్తున్న కేంద్రంపై ఆయనే స్వయంగా మఫ్టీలో దాడి చేయడంతో ముగ్గురు యువతులతో 12మంది విటులను అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన నగర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం బరంపురం పోలీసు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి తానే స్వయంగా మఫ్టీలో బుల్లెట్‌పై బీఎన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బరంపురం టాటా బెంజ్ జంక్షన్లో ఉన్న తులసీ గెస్ట్‌హౌస్(లాడ్జి) వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై దాడి చేయడంతో పాటు కోల్‌కతాకు చెందిన ముగ్గురు యువతులతో పాటు 12మంది నిందితులు పట్టుబడగా, అందరినీ అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లాడ్జి యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నరు. నిందితులను మంగళవారం బరంపురం సబ్ కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ వివరించారు. చదవండి: (పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. చివరికి వేరే అమ్మాయితో..) -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
సాక్షి, గుంతకల్లుటౌన్: స్థానిక ఆచారమ్మ కొట్టాలలోని వ్యభిచార గృహంపై వన్‌టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు శనివారం రాత్రి 11 గంటలకు వన్‌టౌన్ సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ మురారి, సిబ్బంది అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళతో పాటు ఓ యువతి, విటుడిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2వేలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిర్వాహకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
Hyderabad: స్పాల ముసుగులో వ్యభిచారం.. ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా..
సాక్షి, బంజారాహిల్స్: ఫిలింనగర్లో నిబంధనలకు విరుద్ధంగా స్పాల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు స్పా సెంటర్లపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.13లోని మోరా థాయ్ స్పాతో పాటు ఫిలింనగర్‌లోని మరో రెండు స్పాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే మోరా థాయ్ స్పా మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. ఈ స్పా యజమాని విశాల్బాయ్ మున్సుక్ బాయ్ గజేరా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు భాగస్వాములు కార్తీక్, అలీఖాన్‌లు కూడా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఫిలింనగర్‌లోని మరో రెండు స్పాలపై కూడా దాడులు జరిగాయి. ఇక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించి స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసుల వైఖరిపై విమర్శలు... మరోవైపు ఫిలింనగర్‌లోని స్పాలలో గత ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో వెల్లడైంది. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లనే నిర్వాహకులు స్పా కేంద్రాలను వ్యభిచార గృహాలుగా మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ సెక్టార్ పరిధిలోని స్పాలన్నీ వ్యభిచార కూపాలుగా మారాయని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇక్కడి స్పాల వ్యవహారాలపై పోలీసులు విచారణకు ఆదేశించారు. -
Hyderabad: గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు మహిళా ఆర్గనైజర్లతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. ఎస్సై గౌతమ్ వివరాల ప్రకారం.. చింతల్ వాణీనగర్‌లో సరిత(39), పార్వతి(27)అనే ఇద్దరు మహిళలు ఓ గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు మంగళవారం రాత్రి దాడి నిర్వహించి ఇద్దరు నిర్వాహితురాళ్లతో పాటు విటుడు బోయిన్‌పల్లికి చెందిన బండి రాజేందర్(34)లను అదుపులోకి తీసుకుని జీడిమెట్ల పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్) -
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. 17మంది మహిళలకు..
ముంబై: ఉపాధి కల్పిస్తామని ఆశజూపి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టి వారితో డబ్బులు సంపాదిస్తున్న ముఠా గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. గురు వారం ముంబై మీడియాకు పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటికి పనిమనుషులు కావాలన్న ప్రకటనలతో వివిధ రాష్ట్రాలనుంచి మహిళలను రప్పించి వారిని ముంబైలోని ఓ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. అవసరమైన విటులకు ఈ మహిళలను హోటళ్లకు, ప్రైవేట్‌రూమ్‌లకు పంపించి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4న రాజు, సాహిల్ అనే ఇద్దరు వ్యక్తులు తనతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారంటూ ఓ మహిళ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీయూ)ను ఆశ్ర యించడంతో దాన్ని ఫిర్యాదుగా స్వీకరించిన ఈ బృందం రంగంలోకి దిగింది. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నెరుల్ ప్రాంతంలోని శిరవాణే గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 మంది మహిళలను ఏహెచ్‌టీయూ బృందం కాపాడింది. వీరికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (సమాజం తప్పుగా భావించింది.. మాది అన్నా చెల్లి బంధం) -
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ముంబై, గుజరాత్ల నుంచి అమ్మాయిలను..
ముంబై: గుట్టు చప్పుడు కాకుండా థానె పట్టణంలో వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని థానె పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన బిలాల్ కొకాన్ మోరల్ (26) అనే వ్యక్తి థానె, ముంబై, నవీ ముంబై, పుణె, చెన్నై, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లనుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార ముఠాను గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నాడు. ఈ సమాచారాన్ని అందుకున్న థానెలోని మానవ అక్రమరవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీసీ) పోలీసులు వలపన్ని బిలాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటుగా మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం థానెలోని కోప్రీ పోలీసు స్టేషన్లో బిలాల్‌ను ఉంచి మరింత సమాచారాన్ని పోలీసులు రాబట్టేందుకు విచారణ చేస్తున్నారు. -
వ్యభిచార కూపాలు.. విచ్చలవిడిగా సాగుతున్న దందా
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని తంగళ్లపల్లి, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో వ్యభిచార దంగా జోరుగా సాగుతోంది. అయితే ఈ మురికి కూపంలోకి బాలికలను బలవంతంగా దింపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తంగళ్లపల్లి, సిరిసిల్లలో సుమారు 12 మంది బాలికలు ఈ వృత్తిలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మధ్య తంగళ్లపల్లికి చెందిన ఓ మహిళ విజయవాడకు చెందిన 3 ఏళ్ల చిన్నారిని రూ.2 లక్షలకు కొనుగోలు చేయగా ఏపీ పోలీసులు వచ్చి సదరు మహిళను అదుపులోకి తీసుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’లో ఈ నెల 15న ‘వ్యభిచార ముఠా గుట్టురట్టు’ శీర్షికన ప్రచురించడంతో వ్యభిచార మాఫియాలో మానవ అక్రమ రవాణా కూడా జరుగుతున్నట్లు బహిర్గతమైంది. పోలీసుల్లోనే లీకు వీరులు..? జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం రూరల్ సీఐ అనిల్‌కుమార్, తంగళ్లపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి, ఇల్లంతకుంట ఎస్సై మహేందర్, సిబ్బంది వేశ్య గృహాలను తనిఖీ చేశారు. కాగా, తనిఖీలకు ముందే బాలికలను లీకు వీరుల మూలంగా తప్పించినట్లు చర్చ జరుగుతోంది. కొంత మంది పోలీస్ సిబ్బంది వేశ్య గృహాల వారికి ముందుగానే లీక్ చేస్తూ అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యభిచార కూపాల్లో ఉన్న బాలికలకు సంబంధించి పక్కా ఆధారాలు, డీఎన్ఏ టెస్టులు వంటివి నిర్వహిస్తే వారి సంతామేనా..? కాదా..? అని రుజువు చేసి బాలికలకు విముక్తి కలిగించవచ్చు. తంగళ్లపల్లిలో తనిఖీలు చేస్తున్న పోలీసులు వేశ్య గృహాల తనిఖీ సిరిసిల్లక్రైం: సిరిసిల్ల టౌన్, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని వేశ్య గృహాలను మంగళవారం పోలీసులు ఏకకాలంలో తనిఖీ చేశారు. తనిఖీ ల్లో బాలికలు పట్టుబడలేదని వెల్లడించారు. ఆ యా గృహాల్లో ఉంటున్న వారికి కౌన్సెలింగ్ ని ర్వహించారు. ధ్రువీకరణ పత్రాలు లేకుండా ని వాసం ఉండడానికి వీలు లేదని హెచ్చరించా రు. కుటుంబీకులు తప్ప వేరే వాళ్లు ఉంటే వారి కి సంబంధించిన అన్ని వివరాలు ఉండాలన్నా రు. వ్యభిచార గృహాలుగా పేరున్న వారందరి ఆధార్ గుర్తింపులు ఇవ్వాలని ఆదేశించారు. సీఐ అనిల్ కుమార్, ఎస్ఐలు రఫీక్‌ఖాన్, చిననాయక్, మహిళా పోలీసు సిబ్బంది ఉన్నారు. -
Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం
మియాపూర్: గుట్టుచప్పుడు కాకుండా ఓ అపార్ట్మెంట్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను, ఇద్దరు మహిళలను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లోని ప్రభా సాయిధరమ్ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు అపార్ట్మెంట్లో మంగళవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విశాఖపట్నం చిన్నజాగ్రావుపేటకు కిష్టాఫర్ సన్నీ(25), చెలమ భరత్ (35), మరో ఇద్దరు మహిళలను గుర్తించారు. మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా కిష్టాఫర్ సన్నీ, చెలమ భరత్‌లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ వ్యభిచారం నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: (ప్రాణం తీసిన సెల్‌ఫోన్ వివాదం.. నవ వధువు ఆత్మహత్య) -
Hyderabad: అపార్ట్మెంట్లో వ్యభిచారం.. పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై మియాపూర్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ లింగానాయక్ తెలిపిన మేరకు.. మియాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో గురువారం దాడి చేశారు. ఒంగోలుకు చెందిన నిర్వాహకులు షేక్ ఇర్ఫాన్ (22), సాయిగణేష్రెడ్డి (27), మహిళను అదుపులోకి తీసుకున్నారు. దీంతో షేక్ ఇర్ఫాన్, గణేష్రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు. చదవండి: (దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్) -
