bangalore police
-
యడియూరప్పపై పోక్సో కేసు
సాక్షి, బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(81)పై పోక్సో కేసు నమోదైంది. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు యడియూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 354ఏ కింద కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీన 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆమె తల్లి గురువారం రాత్రి ఫిర్యాదు చేసిందని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలను యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. చట్టపరంగా ముందుకు వెళతానన్నారు. పోలీసులు డాలర్స్ కాలనీలోని యడియూరప్ప నివాసానికి వెళ్లి ఆయన నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారని డీజీపీ అలోక్ మోహన్ శుక్రవారం చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం వెంటనే కేసును సీఐడీకి అప్పగించామన్నారు.ఈ పరిణామంపై హోం మంత్రి జి.పరమేశ్వర మాట్లాడారు. బాధితురాలి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని కొందరు చెప్పారన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన తల్లితో కలిసి యడియూరప్పను ఆయన నివాసంలో కలవడానికి వెళ్లినప్పుడు బాలిక చిత్రీకరించిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆమె ఏడుస్తూ సాయం అర్థించింది కేసు నమోదు కావడంపై యడియూరప్ప స్పందించారు. ఈ కేసుకు సంబంధించి చట్ట పరంగా ముందుకెళతానన్నారు. ‘ఆ మహిళ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. ఆమెను లోపలికి రమ్మని చెప్పి, సమస్య తెలుసుకున్నా. ఆ వెంటనే పోలీస్ కమిషనర్ దయానందతో ఫోన్లో మాట్లాడి, ఆమెకు న్యాయం చేయాలని కోరా. ఆ వెంటనే ఆమె నన్ను విమర్శించడం మొదలుపెట్టింది. దీంతో, ఏదో తేడాగా ఉందని అనుమానం వచ్చింది’అని చెప్పారు. ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిశాక, వ్యవహారం మలుపు తిరిగిందని పేర్కొన్నారు. -
ట్రాఫిక్ రూల్స్ పాటించలేదో.. నేరుగా మీ కంపెనీకే నోటీసులు
బెంగళూరు: రోడ్లపై ట్రాఫిక్ సిగ్నళ్లు, స్పీడ్ లిమిట్లను పట్టించుకోకుండా వాహనంపై ముందుకు దూసుకెళ్లే టెకీలకు కళ్లెం వేసేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం..రహదారి నిబంధనలను బేఖాతరు చేసే టెకీలకు కాకుండా వారు పనిచేసే సంస్థలకు నేరుగా ట్రాఫిక్ పోలీసులు ఇకపై నోటీసులు అందజేస్తారు. అవుటర్ రింగ్ రోడ్, వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్‌లో ఈ వారంలో ఇది ప్రయోగాత్మకంగా మొదలైంది. ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైనట్లు గుర్తిస్తే ఈ పద్ధతినే మిగతా ప్రాంతాలకు సైతం క్రమేపీ విస్తరిస్తామని బెంగళూరు ట్రాఫిక్ ఉన్నతాధికారులు అంటున్నారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే తమ లక్ష్యమంటున్నారు. ఈస్ట్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో ఇక్కడి టెక్నాలజీ సంస్థల్లో పనిచేసే వారే అత్యధికులు ఉండటంతో వారినే లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. -
వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు
సాక్షి, బెంగళూరు: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముంబై నివాసంపై బెంగళూరు పోలీసులు గురువారం సోదాలు చేశారు. మత్తుమందుల కేసులో నిందితుడిగా ఉన్న వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య ఆళ్వా కోసం ఈ దాడులు జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని కాటన్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఆదిత్యపై ఓ కేసు నమోదు కాగా అతడు పరారీలో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ‘ఆదిత్య సమాచారం తెలియడంతో కోర్టు వారెంట్‌తో అతడి బంధువైన వివేక్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు’ అని కమిషనర్ చెప్పారు. తనిఖీల ఫలితం ఏమిటన్నది మాత్రం వివరించలేదు. ఆదిత్య మాజీ మంత్రి దివంగత జీవరాజ్ ఆళ్వా కుమారుడు. రేవ్‌పార్టీలు, మత్తుమందు సరఫరాదారులు, అమ్మకం దార్లపై పోలీసులు విరుచుకుపడిన నేపథ్యంలో కన్నడ సినీనటులు రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీసహా కొందరు నైజీరియన్లను అరెస్ట్ చేయడం తెల్సిందే. రెండు నెలల క్రితం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులు తాము నటులకు మత్తుమందులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతోనే ఈ అరెస్ట్‌లు జరిగాయని సమాచారం. -
బెంగళూరు జిహాదీ ముఠా గుట్టురట్టు
సాక్షి, బెంగళూరు/బనశంకరి: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు తెలిపే సమయంలో విధ్వంసానికి కుట్రపన్నిన జిహాదీ ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు ఆదివారం రట్టు చేశారు. కీలక సూత్రధారి మహబూబ్ పాషా.. బెంగళూరులో ఉన్న జిహాదీ ముఠాకు నాయకుడని వెల్లడైంది. పోలీసులు తమ వ్యవహారం పసిగట్టారని తెలియగానే పాషా ముఠా పరారైంది. కొడగు జిల్లా అటవీప్రాంతం, బెంగళూరు సమీపంలోనీ అటవీప్రాంతాల్లో సభ్యులకు తుపాకీ కాల్చడం, బాంబుల తయారీ వంటి వాటిలో శిక్షణనిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసింది. ముఠా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారితో సంప్రదింపులు జరుపుతున్నారన్న అభియోగాలతో ఇద్దరు ఇమామ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. -
హనీట్రాప్ కేసులో హీరోయిన్లు?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రాప్ చేసిన హనీట్రాప్ కేసులో కొందరు సినీ హీరోయిన్లకు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన ముగ్గురు నటీమణుల పాత్ర ఇందులో ఉన్నట్లు సీసీబీ పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఒకరు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాగా, మరో ఇద్దరు రెండు, మూడు సినిమాల్లో నటించిన వారని సమాచారం. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి త్వరలోనే వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు సుమారు 25కు పైగా చిత్రాల్లో పలువురు ప్రముఖ హీరోలతో నటించిన హీరోయిన్గా భావిస్తున్నారు. మరో తార చిన్న సినిమాలు టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలలో కనిపించారు. ఇక మూడో నటి బహుభాషా చిత్రాల్లో నటించిన హీరోయిన్గా గుర్తించారు. వారం క్రితం బహిర్గతమైన హనీట్రాప్ బాగోతంలో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల శృంగార వీడియోలు బయటపడ్డాయి. రాఘవేంద్ర అనే వ్యక్తి తన ప్రియురాలు, కొందరు యువతులను ఎమ్మెల్యేల వద్దకు పంపి పరిచయాలు పెంచుకున్నాడు. వారితో నాయకులు గడుపుతున్న రహస్య వీడియోలు సేకరించి భారీగా డబ్బు డిమాండ్ చేయడం, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రాఘవేంద్ర, అతని ప్రియురాలు పోలీసుల అదుపులో ఉన్నారు. చదవండి: వీఐపీల ఫోన్ డేటా ఆమె గుప్పిట్లో -
తెలీక చేశాను.. సారీ!
