
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ అపార్టుమెంట్‌లోని ఇంటిపై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు విటులను అరెస్ట్ చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి వివేకానందనగర్ కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌ను చరణ్‌రాజు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.
ఈ ప్లాట్‌కు ఇద్దరు యువతులను రప్పించి కాల్స్, వాట్సప్‌ల ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడు చరణ్‌రాజుతో పాటు విటులు లక్ష్మారెడ్డి, భూష రమేశ్‌తో పాటు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.3 వేల నగదు, సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి:
మహిళా కానిస్టేబుల్‌ను అసభ్యంగా తాకుతూ..
ఉప్పల్‌లో లారీ బీభత్సం.. ఒకరు మృతి
Comments
Please login to add a commentAdd a comment