మియాపూర్‌లో సీక్రెట్‌గా హైటెక్ వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ రైడ్‌లో ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో ఉన్న సాయిరాం రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 1205లో గుట్టుగా హైటెక్ వ్యభిచారం నడుస్తోంది. ఒంగోలుకు చెందిన షైక్ ఇర్ఫాన్(26), సాయి గణేష్ రెడ్డి(27)లు.. మహిళలతో వ్యభిచార వ్యవహారం నడుపుతున్నారు. కాగా, ఫ్లాట్‌లో వ్యభిచారం నడిపిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు శుక్రవారం రైడ్స్ వెళ్లారు. దాడుల్లో భాగంగా ఇద్దరు నిర్వాహాకులను అదుపలోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో అదుపులోకి తీసుకున్న ఓ మహిళను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. వ్యభిచారం నిర్వహణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: న్యూడ్ కాల్స్‌తో పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్.. ప్రియుడ్ని హత్య చేసి యాక్సిడెంట్‌గా డ్రామా -
వ్యభిచార గృహంపై దాడి: ఇద్దరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్(నాగోలు): వ్యభిచార గృహంపై ఎల్బీనగర్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... నాగోలు బండ్లగూడ కృషినగర్‌లో నివాసం ఉండే ఓ మహిళ స్థానికంగా టైలరింగ్ చేస్తోంది. ఈ వృత్తి ద్వారా వచ్చే డబ్బులు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఆమె నివాసంపై దాడి చేయగా వ్యభిచారం చేస్తూ అనూష, కొత్తపేటకు చెందిన గురుజాల అనిల్‌కుమార్ పోలీసులకు పట్టుబడ్డారు పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: (వివాహేతర సంబంధం.. మహిళతో న్యూడ్ కాల్స్.. వాటిని రికార్డ్స్ చేసి!) -
Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, మియాపూర్: అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ యాదగిరిరావు తెలిపిన ప్రకారం.. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో మియాపూర్‌లోని గోకుల్ ప్లాట్స్ ఆదర్శనిలయం అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అపార్ట్మెంట్లోని 501 ప్లాట్‌లో దాడి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అనంతవరం మండలం, అంబగిరి గ్రామానికి చెందిన వి.బాలు(37), అదే విధంగా రంగారెడ్డి జిల్లా ఫరూక్ మండలం, చిలకమర్రికి చెందిన అంతారం కృష్ణయ్య (46)లు ఉన్నారు. వారితో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. బాలు, కృష్ణయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు. కాగా నిర్వాహకుడు ప్రభాకర్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్టు) -
Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్టు
సాక్షి, హైదరాబాద్(సనత్‌నగర్): వ్యభిచార గృహంపై ఎస్సార్‌నగర్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏజీకాలనీ సమీపంలోని విజయ కల్యాణ్ అపార్ట్మెంట్స్లోని ఓ ఫ్లాట్‌లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సార్‌నగర్ పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. కేంద్రం నిర్వాహకుడు స్వామితో పాటు అతనికి సహకరిస్తున్న వాసంశెట్టి దుర్గ (35), రాగుల మల్లేష్ (32)లతో పాటు మరో యువతి, విటుడిగా వచ్చిన గోపాల్ అలియాస్ గోపీని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..) -
Hyderabad: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై సరూర్‌నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సాగర్ మొండల్ అలియాస్ రాజు అలియాస్ బిల్లు (31), రోహన్ మండల్ (22) నగరానికి వచ్చి సరూర్‌నగర్ అనిల్ కుమార్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వెబ్సైట్లో యువతుల ఫొటోలు పెట్టి కస్టమర్లకు సఫ్లై చేస్తున్నారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ తమ దందా నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి ఇక్కడ వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. వీరితో పాటు సహకరిస్తున్న మరో ముగ్గురిని గత డిసెంబర్లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న నాగర్మండల్, రోహన్మండల్పై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..) -
Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని పోలీసుల కళ్లు గప్పి వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ దాడి చేశారు. ఫిజియోథెరపీ పేరుతో ఈ ఫ్లాట్ అద్దెకు తీసుకున్న సదాలక్ష్మి అనే నిర్వాహకురాలు ఆ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తుండగా సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి దాడి నిర్వహించారు. ముగ్గురు యువతులను పునరావాస కేంద్రానికి తరలించి సదాలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పరువు తీస్తానని భార్య బెదిరింపు.. భర్త ఆత్మహత్య) -
గురక శబ్ధంతో వీడిన వ్యభిచార ముఠా గుట్టు
బెంగళూరు: అప్పట్లో.. రాజులు యుద్ధాల సమయంలో శత్రు రాజ్యాలకు భయపడి రహస్య గదులను ఏర్పాటు చేసుకోవడం గురించి చరిత్రలో చదివి ఉంటాం. సాధారణంగా.. ఐటీ రైడింగ్‌లకు భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్ గదుల్లోనూ, వాటర్ ట్యాంక్‌ల్లోనో దాచడం చూస్తుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ చూసి ఉంటాం. కానీ, టాయిలెట్లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని.. అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ముఠా ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఈమధ్యకాలంలో ఇతర రాష్ట్రాల వ్యభిచార ముఠాల వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకర్లు.. పోలీసుల కళ్లు గప్పేలా అతితెలివి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. చిత్రదుర్గలోని ఓ చోట వ్యభిచారం చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకుని స్పెషల్ టీం రైడ్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో గదుల్లో వెతికినా ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలోని బాత్రూమ్ను పరిశీలించగా.. ఒకచోట నుంచి గురక శబ్దం వినిపించింది. శబ్ధం ఎటువైపు వస్తుందోనని పరిశీలించిన ఓ అధికారికి.. టైల్స్ నుంచి రావడం వినిపించింది. అనుమానంతో ఆయన టైల్స్‌పై చెయ్యి వేయగానే.. అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన ఒక చిన్న గది బయటపడింది. పోలీసులు గదిని తెరిచి చూడగా.. అందులో ఒక చిన్న సెల్లార్ ఏర్పాటు చేశారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయట చూడ్డానికి మామూలు ప్రదేశమే అనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. -
Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. పరారీలో ఇషిక
సాక్షి, పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్‌పై దాడిచేసిన ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. పంజగుట్ట దుర్గానగర్‌లో ఓ ఇంటోల స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారం అందుకున్న పంజగుట్ట క్రైమ్ ఇన్స్పెక్టర్ నర్సింహరాజు ముందుగా కానిస్టేబుల్‌ను విటుడిగా పంపారు. వ్యభిచారం జరుగుతోందని తెలుసుకుని ఆకస్మికంగా దాడి చేశారు. నిర్వాహకురాలు ఇషిక పరారీలో ఉండగా డార్జిలింగ్‌కు చెందిన ఓ బాధితురాలితో ఈ వ్యాపారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని రెండువేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (క్షుద్ర భయం కల్పించి.. మూడు నెలలుగా లైంగిక దాడి) -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహాన్ని నడుపుతున్న నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్‌లోని లిటిల్ రాక్ అపార్ట్మెంట్లో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. మెదక్ జిల్లా కాజీపల్లికి చెందిన విజయ్‌కుమార్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు మెదక్ జిల్లా శంకరంపేట్‌కు చెందిన అభిలాష్, మచ్చబొల్లారానికి చెందిన మహిళను(20) అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా వ్యభిచార గృహం నడుపుతున్నట్లు తెలిపారు. విజయ్‌కుమార్, అభిలాష్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళను మెమోరియల్ ట్రస్ట్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్) -
హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీసులు రెండు వారాల క్రితం గుట్టురట్టు చేసిన విదేశీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు హైటెక్ పద్దతిలో దందా చేస్తున్నట్లు గుర్తించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడితో పాటు ఉగాండా జాతీయురాలు, విటుడిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై పీటా యాక్ట్‌తో పాటు విదేశీయురాలిపై పాస్‌పోర్ట్, ఫారెనర్స్ యాక్ట్ కిందా కేసు నమోదు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న మరో ఉగాండా జాతీయుడి కోసం గాలిస్తున్నారు. కీలకంగా వ్యవహరిస్తున్న విదేశీయుడు... విజిట్ వీసాపై వచ్చి పుప్పాలగూడలోని ఫ్రెండ్స్ కాలనీలో నివసిస్తున్న ఓ ఉగాండా జాతీయుడు, స్థానిక వ్యక్తితో కలిసి తమ ఫ్లాట్‌లోనే వ్యభిచార కేంద్రం ఏర్పాటు చేశాడు. సదరు ఉగాండా జాతీయుడు తమ దేశానికి చెందిన మహిళలు, యువతులను విజిట్ వీసాపై టూరిస్టుల మాదిరిగా రప్పిస్తున్నాడు. ఆపై వీరి ఫొటోలను డేటింగ్ యాప్స్‌లో పొందుపరుస్తున్నాడు. వీటిని చూసి ఆకర్షితులైన వారు సదరు యాప్ ద్వారా అతడిని సంప్రదిస్తున్నారు. అలాంటి వారికి నిర్వాహకుడు సూచించిన వాట్సాప్ నంబర్ ఇచ్చే యువతి అతడితో చాటింగ్ చేస్తుంది. ఇదే వాట్సాప్‌ను వాట్సాప్ వెబ్ ద్వారా నిర్వాహకుడు, మధ్యవర్తి గమనిస్తుంటారు. గూగుల్ పే ద్వారా చెల్లింపుల తర్వాత... విటుడితో చాటింగ్, బేరసారాల అనంతరం రేటు ఖరారవుతుంది. ఈ మొత్తాన్ని విటుడు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా చెల్లిస్తూ ఆ స్క్రీన్ షాట్‌ను వాట్సాప్ ద్వారానే యు వతికి పంపిస్తాడు. దీనిని పర్యవేక్షించి మిగిలిన ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సదరు యువతి తమ ఫ్లాట్ లోకేషన్‌ను విటుడికి షేర్ చేస్తుంది. దీనిని వేర్వేరు వ్యక్తులకు షేర్ చేసే అవకాశం లేకుండా లాక్డ్ లోకేషన్ షేర్ చేస్తూ, అది కేవలం ఒకరికి మాత్రమే ఓపెన్ అయ్యేలా సెట్ చేస్తున్నారు ఆ నిర్వాహకులు. లోకేషన్‌ను అన్‌లాక్ చేయడానికి ఉపకరించే కోడ్‌ను విడిగా వాట్సాప్‌లో విటుడికి పంపిస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా... అలా వ్యభిచార గృహం నడిచే ఫ్లాట్‌కు విటుడు చేరుకుంటున్నాడు. ఫ్రెండ్స్ కాలనీ కేంద్రంగా కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా దందా నడుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు రెండు వారాల క్రితం దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు పరారీలో ఉన్న ఉగాండా జాతీయుడి కోసం గాలిస్తున్నారు. ఫ్లాట్ నుంచి విటుడు తిరిగి వెళ్లేప్పుడు అతడి ఫోన్ తనిఖీ చేసే యువతి అందులోని తమ చాటింగ్‌తో పాటు నంబర్‌ను డిలీట్ చేస్తోందని పోలీసులు గుర్తించారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నట్లు ఓ అధికారి వివరించారు. చదవండి: వనపర్తిలో మరో ‘సర్ప్రైజ్’ ఘటన.. ఈసారి భర్త ‘బలి’ -
ఇంట్లో గుట్టుగా వ్యభిచారం.. యువతుల ఫొటోలను పంపి..