సాక్షి, బెంగళూరు: కీకీ ఛాలెంజ్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న శాండల్‌వుడ్ నటి నివేదిత గౌడ ఎట్టకేలకు స్పందించారు. ఆ ఛాలెంజ్‌ను నిషేధించిన విషయం తెలీక తాను తప్పు చేశానని ఆమె క్షమాపణలు చెప్పారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో కీకీ ఛాలెంజ్ వీడియో చూసి సరదాగా ప్రయత్నించా. అంతేగానీ దాన్ని నిషేధించారన్న విషయం నాకు తెలీదు. నాపై విమర్శలు వెల్లువెత్తిన సమయంలో నన్ను కావాలని టార్గెట్ చేశారేమో అనిపించింది. విషయం తెలిశాక వేరే వాళ్లు ప్రయత్నించకూడదన్న ఉద్దేశంతో ఆ వీడియోను తొలగించా. ప్రాణాల మీదకు తెచ్చుకోవాలని ప్రజలకు చెప్పేంత మూర్ఖురాలిని కాదు కదా!. క్షమించండి’ అని ఓ జాతీయ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు. (కీకీ ఛాలెంజ్.. దమ్ముంటే ఇలా చేయండి) 18 ఏళ్ల నివేదిత గౌడ కన్నడ బిగ్‌బాస్ 5వ సీజన్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. కీకీ ఛాలెంజ్ విమర్శల నేపథ్యంలో ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. నివేదితపై బెంగళూరు పోలీసులకు ఓ ఉద్యమవేత్త ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే కీకీ డాన్స్‌తో డాన్స్ కిక్ రాదని, కటకటాల కిక్ మాత్రమే వస్తుందని బెంగళూరు పోలీసులు నెటిజన్లను హెచ్చరించారు. నటి రెజీనా కికి వీడియో వైరల్.. విమర్శలు -
కంత్రీ డ్రైవర్లపై ఖాకీలకు మెసేజ్
బనశంకరి: వెకిలిచేష్టలు చేయడం, వేధించడం, ఖరీదైన వస్తువులను లాక్కోవడం, అశ్లీలంగా ఫొటోలు తీయడం, దారి మళ్లించి భయభ్రాంతులకు గురిచేయడం.. ఇలా యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణించే మహిళలపై కొందరు ఘరానా డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఆపదలో చిక్కుకుంటే వారు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అత్యవసర మెసేజ్ అందించే వ్యవస్థను ఓలా యాప్‌లో అమర్చాలని ఆ సంస్థకు నగర పోలీస్ శాఖ ఆదేశించింది. ఇందుకు ఓలా కంపెనీ సమ్మతించింది. ఇటీవల ఒక మహిళను ఓలా క్యాబ్ డ్రైవర్ బెదిరించి అర్ధనగ్నంగా ఫొటోలు తీసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇక నేరుగా పోలీసులకు సందేశం ఓలా యాప్ క్యాబ్ ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడితే వారి బంధువులకు సమాచారం అందించడానికి అత్యవసర సంఖ్యకు గతంలోనే అవకాశం కల్పించింది. ఇందులో తమకు ముఖ్యమైన ఐదుగురి నంబర్లను నమోదు చేసుకోవచ్చు. అత్యవసర వేళల్లో వారికి సందేశం పంపడానికి వీలవుతుంది. కానీ దీని బదులుగా యాప్ ద్వారా మొదట పోలీసులకే సమాచారం అందించే వ్యవస్థను కల్పించాలని ఆదేశించారు. ఓలా కంపెనీ తమ క్యాబ్‌లు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయో తరచూ పరిశీలిస్తుండాలి. సంచరించే మార్గం మళ్లించడం, అర్ధంతరంగా ట్రిప్ ముగించడం తదితరాల్లో ఏమైందో విచారించాలి. దీంతోపాటు మీపై నిఘా పెట్టి ఉంచామని డ్రైవర్లకు స్పష్టం చేయాలని అదనపు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్‌సింగ్ తెలిపారు. బెంగళూరు పోలీస్‌శాఖ ఇప్పటికే సురక్ష యాప్ విడుదల చేసింది. అత్యవసర సమయాల్లో ఎస్వోఎస్ను నొక్కితే పోలీస్‌కంట్రోల్ రూమ్‌కు సందేశం వెళ్తుంది. అక్కడ నుంచి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందుతుంది. ఇదే తరహాలో ఓలా యాప్‌లో వ్యవస్థ ఉండాలని ఓలా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సలహా ఇచ్చామని సింగ్ తెలిపారు. ఈ భద్రతా చర్యలను నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేయాలని, తమకు నివేదిక అందజేయాలని ఆదేశించామన్నారు. -
హెల్మెట్ పెట్టుకోలేదని...
