అమెరికా అన్నిట్లో ముందుంటుంది! అభివృద్ధికి ప్రామాణికమని చెప్పుకుంటారు! ఏ మార్పైనా అక్కడే మొదలవుతుందని, దాన్ని ఏ దేశమైనా అనుసరించొచ్చనే నమ్మకం ఆ దేశానిది.. ప్రపంచానిది కూడా! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దేశం ప్రపంచానికేమని సెలవిస్తోంది.. కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే? ముఖ్యంగా జెండర్ విషయంలో! సాధారణంగా థర్డ్ జెండర్ హక్కుల విషయంలో అమెరికా ప్రపంచానికి మార్గదర్శిగా ఉంది. భద్రమైన, గౌరవప్రదమైన గమ్యంగా ప్రపంచంలోని ఎందరో ట్రాన్స్‌జెండర్స్‌కి ఆశ్రయం ఇచ్చింది. ఆ స్పృహ మనతో సహా ఎన్నో దేశాలకు స్ఫూర్తినిచ్చింది.
వాళ్ల హక్కుల కోసం మన దగ్గరా ఉద్యమాలు సాగాయి. ప్రభుత్వాలు వాళ్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వమైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌గా నియమించింది. ట్రాన్స్‌మన్ ఐఆర్సెస్ ఆఫీసర్ అయ్యాడు. గవర్నమెంట్ డాక్టర్ కొలువొచ్చింది. ఇది కొంత మనం అగ్రరాజ్యం నుంచి నేర్చుకున్నదే! అలాంటిది ఆ దేశాధ్యక్షుడు ఇప్పుడు తాము ‘థర్డ్ జెండర్‌ను గుర్తించం’ అంటూ పాలనా ఉత్తర్వుల మీద సంతకం చేశాడు.
ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ట్రంప్ చేసిన ముఖ్య సంతకాల్లో అదొకటి. ఇప్పుడిప్పుడే సమాన హక్కుల వైపు అడుగులు వేస్తున్న దేశాలకిది విస్మయమే! ఇప్పటికే మన ఐపీసీలోని 377 సెక్షన్‌కు కొత్త చట్టం బీఎన్నెస్( భారతీయ న్యాయ సంహిత) ప్రత్యామ్నాయం చూపక చాలా ఆందోళనలు తలెత్తాయి. దానికిప్పుడు అమెరికా నిర్ణయాన్ని వత్తాసుగా తీసుకునే ప్రమాదమూ ఉంది. ఈ నేపథ్యం, సందర్భంలో ట్రాన్స్ జెండర్స్, వాళ్ల హక్కుల కార్యకర్తలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం ..
స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఎక్కువవుతాయి
అంతకుముందు అమెరికాలో మొదలైన మీ టూ, బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌లాంటి మూవ్‌మెంట్స్ ప్రభావం మన దగ్గరా (దళిత్ లైవ్స్ మ్యాటర్) ఉండింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ డెసిషన్ వల్ల ఎల్‌జీబీటీక్యూని వెస్టర్న్ కాన్సెప్ట్ అని అభిప్రాయపడుతున్న వాళ్లంతా ఇక్కడ దాని రిలవెన్స్‌నే జీరో చేసే చాన్స్ ఉంది. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి సంబంధించిన పాలసీలన్నీ కార్పొరేట్ కంపెనీల్లోనే కనిపిస్తాయి.
వాళ్లకు ఉద్యోగాలుండేవీ వాటిల్లోనే! ఇవన్నీ చాలావరకు అమెరికా బేస్డ్‌గానే ఉంటాయి. మిగతా ఎక్కడైనా ఎల్‌జీబీటీక్యూ వాళ్ల ఐడెంటిటీని దాచుకునే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ కోసం ఇండియన్ బిజినెసెస్ కూడా వాళ్ల పాలసీలు కొన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్లే తీసేస్తే వీళ్లూ అనవసరమనుకుంటారు. ఉద్యోగాలుండవు. దానివల్ల వాళ్ల ఏజెన్సీలు కూడా పోతాయి.
మళ్లీ మునుపటి స్థితికి వచ్చేస్తారు. స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఎక్కువవుతాయి. మన దగ్గర థర్డ్ జెండర్‌కి సంబంధించిన చట్టాలు కొంచెం భిన్నంగా, బలంగా ఉన్నాయి. వాటిని మార్చక΄ోతే పర్వాలేదు. ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి మారిస్తే మాత్రం ఇబ్బందే! ఇంకో విషయం.. రెండే జెండర్లని గుర్తించడం వల్ల ఆ రోల్స్ కూడా రిజిడైపోయి స్త్రీని ఇంటికే పరిమితం చేసే ప్రమాదం, స్త్రీ మీద హింస మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు.
– దీప్తి సిర్లా, జెండర్ యాక్టివిస్ట్
హింస పెట్రేగే ప్రమాదం
జెండర్ విషయంలో ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల ఎల్‌జీబీటీక్యూ, లైంగికత విషయంలో సందిగ్ధంలో ఉన్న పిల్లలు హింసకు లోనయ్యే ప్రమాదం ఉంది. పితృస్వామ్య వ్యవస్థ మరింత బలపడి స్త్రీల మీదా హింస పెట్రేగొచ్చు. ఇప్పుడిప్పుడే జెండర్ రైట్స్ మీద అవగాహన, చైతన్యం పెరుగుతున్న క్రమంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలపై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది.
ట్రాన్స్ జెండర్ల జీవితాలకు రిస్క్ నుంచి ఉంది. ట్రంప్ నిర్ణయాన్ని నిలువరించడానికి అమెరికా ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. అయితే అదొక్కటే సరి΄ోదు. ట్రంప్ నిర్ణయ పర్యవసానాలను తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీలవాదులందరూ సామాజిక పోరాటంతో మద్దతు తెలపాలి.
– రచన ముద్రబోయిన, ట్రాన్స్ రైట్స్, హ్యుమన్ రైట్స్ యాక్టివిస్ట్
ఫండ్స్, ఉద్యోగాలు ప్రశ్నార్థకమే!
చాలా విషయాల్లో మాదిరి జెండర్ విషయంలోనూ ట్రంప్ ఆ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు. ఎన్నో అమెరికన్ కంపెనీలు మన దగ్గర, ఇతర దేశాల్లో ‘డైవర్సిటీ ఈక్విటీ ఇన్‌క్లుజన్’ కింద ఎల్‌జీబీటీక్యూ వాళ్లకు ఫండ్స్, ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఈ ΄ాలసీల వల్ల అవి ప్రశ్నార్థకమవచ్చు! అంతేకాదు తమకు భద్రమైన ప్లేస్‌గా భావించి అమెరికా వెళ్లిన ఎల్‌జీబీటీక్యుల పరిస్థితేంటి? ΄ాస్΄ోర్ట్‌లో కూడా ట్రాన్స్‌జెండర్ అనే పదం వాడకూడదని చె΄్పాడు. ఆ నేపథ్యంలో వేరే దేశాల నుంచి చదువు కోసం, టూరిజం కోసం వెళ్లే ట్రాన్స్‌జెండర్ల సంగతేంటి? భయాందోళనలను కలిగించే విషయమే! ఇంకా చె΄్పాలంటే హింసను ప్రేరేపించే నిర్ణయమిది!
– తాషి చోడుప్, బౌద్ధ సన్యాసిని,
క్వీర్ ట్రాన్స్ వెల్‌నెస్ సెంటర్ ఫౌండర్, సోషల్ యాక్టివిస్ట్
Comments
Please login to add a commentAdd a comment