సాక్షి, నిజామాబాద్: మోర్తాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందరెడ్డి కాలనీలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆదివారం దాడి చేసి ఇద్దరు విటులను అరెస్టు చేశారు. వాట్సప్ ద్వారా యువతుల ఫొటోలను విటులకు పంపుతూ ఆకర్షిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ముత్యంరాజు తెలిపారు. చదవండి: (పరువు హత్యలు.. నాడు నరేశ్, ప్రణయ్.. నేడు రామకృష్ణ) -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. ఐదుగురి అరెస్ట్.. నలుగురు పరారీ
సాక్షి, మహబూబాబాద్ రూరల్ : వ్యభిచార ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్రపవార్ కేసు వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మహబూబాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొంత మంది ముఠాగా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తునట్టుగా గుర్తించారు. వెంటనే టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్ గండ్రతి మోహన్, మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎడ్లపల్లి సతీష్ వారి సిబ్బందిని తీసుకుని జిల్లా కేంద్రంలోని రెడ్డిబజార్లో గల ఒకగృహం మీద దాడి చేశారు. ఆ గృహంలో సర్వోదయ సంస్థలో పని చేస్తున్న కొందరు వ్యక్తులు, ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యభిచారం నిర్వహిస్తున్న కొందరిని అదుపులో తీసుకున్నారు. పట్టుబడిన వారిలో కురవి మండలంలోని తాట్యా తండా గ్రామ పరిధిలోగల పిల్లిగుండ్ల తండాకు చెందిన బానోత్ రవి, రాజోలు గ్రామ పరిధిలోగల హరిసింగ్ తండాకు చెందిన మాలోత్ మంగిలాల్ అలియాస్ లోకేష్, బంచరాయి తండాకు చెందిన భూక్యా కన్కి, మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరికి చెందిన బాదావత్ సరోజ, సోమ్లా తండాకు చెందిన బదావత్ రాములు (విటుడు) ఉన్నారు. పై వ్యక్తులు మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. చదవండి: (దారుణం: ఒక ఇంట్లో రెండేళ్లపాప నాన్నను ఇంకెపుడు చూడలేదు.. మరో ఇంట్లో) అదే మాదిరిగా మంగళవారం కూడా కొంతమంది మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తుండగా టాస్క్ ఫోర్సు, పోలీసులు పట్టుకున్నారు. వారివద్ద నుంచి పది మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వేణు, పద్మ, స్వాతి, శారద పరారీలో ఉన్నారు. ఈ కేసులో విశ్వసనీయ సమాచారం సేకరించి నేరస్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్ మోహన్, టౌన్ ఇన్స్పెక్టర్ సతీప్, టాస్క్ ఫోర్సు ఎస్సైలు జగదీశ్, రామారావు, టాస్క్ ఫోర్సు సిబ్బందికి ఎస్పీ శరత్ చంద్రపవార్ రివార్డులు అందజేసి అభినందించారు. -
వ్యభిచార గృహంపై దాడి.. పొరుగు రాష్ట్రాల అమ్మాయిలను పిలిపించి..
హుబ్లీ (కర్ణాటక): హుబ్లీ తాలూకా వరూరు గ్రామంలోని ఎస్జీ టవర్స్, అమృత కంఫర్ట్ హోటల్లో వేశ్యావాటిక నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. యజమాని వెంకటేష్ నాయక్, మేనేజర్ వీరేష్ మురుడేశ్వర, కేఎం.ప్రదీప్‌గౌడ, మంజునాథ గౌడను అరెస్ట్ చేశారు. అక్కడ చిక్కుకుపోయిన యువతులను రక్షించారు. నిందితులు పొరుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను పిలిపించి ఆన్లైన్ ద్వారా విటులను రప్పించే వారని పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: (స్పాలో అక్రమాలంటూ.. ఓనర్‌ను బెదిరించి, ఆపై) -
ప్రేమపేరుతో ట్రాప్.. లాడ్జికి తీసుకెళ్లి.. మద్యం తాగించి
మంగళగిరి(గుంటూరు జిల్లా): ప్రేమ పేరుతో మైనర్(16)ను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించబోయారు. బాలిక చాకచక్యంగా తప్పించుకుని డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సత్వరమే స్పందించి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మంగళగిరి డీఎస్పీ రాంబాబు మంగళవారం విలేకరులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టకు చెందిన కంసాని రాజేష్ వివాహం చేసుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొత్తపేటలో నివాసముంటున్నాడు. కొద్ది రోజులుగా రాజేష్ మంగళగిరిలోని పార్కు రోడ్డులో ఓ బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి గత నెల 22న రాత్రి రాజేష్ తన బంధువులు అవినాష్, వినోద్ సహాయంతో బాలికను కారులో యాదగిరిగుట్ట తీసుకువెళ్లి ఓ లాడ్జిలో ఉంచాడు. అక్కడ మద్యం తాగించి బాలికను అవినాష్ లోబర్చుకున్నాడు. రాజేష్ బంధువు సిరి వ్యభిచారం నిర్వహిస్తుండగా బాలికను ఆ కూపంలోకి దించాలని చూశారు. దీన్ని గ్రహించిన బాలిక తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బృందాలుగా ఏర్పడి రాజేష్, అవినాష్, వినోద్, సిరిని అరెస్ట్ చేసి బాలికను రక్షించారు. బాలిక కనిపించకుండా పోయిన రోజునే ఆమె తల్లిదండ్రులు మంగళగిరిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందికి అర్బన్ ఎస్పీ రివార్డు ప్రకటించారు. సమావేశంలో సీఐ భూషణం, ఎస్ఐలు నారాయణ, మహేంద్ర పాల్గొన్నారు. -
ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు
సాక్షి, చెన్నై (తమిళనాడు): ఇళ్లల్లో పని పేరిట త్రిపుర రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలను తీసుకొచ్చి.. ఓ ముఠా వ్యభిచార కుంపంలో దించి చిత్ర హింసలకు గురి చేసింది. ఈ ఘటన చెన్నైలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. త్రిపుర రాష్ట్రం శివజాల ప్రాంతానికి చెందిన సలీమా ఖదున్(38) అక్కడి బాలికలు, యువతులకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి బెంగళూరు, చెన్నైకు పంపిస్తోంది. ఈ క్రమంలో త్రిపురకు చెందిన నాలుగురు బాలికల్ని తొలుత ఓ బ్యూటీ పార్లర్లో ఉద్యోగం నిమిత్తం పంపించింది. కొన్నాళ్లు అక్కడున్న ఆ బాలికల్ని చెన్నైకు తరలించారు. ఈనెల 17వ తేదీ చెన్నై శివారులోని కేలంబాక్కం పడూర్‌లోని ఓ నివాసంలో ఈ బాలికల్ని ఉంచారు. అక్కడ అలావుద్దీన్, మైదీన్, అన్వర్, హుస్సేన్ అనే నలుగురు వ్యక్తులు బాలికలను చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టారు. ఈసీఆర్ మార్గంలోని కొన్ని రిసార్టులకు పంపించి బలవంతంగా వ్యభిచార కుంపంలోదించారు. ఈనెల 26న వారి నుంచి తప్పించుకున్న ఓ 16 ఏళ్ల బాలిక గస్తీ పోలీసుల్ని ఆశ్రయించింది. ప్యారిస్ పోలీసులు ఆ నలుగురి బాలికల్ని రక్షించారు. అయితే, ఆ మహిళతో పాటుగా ముఠా సభ్యులు మాత్రం తప్పించుకున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా బాధిత బాలికలను త్రిపురకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థిని ఆత్మహత్య పళ్లిపట్టు: ప్లస్‌టూ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆర్కేపేట పోలీసులు కథనం మేరకు బాలాపురం గ్రామానికి చెందిన స్నేహ(17) స్థానికంగా ఉంటున్న ప్రభుత్వ మహాన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. ఈ బాలిక తల్లిదండ్రులు ఐదేళ్ల కిందట మృతి చెందడంతో అత్తమ్మ మునియమ్మ వద్ద ఉంటోంది. స్నేహ పేరిట దాదాపు రూ.2 కోట్ల విలువైన ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్నేహకు వివాహం చేసేందుకు అత్త మునియమ్మ నిర్ణయించినట్లు సమాచారం. కాగా వివాహంపై ఆసక్తి లేని స్నేహ ఇంట్లో ఒంటిరిగా ఉంటున్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ముగ్గురు అరెస్టు
Warangal: హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి నిర్వహించి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. కొత్తురుజెండాలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం జరుగుతుందని ఆయన తెలిపారు. నిర్వాహకులు కొత్తురుజెండాకు చెందిన ప్రీతి ఉపాధ్యాయ, ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన బండి సురేష్, విటుడు వరంగల్ కొత్తవాడకు చెందిన మామిడి విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసి హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను -
సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. యువతితో కలిసి నీలిచిత్రాలు చిత్రీకరిస్తూ, ఆపై
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకలో సెక్స్ రాకెట్ గుట్టురట్టయినట్లు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి పొత్కపల్లి పోలీసులు గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా అసలు విషయం బయట పడినట్లు సమాచారం. గత కొంతకాలంగా మడకకే చెందిన ఓ యువతితో రాకేశ్, మరికొందరు నీలిచిత్రాలు చిత్రీకరిస్తూ, నీలి క్యాసెట్ల దందాను నడుపుతున్నట్లు తెలిసింది. పోలీసులు పక్కా సమాచారంతో ఆ యువకుడిని పట్టుకోగా వీణవంక మండలంలోని చల్లూరు సెల్ పాయింట్లో నీలి క్యాసెట్లు లభ్యమైనట్లు విశ్వసనీయ సమాచారం. నీలి చిత్రాల ముఠా గత కొంతకాలంగా యువతులను, మహిళలను లొంగదీసుకొని వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం వెనక చాలామంది ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై పొత్కపల్లి ఎస్సై ఎస్.లక్ష్మణ్‌ను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, వివరాలు తర్వాత చెబుతామని పేర్కొన్నారు. (చదవండి: Health Benefits of Butter: ఇమ్యూనిటీని పెంచడంలో ఇదే కీలకం.. దూరంపెట్టకండి) -
సెక్స్ రాకెట్: టాప్ మోడల్, నటి అరెస్ట్