-
వైరల్ : హెల్మెట్స్ పెట్టుకోలేదని షూ విసిరారు
ఇటీవల కాలంలో కొంతమంది పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం, వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఇద్దరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోలేదని బెంగళూరుకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ షూస్ విసిరారు. ఇదంతా కెమెరాలో బంధించిన ఒకతను, యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో, ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అంతే వెంటనే ఆ కానిస్టేబుల్ పోస్టు కూడా ఊడి, సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే...రోడ్డుకు పక్కన ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు వేచిచూస్తూ ఉన్నారు. వారి పక్క నుంచే హెల్మెట్స్ పెట్టుకోకుండా ఇద్దరు బైకర్లు వెళ్తూ కనిపించారు. వారిని చూసిన ఒక ట్రాఫిక్ పోలీసాఫీసర్ షూ తీసి, వారిపైకి విసిరారు. బైకర్లలో ఒకరికి ఈ షూ తగిలింది. అయినా వాళ్లిద్దరూ ఆగకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ సంఘటన్నంతటినీ ద్విచక్ర వాహనదారుల వెనుకాలే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న రిషబ్ ఛటర్జీ అనే వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న బీఈఎల్ రోడ్డులో ఈ ఘటన జరిగినట్టు రిషబ్ పేర్కొన్నాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను తాము ప్రేమిస్తామని, కానీ ఇటు పోలీసులు, అటు బైకర్లు ఇలా చేయడం చాలా ప్రమాదకరమని ఈ పోస్టుకు ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల ఎఫ్బీకి కూడా దీన్ని షేర్ చేయాలని కోరాడు. నెంబర్ ప్లేట్‌ను నమోదు చేసుకుని, వారికి జరిమానా విధించవచ్చు కదా అని యూజర్లంటున్నారు. చట్టాలను చేతుల్లోకి తీసుకుని, బైకర్ల జీవితాలకు ప్రమాదం తెచ్చే బదులు, జరిమానా కోసం నోటీసులు పంపవచ్చని పేర్కొంటున్నారు. బైకర్లపైకి షూస్ విసిరే హక్కులు పోలీసులకు లేవన్నారు. కానిస్టేబుల్ ఈ పరిస్థితిని మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉండాల్సి ఉండేదని యూట్యూబర్ కూడా అన్నాడు. ‘ఈ సంఘటనను సమర్థవంతంగా నిర్వహించాలంటే ఫోటో తీసి, జరిమానా విధించాలి. బెంగళూరులో చాలా మంది పోలీసులు వద్ద డిజిటల్ కెమెరాలు ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించే వారిని రికార్డు చేయవచ్చు. పలు మార్గ కూడలిలో ఏర్పాటు చేసిన కెమెరాలతో వాహన నెంబర్‌ను ట్రాక్ చేయవచ్చు’ అని యూట్యూబర్ పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోతో, ఆ పోలీసు కానిస్టేబుల్ పదవి పోవడమే కాకుండా.. జలహాలి ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే బైక్‌పై వెళ్లిన ఆ ఇద్దరు యువకులు మాత్రం కానిస్టేబుల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదు దాఖలు చేయలేదు. -
మాజీ కార్పొరేటర్ నివాసంలో రూ.40 కోట్లు
బెంగళూరు : బెంగళూరులో ఓ మాజీ కార్పొరేటర్ నివాసంలో పెద్ద ఎత్తున దొరికిన పాతనోట్లను చూసి పోలీసులే అవాక్కు అయ్యారు. వివరాల్లోకి వెళితే.... మాజీ కార్పొరేటర్ వి నాగరాజ్ నివాసంలో శుక్రవారం పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.40 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అంతకు ముందు తాళం వేసి ఉన్న ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు లాక్ పగలగొట్టి లోనికి వెళ్లగా, అక్కడ గదుల్లో పెద్ద ఎత్తున నగదు గుట్టలుగా పడి ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ రాష్ట్రవ్యాప్తంగా అప్పటి నుంచి దాడులు చేపట్టి పెద్ద మొత్తంలో నల్లధనాన్ని స్వాధీనం చేసుకుంది. -
