crorepati
-
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్
దుబాయ్‌లో పనిచేస్తున్న హైదరాబాదీ వాచ్మెన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. హైదరాబాద్‌కి చెందిన 60 ఏళ్ల నాంపల్లి రాచమల్లయ్య దుబాయ్‌లోని అబుదాబిలో గత మూడు దశాబ్దాలుగా బిల్డింగ్ వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి అప్పుడప్పుడూ బిగ్‌టికెట్ కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే తన స్నేహితులతో కలిసి యథావిధిగా టికెట్‌ని కొనుగోలు చేశాడు. ఈసారి అనూహ్యంగా రాజమల్లయ్య కొనుగోలు చేసిన టికెట్‌కి లాటరీ తగలడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇటీవల అనౌన్స్ చేసిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా లో విజేతగా నిలిచాడు రాజమల్లయ్య. ఈ లక్కీ డ్రాలో రాజమల్లయ్య సుమారు రూ. రెండు కోట్లు(రూ. 2,32,76,460) పైనే గెలుచుకున్నాడు. తాను ఇలా లాటరీ టిక్కెట్‌ని గత ముప్పైఏళ్లుగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఎట్టకేలకు అదృష్ట వరించిందని సంతోషంగా చెబుతున్నాడు రాజమల్లయ్య. ఈ ప్రైజ్ మనీని తాను టికెట్ కొనడానికి సాయం చేసిన స్నేహితులతో పంచుకుంటానని, అలాగే మిగతా మొత్తాన్ని కుటుంబం కోసం ఉపయోగిస్తానని తెలిపాడు రాజమల్లయ్య. View this post on Instagram A post shared by Big Ticket (@bigticketauh) (చదవండి: టీనేజ్ పిల్లలకు ఈజీగా వంట నేర్పించండిలా..!) -
బిగ్‌బీని కదిలించిన కేబీసీ 16 ‘కరోడ్‌పతి’ ఎమోషనల్ జర్నీ
బుల్లితెరపై రియాల్టీ, గేమ్, క్విజ్ షోలు చూసేటపుడు, పోటీదారులతోపాటు వీక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్విజ్‌లలో అయితే సమాధానం తెలిసినవారు ‘అబ్బ.. ఛ.! అదే నేనైతేనా అంటూ తెగ ఆరాటపడి పోతారు. కానీ అంత ఈజీ కాదు. అందుకే హాట్ సీట్ అయింది. గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి( KBC). తాజా కేబీసీ 16వ ఎడిషన్‌లో కోటి రూపాయలు గెల్చుకున్నాడు ఓ కుర్రాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాష్ ఎమోషనల్ జర్నీని తెలుసుకుందాం.ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో యుపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న చంద్ర ప్రకాష్ అన్ని దశలను పూర్తి చేసుకుని కేబీసీకి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 24న చాలెంజర్ వీక్‌లో భాగంగా హాట్ సీట్లో బిగ్ బీ ముందు ధైర్యంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఈ సీజన్లో తొలి 'కోటీశ్వరుడు' అయ్యాడు. దీంతో పాటు ఒక కారును కూడా గెల్చుకున్నాడు. ఇక్కడి దాకా రావడానికి చందర్ పడ్డకష్టాలు గురించి తెలుసుకున్న బిగ్‌బీ కూడా చలించిపోయారు. చందర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా చందర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు చందర్. ఆయన గుండె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏడు శస్త్రచికిత్సలు చేయించు కున్నాడు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి వైద్యులు అతనికి ఎనిమిదో శస్త్రచికిత్స చేయించు కోవాలని సూచించారు. ఇన్ని సర్జరీలు, బాధల్ని దాటుకుని చందర్ విజేతగా నిలవడం విశేషం.చందర్ కష్టాలను విన్న అమితాబ్ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ చెప్పిన ‘ప్రాణమున్నంత వరకు పోరాటం తప్పదు’ అనే మాటల్ని గుర్తు చేశారు. పట్టుదల, అంకిత భావమే మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటూ విజేత చందర్ ప్రకాష్‌ను అభినందించారు. కోటి రూపాయల ప్రశ్న "ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు, కానీ 'శాంతి నివాసం' అని అర్ధం వచ్చే అరబిక్ పేరుతో ఉన్న ఓడరేవు? డబుల్ డిప్ లైఫ్‌లైన్‌ని అనే లైఫ్‌లైన్‌ని ఎంచుకుని దీనికి సరియైన టాంజానియాగా చెప్పాడు. దీంతో కోటి గెల్చుకున్నాడు. ఇక ఏడు కోట్ల ప్రశ్నకుచందర్ని రూ. 7 కోట్ల ప్రశ్న '1587లో ఉత్తర అమెరికాలో ఆంగ్లేయ తల్లిదండ్రులకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?'. లైఫ్లైన్లు లేకపోవడంతో, సమాధానం కచ్చితంగా తెలియక షో నుంచి క్విట్ అయ్యాడు. కానీ వర్జీనియా డారే అనే జవాబును సరిగ్గానే గెస్ చేశాడు. ఇలాంటి హృదయాలను కదిలించే కథలు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అనేకం విన్న సంగతి తెలిసిందే. -
ఎన్నికల బరిలో ‘మిజోరం’ కోటీశ్వరులు
మిజోరంలో 2023, నవంబరు 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్నికల బరిలోకి దిగిన మొత్తం 174 మందిలో 112 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. అభ్యర్థుల అఫిడవిట్ల ప్రకారం 64.4 శాతం మంది అభ్యర్థులు రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. సంపన్న అభ్యర్థులలో ముందుగా వినిపించే పేరు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్రూ లాల్రెంకిమా పచువా. ఆయన రూ.69 కోట్లు విలువ చేసే ఆస్తులు కలిగివున్నారు. ఆయన ఐజ్వాల్ నార్త్-III నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇతని తరువాత సెర్చిప్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు చెందిన ఆర్ వన్లాలత్లుంగా రూ.55.6 కోట్ల ఆస్తులు కలిగివున్నారు. చంపై నార్త్ నుంచి పోటీ చేస్తున్న జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కు చెందిన హెచ్ గింజలాలా రూ.36.9 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. అఫిడవిట్ ప్రకారం సెర్చిప్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి రామ్‌లున్-ఎడెనా అత్యంత పేద అభ్యర్థి. ఇతని దగ్గర 1500 విలువైన చరాస్తులున్నాయి. టుయిచాంగ్ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి తవాన్‌పుయ్ అభ్యర్థులలో అత్యధిక వయసు కలిగిన వ్యక్తి. ఆయనకు 80 ఏళ్లు. బీజేపీ అభ్యర్థి ఎఫ్ వాన్‌హమింగ్‌తంగా(31) ఎన్నికల బరిలోకి దిగిన అతి పిన్న వయస్కురాలు. ఇది కూడా చదవండి: అత్యాచార బాధితురాలిని పట్టించుకోని శివరాజ్ సర్కార్! -
కరోడ్‌పతి చాయ్‌వాలా: ఐఐ‘టీ’యన్ చాయ్ కహానీ..
దేశంలో ఉన్నత చదువులు చదివిన కొంత మంది యువత ఉద్యోగాలు దొరక్క టీ దుకాణాలు ప్రారంభించి ఉపాధి పొందడం చూస్తున్నాం. ఇలా లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. అయితే లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం అదీ అమెరికన్ జాబ్ మానేసి మరీ చాయ్ బిజినెస్ పెట్టిన వాళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? అమెరికాలో ఉద్యోగం చాలా మందికి కల. కానీ అది కొందరికే దక్కుతుంది. ఇంతటి క్రేజ్ ఉన్న యూఎస్ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఐఐటీయన్ నితిన్ సలూజా (Nitin Saluja) వదులుకున్నాడు. చాయోస్ (Chaayos) అనే పేరుతో టీ బిజినెస్‌ను ప్రారంభించాడు. నితిన్ సలూజా ప్రారంభించిన చాయోస్ వ్యాపారంలో మొదట్లో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. కానీ నితిన్ పట్టుదల, సంకల్పంతో కంపెనీని విజయ శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు. స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా వంటి కాఫీ షాపుల ఆధిపత్యంలో ఉన్న దేశంలో చాయోస్ తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. భారతదేశంలోని ప్రముఖ చాయ్ కేఫ్‌గా మారింది. చాయ్ బిజినెస్‌ను స్థాపించి, రూ. 100 కోట్ల వ్యాపారంగా మార్చిన నితిన్ సలూజా కథను తెలుసుకుందాం. మెకానికల్ ఇంజనీర్ నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తన చదువు పూర్తయిన తర్వాత, సలుజా అమెరికాలోని ఒక పెద్ద సంస్థలో కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా చేరారు. రూ.లక్షల్లో జీతం. ఒక రోజు నితిన్, తన భార్యతో కలిసి టీ తాగుదామనుకున్నారు. కానీ కనుచూపు మేరలో టీ షాప్ కనిపించలేదు. అప్పుడే నితిన్ ఓ ఆలోచన వచ్చింది. టీ కేఫ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఉద్యోగాన్ని మానేసి ఇండియాకి తిరిగొచ్చేశాడు. టీ వ్యాపారానికి ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించాడు. చాయోస్ పుట్టిందిలా.. నితిన్ అమెరికాలో ఉన్నప్పుడు టీ బూత్‌ల నుంచి టీ కొనడం సవాలుగా ఉందని గమనించాడు. టీ తాగడానికి ఒక హై-ఎండ్ టీ షాప్ ఏర్పాటు చేయగలిగితే అది అద్భుతంగా ఉంటుందని భావించాడు. భారత్‌లో రకరకాల కాఫీని అందించే కేఫ్‌లు చాలా ఉన్నాయి కానీ విభిన్న టీని అందించేవి ఏవీ లేవని గుర్తించాడు. దేశంలో ప్రత్యేకమైన టీ తాగే సంస్కృతి ఉంది. భారతీయులు అనేక రకాల టీలను తయారుచేస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న నితిన్.. ఇండియాలో టీ తాగేవాళ్లకు ఉపయోగపడే టీ కేఫ్‌ను ప్రారంభించాలని భావించాడు. 2012లో తన స్నేహితుడు రాఘవ్‌తో కలిసి చాయోస్ని స్థాపించాడు. గురుగ్రామ్‌లో తమ మొదటి కేఫ్ ప్రారంభించారు. రూ. 100 కోట్ల ఆదాయం ఇంతో ఇష్టంగా చాయోస్ను ప్రారంభించిన నితిన్ కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం మొదలు పెట్టాడు. ప్రారంభంలో కొన్నేళ్లు మూలధనం, పెట్టుబడి సమస్యలతో మనుగడ కోసం కష్టపడ్డాడు. తానే స్వయంగా ఆర్డర్లు తీసుకోవడం, టీ తయారు చేయడం, సర్వ్ చేయడం వంటివి చేసేవాడు. ప్రతి కస్టమర్‌కూ ప్రత్యేకమైన టీని అందిస్తూ ఆకట్టుకునేవాడు. ఇలా వ్యాపారం వేగం పుంజుకుంది. అవుట్లెట్లు విస్తరించాయి. కాగా కోవిడ్ సమయంలో అన్ని వ్యాపారాల లాగే చాయోస్ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత 2020లో మళ్లీ పుంజుకుంది. తొలినాళ్ల కష్టాల తర్వాత నితిన్ శ్రమకు ప్రతిఫలం దక్కింది. కంపెనీ 2020లో రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. చివరికి ముంబై, బెంగళూరు, చండీగఢ్, పుణేలలో చాయోస్ స్టోర్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200కి పైగా చాయోస్ కేఫ్‌లు ఉన్నాయి. -
11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్‌లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ..
సాధారణంగా 11 ఏళ్ల చిన్నారులు వీడియో గేమ్స్ ఆడటం, చదువుకోవడం లేదా ఏదో ఒకటి తింటూ కనిపిస్తారు. అయితే ఆ చిన్నారి వీరందరికీ భిన్నంగా ధనవంతుల మాదిరిగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ చిన్నారి కోట్లకు అధిపతి. వ్యాపారంలో విజయం సాధించింది. ఈ చిన్నారి పేరు పీక్సీ కర్టీస్. ఆమె స్థాపించిన కంపెనీ పీక్సీ ఫిడ్గెట్స్.. పిల్లల బొమ్మలను, దుస్తులను విక్రయిస్తుంటుంది. పీక్సీ చైల్డ్ ఇన్ఫ్లుయెన్సర్గానూ పేరు పొందింది. ఆ చిన్నారి సోషల్ మీడియా అకౌంట్‌ను ఆమె తల్లి రాక్సీ హ్యాండిల్ చేస్తుంటుంది. ది సన్ రిపోర్టును అనుసరించి పీక్సీ రూ. 