ఓ స్టార్ హోటల్లో గుట్టుగా సెక్స్ రాకెట్ నడుపుతున్న ఓ మహిళను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. జూహులోని ఓ 5 స్టార్ హోటల్లో పలువురు టీవీ నటులు, మోడల్‌తో ఆమె ఈ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు తెలిసింది. అరెస్టయిన సదరు మహిళను టాప్ మోడల్, టీవీ నటిగా పోలీసులు గుర్తించారు. లాక్డౌన్లో ఉపాధి కోల్పోవడంతో వ్యభిచారం నడుపుతున్నట్టు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. కాగా సదరు మోడల్ పేరు ఇషా ఖాన్‌గా సమాచారం. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు సమాచారం ప్రకారం.. జూహులోని 5 స్టార్ హోటల్లో సదరు మోడల్ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చదవండి: పాయల్ రాజ్‌పుత్‌పై కేసు నమోదు దీంతో కస్టమర్లుగా ఇషాఖాన్కు పోలీసులు ఫోన్ చేశారు. దీంతో వారితో గంటకు ఒక్కరికి రూ. 2 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. ఈ ఒప్పందం కుదరడంతో ఆమె పోలీసులకు కొంతమంది అమ్మాయిల ఫొటోలను వాట్సప్‌లో పంపించింది. ఆ తర్వాత వారిని కలుసుకోవడానికి జూహులోని ఓ స్టార్ హోటల్‌కు రావాల్సిందిగా ఆమె చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హోటల్‌కు వెళ్లిన పోలీసులు సదరు మోడల్‌తో పాటు మరో ఇద్దరూ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఈ వృత్తిలోకి దిగినట్లు చెప్పారు. అనంతరం ఈ రాకెట్ నడుపుతున్న ఇషాఖాన్‌పై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మరోఇద్దరి అమ్మాయిలను పునరావస కేంద్రాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. Maharashtra | Mumbai Crime Branch on Friday busted a high-profile prostitution racket at a five-star hotel in Juhu. A TV actress was arrested and two people, including a model and another TV actress, have been rescued. — ANI (@ANI) August 21, 2021 -
కరీంనగర్లో హైటెక్ వ్యభిచారం: అంతా ఆన్లైన్లోనే..
సాక్షి, కరీంనగర్: లగ్జరీ ఇళ్లు.. సంపన్నులు ఉండే ప్రాంతాలు.. శివారుకాలనీలు అడ్డాగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో అనుమానం రాకుండా హైటెక్ వ్యభిచారం సాగుతోంది. యువకులు, సంపన్నులు, పేరున్న వారితో ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ.. వాట్సాప్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు పంపిస్తూ.. వలపువల వేస్తున్నారు. రేట్ ఫిక్స్ చేసుకుని దందాను గుట్టుగా సాగిస్తున్నారు. ఇటీవల నిఘా పెట్టిన పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తుండగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. అంతా వాట్సాప్‌లోనే.. ► వ్యభిచార కేంద్రం నిర్వాహకులు కస్టమర్లతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. సదరు గ్రూపుల్లో యువతుల ఫొటోలు పెడుతూ ఆకర్షిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొందరు దంపతులు కలసి ఈ దందాను సైలెంట్‌గా నడిపిస్తున్నారు. ► ఎక్కువగా యువత, ఇంజినీరింగ్, పీజీ కళాశాలలకు చెందిన విద్యార్థులకు వలపువల విసురుతూ.. తమ మనిషిని పంపించి పరిచయాలు పెంచుకొని దందాకు శ్రీకారం చుడుతున్నారు. ► జిల్లాలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులు, పేరున్న పెద్దమనుషులు, విద్యాసంస్థల కరస్పాండెంట్ల వద్దకు యువతులనే నేరుగా పంపిస్తున్నారని సమాచారం. ►నగరశివారు ప్రాంతాల్లో అయితే ఎక్కువగా జనాలు వచ్చిపోవడం చూసి చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమందిస్తున్నారని జిల్లాకేంద్రంలోనే కొత్తదారులు వెతుకుతున్నారు. నగరంలోని మంకమ్మతోట, జ్యోతినగర్, భాగ్యనగర్, తీగలగుట్టపల్లి, విద్యానగర్, భాగ్యనగర్, చైతన్యపురి, బ్యాంక్కాలనీల్లో పెద్దపెద్ద అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని గుట్టుగా దందా నడిపిస్తున్నారు. ► అదే విధంగా కరీంనగర్‌లోని కొన్ని లాడ్జీల్లోనూ విచ్చలవిడగా వ్యభిచారం జరుగుతోందని అరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి అద్దె ఇళ్లు, ప్లాట్లలో వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ► ఫోన్ల ద్వారానే యువతుల ఎంపిక, బేరం అన్ని జరుగుతుంటాయని తెలిసింది. కొందరు ఉన్నత చదువులు చదివిన యువతులు కూడా తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా రొంపిలోకి దిగుతుండడం బాధాకరమైన విషయమని ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసుల నిఘా వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టారు. కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెలలో టూటౌన్ పరిధిలోని సప్తగిరికాలనీలోని ఓ ఇంట్లో దాడిచేసి వ్యభిచార నిర్వాహకులైన భార్యభర్తలు, ముగ్గురు విఠులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.37,380 స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15న కరీంనగర్ రూరల్ ప్రాంతంతోని తీగలగుట్టపల్లిలో ఒక వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకుడితో పాటు విఠుడిని అరెస్టు చేశారు. దందాపై పోలీసులు నిఘా పెడుతూ అరెస్టు చేస్తున్నప్పటికీ ఎక్కడోఒకచోట గుట్టుగా నడుస్తూనే ఉంది. ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగితే డయల్ 100 ద్వారా, సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. వేళ్లూనుకుంటున్న దందా.. కరీంనగర్ జిల్లాకేంద్రంలో వ్యభిచార దందా వేళ్ళూనుకుంటోంది. నగరం నడిబొడ్డున వ్యభిచార కేంద్రాలు వెలుస్తుండగా.. గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వారి అర్థిక స్థితిగతులను ఆసరాగా చేసుకుని రొంపిలోకి దింపుతున్నారు. పోలీసులు దాడులు చేసినప్పటికీ.. దందా ఆగడం లేదు. గతంలో చింతకుంట, రేకుర్తి, హౌసింగ్‌బోర్డుకాలనీ శివారు ప్రాంతాల్లో జరిగే వ్యభిచారం ఇప్పుడు జిల్లాకేంద్రంలోనే హైటెక్ హంగులతో కొనసాగిస్తూ.. పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జిల్లా కేంద్రంలోనే రెండు వ్యభిచార కేంద్రాలపై పోలీసులు దాడిచేసి నిర్వాహకులు, విటులను అరెస్టు చేశారు. -
సెక్స్‌వర్కర్లను రప్పించి.. హోటల్ గదిలో గుట్టుగా వ్యభిచారం
చిక్కడపల్లి: చిక్కడపల్లిలోని సాయికృప హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా చిక్కడపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటనలో మేనేజర్ బి.ఉషశ్రీ (22) సహా హోటల్లో హౌస్‌కీపర్లుగా పని చేస్తున్న ఇ.శ్రీకాంత్ (24), కె.సాయికుమార్(23)లను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి మూడు ఖరీదైన సెల్ఫోన్లు, 10 నిరోధ్ ప్యాకెట్లు, రూ.8 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ పాలడుగు శివశంకర్‌రావు వివరాల ప్రకారం.. సులువుగా డబ్బు సంపాదించేందు కోసం సూర్యపేటకు చెందిన ఉషశ్రీ సాయికృప హోటల్లోని 205 నంబర్ గదిని అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాలకు చెందిన సెక్స్‌వర్కర్లను రప్పించి వారికి వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ షేరింగ్‌తో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. హోటల్లో హౌస్‌కీపింగ్ జాబ్ చేస్తున్న సిద్ధిపేటకు చెందిన శ్రీకాంత్, నల్గొండకు చెందిన సాయికుమార్లు ఆమెకు సహకరించేవారు.మధ్యవర్తులుగా వ్యవహరించిన విష్ణు, ధర్మాలు పరారీలో ఉన్నారు. సీసీఎస్ పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం రాత్రి హోటల్‌పై దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. -
హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం
మాదాపూర్: హైటెక్ సిటీలోని ఓ స్టార్ హోటల్‌పై యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ దాడి చేసి విదేశీ యువతులు, మోడళ్లతో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసింది. నిర్వాహకుడు పరారీ కాగా, ఐదుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించింది. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్‌లోని ఓ స్టార్ హోటల్లో ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతుల పేరిట ఐదు రూమ్‌లు బుక్ చేశారు. నిర్వాహకులు అర్నవ్, ప్రిన్స్‌లు ఫోన్లో విటులతో మాట్లాడి హోటల్‌కు రప్పించి యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం 5 గంటలకు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ సదరు హోటల్‌పై దాడి చేసింది. వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుంది. విటుడు షేక్‌పేట్‌కు చెందిన జ్ఞాన శేఖర్ మణికంఠన్(44)ను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ గదులలో రూ.29,560 నగదు, కండోమ్ ప్యాకెట్లు, సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. కాగా, యువతులను రెస్క్యూ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖైరతాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం
ఖైరతాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై సైఫాబాద్ పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ షాదన్ కళాశాల ఎదురుగా చింతలబస్తీ మార్గంలో ‘టీఎనీ్టఏ బ్యూటీ పార్లర్ అండ్ స్పా’ సెంటర్ నడుస్తోంది. ఈ సెంటర్‌కు మసాజ్ కోసం వచ్చిన వారిని వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో విధుల్లో ఉన్న రాంగోపాల్‌పేట ఇన్స్పెక్టర్ చంచల్ బాబు, సైఫాబా ద్‌కు చెందిన ఇద్దరు ఎస్ఐలు, పలువురు సిబ్బందితో ప్రణాళిక సిద్ధం చేశారు. తొలుత ఓ కానిస్టేబుల్‌ను పంపి బేరం కుదుర్చుకున్నాక అతను సమాచారం ఇవ్వడంతో పోలీసులు దాడులు చేశారు. అక్కడ నిర్వాహకులు హీనా తబస్సుమ్, జైనబ్ తబస్సుమ్‌తో పాటు విటులు మొయినుద్దీన్, పుర్కాన్‌అలీ, సాజిద్‌ఆలీ, మొయిన్ మహబూబ్ హుస్సేన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారితో ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పీటా చట్టం కింద నిర్వాహకులు, విటులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: గచ్చిబౌలి హోటల్లో వ్యభిచారం... ఆరుగురి అరెస్టు) -
కూకట్‌పల్లిలో వ్యభిచారం గుట్టురట్టు.. యువతులను రప్పించి..
సాక్షి, హైదరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ అపార్టుమెంట్‌లోని ఇంటిపై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు విటులను అరెస్ట్ చేసిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లోని ప్లాట్‌ను చరణ్‌రాజు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ ప్లాట్‌కు ఇద్దరు యువతులను రప్పించి కాల్స్, వాట్సప్‌ల ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడు చరణ్‌రాజుతో పాటు విటులు లక్ష్మారెడ్డి, భూష రమేశ్‌తో పాటు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.3 వేల నగదు, సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మహిళా కానిస్టేబుల్‌ను అసభ్యంగా తాకుతూ.. ఉప్పల్‌లో లారీ బీభత్సం.. ఒకరు మృతి -
ఓయో లాడ్జ్‌లో గుట్టు చప్పుడు కాకుండా..
హస్తినాపురం: గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జ్ యజమానిని వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆటోనగర్‌లో మదిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి (40) ఓయో లాడ్జీని నడిపిస్తున్నాడు. కొంతకాలంగా తన లాడ్జ్‌లో వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గతవారం లాడ్జ్‌పై దాడి చేసి మహిళలను,విటులను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రాఘవేందర్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (టిక్‌టాక్‌లో బాసలు చేశాడు.. ఆశలు రేపాడు) -
వాట్సాప్ ద్వారా దందా: భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
స్పా ముసుగులో యువతులను వ్యభిచార కార్యక్రమాల్లోకి దింపుతున్న వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో అమ్మాయిల ఫోటోలు పంపి, వారిని ఆకర్షించి, వ్యభిచార దందా సాగిస్తున్న ఉదంతాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు చేధించారు. వీరిలో ప్రధానంగా ఒక మహిళ వుండటం మరింత ఆందోళన రేపింది. వివరాల్లోకి వెళితే, ఘజియాబాద్ నగర పరిధిలోని రాజ్ హంస ప్లాజాలోని మూడు స్పా సెంటర్లలో సెక్స్‌రాకెట్ కొనసాగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఇందిరాపురంలోని మూడు స్పాస్లపై జరిపిన దాడుల్లో 9 మంది యువతులు సహా, మొత్తం 19 మందిని అరెస్టు చేశారు. యువతుల ఫోటోల ద్వారా నగరంలోని విటులను స్పాలకు ఆహ్వానించి ఈ రాకెట్ నడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ మహిళ ఆధ్వర్యంలో ఈ దందాను నడిపిస్తున్నారని అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ కేశవ్ కుమార్ వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న యువతుల నుంచి రూ. 16 వేలను, 24 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. స్పా సెంటర్లు నిర్వహిస్తున్న వారిలో కొందరు పరారీలో ఉన్నారని, మానవ అక్రమ రవాణా నివారణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు : బాలీవుడ్ కొరియో గ్రాఫర్ అరెస్ట్
సాక్షి, ముంబై: ముంబై పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార రాకెట్‌ను ఛేధించారు. ఈ కేసులో బాలీవుడ్ కొరియో గ్రాఫర్ ఆగ్నేస్ హామిల్టన్ (56) పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని లోఖండ వాలాలో డాన్స్ క్లాసులు నిర్వహించే ఆమె వ్యభిచారం నిమిత్తం విదేశాలకు యువతులను తరలిస్తోందన్న ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం డాన్స్ అకాడమిని నిర్వహిస్తున్న ఆగ్నేస్ డ్యాన్స్ క్లాసులు పేరుతో అమ్మాయిలకు ఎరవేస్తుంది. ఆ తరువాత విదేశాల్లో, బార్లలో డాన్స్ చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయంటూ మభ్యపెడుతుంది. అనంతరం వారిని వ్యభిచారంలోకి బలవంతంగా దించుతోంది. ఇలా కెన్యా, బహ్రెయిన్ దుబాయికి అమ్మాయిలను తరలిస్తుంది. ముఖ్యంగా ఇలా ఒక యువతిని తరలిస్తుండగా ఆమె క్రైం బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించడంతో ఆమె బండారం బట్టబయలైంది. కెన్యా హోటల్లో ఉద్యోగమంటూ సదరు యువతిని కెన్యాకు తరలించగా, అక్కడ రజియా పటేల్ అనే మరోవ్యక్తి (హామిల్టన్ ఏజంట్) ఆమెను నైరోబికి తీసుకెళ్లాడు. అక్కడ వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతం చేయడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశామని క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ దిలీప్ సావంత్ తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఇండియా మలేషియా మధ్య చక్కర్లు కొడుతూ విదేశీ వ్యభిచార రాకెట్‌ను గతకొన్నేళ్లుగా నిర్వహిస్తోందని విచారణ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాదు ఈ విషయాలను ఎవరికైనా చెబితే మత్తుమందుల కేసులో ఇరికిస్తానని కూడా బెదిరిస్తుందట. ఇలా విదేశాలకు పంపిన ప్రతి యువతికి 40వేల రూపాయలు తీసుకుంటుందట. -
బాడీ మసాజ్ ముసుగులో వ్యభిచారం
చిలకలగూడ: బాడీ మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై దాడి చేసి నిర్వాహకుడితోపాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ. 20 వేల నగదు, ఏడు సెల్ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహరాజులు తెలిపిన మేరకు.. బెంగుళూరుకు చెందిన సమీర్ అగర్వాల్ (40) ఆరునెలల క్రితం మెట్టుగూడలో స్పా పేరిట మసాజ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ‘లోకొంటో’ అశ్లీల వెబ్సైట్లో అందమైన యువతుల ఫొటోలతోపాటు తన సెల్‌ఫోన్ నంబర్ పెట్టాడు. ఆకర్షితులైన వారు ఫోన్ చేస్తే వారి పూర్తి వివరాలు తెలుసుకుని తన స్పా సెంటర్ కు పిలిపించుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. మూడు రోజుల క్రితం చిలకలగూడ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఓ కానిస్టేబుల్‌ను విటుడిగా పంపించి వివరాలు సేకరించి పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకుడు సమీర్ అగర్వాల్ (40)తో పాటు అక్కడ పనిచేస్తున్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన షాకీర్‌అలీ (35), సుమిత్‌సర్కార్ (28), విటులు యుపీకి చెందిన అమిత్‌బోస్ (40), నగరానికి చెందిన శశాంక్ (25), శ్రీకాంత్ (27), వెస్ట్ బెంగాల్‌కే చెందిన యువతులు మోంటీసింగ్ (24), లి యాదాస్ (25)లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 20.130 నగదు, ఏడు సెల్ఫోన్లు, కండోమ్ ప్యాకె ట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కుషాయిగూడ: సెలూన్ ముసుగులో మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తున్న ఓ సెలూన్ సెంటర్‌పై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి నిర్వహాకులతో పాటుగా పలువురిని అరెస్టుచేశారు.డాక్టర్ ఏఎస్‌రావునగర్‌లో స్పా సెలూన్ సెంటర్లో కొంత కాలంగా పలువురు మహిళలతో క్రాస్ మసాజ్‌ను నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు సెంటర్‌పై ఆకస్మిక దాడులు జరిపారు. నిర్వహాకుడు హరీష్‌తో పాటుగా మసాజ్ చేస్తున్న ఇతర రాష్ట్రాల మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, 500 నగదు స్వాధీనం చేసుకొని కుషాయిగూడ పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేశారు. -
అక్రమ రవాణాలో బాలికలే టార్గెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకవైపు చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు బలంవంతపు వ్యభిచారం రొంపిలో మైనర్లను దించి వ్యాపారం చేసే ధోరణి పెచ్చుమీరుతోంది. మానవ అక్రమ రవాణా ముఠాలు ప్రధానంగా మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్నాయి. చిన్నపిల్లలైతే ప్రతిఘటించలేరనే ధీమాతో వారిని భయపెట్టి ఏ పని అయినా చేయించవచ్చనే ఉద్దేశంతో అక్రమ రవాణా ముఠాలు దారుణాలకు ఒడిగడుతున్నాయి. వ్యభిచార గృహాలు, పరిశ్రమలు, ఇళ్లల్లో, దుకాణాల్లో, ఇటుక బట్టీలు, హోటళ్లలో పని చేసేందుకు చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నారు. ఇటీవల చిన్నారులతో వ్యభిచారానికి గిరాకీ పెరిగిందని పలు సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. గడిచిన మూడేళ్లలో నమోదైన కేసులు, చిన్నారుల విముక్తిని పరిశీలిస్తే రాష్ట్రంలో మైనర్ల అపహరణ కేసులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 2015లో 40 కేసుల్లో 40 మందికి, 2016లో 49 కేసుల్లో 67 మందికి, 2017లో 77 కేసుల్లో 84 మందికి విముక్తి లభించింది. ఏదో మొక్కుబడిగా అన్నట్టుగా గుంటూరులో 2017లో ఒక కేసు, రాజమహేంద్రవరంలో 2016లో ఒకటి, 2017లో నాలుగు కేసులు నమోదు చేశారు. విజయవాడలో 2016లో ఒకటి, 2017లో 2 కేసులు నమోదు చేశారు. విశాఖపట్నం 2015లో 2, 2017లో ఒకటి, శ్రీకాకుళంలో 2015 ఒకటి కేసు మాత్రమే నమోదు చేశారు. తూర్పు గోదావరిలో 2017లో మూడు కేసులు, పశ్చిమ గోదావరిలో ఒకటి, ప్రకాశం జిల్లాలో ఒక కేసు మాత్రమే నమోదు చేశారు. చాలా జిల్లాల్లో కనీసం మైనర్ బాలల అక్రమ రవాణాపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మైనర్ బాలల అక్రమ రవాణాపై, బాలల వెట్టి చాకిరిపై దృష్టి పెట్టాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. -
వ్యభిచార ముఠా చెర వీడిన అమ్మాయిలు
