దుబాయ్‌లో పనిచేస్తున్న హైదరాబాదీ వాచ్‌మెన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. హైదరాబాద్‌కి చెందిన 60 ఏళ్ల నాంపల్లి రాచమల్లయ్య దుబాయ్‌లోని అబుదాబిలో గత మూడు దశాబ్దాలుగా బిల్డింగ్ వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి అప్పుడప్పుడూ బిగ్‌టికెట్ కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే తన స్నేహితులతో కలిసి యథావిధిగా టికెట్‌ని కొనుగోలు చేశాడు.
ఈసారి అనూహ్యంగా రాజమల్లయ్య కొనుగోలు చేసిన టికెట్‌కి లాటరీ తగలడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇటీవల అనౌన్స్ చేసిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా లో విజేతగా నిలిచాడు రాజమల్లయ్య. ఈ లక్కీ డ్రాలో రాజమల్లయ్య సుమారు రూ. రెండు కోట్లు(రూ. 2,32,76,460) పైనే గెలుచుకున్నాడు.
తాను ఇలా లాటరీ టిక్కెట్‌ని గత ముప్పైఏళ్లుగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఎట్టకేలకు అదృష్ట వరించిందని సంతోషంగా చెబుతున్నాడు రాజమల్లయ్య. ఈ ప్రైజ్ మనీని తాను టికెట్ కొనడానికి సాయం చేసిన స్నేహితులతో పంచుకుంటానని, అలాగే మిగతా మొత్తాన్ని కుటుంబం కోసం ఉపయోగిస్తానని తెలిపాడు రాజమల్లయ్య.
(చదవండి: టీనేజ్ పిల్లలకు ఈజీగా వంట నేర్పించండిలా..!)
Comments
Please login to add a commentAdd a comment