అందాలు ఎరవేసి.. అందినకాడికి దోచేసి
బొమ్మనహళ్లి (బెంగళూరు): అందాన్ని ఎరగా వేసి అమాయకులను మోసగిస్తున్న కుష్బూ శర్మ అనే యువతిని బెంగళూరు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈమె బాధితులు ఏపీ,తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో కలిపి కుష్బుపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. రాజస్తాన్‌కు చె ందిన కుష్బు ఫేస్బుక్ ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకునేది. వారిని కాఫీ కేఫ్‌లు, రెస్టారెంట్లకు ఆహ్వానించి సన్నిహితంగా ఉన్నప్పుడు సెల్ఫీలు తీసుకునేది. అనంతరం డబ్బు ఇవ్వాలని.. ఇవ్వకుంటే అత్యాచార యత్నం చేశారని కేసు పెడతానని బెదిరించేది. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ ధనిక న్యాయవాది ఆమెకు ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. అనంతరం ఆఫీసు విషయం మాట్లాడటానికని అతని ఇంటికి వెళ్లి, రూ.1.75 లక్షల నగదు, ఐఫోన్‌తో పారిపోయింది. కొన్ని రోజుల అనంతరం మళ్లీ న్యాయవాదికి ఫోన్ చేయడంతో పోలీసులు పట్టుకున్నారు. -
ఐఎస్ఐఎస్ కుట్ర భగ్నం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఐఎస్ఐఎస్ తీవ్రవాద ముఠాతో సంబంధాలున్న 13 మందిని బెంగళూరు పోలీసులు గత నెల అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు కావడం కలకలం రేపింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు ఈ విషయాన్ని బైటపెట్టారు. రిపబ్లిక్ డే ఉత్సవాల నేపథ్యంలో తీవ్రవాదుల ఉనికి కారణంగా ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిఘా పెట్టారు. దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో ఐఎస్ఐఎస్కు చెందిన 13 మంది తీవ్రవాదులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో ఇద్దరు చెన్నై సమీపం గుమ్మిండిపూండి, కోయంబత్తూరుకు చెందిన వారుగా అధికారుల విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు ఆసిఫ్ ఆలీ అలియాస్ అర్మాన్ సానిన (21). ఇతను కోయంబత్తూరులో ప్లస్‌టూ వరకు కోయంబత్తూరులో చదివి ఆ తరువాత కుటుంబంతో సహా బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే గుమ్మిడిపూండికి చెందిన మహ్మద్ అబ్దుల్ అకద్ అలియాస్ సల్మాన్ (46) చెన్నైలో డిగ్రీ పూర్తిచేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని కుటుంబికులు గుమ్మిడిపూండిలోనే నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ గత నెల 22వ తేదీన బెంగళూరులో అరెస్టయ్యారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తమ విధ్వంసాలను అమలు చేసేందుకు యువతకు గాలం వేస్తున్నారు. యువతను ముగ్గులోకి దించేందుకు ఐఎస్ఐఎస్ భారత విభాగం అనే పేరుతో ముంబై, ఢిల్లీ, లక్నో, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రత్యేక బృందాలు సంచరిస్తున్నాయి. పట్టుబడిన యువకులు ఐఎస్ఐఎస్లోకి మరింత మంది యువకులను ఎంపికచేయడం, డబ్బు వసూలు చేయడం వంటి బాధ్యతలను అప్పగించింది. ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు కేంద్రస్థానమైన సిరియా నుంచి భారత్‌లోని యువకులను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సంప్రదిస్తుంటారు. అలాగే ఏకే 47, బాంబుల తయారీ ప్రయోగం తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారానే శిక్షణనిస్తున్నారు. ఇందుకోసం సాంకేతిక డిప్లొమో హోల్డర్లు, డిగ్రీలను పొందిన యువకుల పైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుని ఉన్న ఈ 13 మంది కొన్ని నెలల క్రితం లక్నోలో సమావేశమై విధ్వంస రచన చేశారు. పట్టుబడిన ఇద్దరు తమిళనాడు యువకులు తమ తోటివారితో కలిసి చెన్నైలో రహస్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని విధ్వంసాలకు కుట్రపన్నేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తీవ్రవాదుల కదలికలపై తీవ్రస్థాయిలో నిఘాపెట్టిన ఎన్ఐఏ కళ్లలో పడి కటకటాల పాలయ్యారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న చెన్నై యువకుడు సూడాన్‌కు వెళ్లి తీవ్రవాదులతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నట్లు కనుగొన్నారు. ఈ యువకుడిని సైతం గత ఏడాది డిసెంబరులో అరెస్ట్ చేయగా, రెండు నెలల్లోపే మరో ఇద్దరు తమిళనాడు యువకులు పట్టుబటడం ఆందోళనకరంగా పరిగణిస్తున్నారు. కోవైలో మావోల కదలికలు: ఇదిలా ఉండగా కోయంబత్తూరులో 15 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం నుంచి వాహనాల తనిఖీ తీవ్రతరం చేశారు. కోవై తొండాముత్తూరు సమీపం అట్టుకల్ కొండప్రాంత గ్రామాల్లో మావోయిస్టుల కదలికలున్నట్లు పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నక్సలైట్ల నిరోధక విభాగ పోలీసులు, ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా పోలీసులు, క్యూబ్రాంచ్ పోలీసులు, అటవీ అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో కూంబింగ్ ప్రారంభించారు. రెండు రోజుల క్రితం సుమారు 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులు చేతపట్టి కొండల్లోకి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాహనాల తనిఖీని కట్టుదిట్టం చేశారు. కోవై మీదుగా కేరళ రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించే మార్గాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
'అమిత్ మిశ్రా అస్సలు పట్టించుకోలేదు'
బెంగళూరు: క్రికెటర్ అమిత్ మిశ్రాపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని మొదట అనుకున్నానని అతడి స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ తెలిపింది. అయితే తాను పెట్టిన కేసు గురించి అమిత్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నానని వెల్లడించింది. 'కేసు ఉపసంహరించుకోవాలని మొదట్లో అనుకున్నా. కానీ కేసు గురించి అమిత్ మిశ్రా అసలు పట్టించుకోకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకున్నా. ఇప్పుడు కేసు కోర్టు, పోలీసుల ముందు ఉంది. తర్వాత ఏం జరుగుతుందనేది వారే తేలుస్తారు' అని వందన పేర్కొంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అమిత్ మిశ్రా దాడికి పాల్పడినట్టు సెప్టెంబర్ 27న అశోక్ నగర్ పోలీసు స్టేషన్లో వందన ఫిర్యాదు చేసింది. దీంతో అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మూడు గంటల విచారణ అనంతరం 'స్టేషన్ బెయిల్'పై విడుదల చేశారు. -
మిశ్రా అరెస్ట్, విడుదల
* మూడు గంటల విచారణ * వివరాలు తెలుసుకుంటున్నాం: బీసీసీఐ సాక్షి, బెంగళూరు: తన స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్‌పై దాడి చేశాడన్న కారణంతో భారత క్రికెటర్ అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మూడు గంటల విచారణ అనంతరం ‘స్టేషన్ బెయిల్’పై విడుదల చేశారు. ‘మిశ్రా వాదనను విన్నాం. సంఘటనకు సంబంధించి అతని నుంచి కొన్ని విషయాలను సేకరించాం. విచారణ పూర్తి చేసి త్వరలోనే చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేస్తాం. తర్వాత కోర్టు సమన్లు జారీ చేసి కేసును విచారిస్తుంది’ అని సిటీ సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. అనుమతి లేకుండా క్రికెటర్ల గదిలోకి