prostitution gangs
-
కూకట్‌పల్లిలో వ్యభిచారం గుట్టురట్టు.. యువతులను రప్పించి..
సాక్షి, హైదరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ అపార్టుమెంట్‌లోని ఇంటిపై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు విటులను అరెస్ట్ చేసిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లోని ప్లాట్‌ను చరణ్‌రాజు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ ప్లాట్‌కు ఇద్దరు యువతులను రప్పించి కాల్స్, వాట్సప్‌ల ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడు చరణ్‌రాజుతో పాటు విటులు లక్ష్మారెడ్డి, భూష రమేశ్‌తో పాటు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.3 వేల నగదు, సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మహిళా కానిస్టేబుల్‌ను అసభ్యంగా తాకుతూ.. ఉప్పల్‌లో లారీ బీభత్సం.. ఒకరు మృతి -
ఉద్యోగాల పేరుతో వ్యభిచారం
సాక్షి, సిటీబ్యూరో: ఉద్యోగాల పేరుతో ముంబయ్‌కి చెందిన మహిళలను నగరానికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను పట్టుకున్న పోలీసులు ఇద్దరు యువతులకు వ్యభిచారం నుంచి విముక్తి కల్పించారు. పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపినమేరకు..బిహార్ రాష్ట్రానికి చెందిన మిథిలేష్ శర్మ, రాజనీశ్ రాజన్‌లు గత కొన్ని సంవత్సరాలుగా రహస్యంగా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహ్తిన్నారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళల అక్రమ రవాణాదారులతో సంబంధాలున్న వీరు అక్కడి నుంచి అమ్మాయిలను రప్పించేవారు. ఈ విధంగానే ముంబయ్ సమీపంలోని పాల్ఘర్ జిల్లా నాలాసొపార పట్టణానికి చెందిన ఇద్దరు అమ్మాయిలకు హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రప్పించారు. (వేశ్యావాటిక గుట్టురట్టు) ఆ తర్వాత బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపారు. యాప్రాల్‌లోని రిజిస్ట్రేషన్ కాలనీలో ఇండిపెండెంట్ హౌస్‌ను అద్దెకు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలు మొదలెట్టారు. మిథేశ్ శర్మ తన సహచర నిర్వాహకుడు రాజనీశ్ రాజన్‌తో కలిసి రహస్యంగా కస్టమర్లను రప్పించేవాడు.అలాగే ఆయా ఇళ్లకు వచ్చే కస్టమర్లకు తగిన ఆహరంతో పాటు వారి అవసరాలను తీర్చేందుకు సుచిత్రకు చెందిన కాంబ్లీ సుఖేష్‌ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. అయితే యథావిధిగా ఎప్పటిలాగానే మంగళవారం ఇద్దరు విటులు సాయికిరణ్, సిరాజ్‌లు యాప్రాల్‌కు వచ్చారు. ఆ అమ్మాయిలతో వీరిద్దరూ ఉన్న సమయంలో అప్పటికే విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజ్గిరి జోన్ ఎస్వోటీ పోలీసులు, జవహర్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. రాజనీశ్ రంజన్, సుఖేష్ రావణ్ కాంబ్లీ, పి.సాయికిరణ్, ఎండీ సిరాజ్‌లను అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను సంరక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మితిలేష్ శర్మ కోసం గాలిస్తున్నారు. -
ఖరీదైన జీవితం అంటూ కళాశాల విద్యార్థినులను..
సాక్షి ప్రతినిధి, చెన్నై: యువతుల్లోని అమాయకత్వం వారికి అవకాశం. వారి పేదరికమే వీరి దురాగతాలకు పెట్టుబడి. కావాల్సినంత ధనం, ఖరీదైన జీవితం అంటూ కళాశాల విద్యార్థినులను, యువతులను వ్యభిచార కూపంలోకి దింపే ముఠా ఆగడాలను అరికట్టండి అంటూ కుమార్తెను దూరం చేసుకున్న ఓ బాధిత తల్లి కన్యాకుమారి జిల్లా ఎస్పీకి ఆధారాలు సహా శుక్రవారం ఫిర్యాదు చేసింది. ముఠా చేతిలో చిక్కుకున్న కుమార్తెను రక్షించి అప్పగించాలని శుక్రవారం తన బంధువులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘తనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. చదువు పూర్తికావడంతో పెళ్లి చేయాలని భావించాం. పెద్దల అభీష్టం ప్రకారం పెళ్లిచేసుకునేందుకు కుమార్తె అంగీకరించడంతో ఒక యువకుడితో నిశ్చితార్థం చేశాను. నిశ్చితార్థం సమయంలో సహజంగానే ప్రవర్తించిన కుమార్తె...వివాహవేడుక రోజు సమీపిస్తుండగా అకస్మాత్తుగా మాయమైంది. తమ బంధువు ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని వెళ్లగా తనతో మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు, ఇంటికి వచ్చేందుకు నిరాకరించింది. నీ కుమార్తె ఇక ఇంటికి రాదు, ఆమెతో మాకు పని ఉంది. పదేపదే వస్తే చంపేస్తామని నన్ను బెది రించారు. ఈ విషయంపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, మీ కుమార్తె మేజర్, ఆమెఇష్టప్రకారం నడుచుకునే హక్కుంది అన్నారు. కుమార్తె చేష్టలకు అనుమానం వచ్చి తన సెల్‌ఫోన్ తీసి పరిశీలించగా అందులో కుమార్తెతో కూడిన అనేక అశ్లీల విడియో దృశ్యాలు ఉన్నాయి. ఏ తల్లీ చూడలేని దృశ్యాలను చూడాల్సి వచ్చింది. నా కూతురే కాదు, ఇంకా ఎందరో యువతుల అశ్లీల దృశ్యాలు, ఫొటోలు ఉన్నాయి. పేదరికాన్ని అవకాశంగా తీసుకుని యువతులను వ్యభిచార రొంపిలోకి దింపి జీవితాలను నాశనం చేస్తున్నారనేందుకు నా కుమార్తె సెల్‌ఫోన్‌లోని దృశ్యాలే సాక్ష్యం. ముఠా చేతుల్లో నుంచి నాకుమార్తెను రక్షించి అప్పగించండి. ఇతర యువతులకు విముక్తి కల్పించి కిరాతకులను చట్టపరంగా శిక్షించండని ఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అలాగే ఆధారాలను అప్పగించారు. ఈ ఫిర్యాదును అన్ని మహిళా పోలీస్స్టేషన్లకు పంపి విచారణ చేపట్టాల్సిందిగా ఇన్స్పెక్టర్ శాంతకుమారిని ఎస్పీ ఆదేశించారు. కొట్టరై అనే పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఉన్న ఒక ముఠా కళాశాల విద్యార్థినులు, యువతులపై వలవేస్తోందని, చేతినిండా డబ్బు, ఖరీదైన దుస్తులు, విలాసవంతమైన జీవితం అంటూ ఆశచూపి లొంగదీసుకుంటోందని ఆమె మీడియా ముందు వాపోయారు.ఎన్ఎస్ఎస్ క్యాంప్ అని తల్లిదండ్రులకు చెప్పి బంగ్లాకు రా, అక్కడ మరెవరూ ఉండరు, ఒక్క గంట గడిపితే చాలు అంటూ సెల్‌ఫోన్‌లోని సంభాషణలను ఆమె వినిపించారు. ఇది పథకం ప్రకారం సాగుతున్న దురాగతమని ఆమె అన్నారు. కిందిస్థాయి పోలీసులు సహకరించలేదు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు వల్ల న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. -
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠాలు
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాలలో వ్యభిచార గృహాలపై ఈరోజు పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం ముఠాల గుట్టు రట్టు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వెనుక ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నారు. లంగర్‌హౌస్‌లో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు.అక్కడ ఓ ముఠాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో వ్యభిచార గృహంపై దాడి చేశారు. అక్కడ ఓ యువతితోపాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. -
హైటెక్ వేశ్య వాటిక నిర్వాహకుల అరెస్ట్
వేశ్య వాటిక నిర్వహిస్తున్న ఇద్దరిని ఇక్కడి కృష్ణరాజపురం(కేఆర్‌పురం) పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మంజునాథ్, సుబ్రమణి ఉన్నట్లు ఇన్స్పెక్టర్ సంజీవరాయప్ప తెలిపారు. నిందితుల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. మేడిహళ్లిలోని ఓ అద్దె ఇంటిలో వేశ్య వాటిక నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి మెరుపుదాడి నిర్వహించారు. ఆ సమయంలో నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్, ముంబయికి చెందిన తొమ్మిది మంది యువతులను రక్షించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ వారిని నమ్మించి పిలిపించుకున్నారని, అనంతరం వారిని నిర్బందించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.