న్యూఢిల్లీ/వారణాసి: అంతర్జాతీయ వ్యభిచార ముఠా చెర నుంచి 16 మంది నేపాలీలుసహా 18 మంది అమ్మాయిలను ఢిల్లీ, వారణాసి నేర విభాగం పోలీసులు రక్షించారు. అమ్మాయిలనందరినీ గల్ఫ్ దేశాలకు అక్రమంగా తరలించి వ్యభిచార ఊబిలో దించాలని ఓ అంతర్జాతీయ ముఠా కుట్రపన్నింది. ఈ కుట్రను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టుచేసి ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలను సహాయ శిబిరాలకు, నేపాల్ రాయబార కార్యాలయానికి పంపనున్నట్లు ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమన్ చీఫ్ స్వాతి మలివాల్ మీడియాతో చెప్పారు. అమ్మాయిలను ముఠా నిర్భంధించిన ఇంటిలో 68 పాస్‌పోర్టులు దొరికాయని, వీటిలో ఏడు భారత పాస్‌పోర్టులని స్వాతి పేర్కొన్నారు. ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి కొందరు నేపాలీ అమ్మాయిలను ముఠా ముందుగా వారణాసికి తీసుకొచ్చింది. వీరిలోంచి ఇద్దరు అమ్మాయిలు జూలై మొదటివారంలో తప్పించుకుని నేపాల్ పోలీసులకు, నేపాల్ ఎంబసీకి సమాచారమిచ్చారు. ఎంబసీ ఇచ్చిన వివరాలతో పోలీసులు వారణాసిలో ఆరేడు చోట్ల సోదాలుచేసి ముఠాతో సంబంధమున్న జైసింగ్ అనే వ్యక్తిని అరెస్టుచేశారు. ఇతను ఇచ్చిన సమాచారంతో వారణాసి, ఢిల్లీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు అమ్మాయిలను రక్షించారు. -
మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం
విజయవాడ: మసాజ్ సెంటర్లలో బెజవాడ పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో టాస్క్ ఫోర్క్ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నగరంలోని మొగల్రాజపురం, లబ్బీపేట, గురునానక్ కాలనీల్లోని నాలుగు మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేశారు. వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరు మహిళా నిర్వాహకులతో పాటు 11 మంది వ్యభిచారం చేస్తోన్న మహిళలను, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డైమండ్ బ్యూటీ పార్లర్, లా రాయల్స్ బ్యూటీ పార్లర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీనివాసులు దొరికాడు
సాక్షి, హైదరాబాద్ : వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నిర్వహిస్తూ, పీడీ యాక్ట్ ప్రయోగం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శ్రీనివాసులును ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బైరామల్‌గూడకు చెందిన శ్రీనివాసులు అనేకమంది మహిళలు, యువతుల్ని వ్యభిచార దందాలోకి దింపాడు. ఈ రకంగా సంపాదించిన సొమ్ముతోనే బైరామల్‌గూడలో 200 గజాల స్థలంలో మూడు పోర్షన్స్తో కూడిన ఇల్లు సైతం కట్టినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఏళ్ళుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఇతగాడిపై మలక్‌పేట, బంజారాహిల్స్, సైదాబాద్, మీర్‌పేట, సరూర్‌నగర్, వనస్థలిపురం ఠాణాల్లో పదికి పైగా కేసులు నమోదయ్యాయి. శ్రీనివాసులు నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ ఐదు నెలల క్రితం పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసులు తీసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న ఇతగాడి కోసం ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ముమ్మరంగా గాలించారు. ఈ నేపథ్యంలో కేపీహెచ్‌బీ ప్రాంతంలో తల దాచుకున్నట్లు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకుని సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. వీరు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
బంజారాహిల్స్‌లో వ్యభిచారం.. నటి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో వ్యభిచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులతో పాటు, నిర్వాహకుడిని అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ పద్మారావునగర్‌కు చెందిన జనార్దన్‌రావు రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన జనార్దన్ గతంలో ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయిలను నగరానికి తరలించి వ్యభిచారం నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే తాజాగా ముంబైకి చెందిన ఓ బాలీవుడ్ నటిని రప్పించాడు. సైనిక్‌పురికి చెందిన అమిత్ మహేంద్ర అనే విటుడిని హోటల్‌కు పిలిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తన సిబ్బందితో కలిసి హోటల్లో తనిఖీ చేయగా రూ.40,400 నగదుతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్ నటి, విటుడితో పాటు సూత్రధారి జనార్దన్‌రావును అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
కర్నూలు : నగర శివారులోని సంతోష్‌నగర్ టీజీవీ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును షీటీమ్స్ రట్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం షీ–టీమ్స్ ఎస్ఐ విజయలక్ష్మి నేతృత్వంలో సభ్యులు దాడులు జరిపారు. నిర్వాహకులు రాజగోపాల్ అలియాస్ గోపాల్, సైదా అలియాస్ రజిత, లక్ష్మీ, ఓ విటుడిని అరెస్టు చేసి వారి నుంచి రూ.3,200 నగదుతో పాటు 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితులు కర్నూలుకు చెందిన పావని, అనంతపురానికి చెందిన మంజుల, నల్గొండకు చెందిన ఆండాల్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి స్వగ్రామాలకు పంపించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులకు వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫొటోలను పంపి వారి అంగీకారంతో ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పంచనామా చేసి నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించగా నిర్వాహకులతో పాటు విటుడు శివను పోలీసులు రిమాండ్‌కు పంపారు. రాజగోపాల్‌పై గతంలో కూడా కేసులు... ఆళ్లగడ్డకు చెందిన గోపాల్ రెండేళ్లుగా కర్నూలులో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. భార్య లక్ష్మీ, సహజీవనం చేస్తున్న మహిళ సైదాతో కలసి వేర్వేరు చోట్ల ఇళ్లను అద్దెకు తీసుకుని వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గతంలో జంపాల అపార్ట్మెంట్, సిరినోబుల్ అపార్ట్మెంట్లలో ఇళ్లు అద్దెకు తీసుకుని కొంతకాలం వ్యభిచార గృహాలు నిర్వహించేవారని, షీ–టీమ్స్‌కు సమాచారం అందడంతో ఇళ్లు ఖాళీ చేసి పరారైనట్లు సమాచారం. ఈక్రమంలో గతేడాది గోపాల్ కుటుంబ సభ్యులపై రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శరీన్‌నగర్‌కు చెందిన శేఖర్ కమీషన్‌పై వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను గోపాల్‌కు సరఫరా చేస్తుంటాడని, ఇతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. దాడుల్లో షీ–టీమ్స్ సభ్యులు దామోదర్, యాగంటి, అన్వర్, వలి, సుజాత, శ్రీలక్ష్మి, రమాబాయి పాల్గొన్నారు. -
లాడ్జిల్లో వ్యభిచారం: ఎనిమిది మంది అరెస్ట్
సాక్షి, తిరుపతి క్రైం: అమాయక మహిళలకు డబ్బులు ఆశ చూపి పడుపు వృత్తిలోకి దింపుతున్న లాడ్జిల యజమానులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న సాయి అమృత లాడ్జి, సాయి విజయ, అశోక రెసిడెన్సీ, హరిచరణ్ లాడ్జిల వారు ఓ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులకు డబ్బు ఆశ చూపి తీసుకొచ్చి పడుపు వృత్తిలోకి దించేవారు. దీనిపై సమాచారం రావడంతో దాడులు జరపగా సాయి అమృత లాడ్జి యజమాని శ్రీనివాసులు సహా 8 మంది పట్టుబడగా మరో ముగ్గురు లాడ్జి యజమానులు పరారైనట్లు ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ మునిరామయ్య తెలిపారు. పట్టుబడిన వారంతా మధ్యవర్తులు, ఆటో డ్రైవర్లతో సంబంధాలు ఏర్పరుచుకుని రైళ్లు, ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుపతికి వచ్చే భక్తులను, స్థానికులను టార్గెట్ చేసుకుని వారికి మహిళలను ఆశ చూపించి సొమ్ము చేసుకునేవారన్నారు. పట్టుబడిన యువతులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపామన్నారు. -
వ్యభిచారం కేసులో పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్ట్
బోడుప్పల్: గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఎస్వోటీ సీఐ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురి ఆర్కేపురానికి చెందిన మరో యువతి(28), యూసుఫ్‌గూడ మధురానగర్‌లోని ఓ హాస్టల్లో నివసించే జూనియర్ ఆర్టిస్ట్(27), అదే కాలనీలో ఉండే మేకప్‌మెన్ కె.బండారి (23) ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. లోకేట్ అనే వెబ్సైట్లో ఒక విటుడిని బుక్ చేసుకొని బోడుప్పల్‌లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అప్పగించడానికి ఓ యువతిని తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు దాడి చేసి బండారితో పాటు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1700 నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని అనంతరం మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వ్యభిచారం రాకెట్లో బ్యూటీక్వీన్ అరెస్టు
వియత్నాం పోలీసులు ఒక హోటల్ మీద దాడి చేసి హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను పట్టుకున్నారు. అందులో కొంతకాలం క్రితం అందాల పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన ఓ యువతి కూడా ఉండటం పోలీసులకే షాకిచ్చింది. ఉత్తరాది రాష్ట్రమైన క్వాంగ్ నిన్ ఇద్దరు పురుషులతో కలిసి ఉండగా హోటల్ గదిలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలు అయిన ట్రాన్ డక్ తుయ్ లియెన్ 2014లో నిర్వహించిన యూనివర్సిటీ అందాల పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ కేసులో పట్టుబడటంతో ఆమెకు మూడున్నరేళ్ల జైలుశిక్ష విధించారు. ఆమె అసిస్టెంట్ అయిన డోన్ ఎన్గాక్ మిన్కు రెరండు సంవత్సరాల మూడు నెలల జైలుశిక్ష పడింది. లియెన్, మిన్ ఇద్దరూ తాము ఈ అక్రమ వ్యవహారం ద్వారా సంపాదించిన దాదాపు 2 లక్షల రూపాయలను తమకు స్వాధీనం చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. వీళ్లిద్దరూ హో చి మిన్ నగరం నుంచి క్వాంగ్ నిన్ నగరానికి టాక్సీలో వెళ్లినట్లు తెలిసింది. వాళ్లిద్దరూ కూడా రెండు రోజుల పాటు హోటల్ గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ రాకెట్లో మరింతమంది మోడళ్లు, బ్యూటీ క్వీన్లు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
సెక్స్‌రాకెట్ నిర్వహిస్తున్న తల్లిసోదరిని..