రాకూడదనే నిబంధన ఉన్న నేపథ్యంలో తాను వందనా జైన్‌ను మందలించానే తప్ప ఆమెపై దాడికి పాల్పడలేదని విచారణలో మిశ్రా పేర్కొన్నట్లు సమాచారం. విచారణ అనంతరం మంగళవారం మధ్యాహ్నం మిశ్రా అరెస్ట్‌ను చూపారు. అనంతరం మిశ్రా, వందనాల స్నేహితుడైన రాఘవన్ బెయిల్ ష్యూరిటీ ఇవ్వడంతో విడుదల చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 325, 354 (ఎ) ప్రకారం పోలీసులు మిశ్రాపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే ఆరు నుంచి ఏడేళ్లు శిక్ష పడే అవకాశముందని పాటిల్ తెలిపారు. సెప్టెంబర్ 25న శిక్షణ కోసం బెంగళూరుకు వచ్చిన తనను కలిసేందుకు హోటల్ రూమ్‌కు వచ్చిన వందనపై మిశ్రా దాడి చేశాడని సమాచారం. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడికి పాల్పడినట్లు సెప్టెంబర్ 27న అశోక్ నగర్ పోలీసు స్టేషన్లో వందన ఫిర్యాదు చేసింది. దీన్ని విచారించిన పోలీసులు ఈనెల 20న విచారణకు హాజరుకావాలని క్రికెటర్‌కు నోటీసులు జారీ చేశారు. మరోవైపు క్రికెటర్‌పై పెట్టిన కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ‘కేసు విషయం బీసీసీఐ దృష్టికి వచ్చింది. అన్ని అంశాలను తెలుసుకుంటున్నాం. విషయాలు పూర్తిగా తెలిశాకే దాని గురించి మాట్లాడుతాం. పోలీసులు వాళ్ల పని చేస్తున్నారు. నేరంతో క్రికెటర్‌కు సంబంధం ఉందో లేదో మేం తెలుసుకుంటున్నాం. కచ్చితమైన విషయాలు తెలిసిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం’ అని శుక్లా వ్యాఖ్యానించారు. -
క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్టు
-
బెంగళూరు నుంచి ఐఎస్ఐఎస్ ప్రచారం!
ఉగ్రవాదుల ట్వీటర్ ఖాతాను నిర్వహిస్తున్న నగర వాసి! బ్రిటిష్ చానల్ వెల్లడి సాక్షి, బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు వాడుతున్న సామాజిక మాధ్యమం ట్వీటర్లో దాని ఖాతాను బెంగళూరుకు చెందిన వ్యక్తే నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. బ్రిటన్‌కు చెందిన చానల్ ‘4 న్యూస్’ ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో బెంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఖాతాను అనుమానితుడు బెంగళూరు నుంచి నిర్వహిస్తుండకపోవచ్చని భారత నిఘావర్గాలు పేర్కొన్నాయి. జిహాదీలకు అనుకూలంగా ‘షామీ విట్నెస్’ పేరుతో మెహ్దీ అనే వ్యక్తి ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు బ్రిటిష్ చానల్ వెల్లడించింది. అయితే అతని జీవితం ప్రమాదంలో పడే అవకాశమున్నందున పూర్తి పేరును వెల్లడించడం లేదని పేర్కొంది. బెంగళూరులోని ఓ కంపెనీలో అతను పనిచేస్తున్నట్లు తెలిపింది. షామీ విట్నెస్ పేరుతో ఐఎస్‌కు అనుకూలంగా అతను తన మొబైల్ ద్వారా ఇచ్చే ట్వీట్లను ప్రతి నెలా 20 లక్షల మంది చూస్తున్నారు. దీనికి 17,700 మంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. వీరిలో మూడు వంతుల మంది విదేశీయులే. దీంతో ఐఎస్ ఖాతాల్లోకెల్లా ఇదే అత్యంత ప్రచారం జరుగుతున్న ఖాతాగా గుర్తింపు పొందింది. ఐఎస్‌లో చేరే వారి కోసం సమాచారం అందించడం, బందీల తలల నరికివేత వీడియోలు వంటివి ఈ ఖాతాలో ఉన్నాయి. ఈ విషయం బయటకు పొక్కిన వెంటనే ఆ ఖాతా స్తంభించిపోయింది. కుటుంబం ఆర్థికంగా తనపైనే ఆధారపడటంతో ఖాతాదారుడు ఇంకా ఉగ్రవాద సంస్థలో చేరలేదని చానల్ తెలిపింది. -
చిన్నారిపై లైంగిక దాడి