72 కోట్లకుపైగా ఆస్తికి యజమాని. ఆ చిన్నారి తన 15 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంది. యూరప్‌కు ప్రైవేట్ జెట్‌లో విహారయాత్రలు చేసేందుకు వెళ్లింది. పెద్దవారి మాదిరిగా చర్మ సౌందర్యం కోసం అనేక ట్రీట్మెంట్లు తీసుకుంటోంది. ఆమె దగ్గర పలు లగ్జరీ వాహనాలు ఉన్నాయి. పీక్సీ ఇన్‌స్టాగ్రామ్‌కు 1,36,000కు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. పీక్సీ తల్లి కూడా ఇదేవిధమైన లగ్జరీ లైఫ్ గడుపుతోంది. ఆమె తన కుమార్తె కోసం 193,000 పౌండ్లు (సుమారు రెండు కోట్లు) వెచ్చించి కార్లు కొనుగోలు చేసింది. వీటిలో 43 వేల పౌండ్లు(సుమారు 44 లక్షలు) విలువైన మెర్సిడీస్ బెంజ్ కారు కూడా ఉంది. రాక్సీ తన కుమార్తె గురించి మాట్లాడుతూ తన కుమార్తె అన్ని పనులకు ఈ కార్లను వాడదని, తన సోదరునితో పాటు స్కూలుకు వెళ్లేందుకు, ఇతర ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ఈ కార్లను వాడుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో పీక్సీ గురించిన కథలనాలను చూసిన యూజర్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ ఆ చిన్నారి ఎప్పుడూ ఫోను చూస్తూనే కనిపిస్తుందని అన్నారు. మరో యూజర్ 11 ఏళ్ల చిన్నారికి ఇంజక్షన్ ప్లాంపర్ అవసరం ఏముందని, ఆమె పెద్ద అయ్యాక అందం కోసం వివిధ థెరపీలు చేయించాల్సి ఉంటుందన్నారు. ఇంకొక యూజర్ 11 ఏళ్ల చిన్నారికి 3 వేల డాలర్ల విలువైన బ్యాగ్ ఇవ్వడం తగినది కాదన్నారు. ఇది కూడా చదవండి: సముద్రంలో పర్యాటకుల సయ్యాటలు.. సడన్‌గా షార్క్ దూసుకురావడంతో.. -
అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు
కేబీసీ కరోడ్‌పతి రవి మోహన్ సైనీ గుర్తున్నారా. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన టాప్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి టెలివిజన్ షో 2001లో రవి పెద్ద నేషనల్ సెన్సేషన్. కేవలం 14 సంవత్సరాలకే కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్ని రవి మోహన్ సైనీ గెలుచుకున్నారు.15 కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అప్పట్లో పెద్ద సంచలనం రేపాడు. అంతేనా దయాగాడి దండయాత్ర అన్నట్టు రవి విజయ పరంపర ఆగిపోలేదు. కేబీసీ జూనియర్ విజేత మాత్రమే కాదు, ఆ తరువాత డాక్టర్ అయ్యాడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి ఐపీఎస్‌గా ఆ తర్వాత వార్తల్లో నిలిచాడు. 20 ఏళ్ల తర్వాత 34 ఏళ్ల వయసులో 2021లో గుజరాత్లో పోరుబందర్‌కి ఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఊహించని విజయాలతో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్న రవిసైనీ విజయగాథ ఇది. కేబీసీ నాటికి రవి 10వ తరగతి చదువుతున్నాడు. మెగాస్టార్ అబితాబ్‌ని కలవాలన్న కలతో పాటు షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని తానే ఒక స్టార్‌గా నిలిచాడు. అప్పటికే మంచి విద్యార్థి ,ఎప్పుడూ టాపర్ అయిన రవిలో ఇది మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జైపూర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రవి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఎలాంటి కోచింగూ తీసుకోకపోవడం మరో విశేషం. (టీసీఎస్‌లో భారీ కుంభకోణం: రూ.100 కోట్ల కమిషన్లు మింగేశారు!) 2012 లో మెయిన్స్‌ను క్లియర్ చేయలేకపోయాడు. దీంతో 2013లో, భారత తపాలా శాఖ ఖాతాలు, ఆర్థిక సేవలకు ఎంపికయ్యాడు. ఆ తరువాత మెడికల్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడే 2014లో, ఆల్ ఇండియా ర్యాంక్ 461తో అర్హత సాధించాడు. తండ్రి నేవీ అధికారి స్ఫూర్తితోనే ఐపీఎస్‌లో చేరానంటారు ఎస్పీ డా. రవి మోహన్ సైనీ. પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર દ્વારા વાવાઝોડાથી સંભવિત નુકશાન થઈ શકે તેવા હાર્બર મરીન અને સુભાષ નગર જેટી વિસ્તારની મુલાકાત લઈ નાગરિકો અને સ્ટાફને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.@GujaratPolice@dgpgujarat@sanghaviharsh@Harsh_office @CMOGuj@Igp_jnd_range pic.twitter.com/pNSqC2Oh84 — SP Porbandar (@SP_Porbandar) June 13, 2023 మరిన్ని బిజినెస్ వార్తలు, ఇంట్రస్టింగ్ కథనాల కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో..