ఇటీవల రాజస్థాన్‌లో జంట మహిళలను చంపిన కేసులో మిస్టరీ వీడింది. ఓ యువకుడు తల్లిసోదరిని హత్య చేశాడు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నందుకు తల్లి, సోదరిని కాల్చిచంపనట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు నిందితుడిని, అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు దేశ రాజధాని ఢిల్లీ శివారు నగాఫ్గఢ్లో నిందితుడు సుమిత్ తల్లి, సోదరి సెక్స్ రాకెట్ నిర్వహించేవారు. ఈ పని మానుకోవాలని సుమిత్ పలుమార్లు తల్లిసోదరిని హెచ్చరించాడు. అయినా వారు మారకపోవడంతో ఇద్దరినీ హతమార్చాలని పథకం వేశాడు. ఇందుకు స్నేహితుల సాయం కోరాడు. టూర్ వెళదామని చెప్పి సుమిత్ తల్లి (38), సోదరి (16)ని రాజస్థాన్ తీసుకెళ్లాడు. స్నేహితులు ప్రదీప్ కుమార్, ధరమ్వీర్లను కూడా వెంట తీసుకెళ్లాడు. ఈ నెల 19వ తేదీ రాత్రి మనేసర్‌లో సుమిత్ తుపాకీ తీసుకుని తల్లి సోదరిని కాల్చిచంపాడు. పోలీసులు దర్యాప్తు చేసి సుమిత్, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. 16 ఏళ్ల క్రితం తన తల్లి తండ్రిని చంపిందని, తన సోదరిని కూడా సెక్స్ రాకెట్లోకి దించిందని సుమిత్ పోలీసుల విచారణలో చెప్పాడు. -
సెక్స్ రాకెట్ లో సినిమా తారలు!
పణజి: హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును గోవా పోలీసులు రట్టు చేశారు. మోడల్స్, సినిమా తారలతో మహారాష్ట్ర, గోవాలో వ్యభిచారం చేయిస్తున్న ముఠాలోని కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పణజి శివారులోని టోనీ హౌసింగ్ కాలనీలో నివసిస్తున్న ఆనంద్ కుమార్ అలియాస్ ఆండీని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ(క్రైమ్ బ్రాంచ్) కార్తీక్ కశ్యప్ తెలిపారు. అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు వెల్లడించారు. 'ఆనంద్ కుమార్ ఇంట్లో కీలక ఆధారాలు లభించాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు, సినిమా తారలు, మోడల్స్ ఫోన్ నెంబర్లు దొరికాయ'ని ఎస్పీ కశ్యప్ చెప్పారు. క్లైయింట్ల లిస్టులో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే మిగతా వివరాలు చెప్పేందుకు ఎస్పీ నిరాకరించారు. పోలీసులు కస్టమర్ల నటించి ఆనంద్ కుమార్ కింద పనిచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళలను కాపాడారు. -
వ్యభిచార కూపం నుంచి టాలీవుడ్ నటికి విముక్తి
పణజి: తెలుగు, హిందీ భాషల్లో పలు హిట్ సినిమాల్లో తనదైన నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించి.. ప్రస్తుతం వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన ఓ టాలీవుడ్ నటిని గోవా పోలీసులు కాపాడారు. పణజి ఇన్స్పెక్టర్ సిద్దాంత్ శిరోద్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సినిమా ఛాన్సులు తగ్గటంతో దాన్ని అవకాశంగా తీసుకుని సదరు నటీమణిని వ్యభిచార కూపంలోకి దింపేందుకు సాక్షాత్తు ఆమె సహాయకురాలు ఆయేషా సయ్యద్ (30) పథకం రచించింది. ఈ క్రమంలోనే నటి, ఆమె సహాయకురాలు మంగళవారం ఉదయం పణజికి చేరుకుని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో రూమ్ తీసుకున్నారు. రాత్రయిన తర్వాత ఆ గదికి ఓ బడాబాబు చేరుకున్నాడు. అంతలోనే సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ పై పోలీసులు దాడిచేశారు. విటుడు పోలీసుల కన్నుగప్పి పారిపోగా, నటిని, ఆమె సహాయకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తనను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపేందుకు ఆయేషా ప్రయత్నిస్తోందని నటీమణి పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం ఆమెను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించామని, ఆయేషాపై కేసు నమోదుచేసి, విటుడి కోసం గాలిస్తున్నామని శిరోద్కర్ తెలిపారు. కాగా వ్యభిచారం చేయడానికి వెళ్లిన విటులపై కూడా 370 ఏ కేసు పెట్టవచ్చని హైకోర్టు ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నేరం రుజువైతే విటుడికి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. -
స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠా గుట్టును గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు. గచ్చిబౌలి సీఐ జె.రమేశ్ కుమార్ కథనం ప్రకారం... ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం(32) అలియాస్ అలీసాబేగం కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నివాసముంటుంది. కొండాపూర్ శ్రీరాంనగర్‌లోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. గత నాలుగు నెలలుగా ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం రాత్రి ప్లాట్‌పై దాడి చేశారు. ప్రధాన నిందితురాలు సిమ్రాన్‌తో పాటు డీల్లీకి చెందిన డింపుల్(27), అబ్దుల్ సమద్(42), కరీంనగర్‌కు చెందిన షేక్ యాసిన్(20), షేక్ మోసిన్(20), డ్రైవర్లుగా పనిచేసే ఎండి.షకీల్(23), అబ్దుల్ అజీజ్(23), వైజాగ్ తాళ్లపాలెంకు చెందిన వంట మనిషి సంధ్య(35)లను అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి అసెంట్, ఇండికా కార్లు, 20 సెల్ ఫోన్లు, 9 సిమ్ కార్డులు, ల్యాప్ టాప్, బ్యాంక్ పాస్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లో రూ.2.50 లక్షలు ఉన్నాయని సీఐ తెలిపారు. బ్యాంక్‌లోని డబ్బును కోర్టుకు అందజేస్తామన్నారు. ఫ్లాట్ యజమానికి నోటీస్ జారీ చేస్తామని చెప్పారు. అతని వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఫ్లాట్ సీజ్ చేస్తామని సీఐ రమేశ్ కుమార్ తెలిపారు. -
ఆ బాధ జీవితాంతం దహిస్తూనే ఉంటుంది : శ్వేతాబసు ప్రసాద్
వ్యభిచారం ఆరోపణలపై అరెస్టై, కోర్టు ఆదేశాలపై ఇటీవలే ‘సంరక్షణాలయం’ నుంచి బయటకొచ్చిన సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ తొలిసారిగా పెదవి విప్పారు. ముంబయ్‌లోని ఇంటికి చేరుకొన్న 23 ఏళ్ల ఈ యువ నటి ‘డి.ఎన్.ఎ’ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అసలేం జరిగిందీ వివరించారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు... ఇంటికి ఎప్పుడొచ్చారు? శుక్రవారం ఇంటికి వచ్చా. జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి మీదా ఫిర్యాదులు లేవు. కాకపోతే, నేనేమీ మాట్లాడకుండానే ఆ సంక్షోభ సమయంలో ‘అన్ని దారులూ మూసుకుపోవడం వల్లే ఈ పనికి పాల్పడ్డా. డబ్బు సంపాదించడం కోసం వ్యభిచారంలోకి దిగాల్సిందిగా కొందరు నన్ను ప్రోత్సహించారు’ అంటూ నా పేరు మీద ఓ జర్నలిస్టు తప్పుడు ప్రకటన జారీ చేశారు. రెండు నెలలు పత్రికలు అందుబాటులో లేవు. దాని గురించి నాకు ఇప్పుడే తెలిసింది. అంటే, ఆ ప్రకటన మీరు చేయలేదంటారు! లేదు. కస్టడీలో అమ్మానాన్నలతో మాట్లాడడానికి కూడా నాకు అనుమతినివ్వనప్పుడు, మీడియాతో మాత్రం నేనెలా మాట్లాడగలను? నా పరువు ప్రతిష్ఠలను దెబ్బతీశారు. అసత్య ప్రకటనలు ఏ జర్నలిస్టు వద్ద నుంచి, ఏ పత్రిక ద్వారా పుట్టాయన్నది ఆరా తీస్తున్నా. చట్టపరంగా చర్యలు చేపడుతున్నా. అనని మాటలు అన్నట్లు రాసేవారు ఏ రకం వారంటారు? ఎవరైనా కష్టాల పాలై, ఇబ్బందులు పడుతుంటే అది చూసి ఆనందించడం మన జాతి లక్షణం. మనం శాడిస్టులం. నా పేరు మీద తప్పుడు ప్రకటన ప్రచారంలో పెట్టిన ఆ జర్నలిస్టును అడగదలుచుకున్నది ఒక్కటే - ‘మీకు నా గురించి, నా కుటుంబం గురించి ఏం తెలుసు? ఇది (ఈ అరెస్టు) జరిగినప్పుడు కూడా రకరకాల పాత్రల కోసం నేను ఆడిషన్లలో పాల్గొంటున్నాను. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంపై ఒక డాక్యుమెంటరీ రూపకల్పన కోసం మూడున్నరేళ్ళ జీవితాన్ని వినియోగించా. మళ్ళీ నటన మీద దృష్టిపెట్టాలనుకుంటున్నా. ఎక్కువ భాగం మీడియా మీకండగా నిలిచిందే! అవును. అందుకే, ఇంటికి తిరిగిరాగలిగా. జరిగిందేమిటన్న దానిపై లోతుల్లోకి వెళ్ళాలని అనుకోవడం లేదు. అది కోర్టులో ఉన్న విషయం. దేనికైనా పశ్చాత్తాపపడుతున్నారా? నేను తప్పు చేశానా, లేదా అన్న విషయంలో ఒక నిర్ధారణకు వచ్చే ముందు.... మీడియా నేను బయటకు వచ్చేదాకా ఆగాల్సింది. నన్ను నేను రక్షించుకొనే హక్కు ఇవ్వాల్సింది. అక్కడ ఉండగా టీవీ చూడడానికీ, పేపర్లు చదవడానికీ నన్ను అనుమతించలేదు. తీరా ఇప్పుడు బయటకు వచ్చాక చూస్తే, జీవితం ఎంతటి మీడియా సర్కస్‌గా మారిందో తెలిసింది. అసలు ఈ పరిస్థితుల్లోకి మీరెలా చిక్కుకున్నారు? (ఒక్క క్షణం ఆగి..., నిట్టూరుస్తూ...) వ్యభిచారం కోసమంటూ నన్ను ఏ ఏజెంటూ హైదరాబాద్‌కు పిలవలేదు. అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడానికి నేను అక్కడకు వెళ్ళాను. నా తలరాత అనండి, మరొకటి అనండి - వెనక్కి తిరిగి వచ్చే ఉదయం విమానం నేను మిస్సయ్యాను. ఆ అవార్డుల ఉత్సవం నిర్వాహకులే విమానం టికెట్, బస ఏర్పాట్లు చేశారు. ఆ టికెట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఏజెంట్ అరె స్టయ్యాడని నాకు చెప్పారు. ఈ కేసు ఇప్పుడు విచారణలో ఉంది. ఈ వ్యవహారంలో బలిపశువునయ్యా. ఆ సమయంలో పోలీసు దాడి జరిగింది.... ఆ సంఘటనను తోసిపుచ్చడం లేదు. కానీ, బయటకు వారు చెప్పినవన్నీ నిజాలు కావు. మిమ్మల్ని పోలీసులు కఠినంగా ప్రశ్నించారా? లేదు. అయితే, విచారణ నిమిత్తం నన్ను నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు పోలీసులు (వ్యభిచార రాకెట్లలో ప్రమేయమున్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న) తెలుగు సినీ తారల పేర్లడిగారు. చాలామంది పేర్లయినా నాకు తెలియవు. అయినా, ఇతర తారలపై నేనెందుకు వ్యాఖ్యానించాలి? అరెస్ట్ తర్వాత... రెస్క్యూ హోమ్‌లో ఉన్నాను. మనుషుల అక్రమ రవాణా, వగైరా వ్యవహారాల్లో బాధితులైన పిల్లలకు సంబంధించిన హాస్టల్ అది. అక్కడ నేను స్వచ్ఛందంగా టీచర్‌గా పనిచేశా. పిల్లలకు హిందీ, ఇంగ్లీషు, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం నేర్పించా. నేనేమీ మానసికంగా కుంగిపోలేదు. అలా ఎందుకు కుంగిపోవాలి? నిజానిజాలు నాకు తెలుసు. నా జీవితాన్ని సినిమాకూ, నటనకూ అంకితం చేశా. ఏదో ఒక సంఘటనతో నా జీవితాన్ని నాశనం కానివ్వను. మీ అమ్మానాన్న ఏమనుకున్నారు? నేను రెస్క్యూ హోమ్‌లో ఉండగా మా తాతగారు చనిపో యారు. ఆ బాధ జీవితాంతం నన్ను వెంటాడుతుంది. ఆయన అంత్యక్రియలకైనా హాజరు కాలేకపోయా. జీవితాంతం ఆ బాధ నన్ను దహిస్తూనే ఉంటుంది. మీడియాలో వార్తల పుణ్యమా అని ఆ ప్రకటనలన్నీ నేనే చేశాననుకొంటూనే మా తాత గారు కన్నుమూశారు. దర్శకుడు హన్సల్ మీతో పనిచేస్తానంటున్నారు. ఆయన నుంచి నాకు ఇంకా ఫోన్ రాలేదు. హన్సల్ మెహతా చిత్రానికి ఆడిషన్లో పాల్గొని, ఆ పాత్రకు నేను సరిపోతేనే చేద్దామనుకుంటున్నాను. అంతేతప్ప, ఏదో సానుభూతి చూపుతూ ఇచ్చే పాత్ర వద్దు. వివాదాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ముచేసుకుంటున్నానని జనం అనుకోవడం నాకిష్టం లేదు. పదేళ్ళకే జాతీయ అవార్డొచ్చిన మీ ప్రతిభపై అనుమానాల్లేవు.. కానీ, జనం అవన్నీ సులభంగా మర్చిపోతారు. నన్నడిగితే, కష్టకాలంలోనే అసలైన స్నేహితులెవరన్నది తెలుస్తుంది. తెలిసినవాళ్ళు ముఖం చాటేశారు. స్నేహితులైతే, మా అమ్మ ఫోన్ చేస్తే ఎత్తేవాళ్ళు కాదు. మా అమ్మానాన్నకు ఏదైనా జరగరానిది జరిగి ఉంటే, దానికి బాధ్యులెవరు? ఈ సమయంలో మాకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు. ఇక, మాకు అండగా నిలబడనివాళ్ళ గురించి కూడా ఏమీ అనను. జీవితమంటే ఇంతే! ఇలాగే ఉంటుంది! -
హైటెక్ వేశ్య కేంద్రంపై పోలీసుల దాడి
ప్రవాసాంధ్రులు అధికంగా నివాసముండే ప్రాంతంలో హైటెక్ వేశ్య కేంద్రం బయటపడటంతో ఆ ప్రాంతంలో తీవ్ర అలజడి ఏర్పడింది. నిందితులు మురడేశ్వర సమీపంలోని ఉత్తరకోప్పకు చెందిన దుర్గయ్య, హాసన్ జిల్లా చెన్నరాయణపట్ట తాలుకా హిరిసావా గ్రామానికి చెందిన దీపు, అదే జిల్లా సకలేశపుర తాలుకా బాళగెద్ద గ్రామానికి చెందిన కుమార్, బెంగళూరు కేఆర్ పురంలోని గాయత్రీ లేఔట్‌కు చెందిన నాగరాజ్ అలియాస్ జాన్సన్‌లను అరెస్టు చేశామని శనివారం బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు. కోల్‌కతాకు చెందిన ముగ్గురు యువతులతో పాటు ఒక బంగాదేశ్‌కు చెందిన యువతిని రక్షించామని చెప్పారు. పాస్‌పోర్టు లేని బంగ్లా యువతిపై కేసు నమోదు చేశామని అన్నారు. దేవసంద్ర సమీపంలోని ఆర్‌ఎంవీ రెండో స్టేజ్‌లోని ఒక ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో బంగ్లాదేశ్, కోల్‌కత్తాకు చెందిన యువతులను నిర్బంధించి బయట ప్రాంతాల నుంచి విటులను తీసుకువచ్చి దందా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ది ఫ్రీడం ప్రాజెక్ట్ ఇండియా నిర్వాహకులు గుర్తించారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంపై నిఘా పెట్టిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు జయణ్ణ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. -
బీచ్ రోడ్డులో వ్యభిచార ముఠా అరెస్ట్
విశాఖపట్నం బీచ్రోడులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను శుక్రవారం నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీచ్ రోడ్డులోని ఓ పెద్ద హోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు బీచ్‌రోడ్డులోని హోటల్‌పై దాడి చేశారు. వ్యభిచారులతోపాటు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. హోటల్ యాజమాన్యంతోపాటు వ్యభిచార ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
వ్యభిచార గృహంపై దాడి, బుల్లితెర నటి అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని బోయిన్పల్లి బాపూజీ నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ అపార్ట్‌మెంటుపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పల్లవి అనే జూనియర్ ఆర్టిస్టుతో పాటు మరో ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రాంతి అనే వ్యక్తి జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఇన్స్పెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. అయితే ఆ జూనియర్ ఆర్టిస్టును మీడియాకు చూపించడానికి పోలీసులు నిరాకరించారు. అక్కడి నుంచి పల్లవిని బేగంపేట పోలీస్ స్టేషన్‌ను తరలించారు. ఈ దాడికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. ఈ సందర్భంగా సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.