బెంగళూరు : మూడు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ఏడుకొండలు (35)గా గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు బుధవారం తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అనేక కుటుంబాలు ఇక్కడి అమృతహళ్లి చేరుకుని గుడారాలు వేసుకుని నివాసముంటున్నారు. వీరు అందరూ కూలి పనులు చేస్తున్నారు. ఇక్కడే ఏడుకొండలు అనే వ్యక్తి కూడా గుడారాల్లో నివాసముంటున్నాడు. అతని ఇంటి సమీపంలో మూడు సంవత్సరాల బాలిక నివాసముంటోంది. సోమవారం రాత్రి మద్యం మత్తులో గుడారం దగ్గరకు వెళ్లిన ఏడుకొండలు అక్కడ ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్ ఇస్తానంటూ అతని ఇంటిలోకి తీసుకు వెళ్లాడు. బాలిక బట్టలు తీసివేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కనపడకపోవడంతో ఆమె తల్లి చుట్టుపక్కల గాలించింది. ఏడుకొండలు నివాసముంటున్న గుడారంలోకి వెళ్లి చూడగా అతను రెడ్ హ్యాడెండ్‌గా చిక్కిపోయాడు. ఏడుకొండలు చాకచక్యంగా తప్పించుకుని పరారైనారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో గాలించిన పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేశారు. బుధవారం అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామని పోలీసులు చెప్పారు. -
బెంగళూరు పోలీస్ కమిషనర్‌గా ఎం.ఎన్.రెడ్డి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వరుస అత్యాచార సంఘటనలతో ప్రభుత్వం ప్రతిష్ట మసక బారడంతో పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌ను సోమవారం సాయంత్రం ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ ఎంఎన్. రెడ్డి నియమితులయ్యారు. రెడ్డి స్థానంలో హెచ్‌సీ. కిశోర్ చంద్ర నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన కమ్యూనికేషన్, లాజిస్టిక్, ఆధునికీకరణ విభాగంలో అదనపు డీజీపీగా పని చేశారు. రాఘవేంద్ర ఔరాద్కర్ కర్ణాటక రిజర్వు పోలీసు అదనపు డీజీపీగా నియమితులయ్యారు. నగర అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) కమల్ పంత్‌పై కూడా బదిలీ వేటు పడింది. ఫిర్యాదులు, మానవ హక్కుల విభాగానికి ఆయన ఐజీపీగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ స్థానంలోని ఐజీపీ అలోక్ కుమార్‌ను నగర అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు)గా నియమించారు. ఒత్తిడి పెరగడంతో... నగరంలో వరుస అత్యాచార ఘటనలు ప్రభుత్వాన్ని ఊపిరి సలుపుకోకుండా చేశాయి. వాస్తవానికి రాఘవేంద్ర ఔరాద్కర్‌పై వేటు పడుతుందని ముందుగానే ఊహించినా, ఇంత హఠాత్తుగా జరుగుతుందనుకోలేదు. ఆయన పని తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ సమావేశాల తర్వాత బదిలీ చేస్తారని వినవచ్చింది. అయితే తొలుత పీజీ విద్యార్థిని, తర్వాత అరేళ్ల బాలికపై లైంగిక దాడులు జరగడంతో ప్రతిపక్షాలు శాసన సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ లైంగిక దాడులపై రోజు రోజుకు నిరసనల హోరు ఎక్కువవడంతో ప్రభుత్వం తక్షణమే ఈ బదిలీలకు ఉపక్రమించింది. -
హైటెక్ వేశ్య వాటిక నిర్వాహకుల అరెస్ట్
వేశ్య వాటిక నిర్వహిస్తున్న ఇద్దరిని ఇక్కడి కృష్ణరాజపురం(కేఆర్‌పురం) పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మంజునాథ్, సుబ్రమణి ఉన్నట్లు ఇన్స్పెక్టర్ సంజీవరాయప్ప తెలిపారు. నిందితుల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. మేడిహళ్లిలోని ఓ అద్దె ఇంటిలో వేశ్య వాటిక నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి మెరుపుదాడి నిర్వహించారు. ఆ సమయంలో నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్, ముంబయికి చెందిన తొమ్మిది మంది యువతులను రక్షించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ వారిని నమ్మించి పిలిపించుకున్నారని, అనంతరం వారిని నిర్బందించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.