చిన్నారిపై లైంగిక దాడి
బెంగళూరు : మూడు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన ఏడుకొండలు (35)గా గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు బుధవారం తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అనేక కుటుంబాలు ఇక్కడి అమృతహళ్లి చేరుకుని గుడారాలు వేసుకుని నివాసముంటున్నారు. వీరు అందరూ కూలి పనులు చేస్తున్నారు. ఇక్కడే ఏడుకొండలు అనే వ్యక్తి కూడా గుడారాల్లో నివాసముంటున్నాడు. అతని ఇంటి సమీపంలో మూడు సంవత్సరాల బాలిక నివాసముంటోంది.
సోమవారం రాత్రి మద్యం మత్తులో గుడారం దగ్గరకు వెళ్లిన ఏడుకొండలు అక్కడ ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్ ఇస్తానంటూ అతని ఇంటిలోకి తీసుకు వెళ్లాడు. బాలిక బట్టలు తీసివేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కనపడకపోవడంతో ఆమె తల్లి చుట్టుపక్కల గాలించింది. ఏడుకొండలు నివాసముంటున్న గుడారంలోకి వెళ్లి చూడగా అతను రెడ్ హ్యాడెండ్గా చిక్కిపోయాడు. ఏడుకొండలు చాకచక్యంగా తప్పించుకుని పరారైనారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో గాలించిన పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేశారు. బుధవారం అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించామని పోలీసులు చెప్పారు.