ఓవర్ నైట్‌లో కోటీశ్వరులైపోవాలని కలలు కనని వారుండరేమో ఈ జిందగీలో! కానీ చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. హఠాత్తుగా అదృష్టం వరించి రాత్రికిరాత్రే జాతకం మారిపోతుంది. అలాంటి వింతొకటి ఓ వ్యక్తి కి తారసపడింది. ఉదయం లాటరీ టికెట్ కొన్నాడు సాయంత్రానికి కోటీశ్వరుడైపోయాడు. అదెలాగో మీరే తెలుసుకోండి.. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బార్ధమాన్కు చెందిన షేక్ హీరా అనే అంబులెన్స్ డ్రైవర్ ఒక రోజు ఉదయం రూ. 270లతో కోటి రూపాయల జాక్‌పాట్ లాటరీ టికెట్ కొన్నాడు. అంతే! సాయంత్రానికి అతన్ని అదృష్ట దేవత వరించింది. దీంతో అయోమయానికి గురైన సదరు వ్యక్తి సమీపంలోని శక్తి ఘడ్ పోలీస్ స్టేషన్‌ను సలహాకోసం ఆశ్రయించాడు. లాటరీ టికెట్ పోతుందేమోననే భయం కూడా అతనిలో లేకపోలేదు. పోలీస్ అధికారులు అతన్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లి, బయట కొంత మంది పోలీసులను రక్షణగా ఉంచారు కూడా. నిజానికి అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించుకోవడానికి అతనికి డబ్బు అవసరం చాలా ఉంది. లాటరీని గెలుచుకున్న తర్వాత తన తల్లి త్వరగా కోలుకుంటుందనే ధీమా వ్యక్తం చేశాడు. ‘లాటరీ టికెట్ల ద్వారా ఏదో ఒక రోజు జాక్‌పాట్ కొట్టాలని కలలు కన్నాను. ఇన్నాళ్లకు నా కాల నెరవేరింద’ని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావని మీడియా అడిగిన ప్రశ్నకు.. తన తల్లికి మంచి వైద్యం చేయించి, ఉండటానికి చక్కని ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. ప్రస్తుతం అంతకు మించి వేరే ఆలోచన ఏమీ లేదని చెప్పాడు. హీరాకు టిక్కెట్ అమ్మిన దుకాణదారుడు షేక్ హనీఫ్ మాట్లాడుతూ.. ‘ఎన్నో యేళ్లగా లాటరీ టిక్కెట్ వ్యాపారం చేస్తున్నాను. చాలా మంది నా షాప్ నుండి టిక్కెట్లు కొంటారు. కొంతమందికి రివార్డ్‌లు అప్పుడప్పుడు దక్కుతాయి. కానీ ఇంత పెద్దమొత్తంలో ఎవరికీ మునుపెన్నడూ తగల్లేదు. నా షాప్‌లో కొన్న టికెట్ జాక్‌పాట్ కొట్టడం చాలా సంతోషంగా ఉంద’ని తెలిపాడు. చదవండి: గాడిదపాలు తాగితే కరోనా తగ్గుతుంది! లీటరు రూ. 10వేలు.. -
చేతిలో భారీ నగదు.. ఆటో డ్రైవర్‌తో కోటీశ్వరుడి భార్య పరార్
భోపాల్: మధ్యప్రదేశ్, ఇండోర్ పోలీసులు ముందుకు ఓ అసాధారణ కేసు వచ్చింది. కోటీశ్వరుడి భార్య.. వయసులో తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన ఆటో డ్రైవర్‌తో పరార్ అయ్యింది. వెళ్తూ వెళ్తూ 47 లక్షల రూపాయలు తనతో తీసుకెళ్లింది. దాంతో ఆ కోటీశ్వరుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కోటీశ్వరుడి భార్య, ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇండోర్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు కొన్ని నెలల క్రితం సదరు కోటీశ్వరుడి భార్యతో పరిచయం ఏర్పడింది. రెండు, మూడు సార్లు ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కోటీశ్వరుడి భార్య, ఆటో డ్రైవర్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోతూ పోతూ తనతో పాటు 47 లక్షల రూపాయలు పట్టుకెళ్లింది. (చదవండి: వైరల్: భర్త మరో మహిళతో జిమ్‌లో.. చెప్పులతో చితకబాదిన భార్య) బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఖంద్వా, ఉజ్జయిని, రత్లామ్ ప్రాంతాల్లో గాలించి.. ఆటోడ్రైవర్ని, సదరు మహిళను అదుపులోకి తీసకున్నారు. ఆటో డ్రైవర్ వద్ద నుంచి 33 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఒంటరి ప్రయాణికులనే సెలక్ట్ చేసుకుని.. ఆపై.. -
ఎంబీఏ చదవలేకపోయాడు.. టీ కొట్టుతో కోట్లు సంపాదించాడు..
అహ్మదాబాద్: జీవితంలో సక్సెస్ ఎవరికీ అంత ఈజీగా రాదు. కానీ వినూత్న ఆలోచన, పట్టుదల ఉంటే అదే సక్సెస్ వెతుక్కుంటూ మన ఇంటి తలుపు తడుతుందని నిరూపించాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రపుల్ బిల్లోర్. మొదట్లో ఈ పేరు కూడా పలకడం రాని వాళ్లకు, అలాంటి పేరుని ఇప్పుడు పది మంది నోళ్లలో నానేలా చేశాడు. ఓ చిన్న టీ కోట్టుతో మొదలై దేశవ్యాప్తంగా 22 స్టాల్స్‌ను ప్రారంభించే స్థాయికి వెళ్లాడు. అలాంటి ప్రపుల్ విజయగాథ వివరాలను ఓ సారి చూసేద్దాం. మధ్యప్రదేశ్‌లోని లాబ్రవదా గ్రామానికి చెందిన రైతు కుమారుడు ప్రఫుల్ బిల్లోర్. అయితే వ్యాపారవేత్త కావాలని మొదటి నుంచి కలలు కనేవాడు. అందుకు ప్రతిష్ఠాత్మక ఐఐఎం విద్యాసంస్థల్లో ఎంబీఏ చేద్దామనుకున్నాడు కానీ క్యాట్ పరీక్షలో మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకోయాడు. కానీ అదే తన జీవితాన్ని మార్చేయబోతోందని ఆ రోజు అతనికి తెలీదు. మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా చదువు పక్కన పెట్టి మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. అలా కొన్ని నెలల తరువాత, అతను ఉద్యోగం చేస్తునే సొంతంగా చిన్న కొట్టు ప్రారంభించాడు. అయితే వ్యాపారానికి డబ్బులు సరిపోయేవి కావు, దీంతో చదువు కోసం రూ.10,000 కావాలని తండ్రి దగ్గర తీసుకుని వాటిని టీ సామాగ్రిని కొనుగోలుకి ఉపయోగించాడు. అలా సెట్ అయిన వ్యాపారంతో ప్రపుల్ డ్రీమ్ కాలేజ్ అయిన, ఐఐఎం అహ్మదాబాద్ వెలుపల తన టీ అమ్మడం మొదలుపెట్టాడు. మొదటగా మిస్టర్ బిల్లోర్ అహ్మదాబాద్ అనే పేరు పెట్టినప్పటికీ, అతని కస్టమర్లకి ఆ పేరు పిలవడం కష్టంగా ఉండడంతో దానిని ‘ఎంబీఏ చాయ్’ వాలాగా మార్చాడు. ఆ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసలు, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాడు. తన షాపుకి వచ్చే ఎంబీఏ విద్యార్థులు, స్టాఫ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ కస్టమర్ బేస్‌ను క్రమంగా పెంచుకుంటూ పోయాడు. గతేడాది అతని వ్యాపారం టర్నోవర్ 3 కోట్లు చేరినట్లు తెలిపాడు ప్రపుల్. ఇలా కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా 22 టీస్టాల్స్‌ను ప్రారంభించి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. చదవండి: A Man Sends Mail TO Paytm CEO: "నా స్టార్ట్ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్" -
తమిళనాట కరోడ్‌పతి..యూపీలో బెగ్గర్
సాక్షి,న్యూఢిల్లీ: ఆధార్ కార్డుపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంటే అదే ఆధార్ ద్వారా తమిళనాడులో కోటీశ్వరుడైన ఓ వ్యక్తి యూపీలో యాచకుడిగా దీనస్థితిలో ఉన్న విషయం వెల్లడైంది.యూపీలోని రాయ్‌బరేలి జిల్లా రాల్పూర్ పట్టణంలో వృద్ధుడి వద్ద ఆధార్ కార్డు, కోటి రూపాయల పైన ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలున్నట్టు కనుగొన్నారు. స్వామి భాస్కర్ స్వరూప్‌జీ ఆశ్రమ పాఠశాల వద్ద యాచకుడిగా తిరుగుతున్న వ్యక్తిని స్వామి చేరదీసిన క్రమంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. యాచకుడికి స్నానం చేయిస్తుండగా ఆయన దుస్తుల్లో ఆధార్ కార్డు, రూ కోటికి పైగా ఎఫ్డీ పత్రాలు లభించాయి. ఆధార్‌లో పొందుపరిచిన వివరాలతో ఆరా తీయగా ఆ యాచకుడు తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సంపన్న వ్యాపారవేత్త ముత్తయ్యనాడార్‌గా తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు.తండ్రిని తీసుకునివెళ్లేందుకు తమిళనాడు నుంచి ఆయన కుమార్తె గీత రాల్పూర్‌కు వచ్చారు. తన తండ్రికి ఆశ్రయమిచ్చిన స్వామీజీకి, ఆశ్రమ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఓ రైలు ప్రయాణంలో తప్పిపోయిన తమ తండ్రి కోసం ఆరు నెలలుగా గాలిస్తున్నామని ఆమె చెప్పారు. తమ తండ్రికి బలవంతంగా మత్తుపదార్ధాలు ఎక్కించడంతో ఆయన దారితప్పి ఉంటారని భావిస్తున్నామన్నారు. -
కరోడ్‌పతి కాలేదు...కోర్టుకెక్కాడు..
సాక్షి, ముంబయి: మేమిచ్చిన రాయి పెట్టుకుంటే మూడు నెలల్లో కోటీశ్వరుడవుతావు..అలా కాకుంటే డబ్బు వాపస్ చేస్తాం అంటూ జ్యూవెలర్ చెప్పిన మాట నమ్మి సొమ్ము పోగొట్టుకున్నాడు ఓ వృద్థుడు. మూడు నెలలు దాటినా కోట్లు కనబడక పోయేసరికి రాయి తీసుకుని తన డబ్బు తనకివ్వాలని షోరూం నిర్వాహకులను కోరగా అందుకు వారు నిరాకరించడంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. అక్రమ పద్ధతుల్లో లావాదేవీ నిర్వహించారని బాధితుడికి 9 శాతం వడ్డీతో కలిపి అతను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాలని, పరిహారంగా రూ 25,000 చెల్లించాలని కోర్టు జ్యూవెలర్‌ను ఆదేశించింది. ముంబయికి చెందిన స్వర్ణ్ స్పర్శ్ అనే జెమ్‌స్టోన్ దుకాణంలో ఖండాలే అనే వ్యక్తి 2013లో నీలం జెమ్ స్టోన్‌ను కొనుగోలు చేశారు. కొద్ది రోజుల తర్వాత అదే షాపు నుంచి జ్యోతిష్యులు కుమారి ప్రాచి, శశికాంత్ పాండ్యా ఫోన్ చేసి సదరు రాయి మీకు సరిపడదు..పుష్యరాగ్, మాణిక్య రాళ్లను కొనుగోలు చేయాలని సూచించడంతో రూ 2.9 లక్షలకు వాటిని ఖండాలే కొనుగోలు చేశారు. మూడు నెలల్లో తాము చెప్పినట్టు కోటీశ్వరుడు కానిపక్షంలో డబ్బు తిరిగి ఇచ్చస్తామని ఈ సందర్శంగా జ్యోతిష్యులు నమ్మబలికారు. అయితే మూడు నెలలు గడిచినా కోటీశ్వరుడు కాకపోవడంతో డీలా పడిన ఖండేలా తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని షాపులో కోరారు. అందుకు నిర్వాహకులు నిరాకరించడంతో 2014 మేలో ఆయన కన్సూమర్ కోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లోగా కొనుగోలు చేసిన వస్తువును తిరిగి ఇస్తేనే సొమ్ము చెల్లించడం జరుగుతుందని, బాధితుడు గడువులోగా రానందున డబ్బు వాపస్ చేయలేమని సంస్థ తేల్చిచెప్పింది. వాదనలు పరిశీలించిన కోర్టు మోసపూరిత హామీతో వస్తువు విక్రయించిన క్రమంలో బాధితుడికి 9 శాతం వడ్డీతో కలిపి రూ 3.2 లక్షలు చెల్లించాలని, పరిహారం కింద రూ 25,000 కోర్టు ఖర్చుల కింద రూ 5000 చెల్లించాలని జ్యూవెలర్‌ను ఆదేశించింది. -
జీతం రూ.1,200.. కానీ కళ్లు చెదిరే కోటీశ్వరుడు
భోపాల్: అతడు నెల రోజులుపాటు కష్టపడితే అందుకు ప్రతిఫలంగా యజమాని చెల్లించేది రూ.1,200. కానీ అనూహ్యంగా అతడు కోట్లాధిపతి అయ్యాడు. కాదు కాదు.. అతడు కోటీశ్వరుడని ప్రభుత్వ అధికారులు తేల్చారు. అది కూడా అక్రమంగా సంపాధించిందని బయటపెట్టారు. లోకాయుక్త అధికారులు అతడి ఇంటిపై దాడిచేసిన తర్వాత గానీ ఈ విషయం లోకానికి తెలియలేదు. సురేశ్ ప్రసాద్ పాండే అనే వ్యక్తి మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో ఓ చిన్న దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతడి నెల జీతం రూ.1200. అయితే, అతడి వద్ద అక్రమ ఆస్తులు చాలా ఉన్నాయని స్థానిక లోకాయుక్త అధికారులకు సమాచారం అందడంతో అనూహ్యంగా వారు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిజంగానే అతడి వద్ద కోట్ల విలువ చేసిన ఆస్తులు ఉన్నట్లు స్థిర, చర ఆస్తుల పత్రాలు లభించాయి. వీటితోపాటు ఒక బొలేరో, ఆల్టో కార్లను, యాక్టివా, హోండా షైన్ బైక్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి సంవత్సర సంపాధన కంటే 200 రెట్లు ఆస్తులు గుర్తించామని అధికారులు వెల్లడించారు. పాండే, అతడి కుమారుడు, భార్య పేరిట మొత్తం 8 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. -
ఇన్ఫోసిస్ లో కోటీశ్వరులు తగ్గారు!
టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీలో కోటీశ్వరులైన ఉద్యోగుల సంఖ్య పడిపోయిందట. కంపెనీ వార్షిక రిపోర్టు ప్రకారం 2014-15లో 113గా ఉన్న సంపన్న ఉద్యోగులు, 2015-16 ఆర్థిక సంవత్సరానికి 54కి పడిపోయారట. దీనికి గల ప్రధాన కారణం కంపెనీ నుంచి ఉద్యోగులు బయటికి వెళ్తుండటమేనని వార్షిక రిపోర్టు నివేదించింది. భారత్ లో రెండో అతిపెద్ద స్టాఫ్ట్ వేర్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్, గతేడాది ఉద్యోగులకు ప్రమోషన్లను, బోనస్ లను ఇవ్వడం వల్ల కోటీశ్వరుల జాబితా పెరిగింది. అయితే ఈ ఏడాది ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ లకు మాత్రమే వన్ టైమ్ బోనస్ లు అందించింది. దీంతో విశ్లేషకులు అంచనా వేసిన విధంగానే ఇన్ఫోసిస్ లో సంపన్న ఉద్యోగుల జాబితా తగ్గింది. అయితే ఏడాదికి రూ.60 లక్షల వేతనం ఆర్జించే ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాదిలో 260కి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం నాటికి రూ.60 లక్షల వేతనం ఆర్జించేవారు కేవలం 200 మందే ఉన్నారు. కంపెనీ నుంచి ఉద్యోగులు బయటికి వెళ్తుండటంతో సంపన్న ఉద్యోగుల జాబితా 2016-17లో మరింత తగ్గుతుందని ఇన్ఫోసిస్ వార్షిక రిపోర్టులో నివేదించింది. గతేడాది ఇన్ఫోసిస్ కు రాజీనామా చేసిన వెళ్లిన మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ రాజీవ్ బన్సాల్, ఏడాదికి రూ.10 కోట్లకు పైగా వేతనం ఆర్జించేవారు. ఏడాదికి రూ.60 లక్షలకు పైగా వేతనం ఆర్జించే వారిలో దాదాపు 70 మంది ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ నుంచి బయటికి వెళ్లినట్టు వార్షిన నివేదిక వెల్లడించింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.48.73 కోట్ల వేతనం ఆర్జిస్తున్నారని కంపెనీ తెలిపింది. సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు 2014 ఆగస్టులో ఆయన వేతనం కేవలం రూ.4.56 కోట్లగా మాత్రమే. ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావ్ ఈ ఏడాది రూ.9.28కోట్ల సాలరీ పొందుతున్నారు. 2016 మార్చి 31 వరకు ఇన్ఫోసిస్ లో 1.94 లక్షల పైగా ఉద్యోగులున్నారు. -
కేబీసీ 2013లో తొలి కోటీశ్వరుడు
ఉదయ్‌పూర్‌కు చెందిన తాజ్ మహ్మద్ రంగ్రేజ్ ఓ చరిత్ర ఉపాధ్యాయుడు కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. టీవీ చరిత్రలోనే అత్యంత సూపర్ హిట్ గేమ్ షోగా నిలిచిన కౌన్ బనేగా కరోడ్‌పతి ఏడో సీజన్లో తొలి కోటీశ్వరుడయ్యాడు. కోటి రూపాయలు గెలుచుకున్నానంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని.. అయితే తనమీద తనకు మాత్రం నమ్మకం ఉందని చెప్పారు. ఆట మొదట్లోనే లైఫ్లైన్లన్నింటినీ అందుకే వాడుకోలేదని తెలిపారు. ఇప్పుడు తాను కోటి రూపాయలు గెలుచుకోవడంతో ముందుగా.. పాక్షికంగా అంధురాలైన తన ఏడేళ్ల కుమార్తెకు చికిత్స చేయించడమే తన తొలి ప్రాధాన్యమన్నారు. ఒక ఇల్లు కొనుక్కోవాలని, అలాగే చదువుకునే పరిస్థితి లేని ముగ్గురు విద్యార్థినులను చదివిస్తానని, ఇద్దరు అనాథలకు పెళ్లి చేయిస్తానని చెప్పారు.