హైటెక్ వేశ్య వాటిక నిర్వాహకుల అరెస్ట్ | Hi-Tech prostitution gangs busted by Bangalore police | Sakshi
Sakshi News home page

హైటెక్ వేశ్య వాటిక నిర్వాహకుల అరెస్ట్

Published Tue, May 27 2014 9:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

Hi-Tech prostitution gangs busted by Bangalore police

వేశ్య వాటిక నిర్వహిస్తున్న ఇద్దరిని ఇక్కడి కృష్ణరాజపురం(కేఆర్‌పురం) పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మంజునాథ్, సుబ్రమణి ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్ సంజీవరాయప్ప తెలిపారు. నిందితుల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. మేడిహళ్లిలోని ఓ అద్దె ఇంటిలో వేశ్య వాటిక నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి మెరుపుదాడి నిర్వహించారు. ఆ సమయంలో నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.
 
 పశ్చిమబెంగాల్, ముంబయికి చెందిన తొమ్మిది మంది యువతులను రక్షించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ వారిని నమ్మించి పిలిపించుకున్నారని, అనంతరం వారిని నిర్బందించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement